అనంతపూర్
పంట నష్టపరిహారంపై జాయింట్ కలెక్టర్‌ఒ అనితారామచంద్రన్ గురువారం సాయంత్రం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహిం చారు. అనంతరం వి లేకరులతో మాట్లాడుతూ 2011కు రైతులకు సంబంధించిన పంటనష్టపరిహారం 298కోట్లకుగాను 80కోట్లు రైతుల ఖాతాలో జమచేసినట్లు తెలిపారు. మిగిలిన రైతులకు బ్యాంక్ అకౌంట్లను సేకరించి ఖాతాలో వేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు . ఎఎవై పథకం కింద జిల్లా లో 77వేల కార్డులు నూతనంగా తయారుచేస్తున్నామన్నారు. జూన్ మొదటివారంలోనే 30కేజిల బియ్యాన్ని సరఫరాచేస్తామన్నారు. దీనిని ప్రజలందరు సద్వినియోగం పరుచుకోవాలని ఆమె తెలిపారు. ఈసమావేశంలో ఉరవకొండతహసీల్దార్ మద్దిలేటితో పాటు మిగిలిన ఐదు మండలాలకు చెందిన తహసీల్దార్ లు పాల్గొన్నారు.
ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాటిల్‌వేణుగోపాల్‌రెడ్డి గెలుపు కోసం రాజ్యసభసభ్యుడు చిరంజీవి ఈనెల 22వతేదీన రాయదుర్గం నియోజక వర్గంలో పర్యటించనున్నట్లు మాజీ మున్సిపల్ చేర్మెన్ గౌనిఉపేంద్రరెడ్డి తెలిపారు. 22వతేదీ ఉదయం 9.30 గంటలకు వేపరాళ క్రాస్‌కు చేరుకుంటారని తెలిపారు. కాశీపురం, కెంచానపల్లి, మలకాపురం, జుంజురాంపల్లి, భూపసముద్రం, ఎస్.కొత్తపల్లి, మారెంపల్లి, దేవరెడ్డిపల్లి, 74 ఉడేగోళం మీదుగా రోడ్‌షో నిర్వహించి రాయదుర్గానికి మధ్యాహ్నం 1 గంటకు చేరుకుంటారని తెలిపారు. రాయదుర్గం పట్టణంలో రోడ్‌షో, పాతబస్టాం డ్‌లో బహిరంగ సభ కార్యక్రమాలు వుంటాయని తెలిపారు. అలాగే శాంతినగర్‌లోని ఆంజినేయ స్వామి దేవాలయంవద్ద ప్రసంగం వుంటుందని తెలిపారు. అనంతరం డి.హీరేహాళ్ మండలం కల్యం, మురడి, ఎం.హనుమాపురం, దొడగట్ట, గొడశలపల్లి, కాదలూరు, సొమలాపురం, పులకుర్తి, హిర్ధెహాళ్ మీదుగా డి.హీరేహాళ్ చేరుకుంటారన్నారు. అక్కడ బహిరంగ సభ అనంతరం ఓబుళాపురం మీదుగా బళ్ళారికి చేరుకుని, హైదరాబాద్‌వెళ్ళనున్నట్లు ఆయన తెలిపారు. కావున 22వతేదీ చిరంజీవి చేపట్టిన రోడ్‌షో, పర్యటన, బహిరంగ సభలకు కాంగ్రెస్ నాయకులు, అభిమానులు, కార్యకర్తలే కాకుండా చిరంజీవి అభిమానులు కూడా అశేషంగా తరలివచ్చి సభలను జయప్రదం చేయాలని, కాంగ్రెస్ పార్టీకి ఓటువేసి, పాటిల్‌ను అత్యధికమెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.
సిఎం కిరణ్ కుమార్ రెడ్డి ఉప ఎన్నికల ప్రచారానికి అనంతపురం నగరంలో పర్యటిస్తున్న కారణంగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎస్ రాజును పొలీసులు అరెస్ట్ చేశారు. గురువారం త్రీటౌన్ సిఐ చిన్నగౌస్ ఆధ్వర్యంలో ఎస్సై రెడ్డప్ప, సిబ్బంది రాజును అరెస్ట్ చేసి, స్టేషన్ కు తరలించారు. సిఎం పర్యటనలో ఆందోళనలు జరగకుండా రాజుతో పాటు మరో 30 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిసింది.
తాడిపత్రి పట్టణంలోని పుట్లూరు రోడ్ కాత్యాయని లాడ్జ్ సమీపంలో గురువారం ఏడుగురు క్రికెట్ బెట్టింగ్ రాయళ్ళను అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్బంగా 7 మంది క్రికెట్ బెట్టింగ్ రాయళె్ళైన జగన్, శివ, ఒన్నూర్, మహేష్. భార్గవ, రవి చంద్ర, హనీష్‌రెడ్డి అనే నిందితులను విలేకరుల ముందు ప్రదిర్శంచారు. అనంతరం ఎస్‌ఐ మాట్లాడుతూ రాబడిన సమాచాం మేరకు క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న ప్రదేశంలో దాడులు నిర్వహించి ఏడుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి రూ.60,000ల నగదును స్వాధీన పరుచుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
గోరంట్ల పట్టణంలోని పంచాయితీ బస్టాండ్ వద్ద నూతనంగా పునఃప్రారంబించిన ఆర్టీసి బస్టాండ్‌లోకి వెళ్తుండగా మలుపు వద్ద విద్యుత్ స్తంబాన్ని హిందూపురం నుండి కదిరికి వెళ్తూ ఢీ కొంది. దీంతో విద్యుత్ స్తంబం సగభాగానికి విరిగి బస్సు మీద పడటంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేసి బస్సును పక్కకు తిప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే విద్యుత్ బస్సుకు దిగకపోవడంతో వెైర్లు కూడా తెగకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

ప్రచార వాహనంపై నుంచి పడిన గుంతకల్ ఎమ్మెల్యే
తీవ్రగాయాలు.. ప్రాణాపాయం లేదన్న వైద్యులు
ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి గురువారం అనంతపురం జిల్లా తాడిపవూతిలో నిర్వహించిన రోడ్‌షోలో ప్రమాదం చోటుచేసుకుంది. అనంతపురం డీసీసీ అధ్యక్షుడు, గుంతకల్ ఎమ్మెల్యే మధుసూదన్‌గుప్తా ప్రచార వాహనంపై నుంచి జారిపడి తీవ్ర గాయాలపాలయ్యారు. ఎమ్మెల్యే తలకు, చేతికి బలమైన గాయం తగలడంతో ఆయనను వెంటనే అనంతపురం ప్రభుత్వాస్పవూతికి తరలించారు. ఎమ్మెల్యేకు అత్యవసర విభాగంలో చికిత్స చేసిన వైద్యులు ప్రాణాపాయంలేదని చెప్పారు. అనంతరం ఆయనను మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. ఎమ్మెల్యే వెన్నెముకకు కూడా బలమైన గాయమైనట్లు సమాచారం. రోడ్‌షో జరుగుతున్న సమయంలో వాహనంపై ఎక్కువ మంది ఎక్కడం, రక్షణ గ్రిల్స్ లేకపోవడంతో ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలిసింది.
ఎమ్మెల్యేను పరామర్శించిన సీఎం
ప్రచార వాహనంపై నుంచి జారిపడి తీవ్ర గాయాలతో అనంతపురం ప్రభుత్వాస్పవూతిలో చికిత్స పొందుతున్న గుంతకల్ ఎమ్మెల్యే మధుసూదన్‌గుప్తాను సీఎం కిరణ్‌కుమాడ్డి పరామర్శించారు. రోడ్‌షోను మధ్యలో ఆపేసి స్థానిక నేతలతో ఆయన ఆస్పవూతికి చేరుకున్నారు. వైద్యులను అడిగి ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యేను బెంగళూరుకు తరలించారు.

రాష్ట్రంలో భానుడు ఉగ్రరూపం దాల్చాడు. రాష్ట్రం నిప్పుల కొలిమిగా మారింది. ప్రచండబానుడిదాటికి ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడదెబ్బతో 10మంది మృతిచెందారు. ఉదయం ఏడు గంటలనుంచే వేసవి ప్రతాపం చూపుతోంది. ఇళ్లలో విద్యుత్ వాడకం కూడా భారీగా పెరుగుతోంది. పలు జిల్లాల్లో విద్యుత్ కోతలు కూడా మళ్లీ మొదలయ్యాయి. బుధవారం హైదరాబాద్‌లోనూ అనధికారికంగా 3 గంటల విద్యుత్ కోత విధించారు. రాష్టవ్య్రాప్తంగా బుధవారం ఉష్ణోగ్రతలు తీవ్రరూపం దాల్చాయి. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు. ఈ సమయంలో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటాయి.
తెలంగాణతోపాటు రాయలసీమ జిల్లాల్లోనూ 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో సాధారణం కంటే 3 డిగ్రీలు, కోస్తోంధ్ర, రాయలసీమలో 1 నుంచి 3 డిగ్రీలు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదువుతన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం రెంటచింతలలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వ్యవసా య రంగానికి ప్రాణధారమైన నైరుతి రుతుపవనాలు జూన్ 1 కల్లా కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ విభాగం ప్రకటించిన విషయం తెలిసిందే. రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకేవరకు ఇదే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంటుందని అధికారులు చెబుతున్నారు. ఈసారి సాధారణ తేదీ కన్నా కొంత ఆలస్యంగా దక్షిణ అండమాన్ సముద్రంలో రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు.
ఉరవకొండరూరల్ మండలపరిధిలోని పెన్నహోబిళం ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఉచిత పశుగ్రాస పంపిణీ కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ దుర్గాదాస్ ప్రారం భించారు. అనంతరం ఆయన పశుగ్రాస కేంద్రాన్ని పరిశీలించారు. స్థానిక రెైతులతో పలు అంశాలపెై చర్చించారు. ఒక పశువుకు ఐదు కేజీల గడ్డి మాత్రమే తిస్తున్నారని ఇది ఎంత మాత్రమూ సరిపోదని మరికొంత పెంచాలని రెైతులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళారు. ఈ విష యమై సాధ్యా,సాధ్యాలను పరిశీలించి తగు చర్య లు తీసుకుంటామని రెైతులకు హామి ఇ చ్చారు. 75 శాతం సబ్సిడీతో టన్ను రూ.2000 వేల చొప్పున పశుగ్రాసాన్ని రెైతులకు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కేంద్రం వద్ద పూర్తి స్థాయిలో నీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఆలయ ఇఓ ఆనంద్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెడి ముకుందప్ప, డిడి జయకుమార్, ఏడిలు సుబ్బరాయుడు, దేవరాజు, శ్రీనివాస గుప్త, పశువెై ద్యులు రమేష్, కృష్ణ ప్రసాద్, దిలీప్ పాల్గొన్నారు.
ఇంట్లో నిద్రిస్తున్న నలుగురిపెై ఇంటికి గడియపెట్టి, గవాక్షం నుంచి పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన కేసులో ముద్దాయి మంజునాథ్‌కు ఉరి శిక్ష విధిస్తూ మంగళవారం అదనపు జిల్లా జడ్జి కె.వి.విజయకుమార్ తీర్పు చెప్పారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రఘురామిరెడ్డి కథనం మేరకు సంఘటన పూర్వాపరాలిలా ఉన్నాయి. బుక్కరాయసముద్రం మండలం పొడరాళ్ల గ్రామంలో ఇంట్లో నిద్రిస్తున్న నలుగురిపెై ఈడిగ మంజునాథ్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. పొడరాళ్ల గ్రామానికి చెందిన ఎరుకల సుబ్బలక్ష్మీకి 11ఏళ్ల క్రితం భర్త చనిపోయాడు. సదరు సుబ్బలక్ష్మీతో అదే గ్రామానికి చెందిన ఈడిగ మంజునాథ్‌కు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో మంజునాథ్ ఆమెను బెంగళూరుకు తీసుకెళ్లి మూడు నెలలపాటు అక్కడే ఉన్నారు. తర్వాత ఆమె బంధువులు బెంగళూరు నుంచి ఆమెను తిరిగి పొడరాళ్లకు పిలుచుకువచ్చారు.
ఆమె వచ్చిన కొద్ది రోజులకు ఆమె మామ చౌడప్ప వృద్ధాప్యంతో మరణించాడు. చౌడప్ప పేరు మీద ఉన్న ఎకరం భూమి సుబ్బలక్ష్మీకి సంక్రమించింది. సుమారు రూ.6లక్షలు విలువ చేసే భూమి ఆమెకు దక్కడంతో మంజునాథ్ ఆమెను భూమి అమ్మి డబ్బులు ఇవ్వాలని గొడవపడేవాడు. ఈ విషయమై సుబ్బలక్ష్మీ బంధువులు మంజునాథ్‌ను దండించారు. సుబ్బలక్ష్మీ భూమి అమ్మకుండా డబ్బులు ఇవ్వకపోవడంతో మంజునాథ్ ఆమెపెై కక్ష పెంచుకున్నాడు. 2011 మార్చి 11వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో సుబ్బలక్ష్మీ ఇంట్లో ఆమె, కుమారుడు శ్రీకాంత్, ఆమె తల్లిదండ్రులు కొండమ్మ, నాగముని, 9ఏళ్ల వయస్సున్న ఆమె అన్న కుమార్తె అపర్ణలు నిద్రించారు. వారిపెై కక్ష కట్టిన మంజునాథ్ తొలుత ఇంటికి గడియపెట్టి, గవాక్షంలో నుంచి పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
లోపల నిద్రిస్తున్న ఐదు మందిలో నాగముని గట్టిగా అరవగా, అతని కుమారుడు ఎర్నాగప్ప, అతని భార్య ఇంటి వద్దకెళ్లి మంటల్లో కాలిపోతున్న వారిపెై నీళ్లు చల్లి బయటకు తీసుకొచ్చారు. 108 వాహనంలో అనంతపురం ఆసుపత్రికి తరలించగా, మరుసటి రోజు ముగ్గురూ మరణించారు. 13 రోజుల అనంతరం నాగముని కూడా చనిపోయాడు. ఈ విషయంపెై బుక్కరాయసముద్రం పోలీసులు కేసు నమోదు చేసి మంజునాథ్‌కు వ్యతిరేకంగా కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. 29 మంది సాక్షులను విచారించిన కోర్టు ముద్దాయి నేరం చేసినట్లు రుజువు కావడంతో అతనికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
అనంతపురం రూరల్ మండల పరిధిలో గల సోమలదొడ్డి గ్రామం వద్ద వున్న అభయాంజనేయస్వామి దేవస్థానం నందు మంగళవారం హనుమాన్ జయంతి ఉత్సవాలు అత్యంత వెైభవంగా జరిగాయి. అభయాంజనేయస్వామి దేవస్థానం వ్యవస్థాపకులు బి.ప్రమోద్‌కుమార్ ఆధ్వర్యంలో 14, 15 తేదిలలో రెండు రోజులు పాటు హనుమాన్ జయంతి ఉత్సవాలను వెైభవంగా సంప్రదాయబద్దంగా నిర్వహించారు. ప్రముఖ వేదపండితులు బెల్డోన వేణుగోపాల్‌శాస్ర్తి బృందం ప్రతినిధుల ఆధ్వర్యంలో నిర్వహించిన వేద మంత్రోశ్చరణల మధ్య మహా గణపతి పూజ, ప్రత్యేకంగా ఆలంకరించిన అభయాంజనేయస్వామికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం సుందరకాండ హోమం, పవమాన హోమం, ఏకవారరుద్రాభిషేకం, పూర్ణాహుతి తదితర పూజ కార్య్ర మాలతో పాటు వివిధ రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు.
హనుమాన్ జయంతి శుభసందర్భంను పురష్కరించుకొని ఆడపడుచులకు వడిబియ్యం కార్యక్రమంను నిర్వహించారు. నారాయణ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం ఆంజనేయస్వామి ఉత్సవ విగ్రహంను నగర పురవీధులలో ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్‌పి బి.సత్యనారాయణ దంపతులు, దివ్యశ్రీ నర్సింగ్‌హోమ్ అధినేత డాక్టర్ బి.రామ్మోహన్, ప్రముఖ పారిశ్రామిక వేత్త బి.శేషాంజినేయులు, రవాణా శాఖాధికారి బి.వెంకటేశ్వర్లు, శ్రీరంగ మెడికల్ ఏజెన్సీ అధినేత సుంకు వేణుగోపాల్, ఆలయకమిటి ప్రతినిధులు వెై.సత్యనారాయణ, పి. సత్యనారాయణ, ఓం శ్రీ సద్గురు వృద్దాశ్రమం వ్యవస్థాపకురాలు చల్లా గీతా భవానీ, సాయి సేవా సమితి ప్రధాన కార్యదర్శి కెవిఎస్.చలపతిరెడ్డి తదితరులతో పాటు వివిధ స్థాయిలలో వున్న అధికార, అనాధికార ప్రముఖులు, వివిధ ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.