AP భవన్

ప్రధాని దగ్గర పెద్దన్నలు పేద అరుపులు – సాంకేతి విషయాలు తెలియవు ప్రధాని సమాధానం

pm-all
రాష్ర్ట నాయకులు అఖిల పక్షంగా వెళ్ళి కేంద్రం మెడలు వంచి బాబ్లీపై రాష్ర్టానికి జరుగుతున్న అన్యాయన్ని ఆపుతారని అనుకున్న రాష్ర్ట ప్రజలకు మరోసారి అవమానం ఎదురైంది.. అఖిల పక్షంగా వెళ్ళిన రాష్ర్ట పెద్దన్నలు ప్రధాని ముందు పేద అరుపులు అరవడానికే సరిపోయింది.. అయితే పేద అరుపులు విన్న ప్రధాని చాలా రిలాక్స్‌గా నాకు సాంకేతిక సమస్యలు తెలియవు తెలుసుకుంటానని తెలపడం అత్యంత హాస్యా స్పదం.  రెండు రాష్ర్టాల మధ్య ఇంత పెద్ద ఎత్తున జల వివాదం తలెత్తి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ర్ట ప్రదాన ప్రతి పక్ష నేత మహారాష్ర్ట అరెస్టు, లాఠీ చార్జి జరిగిన తరువాత కూడా ఇంకా ప్రధాని సాంకేతిక సమస్యలు తెలియవని కుంటి సాకులతో సమాధానం ఇవ్వడం ఎంతో హాస్యస్పాదం.  దీన్ని బట్టి కేంద్రం ఆంధ్ర ప్రదేశ్‌పై ప్రభుత్వానికి ఎంత చిత్తశుధ్ది వుందనేది ఇట్టే అర్థం మవుతుంది.. అయితే మన పెద్దన్నలు ఈ విషయాన్ని ఎక్కడ కనపడకుండా మీడియా ముందు చంకలు గుద్దుకున్నారు.  వారి మాటల్లో..   “ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ బాబ్లీ సమస్యను సావధానంగా విన్నారు. సమస్య పరిష్కారానికి ఆయన చిత్తశుద్ధితో కృషి చేస్తారనే విశ్వాసం నాకుంది” – ముఖ్యమంత్రి రోశయ్య
బాబ్లీపై కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. ప్రధాని నిర్దిష్టమైన హామీ ఇవ్వలేదు. కార్యాచరణ ప్రకటించలేదు. – చంద్రబాబు, తెలుగుదేశం
బాబ్లీ సమస్యను ప్రధాని సీరియస్‌గా తీసుకున్నారు. ఆయనతో సమావేశం సంతృప్తికరంగా జరిగింది. – చిరంజీవి, ప్రజారాజ్యం
బాబ్లీని రాజకీయంగానే పరిష్కరించాలని ప్రధానిని కోరాం. ప్రధాని స్పందించిన తీరు అసంతృప్తి కలిగించింది. – నారాయణ, సీపీఐ
కృష్ణా, గోదావరి జలాల వినియోగంపై చట్టబద్ధ సంస్థ ఏర్పాటు చేయాలని కోరాం. దీనిపై ప్రధాని సానుకూలంగా స్పందించారు. – వినోద్ కుమార్, టీఆర్ఎస్
ప్రధానికి సమస్య తీవ్రత అర్థమైంది. సమాఖ్య వ్యవస్థలో ఏ ప్రధానీ ఒక్క రోజులో సమస్యను పరిష్కరించలేరు. – జయప్రకాశ్ నారాయణ్, లోక్‌సత్తా
బాబ్లీ ప్రాజెక్టుపై కేంద్రం ముందు అఖిలపక్షం ఒకే మాట వినిపించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ అమర్చిన బాబ్లీ గేట్లను బద్దలు కొట్టాలని కోరింది. మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్టులు అడ్డుకోవాలని మొరపెట్టుకుంది. దిగువ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రధాని మన్మోహన్ దృష్టికి తెచ్చింది.
సమస్య పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని, వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని విన్నవించింది. బాబ్లీపై ముఖ్యమంత్రి రోశయ్య నేతృత్వంలో అన్ని రాజకీయ పార్టీల నేతలు సోమవారం ప్రధాని మన్మోహన్‌ను కలిశారు. గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ, 13 ఇతర ప్రాజెక్టులను నిలిపివేయకపోతే… ఉత్తర తెలంగాణలో లక్షలాది ఎకరాలు ఎడారిగా మారతాయని తెలిపారు.
మహారాష్ట్ర అక్రమాలను వివరిస్తూ 14 పేజీల వినతి పత్రాన్ని ప్రధానికి సమర్పించారు. “సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టుకు గేట్లు అమర్చింది. ఎలాంటిఅనుమతులు లేకుండానే గోదావరి 13 ఇతర ప్రాజెక్టులు నిర్మిస్తోంది.
ఇలాంటి అక్రమాలు అడ్డుకోవాలన్నా, భవిష్యత్తులో నీటి యుద్ధాలు జరగకుండా ఉండాలన్నా ఒక బలమైన రాజ్యాంగబద్ధమైన నియంత్రణ సంస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాలి” అని వినతిపత్రంలో కోరారు. కృష్ణా, గోదావరి నదులకు అత్యంత దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ జల ప్రయోజనాలను కాపాడేందుకు వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని ప్రధానిని కోరారు.
ముఖ్యమంత్రితోపాటు తొమ్మిది పార్టీల నేతలు మహారాష్ట్ర వైఖరిని ముక్తకంఠంతో ఖండించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ రాజ్యాంగానికి అతీతమైనట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ పరిస్థితుల్లో తామేమీ చేయలేమంటూ కేంద్ర జలవనరుల మంత్రి పవన్ కుమార్ బన్సల్ వ్యాఖ్యానించడం సరి కాదని రోశయ్య ప్రధానికి ఫిర్యాదు చేశారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి నిల్వ పరిధిలోనే బాబ్లీ ప్రాజెక్టు నిర్మిస్తున్న విషయాన్ని నేతలు ప్రధాని దృష్టికి తెచ్చారు. అయితే… ప్రధానమంత్రి నుంచి ఈ విషయంలో నిర్దిష్టమైన హామీ ఏమీ లభించలేదు. ఈ విషయంలో సాంకేతికాంశాలపై కేంద్ర జల సంఘం, జల మంత్రిత్వ శాఖ అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేస్తానన్నారు.
“సమాఖ్య వ్యవస్థలో చర్చల ద్వారా పరిష్కారం సాధ్యమే. నన్ను ఆలోచించుకోనివ్వండి” అని కోరారు. ప్రధాని హామీ పట్ల ముఖ్యమంత్రితోపాటు మరికొందరు ప్రతిపక్ష నేతలు విశ్వాసం ప్రకటించారు. అయితే… సమస్య పరిష్కారానికి నిర్ణీత కాలపరిమితిని చెప్పకపోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబుతీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇలాంటి హామీలు ఇచ్చి నెరవేర్చలేదని ఆయన అన్నారు.
ప్రధాని నిర్దిష్టమైన హామీ ఇవ్వనప్పటికీ ఆయన స మస్యను సానుకూలంగా విన్నారని, పరిష్కారం కోసం వేచి చూడడం మంచిదని ఇతర పార్టీ నేతలు చెప్పారు. ప్రధాని నివాసంలో సుమారు 45 నిమిషాలపాటు ఈ సమావేశం జరిగింది. ప్రధానితో భేటీ తర్వాత నేతలు విలేఖరులతో మాట్లాడారు. తా ము చెప్పి విషయాలు ప్రధాని సావధానంగా విన్నారని దాదా పు అందరు నేతలు చెప్పారు.

బాబ్లీ నిర్మాణం అపాలని పార్లమెంట్‌ ఆవరణలో టీడీపీ ధర్నా

nirasana

బాబ్లీ నిర్మాణాన్ని ఆపాలంటూ మహా రాష్టక్రు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు పార్లమెంటు ఆవర ణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. మహా రాష్ట్ర డౌన్‌డౌన్‌, పీఎమ్‌ జోక్యం చేసుకోవాలి, రోకో.. రోకో..బాబ్లీ రోకో.. అంటూ నినదిం చారు. పార్లమెంటుల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమైన నేపథ్యంలో తెలుగుదేశం పార్ల మెంటరీ నాయకుడు నామా నాగేశ్వ రరావు నాయకత్వంలో దేశం నేతలు ప్లకార్డులతో గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.
ధర్నాలో మాజీ పార్లమెంటు సభ్యులు ఎర్రం నాయు డుతో సహా ఎం.పి.లు సుధారాణి, సుజనాచౌదరి, శివప్రసాద్‌, నారాయ ణరావు, వేణుగోపాలరెడ్డి, నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్యే దయాకరరావు లు ఉదయం 10.30 గంటల ప్రాంతం లో కొంత సేపు ధర్నా చేసిన అనంత రం లోకసభ స్పీకర్‌ శ్రీమతి మీరాకు మార్‌ వద్దకు వెళ్ళి మహారాష్ట్ర పోలీసు లు తమ పట్ల అనుచితంగా ప్రవర్తిం చారని ఫిర్యాదు చేశారు. నామా నాగే శ్వరరావు తన వీపుపై మహారాష్ట్ర పోలీసులు కొట్టిన దెబ్బలను, వాటి తాలూకు ఫొటోలను చూపించారు. తాము పార్లమెంటు సభ్యులమని చెప్పినా పోలీసులు వినిపించుకో కుండా లాఠీలు ఝులిపించారని ఫి ర్యాదు చేశారు. స్పీకర్‌ వారి ఫిర్యా దును హక్కుల ఉల్లంఘన విభాగాని కి పంపించారని తెలిసింది.
బాబును కలిసిన దేవెగౌడ, తంబిదొరై..
కాగా దేశం అధ్యక్షుడు ఉదయం పార్లమెంటులోని దేశం పార్లమెంటరీ సభ్యుల కార్యాలయంలో కొంత సేపు గడిపారు. ఆ సమయంలో మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ, తమిళనా డుకు చెందిన ఎం.పి.తంబిదొరై ఆయనను కలిసారు. ఈ సందర్భం గా బాబు, మహారాష్ట్ర ప్రభుత్వం అక్ర మంగా నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టు గు రించి, సుప్రీకోర్టు ఆదేశాలిచ్చినా బేఖాతరు చేసిన విష యాన్ని వివరించారు. ఇటీవల తమ బృందం బాబ్లీ సంద ర్శనకై వెళ్తే మహారాష్ట్ర పోలీసులు తమపై లాఠీలు ఝలి పించిన వైనాన్ని వారికి వివరించారు. అంతరాష్ట్ర జల వివా దాల గురించి ఒప్పందాలున్నా, ఎగువనున్న రాష్ట్రాలు వాటి ని ఉల్లంఘిస్తున్నాయని, దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని, ఇందుకు అన్ని ప్రతిపక్ష పార్టీలు చొరవ తీసు కోవాలని కోరారు.
శరద్‌యాదవ్‌, ప్రకాశ్‌ కారత్‌ను కలిసిన బాబు..
జనతాదల్‌(యు) అధ్యక్షుడు శరద్‌ యాదవ్‌ను, సీపీఐ (ఎం) కార్యదర్శి ప్రకాశ్‌ కారత్‌ను చంద్రబాబు వేరు వేరు గా కలుసుకున్నారు. వారికి మహారాష్ట్ర అక్రమంగా కడు తున్న బాబ్లీ, ఇతర ప్రాజెక్టుల గురించి వివరించారు. బాబ్లీ సందర్శనకు వెళ్లిన సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును వివరించారు. బాబ్లీ, తదితర అక్రమ ప్రాజెక్టుల విషయంలో సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరించి మహారాష్ట్ర చేస్తున్న ఆగడంతో తెలంగాణ ప్రాం తం ఎడారిగా మారనున్నదని, తెలుగుదేశం పార్టీ న్యాయం లభించేవరకు పోరాటం ఆపదని, అందుకు జాతీ య స్థాయిలో ప్రతిపక్షాల మద్దతు కావాలని కోరారు.
బన్సల్‌ ఆ పదవిలో ఎందుకు?
మహారాష్ట్ర మితిమీరిన ఆగడాలను నియంత్రించలేనపుడు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి పి.కె.బన్సల్‌కు ఆ పదవి లో కొనసాగేందుకు అనర్హుడని సీపీఐ కార్యదర్శి నారాయ ణ విమర్శించారు. ‘మంత్రిపదవి ఇచ్చింది ఆయనకు గోళ్లు గిల్లుకోవడానికా?’ అంటూ ఎద్దేవా చేశారు. అఖిలపక్షం సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ విచ్చేసిన నారాయణ ఏపీ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు.

బెంగాల్‌లో రైలు ప్రమాదం – 67 మంది మృతి – 150 మందికి పైగా గాయాలు

train pramadam
పశ్చిమ బెంగాల్‌లో జార్ఖండ్ రాష్ట్ర సరిహద్దుకు దగ్గర్లో ఉన్న సైంధియా రైల్వే స్టేషన్ వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 67 మందికి పైగా చనిపోగా, మరో 150 మంది దాకా గాయపడ్డారు. బీర్భమ్ జిల్లా సైంధియా రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న వనాంచల్ ఎక్స్‌ప్రెస్‌ను వేగంగా వచ్చిన ఉత్తరబంగ ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ‘మానవ తప్పిదం’ ఈ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్న వర్గాలు ప్రాథమికంగా అభిప్రాయ పడుతున్నాయి. స్టేషన్ సమీపించినప్పటికీ ఉత్తరబంగ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ వేగం తగ్గించలేదని, అదే వేగంతో నాలుగో ప్లాట్‌ఫామ్‌నుంచి బయల్దేరడానికి సిద్ధంగా ఉన్న వనాంచల్ ఎక్స్‌ప్రెస్‌ను వెనకవైపునుంచి వేగంగా ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. స్టేషన్ సమీపంలోని కీలకమైన సిగ్నల్‌ను ఉత్తర బంగ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ గమనించలేదని తెలుస్తోంది. రైలును ఆపాలంటూ తాము అరిచినప్పటికీ లాభం లేకపోయిందని, డ్రైవర్ చాలా వేగంగా వస్తుండడంతో హ్యాండ్ బ్రేక్ వేయడానికి కూడా సమయం లేకపోయిందని వారు చెప్పారు. మృతి చెందిన వారిలో రెండు రైళ్ల డ్రైవర్లు, వనాంచల్ ఎక్స్‌ప్రెస్ గార్డు కూడా ఉన్నారు.
ఉత్తరబంగ ఎక్స్‌ప్రెస్ ఎంత తీవ్రంగా ఢీకొట్టిందంటే రెండు అన్ రిజర్వ్‌డ్ బోగీలతో ససా వనాంచల్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన మూడు బోగీలు తునాతునకలై పోగా, ఉత్తరబంగ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన రెండు బోగీలు పైకెగిరి పాదచారులకోసం ఏర్పాటు చేసిన బ్రిడ్జిపైన పడ్డాయి. ఒక బోగీలో కొంతభాగమైతే విడిపోయి బ్రిడ్జిని ఢీకొట్టిన తర్వాత రైలు పట్టాలకు పక్కనే ఉన్న రోడ్డుపై పడిపోయింది. సహాయ కార్యక్రమాల్లో పాలు పంచుకునేందుకు సైన్యాన్ని, బిఎస్‌ఎఫ్ జవాన్లను రంగంలోకి దింపినట్లు చెప్పిన రైల్వే అడిషనల్ డిజిపిడిటిపి మిత్రా చెప్తూ, మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని అన్నారు. గ్యాస్ కట్టర్లు ఉపయోగించి బోగీల్లో చిక్కుకుపోయిన 32 మృత దేహాలను వెలికి తీసారు. దగ్గర్లో ఉన్న గ్రామాల ప్రజలు ముందుగా ప్రయాణికులను కాపాడడానికి ప్రయత్నించారు. ప్రమాదం జరిగినప్పుడు రెండు రైళ్లలోని చాలామంది ప్రయాణికులు గాఢనిద్రలో ఉన్నారు. సురి జిల్లా ఆస్పత్రి, సైంధియా ఆస్పత్రుల్లో చేర్చిన క్షతగాత్రుల్లో 14 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, బుర్ద్వాన్ మెడికల్ కాలేజి ఆస్పత్రినుంచి 150 బాటిళ్ల రక్తాన్ని తెప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్థానికులు సైతం పెద్ద సంఖ్యలో రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు.
ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన మమత
కాగా, ప్రమాద స్థలాన్ని సందర్శించిన రైల్వే మంత్రి మమతా బెనర్జీ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ప్రమాదం వెనుక కుట్ర ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తం చేసారు. ‘మా మనస్సుల్లో కొన్ని అనుమానాలున్నాయి. సమాచారం కోసం అనే్వషిస్తున్నాం, ముందు ప్రమాదం వివరాలు తెలియనివ్వండి’ అని ఆమె అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో రెండు నెలల్లో రెండు ఘోరప్రమాదాలు జరగడం తమకు ఎంతో బాధకలిగిస్తోందని ఆమె అన్నారు. మృతుల కుటుంబాలకు తలా 5 లక్షలు, గాయపడిన వారికి 25 వేల రూపాయల ఎక్స్‌గ్రేషియాను ఆమె ప్రకటించారు. మమత వెంట స్థానిక ఎంపి శతాబ్ది రాయ్ కూడా ఉన్నారు. కాగా, తూర్పు రైల్వే జనరల్ మేనేజర్ విజయ్ నారాయణ్ త్రిపాఠీ, రైల్వే సేఫ్టీ చీఫ్ కమిషనర్ ఆర్‌పి యాదవ్, ఇతర ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణాలపై విచారణ జరుపుతున్నారు. కాగా, ప్రయాణికులకు సంబంధించి తాజా సమాచారాన్ని తెలియజేయడానికి హౌరా, సీల్డా రైల్వే స్టేషన్లలో రెండు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసారు. ప్రమాదం కారణంగా హౌరా వెళ్లాల్సిన కాంచన్‌జంగ ఎక్స్‌ప్రెస్, సీల్డా వెళ్లే డార్జిలింగ్ మెయిల్ సహా కొన్ని రైళ్లను దారి మళ్లించగా, మరి కొన్ని రైళ్లను రద్దు చేసారు.

యువ ఎమ్మెల్యేలకు రాహుల్ పిలుపు

rahul
రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ యువ ఎమ్మెల్యేలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. వారిని ఢిల్లీ రావలసిందిగా సూచించినట్టు తెలిసింది. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకోగా, మరో పది మంది సోమవారం బయలుదేరి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. పార్టీ సంస్థాగత ఎన్నికలు, నిర్మాణంపై చర్చించేందుకే వీరిని పిలిపించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
35 ఏళ్ల లోపు యువ ఎమ్మెల్యేలతో దఫదఫాలుగా రాహుల్ సమావేశమవుతున్నారు. వీరందరికీ యువజన కాంగ్రెస్ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో యువ నేతలను రాహుల్ కలవడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. కాగా, యువజన కాంగ్రెస్ ప్రస్తుత అధ్యక్షుడు టీజేవీ సుధాకర్‌బాబును మారుస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆయన స్థానంలో గుంటూరు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని నియమించనున్నట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి.

తెదేపా నేతల రిమాండుకు నిరసనగా అట్టుడికిన ఆంధ్ర

18.07.03
బాబ్లీపై అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాన్ని పరిశీలించేందుకు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఇతర ఎమ్మెల్యేలను అరెస్టు చేసి, జైలుకు పంపించడంపై రాష్ట్రం భగ్గుమంది. టీడీపీ, రైతుసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు భారీ ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, సీఎం రోశయ్య దిష్టిబొమ్మలు దగ్థం చేశారు. వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలుగుజాతి పరువును కాంగ్రెస్‌ మరోసారి మంటకలిపిం దని దుయ్యబట్టారు. వరంగల్‌లో కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్‌రెడ్డి, వేం నరేందర్‌ రెడ్డి ఆధ్వర్యాన రాస్తారోకో నిర్వహించారు.

18.07.
గుంటూరులో ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి ఆధ్వర్యా న రైల్‌రోకో నిర్వహించారు. సచివాలయం ముట్టడికి నగర పార్టీ సీనియర్‌ నేత, బల్దియా ఫ్లోర్‌ లీడర్‌ సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యాన కార్యకర్తలు ప్రయత్నించారు. మంత్రి పొన్నాల లక్ష్మయ్య నివాసం వద్ద ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు శ్రీశైలం ఆధ్వర్యాన 100 మంది కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.

Secretariatefire
ఇదిలాఉండగా, సోమవారం రాష్ట్ర బందుకు టీడీపీ పిలుపునిచ్చింది. ఈ మేరకు శనివారం సాయంత్రం బాబు సీనియర్లతో టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు నేతృత్వంలో సీనియర్లు భేటీ అయి వ్యూహరచన చేశారు. బాబును జైలుకు పంపిస్తే కార్యాచరణ ఏవిధంగా ఉండాలన్న అంశంపై చర్చించారు. తర్వాత యనమల బాబుతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా నేతలతో యనమల మాట్లాడి, కార్యాచర ణపై సూచనలిచ్చారు. ఎంపీ మైసూరారెడ్డి, మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు, నాగం, చంద్రశేఖర్‌, చిక్కాల రామచంద్రరావు, విజయరామారావు, వర్ల రామయ్య, టిడి జనార్దన్‌రావు తదితరులు సమావేశమయ్యారు.
సచివాలయం వద్ద ఆందోళన
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ నాయకులు శనివారం సచివాలయాన్ని మట్టిడించారు.బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణ పనులు వెంటనే నిలిపివేసే విధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.ఓదార్పుయాత్రలు కాదు బాబ్లీయాత్ర చేపట్టాలి, సీపీఎం డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు.బాబ్లీప్రాజెక్టు నిర్మాణపనులు ఆపలేని చేతకాని ప్రభుత్వం వెంటనే గద్దెదిగాలని డిమాండ్‌ చేస్తూ మధాహ్నం మూడన్నర గంటలకు సచివాలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు.పోలీసులు వెంటనే రంగప్రవేశంచేసి వారి అరెస్టు చేసి సమీపంలోని పోలీస్టేషన్‌కు తరలించారు.ఈ సందర్భంగా పోలీసులు సచివాలయ ప్రాంతంలో గట్టి భధ్రతా చర్యలు చేపట్టారు. సచివాలయానికి వచ్చే మీడి యా ప్రతినిధుల గుర్తింపు కార్డును క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే వారిని లోపలకు అనుమతించారు.

td
ఆందోళనలను ఉధృతం చేస్తాం : కడియం
గోదావరి నదిపై బాబ్లీతో సహా నిర్మిస్తున్న 12 అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలను వెంటనే ఆపకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కడియం శ్రీహరి హెచ్చరించారు. నేతల అరెస్టును నిరసిస్తూ శనివారం రాష్ర్ట వ్యాప్తంగా శనివారం రాస్తారోకో లు ధర్నాలు జరిగాయి.
కరీంనగర్‌లో రెండవ రోజు వెల్లువెత్తిన నిరసనలు
చంద్రబాబునాయుడు అరెస్టును నిరసిస్తూ కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆందోళనలు చేపట్టారు. పలు చోట్ల రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించడంతో ట్రాఫిక్‌తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిల్లా కేంద్రంతో పాటు అనేక చోట్ల మహారాష్ట్ర సిఎం అశోక్‌సింగ్‌ చవాన్‌ దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బాబ్లీని చూపి స్తామని చెప్పి వాళ్ల సరిహద్దుకు చేరగానే అరెస్టు చేసినట్లు ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అరెస్టు అయిన నేతలకు సరైన సౌకర్యాలు సైతం కల్పించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలు కేవలం కాంగ్రెస్‌ నాయకుల అసమర్థత వలన, అవినీతి సామ్రాట్‌ వైఎస్‌. రాజశేఖరరెడ్డి చలవ, ప్రస్తుత ముఖ్యమంత్రి రోశయ్య ఉదాసీనతతోనే రూపుదిద్దుకున్నాయన్నాయన్నారు. ఈ అక్రమ ప్రాజెక్టుల వల్ల తెలంగాణ రైతుల చెందిన భూములు దాదాపు 18లక్షల ఎకరాలకు సాగు నీరు అందే పరిస్థితి లేదని, ఇది రాజస్థాన్‌లోని ఎడారిగా మారే పరిస్థితి ఇంకా ఎంతో దూరంలో లేదన్నారు. ఇది చారిత్రక తప్పిద అవుతుందన్నారు.
భగ్గుమన్న తెలుగు తమ్ముళ్లు

police-attack2512707560_d113e40140_m
బాబు అరెస్టును నిరసిస్తూ శనివారం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. మహారాష్ర్ట ముఖ్యమం త్రి అశోక్‌ చౌహాన్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీల దిష్టిబొమ్మలను టీడీపీ కార్యకర్తలు దగ్ధం చేశారు. కర్నూలులో జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి రాంభూపాల్‌చౌదరి, ధనారెడ్డిల ఆధ్వర్యంలో, కల్లూరులో తెలుగు యువత ఆధ్వర్యంలో, ఆళ్లగడ్డలో ఇరిగెల సోదరులు, నందికొట్కూరులో బిచ్చన్న, ఆత్మకూరు లో బుడ్డా రాజశేఖర్‌రెడ్డిల ఆధ్వర్యంలో, నంద్యాలలో స్థానిక నాయకులు, ఎమ్మిగనూరులో బివి వర్గీయులు, డోన్‌లో కెయి వర్గీయుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఆదోని, పత్తికొండ ప్రాంతాల్లో నూ చంద్రబాబు అరెస్టుకు నిరసనగా భారీ ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి.
దేశం ధర్నా
మహారాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబును మోసపూరితంగా అరెస్టు చేసిందని వెంటనే ఆయనను విడుదల చేసి చంద్రబాబును బాబ్లీ ప్రాజెక్టును సందర్శించేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండు చేస్తూ హిందూపురం పార్లమెంటు సభ్యులు నిమ్మలక్రిష్టప్ప ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో తెలుగు దేశం నాయకులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. స్థానిక చంద్రశేఖర్‌ థియేటర్‌ నుండి బయలుదేరి ర్యాలీగా తహసీల్దార్‌ కార్యాలయం చేరుకున్నారు.

నేడు ఢిల్లీకి రోశయ్య

03
ముఖ్యమంత్రి కె.రోశయ్య ఆదివారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తదితరులతో సమావేశం కానున్నారు. గోదావరిపై అక్రమ ప్రాజెక్టుల నిర్మాణానికి వ్యతిరేకంగా టిడిపి చేపట్టిన బాబ్లీ బస్సుయాత్ర సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయడుతో సహా ఇతర నాయకులను మహరాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి నేతల నిరసన, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, సోంపేట కాల్పుల ఘటన, జగన్‌ వ్యవహారం తదితర అంశాలను పార్టీ అధిష్టానానికి వినిపించనున్నట్లు తెలిసింది. నిజానికి రోశయ్య ఢిల్లీ వెళ్లే షెడ్యూలు లేకపోయినప్పటికీ బాబ్లీ ప్రాజెక్టులపై చంద్రబాబు చేపట్టిన యాత్ర వల్ల రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌పార్టీపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీ వెళుతున్నట్లు తెలిసింది.

గనుల వివాదంపై చేతులెత్తేసిన సర్వే ఆఫ్ ఇండియా – సుప్రీం కోర్టుకు నివేదిక

SupremeCourtIndia
అంతర్ రాష్ట్ర సరిహద్దుల పై ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలు పరస్పర అవగాహనకు వస్తేనే, వాటి మధ్య గనుల వివాదం పరిష్కారం అ వుతుందని, అంతవరకూ తామే చేసేదేమీ లేదని స ర్వే ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఈ ఉభయ రా ష్ట్రాల గనుల వివాదంపై చేతులెత్తేసింది.  ఉభయ రా ష్ట్రాలు సరిహద్దులపై పరస్పరం ఒక అంగీకారానికి వచ్చి, వాటిని స్పష్టంగా నిర్ధారించుకునేలా ఆదేశించాలని సుప్రీంకోర్టును ఈ సంస్థ కోరింది. అంతే కా కుండా గనుల లీజుల సరిహద్దుల నిర్ధారణకు వీలు గా లీజు స్కెచ్‌లను తమకు ఇవ్వాల్సిందని కేంద్ర, రాష్ట్ర సంస్థలను ఆదేశించాలని కూడా అభ్యర్థించిం ది.  ఈ రెండు పనులు పూర్తయితే, తాము గనుల స రిహద్దులను నెలరోజుల్లోనే నిర్ణయిస్తామ ని, లేకపోతే ఏమి చేయలేమని తెలిపింది. సర్వే ఆఫ్ ఇండియా 1975లో నిర్ధారించిన అంతర్ రాష్ట్ర సరిహద్దులకు ఇరు రాష్ట్రాలు అంగీకారం తెలుపనంతవరకు, నిర్ధారిత సమయంలో మైనింగ్ లీజు సరిహ ద్దు వివాదాన్ని పరిష్కరించలేమని స్పష్టం చేసింది.  సరిహద్దులు, మైనింగ్ లీజు ప్రాంతాల ఖరారుకు సర్వే ఆఫ్ ఇండియా పలు సూచనలు చేసింది. ఈ మేరకు ఈ సంస్థ నివేదిక సమర్పించడంతో సుప్రీంకోర్టు అటవీ బెంచ్ తన తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి (ఈ నెల 23కు) వాయిదా వేసింది.  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.హెచ్. కపాడియా, అఫ్తాబ్ ఆరా, కె.ఎస్.రాధాకృష్ణన్‌లతో కూ డిన బెంచ్ ఈ కేసు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. కాగా, నివేదిక ప్రకారం సుప్రీంకో ర్టు ఆదేశాల మేరకు బళ్లారి అటవీ ప్రాంతంలోని ఆ రు ఇనుప ఖనిజ మై నింగ్ లీజుల సరిహద్దులను ని ర్ధారించి, నిర్ణయించేందుకు గత మార్చి నెలలోనే ఓ బృందం ఏర్పాటయింది.
సర్వే ఆఫ్ ఇండియా అదనపు సర్వేయర్ జనరల్ మేజర్. జనరల్ ఎ.కె.పాధా నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో ఈ నిపుణుల బృందం ఏర్పాటయింది. ఈ ఉమ్మడి కమిటీ సమర్పించిన నివేదికలో మంజూరైన లీజు స్కెచ్‌లకూ, లీజు ప్రాంతంలో సరిహద్దు రాళ్లకూ పొంతన లేదని తేలింది. ఈ స్కెచ్‌లలో తప్పుల తడకలున్నాయని కూడా ఈ కమిటీ అభిప్రాయపడింది.

అభివృద్ధే అంశంగా ఉపఎన్నికల్లో ప్రచారం? మంత్రులకు మొయిలీ సూచన

1-1
ఉపఎన్నికల్లో అభివృద్ధి నినాదంతో ప్రచారం నిర్వహించాలని తెలంగాణా మంత్రులకు ఎఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ వీరప్పమొయిలీ సూచించినట్లు తెలిసింది. లేక్‌వ్యూగెస్ట్‌హాస్‌లో మొయిలీని తెలంగాణా మంత్రులందరూ కలిశారు. ప్రచార సరళిపై చర్చించారు. తెలంగాణా అంశాన్ని స్థానిక నేతలు చూసుకుంటారని, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిన బాధ్యత మంత్రులదేనని, దానిని ప్రచారాస్త్రంగా చేసుకోవాలని సూచించినట్లు తెలిసింది.ఉపఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నాలుగైదు స్థానాల్లో అయినా పార్టీ అభ్యర్థులు గెలిచేలా ప్రచారం నిర్వహించాలని అన్నారు. ఈ సందర్భంగా కలిసిన వచ్చిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డికె అరుణ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణా అంశంతో పాటు అభివృద్ధి అంశాన్ని ప్రచారాస్త్రంగా తీసుకెళ్తామని తెలిపారు.

రూపాయికి కొత్త చిహ్నం – మంత్రివర్గ ఆమోదం

16.07
మన రూపాయి ఇక అంతర్జాతీయ స్థాయిలో కొత్త సొబగులు సంతరించుకోనుంది. రూపాయి చిహ్నాన్ని మార్చాలని ఇప్పటి వరకూ మల్లగుల్లాలు పడుతున్న కేంద్ర ప్రభుత్వం ఐఐటి పోస్టు గ్రాడ్యుయేట్‌ విద్యార్థి డి ఉదయకుమార్‌ రూపొందించిన కొత్త నమూనాను ఆమోదిం చింది. ఈ చిహ్నం ఎంపికకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల బృందం ఐదు చిహ్నాలను ఎంపిక చేసి మంత్రివర్గ ఆమోదానికి పంపగా అందులో ఉదరు కుమార్‌ రూపొందించిన చిహ్నానికి ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. ఈ కొత్త చిహ్నంలో దేవనాగరి లిపిలో ‘ర’ అనే అక్షరం, రోమన్‌ అక్షరం కేపిటల్‌ ‘ఆర్‌’ (మధ్య కొమ్ము లేకుండా) ఉంటాయి. ఈ చిహ్నం రూపకల్పన కోసం ఆర్థిక మంత్రిత్వశాఖ రూ.2.5 లక్షల ప్రైజ్‌మనీతో పోటీ నిర్వహించిన విషయం తెలిసిందే. తాను రూపొందించిన డిజైన్‌కు కేంద్ర ప్రభుత్వ ఆమోదముద్ర లభించిందన్న విషయాన్ని తెలుసుకున్న ఉదరుకుమార్‌ హర్షం వ్యక్తం చేశారు. ఆయన గౌహతి ఐఐటిలో డిజైన్‌ విభాగంలో ఫ్యాకల్టీ సభ్యునిగా శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.

మావోయిస్టులను అదుపు చేయడానికి యూనిఫైడ్‌ కమాండ్‌

15.07
మావోయిస్టులను అదుపు చేసేందుకు వీలుగా మేజర్‌ జనరల్‌ స్థాయి రిటైర్డ్‌ సైనికాధికారి సారధ్యంలో ఏకీకృత (యూనిఫైడ్‌) కమాండ్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం నక్సల్‌ ప్రభావిత ఛత్తీస్‌ఘడ్‌, జార్ఖండ్‌, ఒడిషా, బెంగాల్‌ రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు తాము ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నామని బుధవారం ఇక్కడ జరిగిన నక్సల్‌ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో హోం మంత్రి పి చిదంబరం చెప్పారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బీహార్‌, ఛత్తీస్‌ఘడ్‌, ఒడిషా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులతో పాటు జార్ఖండ్‌ ప్రభుత్వం తరపున ఆ రాష్ట్ర గవర్నర్‌, బెంగాల్‌ ప్రభుత్వం తరపున సీనియర్‌ మంత్రి సూర్యకాంత్‌ మిశ్రా హాజరయ్యారు. మావోయిస్టులపై చర్యలకు సంబంధిత రాష్ట్రాలకు అవసరమైన సాయాన్ని పూర్తి స్థాయిలో అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు హోం మంత్రి హామీ ఇచ్చారు. పెద్ద సంఖ్యలో హెలికాప్టర్లు, దళాలను కేటాయించడంతో పాటు అవసరమైన ఆయుధాలను కూడా అందజేస్తామన్నారు. నక్సల్‌ ప్రభావిత జిల్లాల్లో పోలీసు వ్యవస్థను బలోపేతం చేసేందుకు, కొత్తగా 400 పోలీస్‌ స్టేషన్ల ఏర్పాటుకు స్టేషన్‌కు రెండు కోట్ల రూపాయల వంతున అవసరమైన నిధులను 80:20 నిష్పత్తిలో రెండేళ్లపాటు కేంద్రం సమకూరుస్తుందని ఆయన చెప్పారు.
గత ఆర్నెల్ల కాలంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. నక్సల్స్‌పై కార్యకలాపాల కోసం ఇప్పటికే నియమితులైన సిఆర్‌పిఎఫ్‌ అధికారులతో సమన్వయంతో వ్యవహరించేందుకు వీలుగా ఐజిపి స్థాయిలో ఒక ప్రత్యేకాధికారిని నియమించాలని నక్సల్‌ ప్రభావిత రాష్ట్రాలను కోరనున్నట్లు ఆయన చెప్పారు. ఆ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ఆయన మాట్లాడుతూ వివిధ అభివృద్ధి పథకాల అమలుకు సంబంధించి ప్రస్తుతమున్న మార్గదర్శకాలను, నియమనిబంధనలను స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికా సంఘం సభ్య కార్యదర్శి నేతృత్వంలోని ఉన్నతాధికార సంఘం సమీక్షించి సవరిస్తుందన్నారు. షెడ్యూల్డు ప్రాంతాలకు పంచాయతీల విస్తరణ (పిసా) చట్ట నిబంధనలను సత్వరమే అమలు చేయాలని, ముఖ్యంగా అటవీ ఉత్పత్తులకు సంబంధించిన హక్కులపై అధికారాలను గ్రామసభలకు అప్పగిస్తూ ప్రభుత్వ నియంత్రణలోని విభాగాలు, ఇతర సంస్థల జోక్యాన్ని తొలగించాలని ఆయా రాష్ట్రాలకు సూచించినట్లు ఆయన చెప్పారు. నక్సల్‌ ప్రభావిత 35 జిల్లాల్లోని రోడ్ల నిర్మాణాన్ని కూడా మెరుగు పర్చనున్నట్లు, రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ రూ.950 కోట్ల అంచనా వ్యయంతో పలు రోడ్లు, వంతెనల నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. రోడ్ల నిర్మాణం, ప్రాథమిక విద్యాభివృద్ధి, ఆరోగ్య సౌకర్యాలు, తాగునీటి సరఫరా వంటి అంశాల ప్రాతిపదికన నక్సల్‌ ప్రభావిత జిల్లాల్లో అమలు చేసేందుకు ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన అంశాన్ని ప్రణాళికా సంఘం పరిశీలిస్తోందన్నారు.