80 వేల పారా మిలిటరీ బలగాలతో పోలింగ్‌కు భారీ బందోబస్తు – డిజిపి గిరీష్

ఉప ఎన్నికలు జరిగే అయిదు జిల్లాల్లోని పన్నెండు నియోజకవర్గాల్లో పోలింగ్‌కు పోలీసు శాఖ సర్వ సన్నాహాలు చేసినట్లు డిజిసి గిరిష్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టిందని. ఉప ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో మూడు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని తలపడుతున్న నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా స్థానిక పోలీసులతో పాటు ఎనభై కంపెనీల పారామిలటరీ బలగాలను రంగంలోకి దించినట్లు వివరించారు.
ఈవీఎంలు పోలింగ్ కేంద్రాలకు చేర్చడం… ఓటింగ్ పూర్తయిన తర్వాత తిరిగి వాటిని భద్రంగా స్ట్రాంగ్‌రూమ్‌లకు చేరేంతవరకు తీసుకోవలసిన జాగ్రత్తలపై ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేయడం జరిగిందని, తెలిపారు. అదే విధంగా స్పెషల్ టాస్క్‌ఫోర్స్, స్ట్రైకింగ్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎన్నికల సంఘం ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద తీసుకోవలసిన చర్యలను వివరించిన నేపథ్యంలో చాలా ఎన్నికలను ప్రతిష్టత్మకంగా తీసుకుని భద్రతా చర్యలు చేపట్టామని గిరిష్ తెలిపారు.




