19న శ్రీకృష్ణ కమిటీకి టీడీపీ తెలంగాణ నేతల నివేదిక

టీడీపీ తెలంగాణ నేతలు ఈ నెల 19వ తేదీన శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇవ్వనున్నారు. నివేదికను రూపొందిస్తున్న మాజీ మంత్రి విజయ రామారావుతో కడియం శ్రీహరి, దేవేందర్ గౌడ్ భేటీ అయ్యారు. నివేదికపై చర్చించారు. కాగా.. కోస్తాలోని టీడీపీ నేతలు కూడా శ్రీకృష్ణ కమిటీకి విడిగా నివేదిక ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది.




