7న కరువు బృందం జిల్లా పర్యటన

కేంద్ర కరువు బృందం ఫిబ్రవరి 7న జి ల్లా పర్యటనకు వస్తున్నట్టు కలెక్టర్ దు ర్గాదాస్ తెలిపారు. శుక్రవారం స్థానిక డ్వామా సమావేశపు హాల్‌లో జేసీ అనితారామచంద్రన్,ఏజేసీ చెన్నకేశవరావు తో కలిసి పలు శాఖల ఉన్నతాధికారులతో కరువు బృందం పర్యటనపై కలెక్ట ర్ సమీక్షించారు. కరువు బృందం పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌తోపా టు రూట్ మ్యాప్‌ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా అధికారులకు కలెక్టర్ పలు సూచనలు, సలహాలుఇచ్చారు. జిల్లాలోని 63 మండలాలను ఇదివరకే ప్రభుత్వం కరువు ప్రాంతాలుగా ప్రకటించిన విషయం తెలిసిందేనన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో పరిస్థితులను పరిశీలించేందుకు ఫిబ్రవరి 7న కరువు బృందం పర్యటించనుందన్నారు.
కేం ద్రం నుంచి ఇద్దరు,రాష్ట్ర స్థాయిలో ఒక సీనియర్ అధికారితో కలిసి ముగ్గురు సభ్యుల బృందం జిల్లాకు వస్తుందన్నా రు. జిల్లాలో నిర్ధేశించిన ప్రాంతాల్లో బృందం సభ్యులు పర్యటిస్తారన్నారు. ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో పంట ల పరిస్థితులపై రైతులతో ముఖాము ఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తారన్నారు. కరువు నేపథ్యంలో పిల్లలకు పౌష్ఠికాహారం పంపిణీ తీరుపై ఆరా తీస్తారు. ఇందులో భాగంగా అంగన్‌వాడీ కేం ద్రాలను సందర్శిస్తారన్నారు. స్వయంసహాయక సంఘాల పనితీరును పరిశీలిస్తారన్నారు. ఆయా సంబంధిత శా ఖల అధికారులు సమగ్ర సమాచారం తో సన్నద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృత్తం కాకుండా చూడాలన్నా రు. కార్యక్రమంలో డీఆర్ఓ సుదర్శన్‌రె డ్డి, డ్వామా,డీఆర్‌డీఏ పీడీలు మురళి,రంగయ్య, పెనుకొండ ఆర్‌డీఓ ఈశ్వర్,జేడీఏ సాంబశివరావు, వివిధ శా ఖల ఉన్నతాధికారులుపాల్గొన్నారు.
కరువు బృందం రూట్ మ్యాప్ ఇదే… కేంద్ర కరువుబృందం ఫిబ్రవరి 7న జి ల్లాకు వస్తారు. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు పంటల స్థి తిగతులపై పవర్‌పాయింట్‌లో ప్రదర్శిస్తారు. ఆతర్వాత 10.20 గంటలకు రాప్తాడు మండలం మరూరు గ్రామంలోని ట్యాంక్, బోర్లను పరిశీలించి రైతులతో ముఖాముఖిగా మాట్లాడతా రు. అక్కడి నుంచి 11.5 గంటలకు క నగానపల్లి మండలం పర్వతదేవరపల్లి కి చేరుకొని పత్తి పంటను పరిశీస్తారు. 11.45 గంటలకు తగరకుంటకు వెళ్లి ఉపాధి హామి పనులను పరిశీలిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12.20 గంటలకు అదే మండలం భానుకోటకు చేరుకొని అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శిం చి, రైతులతో ముఖాముఖిగా మాట్లాడతారు.
మధ్యాహ్నం 1 గంటకు కంబదూరు మండలం నూతిమడుగుకు వెళ్లి అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి, రైతుల తో ముఖాముఖిగా మాట్లాడతారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1.45 గంటలకు కళ్యాణదుర్గం మండలం పాల్వాయి గ్రామానికి చేరుకొని కమ్యూనిటీ ట్యాంక్ బండను సందర్శిస్తారు. మ ధ్యాహ్నం 2.10 గంటలకు కళ్యాణదు ర్గం మండల కేంద్రానికి చేరుకొని భోజ న విరామం తీసుకుంటారు. అనంత రం మధ్యాహ్నం 3.30 గంటలకు బ్ర హ్మసముద్రానికి చేరుకొని మైనర్ ఇరిగేషన్ ట్యాంక్‌ను సందర్శిస్తారు. ఆ త ర్వాత 4.10 గంటలకు గుమ్మగట్ట మండలం పూలకుంటకు వెళ్లి రైతులతో మాట్లాడతారు. అనంతరం సాయం త్రం 5 గంటలకు రాయదుర్గానికి వెళ్లి అక్కడి నుంచి రాత్రికి జిల్లా కేంద్రానికి చేరుకుంటారు.

Leave a Reply

free website analytics