12 స్థానాల్లో నేడే పోలింగ్ – ఒంటరిపోరులో మూడు పార్టీలు

మరికొద్ది గంటల్లో జరగనున్న శాసనసభ ఉప ఎన్నికలపై ఉత్కంఠ పెరుగుతోంది. బరిలో ఉన్న మూడు ప్రధాన పార్టీలు ఈసారి ఎవరూ తోడు లేకుండానే ఒంటరిగా పోటీ చేస్తుండటంతో చీలిపోనున్న ఓట్లు ఎవరికి మేలు చేస్తాయన్న ఆసక్తి కనిపిస్తోంది. 2004, 2009 నాటి ఎన్నికలకు భిన్నంగా జరుగుతున్న ఈ ఉప ఎన్నికలు కాంగ్రెస్, టీఆర్‌ఎస్, తెలుగుదేశం పార్టీలకు ప్రతిష్ఠా త్మకంగా పరిణమించగా, రాజీనామా చేసి మళ్లీ బరిలో నిలిచిన టీఆర్‌ఎస్‌కు అగ్ని పరీక్షలా మారాయి. కాంగ్రెస్-టీడీపీ కూడా తెలంగాణవాదాన్ని బలంగా వినిపించడంతో ఓట్లు భారీగా చీలిపోయే పరిస్థితి కని పిస్తోంది. ఆ రెండు పార్టీలకు ఉన్న క్యాడర్ కూడా సర్వం ఒడ్డి పోరాడింది. మంగళవారం 12 నియోజకవర్గాల్లో జరగ నున్న ఉప ఎన్నికలు ఉత్కంఠభరితంగా మారాయి. 2004లో కాంగ్రెస్‌తో కలసి పోటీ చేసిన టీఆర్‌ఎస్ ఈసారి ఒంటరిగా పోటీ చేస్తోంది. 2009లో మహాకూటమిగా కలసి పోటీ చేసిన టీడీపీ-టీఆర్‌ఎస్ ఈ ఉప ఎన్నికల్లో విడిగా పోటీ చేస్తున్నాయి. అయితే, గతంలో టీఆర్‌ఎస్ విజయాలకు ప్రధాన కారకుడిగా ప్రచారంలో ఉన్న ప్రజాగాయకుడు గద్దర్, ఇతర కళాకారులు, విద్యార్థి సంఘ నేతలు ఈసారి ఉప ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. విద్యార్థులు, కళాకారులను కేసీఆర్ ఫుట్‌పాత్‌గాళ్లన్న వ్యాఖ్యలకు నిరసనగా వారంతా ఉప ఎన్ని కలకు దూరంగా ఉన్నారు. కొన్నిఉద్యోగ సంఘాలు, రాజకీయ జేఏసీ మాత్రం టీఆర్‌ఎస్, బీజేపీకి మద్దతుగా నిలిచాయి. తన అభ్యర్థుల విజయం కోసం కేసీఆర్ అలు పెరుగని ప్రచారం చేశారు.
ప్రధానంగా.. సిరిసిల్లలో కేసీఆర్ కుమారుడు కేటీఆర్‌ను ఓడించేందుకు అటు కాంగ్రెస్, ఇటు టీడీపీ వ్యూహరచన చేస్తున్నాయి. టీఆర్‌ఎస్‌కు ఈ నియోజకవర్గం ప్రాణ ప్రతిష్ఠగా పరిణమించింది. ఇక తెలుగుదేశంపార్టీ ప్రచారా నికి చంద్రబాబు సహా అగ్రనేతలంతా దూరంగానే ఉండటంతో టీడీపీ ఒంటరిపోరు సాగించింది. కా పోతే మంచిర్యాల వంటి నియోజకవర్గాల్లో సిపిఐ అనుబంధ ఏఐటియుసి మద్దతుగా నిలిచింది. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి సైతం ముఖ్యమంత్రి రోశయ్య కనిపించలేదు. మంత్రులే ఇన్చార్జి బాధ్యతలు పంచుకున్నారు. స్వయంగా డి.శ్రీనివాస్ నిజామా బాద్ అర్బన్ నుంచి పోటీ చేస్తుండ టంతో ఆయన అక్కడికే పరిమితమయ్యారు. ఆయనకు ఈ ఎన్ని కలు ప్రాణప్రతిష్ఠగా పరిణమించాయి. కాంగ్రెస్- టీడీపీ తెలంగాణవాదాన్ని బలంగా వినిపించి, అంతకుముందు వరకూ తమపై ఉన్న వ్యతిరేకత స్థానంలో సానుకూలత సంపాదించుకున్నాయి. అయితే, ప్రధాన పార్టీగా బరిలో ఉన్న టీఆర్ ఎస్‌కు మద్దతుగా నామినేషన్లు వేసిన స్వతంత్ర అభ్యర్ధులే అందరినీ ఆకర్షిస్తున్నారు. ప్రధాన పార్టీలకు ఆందోళన కలిగి స్తున్నారు. వీరంతా సాంకేతికంగా టీఆర్‌ఎస్‌కు మద్దతుగా బ్యాలెట్ పేపర్ల కోసం నామినేషన్లు వేశారు. అయితే, వీరు ప్రచారం చేయకపోయినప్పటికీ కనీసం స్థానికంగా వారికున్న కొద్దో గొప్పో పేరు, బంధుగణాలు ఓట్లు వేసినా ఓట్లు చీలి ప్రధాన పార్టీల కొంప మునిగే ప్రమాదం ఉంది. మొత్తం 5 నియోజకవర్గాల్లో 60 మందికి మించి నామినేషన్లు వేశారు. ఎల్లారెడ్డిలో 75 మంది, కోరుట్లలో 67 మంది, సిరిసిల్లలో 78 మంది, హుజూరాబాద్‌లో 69 మంది, వరంగల్ వెస్ట్‌లో 74 మంది స్వతంత్రులు బరిలో నిలిచారు. బ్యాలెట్ వల్ల ఏర్పడే గందరగోళం వల్ల.. వీరిలో ఒక్కొక్కరు హీనపక్షం వంద ఓట్లు చీల్చినా ప్రధాన పార్టీల పుట్టి మునిగిపోవడం ఖాయం. మరోవైపు.. బ్యాలెట్ పోరు జరిగే నియోజక వర్గాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని కాంక్షిస్తున్న తెలంగాణ ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, సామాజిక సంఘాలు బ్యాలెట్‌పై జై తెలంగాణ రాసి, తమ డిమాండును యుపిఏ సర్కారు దృష్టికి తీసుకు వెళ్లాలని నిర్ణయించాయి. దీని వల్ల ఎవరి పుట్టి మునుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. బ్యాలెట్ యుద్ధం జరిగే నియోజకవర్గాల్లో పొలింగ్ శాతం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్కో నియోజకవర్గంలో 60 మందికిపైన అభ్య ర్థులు ఉన్నందున, బ్యాలెట్ పేపరు సైజుగా పెద్దదిగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఓటరు తమకు కావ లసిన అభ్యర్థిని తెలుసుకుని, ఓటుహక్కు వినియో గించుకునేందుకు కనీసం పది నిమిషాలు పట్టే అవ కాశం ఉంది. దీనివల్ల ఓటింగ్ గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.




