మహబూబ్‌నగర్

భానుడి భగభగ


రాష్ట్రంలో భానుడు ఉగ్రరూపం దాల్చాడు. రాష్ట్రం నిప్పుల కొలిమిగా మారింది. ప్రచండబానుడిదాటికి ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడదెబ్బతో 10మంది మృతిచెందారు. ఉదయం ఏడు గంటలనుంచే వేసవి ప్రతాపం చూపుతోంది. ఇళ్లలో విద్యుత్‌ వాడకం కూడా భారీగా పెరుగుతోంది. పలు జిల్లాల్లో విద్యుత్‌ కోతలు కూడా మళ్లీ మొదలయ్యాయి. బుధవారం హైదరాబాద్‌లోనూ అనధికారికంగా 3 గంటల విద్యుత్‌ కోత విధించారు. రాష్టవ్య్రాప్తంగా బుధవారం ఉష్ణోగ్రతలు తీవ్రరూపం దాల్చాయి. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు. ఈ సమయంలో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటాయి.
తెలంగాణతోపాటు రాయలసీమ జిల్లాల్లోనూ 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో సాధారణం కంటే 3 డిగ్రీలు, కోస్తోంధ్ర, రాయలసీమలో 1 నుంచి 3 డిగ్రీలు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదువుతన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం రెంటచింతలలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వ్యవసా య రంగానికి ప్రాణధారమైన నైరుతి రుతుపవనాలు జూన్‌ 1 కల్లా కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ విభాగం ప్రకటించిన విషయం తెలిసిందే. రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకేవరకు ఇదే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంటుందని అధికారులు చెబుతున్నారు. ఈసారి సాధారణ తేదీ కన్నా కొంత ఆలస్యంగా దక్షిణ అండమాన్‌ సముద్రంలో రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు.

జాతీయ హోదాకు కృషి చేస్తాం


పోలవరం సమస్యపై చర్చలకు
ఒడిశా సీఎంను ఆహ్వానించా
ఛత్తీస్‌గఢ్ సీఎంనూ సంప్రతిస్తాం
మంత్రి డీఎల్‌కు పనేమీ లేదు
మీడియా.. ప్రభుత్వానికి సలహాదారుగా
వ్యవహరించాలి.. విశాఖలో సీఎం కిరణ్
- ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌దే గెలుపు.. అందుకు నరసన్నపేట నుంచే శ్రీకారం
- మాజీ సీఎం వైఎస్‌కు కాంగ్రెస్ ఎంతో ప్రాధాన్యం ఇచ్చింది
- ఆయన కుటుంబానికి అనేక పదవులు కట్టబెట్టింది
- కాంగ్రెస్ మోసం చేసిందని జగన్ చెప్పుకోవడం సిగ్గుచేటు
- శ్రీకాకుళం ఉప ప్రచారంలో సీఎం
- ఇప్పుడే ఫలితాలు చెప్పేందుకు మేం జ్యోస్యులం కాదు: పీసీసీ చీఫ్ బొత్స
విశాఖపట్నం/శ్రీకాకుళం, మే 6:పోలవరం, ప్రాణహిత-చే ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించేందుకు తాము కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్తూ.. విశాఖపట్నం విమానాక్షిశయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో సమస్యను పరిష్కరించుకునేందుకు పొరుగు రాష్ట్రాలతో సంప్రతింపులు జరుపుతామని సీఎం చెప్పారు. దీనిపై ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ముఖ్యమంవూతులతో చర్చించి ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు.
పోలవరంపై చర్చలకు రావాలంటూ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను ఢిల్లీలో ఎన్‌సీటీసీ సదస్సు సందర్భంగా ఆహ్వానించినట్లు చెప్పారు. మంత్రి డీఎల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యల గురించి విలేకరులు ప్రస్తావించగా ఆయనకేం పనిలేదు, మీకేం పనిలేదు అని వ్యంగ్యంగా స్పందించారు. అభివృద్ధి కార్యక్షికమాల విషయంలో మీడియా ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరించాలని హితవు పలికారు. అనంతరం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నరసన్నపేటలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు లోక్‌సభతోపాటు అన్ని అసెంబ్లీ స్థానాల్లో తామే గెలుస్తామని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం నుంచే శ్రీకారం చుట్టాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.
మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్‌డ్డికి కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రాధాన్యం ఇచ్చిందని చెప్పారు. రాజశేఖర్‌డ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయనను ఎవరు విమర్శించినా తాను, ధర్మాన ప్రసాదరావు, ఇతర మంత్రులు తిప్పికొట్టామని, ఆయనకు రక్షణ కవచంలా నిలిచామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబానికి అనేక పదవులు ఇచ్చిందని తెలిపారు. ఇప్పుడు రాజశేఖర్‌డ్డి కుమారుడు జగన్ కాంగ్రెస్ పార్టీ తమను మోసం చేసిందని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ బహిరంగసభలో రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కొండ్రు మురళీమోహన్, శ్రీకాకుళం ఎంపీ కృపారాణి తదితరులు పాల్గొన్నారు.
అన్ని పార్టీల్లో కోవర్టులుంటారు: బొత్స
నరసన్నపేట ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డికి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌తోసహా కోవర్టులు ఏ పార్టీలోనైనా ఉంటారని వ్యాఖ్యానించారు. ఏదేమైనా ఉప ఎన్నికల్లో విజయమే తమ ముందున్న లక్ష్యమని చెప్పారు. ఉప ఎన్నికల అభ్యర్థు ఎంపిక సరిగానే జరిగిందని, ఇందులో చర్చకు తావులేదని అన్నారు. నెల్లూరు లోక్‌సభ స్థానంతోపాటు 1 అసెంబ్లీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా తాము ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పుడే ఫలితాలు చెప్పేందుకు తామేమీ జ్యోతీష్యులం కాదని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

కడదాక తీసుకెళ్లేది టీఆర్‌ఎస్సే – కేసీఆర్


తెలంగాణ ఉద్యమాన్ని కడదాక తీసుకెళ్లేది టీఆర్‌ఎస్ పార్టీనే అని కేసీఆర్ ఉద్ఘాటించారు. నిజామాబాద్‌లో తెలంగాణ కోసం రాజీనామా చేస్తే బీజేపీని ముస్లింలు గెలిపియలేదా? అప్పుడు కనపడని రజాకార్లు ఇప్పుడు వస్తారా? అని బీజేపీని ప్రశ్నించారు. జాతీయపార్టీలన్ని తెలంగాణకు మోసం చేసినవేనని అందుకే తెలంగాణ స్వీయ రాజకీయ అస్థిత్వం కోసం ఏర్పడ్డదే తెలంగాణ రాష్ట్ర సమితి అని కేసీఆర్ తెలిపారు. ఈ పాలమూరు జిల్లాలో ఆర్డీఎస్ తూములు పగులగొట్టి నీళ్లను దోసుకొని పోయినపుడు జాతీయ పార్టీ బీజేపీ ఎక్కడ పన్నది అని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో 17 ఎంపీ స్థానాల్లో తెలంగాణ ఉద్యమకారులనే గెలిపించుకోని, జాతీయపార్టీలనే తమ కాళ్లకాడికి తెచ్చుకుంటామని పేర్కొన్నారు. యాచించే తెలంగాణ కాదు శాసించే తెలంగాణ అనే విషయం మరచిపోవద్దని కేసీఆర్ స్పష్టం చేశారు. బీజేపీ మతప్రచారలను నమ్మవద్దని మహబూబ్‌నగర్ ప్రజలను కోరారు.

తెలంగాణపై కాంగ్రెస్ బిల్లు పెడితే సహకరిస్తాం – చంద్రబాబు


తెలంగాణలోని ఐదు ప్రాంతాల్లో టీఆర్ఎస్‌కు బీజేపీ మద్దతిస్తోందని, మహబూబ్‌నగర్‌లో మాత్రం ఆ రెండు పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. కేంద్రంలో, రాష్ట్రం లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున తెలంగాణ ఇచ్చే బాధ్యత ఆ పార్టీ పైనే ఉందని బాబు స్పష్టం చేశారు. కాంగ్రెస్ బిల్లు పెడితే తాము సహకరిస్తామని చెప్పారు. తెలంగాణకు తానెప్పుడూ వ్యతిరేకంగా మాట్లాడలేదని, ఇకపై మాట్లాడబోనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలో పీఆర్పీని, తెలంగాణలో టీఆర్ఎస్‌ను కలుపుకొని టీడీపీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. శనివారం మహబూబ్‌నగర్ పట్టణంలో నిర్వహించిన రోడ్డుషోలో బాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన ప్ర సంగించారు. రాష్ట్రంలో తాగడానికి మంచినీళ్లు ఇవ్వలేని పనికిమాలిన ప్ర భుత్వం కొనసాగుతోందని ధ్వజమెత్తారు. అసమర్థ సీఎం ఉన్నారని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో వస్త్రాలపై వ్యాట్ విధించారని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో అడ్రస్‌లేని పార్టీ బీజేపీ అని, ఆ పార్టీకి ఓటువేయవద్దని కోరారు. హిందూ, ముస్లింల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ముస్లింలకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటోందని అన్నారు.
పదవి కోసం పార్టీ పెట్టిన వ్యక్తి కేసీఆర్ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఆయనకు ప్రజా సమస్యలు పట్టవని ఆరోపించారు. ఇటు పాలమూరులో ఉండడు, అక్కడ పార్లమెంటుకు వెళ్లడు, పోయి ఫాంహౌస్‌లో పడుకుంటాడని మండిపడ్డారు. టీడీపీ దయవల్ల ఇక్కడ ఎంపీగా గెలిచారని, దమ్ముంటే కేసీఆర్ మళ్లీ ఇక్కడి నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఎప్పుడైనా పార్లమెంటులో ఆయన తెలంగాణ వాణి వినిపించారా? మీ సమస్యలు పట్టించుకున్నారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. టీఆర్ఎస్ వసూళ్ల పార్టీ అని ఆరోపించారు.

విరుచుకుపడిన ఎసిబి


ఎక్సైజ్ శాఖలో మద్యం ముడపులు అందుకున్న ఏ ఒక్కరినీ వదలకుండా అవినీతి నిరోదక శాఖ ఏరేసే కార్యక్రమాన్ని ఉధృతం చేసింది. ముడుపులు అందుకున్న మరికొందరు ఎక్సైజ్ అధికార్లను కోర్టు బోను ఎక్కించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే రాష్టవ్య్రాప్తంగా ఎక్సైజ్ కార్యాలయాలపై సోమవారం ఏకకాలంలో దాడులకు దిగింది. ఏసిబి సిట్ బృందాలు అనూహ్యంగా దాడులకు దిగాయి. ఎక్సైజ్ శాఖలో ఏళ్ల తరబడి ఒకే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న వారిపై గట్టి నిఘా పెట్టారు.
ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నవారి జాబితా తయారు చేసి ఉచ్చును మరింత బిగిస్తోంది. ఎసిబి అదనపు డైరక్టర్ శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలోని స్పెషల్ ఇనె్వస్టిగేషన్ బృందాలు ఈ కార్యక్రమంలో నిమగ్నమయ్యాయి. ఎక్సైజ్ శాఖలో మద్యం సిండికేట్ల నుంచి ముడుపులు అందుకున్న వారేకాకుండా, ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్న వారినీ తాజాగా ఎసిబి టార్గెట్ చేస్తోంది. విజయనగరం, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఎసిబి బృందాలు తనిఖీలు నిర్వహించాయి. కీలకమైన ఫైళ్లు, ఆఫీసు రికార్డులు, కంప్యూటర్ సామగ్రి, అధికారుల మొబైల్ నెంబర్లు స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయాల్లోని అధికారులను విచారించడంతోపాటు, వారి వద్దనున్న మొబైల్ నెంబర్లనుంచి గత కొన్ని రోజులుగా ఎవరెవరికి కాల్స్ వెళ్లిందీ విచారిస్తున్నారు. ఎసిబి దర్యాప్తుతో వ్యాపారాలు వదిలి అజ్ఞాతంలోకి వెళ్లిన సిండికేట్ల గురించీ సిట్ బృందాలు గాలిస్తున్నాయి. చిక్కడపల్లికి చెందిన మద్యం వ్యాపారి బాలరాజ్‌గౌడ్ అరెస్టు కాకుండా తప్పించుకుంటున్నాడు. ఇతను దేశం విడిచిపోకుండా ఎసిబి లుకౌట్ నోటీసు జారీ చేసింది. త్వరలోనే అరెస్టు చేస్తామని ఎసిబి వర్గాలు తెలిపాయి. ఇదిలావుంటే, విజయనగరం జిల్లాలోని ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఏసిబి బృందాలు తనిఖీలు నిర్వహించాయి. విజయనగరం జిల్లా కేంద్రం, పార్వతీపురం ఇఎస్ ఆఫీసుతోబాటు బొబ్బిలి సబ్ డివిజన్‌లో సైతం సోదాలు నిర్వహించారు. ఎసిబి డిఎస్పీ వెంకటేశ్వర రావు నేతృత్వంలో సిబ్బంది ఇఎస్ కార్యాలయానికి చేరుకుని 2010-12 మద్యం దుకాణాల టెండర్ రికార్డులు పరిశీలించారు.
పట్టు బిగిస్తున్న ఎసిబి
ఖమ్మం జిల్లాలో 2010 మద్యం టెండర్లలో 16 దుకాణాల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని నిర్థారించిన ఎసిబి, అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకునేందుకు ఎసిబి ఆధారాలు సేకరించే పనిలో పడింది. రెండురోజులుగ దాడులు కొనసాగిస్తున్న ఎసిబి, సోమవారం టెండర్లకు సంబంధించిన అన్ని ఫైళ్లనూ ఎసిబి డిఎస్పీ శంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో డిఆర్వో క్యాంప్ కార్యాలయం నుంచి స్వాధీనం చేసుకున్నారు. టెండర్ల సమయంలో జిల్లాలో పనిచేసిన జెసి అజీంతో పాటు పలువురు ఉన్నతాధికారుల ప్రమేయంపైనా విచారణ సాగుతోంది.
గుంటూరులోని ఎక్సైజ్ డిసి ఆఫీసులో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. సిండికేట్లు అందించిన వివరాలతో ఎక్సైజ్ అధికారుల పాత్రపై ఆరా తీస్తున్నారు. ఎసిబి జెడి రమేష్‌రెడ్డి ఆధ్వర్యంలో సోదాలు సాగాయి. 2010లో జరిగిన మద్యం టెండర్లలో అవకతవకలు జరిగాయని, సిండికేట్‌లకు షాపులు కేటాయించడంలో నిబంధనల ఉల్లంఘన వెల్లడైనట్టు సమాచారం. రికార్డులను స్వాధీనం చేసుకున్న ఎసిబి, చర్యలకు సిద్ధమవుతోంది. దాడుల సందర్భంలో డిసి కార్యాలయంలో ముఖ్య అధికార్లు అందుబాటులో లేకపోవడం గమనార్హం. అలాగే తెనాలి, నరసరావుపేట ఎక్సైజ్ కార్యాలయాల్లోనూ సోమవారం ఎసిబి బృందాలు దాడులు నిర్వహించి రికార్డులు తనిఖీలు చేశాయి. ఎసిబి డిఎస్పీ శివాజీ, విజయవాడ రేంజ్ ఎసిబి సిఐ టిఎస్‌కె రవి నేతృత్వంలో రికార్డులను పరిశీలించి, టెండర్ల విషయంలో అధికార్లు అక్రమాలకు పాల్పడ్డారా? అన్న అంశాలను పరిశీలించారు.
తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి, కాకినాడ, అమలాపురం ఇఎస్ కార్యాలయాలపై సోమవారం ఎసిబి బృందాలు దాడులు జరిపాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన సిట్ బృందాలు దాడుల్లో పాల్గొన్నాయి. 2010లో మద్యం దుకాణాల వేలం ప్రక్రియకు సంబంధించిన ఫైళ్లపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. దాడుల్లో ఎసిబి సిట్ డిఎస్పీలు విజయపాల్, లక్ష్మీపతి ఆధ్వర్యంలో ఇనస్పెక్టర్లు బి రామకృష్ణ, ఎస్ మురళీమోహన్ పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు, భీమవరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ అధికార్లు సోమవారం రికార్డులు పరిశీలించారు. ఏలూరులో హైదరాబాద్ ఎసిబి డిఎస్‌పి నరసింహారావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించగా, మధ్యాహ్నం నుంచి భీమవరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో విజయవాడ నుండి వచ్చిన బృందం ఆధ్వర్యంలో తనిఖీలు జరిపారు. దాడుల్లో భాగంగా కొన్ని ముఖ్యమైన ఫైళ్లను స్వాధీనం చేసుకుని, కార్యాలయాల్లోని కంప్యూటర్లలో నిక్షిప్తమైన సమాచారాన్ని సైతం ఎసిబి అధికార్లు సేకరించారు.
నెల్లూరు జిల్లాలోని నెల్లూరు, గూడూరు ఎక్సైజ్ కార్యాలయాల్లో ఎసిబి సోదాలు సాగాయి. మద్యం దుకాణాల లైసెన్సులు పరిశీలించి, 2010 నుంచి టెండర్లకు సంబంధించిన వివరాలు తీసుకున్నారు. కర్నూలు, కడప జిల్లాల్లో సైతం ఎక్సైజ్ కార్యాలయాలపై ఎసిబి దాడులు జరిపింది. 2010 వేలం పాటల రికార్డులు, టెండర్లలో పాల్గొన్న వారి వివరాలు, ఆస్తిపాస్తుల సమాచారం, మద్యం దుకాణాలను వేలంలో దక్కించుకున్న వారి వివరాలు సేకరించారు. అలాగే, మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ పట్టణాలలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల్లో ఎసిబి అధికారులు సోమవారం దాడులు నిర్వహించి సోదాలు చేశారు. మద్యం దుకాణాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.

21,343 టీచర్ పోస్టులు


డీఎస్స-12 నోటిఫికేషన్ విడుదల
మే 2,3,4 తేదీల్లో రాత పరీక్షలు
అప్రెంటీస్ విధానం రద్దు
‘ఇంటర్’ నిబంధన తొలగింపు
‘ఓపెన్ డిగ్రీ’ వారికీ అర్హత
ఎస్ఏ పోస్టులకు సబ్జెక్టు నిబంధనల సడలింపు
80 మార్కులకే డీఎస్సీ
20 మార్కులకు టెట్ వెయిటేజి
మరో 7100 పోస్టులకు రెండు రోజుల్లో నోటిఫికేషన్
హైదరాబాద్, జనవరి 30 : లక్షలాది మంది ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త. కొద్ది రో జులుగా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న ‘డీఎస్సీ -2012 నోటిఫికేషన్’ సో మవారం విడుదలైంది. మొత్తం 21,343 ఉపాధ్యాయ ఉద్యోగాలను ఇందులో నోటిఫై చేశారు. ఉపాధ్యాయ అభ్యర్థులు దశాబ్దకాలంగా చేస్తోన్న ‘అప్రెంటిస్’ రద్దు డిమాండ్ కూడా నెరవేరుతోంది. వివాదాస్పదంగా మారిన ‘ఇంటర్‌లో సంబంధిత సబ్జెక్టులు తప్పనిసరి’ అనే నిబంధనను తొలగించారు.
నోటిఫై చేసిన మొత్తం పోస్టుల్లో.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 5,703, ఎస్జీటీ పోస్టులు 11, 602 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్లు 2000, పీఈటీలు 365, మునిసిపల్ పాఠశాలల్లో 1,673 పోస్టులు ఉన్నాయి. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 17వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. సచివాలయంలో సోమవారం సాయంత్రం 3 గంటలకు మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కె.పార్థసారథి ఈ డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. డీఎస్సీకి విద్యార్హతల నిబంధనల్లో కొన్నింటిని సడలించారు.
స్కూల్ అసిస్టెంట్స్ (మేథ్స్, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్) పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్ స్థాయిలో కూడా మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, హిస్టరీ, జాగ్రఫీ సబ్జెక్టులు చదివి ఉండాలన్న నిబంధనలను తొలగించారు. అంటే.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్ చదివి ఉండాలన్న నిబంధన లేదు.
ఫలితంగా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా నేరుగా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు కూడా అర్హత లభిస్తుంది. స్కూల్ అసిస్టెంట్స్ (జీవశాస్త్రం) పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు జీ.వో.నెం.4లో పేర్కొన్న సబ్జెక్టులతో పాటు సెరికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, పౌల్ట్రీ సబ్జెక్టుల అభ్యర్థులకు కూడా అర్హత కల్పించారు. టీచర్లకు అప్రెంటిస్ విధానాన్ని ఈ డీఎస్సీ నుంచి రద్దు చేశారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు నమూనా, యూజర్ గైడ్ కోసం జ్ట్టిఞ://్చఞఛీటఛి.ఛిజజ.జౌఠి.జీn వెబ్‌సైట్‌ను చూసుకోవాలి.
డీఎస్సీ 80 మార్కులకే..
టెట్‌కు వెయిటేజీ ఇవ్వనున్న కారణంగా 80 మార్కులకే డీఎస్సీ పరీక్షను నిర్వహించనున్నారు. మిగతా 20 మార్కులకు టెట్ మార్కులను వెయిటేజీగా జమ చేస్తారు. ఒక్కో ప్రశ్నకు అర మార్కు చొప్పున 80 మార్కులకు 160 డీఎస్సీ పరీక్ష ఉంటుంది. ఎస్జీటీ పరీక్షలో జనరల్ నాలెడ్జ్‌కు 10 మార్కులు, పర్‌స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 10, ఇంగ్లీష్ 9, ఇండియన్ లాంగ్వేజ్ 9, మాథ్స్ 9, సైన్స్ 9, సోషల్ స్టడీస్ 9, టీచింగ్ మెథడ్ 15 మార్కులు ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్ పరీక్ష ల్లో.. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10, పర్‌స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 10, సబ్జెక్ట్ కంటెం ట్ 44, టీచింగ్ మెథడాలజీ 16 మార్కులు ఉంటాయి. పీ ఈటీలకు టెట్ ఉండకపోవ డం వల్ల పూర్తిగా 100 మా ర్కులకు పరీక్ష ఉంటుంది.

మృత్యుంజయుడు


ఐజాలో బోరుబావిలో పడిన బాలుడు సురక్షితం
ఆరున్నర గంటలపాటు శ్రమించిన యంత్రాంగం
ఆ చిన్నారి మృత్యుంజయుడు. 120 అడుగుల బావిలో పడినా… ఆరున్నర గంటల పాటు మృత్యు వుతో పోరాడి సజీవంగా బయట పడ్డాడు. అధికారుల పడిన శ్రమకు ఫలితం లభించింది. ఈ సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా ఐజ మండలం బింగిదొడ్డి గ్రామంలో బుధ వారం జరిగింది. వ్యవసాయ పొలంలో వేసిన బోరు బావిలో పడిన గుమ్మడి తిరుమలేష్‌ (2)ను అధికారులు ప్రాణాలతో కాపాడారు. ఆరున్నర గంటల పాటు శ్రమించి బోరుబావిలో పడిన బాలుడ్ని బయటకు తీశారు. బాలుడు సురక్షితంగా బయట పడటంతో అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు, ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో బోరుబావిలో బాలుడు పడ్డాడు. తండ్రి వీరేష్‌, తల్లి సుజాత వ్యవసాయ పనుల నిమిత్తం తమతో పాటు బాలుడిని కూడా తీసుకెళ్లారు. తల్లిదండ్రులు పనిలో నిమ గమై ఉండగా బాలుడు ఆడుకుంటూ వారి పొలం పక్కనే ఉన్న నీరులేని బోరు బావి దగ్గరకు వెళ్లి అందులో పడిపోయాడు. నెలరోజుల క్రితం కుర్వ తిప్పన్న అనే రైతు తన పొలంలో బోరు బావి తవ్వించారు. నీళ్లు రాని కారణంగా దానిని పూడ్చకుండా అలాగే వదిలేశారు. ఈ బోరు బావిని 120 అడుగులకు పైగా తవ్వి నీరు రానందున వదిలారు. అయితే సుమారు 20 అడుగుల వద్ద బాలుడు మధ్యలో ఇరుక్కున్నాడు. ఈ సమాచారం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నాలుగు జెసిబిలు, నాలుగు డోజర్ల ద్వారా బాలుడిని రక్షిం చేందుకు సహాయక చర్యలు చేపట్టారు. 108 వాహనం ద్వారా బాలుడికి ఆక్సిజన్‌ అందించారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా చేరుకున్నారు. స్థలంలో మంత్రి డికె అరుణ, గద్వాల ఆర్డీఓ నారాయ ణరెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, అయిజ, గద్వాల పోలీసులు ఉన్నారు. హైదరాబాద్‌ నుంచి అత్యాధునిక యంత్రాలను తెప్పించారు. బాలుడు బతికే ఉన్నాడని 108 వైద్య సిబ్బంది చెప్పడంతో బాలుడికి ఎలాంటి గాయాలు కాకుండా జాగ్రత్తగా తవ్వి తీశారు. బాలుడు మృత్యుంజయుడై బయటపడంతో అందరూ హర్షం వ్యక్తం చేశారు. వాల్టా చట్టం ప్రకారం…. బోరుబావులు తవ్విన తరువాత తీసుకోవల్సిన జాగ్రత్తలు తీసుకోక పోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. . రాష్ట్రంలో గతంలో బోరుబావిలో పడిన చిన్నారులు ప్రాణాలతో బతికి బయటపడలేదు. బింగిదొడ్డిలో పడిన బాలుడు బతకడం విశేషంగా చెప్పవచ్చు.

రూపాయి బియ్యం వద్దా… రేషన్ కార్డులు ఇచ్చేయండి – సిఎం కిరణ్


ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రూపాయి బియ్యం పథకం విమర్శలను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో జరిగిన రచ్చబండలో కొంతమంది మహిళలు లేవనెత్తిన అంశంపై సిఎం తీవ్రంగా స్పందించారు. రూపాయికే కిలోబియ్యం పథకం మాటెలా ఉన్నా, మిగిలిన నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకడంతో తమ బతకులు దారుణం అవుతున్నాయని కొందరు మహిళలు ప్రస్తావించారు. దీనిపై సిఎం స్పందిస్తూ ‘రూపాయికి కిలో బియ్యం ఇష్టం లేకుంటే రేషన్‌కార్డులు వెనక్కివ్వండి’ అన్నారు. పెరుగుతున్న ధరల నియంత్రణకు ప్రభుత్వం కమిటీ వేసిందన్నారు. కమిటీ ప్రజల అవసరాలను విచారించి ధరలను నిర్ణయిస్తుందని ఆయన తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో వస్తువుల ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని, దీంతో నిత్యావసరాల ధరల్లోనూ మార్పులు చోటుచేసుకుంటాయని వివరించారు. రాబోయే రోజుల్లో ధరలు తగ్గించి తక్కువ ధరకే నిత్యావసరాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పేద, బడుగు వర్గాల కోసమే రూపాయికి కిలోబియ్యం పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. దీనిపై ఎవరు రాద్ధాంతం చేయరాదని ఆయన హితవు పలికారు. పూట గడవని వారు ఎంతోమంది సమాజంలో ఉన్నారని, వారి కోసమైనా విమర్శలు మాని పథకానికి మద్దతు ప్రకటించాలని కోరారు. (చిత్రం) నిత్యావసరాల ధరలపై నిలదీస్తున్న మహిళలు

రాష్ట్రం రావడానికి ఇది మార్గం కాదు – సిఎం


సకల జనుల సమ్మె పై ఎలాంటి నివేదికలు కేంద్రానికి పంపలేదని ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. తాను తప్పడు నివేదికలు పంపానని కొందరు ఆరోపణలు చేయడం శోచనీయం అని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రానికి ఎలాంటి నివేదికలు పంపలేదని ఎంతగా చెప్పినా ఎవరూ నమ్మడం లేదని, పైగా కిరణ్‌ తెలంగాణకు వ్యతిరేకం అని విమర్శలు చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. కేంద్రాన్ని ఎవరు కూడా మభ్యపెట్టలేరని, మభ్యపెడతారనుకుంటే శుద్ద తప్పు అని చెప్పారు. ఎక్కడ ఏమి జరుగుతుందనేది కేంద్రానికి బాగా తెలుసని, అన్ని విధాలుగా నివేదికలు వారికి వస్తాయని వివరించారు. కళ్లకు కనిపించే వాస్తవాలపై నివేదికలు పంపించవలసిన అవసరం ఉంటుందా అని తనపై విమర్శలు చేస్తున్న వారిని ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రశ్నించారు. సమ్మె వల్ల ప్రజలు బాధ పడుతున్నది మాత్రం వాస్తవం, రాష్ట్రం రావడానికి ఇది మార్గం కానే కాదు అని కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. రూపాయికి కిలో బియ్యం పథకం ప్రకటించిన సందర్భంగా సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి డి.కె. అరుణ నేతృత్వంలో మహబూబ్‌నగర్‌ జిల్లా నుండి వచ్చి అభినందించిన వారినుద్దేశించి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఎవరూ వ్యతిరేకం కాదని, కాంగ్రెస్‌ పార్టీ కూడా వ్యతిరేకం కానేకాదని సభికుల హర్షద్వానాల మధ్య ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రజలు ఇబ్బంది పడని విధంగా ఉద్యమాలు జరపాలని సూచించారు. ఈ విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకొనేంత వరకు సంయమనం పాటించాలని మాత్రమే తెలంగాణ వాదులను కోరుతున్నానని చెప్పారు. సకల జనుల సమ్మె వల్ల బస్సులు నడవడం లేదు, రైళ్లు నిలిచిపోయాయి, సింగరేణి కార్మికులు పనిచేయడం లేదు, విద్యుత్‌ ఉత్పత్తి తగ్గిపోయింది, ఉపాది కూలీలకు పని లేకుండా పోయింది. విద్యా సంస్ధలు మూత పడి విద్యార్ధులు ఇబ్బంది పడుతున్నారు, ఈ విధంగా లక్షలాది మంది సమ్మె వల్ల ఇబ్బంది పడుతున్నారు, ఈ వాస్తవాలు కేంద్రానికి బాగా తెలుసు, ప్రత్యేకంగా నివేదికలు పంపించాల్సిన అవసరం లేదు, మీ ఊళ్లో ఏం జరుగుతుందో నాకంటే కేంద్రానికే బాగా తెలుసు, వారికి ప్రత్యేకంగా నివేదికలు పంపించాల్సిన అవసరం లేదు, నేనైతే ఎలాంటి నివేదికలు పంపడం లేదు అని ముఖ్యమంత్రి వివరించారు. సకల జనుల సమ్మె వల్ల తెలంగాణ రాష్ట్రం వస్తుందా ? లేక ప్రజలను అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నామా అనే విషయం ఉద్యమకారులు ఆలోచించుకోవాలని కిరణ్‌కుమార్‌రెడ్డి సూచించారు. టోకెన్‌గా ఒకటి రెండు రోజులు సమ్మె చేసి సమస్య తీవ్రతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తేవాలే గాని ఈ విధంగా సమ్మెలు కొనసాగించి ప్రజలను ఇబ్బంది పెట్టడం తగదని అన్నారు.
తెలంగాణ అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వద్ద ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు నమోదయ్యాయని తెలిపారు. సమ్మె వల్ల ఉత్పన్నమవుతున్న ప్రజా సమస్యలను ప్రధానమంత్రి దృష్టికి తెచ్చి బొగ్గు, గ్యాస్‌, విద్యుత్‌ను అదనంగా సరఫరా చేయాలని కోరడం జరిగిందని వివరించారు. ప్రస్తుతం పంటలు చేతికొచ్చే సమయం అని, ఈ పరిస్ధితిలో విద్యుత్‌ ఉత్పత్తి తగ్గడం మంచి పరిణామం కాబోదని, అవసరమైతే పంట చేతికి వచ్చిన తర్వాత సమ్మెలు నిర్వహించుకోవచ్చని ముఖ్యమంత్రి తెలిపారు. అభివృద్ధి ఆగితే, సంక్షేమం నిలిచిపోతే, పరిశ్రమలు బంద్‌ పాటిస్తే, బస్సులు నడవకపోతే, రైళ్లు నిలిచిపోతే, కరెంటు రాకుండా పోతే, బొగ్గు ఉత్పత్తి నిలిచిపోతే దానికి కారణం ఎవరు ? దీని వల్ల తెలంగాణ వస్తుందా ? అని ముఖ్యమంత్రి సమ్మె చేస్తున్న వారిని ఉద్దేశించి ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సి. ప్రతాపరెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, మాజీ పార్లమెంటు సభ్యులు మల్లు రవి, డిసిసిబి చైర్మన్‌ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

స్పందించని నేతలను నిలదీయండి


సకల జనుల సమ్మెలో అన్ని వర్గాలు కదిలివస్తుంటే ఏ మాత్రం చలనం లేకుండా ప్రేక్షకపాత్ర పోషిస్తున్న తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులను నిలదీసి ఉద్యమ సెగ ఢిల్లీకి తగిలేలా కృషి చేయాలని రాజకీయ జెఎసి ఛైర్మన్‌ ప్రొపెసర్‌ ఎం. కోదండరామ్‌ పిలుపునిచ్చారు. సకల జనుల సమ్మెలో భాగంగా గురువారం ఖమ్మంలో జరిగిన పోరు గర్జన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణలో పది రోజులుగా జరుగుతున్న సకలజనుల సమ్మెలో తెలంగాణ సమాజం మొత్తం కదిలివచ్చి భాగస్వాములవుతుంటే కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు కన్పించకుండా పోయారని మంత్రులు ఏమీ ఆశించి మౌనంగా ఉన్నారో అర్థం కావడం లేదన్నారు.
కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఎక్కడికి పోయారో తెలియడం లేదని.. ఎక్కడా దాక్కున్నారో వేతకాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎంపిలు నోరు తెరిస్తే ఢిల్లీ కదిలిరాదా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ మంత్రులు కదిలివస్తే నిజాం విద్యార్థులపై దాడులు జరిగేవా? స్వామిగౌడ్‌ను అరెస్ట్‌ చేసేవారా? ఆర్టీసి బస్సులను తిప్పేవారా? అంటూ కోదండరామ్‌ ప్రశ్నించారు. తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధుల ప్రేక్షకపాత్రను సవాల్‌గా తీసుకొని ఎక్కడపడితే అక్కడ వారిని నిలదీయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో సమ్మె జరగడం లేదని ఢిల్లీలో భజన చేసే రేణుకచౌదరి, అభిషేక్‌ సింఘ్వీలు కళ్లు ఉండి చూడదల్చుకుంటే చెవులు ఉండి వినదల్చుకుంటే తెలంగాణలో అడుగుపెట్టి చూడాలన్నారు.
శాంతియుతంగా సహనంతో సమ్మె చేస్తున్నామని ‘తెలంగాణ ప్రజల సహనాన్ని, ఓర్పును వారు తప్పుగా అర్థం చేసుకోవద్దని హితవు పలికారు. సమ్మెపై సీఎం కిరణ్‌ మాట్లాడిన తీరు పిల్లచేష్టల్లా ఉన్నాయన్నారు. సీఎం సమ్మె సెగ తాకకుండా బుల్లెట్‌ ప్రూప్‌ తగిలించుకున్నాడో లేదా ఏదైనా లేహ్యం, పౌడర్‌ రాసుకున్నాడో తెలియడం లేద న్నారు. ఆయనకు ఏ పేరు పెట్టాలో డిక్షనరీలో అర్ధాలు వెతకాల్సి వస్తుందన్నారు. ఈ నెల 24, 25 తేదీల్లో జరిగే రైల్‌రోకో ద్వారా సమ్మె సెగ ఢిల్లీకి తాకాలని కోదాండరామ్‌ పిలుపునిచ్చారు. 48 గంటలపాటు తెలంగాణలో రైలు పట్టాలు కన్పించ కుండా మానవహారాలే కన్పించాలన్నారు. విద్యార్థులు అవేశానికి పోయి టవర్లు ఎక్క వద్దని, ఆత్మబలిదానాలకు పాల్పడవద్దని కోరారు.
వడ్డీతో సహా మూల్యం చెల్లిస్తాం : ఈటెల
తెలంగాణ కోసం జరుగుతున్న పోరాటాన్ని అణిచివేసేందుకు ప్రయత్నిస్తే వడ్డితో సహా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని టిఆర్‌ఎస్‌ శాసనసభపక్ష నాయకులు ఈటెల రాజేందర్‌ అన్నారు. ఉద్యమాన్ని అణచివేయడానిి చూస్తే తెలంగాణ వచ్చిన తరువాత వడ్డీతో సహా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే సంసృ్కతి ఆంధ్రా వాళ్ళదని రేణుకచౌదరి మరోసారి నిరూపించిందన్నారు.
గర్జించిన ఖమ్మం
పోరుగర్జన పేరుతో నిర్వహించిన సభ విజయవంతం అయ్యింది.ఈ సభకు ముఖ్యఅతిథిగా రావాల్సిన టిఆర్‌ఎస్‌ అధినేత .ెచంద్రశేఖర్‌రావు అస్వస్థతకు గురికావడంతో హాజర ్‌కాలేకపోయారు.దీంతో నిర్వాహకులు నిరుత్సాహనాకి గురైనప్పటికి ప్రజలు మాత్రం భారీగా తరలివచ్చారు. తెలంగాణ ఉద్యమంలో మేము సైతం అంటూ ఏజెన్సీ నుంచి ఆదివాసులు , కొయ్యలు భారీ ఎత్తున్న తరలి వచ్చారు.

free website analytics