11వ తేదీ నుంచి విద్యుత్ సరఫరా మెరుగు : పొన్నాల

Ponnalaరాష్ట్రంలో జరుగుతున్న అప్రకటిత కోతను తగ్గించి విద్యుత్ సరఫరా మెరుగుపర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని బుధవారం భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అసెంబ్లీలో చెప్పారు. ఈ మేరకు రేపటి నుంచే తీసుకున్న చర్యలు అమల్లోకి వస్తాయని ఆయన చెప్పారు. పరీక్షల సమయంలో విద్యార్థుల చదువుకోవడానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తామని ఆయన తెలిపారు. అదేవిధంగా తాగు, సాగునీటికి ఆటంకం లేకుండా, పంటలు ఎండిపోకుండా రైతులకు విద్యుత్ సరఫరా చేయడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామన్నారు. అలాగే పరిశ్రమలకు విధిస్తున్న ఒక రోజు కోత నుంచి చిన్న పరిశ్రమలకు వెసులుబాటు కల్పించే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి పొన్నాల వివరించారు.

Leave a Reply

free website analytics