చిత్తూరు

తిరుపతి ఉప ప్రచారంలో చంద్రబాబు
రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ నాయకులు యథేచ్ఛగా భూ కబ్జాలకు పాల్పడుతున్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రభుత్వ భూములతోపాటు, పేదల భూములను కూడా వారు దౌర్జన్యంగా కబ్జా చేస్తున్నారని విమర్శించారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన తిరుపతిలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తిరుపతి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణ బినామీ పేర్లతో భూముల్ని కబ్జా చేశారని ఆరోపించారు. తిరుపతి-తిరుచానూరు ప్రధాన మార్గం వెంట వెంకట రమణ కబ్జా చేసినట్లుగా చెబుతున్న భూములను చంద్రబాబు పరిశీలించారు. అక్కడి ప్రజలను, మాజీ సర్పంచ్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాము అధికారంలోకి వస్తే కబ్జాకు గరైన భూములన్నింటినీ స్వాధీనం చేసుకుంటామని చెప్పారు.

రాష్ట్ర ఇసుక విధానం ఖరారైంది. నాలుగైదు రోజుల్లో నూతన విధానాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. నిర్మాణ రంగ అవసరాలకు ఏటా 2 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం. సుప్రీం కోర్డు మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకున్న పక్షంలో 1.40 కోట్ల క్యూబిక్ మీటర్ల వరకు సహజ సిద్దమైన ఇసుకను వెలికితీసే అవకాశం ఉంది. మరో 60 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరాల కోసం రోబో శాండ్‌ను ప్రోత్సహించే విధంగా కొత్త విధానం ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, భూగర్భగనుల శాఖ మంత్రి గల్లా అరుణ కుమారి ఇప్పటికే సంబంధిత అధికారులు, పరిశ్రమ వర్గాలతో చర్చలు జరిపారు. ఇసుక తవ్వకాల క్రమబద్దీకరణ, ప్రస్తుత నియమాల్లో సమూల మార్పులతో కొత్త విధానం రూపొందించబడుతుందని అధికార వర్గాలు తెలిపాయి. ఉదాసీనతకు తావు లేని విధంగా నిబంధనలను పొందుపరుస్తున్నారు. ఇసుక తవ్వకాలపై ఇక మీదట గ్రామీణ పేదలు, కూలీలు, రైతులకు అవగాహన పెంపొందించే ప్రచార కార్యక్రమాలను కూడా చేపట్టాలని సంకల్పించారు.
ప్రభుత్వం ఇసుకను ఆదాయ వనరుగా చూడటం లేదు, అయినప్పటికీ పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందనే సందేశంతో ప్రచారం నిర్వహించడానికి చర్యలు చేపట్టబోతున్నారు. ఇక మీదట నిబంధనల పరిధిలోనే ఇసుక రీచులకు అనుమతి ఇవ్వాలనే కఠిన నిబంధన కొత్త విధానంలో ప్రధానంగా పొందుపరుస్తున్నారు. ఈ మేరకు వేలం విధానాన్ని క్లిష్టతరం చేయబోతున్నారు. ఇసుక అక్రమ రవాణాను కఠినంగా అరికట్టేందుకు అన్ని స్ధాయిల్లో నిఘాను పటిష్టపర్చడం, కఠినమైన చర్యలు తీసుకొనడం లాంటి అవకాశాలను కొత్త విధానంలో తీసుకురాబోతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 47 ఇసుక రీచులను గుర్తించారు. అందులో 15 రీచులకు భూగర్భజల శాఖ అనుమతి లభించింది. ప్రభుత్వం అనుమతించిన రీచుల్లో 80 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక లభిస్తుంది.
దాదాపు 20 లక్షల మందికి ఉపాధి కలుగుతుంది. రాష్ట్రంలోని 29 చోట్ల పట్టా భూముల్లో ఇసుక తీయడానికి ప్రభుత్వం ఇప్పటికే అనుమతించింది. ఈ రీచుల్లో నుండి 24 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తీసే అవకాశం ఉంది. వీటికి తోడు 31 సబ్ మర్జన్స్ ప్రాంతాల్లో 45 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక వెలికి తీసేందుకు ఎపిఎండిసికి అనుమతించింది. మరో 14 చోట్ల అండర్ వాటర్‌లో ఉన్న ఇసుకను వెలికితీయడానికి కూడా పర్యావరణ అనుమతులు అవసరం లేనందున ఎపిఎండిసి ద్వారా మైనింగ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
తిరుపతి అసెంబ్లి నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికకు తొలిరోజు శుక్రవారం ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు. అందులో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైకాపా) అభ్యర్ధిగా పోటీ పడుతున్న భూమన కరుణాకర్‌రెడ్డి తరఫున ఆయన కుమారుడు అభినయరెడ్డి నామినేషన్‌ను ఆర్డీవో, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎ. ప్రసాద్‌కు అందజేశారు. అలాగే బి.జె.పి అభ్యర్ధిగా జల్లి మధుసూధన్ రెండుసెట్ల నామినేషన్లను దాఖలు చేశారు.
కరుణాకర్‌రెడ్డి ఆస్తి ఇదీ – భూమన కరుణాకర్‌రెడ్డి తన ఆస్తికి సంబంధించిన అఫిడవిట్‌ను నామినేషన్‌తో పాటు దాఖలు చేశారు. అందులో మొత్తం తన పేరున తన కుటుంబ సభ్యుల పేరున ఉన్న ఆస్తి ఆరుకోట్ల 24 లక్షల 15 వేల 667 రూపాయలు ఉన్నట్లు తెలిపారు. అందులో తన పేరున 71,23,495 రూపాయల విలువైన ఆస్తి తన కుటుంబ సభ్యులపేరున 5,51,92,172 రూపాయల విలువైన ఆస్తి ఉన్నట్లు అందులో పేర్కొన్నారు. అందులో తన వద్ద నగదు రూపంలో 10లక్షల 70 వేల రూపాయలు, తనకుటుంబ సభ్యుల వద్ద 8 లక్షల రూపాయలున్నట్లు తెలిపారు. అలాగే తిరుపతి ఎస్‌బి.హెచ్ మెయిన్ బ్రాంచ్‌లో తన సొంత ఖాతాల్లో 6, 35, 686 రూపాయల డిపాజిట్లు ఫైనాన్స్ కంపెనీల్లో 3,28,314 రూపాయలు, 2007 ఆగస్టు 7న పెట్టుబడిగా పెట్టగా 2012 మే నెల 9 నాటికి 4,75,277 రూపాయలుగా పెరిగినట్లు ఆయన వివరించారు. పోస్టర్‌ఒ సేవింగ్, ఇన్సూరెన్స్ తదితర వాటిలో 3,69,809 రూపాయలు ఉందని తెలిపారు. పర్సనల్ లోన్లు 15.85 లక్షల రూపాయలు జంగా రేవతి వద్ద ఉందన్నారు. 350 గ్రాముల బంగారం, 10.70 లక్షల రూ పాయలు విలువైంది తన వద్ద వుందన్నారు. వీటి విలువ 47,30,495 రూపాయలని ఆయన తెలిపారు. అలాగే తన కుటుంబ సభ్యుల వద్ద నగదు రూపంలో 8 లక్షల రూపాయలుందని, 97,469 బ్యాంకు డిపాజిట్లు, షేర్లు, అప్పులిచ్చిన బాండ్లు 40 వేలు, పోస్టల్ డిపాజిట్లు 4,28,052 రూపాయలు, 14.58 లక్షల విలువైన మోటారు వాహనాలు, 19.25 లక్షలవ ిలువైన 650 గ్రాముల బంగారం వుందని ఆయన వివరించారు. తన పేరున భూములు చిర చరాస్థులు 23.65లక్షలు ఉండగా, తమ కుటుంబ సభ్యుల పేరున కోటి ఐదు లక్షల మూడువేల 151 రూపాయల విలువగల ఆస్తులు ఉన్నాయన్నారు. ఇందులో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ప్లాట్లు ఉన్నాయి. తాను ఎవరికీ అప్పులులేనని తెలిపారు. భారతీయ జనతాపార్టీ అభ్యర్ధిగా నామినేషన్ వేసిన జల్లి మధుసూధన్ తన పేరున తన కుటుంబ సభ్యుల పేరున మొత్తం 52 లక్షల 46 వేల 432 రూ పాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
ద్విచక్రవాహనాన్ని లారీ డీకొని ముగ్గురు మృతి
బి.కొత్తకోట చెందిన సంఘటన బి.కొత్తకోట మండల పరిధిలో శుక్రవారం జరిగింది. సంఘటనకు సంబంధించి ఎస్సై సుకుమార్ అందించిన వివరాలు ఇలా ఉన్నా¸ ు. మండల పరిధిలోని కోటవూరు పంచాయితీ కూనీతోపు సమీ పంలోని సీటివారిపల్లె వద్ద జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది. బి.కొత్తకోట మండలంలోని గట్టు పంచాయతీ దేవరాశిపల్లికి చెందిన గంగిరెడ్డి(40) తన ద్విచక్రవాహనంపై తంబళ్ళపల్లె మండలంలోని కోసువారిపల్లెకు బయలుదేరాడు. అదే గ్రామానికి చెందిన వెంకటశివారెడ్డి(55) కూడా అతనితో పాటు బయలుదేరాడు. ఇద్దరూ కలిసి వెలుతుండ గా తానుకూడా వస్తానంటూ మార్గమధ్యంలో సమీప గ్రామం గట్టుపాళెంకు చెందిన చిన్నపరెడ్డి(22) అదే ద్విచక్రవాహనం ఎక్కాడు. ముగ్గురూ కలిసి జాతీయరహదాిం పైకి చేరుకొన్నారు. అంతలో ఎదురుగా తమిళనాడులోని గుడియాతం నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకటశివారెడ్డి చిన్నపరెడ్డిలు ప్రమాదస్థలంలోనే మృతి చెందగా తీవ్ర ంగా గాయపడ్డ గంగిరెడ్డిని స్థానికులు చికిత్సనిమిత్తం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి 108 ద్వారా తరలించి మృతుల కుటుంబీకులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన వారు సంఘటనా స్థలానికి చేరుకొని బోరున విలపించారు. గంగిరెడ్డి కుటుంబీకులు మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొన్నారు. ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు గంగిరెడ్డి పరిస్థితి విషమంగా ఉందని తెలపడంతో మెరుగైన చి కిత్స నిమిత్తం అతడిన్ని బెంగళూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో చింతామణి వద్ద మృతి చెందాడు. బి.కొత్తకోట ఎస్సై సుకుమార్ కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్, క్లీనర్లను మదనపల్లె రెండో పట్టణ పోలీ సులు అదుపులోకి తీసుకొన్నట్లు తెలిపారు. మృత దేహాలను పోస్టుమార్టరం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
రాష్ట్రీయ, మాధ్యమిక శిక్ష అభియాన్(ఆర్‌ఎంఎస్‌ఎ) శిక్షణను తరగతి గదులకు తీసుకెళ్లాలని చిత్తూరు జిల్లా విద్యాశాఖాధికారి వి.ప్రతాప్‌రెడ్డి కోరారు. జిల్లాలో నాలుగు డివిజన్లలో జరుగుతున్న శిక్షణా కార్యక్రమంలో భాగంగా తిరుపతి డివిజన్‌లోని జీవకోన విశ్వం ఉన్నత పాఠశాలలో ఆంగ్ల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎంతో అనుభవం కలిగి, బోధనా మెళకువలతో పాఠశాలలో సృజనాత్మక విద్యను అందిస్తున్నారన్నారు. కోర్సు డైరెక్టర్ తిరుపతి ఉప విద్యాశాఖ అధికారి జె.చంద్రయ్య మాట్లాడుతూ తిరుపతి డివిజన్‌లో 13 మండలాల నుంచి 220 మంది ఉపాధ్యాయులు హాజరై శిక్షణ పొందుతున్నారన్నారు. రాబోయే విద్యాసంవత్సరంలో సక్సెస్ ఉన్నత పాఠశాలల్లో ఆంగ్లమీడియం విద్యార్థులకు బోధన అందించడానికి ఈ శిక్షణా కార్యక్రమంపై శ్రద్ధ వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆపస్ రాష్ట్ర సహాధ్యక్షులు టి.గోపాల్, ఎస్‌టియు రాష్ట్ర సహాధ్యక్షులు గాజుల నాగేశ్వరరావు, దామోదర్, ఉమాశంకర్, దేవి, కరీం తదితరులు పాల్గొన్నారు.
పురాతన కట్టడాలే భావితరాలకు తీపిగుర్తులని చంద్రగిరి ఎస్‌ఐ విద్యాసాగర్ తెలిపారు. అంతర్జాతీయ పరావస్తు సంగ్రహాల దినోత్సవం సందర్భంగా చంద్రగిరి రాయలకోటలో పురావస్తు శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ 11వ శతాబ్ధంలో యాదవ నరసింహరాయులుచే నిర్మించబడిన ఈ మహల్ పురాతన కట్టడాలని, ఇవి భావితరాలకు తీపిగుర్తులుగా మిగిలాయని ఆయన అన్నారు. ఇక్కడే తిమ్మరుసువు పుట్టి, రాజనీతిలో అగ్రగణ్యుడిగా పేరుగాంచాడని, ఈ చంద్రగిరి గడ్డపై పుట్టిన ప్రతి బిడ్డ శ్రీకృష్ణ దేవరాయుల వలె ఉన్నత పండితులుగా వెలుగొందుతారన్నారు. ఈ రాజమహల్, రాణిమహల్ కట్టడాలను చూసి అలనాటి శ్రీకృష్ణదేవరాయుల స్వర్ణయుగం గుర్తుకు వస్తుందని ఆయన అన్నారు.
అనంతరం బాలబాలికలకు పురావస్తు శాఖ నిర్వహించిన వ్యాసరచన పోటీలు, చిత్రలేఖనంలలో గెలుపొందిన వారికి విద్యాసాగర్ బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు బాలికల కళాశాల ప్రొఫెసర్ సాంబశివారెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక అధికారి చొక్కలింగం, పురావస్తుశాఖ డైరెక్టర్ త్రిమూర్తి, మునిరాజు, సుధ, జగన్, శేఖర్, వేణుగోపాల్‌నాయుడు, రత్నమ్మ, తదితరులు పాల్గొన్నారు.
రైతులైతే ఋణం ఇవ్వాలని చట్టం ఉందా? అని ఓ రైతును బ్యాంకు అధికారులు ప్రశ్నించిన సంఘటన నిమ్మనపల్లిలో ఇండియన్ బ్యాంకులో చోటు చేసుకొంది. మండలంలోని వెంగంవారిపల్లె కురవపల్లెకు చెందిన రైతు దాసన్నగారి వెంకటరమణ శుక్రవారం తమ పొలాల సాగుకై విత్తనాలు, ఎరువులు కొనడానికి, ఇంట్లోని తన ఇల్లాలు బంగారు నగలను బ్యాంకులో తాకట్టు పెట్టడానికి తీసుకు వచ్చాడు. బ్యాంకులోని బంగారును పరిశీలించే గోల్ట్‌స్మిత్ ఋణం ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో బ్యాంకు మేనజర్‌ను రైతు ఆశ్రయించగా గోల్డ్ స్మిత్ ఒప్పుకొటేనే ఋణం లబిస్తుందన్నాడు. తిరిగి ఆయన దగ్గరకు వెళ్ళగా రైతులైతే ఋణం ఇవ్వాలని చట్టం ఉందా? నీకు దిక్కున్న చోట చేప్పుకో అంటూ దురుసుగా సమాధానం ఇవ్వడంతో రైతు పత్రిగా విలేకర్లను ఆశ్రయించాడు.
తిరుమలలో విధులు నిర్వహిస్తున్న పోలీస ుల వసతి సౌకర్యార్దమై టిటిడి కౌస్తుభం వద్ద గృహ సముదాయానికి కేటాయించిన స్థలాన్ని గురువారం ఐజి టిటిడి ఇంజనీర్ అధికారులతో కలసి స్థలాన్ని పరిశీలించారు. త్వరలో ప్రారంభం కానున్న పోలీసు గృహ సముదాయాని కి సంబందించి కొన్ని మార్పు చేర్పులను ఆయన టిటిడి ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ఈ స్థల పరిశీలన కార్యక్రమంలో అర్భన్ ఎస్పి ప్రభాకర్‌రావు, తిరుమల ఏఎస్పి ఉమామహేశ్వరశర్మ, డిఎస్పి నంజుడప్ప, టిటిడి ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
తిరుమలలోని మాధవనిలయం, పలు ప్రాంతాలలో అర్బన్ ఎస్పి ప్రభాకర్‌రావు తన సిబ్బందితో కలసి గురువారం అకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో బాగంగా గత నాలుగు రోజుల క్రితం కార్తిక్ అనే బాలుడు ప్రమాదానికి గురైన మాధవనిలయంలోని వంటశాలను తన సిబ్బందితో కలసి పరిశీలించి అక్కడ పనిచేసే సి బ్బందిని ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ పనిచేసే సిబ్బందికి, పోలీసు అధికారులకు పలు సూచనలు, సలహాలను తెలియచేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల ఏఎస్పి ఉమామహేశ్వరశర్మ, డిఎస్పి నంజుడప్ప, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రరాష్టమ్రంతా అవినీతిమయంగా తయారెైందని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. గురువారం తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రం భ్రష్టుపట్టిపోయిందని, ఎటుచూసినా అవినీతి, అక్రమాలు అధికమయ్యాయని అన్నారు. వెైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన అవకతవకల వల్లే రాష్ట్రంలో నేడు ఈ పరిస్థితి నెలకొందన్నారు. ఆ అవకతవకల వల్ల లబ్ధిపొందిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. సచివాలయం ఓ మాఫియాలా తయారెైందని, రెైడీలకు నిలయంగా సచివాలయం మారిందని తెలిపారు. అక్రమ మార్గాల్లో లబ్ధిపొందడానికి సచివాలయం కేంద్రంగా తయారెైందన్నారు.
సచివాలయాన్ని అడ్డుపెట్టుకొని సంపాదించిన వారంతా జెైళ్లకు వెళుతున్నారని తెలిపారు. ప్రజాస్వామ్యం కూనీ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల కోట్లు అవినీతి జరిగిందని తెలిసినా సిఎం కిరణ్ ద్వంద్వ వెైఖరి అవలంభిస్తున్నారని ఎద్దేవా చేశారు. గతంలో కిరణ్‌కుమార్ రెడ్డి చీఫ్‌విప్‌గా ఉన్నప్పుడు, పరిటాల హత్యకేసులో జగన్‌ను కాపాడామని కిరణ్ అన్న సంఘటనను గుర్తు చేశారు. జగన్‌పెై విమర్శలు చేస్తున్నారే తప్ప, అక్రమంగా సంపాదించిన ఆస్తులను తిరిగి ఎందుకు రాబట్టలేకపోతున్నారని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి డబ్బును ధన ప్రవాహంలా ఖర్చు చేస్తున్నారన్నారు. కిరణ్ ప్రభుత్వం వెైఎస్ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలు, అప్పటి క్యాబినెట్‌పెై ఎందుకు స్పందించడంలోదో అర్ధం కావడం లేదన్నారు.
అప్పటి క్యాబినెట్‌లోని మంత్రులు కూడా ప్రస్తుతం కొనసాగిస్తున్నారన్నారు. వెైఎస్ మరణించకుండా ఉండిఉంటే ప్రస్తుతం సిబిఐ ఇచ్చిన ఛార్జిషీట్‌లో ఎ-వన్(ఎ1)గా ఉండేవారని తెలిపారు. జగన్ అక్రమంగా సంపాదించుకున్న సొమ్మంతా ప్రజలదేనని, వాటిని ప్రజలకు అప్పజెప్పడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అటువంటి అవినీతిపరుడు జగన్‌కు ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. ప్రజలందరూ ఆలోచించి ఓట్లు వేయాలని కోరారు. ఉప ఎన్నికలలో అధికశాతం సీట్లను టిడిపి కైవసం చేసుకుంటుందని పేర్కొన్నారు. తిరుపతి అభ్యర్థి చదలవాడ కృష్ణమూర్తిని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సమావేశంలో చదలవాడ క్రిష్ణమూర్తి, తెలుగుయువత జిల్లా అధ్యక్షులు శ్రీధర్‌వర్మ, నరసింహయాదవ్, పుష్పావతి, బి.జి.కృష్ణాయాదవ్ తదితరులు పాల్గొన్నారు.