అదిలాబాద్

రాష్ట్రంలో భానుడు ఉగ్రరూపం దాల్చాడు. రాష్ట్రం నిప్పుల కొలిమిగా మారింది. ప్రచండబానుడిదాటికి ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడదెబ్బతో 10మంది మృతిచెందారు. ఉదయం ఏడు గంటలనుంచే వేసవి ప్రతాపం చూపుతోంది. ఇళ్లలో విద్యుత్ వాడకం కూడా భారీగా పెరుగుతోంది. పలు జిల్లాల్లో విద్యుత్ కోతలు కూడా మళ్లీ మొదలయ్యాయి. బుధవారం హైదరాబాద్‌లోనూ అనధికారికంగా 3 గంటల విద్యుత్ కోత విధించారు. రాష్టవ్య్రాప్తంగా బుధవారం ఉష్ణోగ్రతలు తీవ్రరూపం దాల్చాయి. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు. ఈ సమయంలో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటాయి.
తెలంగాణతోపాటు రాయలసీమ జిల్లాల్లోనూ 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో సాధారణం కంటే 3 డిగ్రీలు, కోస్తోంధ్ర, రాయలసీమలో 1 నుంచి 3 డిగ్రీలు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదువుతన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం రెంటచింతలలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వ్యవసా య రంగానికి ప్రాణధారమైన నైరుతి రుతుపవనాలు జూన్ 1 కల్లా కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ విభాగం ప్రకటించిన విషయం తెలిసిందే. రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకేవరకు ఇదే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంటుందని అధికారులు చెబుతున్నారు. ఈసారి సాధారణ తేదీ కన్నా కొంత ఆలస్యంగా దక్షిణ అండమాన్ సముద్రంలో రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు.

పోలవరం సమస్యపై చర్చలకు
ఒడిశా సీఎంను ఆహ్వానించా
ఛత్తీస్‌గఢ్ సీఎంనూ సంప్రతిస్తాం
మంత్రి డీఎల్‌కు పనేమీ లేదు
మీడియా.. ప్రభుత్వానికి సలహాదారుగా
వ్యవహరించాలి.. విశాఖలో సీఎం కిరణ్
- ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌దే గెలుపు.. అందుకు నరసన్నపేట నుంచే శ్రీకారం
- మాజీ సీఎం వైఎస్‌కు కాంగ్రెస్ ఎంతో ప్రాధాన్యం ఇచ్చింది
- ఆయన కుటుంబానికి అనేక పదవులు కట్టబెట్టింది
- కాంగ్రెస్ మోసం చేసిందని జగన్ చెప్పుకోవడం సిగ్గుచేటు
- శ్రీకాకుళం ఉప ప్రచారంలో సీఎం
- ఇప్పుడే ఫలితాలు చెప్పేందుకు మేం జ్యోస్యులం కాదు: పీసీసీ చీఫ్ బొత్స
విశాఖపట్నం/శ్రీకాకుళం, మే 6:పోలవరం, ప్రాణహిత-చే ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించేందుకు తాము కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్తూ.. విశాఖపట్నం విమానాక్షిశయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో సమస్యను పరిష్కరించుకునేందుకు పొరుగు రాష్ట్రాలతో సంప్రతింపులు జరుపుతామని సీఎం చెప్పారు. దీనిపై ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ముఖ్యమంవూతులతో చర్చించి ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు.
పోలవరంపై చర్చలకు రావాలంటూ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను ఢిల్లీలో ఎన్‌సీటీసీ సదస్సు సందర్భంగా ఆహ్వానించినట్లు చెప్పారు. మంత్రి డీఎల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యల గురించి విలేకరులు ప్రస్తావించగా ఆయనకేం పనిలేదు, మీకేం పనిలేదు అని వ్యంగ్యంగా స్పందించారు. అభివృద్ధి కార్యక్షికమాల విషయంలో మీడియా ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరించాలని హితవు పలికారు. అనంతరం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నరసన్నపేటలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు లోక్‌సభతోపాటు అన్ని అసెంబ్లీ స్థానాల్లో తామే గెలుస్తామని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం నుంచే శ్రీకారం చుట్టాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.
మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్‌డ్డికి కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రాధాన్యం ఇచ్చిందని చెప్పారు. రాజశేఖర్‌డ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయనను ఎవరు విమర్శించినా తాను, ధర్మాన ప్రసాదరావు, ఇతర మంత్రులు తిప్పికొట్టామని, ఆయనకు రక్షణ కవచంలా నిలిచామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబానికి అనేక పదవులు ఇచ్చిందని తెలిపారు. ఇప్పుడు రాజశేఖర్‌డ్డి కుమారుడు జగన్ కాంగ్రెస్ పార్టీ తమను మోసం చేసిందని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ బహిరంగసభలో రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కొండ్రు మురళీమోహన్, శ్రీకాకుళం ఎంపీ కృపారాణి తదితరులు పాల్గొన్నారు.
అన్ని పార్టీల్లో కోవర్టులుంటారు: బొత్స
నరసన్నపేట ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డికి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌తోసహా కోవర్టులు ఏ పార్టీలోనైనా ఉంటారని వ్యాఖ్యానించారు. ఏదేమైనా ఉప ఎన్నికల్లో విజయమే తమ ముందున్న లక్ష్యమని చెప్పారు. ఉప ఎన్నికల అభ్యర్థు ఎంపిక సరిగానే జరిగిందని, ఇందులో చర్చకు తావులేదని అన్నారు. నెల్లూరు లోక్‌సభ స్థానంతోపాటు 1 అసెంబ్లీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా తాము ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పుడే ఫలితాలు చెప్పేందుకు తామేమీ జ్యోతీష్యులం కాదని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

తెలంగాణపై కేంద్ర నిర్ణయమే శిరోధార్యం
రైతులకు,మైనారిటీల అభివృద్ధికి పెద్దపీట
రైతులు వ్యవసాయ కార్మికులతో పాటు మహిళలకు ,విద్యార్థులకు, యువజనులకు అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందిస్తున్న తమది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. రాజకీయలబ్ధికోసం చేసే మోసపూరిత వాగ్దానాలు, కల్లబొల్లి మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు అంశం సున్నితమైందని, దీనిపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంటుందన్నారు. ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి సి.రామచంద్రారెడ్డికి మద్దతుగా జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో బుధవారం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. సభకు నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అధ్యక్షత వహించారు. తమ పార్టీ అధికారంలోకివచ్చిన 2004 నుంచి ఇప్పటివరకు ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తున్నామని కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. మాటలతో పొద్దుపుచ్చక, ప్రజాసంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా తాము ముందుకు సాగుతున్నామన్నారు. వివరించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న రాజీనామా చేయడం వల్లే ఉపఎన్నికల అనివార్యమైందని గాడి తప్పిన పాలనను గాడిలో పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, ప్రజలతో మమేకమైన రాంచంద్రారెడ్డిని అసెంబ్లీకి పంపి అభివృద్ధికి ఆస్కారమివ్వాలని ముఖ్యమంత్రి ప్రజలను కోరారు. తనకు ఓటు వేసే అవకాశంఉంటే తాను కూడా ఇక్కడే ఓటు వేసేవాడినని ఆయన చలోక్తి విసిరారు. 2004నుంచి తమ ప్రభుత్వం చేపట్టిన అన్ని పథకాలను ముందుకు తీసుకెళ్తోందని, రచ్చబండద్వారా 30లక్షల మందికి అదనంగా రేషన్ కార్డులు అందచేశామని, రాష్ట్రంలో ఏడున్నర కోట్లమందికి ఒక్కరూపాయికే కిలో బియ్యం ఇస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని 95లక్షల మంది రైతులకు వడ్డీలేని రుణాలను అందజేస్తున్నామని, లక్ష రూపాయలు తీసుకుని వెంటనే తిరిగి చెల్లించిన వారికి వడ్డీ లేకుండా రుణాలు అందజేస్తున్నామని మిగతా వారికి పావలా వడ్డీతో ఇస్తున్నామని ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల 75వేల మందికి రుణాలు అందజేస్తే ఒక్క మన రాష్ట్రంలోనే 45వేల కోట్ల మందికి రుణాలు అందజేసి దేశంలోనే రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు ఉపాధి హామీ పథకంలో కూలీల పనిదినాలను పెంచడమేకాకుండా పనికిదగ్గ ఫలితాలు అందజేస్తున్నామని, కేవలం ఒక్క ఆదిలాబాద్‌లోనే 970 కోట్ల రూపాయల ఉపాధిహామీ పనులు చేపట్టామని చెప్పారు. ఈఏడాది జనవరి నుంచి వడ్డీ లేని రుణాలను మహిళలకు అందజేస్తున్నామని దీని ద్వారా పదివేల కోట్ల రూపాయలను ఎలాంటి వడ్డీ లేకుండా మహిళలకు అందిస్తున్నట్లు వివరించారు. మహిళల ఆర్థిక స్వయం సమృద్ధికి తమప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద 13లక్షల కుటుంబాలకు ఉచితంగా వైద్య ఆరోగ్య సేవలు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. యువకులకు ఉపాధి కల్పించేందుకు లక్షా16వేల మందికి వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు అందజేస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని చెప్పారు. ఇటీవలే విఆర్వో, ఎస్సైల పరీక్షాఫలితాలు వచ్చాయని , త్వరలోనే టీచర్లు , కానిస్టేబుళ్ల ఫలితాలు కూడా వస్తాయన్నారు. యువకులకు ఉచిత శిక్షణతో పాటు పారిశ్రామిక రంగాల్లో ఉపాధి కల్పించేందుకు మరో ఐదు లక్షల మందికి ఉద్యోగాలు అందజేస్తున్నట్లు ఆయన వివరించారు.
తెలంగాణ విషయంలో రెచ్చగొట్టి, మభ్యపెట్టేవారి కల్లబొల్లి మాటలు నమ్మవద్దని కిరణ్‌కుమార్‌రెడ్డి కోరారు. తెలంగాణ విషయంలో కేంద్రం సముచిత నిర్ణయం తీసుకుంటుందని, కేంద్రం తీసుకునే నిర్ణయం తమకు శిరోధార్యమని చెప్పారు. తెలంగాణ ఉద్యమం సాకుతో రాజకీయ లబ్ధిపొందాలని చూసేదెవరో ప్రజలు గమనంచాలన్నారు. ప్రాణహిత… చేవెళ్ల ప్రాజెక్టు విషయమై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించామని, జిల్లాలో మరిన్ని అభివృద్ధి పనులు శరవేగంగా జరుగాలంటే ఉపఎన్నికల్లో వచ్చిన అవకాశాన్ని నియోజక వర్గ ప్రజలు ఉపయోగించుకుని కాంగ్రెస్ అభ్యర్థి రాంచంద్రారెడ్డిని గెలిపించి అసెంబ్లికి పంపాలని ఆయన కోరారు. జిల్లా ఇంచార్జి మంత్రి బసవరాజు సారయ్య మాట్లాడుతూ మూడేళ్లలో ఆగిపోయిన ప్రగతిని రెండేళ్లలో చేసేచూపేవిధంగా రాంచంద్రారెడ్డిని గెలిపించడం ద్వారా రాష్ట్ర క్యాబినెట్‌లో అవకాశం వచ్చే విధంగా ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరించాలని కోరారు.

రాష్ట్రంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మార్చి 18న పోలింగ్
ఉప ఎన్నికల నగారా మ్రోగింది. వివిధ రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న ఒక పార్లమెంటు, 11 శాసనసభా స్థానాల్లో ఉప ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్(సిఇసి) షెడ్యూల్ జారీ చేసింది. ఇందులో ప్రస్తుతం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఏడు శాసనసభా నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. రాష్ట్రంలో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, కోవూరు, స్టేషన్‌ఘన్‌పూర్, కొల్లాపూర్, అదిలాబాద్, కామారెడ్డి నియోజకవర్గాలు ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే రాజేశ్వరరెడ్డి మృతితో మహబూబ్‌నగర్ ఖాళీ కాగా జగన్ వర్గంలో చేరిన కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, తెలంగాణా రాష్ట్ర డిమాండ్‌తో నాగం జనార్ధన్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహా ఇతర ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ స్థానాలతో పాటు మంసా(గుజరాత్), పిరవొమ్(కేరళ), శంకరన్ కొవిల్(తమిళనాడు), అతాగర్(ఒడిషా) శాసనసభా స్థానాలకు, ఉడుపి చిక్మగలూర్(కర్నాటక) పార్లమెంటు స్థానానికి ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. ఉప ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 22న విడుదల కానుంది. ఫిబ్రవరి 22 నుంచి 29వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. మార్చి 18 న పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు 21న నిర్వహిస్తారు. కాగా ఉప ఎన్నికలు జరుగనున్న ఆయా స్థానాలకు సంబంధించిన జిల్లాల్లో ఎన్నికల నియమావళి వెంటనే అమల్లోకి వస్తుందని సిఇసి ఒక ప్రకటనలో తెలిపింది.కాగా జమ్మూకాశ్మీర్‌లో ఎమ్మెల్యేల కోటాలో శాసనమండలికి ఎన్నికైన యశ్‌పాల్ ఖజరియా మృతితో ఏర్పడిన ఖాళీ స్థానానికి ఇసి షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 22న ఆ స్థానానికి పోలింగ్ జరగనుంది.

డీఎస్స-12 నోటిఫికేషన్ విడుదల
మే 2,3,4 తేదీల్లో రాత పరీక్షలు
అప్రెంటీస్ విధానం రద్దు
‘ఇంటర్’ నిబంధన తొలగింపు
‘ఓపెన్ డిగ్రీ’ వారికీ అర్హత
ఎస్ఏ పోస్టులకు సబ్జెక్టు నిబంధనల సడలింపు
80 మార్కులకే డీఎస్సీ
20 మార్కులకు టెట్ వెయిటేజి
మరో 7100 పోస్టులకు రెండు రోజుల్లో నోటిఫికేషన్
హైదరాబాద్, జనవరి 30 : లక్షలాది మంది ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త. కొద్ది రో జులుగా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న ‘డీఎస్సీ -2012 నోటిఫికేషన్’ సో మవారం విడుదలైంది. మొత్తం 21,343 ఉపాధ్యాయ ఉద్యోగాలను ఇందులో నోటిఫై చేశారు. ఉపాధ్యాయ అభ్యర్థులు దశాబ్దకాలంగా చేస్తోన్న ‘అప్రెంటిస్’ రద్దు డిమాండ్ కూడా నెరవేరుతోంది. వివాదాస్పదంగా మారిన ‘ఇంటర్‌లో సంబంధిత సబ్జెక్టులు తప్పనిసరి’ అనే నిబంధనను తొలగించారు.
నోటిఫై చేసిన మొత్తం పోస్టుల్లో.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 5,703, ఎస్జీటీ పోస్టులు 11, 602 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్లు 2000, పీఈటీలు 365, మునిసిపల్ పాఠశాలల్లో 1,673 పోస్టులు ఉన్నాయి. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 17వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. సచివాలయంలో సోమవారం సాయంత్రం 3 గంటలకు మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కె.పార్థసారథి ఈ డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. డీఎస్సీకి విద్యార్హతల నిబంధనల్లో కొన్నింటిని సడలించారు.
స్కూల్ అసిస్టెంట్స్ (మేథ్స్, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్) పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్ స్థాయిలో కూడా మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, హిస్టరీ, జాగ్రఫీ సబ్జెక్టులు చదివి ఉండాలన్న నిబంధనలను తొలగించారు. అంటే.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్ చదివి ఉండాలన్న నిబంధన లేదు.
ఫలితంగా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా నేరుగా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు కూడా అర్హత లభిస్తుంది. స్కూల్ అసిస్టెంట్స్ (జీవశాస్త్రం) పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు జీ.వో.నెం.4లో పేర్కొన్న సబ్జెక్టులతో పాటు సెరికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, పౌల్ట్రీ సబ్జెక్టుల అభ్యర్థులకు కూడా అర్హత కల్పించారు. టీచర్లకు అప్రెంటిస్ విధానాన్ని ఈ డీఎస్సీ నుంచి రద్దు చేశారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు నమూనా, యూజర్ గైడ్ కోసం జ్ట్టిఞ://్చఞఛీటఛి.ఛిజజ.జౌఠి.జీn వెబ్‌సైట్‌ను చూసుకోవాలి.
డీఎస్సీ 80 మార్కులకే..
టెట్‌కు వెయిటేజీ ఇవ్వనున్న కారణంగా 80 మార్కులకే డీఎస్సీ పరీక్షను నిర్వహించనున్నారు. మిగతా 20 మార్కులకు టెట్ మార్కులను వెయిటేజీగా జమ చేస్తారు. ఒక్కో ప్రశ్నకు అర మార్కు చొప్పున 80 మార్కులకు 160 డీఎస్సీ పరీక్ష ఉంటుంది. ఎస్జీటీ పరీక్షలో జనరల్ నాలెడ్జ్‌కు 10 మార్కులు, పర్‌స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 10, ఇంగ్లీష్ 9, ఇండియన్ లాంగ్వేజ్ 9, మాథ్స్ 9, సైన్స్ 9, సోషల్ స్టడీస్ 9, టీచింగ్ మెథడ్ 15 మార్కులు ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్ పరీక్ష ల్లో.. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10, పర్‌స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 10, సబ్జెక్ట్ కంటెం ట్ 44, టీచింగ్ మెథడాలజీ 16 మార్కులు ఉంటాయి. పీ ఈటీలకు టెట్ ఉండకపోవ డం వల్ల పూర్తిగా 100 మా ర్కులకు పరీక్ష ఉంటుంది.

- గురువారం వెలుగులోకి.. నిందితుడి అరెస్టు
మూఢనమ్మకం పడగవిప్పింది.. అనాగరికం కోరలు చాచింది.. గుప్త నిధుల కోసం అభం శుభం తెలియని బాలుడ్ని ఓ కసాయి పొట్టనబెట్టుకున్నాడు. బైక్‌పై తిరగాలన్న ఆ బాలుడి ఉబలాటాన్ని ఆసరాగా చేసుకొని బయటకు తీసుకెళ్లాడు.. సమోసాలు తినిపించి, కోటను చూసివద్దామన్నాడు. నమ్మిన బాలుడు.. వెంట చీకటి పడటంతో ఎవరూ లేనిది చూసి ఆ బాలుడి గొంతునులిమి చంపేశాడు కసాయి..! ఈ దారుణం ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో గురువారం వెలుగుచూసింది. జిల్లాలోని లక్ష్మణచాంద మండలం కనకాపూర్‌కు చెందిన పూసపర్తి నర్సయ్య టైలర్‌గా పనిచేస్తూ కొన్నాళ్ల క్రితం నిర్మల్‌లో స్థిరపడ్డాడు. ఆయనకు భార్య కల్పన, కుమారుడు గణేష్(13) ఉన్నారు. గణేష్ స్థానిక చాణక్య పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. తండ్రి పనిచేస్తున్న టైలర్‌షాప్‌నకు మంగళవారం సాయంత్రం ఆ బాలుడు వెళ్లాడు.
షాపు పక్కనే ఉన్న హోటల్‌లో లోకేశ్వరం మండలం నగర్ తండాకు చెందిన రాథోడ్ రాజు పనిచేస్తున్నాడు. నిర్మల్‌కు చెందిన ప్రభాకర్‌తో కలిసి రాథోడ్ రాజు కొన్నాళ్లుగా గుప్తనిధుల వేట సాగిస్తున్నాడు. వీరిద్దరూ శ్యాంగఢ్ కోటలో ఇటీవలతవ్వకాలు చేపట్టినట్లు సమాచారం. ఓ మంత్రగాడి సలహాతో నరబలి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం రాజు టైలర్‌షాప్ వద్ద ఆడుకుంటున్న గణేష్‌ను మాటల్లో దింపాడు. గణేష్‌కు బైక్‌పై తిరగాలన్న ఆరాటాన్ని గ్రహించి, బైక్‌పై జూనియర్ కళాశాల మైదానంలోకి తీసుకెళ్లాడు. అక్కడ సమోసాలు తినిపించి, శ్యాంగఢ్ కోటకు తీసుకెళ్లాడు. కోట పరిసరాల్లో గొంతునులిమి ప్రాణాలు తీశాడు. అనంతరం అప్పటికే తవ్వి ఉంచిన గోతిలో శవాన్ని పూడ్చివేశాడు.
వెలుగు చూసింది ఇలా…
తమ కొడుకు ఆచూకీ తెలియకపోవడంతో గణేష్ తండ్రి నర్సయ్య తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గణేష్‌ను రాజు తీసుకెళ్లినట్లు స్థానికులు చెప్పడంతో రాజు కోసం వెతకడం ప్రారంభించారు. ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బుధవారం రాజును అదుపులోకి తీసుకొని విచారించగా హత్యఘటన వెలుగుచూసింది. గురువారం శ్యాంఘడ్ కోటలో నిందితుడితోనే గోతి నుంచి గణేష్ మృతదేహాన్ని వెలికి తీయించారు. మృతదేహాన్ని చూసిన తల్లిదంవూడులు భోరున విలపించారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి, నిందితులను కఠినంగా శిక్షిస్తామని డీఎస్పీ శేషుకుమార్ చెప్పారు.
కఠినంగా శిక్షించాలి: జన చైతన్య వేదిక
హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో నరబలి జరగడానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా మూఢనమ్మకాలతో నరబలి ఇవ్వడాన్ని ఆయన ఖండించారు.
ప్రభుత్వానిదే బాధ్యత: బాలల హక్కుల సంఘం
గుప్తనిధుల కోసం బాలుడ్ని బలి ఇవ్వటంపై బాలల హక్కుల సంఘం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. దీనికి బాధ్యులైనవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. మూఢనమ్మకాలతో బాలుడ్ని బలి ఇవ్వటం దారుణమని బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు అన్నారు. దీనికి ప్రభుత్వానిదే బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలను తొలగించటానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

రైతు పోరుబాటలో చంద్రబాబు పశ్చాత్తాపం తెలంగాణకు తెదెపా వ్యతిరేకం కాదు బాబు పర్యటనలో చేదు అనుభవం సభా వేదికపైకి చెప్పు.. కాన్వాయ్‌పైకి గుడ్లు
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రైతులకు ఉచిత విద్యుత్ అమలు చేయకపోవడం తప్పిదంగా నిలిచిందని, ఆ సమయంలోనే ఉచిత విద్యుత్ ఇచ్చివుంటే నేడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉండేది కాదని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పశ్చాత్తాపం వెలిబుచ్చారు. రైతు పోరుబాటలో భాగంగా గురువారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఆర్మూర్ మండలం గోవింద్‌పేట్ నుంచి జక్రాన్‌పల్లి వరకు సుమారు 14కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించి రైతు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జక్రాన్‌పల్లిలో బహిరంగ సభలో మాట్లాడుతూ ‘నా హయాంలో ఉచిత విద్యుత్ ఇవ్వకపోవడం పొరబాటే. ఇందుకు ప్రాయశ్చిత్తంగానే నన్ను నేను శిక్షించుకోవడానికి రైతాంగ సమస్యలపై పాదయాత్ర నిర్వహిస్తూ పోరాటం చేస్తున్నా’ అని చంద్రబాబు పేర్కొన్నారు. వ్యవసాయరంగానికి తొమ్మిది గంటల ఉచిత కరెంట్ ఇస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, కనీసం మూడు గంటలు కూడా నాణ్యమైన విద్యుత్ అందించడం లేదని దుయ్యబట్టారు. పైపెచ్చు రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను ఇతర ప్రాంతాలకు విక్రయించుకుంటూ 1500 కోట్ల రూపాయలు కూడబెట్టుకుంటోందని, ఉచిత విద్యుత్ పేరిట అందులో కేవలం 400 కోట్ల రూపాయల సబ్సిడీ వర్తింపజేస్తోందన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతాంగానికి ఉచితంగా 9గంటలు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎరువులు, క్రిమిసంహారక ధరలు విపరీతంగా పెరిగిపోయి పంటల సాగుకు పెట్టుబడులు రెట్టింపయ్యాయని, అదే సమయంలో వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించకపోవడంతో అన్నదాత ఆర్థికంగా చితికిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరవు జిల్లాలను ప్రకటించి చేతులు దులుపుకోవడం వినా, సహాయక చర్యలకు పైసా విదిల్చలేని అసమర్ధ ప్రభుత్వమని దుయ్యబట్టారు. పసుపు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. ఇంత జరుగుతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా కాంగ్రెస్ పాలకులు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ అధికారాన్ని నిలుపుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని, మైనార్టీలకు రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
తెలంగాణకు తెదెపా వ్యతిరేకం కాదు
కాగా, తెలంగాణ ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ ఎంతమాత్రం వ్యతిరేకం కాదని, పార్టీ మహానాడులోనూ ఈ విషయమై తమ నిర్ణయాన్ని స్పష్టం చేశామని చంద్రబాబు పేర్కొన్నారు. వ్యక్తిగతంగా తానెన్నడూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదని గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణపై కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నప్పటికీ నాన్చుడు ధోరణి అవలంభిస్తూ అనిశ్చితి కొనసాగిస్తోందని, ప్రజల మధ్య అపోహలు సృష్టిస్తోందని విమర్శించారు. తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న తమ పార్టీ నేతలను కూడా తాను వారించకుండా పూర్తి స్వేచ్ఛ ఇచ్చానని చంద్రబాబు వివరించారు.
సభా వేదికపైకి టిఆర్‌ఎస్ చెప్పు
నిజామాబాద్ జిల్లా పర్యటనకు హాజరైన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు చేదు అనుభవం ఎదురైంది. పాదయాత్ర ముగించుకుని జక్రాన్‌పల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్న సమయంలో చిన్నారెడ్డి అనే టిఆర్‌ఎస్ కార్యకర్త సభా వేదికపై చెప్పు విసరడం కలకలం సృష్టించింది. తెలంగాణ విషయంలో తెదెపా వైఖరిని తేటతెల్లం చేయాలంటూ టిఆర్‌ఎస్ కార్యకర్తలు, పలువురు మహిళలు నినాదాలు చేస్తూ సభలో నిరసన వ్యక్తం చేశారు. చెప్పు విసిరిన సంఘటనను తీవ్రంగా పరిగణిస్తూ కోపోద్రిక్తులైన తెలుగుదేశం కార్యకర్తలు చిన్నారెడ్డితో పాటు తెలంగాణ నినాదాలు చేస్తున్న ఇతర ఆందోళనకారులపై దాడికి దిగి ముష్టిఘాతాలు కురిపించారు. పోలీసుల సమక్షంలోనే తీవ్రంగా చితకబాదడంతో సభా ప్రాంగణం రసాభాసగా మారింది. ఓవైపు చంద్రబాబు వారిస్తున్నా లెక్క చేయకుండా తెలుగు తమ్ముళ్లు ఇష్టారీతిన ఆందోళనకారులను చితకబాదుతూ పార్టీ అధినేత పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇదిలావుంటే, మామిడిపల్లి గ్రామం వద్ద మహిళా జెఎసి ప్రతినిధులు చంద్రబాబు కాన్వాయ్‌పై కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేసి నిరసన వ్యక్తం చేశారు. కొలిప్యాక్ గ్రామంలో తెలంగాణ ద్రోహి చంద్రబాబు గో బ్యాక్ అంటూ తెలంగాణవాదులు నినాదాలు చేశారు.

రైతాంగ సమస్యలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేపట్టిన రైతు పోరుబాట తెలంగాణలోనూ జోరుగా కొనసాగింది. ఉత్తర తెలంగాణలో చంద్రబాబు పర్యటన అడ్డుకోవాలంటూ తెలంగాణ రాజకీయ జెఎసి పిలుపునకు స్పందన కానరాలేదు. చెదురు మదురు సంఘటనలు మినహా చంద్రబాబు పాదయాత్రకు ప్రజలు జననీరాజనాలు పలికారు. తెలంగాణ, సీమాంధ్రలో ఇప్పటి వరకు చంద్రబాబు చేపట్టిన పాదయాత్ర అద్వితీయంగా విజయవంతమైంది. ఆయన యాత్రకు ప్రజలు, రైతులు అపూర్వంగా స్పందించారు. రైతులు తమ సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళేందుకు పోటీపడ్డారు.
రైతు సమస్యలు పరిష్కారమయ్యే వరకు తాను అండగా ఉంటానంటూ చంద్రబాబు ఇచ్చిన హామీ రైతుల గుండెల్లో మనోధైర్యాన్ని నింపింది. తెలంగాణలో రంగారెడ్డి, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో చంద్రబాబు తన పోరుబాటను పూర్తి చేసుకున్నారు. ఉత్తర తెలంగాణలో తెలంగాణవాదం బలంగా ఉండడం, తెలంగాణ రాజకీయ జెఎసి చంద్రబాబు పర్యటనను అడ్డుకోవాలంటూ ప్రజలకు పిలుపునివ్వడం వంటి పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు ధైర్యంగా ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం తన పోరుబాటను ప్రారంభించారు. 1986లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు బసచేసిన ఉట్నూరు మండలం సాలెగూడ నుంచే చంద్రబాబు కూడా తన పాదయాత్రను ప్రారంభించారు. ఉదయం 11 గంటలకే పాదయాత్ర ప్రారంభం కావలసి ఉన్నా కొన్ని కారణాల వల్ల గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైంది. అయినా ప్రజలు, రైతులు పెద్ద సంఖ్యలో చంద్రబాబు రాక కోసం నిరీక్షించారు. ఉమ్రీ, ఎందా, ఎందా క్రాస్ రోడ్, షాంపూర్, గోదారి గూడ, ఉట్నూరు క్రాస్ రోడ్ మీదుగా ఉట్నూరు వరకు కొనసాగింది. ఏజెన్సీ కేంద్రమైన ఉట్నూరు ప్రాంతంలో బాబు యాత్రకు పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. మహిళలు అడుగడుగునా హారతులిచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై చంద్రబాబు నిప్పులు చెరిగారు.

సకల జనుల సమ్మెలో అన్ని వర్గాలు కదిలివస్తుంటే ఏ మాత్రం చలనం లేకుండా ప్రేక్షకపాత్ర పోషిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను నిలదీసి ఉద్యమ సెగ ఢిల్లీకి తగిలేలా కృషి చేయాలని రాజకీయ జెఎసి ఛైర్మన్ ప్రొపెసర్ ఎం. కోదండరామ్ పిలుపునిచ్చారు. సకల జనుల సమ్మెలో భాగంగా గురువారం ఖమ్మంలో జరిగిన పోరు గర్జన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణలో పది రోజులుగా జరుగుతున్న సకలజనుల సమ్మెలో తెలంగాణ సమాజం మొత్తం కదిలివచ్చి భాగస్వాములవుతుంటే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కన్పించకుండా పోయారని మంత్రులు ఏమీ ఆశించి మౌనంగా ఉన్నారో అర్థం కావడం లేదన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కడికి పోయారో తెలియడం లేదని.. ఎక్కడా దాక్కున్నారో వేతకాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎంపిలు నోరు తెరిస్తే ఢిల్లీ కదిలిరాదా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ మంత్రులు కదిలివస్తే నిజాం విద్యార్థులపై దాడులు జరిగేవా? స్వామిగౌడ్‌ను అరెస్ట్ చేసేవారా? ఆర్టీసి బస్సులను తిప్పేవారా? అంటూ కోదండరామ్ ప్రశ్నించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ప్రేక్షకపాత్రను సవాల్‌గా తీసుకొని ఎక్కడపడితే అక్కడ వారిని నిలదీయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో సమ్మె జరగడం లేదని ఢిల్లీలో భజన చేసే రేణుకచౌదరి, అభిషేక్ సింఘ్వీలు కళ్లు ఉండి చూడదల్చుకుంటే చెవులు ఉండి వినదల్చుకుంటే తెలంగాణలో అడుగుపెట్టి చూడాలన్నారు.
శాంతియుతంగా సహనంతో సమ్మె చేస్తున్నామని ‘తెలంగాణ ప్రజల సహనాన్ని, ఓర్పును వారు తప్పుగా అర్థం చేసుకోవద్దని హితవు పలికారు. సమ్మెపై సీఎం కిరణ్ మాట్లాడిన తీరు పిల్లచేష్టల్లా ఉన్నాయన్నారు. సీఎం సమ్మె సెగ తాకకుండా బుల్లెట్ ప్రూప్ తగిలించుకున్నాడో లేదా ఏదైనా లేహ్యం, పౌడర్ రాసుకున్నాడో తెలియడం లేద న్నారు. ఆయనకు ఏ పేరు పెట్టాలో డిక్షనరీలో అర్ధాలు వెతకాల్సి వస్తుందన్నారు. ఈ నెల 24, 25 తేదీల్లో జరిగే రైల్‌రోకో ద్వారా సమ్మె సెగ ఢిల్లీకి తాకాలని కోదాండరామ్ పిలుపునిచ్చారు. 48 గంటలపాటు తెలంగాణలో రైలు పట్టాలు కన్పించ కుండా మానవహారాలే కన్పించాలన్నారు. విద్యార్థులు అవేశానికి పోయి టవర్లు ఎక్క వద్దని, ఆత్మబలిదానాలకు పాల్పడవద్దని కోరారు.
వడ్డీతో సహా మూల్యం చెల్లిస్తాం : ఈటెల
తెలంగాణ కోసం జరుగుతున్న పోరాటాన్ని అణిచివేసేందుకు ప్రయత్నిస్తే వడ్డితో సహా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని టిఆర్‌ఎస్ శాసనసభపక్ష నాయకులు ఈటెల రాజేందర్ అన్నారు. ఉద్యమాన్ని అణచివేయడానిి చూస్తే తెలంగాణ వచ్చిన తరువాత వడ్డీతో సహా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే సంసృ్కతి ఆంధ్రా వాళ్ళదని రేణుకచౌదరి మరోసారి నిరూపించిందన్నారు.
గర్జించిన ఖమ్మం
పోరుగర్జన పేరుతో నిర్వహించిన సభ విజయవంతం అయ్యింది.ఈ సభకు ముఖ్యఅతిథిగా రావాల్సిన టిఆర్‌ఎస్ అధినేత .ెచంద్రశేఖర్‌రావు అస్వస్థతకు గురికావడంతో హాజర ్‌కాలేకపోయారు.దీంతో నిర్వాహకులు నిరుత్సాహనాకి గురైనప్పటికి ప్రజలు మాత్రం భారీగా తరలివచ్చారు. తెలంగాణ ఉద్యమంలో మేము సైతం అంటూ ఏజెన్సీ నుంచి ఆదివాసులు , కొయ్యలు భారీ ఎత్తున్న తరలి వచ్చారు.

తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో అధిష్ఠానంతో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించిన తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు చిట్టచివరి సారిగా ఈ నెల 25వ తేదీన ఢిల్లీకి వెళ్ళాలని నిర్ణయించారు. ఈ సారి అధిష్ఠానం సానుకూలంగా నిర్ణయం తీసుకోని పక్షంలో హైదరాబాద్‌కు తిరిగి వచ్చి అందరూ రాజీనామాలు చేయాలని నిర్ణయించారు. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా రాజీనామాలకు సిద్ధంగా ఉండాలని సమావేశంలో నిర్ణయించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సారధ్య సంఘం చైర్మన్, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు నివాసంలో గురువారం తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సారథ్య సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి, గవర్నర్‌పై సభ్యులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జరుగుతున్న సకల జనుల సమ్మె గురించి ముఖ్యమంత్రి, గవర్నర్ కేంద్రానికి, అధిష్ఠాన వర్గానికి తప్పుడు నివేదికలు పంపిస్తున్నారని, ఆ నివేదికల అధారంగానే అధిష్ఠానం ప్రతినిధులు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్నారని వారు విమర్శించారు. రాష్ట్రంలో పరిస్థితిని అంచనా వేసేందుకు అధిష్ఠాన వర్గం తన దూతగా ఎవరినైనా పంపించి వాస్తవాలను తెలుసుకోవచ్చు కదా అని వారు అభిప్రాయ పడ్డారు. సకల జనుల సమ్మె ప్రభావం ఏమీ లేదంటూ ఎఐసిసి అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి ఢిల్లీలో చేసిన ప్రకటనను సమావేశం తీవ్రంగా ఖండించింది. అదే విధంగా, తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల గురించి తెరాస అధినేత కెసిఆర్ చేస్తున్న వ్యాఖ్యలను కూడా సమావేశం ఖండించింది.
సకల జనుల సమ్మెతో తెలంగాణలో జన జీవనం స్తంభించినా అధిష్ఠాన వర్గం తెలంగాణపై నిర్ణయం తీసుకోకపోవడం పట్ల సారధ్య సంఘం ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఇక చివరిసారిగా ఢిల్మీకి వెళ్ళి అధిష్ఠాన వర్గాన్ని కలిసి ఇక్కడి పరిస్థితిని వివరించి తెలంగాణపై వెంటనే నిర్ణయం తీసుకోవలసిందిగా కోరుదాం, అధిష్ఠాన వర్గం సానుకూలంగా స్పందిస్తే సరే, లేని పక్షంలో వెంటనే హైదరాబాద్‌కు తిరిగి వచ్చి తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం రాజీనామాలు చేద్దాం’ అని సమావేశంలో సభ్యులు అన్నారు. దీనిపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, మళ్ళీ మనం ఎవరం ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం అందరం రాజీనామాలు చేస్తే అధిష్ఠానవర్గమే దిగి వచ్చి తెలంగాణను ప్రకటిస్తుంది’ అని అన్నారు.
మంత్రులు కూడా రాజీనామాలు చేయాలన్న విషయం చర్చకు వచ్చినపుడు, ఎంతమంది మంత్రులు రాజీనామాలు చేసేందుకు సిద్ధపడతారో అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సారధ్య సంఘం చైర్మన్‌గా ఉన్న పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె.జానారెడ్డి సమావేశంలో తెలియజేశారు. వెంటనే మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలుగజేసుకుని తాను కూడా రాజీనామా చేసేందుకు సిద్ధమేనని ప్రకటించారు. తన రాజీనామా గురించి ఇంతకు ముందే చెప్పానని, నెలాఖరులోగా తెలంగాణ ఏర్పాటుకు అధిష్ఠానం సానుకూల నిర్ణయం తీసుకోని పక్షంలో అక్టోబర్ 2వ తేదీ నుంచి ఆమరణ దీక్ష చేపట్టనున్న విషయాన్ని కూడా మీడియా ద్వారా ప్రకటించానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరించారు. నల్లగొండ జిల్లా సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆర్.దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ, తన సోదరుడు, ఉద్యావన శాఖ మంత్రి ఆర్.వెంకటరెడ్డితో కూడా తాను రాజీనామా చేయిస్తానని హామీ ఇచ్చారు. అయితే మిగిలిన తెలంగాణ మంత్రుల్లో ఎంతమంది రాజీనామాకు సిద్ధపడతారో ఇప్పుడే చెప్పలేమని వారు అభిప్రాయ పడ్డారు.
మాకు కావాల్సింది తెలంగాణ.. కిలో రూ.1 బియ్యం కాదు
ఇలా ఉండగా, సమావేశం అనంతరం మాజీ మంత్రి, ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. సకల జనుల సమ్మె ఇంత తీవ్రంగా ఉంటే రూపాయికి కిలో బియ్యాన్ని ఎవరు అడిగారని ప్రశ్నించారు. ‘మాకు కావలసింది తెలంగాణ తప్ప రూపాయికి కిలో బియ్యం కాదు’ అని దామోదర్‌రెడ్డి అన్నారు. సకల జనుల సమ్మె ప్రభావం గురించి ముఖ్యమంత్రి అధిష్ఠాన వర్గానికి తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఆయన మండి పడ్డారు.
తెలంగాణ ఇవ్వకపోతే కఠిన నిర్ణయాలు
తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సారధ్య సంఘం అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ, ఇక్కడి పరిస్థితిని అధిష్ఠాన వర్గానికి వివరించేందుకు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం ఈ నెల 25వ తేదీ సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళతామన్నారు. 26వ తేదీన అధిష్ఠాన వర్గాన్ని కలుసుకుంటామని, ఈ సందర్భంగా తెలంగాణకు అనుకూలంగా అధిష్ఠాన వర్గం నిర్ణయం తీసుకోని పక్షంలో హైదరాబాద్ తిరిగివచ్చి కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదని ఆయన హెచ్చరించారు.
తప్పుడు నివేదికలు పంపుతున్న సిఎం, గవర్నర్
కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు మందా జగన్నాధం మాట్లాడుతూ, సకల జనుల సమ్మెకు సంబంధించి ముఖ్యమంత్రి, గవర్నర్ కూడా కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచి వేసేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.