అనంతపూర్

పెనుకొండలో ఘోర రైలు ప్రమాదం


25 మంది మృతి.. 43 మందికి గాయాలు
గూడ్స్ రైలును ఢీకొన్న హంపి ఎక్స్‌వూపెస్
-సహాయ కార్యక్షికమాల్లో జాప్యం
-ఫలితంగానే పెరిగిన మరణాలు!
-మృతుల కుటుంబాలకు ఐదు లక్షలు
-పరిహారం ప్రకటించినరైల్వే మంత్రి
-డ్రైవరు నిర్లక్ష్యమే కారణం
-రైల్వే శాఖ ప్రాథమిక నిర్ధారణ
-అదనంగా లక్ష పరిహారం ప్రకటించిన కన్నడ సీఎం
-సిగ్నలింగ్ లోపమా? డ్రైవర్ పొరపాటా?
-విచారణకు రైల్వేశాఖ మంత్రి ఆదేశం
అనంతపురం జిల్లా పెనుకొండ రైల్వే స్టేషన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. స్టేషన్‌లో ఆగి ఉన్న గూడ్స్ రైలును బెంగళూరు వెళుతూ అదే ట్రాక్‌పై వచ్చిన హంపి ఎక్స్‌వూపెస్ మంగళవారం తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో ఢీకొనడంతో 25 మంది చనిపోయారు. 43 మంది గాయపడ్డారు. ప్రమాదం కారణంగా నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. వాటిలో ఒకటి దగ్ధమైంది. సహాయ కార్యక్షికమాలు ఆలస్యం కావడంతో మృతుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. 16 మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. వీరిలో ఎక్కువ మంది మహిళలే. చాలా మంది ప్రమాదం కారణంగా చెలరేగిన మంటల్లో కాలిపోయి, పొగల మధ్య ఊపిరాడక, సహాయ కార్యక్షికమాలు ఆలస్యమై నరకయాతన అనుభవిస్తూ చనిపోయినవారే. ప్రమాదంతో బోగీ తలుపులు బిగుసుకుపోవడంతో లోపలివారు బయటికి రాలేక అక్కడే చనిపోయారు. మంటలు ఆర్పేందుకు రెండు గంటల సమయం తీసుకోవడంతో వారిని కాపాడటం సాధ్యం కాలేదు. పట్టాలు తప్పిన బోగీల తలుపులు సైతం తెరుచుకోకపోవడంతో క్షతగావూతులను బయటికి తీసేందుకు తొమ్మిది గంటల పాటు సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. దీంతో గాయపడినవారు ప్రాణాలు అరచేతబట్టుకుని, బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. ఆ తర్వాత గ్యాస్ కట్టర్ల సహాయంతో చువ్వలను కత్తిరించి ఒక్కొక్కరినే బయటికి తీసి, ఆస్పవూతులకు తరలించారు. హంపి ఎక్స్‌వూపెస్ డ్రైవర్ సిగ్నల్‌ను పట్టించుకోకుండా రావడంతోనే ఈ ఘటన జరిగిందని ఒక వాదన వినిపిస్తుండగా.. స్టేషన్‌లో తప్పుడు సిగ్నల్ ఇచ్చి, గూడ్స్ ఉన్న ట్రాక్‌మీదకే హంపి ఎక్స్‌వూపెస్‌ను అనుమతించడం వల్ల ఈ ఘోరం జరిగిందని మరోవాదన వినిపిస్తున్నది.
చనిపోయినవారి కుటుంబాలకు రూ.5 లక్షలను పరిహారంగా ఇస్తామని కేంద్ర రైల్వే మంత్రి ముకుల్ రాయ్ చెప్పారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు. తీవ్రంగా గాయపడినవారికి లక్ష, స్వల్పంగా గాయపడినవారికి 25వేలు చెల్లిస్తామని తెలిపారు. ఘటనపై విచారణ జరిపి, పది రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని రైల్వే భద్రతా కమిషనర్‌ను ఆదేశించినట్లు తెలిపారు. చనిపోయిన, గాయపడిన వారిలో ఎక్కువ మంది సాధారణ కూలీలే. వీరంతా హుబ్లి, హోస్పేట నుంచి బతుకుదెరువు వెతుక్కుంటూ బెంగళూరుకు వస్తున్నారు.
హంపి ఎక్స్‌వూపెస్ రైలింజన్, దానివెనుక ఉన్న మొదటి మూడు బోగీలు ఈ ప్రమాదంలో బాగా దెబ్బతిన్నాయి. మొదటిది గార్డ్/లగేజ్/ప్యాసింజర్ బోగీ. 2వ, 3వ బోగీలు జనరల్ కంపార్టుమెంట్లు. తొలుత చనిపోయింది నలుగురేనని భావించారు. తెల్లవారిన తర్వాత కానీ మృతుల సంఖ్యపై స్పష్టత రాలేదు. బోగీలోంచి ఇంకా పొగ వస్తూనే ఉండటంతో సహాయ సిబ్బంది లోపలికి వెళ్లడం కష్టసాధ్యమైంది. దానికి తోడు లోపల మంటల్లో కాలిపోయినవారు తలుపుల వద్ద గుట్టలుగా పడిఉన్నారు. వీటిని బయటకు తీయడానికే మూడు గంటల సమయం పట్టింది.


భద్రతకే తొలివూపాధాన్యం: ముకుల్‌రాయ్
రైళ్ల భద్రతకు తమ తొలి ప్రాధాన్యం ఉంటుందని ముకుల్ రాయ్ చెప్పారు. ఐరోపా దేశాల్లోని తరహాలో విద్యుదీకరించిన మార్గాల్లో రైలు భద్రతా హెచ్చరిక వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నామని మంత్రి తెలిపారు.
ఘటనా స్థలానికి సీఎం, ఇతర ప్రముఖులు
ప్రమాద స్థలాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సందర్శించారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు ఆయన రైలు ప్రమాదంపై హైదరాబాద్‌లో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణ సహాయ చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారని సీఎం కార్యాలయం విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఈ ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాకు చెందిన మంత్రులు రఘువీరాడ్డి, ఎస్ శైలజానాథ్ హుటాహుటిన పెనుకొండకు బయల్దేరారు. అనంతపురంలోనే ఉన్న ఎంపీ చిరంజీవి పెనుకొండ చేరుకుని, ఆస్పవూతిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అనంతపురం ఎంపీ వెంకటరామిడ్డి, హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, పల్లె రఘునాథ్‌డ్డి, అబ్దుల్ ఘనీ, పార్థసారథి తదితరులు కూడా ఘటనా స్థలానికి వచ్చి, బాధితులను ఓదార్చారు.


ప్రమాద స్థలాన్ని కర్ణాటక సీఎం సదానందగౌడ సందర్శించారు. చనిపోయినవారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.లక్ష, గాయపడినవారికి రూ.25వేలు పరిహారం ఇస్తామన్నారు. పెనుకొండ స్టేషన్‌లో నిలిచిపోయిన ప్రయాణికులను బస్సులు, రైళ్ల ద్వారా బెంగళూరుకు తరలించారు. దెబ్బతిన్న ట్రాక్‌ను పునరుద్ధరించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా మూడు రైళ్లను రద్దు చేశామని, మరో ఐదు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని పేర్కొన్నారు. బెంగళూరు-మైసూర్ ఎక్స్‌వూపెస్, మైసూర్-యశ్వంత్‌పూర్ ఎక్స్‌వూపెస్, హిందూపూర్-గుంతకల్ ప్యాసింజర్ రైళ్లను మంగళవారానికి రద్దు చేశారు. కాచిగూడ-బెంగళూరు ఎక్స్‌వూపెస్, నిజాముద్దీన్-బెంగళూరు రాజధాని ఎక్స్‌వూపెస్, ముంబై(సీఎస్‌టీ)-బెంగళూరు ఉదయన్ ఎక్స్‌వూపెస్, మచిలీపట్నం-యశ్వంత్‌పూర్ ఎక్స్‌వూపెస్, బాగల్‌కోట్-యశ్వంత్‌పూర్ బసవ ఎక్స్‌వూపెస్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
సహాయంలో జాప్యం?
తెల్లవారుజామున ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే శాఖ సిబ్బంది సకాలంలో స్పందించకపోవడంతో మృతుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్న వాదన వినిపిస్తున్నది. మంటల్లో తగలబడుతున్న బోగీని ఆర్పడానికి ఫైరింజన్లు సకాలంలో చేరుకోలేదు. నిజానికి ప్రమాదం జరిగింది స్టేషన్‌లోనే. కనుక మరింత సత్వర సాయం అందించేందుకు ఆస్కారం ఉంది. కానీ ఆచరణలో కనిపించలేదు. మంటలు ఆర్పేందుకు వచ్చిన పెనుకొండలోని ఫైరింజన్‌లో తగినన్ని నీళ్లు లేకపోవడంతో వాటర్ ట్యాంకర్‌లు తెప్పించారు. హిందూపూర్, ధర్మవరం, మడకశిర నుంచి అగ్నిమాపక సిబ్బంది రావటానికి 45 నిమిషాలు పట్టింది. పెనుకొండ ఫైరింజన్ సరిగా పని చేసి ఉంటే కొన్ని ప్రాణాలైనా దక్కి ఉండేవని పలువురు వ్యాఖ్యానించారు. ప్రమాదం జరగగానే ప్రయాణికులందరూ భయకంపితులై బయటపడటానికి ప్రయత్నించడంతో పెద్ద ఎత్తున తొక్కిసలాట చోటు చేసుకోవడం, షార్ట్‌సర్క్యూట్ కారణంగా బోగీలో చీకటి అలముకోవడంకూడా మృతుల సంఖ్య పెరగడానికి కారణమైందని అంటున్నారు. తెల్లవారిన తర్వాతకానీ సహాయ చర్యలు ఊపందుకోలేదు.
అప్పటిదాకా బోగీల్లో చిక్కుకుపోయినవారు నరకయాతన అనుభవించారు. ఇంత ఇబ్బందిలోనూ కొందరు అందుబాటులో ఉన్న సాధనాలతో బోగీలను కత్తిరించి, ప్రయాణికులను కాపాడేందుకు సాహసం చేశారు. పెద్ద ఎత్తున వీఐపీలు పరామర్శల కోసం బారులు తీరడంతో సిబ్బంది సహాయ చర్యలు వదిలి, వీరి రక్షణ ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. ఇది తీవ్ర విమర్శలకు దారితీసింది.
1990 తర్వాత రాష్ట్రంలో జరిగిన ప్రధాన రైలు ప్రమాదాల వివరాలు..
1990 అక్టోబర్ 10 : హైదరాబాద్‌లోని చర్లపల్లి వద్ద రైలు దగ్ధమైన ఘటనలో 40 మంది సజీవ దహనమయ్యారు.
1992 ఏప్రిల్ 7: తెనాలిలో బిట్రగుంట-విజయవాడ పాసింజర్‌కు జరిగిన ప్రమాదంలో 20 మంది చనిపోయారు.
1994 మే 3 : నల్లగొండలో నారాయణాద్రి ఎక్స్‌వూపెస్‌కు జరిగిన ప్రమాదంలో 35 మంది చనిపోయారు.
1999 జూన్ 4 : ఖాజీపేటలో సికింద్రాబాద్-గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు జరిగిన ప్రమాదంలో 12 మంది చనిపోయారు.
2002 డిసెంబర్ 21: రామలింగాయపల్లిలో బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌కు జరిగిన ప్రమాదంలో 20 మంది మరణించారు.
2003 జూలై 02 : గుంటూరు-సికింవూదాబాద్ గోల్కొండ ఎక్స్‌వూపెస్ రైలింజన్ దాని వెనుక ఉన్న రెండు బోగీలు వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓవర్ బ్రిడ్జ్ నుంచి పట్టాలు తప్పి కింద పడటంతో 18 మంది చనిపోయారు.
2005 అక్టోబర్ 29 : వలిగొండ వద్ద వరద నీళ్లలో పట్టాలు కొట్టుకుపోవడంతో రేపప్లూ-సికింవూదాబాద్ డెల్టా ఫాస్ట్‌ప్యాసింజర్‌లో 114 మంది మృతి.
2006 ఆగస్ట్ 18 : సికింవూదాబాద్ రైల్వే స్టేషన్ వద్ద చెన్నై-హైదరాబాద్ ఎక్స్‌వూపెస్‌లోని ఐదు బోగీలు మంటల్లో చిక్కుకున్నాయి. అయితే అదృష్టవశాత్తూ ప్రయాణికులు ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.
బైకుల్లో పెట్రోలే కారణమా?
హంపి ఎక్స్‌వూపెస్ బోగీల్లో మంటలు చెలరేగడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణంగా కనిపిస్తున్నది. ఇంజిన్ వెనుక భాగంలో ఉన్న లగేజ్ కం ప్యాసింజర్ బోగీలో బైకులు రవాణా చేసినట్లు కనిపిస్తున్నది.వాటిలో ఉన్న పెట్రోలు కారణంగానే బోగీ మంటల్లో చిక్కుకుని ఉండొచ్చని పలువురు అభివూపాయపడుతున్నారు. ప్రమాదంలో లోకోమోటివ్‌లోని డీజిల్ ట్యాంకు సురక్షితంగానే ఉంది. కానీ.. దాదాపు రెండు గంటల పాటు నిరంతరాయంగా బోగీ నుంచి మంటలు వెలువడుతూనే ఉన్నాయి. సాధారణంగా రైళ్లలో బైకులు రవాణా చేసేటప్పుడు వాటిలోని పెట్రోల్ మొత్తం తీసేస్తారు. కానీ.. ఈ రైలులో బైకులు పెట్రోలుతోనే రవాణా అవుతున్నట్లు సమాచారం. మృతదేహాలను బయటికి తీసే సమయంలోనే కాలిపోయిన బైక్‌లను కూడా సిబ్బంది బయటకు తీశారు. ఈ విషయం రైల్వే మంత్రికి తెలియకుండా సిబ్బంది జాగ్రత్త పడినట్లు కనిపిస్తున్నది.

హామీ ఇచ్చిన వంద రోజుల్లోనే మరో ఘోర ప్రమాదం


కాపలా లేని క్రాసింగ్‌లు17వేలపైనే
85 శాతం మానవ తప్పిదాలు
నిధుల కొరతే శాపం
ఏలినవారి మాటల గారడీ
ప్రాణాలకు లేని హామీ
దక్షిణ మధ్య రైల్వే చరిత్రలో మరో నెత్తుటి మరక. భద్రతపై కేంద్ర సర్కారు భరోసా ఇచ్చి వంద రోజులు కాకముందే మరో దుర్ఘటన. హంపీ ఎక్స్‌ప్రెస్‌ దుర్ఘటనకు మానవ తప్పిదమే ప్రమాదానికి కారణమని తేలింది. రైల్వే సిగ్నలింగ్‌ వైఫల్యం మరోసారి వెక్కిరించింది. ఏలిన వారి మాటల గారడీ పక్కన బెట్టి… ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ సంఘటన గుర్తు చేస్తోంది. తాతల నాటి రైల్వే ట్రాక్‌ రికార్డు మారుస్తామని ప్రతి మంత్రి చెబుతున్నారు. ఆచరణను బట్టి చూస్తే మాటలు ఒకింత కోతలుగానే అనిపిస్తున్నాయి. వాస్తవానికి రైల్వే భద్రత అంశంపై ఎన్నో ఏళ్ళుగా కేంద్ర ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది.
140 సంవత్సరాల పైబడిన ఘన చరిత్ర తనదని భుజకీర్తులు తగిలించుకున్న భారతీయ రైల్వే ప్రస్థానంలో భద్రతకే భరసా లేదు. నలభై దేశాల జన సంఖ్యతో సరితూగే ప్రయాణికులను ప్రతిరోజూ గమ్యస్థానాలకు చేరుస్తున్నామని సగర్వంగా చాటుకునే భూరి వ్యవస్థలో, అత్యంత కీలకమైన భద్రతే.. అక్షరాల దేవతావస్త్రం. 63వేల కిలోమీటర్ల విస్తృతి, 44 వేల బోగీలు, 7,700 లోకోమోటివ్‌లు, 2.16 లక్షల వ్యాగన్లు, 15 లక్షలకు పైబడిన సిబ్బంది.. వీటన్నింటికీ మించి ఏకీకృత యాజమాన్యం సారథ్యంలో నడిచే వ్యవస్థ ప్రపంచంలోనే మరెక్కడా లేదనేది అక్షర సత్యం.
పెరుగుతున్న మృతులు
ప్రమాదాల సంఖ్య ఒకింత తగ్గిందన్న ఆనందమే కానీ… ప్రమాద మృతుల సంఖ్య ఏయేటికాయేడు పెరుగుతూనే ఉంది. గత దశాబ్ద కాలాన్ని పరిశీలిస్తే ఇది జగమెరిగిన సత్యం. 2001-10 మధ్య మొత్తం 2,431 ప్రమాదాలు జరిగాయి. అందులో రైళ్ళు ఢీకొన్న దుర్ఘటనలు 120, పట్టాలు తప్పినవి 1,410. ప్రమాదాలు జరిగినప్పడు దాని తీవ్రత ఎంత అనేది లెక్కగట్టడం కష్టంగానే ఉంటోంది. ప్రమాదాల్లో అత్యధికంగా రైల్వే ఉద్యోగులూ ప్రాణాలు కోల్పోతున్నారు.
2007-08 నుంచి 2011 వరకూ 1,624 మది ఉద్యోగులు చనిపోయారు. ఇదే సమయంలో విగతజీవులైన సాధారణ ప్రజల సంఖ్య 1,019. క్షతగాత్రులు 1,716. ఈ విషయాన్ని రైల్వే భద్రతపై ఏర్పాటు చేసిన కకోద్కర్‌ కమిటీ వెల్లడించింది. ట్రాక్‌ ఇంజనీరింగ్‌ పనుల్లో నిమగ్నమైన ఇంజనీరింగ్‌ ఉద్యోగుల్లో 1100 మంది రైళ్ళ కింద పడి నలిగిపోయారు. మెకానికల్‌ పనుల విభాగంలో ఈ సంఖ్య 110గా నమోదైంది.
పట్టాల నిర్వహణ, నిర్మాణాలను పూర్తిగా యాంత్రీకరిస్తే తప్ప ఈ ప్రమాదాలను అరికట్టలేమని కకోద్కర్‌ కమిటీ వెల్లడించింది. వాస్తవానికి రైలు ప్రమాదాల సంఖ్య తగ్గుతోంది. కానీ మరణాలే పెరుగుతున్నాయి. 2006-07లో 195 ప్రమాదాలు జరిగితే…208 మంది మృతి చెందారు.
కానీ గత ఏడాది ప్రమాదాల సంఖ్య 141కి తగ్గినా… మృతులు మాత్రం 381కి పెరిగారు.
నివేదికలకే పరిమితం
ప్రమాదం జరిగినప్పుడే సర్కారులో చలనం వస్తుంది. మొక్కుబడిగా ఓ కమిటీ వేయడం… తీవ్రత తగ్గాక వచ్చే ఆ నివేదికల మొఖం చూడకుండా పక్కన పడేయడం షరా మామూలుగా జరుగుతున్న తంతే. ఏ ప్రమాదం విశ్లేషించినా అందుకు దారితీసిన క్రమానుగత
విధి వైఫల్యాలు కళ్ళకు కడతాయి. సంస్థాగత లొసుగులు లోపాల్ని సరిదిద్దుకోవాలని ఎత్తి చూపుతున్నాయి.
న 1998లో జస్టిస్‌ హెచ్‌ఆర్‌ ఖన్నా సారథ్యంలోని నియుక్తలైన రైల్వే భద్రతా సమీక్షా సంఘం ఇదే విషయాన్ని వెల్లడిచింది.
రెండు విభాగాలుగా 278 సూచనలు చేసింది. వీటిలో 240 సిఫార్సుల్ని పూర్తిగానో పాక్షికంగానో ఆమోదించామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. వివిధ కారణాల రీత్యా 38 సూచనల్ని త్రోసిపుచ్చింది. కాలం చెల్లిన ట్రాక్‌లు, వంతెనలు సిగ్నల్‌ వ్యవస్థ వంటి వాటిని ఆరేళ్ళ కాల వ్యవధిలో పూర్తిగా మార్చి వేయడానికి రూ. 17,000 కోట్ల భద్రతానిధి ఏర్పాటు చేసి, కేంద్రం ఆ మొత్తాన్ని గ్రాంటుగా ఇవ్వాలని ఖన్నా కమిటి సూచించింది. ఈ నివేదికను వాజ్‌పాయ్‌ సర్కారు పరిశీలించేనాటికి అంచనా వ్యయం 20 వేల కోట్లు దాటింది. అందులో రూ. 5వేల కోట్లను భద్రత రుసుముగా ప్రయాణీకుల నుంచే కేంద్రం వసూలు చేస్తోంది.
న ఏమైనా విపత్తులు ఎదురైనప్పుడు ఎలా ఎదుర్కొవాలన్న దానిపై 2002లో మరో ఉన్నత స్థాయి కమిటీని నియమిస్తే అది 111 సూచనలు చేసింది. వాటిలో మెజారిటీ అమలుకు నోచుకోలేదు. భారత రైల్వే భద్రతంగా ఉండాలంటే లక్షకోట్ల రూపాయలు అవసరమని కకోద్కర్‌ కమిటి సూచించింది.
న ఘనీఖాన్‌ చౌదరి నుంచి మమతా బెనర్జీ వరకూ రైల్వే మంత్రులంతా భద్రతపై మొసలి కన్నీరు కార్చడం మినహా ఏ ఒక్క కమిటి నివేదికను యథాతథంగా అమలు చేసిన దాఖలాలు లేవు. మరమ్మత్తులు చేసే సమయమైనా లేకుండా అధిక సంఖ్యలో రైళ్ళు నడుపుతున్నారు. ఫలితంగా గత మూడేళ్ళలో 1100 మంది సిబ్బంది మరణించారు.
క్రాసింగులే మాయ ద్వారాలు
రైల్వే ప్రమాదాలకు అగ్రభాగం లెవల్‌ క్రాసింగ్‌లే కారణమని అధ్యయన నివేదికలు చెబుతున్నాయి. దేశంలో మొత్తం 35,363 గేట్లు ఉంటే… ఇందులో 17,954 క్రాసింగుల వద్ద కాపలా కూడా లేదు. రాష్ట్రంలో కాపలా లెెని గేట్లు 935 వరకూ ఉన్నాయి. ప్రమాదాల్లో 59 శాతం కాపలా లేని లెవల్‌ క్రాసింగులను దాటుతుండగానే జరుగుతున్నాయి. మొత్తం ప్రమాద ఘటనల్లో 85 శాతం మానవ తప్పిదాలు. ఏడు శాతం విద్రోహ చర్యలు. 3 శాతం పరికరాల వైఫల్యం లేదా ఆకస్మిక కారణాలుగా ఉంటున్నాయి. ఓక్క శాతం ప్రమాదాలకు కారణాలు తెలియడం లేదు. విద్రోహ చర్యల వాటా నానాటికీ పెరుగుతోంది. 2006-07లో ఇది 4.1 శాతం ఉంటే… 2010-11 నాటికి 11.36 శాతంకు చేరింది. దేశవ్యాప్తంగా దాదాపు 15వేల లెవల్‌ క్రాసింగులు సరైన కాపలా లేకపోవడం వల్ల మృత్యు ద్వారాలుగా మారతున్నాయి. రైళ్ళు పట్టాలు తప్పడం, ఢీకొనడం, వంతెన మీద నుంచి పడిపోవడం వంటి ప్రమాదాలు భయావహ ప్రమాద చరిత్రనే లిఖించాయి. కమిటీలు వేసి నివేదికలు రాబట్టడమేగానీ చిత్తశుద్ధితో దీటైన కార్యాచరణకు ఉపక్రమించిన దాఖలాలు లేవు.
దక్షిణ మధ్య రైల్వే పరిస్థితి ఇదీ
దక్షిణ మధ్య రైల్వేకు దేశంలోనే ప్రధానమైన గుర్తింపు ఉంది. ఇక్కడే ఆదాయం ఎక్కువ. అయినా సౌకర్యాల వైపు రైల్వేశాఖ కన్ను పడటం లేదు. తీవ్ర నిర్లక్ష్యంగా కారణంగా భద్రత పెనుశాపంగా మారుతోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 7500 కిలో మీటర్ల పొడవున రైలు మార్గం ఉంది. ఈ మార్గంలోదాదాపు 3500 రైల్వే లెవల్‌ క్రాసింగ్‌లున్నాయి. ఈ క్రాసింగ్‌ల వద్ద రైలు పట్టాలు దాటి వేరే ప్రాంతాలకు వెళ్ళడం నిత్యకృత్యం. కాబట్టి అక్కడ రైల్వే గుట్లు పెట్టి ఒక కాపలా మనిషి నియమించదాలనదే సర్వసాధారణ విషయం.
రైలు వచ్చిన ప్రతిసారి గెెటు తీసే ఏర్పాటు లెెకపోవడం వల్ల ఏటా ఎన్నో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వేలో మొత్తం 1234 కాపలా గేట్లు ఉన్నాయి. ఇంకా 1177 క్రాసింగ్‌ల వద్ద ఎటువంటి కాపలా లేదు. ఈ క్రాసింగుల వద్ద ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకపోవడంతో తరచూ ప్రమా దాలు సంభవిస్తున్నాయి. ఐదేళ్ళలో ఈ రైల్వే క్రాసింగ్‌ల వద్ద కాపలా గేట్లు ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ ప్రతిపాదించినా వాటికి నిధులు మంజూరు కాలేదు. 2009-10 ఆర్థిక సంవత్సరంలో రూ. 12 కోట్లను వ్యయం చేసి కేవలం 9 గేట్లను మాత్రమే ఏర్పాటు చెెశారు.
2010-11 ఆర్థిక సంవత్సరంలో 12.40 కోట్లతో 68 గేట్లను ఏర్పాటు చేయడంతో పాటు కొన్ని రైల్వే బ్రిడ్జిలను కూడా కట్టాలని ప్రతిపాదించారు.
మరో 56 రైల్వే క్రాసింగ్‌ల వద్ద పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని అధికారులే గుర్తించారు. దీనికి రూ. 11.25 కోట్లు వ్యయం అవుతుం దని అంచనా వేశారు తప్ప, నిధులు ఇవ్వలేదు. ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం నిధులు మంజూరు చేయాలి. కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం కొరవడటం వల్ల నిధుల మంజూరు సాధ్యం కావడం లేదు.

మద్యం దుకాణాలు మూసే వరకు ఉద్యమం ఆగదు

చాపాడు మండల కేంద్రమైన చాపాడు దళిత మహిళలు మద్య నిషేదంపై నిర్వహిస్తున్న ఉద్యమాన్ని మరింత ఉదృతం చేశారు. గత 3 రోజులుగా మద్యం షాపులు మూసివేయాలని రిలే దీక్షలు చేపట్టారు. ఈ సందర్బంగా టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, తదితర ప్రజా సంఘాల నాయకులు శుక్రవారం దీక్షకు మద్దతు పలికారు. ఈ సందర్బంగా రాయలసీమ సంపూర్ణ మద్య నిషేద కమిటీ కన్వీనర్‌ సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ చాపాడు మద్యం షాపులను బినామీ పేర్లతో నడుపుతున్నారని, మద్యం షాపుల లైసెన్స్‌లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్బంగా రెడ్యం వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ వచ్చే ఏడాది మద్యం టెండర్లలో చాపాడును తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఈసందర్బంగా ఉద్యమకారులతో పాటూ ప్రజా సంఘాల నాయకులు పురవీధుల వెంబడి ర్యాలీ ని ర్వహించి తహసీల్దార్‌ ప్రకాష్‌బాబుకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సమాఖ్య ఉపాధ్యక్షురాలు సరస్వతమ్మ, కోశాధికారి పద్మావతి, మద్యపాన వ్యతిరేక కమిటీ జిల్లా కన్వీనర్‌ నజీర్‌ బాషా తదితర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఉప ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహిస్తాం – కలెక్టర్‌ వి.దుర్గాదాస్‌

జిల్లాలోని అనంతపురం అర్బన్‌, రాయదుర్గం నియోజకవర్గాల ఉప ఎన్నికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఎన్నికల మీడియా కేంద్రం ద్వారా వెల్లడి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ వి.దుర్గాదాస్‌ పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని రైతుబజార్‌ సమీపంలోని అనంతకృషి భవన్‌లో జిల్లా యంత్రాంగం సహాయప్రాజెక్ట్‌ అధికారి ఎం. వెంకటేశ్వరప్రసాద్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల మీడియా కేంద్రాన్ని కలెక్టర్‌ వి.దుర్గాదాస్‌ ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఉప ఎన్నికలకు సంబంధించిన సంపూర్తి సమాచారాన్ని మీడియా కేంద్రం ద్వారా ప్రజలకు తెలియజేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుత ఉప ఎన్నికలకు సంబంధించి నేటి నుండి 25 వరుకు జరిగే నామినేషన్ల ప్రక్రియ, వాటి పరిశీలన, నామినేషన్‌ ఉప సంహరణ, పోటీ అభ్యర్థుల నమూనా తుది జాబితా, ఎన్నికల రోజు పోలింగ్‌శాతం, ఓట్లు లెక్కింపు ఫలితాలు తదితర నన్నింటిని మీడియా కేంద్రాన్ని అన్ని మీడియా ప్రతినిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
జిల్లాలో ఉప ఎన్నికలను స్వేచ్చగా సజావుగా ప్రశాంత వాతావరణంలో జరగడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. మోడల్‌కోడ్‌ అమలును పక్కాగా అమలు పరచకోవడానికి పరిశీలకులను నియమించడం జరిగిందన్నారు. ఇప్పటికే ఎన్నికల బందోబస్తుపై కార్యాచరణ ప్రణాళిక తయారు చేశామని, దాని ప్రకారం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జిల్లాలో అక్రమ మద్యం, డబ్బుపంపిణీ అరికట్టడానికి 9 చెక్‌పోస్టులు, 11 మొబైల్‌ చెక్‌పోస్టులను ఏర్పాట్లు చేశామని తెలిపారు.
రాష్ట్రంలో ఏ జిల్లాలో పట్టుకోనంత పెద్ద మొత్తంలో రూ.3.68 కోట్లను జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ప్రజాస్వామ్యపద్ధతిలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ సుదర్శన్‌రెడ్డి, డిఇఐఇ నాగభూషణం, డివిజనల్‌ పిఆర్‌ఓ ఎన్‌.జ్యోతి, ఏపిఆర్‌ఓ పురుష్తోత్తం, కలెక్టరేట్‌ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్లు వెంకటసుబ్బయ్య, వరద రాజులు తదితరులు పాల్గొన్నారు.

నాలుగైడు రోజుల్లో వేరుశనగ విత్తన పంపిణీ చేస్తాం…. జాయింట్‌కలెక్టర్‌

నాలుగైదు రోజుల్లో రైతులకు సబ్సీడీతో విత్తన వేరుశనగ పంపిణీ చేస్తామని జాయింట్‌ కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ పేర్కొన్నారు. శుక్రవారం హిందూపురం పర్యటించిన ఆమె స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో సకాలంలో రైతులకు వేరుశనగ విత్తన పంపిణీ చేయడం కోసం ఇప్పటికేఅన్ని చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఎలాంటి అనుమానాలగు తావులేకుండా పంపిణీ జరుగుతుందన్నారు. కానీ జిల్లాలో ఎన్నికల కోడ్‌ ఉన్న కారణంగా ప్రధానంగా రాయదుర్గంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆ నియోజక వర్గం రైతులకు వేరశన విత్తనం పంపిణీ చేయడానికి ఎన్నికల కమిషన్‌ నుంచి అనుమతి తీసుకోవడం జరుగుతుందన్నారు. వారి అనుమతితోనే పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రధానంగా పట్టణంలో తాగునీటి సమస్య ఎదురవుతున్న కారణంగా అందుకు ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా ప్రజలకు నీటి సౌకర్యం కల్పించాలని సంభందిత అధికారులకు ఆమె ఆదేశించారు. పట్టణంలో పరిశుభ్రతకోసం శానిటేషన్‌ సిబ్బందితో పనులు చేయించాల్సిన అవసరం ఉందని ఆ అధికారులు కూడా సూచించారు. 13వ ఆర్థిక ప్రణాళిక నిధులతో కంపోస్టు యార్డుకోసం రూ.50లక్షలు మంజూరు అయ్యాయని భూమి గోరంట్ల రోడ్డు సమీపంలో ఉన్న కారణంగా దాన్ని పరిశీలించడానికి పెనుకొండ ఆర్డీఓకు తెలియజేయడం జరిగిందన్నారు. పురపాలక సంఘం పరిధిలో ఉన్న బోర్లను ప్లషింగ్‌ చేయడానికి అనుమతి ఉందని, దాన్ని ఆసరాగా చేసుకుని ప్రయివేటు వ్యక్తులు బోర్లు వేసుకుంటున్నారని, దానిపై చర్యలు చేపడుతామని ఆమె అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ ప్రభాత్‌కుమార్‌, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.

సబ్‌ రిజిస్ట్ర్రార్‌ లంచం డబ్బు రూ.2.90లక్షలు పట్టుకున్న పోలీసులు

స్థానిక సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో శుక్రవారం పట్టణంలోని వివిద స్థలాలకు సంబందించి అధిక సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగాయి. సబ్‌ రిజిస్ట్రార్‌ కు దాదాపు రూ.6లక్షలు లంచం ముట్టినట్లు, అందులో రూ.2.90లక్షలు కార్యాలయ ఉద్యోగి అశోక్‌ నాయక్‌ ద్విచక్రవాహనంలో తీసుకువెళ్తూ సాయంకాలం పోలీసులకు పట్టుబడ్డాడు. పట్టణ ఎస్సై శివగంగాధర్‌ రెడ్డి పాండురంగ సర్కిల్‌ లో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ ద్విచక్రవాహనంలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ అటెండర్‌ అశోక్‌ నాయక్‌ బ్యాగును పెట్టుకొని వెళ్తుండగా పోలీసులకు అనుమానం వచ్చి అతడిని కొత్తపేట వరకు అనుసరించి ఆంజనేయస్వామి గుడి సమీపంలో అతడిని పట్టుకొని బ్యాగును సోదా చేయగా రూ.2.90లక్షలు డబ్బు దొరికింది. ఇంత డబ్బు నీకు ఎక్కడినుండి వచ్చిందని పోలీసులు ప్రశ్నించగా దాదాపు రూ.6లక్షలు సబ్‌ రిజిస్ట్రార్‌ కు లంచంగా వచ్చిందని, సబ్‌ రిజిస్ట్రార్‌ లక్ష్మినారాయణ డాక్యుమెంట్‌ రైటర్‌ చాంద్‌ భాషా ద్వారా తనకు రూ.2.90లక్షలు పంపి ఇంటిలో పెట్టుకోమని తర్వాతా తీసుకుంటానని చెప్పడంతో తాను తన ఇంటికి తీసుకువెళ్తున్నానని అతడు చెప్పాడు. మిగిలిన మొత్తం డాక్యుమెంట్‌ రైటర్‌ చాంద్‌ భాషా వద్ద వుంటుందని భావించిన ఎస్సై శివగంగాధర్‌ రెడ్డి అతడి కోసం గాలిస్తున్నారు. అశోక్‌ నాయక్‌ ను అరెస్టు చేసి రూ.2.90లక్షలు సీజ్‌ చేశారు.

ప్రశాంతంగా ఐసెట్‌

పరీక్షా కేంద్రాలను పరిశీలించిన వీసీ, రీజినల్‌ కో ఆరి ్డనేటర్‌,పీజీడీన్‌లు
గైర్హాజరు నాలుగు శాతం మాత్రామే- రీజినల్‌ కో ఆర్డినేటర్‌ కృష్ణారెడ్డి
రాష్ట్ట్ర వ్యాప ్తంగా నిర్వహించిన ఎం బీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశ అర్హత పరీక్ష (ఐసెట్‌) అనతంపురం రీజియన్‌ పరిధిలో ప్రశాంతంగా జరిగింది. శుక్రవారం నిర్వహించిన ఈ పరీక్షలకు ఎస్కేయూ ఎంబీఏ విభాగాపధిపతి ఆచార్య బి. కృష్ణారెడ్డి రీజినల్‌ కో ఆర్డినేటర్‌గా వ్యవహరించారు. జిల్లా కేంద్రాంలో 9 కేంద్రాల్లో పరీక్షలకు హాజరయ్యారని, 94 శాతం హాజరు నమోదయిందని రీజినల్‌ కో ఆర్డినేటర్‌ తెలిపారు. ఐ సెట్‌ పరీక్షల కేం ద్రాలను ఎస్కేయూ వీసీ కె.రామకృష్ణారెడ్డి, ఎస్కేయూ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య ఎం. బుద్దన్న, వైస్‌ ప్రిన్సిపాల్‌ ఫణిశ్వరరాజు, పీజీ పరీక్షల డీన్‌ ఆచార్య గోవిందప్పలు పరశీలించారు. ముందుగా ఎస్కేయూ పరీక్షా కేంద్రాంలో వీసీ తదితరులు పరిశీలన చేశారు. అనంతరం నగరంలోని జేఎన్‌టీయూ. ఎస్‌ఎస్‌బీఎన్‌, ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల, శ్రీసాయి డిగ్రీ కళాశాల తదితర వాటిని వీసీ, రాష్ట్ర పరిశీలన చేశారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం క లుగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయడం పై సంతృప్తిని వ్యక్తం చేశారు. పరీక్షలకు విద్యార్థులు అధిక సంఖ్యలోనే హాజరయ్యారు. గతంతో పోలిస్తే హాజరు శాతం గణనీయంగా పెరిగిందన్నారు. ఆర్‌ ్ట్స కళాశాలలో 901 మందికి గాను 863 మంది హాజరు కాగా, 38 మంది పాల్గొన్నా లేదు ఎస్కేయూ కళాశాలో 904 గాను 42 మంది హాజరు కాలేదు. జే ఎన్‌టీయూలో 700 లకు 672 మంది ఎస్‌ఎస్‌ బీఎన్‌ కళాశాలలో 800 మందికి 767 మంది అనంతలక్ష్మి ఇంజనీరింగ్‌ క ళాశాలలో 500 మందికి 477 మంది సివి.ఎల్‌ఎన్‌ఆర్‌ కళాశాలలో 300 గాను 290మంది ఎస్వీ డిగ్రీ కళాశాలలో 620కీ గాను 603 మంది శ్రీసాయి డిగ్రీ కళాశాలలో 351 కీ 341 మంది, బాలజీ కళాశాలలో 500 మందికి 479 మంది హాజరయ్యారు.
అనంతలక్ష్మి కళాశాల ఆధ్వర్యంలో ఉచ్చిత బసు సౌకర్యం :–
ఐసెట్‌ పరీక్షల సందర్భంగా అనంతలక్ష్మి కళాశాల యాజమాన్యం అనంత రాముడు, డైరెక్టర్‌ రమేష్‌ నాయుడు, ప్రిన్సిపాల్‌, డి. బండి రమేష్‌ బాబులు మాట్లాడుతూ విద్యార్థుల ఉపయోగార్థం అనంతలక్ష్మి ఇంజ నీ రింగ్‌ అండ్‌ టేక్నాలజీ కళాశాల యాజమాన్యం ప్రత్యేక బసులు ఏర్పాటు చేశారు. తమ కళాశాలకు బస్సులలో ఉచితంగా విద్యార్థులను పరీక్ష కేం ద్రాలకు తరలించారు. విద్యార్థులకు ఇబ్బందిలకు గురి కాకుండా పరీక్షల సమయంలో బస్సులను ఏర్పాటు చేశామాన్నారు, దీనిపై విద్యార్థులు వారి తల్లి దండ్రులు అనందం వ్యక్తం చేశారన్నారు.

తెదేపా అభ్యర్థి పై కాంగ్రెస్‌ అభ్యర్థి తనయుడు దాడి

15 మందికి గాయాలు
5 మంది తెదేపా కార్యకర్తలు గల్లంతు
ప్రచారవాహనాలు ధ్వంసం
నియోజక వర్గంలోని కాంగ్రెస్‌ అభ్యర్థి పాటిల్‌ వేణుగోపాల్‌ రెడ్డి స్వగ్రామమైన పల్లేపల్లి గ్రామానికి శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో ప్రచారానికి వెళ్ళిన తెలుగు దేశం పార్టీ అభ్యర్థి దీపక్‌రెడ్డి, తోటి కార్యకర్తలపై పాటిల్‌ కుమారుడు పాటిల్‌అజయ్‌కుమార్‌రెడ్డి గ్రామస్థులతో కలిసి దాడికి పాల్పడినట్లు, ఇందులో ఐదు మంది స్పృహకోల్పోగా, 15 మంది గాయాలపాలైనట్లు, 5 మంది కార్యకర్తలు అసలు కనబడడం లేదని, రెండు టాటాసుమోలు, ప్రచారరథం ధ్వంసం చేసినట్లు తెదేపా అభ్యర్థి దీపక్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నా వాహనం కూడా పాక్షికంగా దెబ్బతినిందని ఆయన మండిపడ్డారు. పల్లేపల్లిలో తెలుగు దేశం ప్రచారం చేయడానికి రావాలని గ్రామానికి చెందిన మహేంద్రఅనే వ్యక్తి ఫోనుద్వారా పిలువగా, మేము ప్రచారానికి వెళ్ళామని, అంతలో పాటిల్‌తనయుడు అజయ్‌, తమ్ముడు సదాశివరెడ్డి గ్రామస్థులను రెచ్చగొట్టగా, వారుమాపై దాడికి పూనుకున్నారని, అంతటితో ఆగకుండా అజయ్‌ తనవాహనంతో మా వాహనాలను ఢీకొట్టడమేకాకుండా కార్యకర్తలపైకి దూసుకువచ్చాడని, మా కార్యకర్తలపై కట్టెలు, రాళ్ళతో దాడులు చేయించాడని మండిపడ్డారు. నాచొక్కా కూడా చింపారని ఆగ్రహించారు. ఇదేనా వారి సంస్కృతి, రౌడీరాజకీయం, దౌర్జన్యాలు మానుకోకపోతే తగినబుద్దిచెప్పాల్సి వస్తుందన్నారు. తెలుగు దేశం కార్యకర్తలైన లడ్డుఇస్మాయిల్‌, డ్రైవర్‌ రమేష్‌, చమన్‌, ప్రసాద్‌ తదితరులు తీవ్రంగా గాయపడడంతో వారిని చికిత్స కోసం రాయదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటన తెలుసుకున్న ఎమ్మెల్సీ మెట్టుగోవింద రెడ్డి, హిందూపురం ఎం.పి.నిమ్మలకిష్టప్ప హుటాహుటీన ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఈ ఘటనకు పాల్పడిన పాటిల్‌ కుమారుడు అజయ్‌కుమార్‌ను, తమ్ముడు సదాశివరెడ్డిని, దాడిచేసిన కాంగ్రెస్‌ వర్గీయులను వెంటనే అరెస్ట్‌ చేయాలని వారు డిమాండ్‌ చేశారు. అనంతరం ఆసుపత్రి నుండి సుమారు 200 మంది తెదేపా కార్యకర్తలతో కలిసి పాటిల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని డి.ఎస్‌.పి.శ్రీధర్‌, సి.ఐ.రెడ్డప్పలకు ఫిర్యాదు చేశారు. ప్రశాంతతకు మారుపేరైన రాయదుర్గం నియోజక వర్గంలో ఎన్నడులేని విధంగా జరిగిన ఈ సంఘటనతో ప్రజలు ఏమిజరగబోతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దాడులు సమంజసంకాదని చర్చించుకుంటున్నారు.

బాదితులను పరామర్శించిన కాపు

శుక్రవారం రాత్రి పల్లేపల్లి గ్రామంలో జరిగిన దాడి సంఘటనలో గాయపడిన బాదితులను రాయదుర్గం ప్రభుత్వాసుపత్రిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కాపురామచంద్రారెడ్డి పరామర్శించారు. టి.డి.పి.నాయకులపై జరిగిన దాడిలో గాయపడిన వారిని మానవతాదృక్పదంతో తాను పరామర్శించినట్లు తెలిపారు. ఇందుకు పార్టీలకతీతంగా తానుబాదితులకు ఎల్లవేళలా సహాయకార్యక్రమాలు అందించేందుకు అందుబాటులో వుంటానని తెలిపారు.

ఆ ఇద్దరూ ఒక్కటే ఆ ఇద్దరూ ఒక్కటే

బాబుకు, జగన్‌కు తేడా ఏమీ లేదు
-మంత్రి పదవిచ్చిన ఎన్టీఆర్‌కే బాబు వెన్నుపోటు పొడిచారు
-తల్లిలాంటి కాంగ్రెస్‌ను జగన్ మోసం చేశారు
-సీఎం పదవి కోసం ఆయన కుట్ర చేస్తున్నారు
-టీడీపీ, టీఆర్‌ఎస్, బీజేపీతో కుమ్మక్కయ్యారు
-రాయదుర్గం ప్రచారంలో సీఎం కిరణ్
అనంతపురం, మే 18:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌డ్డికి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు తేడా ఏమీ లేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి వ్యాఖ్యానించారు. మంత్రి పదవి ఇచ్చి అక్కున చేర్చుకున్న ఎన్టీ రామారావుకే చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. జగన్ కూడా కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని, రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన ఏఐసీసీ అధ్యక్షరాలు సోనియాగాంధీని మోసం చేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీకి చేటు తేవొద్దన్న మాజీ సీఎం వైఎస్ మాటను ఆయన కొడుకు మర్చిపోయారని ఆరోపించారు. మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు, తల్లిలాంటి పార్టీని మోసం చేసిన జగన్‌కు తేడా ఏముందని ప్రశ్నించారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమ అధినేత్రి సోనియాగాంధే వైఎస్‌ను రెండుసార్లు ముఖ్యమంవూతిని చేశారని వ్యాఖ్యానించారు. ఆయన తమ పార్టీ నేతని, ఆయనను తామెప్పుడూ కించపర్చలేదని చెప్పారు. చేసిన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు, ముఖ్యమంత్రి పదవి దక్కించుకునేందుకు జగన్ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొ ఆయన టీడీపీ, టీఆర్‌ఎస్, బీజేపీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వ పథకాలపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
రాయదుర్గం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి కాపు రామచంవూదాడ్డి గురువు జైలులో ఉన్నారని, ఆయన కూడా ఏ క్షణమైనా జైలుకు వెళ్లవచ్చునని సీఎం అన్నారు. జైలుకు వెళ్లే వ్యక్తులు ప్రజలకు ఏం సేవ చేస్తారని ప్రశ్నించారు. అటువంటి వ్యక్తులకు ప్రజలు ఓట్లేయరన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పాటిల్ వేణుగోపాల్‌డ్డిని గెలిపిస్తే రాయదుర్గం రెండేళ్లలో అభివృద్ధి చెందుతుందని, కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే ఆయన గెలిచినట్లే అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. వేణుగోపాల్‌డ్డి స్థానికుడని, స్థానికునికి ఓటేస్తారో, స్థానికేతరునికి ఓటేస్తారో మీరే నిర్ణయించుకోవాలని ఓటర్లను కోరారు. టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్‌లకు ఓటేస్తే వృథా అవుతుందని చెప్పారు.
జగన్‌ వెన్నుపోటుదారుడు
రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పటిష్ఠంగా అమలుపరుస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వానికి జగన్‌ మోహన్‌రెడ్డి వెన్ను పోటు పొడుస్తూ అభివృద్ధికి అడ్డుతగులుతున్నా రని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. జగన్‌ పదవీ వ్యామోహంతో ముఖ్య మంత్రి కావా లని అరాచకాలకు పాల్పడుతున్నారని, అవినీతి, అక్రమార్జన, రౌడీలకు, గుండా లకు, నేరస్తులకు ‘‘బాస్‌’’గా మారి అక్రమ సామ్రా జ్యానికి ‘‘సామ్రా ట్టు’’గా వ్యవహరిస్తున్నా రని ఆరో పించారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయ న రాయదుర్గం నియోజకవర్గం లోని కణేకల్లు, బొమ్మనహాళ్‌లో నిర్వహించిన రోడ్‌షోలో ప్రసం గించారు. జగన్‌ ముఖ్యమంత్రి పదవిని కాంక్షించి అనాలోచనతో తీసుకొన్న నిర్ణయ ప్రతిఫలమే బై ఎలెక్షన్లన్నారు. అంతిమ విజయం న్యాయం, ధ ర్మాలకు దక్కుతుందనే నిజాన్ని జగన్‌ తెలుసు కోవాలన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో ఖనిజ సంపదను విచ్ఛలవిడిగా దోచుకొన్న గాలి జనార్దన్‌రెడ్డి జైల్లో ఉన్నాడన్నారు.
కాపు రామ చంద్రారెడ్డి జైలుకెళ్ళడం ఖాయ మని, జైలుకెళ్ళే నాయకునికి ఓటు వేస్తారా? అని ప్రజలను ప్రశ్నించారు. టీడీపీ అభ్యర్థి అయిన గుణపాటి దీపక్‌రెడ్డి కి నెల్లూరు జిల్లా నుండి వలస వచ్చారని, రాయ దుర్గం నియోజకవర్గం నైసర్గిక స్వరూపం, ఎల్లలు, తెలియని స్థానికేతరుడికి ఈ ఉప ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పా లన్నారు. 35 ఏళ్ళుగా రాయదుర్గం నియోజకవర్గానికి ఎన లేని సేవలు చేసిన అనుభవజ్ఞుడు, రాజనీతు జ్ఞుడైన పాటిల్‌ వేణు గోపాల్‌రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపిం చాలని కోరారు. పాటిల్‌ ఏది చెబితే అదే జీఓగా విడుదల చేస్తామని హామీనిచ్చా రు. తాను కూడా కరవు ప్రాంతానికి చెందిన వ్యక్తి నేనని ఈ ప్రాం తం అభివృద్దికి శాయశక్తుల కృషి చేస్తానన్నారు. ఈ ప్రచారంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి, ప్రాథ మిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్‌, ఎంపీ అనంత వెం ట్రామిరెడ్డి, ప్రభుత్వ విప్‌ శివరామిరెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి పాటిల్‌ వేణు గోపాల్‌రెడ్డ్డి పాల్గొన్నారు.

free website analytics