కడప

“ముందు మీరు సమ్మె విరమించి, విధులకు హాజరుకండి. ఉదయం 11 గంటల నుంచి సచివాలయంలో మీతో చర్చించడానికి అందుబాటులో ఉంటా” అని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి జూనియర్ వైద్యులకు సూచించారు. ’132 జీవో కావాలో, 287 జీవో కావాలో ముందు తెల్చుకోవా’లని స్పష్టం చేశారు. నెలనెలా స్టైపెండ్ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. జూనియర్ వైద్యుల సమ్మె రాజకీయ ప్రేరితంగా కొనసాగుతుందని, వారి చర్చల్లో పొంతన ఉండడం లేదని ఆరోపించారు.
132 జీవో అమలు కావాలో, 287 జీవో కావాలో తేల్చుకోవాలని ఆయన జూనియర్ వైద్యులకు సూచించారు. “వారి సమస్యలను పరిష్కారిద్దామని మూడు సార్లు చర్చలు జరిపా. డిమాండ్ల విషయంలో కొంత సానుకూలత వచ్చింది. అయితే.. రెండు గంటల సమయం అడిగి వెనక్కి వెళ్లిపోయారు. వారికి ఈ సమాజం పట్ల బాధ్యత లేదా” అని డీఎల్ ప్రశ్నించారు. ‘ఎవరో ఏదో చెప్పాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మాట్లాడిస్తే ఎలా! అసలు జూనియర్ వైద్యులంటే ఎవరో ఆయనకు తెలుసా?’ అని డీఎల్ ఎద్దేవా చేశారు.

డీఎస్స-12 నోటిఫికేషన్ విడుదల
మే 2,3,4 తేదీల్లో రాత పరీక్షలు
అప్రెంటీస్ విధానం రద్దు
‘ఇంటర్’ నిబంధన తొలగింపు
‘ఓపెన్ డిగ్రీ’ వారికీ అర్హత
ఎస్ఏ పోస్టులకు సబ్జెక్టు నిబంధనల సడలింపు
80 మార్కులకే డీఎస్సీ
20 మార్కులకు టెట్ వెయిటేజి
మరో 7100 పోస్టులకు రెండు రోజుల్లో నోటిఫికేషన్
హైదరాబాద్, జనవరి 30 : లక్షలాది మంది ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త. కొద్ది రో జులుగా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న ‘డీఎస్సీ -2012 నోటిఫికేషన్’ సో మవారం విడుదలైంది. మొత్తం 21,343 ఉపాధ్యాయ ఉద్యోగాలను ఇందులో నోటిఫై చేశారు. ఉపాధ్యాయ అభ్యర్థులు దశాబ్దకాలంగా చేస్తోన్న ‘అప్రెంటిస్’ రద్దు డిమాండ్ కూడా నెరవేరుతోంది. వివాదాస్పదంగా మారిన ‘ఇంటర్‌లో సంబంధిత సబ్జెక్టులు తప్పనిసరి’ అనే నిబంధనను తొలగించారు.
నోటిఫై చేసిన మొత్తం పోస్టుల్లో.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 5,703, ఎస్జీటీ పోస్టులు 11, 602 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్లు 2000, పీఈటీలు 365, మునిసిపల్ పాఠశాలల్లో 1,673 పోస్టులు ఉన్నాయి. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 17వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. సచివాలయంలో సోమవారం సాయంత్రం 3 గంటలకు మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కె.పార్థసారథి ఈ డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. డీఎస్సీకి విద్యార్హతల నిబంధనల్లో కొన్నింటిని సడలించారు.
స్కూల్ అసిస్టెంట్స్ (మేథ్స్, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్) పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్ స్థాయిలో కూడా మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, హిస్టరీ, జాగ్రఫీ సబ్జెక్టులు చదివి ఉండాలన్న నిబంధనలను తొలగించారు. అంటే.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్ చదివి ఉండాలన్న నిబంధన లేదు.
ఫలితంగా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా నేరుగా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు కూడా అర్హత లభిస్తుంది. స్కూల్ అసిస్టెంట్స్ (జీవశాస్త్రం) పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు జీ.వో.నెం.4లో పేర్కొన్న సబ్జెక్టులతో పాటు సెరికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, పౌల్ట్రీ సబ్జెక్టుల అభ్యర్థులకు కూడా అర్హత కల్పించారు. టీచర్లకు అప్రెంటిస్ విధానాన్ని ఈ డీఎస్సీ నుంచి రద్దు చేశారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు నమూనా, యూజర్ గైడ్ కోసం జ్ట్టిఞ://్చఞఛీటఛి.ఛిజజ.జౌఠి.జీn వెబ్‌సైట్‌ను చూసుకోవాలి.
డీఎస్సీ 80 మార్కులకే..
టెట్‌కు వెయిటేజీ ఇవ్వనున్న కారణంగా 80 మార్కులకే డీఎస్సీ పరీక్షను నిర్వహించనున్నారు. మిగతా 20 మార్కులకు టెట్ మార్కులను వెయిటేజీగా జమ చేస్తారు. ఒక్కో ప్రశ్నకు అర మార్కు చొప్పున 80 మార్కులకు 160 డీఎస్సీ పరీక్ష ఉంటుంది. ఎస్జీటీ పరీక్షలో జనరల్ నాలెడ్జ్‌కు 10 మార్కులు, పర్‌స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 10, ఇంగ్లీష్ 9, ఇండియన్ లాంగ్వేజ్ 9, మాథ్స్ 9, సైన్స్ 9, సోషల్ స్టడీస్ 9, టీచింగ్ మెథడ్ 15 మార్కులు ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్ పరీక్ష ల్లో.. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10, పర్‌స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 10, సబ్జెక్ట్ కంటెం ట్ 44, టీచింగ్ మెథడాలజీ 16 మార్కులు ఉంటాయి. పీ ఈటీలకు టెట్ ఉండకపోవ డం వల్ల పూర్తిగా 100 మా ర్కులకు పరీక్ష ఉంటుంది.

సి. రామచంద్రయ్య
1948లో కడపలో జన్మించి తిరుపతిలోని ఎస్వీ యూనివర్శిటీలో కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత న్యూఢిల్లిdలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో చార్టెడ్ అకౌంటెన్సీ కోర్సు పూర్తి చేశారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత 67లో కడపలోని సిండికేట్ బ్యాంక్‌లో క్లర్క్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. 85లో రాజంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది అప్పటి మంత్రివర్గంలో ప్రణాళిక కార్యక్రమాల అమలు శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అప్పట్లో రాష్ట్ర ట్రేడింగ్ కార్పోరేషన్ సభ్యునిగా కూడా వ్యవహరించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి రెండు సార్లు రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. రెండోసారి ఎంపిగా కొనసాగుతున్న సమయంలో పదవీకాలం ఉంటుండగానే ప్రరాపాలో చేరారు. కాంగ్రెస్‌లో ప్రరాపా విలీనం తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కాగా చార్టెడ్ అకౌంటెన్సీలో తనకున్న 30 ఏళ్ళ అనుభవంతో ప్రముఖ కంపెనీల ఆర్ధిక లావాదేవీలను చాకచక్యంగా నిర్వహించారు.
గంటా శ్రీనివాసరావు
1960లో ప్రకాశం జిల్లా కామేపల్లిలో జన్మించి చీరాలలోని విఆర్‌ఎస్ అండ్ వైఆర్‌ఎన్ కాలేజీలో బి.కామ్, బి.ఎల్ పూర్తి చేశారు. అనంతరం విశాఖపట్నంలో స్థిరపడి పెట్రో కెమికల్ రంగంలో పలు యూనిట్లను స్థాపించారు. 1999లో అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి గెలుపొందారు. 2004లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అదే పార్టీ నుంచి చోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 2008లో ప్రరాపాలో చేరి 09లో జరిగిన అసెంబ్లిd ఎన్నికలలో అనకాపల్లి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

తెలుగుదేశం అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆస్తుల కేసు విచారణను మరో రాష్ట్రంలోని హైకోర్టుకు బదిలీ చేయాలన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల నియోజకవర్గ శాసనసభ్యురాలు వై.ఎస్.విజయమ్మ అభ్యర్థనను సుప్రీంకోర్టు అంగీకరించలేదు. చంద్రబాబునాయుడు, ఆయన సన్నిహితుల ఆస్తులపై కేంద్ర నేరపరిశోధక శాఖ (సిబిఐ)తో విచారణ జరిపించడంపై రాష్ట్ర హైకోర్టులో వాదనలు ముగిసి తీర్పు రిజర్వ్ అయిన దశలో ఈ కేసును మరో రాష్ట్రంలోని హైకోర్టుకు బదలీ చేయాలని కోరడం న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను, ఔన్నత్యాన్ని కించపరచడమేనని వ్యాఖ్యానించిన జస్టిస్ బి.ఎస్.ఠాకూర్, జస్టిస్ టి.ఎస్.చౌహాన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఆగ్రహించడంతో విజయమ్మ తన పిటిషన్‌ను ఉపసంహరించుకొన్నారు. ‘నాట్ బిఫోర్ మి’ పద్ధతితో తమకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ సక్రమంగా జరగదన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్న పిటిషనర్‌కు ఇతర రాష్ట్రాలలోని హైకోర్టులలో కూడా ఇలాంటి అనుభవమే ఎదురుకాదనే నమ్మకమేముందని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రశ్నించారు.
దీనికితోడు, అత్యంత ప్రతిష్ఠాకరమైన హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు ముగిసి తీర్పును రిజర్వ్ చేసిన ప్రస్తుత దశలో తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరముందని కూడా భావించడం లేదని డివిజన్ బెంచ్ తేల్చిచెప్పడంతో విజయమ్మ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహతగి తమకు న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసముందని, కోర్టు సూచన మేరకు తమ పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతించాలని కోరాల్సి వచ్చింది. అంతకు ముందు సోమవారంనాడు ఈ పిటిషన్‌పై సుదీర్ఘంగా జరిగిన వాదోపవాదాలలో చంద్రబాబు నాయుడు అక్రమాస్తుల కేసు రాష్ట్ర హైకోర్టులో పలు బెంచీల చుట్టూ తిరిగిందని, ప్రతివాదులు నాట్ బిఫోర్ మి పద్దతిని తమకు అనుకూలంగా వాడుకొంటూ న్యాయ ప్రక్రియకు అడ్డుతగులుతున్న కారణంగానే మరో హైకోర్టుకు బదలీ చేయాలని కోరుతున్నామని పిటిషనర్ తరఫు న్యాయవాది ముకుల్ రోహతగి వాదించారు.
అయితే, హైకోర్టులో చోటుచేసుకొన్న పరిణామాలపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, రిలయన్స్ సంస్థల తరఫున హాజరైన న్యాయవాదులు దీనిని త్రోసిపుచ్చుతూ నాట్ బిఫోర్ మి కారణంగా ఈ కేసు నుండి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లోకూర్ తప్పుకున్న తర్వాత జస్టిస్ ఈశ్వరయ్య నేతృత్వంలోని బెంచ్ విచారణను చేపట్టడానికి పిటిషనర్ విజయమ్మే అభ్యంతరం తెలిపారని, ఫలితంగానే పిటిషన్‌ను విచారించిన మరో బెంచ్ సిబిఐ ప్రాధమిక విచారణను తాత్కాలికంగా నిలుపుచేస్తూ ఆదేశాలిచ్చిందని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు, ఆయన సన్నిహితులు పలువురి అవినీతి, అక్రమంగా కూడబెట్టన ఆస్తులపై విచారణను కోరుతూ విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్‌తో హైకోర్టు తొలుత ప్రాథమిక విచారణ జరిపి నివేదికను సమర్పించాలని సిబిఐని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, ఆ తర్వాత తమకు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా, తమ వాదనలు వినకుండా హైకోర్టు ఆదేశాలు వెలువడినందున తమకు సహజ న్యాయసూత్రాలను వర్తింపజేయాలంటూ చంద్రబాబు సన్నిహితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో, హైకోర్టుకు వెళ్లి అక్కడే తమ వాదనలను వినిపించాలని గతనెలలో వారిని ఆదేశించిన సుప్రీంకోర్టు పక్షం రోజుల్లో వారి వాదనలు విని నిర్ణయాన్ని వెలువరించాల్సిందిగా హైకోర్టును ఆదేశించిన విషయం పాఠకులకు విదితమే.
సుప్రీంకోర్టులో కూడా రిలయన్స్ సంస్థ ప్రతివాదిగా ఉన్నందున నాట్ బిఫోర్ మి కారణంతో జస్టిస్ దల్వీర్ భండారీ ఈ కేసు విచారణ నుండి తప్పుకోవడంతో జస్టిస్ ఠాకూర్, జస్టిస్ చౌహాన్‌ల బెంచ్ విచారణను చేపట్టింది. గత శుక్రవారమే దీనిపై విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ తమ సీనియర్ న్యాయవాది అనారోగ్యంతో ఉన్నందున నాలుగు వారాలపాటు వాయిదా వేయాలని విజయమ్మ కోరినా కోర్టు అంగీకరించకుండా సోమవారంనాడు విచారణను ప్రారంభించింది. ఇరు పక్షాలు యథేచ్ఛగా నాట్ బిఫోర్ మి విధానాన్ని తమకు అనుకూలంగా వాడుకోవడం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు హైకోర్టుపై విశ్వాసం లేదంటూ మరో కోర్టుకు బదిలీ చేయాలని కోరడం మొత్తం న్యాయ వ్యవస్థపై దాడి చేయడం, కించపరచడమే అవుతుందంటూ న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడేందుకు ఈ పిటిషన్‌ను ఉపసంహరించుకొంటారా లేదా అని విజయమ్మ తరఫు న్యాయవాదులను ప్రశ్నించింది.
మరో హైకోర్టుకు బదలీ చేయాలన్న పిటిషన్‌ను ఉపసంహరించుకోకపోతే దానిని తాము తిరస్కరించాల్సి వస్తుందని కూడా జస్టిస్ ఠాకూర్ కఠినంగా వ్యాఖ్యానించడంతో కోర్టు మనోగతాన్ని అర్థం చేసుకున్న విజయమ్మ న్యాయవాది ముకుల్ రోహతగి తమకు న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకముందని, పిటిషన్‌ను ఉపసంహరించుకొనేందుకు అనుమతించాలని కోర్టును అభ్యర్థించారు.

రామచంద్రయ్యకు పదవిపై అభ్యంతరాలు
డీఎల్ నేతృత్వంలో ఢిల్లీకి కడప బృందం
పీఆర్పీ నేత సి.రామచంద్రయ్యకు ఈ నెల 19న జరిగే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఉంటుందని వార్తలు రావడంతో కడప జిల్లా కాంగ్రెస్‌లో చిచ్చురేగింది. ఎంతోకాలంగా పార్టీలో ఉన్నవారిని కాదని.. నిన్నగాకమొన్న వచ్చిన రామచంద్రయ్యకు పదవి ఇవ్వడం సరైంది కాదని రాష్ట్ర మంత్రులు డీఎల్ రవీంద్రారెడ్డి, అహ్మదుల్లా, ఎమ్మెల్యే కందుల వీరశివారెడ్డి, ఎమ్మెల్సీ చెంగల్రాయుడు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, కేంద్ర ఆరోగ్యమంత్రి గులాంనబీ ఆజాద్‌ను కలిసి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వచ్చారు.
జిల్లాలో ప్రాబల్యం ఉన్న వర్గాన్ని వదిలిపెట్టి రామచంద్రయ్యకు అవకాశం కల్పిస్తే పార్టీలో చిచ్చు రేగుతుందని, అనేక మంది జగన్‌తో చేతులు కలిపే అవకాశం ఉందని వారంటున్నారు. జగన్‌తో సన్నిహితంగా ఉండే రామచంద్రయ్యకు పదవి ఇవ్వడం పార్టీకి మంచిది కాదని వీరశివారెడ్డి అన్నారు. దీనిపై మాట్లాడేందుకు పలువురు ఎమ్మెల్సీలు కూడా ఢిల్లీకి రానున్నట్లు తెలిసింది. కాగా గురువారం ఆజాద్‌ను కలిసేముందు వీరంతా ఏపీ భవన్‌లో మంతనాలు జరిపారు. తర్వాత ఆజాద్ కోసం వెళ్లగా.. ఆయన బిజీగా ఉండటంతో రాత్రి 7.30 నుంచి 10.30 వరకూ వారు వేచి చూడాల్సి వచ్చింది. అప్పటికీ ఆజాద్‌కు వీలు కుదరకపోవటంతో వారంతా నిరాశగా వెనుదిరిగారు.

రైతన్న పెడుతున్న కన్నీళ్లను.. రైతు కూలీలు అనుభవిస్తున్న బాధలను పట్టించుకోని ఈ మొండి ప్రభుత్వ వైఖరికి నిరసనగా 17 మంది ఎమ్మెల్యేలు వైఎస్సార్ స్ఫూర్తితో పదవీ త్యాగానికి సిద్ధపడ్డారు. రైతు కోసమని, రైతు కూలీల కోసమని చెప్పి ఉప ఎన్నికలకు సైతం సై అని నిలబడ్డారు. త్వరలో రాబోయే ఉప ఎన్నికలు రాష్ట్రంలోని కుళ్లు రాజకీయ వ్యవస్థ ప్రక్షాళనకు నాంది పలుకుతాయి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్ జిల్లా రాయచోటి నియోజకవర్గంలో రెండో రోజు మంగళవారం ఓదార్పు యాత్రలో భాగంగా ఆయన రాయచోటి, చిన్నమండెం, సంబెపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు. 10 వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. పలు గ్రామాల్లో ప్రసంగించారు. ‘‘ఈ పాలకులు రైతులను రోడ్డు మీద విసిరేస్తే నేను అండగా నిలబడతానని ముందుకొచ్చిన ఆ ఎమ్మెల్యేల్లో ఒకరు మీ ఎమ్మెల్యే(రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి). ఆయన నా పక్కన నిలబడటం చూసి గర్వపడుతున్నాను’’ అని ప్రశంసించారు. మీరు ఇచ్చే తీర్పు రాష్ర్ట ప్రభుత్వానికే కాదు, ఈ పాలకులను నడిపిస్తున్న ఢిల్లీ పెద్దల దిమ్మ తిరిగిపోయేలా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అర్ధరాత్రి 12 దాటాక కూడా యాత్ర కొనసాగింది. జగన్ వెంట రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, కడప ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, చిత్తూరు ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి తదితరులు యాత్రలో పాల్గొన్నారు. పలు గ్రామాల్లో జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..
ఆ ధీమా వచ్చాకే బాబు అవిశ్వాసం..
మొన్ననే చంద్రబాబు నాయుడు అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఇదే అవిశ్వాస తీర్మానం ఆరు నెలల కిందట పెట్టి ఉంటే ఈ ప్రభుత్వం కూలిపోయేది. అప్పట్లో చిరంజీవి గారు కూడా చంద్రబాబు నాయుడు అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేసేవారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం పడిపోదు అన్న ధీమా వచ్చిన తరువాత మాత్రమే చంద్రబాబు అవిశ్వాసం పెట్టారు. ఇటు కాంగ్రెస్ పార్టీ.. జగన్ వె ంట ఉన్న ఎమ్మెల్యేలకు డబ్బులు, కాంట్రాక్టు పనులు, మంత్రి పదవులు ఆశ చూపించి వారిని తమవైపు లాక్కునే ప్రయత్నం చేస్తా ఉంది. ఆ సమయంలో.. ‘చంద్రబాబు ఏ రాజకీయ ఉద్దేశాలతో అవిశ్వాసం పెట్టినా మీరు మాత్రం ఈ కుళ్ళు రాజకీయ వ్యవస్థలో తులసి మొక్కగా బతకాల’ని మా ఎమ్మెల్యేలకు చెప్పా. రైతు కోసం, రైతు కూలీల కోసం వారు పదవులను తృణప్రాయంగా వదిలేయడానికీ సిద్ధపడ్డారు. ఉప ఎన్నికలు వస్తున్నది కుర్చీ కోసం కాదు.. ప్రాంతం కోసం కాదు.. పదవి కోసం కాదు.. రైతు కోసం, రైతు కూలీల కోసం! అవి ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ కాదు.. రైతులకు, చెడిపోయిన రాజకీయాలకు మధ్య జరిగే పోటీ.
ఇద్దరూ కలిసి పోటీ..: ఇవాళ రాజకీయ వ్యవస్థలో విలువలు లేవు.. విశ్వసనీయత అనే పదానికి ఈ నేతలు అర్థాన్నే మార్చేశారు. దేశంలోనే ఎక్కడా ఎప్పుడూ చూడని విధంగా ఇవాళ రాష్ట్రంలో అధికార పక్షం, ప్రతిపక్షం ఒక్కటై కుళ్లు, కుతంత్రాలతో కూడిన రాజకీయాలు చేస్తున్నాయి. త్వరలో జరగబోయే ఉప ఎన్నికల్లో ఈ ఇద్దరు కూడా కలిసి పోటీ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ చేతగాని పాలకులు దివంగత వైఎస్సార్ కలలుగన్న స్వప్నాలను సర్వ నాశనం చేస్తున్నారు.
రోజంతా కూలి చేస్తే వచ్చేది రూ. 60
దివంగత నేత మన మధ్య నుంచి వెళ్లిపోయిన తరువాత ఇవాళ ఈ రాష్ట్రంవైపు తిరిగిచూస్తే బాధనిపిస్తోంది. పొలానికి వెళ్ళి ఎలా ఉన్నావన్నా అని రైతన్నను అడిగితే.. వ్యవసాయం చేయడం కంటే ఉరి వేసుకోవడం మేలంటున్నాడు. చేతికొచ్చిన వరిని కోస్తే రూ.750కి మించి గిట్టని పరిస్థితి. రైతు కూలీల పరిస్థితి మరీ దారుణం.. గ్రామాల మీదుగా వస్తుంటే.. పొలాల్లో పనులు చేసుకుంటున్న అక్కా, చెల్లెమ్మలు నాకోసం పరిగెత్తుకుంటూ వచ్చారు. కూలి ఎంత గిట్టుతుందమ్మా అని వారిని అడిగా.. పొద్దున నుంచిసాయంత్రం దాక కష్టపడితే రూ. 50 నుంచి 60 గిట్టుతుందన్నా అని చెప్పారు. అవ్వల చెయ్యిపట్టుకుని నీకెంత వస్తుందవ్వా అని అడిగితే… సాయంత్రం వరకు మేం పనిచేయలేం.. చేతనైనంత వరకు చేస్తే రూ. 20 నుంచి 30 కూలి గిట్టుతుందని ఆ అవ్వా తాతలు చెప్పినపుడు బాధనిపించింది. చాలా చాలా బాధనిపించింది.

పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు తక్షణమే నీరివ్వాలని డిమాండ్
చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్దకు రైతులతో వెళ్లిన విజయమ్మ
అధికారుల చర్చలు.. 30 నుంచి నీటి విడుదలకు అంగీకారం.. రైతుల ఆనందం
పంటలకు మంచి సీజన్.. తుంగభద్రలోనూ నీళ్లున్నాయ్.. ఇంకేం ఈ సారి మన పంట పండిందని పులివెందుల బ్రాంచ్ కెనాల్(పీబీసీ) ఆయకట్టు రైతులు ఆశ పడ్డారు. కానీ నీళ్లు వదలకుండా అధికారులు వారి ఆశలపై నీళ్లు చల్లారు. ఇది సీజనైనా.. కాకున్నా మా రికార్డుల ప్రకారం ఏ తేదీల్లో ఇవ్వాల్సి ఉంటే అప్పుడే ఇస్తామంటూ గుడ్డి లెక్కలతో కృత్రిమ కరువు సృష్టించబోయారు. ఈ విషయం తెలిసి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వై.ఎస్.విజయమ్మ రైతుల పక్షాన సోమవారం ఆందోళనకు దిగారు. పీబీసీకి కేటాయించిన నీటిని తక్షణమే విడుదల చేయాలంటూ విజయమ్మ ఆధ్వర్యంలో పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు వై.ఎస్.అవినాష్‌రెడ్డి, పార్టీ కార్యకర్తలు, పీబీసీ ఆయకట్టు రైతులు పెద్ద ఎత్తున చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(సీబీఆర్) వద్దకు చేరుకున్నారు. ఇది తెలిసి ఆగమేఘాలపై తరలివచ్చిన అధికారులు వారితో చర్చలు జరిపి.. డిసెంబరు 30 నుంచి ఫిబ్రవరి 10 వరకు ప్రతి రోజూ 350 క్యూసెక్కుల చొప్పునవిడుదల చేయడానికి అంగీకరించారు.
లక్ష ఎకరాలకు ముప్పు
ఈ ఏడాది తుంగభద్ర హెచ్చెల్సీ ప్రధాన కాలువ ద్వారా పీబీసీకి 2.45 టీఎంసీల నీటిని కేటాయించారు. కానీ.. ఆ మేరకు నీటిని విడుదల చేయడం లేదు. దీంతో పీబీసీ కింద 96,900 ఎకరాల్లో సాగుచేసిన పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. పులివెందులకు తాగునీటి అవసరాలను తీర్చే నక్కలపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో నీటి నిల్వలు కూడా అడుగంటిపోయాయి. ఇదే అంశంపై కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మలు పలు మార్లు అనంతపురం జిల్లా కలెక్టర్ వి.దుర్గాదాస్, హెచ్చెల్సీ ఎస్‌ఈ టీబీ రవిలతో పలుమార్లు చర్చించారు. విజయమ్మ మూడు సార్లు లేఖలు కూడా రాశారు. పీబీసీకి ఆలస్యంగా నీటిని విడుదల చేయడం, ఆ జలాలను ఎగువ ప్రాంత రైతులు మోటార్ల ద్వారా తోడేసుకోవడంతో పీబీసీ ఆయకట్టుకు నీరు అందక అన్నదాతలు ఇబ్బందుల పాలవుతున్నారని, దీన్ని అరికట్టాలని ఆమె కోరారు. కానీ.. ఇంజనీర్లలో స్పందన కరువైంది. మరోవైపు ఇటు సీజన్‌లో పంటలకు నీళ్లు అందకపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో సోమవారం ఎమ్మెల్యే విజయమ్మ ఆందోళనకు దిగడంతో పీబీసీ ఈఈ మునిరెడ్డి, హెచ్‌ఎల్‌సీ ఎస్‌ఈ రవి.. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్దకు వచ్చి ఆమెతో చర్చలు జరిపారు.
అప్పటిదాకా ఆగితే పంటలు ఎండిపోతాయి
ప్రస్తుతం హెచ్‌ఎల్‌సీలో నీటిమట్టం గణనీయంగా తగ్గిపోయిందని అధికారులు విజయమ్మకు వివరించారు. ఈ ఏడాది పీబీసీకి 2.46టీఎంసీల నీటిని కేటాయించామని, గత జూలైలో రెండు విడతలుగా 0.56 టీఎంసీల నీటిని విడుదల చేశామని, మిగతా 1.9 టీఎంసీల నీటిని త్వరలో విడుదల చేస్తామని పేర్కొన్నారు. ‘మీరు ఇచ్చేదాకా వేచి ఉంటే.. పంటలు ఎండిపోయే పరిస్థితి. ఆ నీటిని త్వరగా ఇవ్వాలి. ఎప్పుడు విడుదల చేస్తారో లిఖిత పూర్వక హామీ ఇవ్వండి’ అంటూ విజయమ్మ, పీబీసీ మాజీ నీటి సంఘం అధ్యక్షుడు రమణారెడ్డి పట్టుబట్టారు. లిఖిత పూర్వక హామీ ఇవ్వడానికి హెచ్‌ఎల్‌సీ ఎస్‌ఈ రవి ససేమిరా అన్నారు. దీంతో రైతులు అధికారులపై మండిపడ్డారు. తమకు కేటాయించిన నీటిని విడుదల చేసేవరకూ ఇక్కడి నుంచి అధికారులను కదలనివ్వబోమన్నారు. ఈ విషయాన్ని అనంతపురం జిల్లా కలెక్టర్‌కు తెలిపేందుకు ఎస్‌ఈ రవి ప్రయత్నించగా కలెక్టర్ అనారోగ్యం కారణంగా అందుబాటులోకి రాలేదు. చివరకు రాతపూర్వక హామీ ఇచ్చేందుకు అంగీకరించారు. అనంతపురంలోని హెచ్చెల్సీ కార్యాలయానికి వెళ్లి లిఖితపూర్వక హామీ పంపుతానని ఎస్‌ఈ చెప్పారు. ఆయన వెంట అవినాష్‌రెడ్డిని విజయమ్మ అనంతపురానికి పంపారు. ఆ కార్యాలయానికి వెళ్లి అవినాష్‌రెడ్డి లిఖితపూర్వక హామీ తీసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పులివెందుల ప్రజల సాగు, తాగునీటి అవసరాలను తీర్చడం కోసం కృషి చేసిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ విజయమ్మలకు కృతజ్ఞతలు తెలిపారు. సకాలంలో స్పందించిన అధికారులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు.
పీబీసీ కష్టాలు వైఎస్‌కు ముందే తెలుసు: విజయమ్మ
పీబీసీ ఆయకట్టు రైతుల సాగునీటి కష్టాలు దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డికి ముందే తెలుసని, అందుకే కృష్ణానది మిగులు జలాలను చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(సీబీఆర్)కు మళ్లించేందుకు పనులు చేపట్టారని ఎమ్మెల్యే వై.ఎస్.విజయమ్మ రైతులతో అన్నారు. మహానేతే ఉంటే ఈ పాటికి కృష్ణానది జలాలు సీబీఆర్‌కు చేరి ఉండేవన్నారు. తుంగభద్ర నుంచి పీబీసీకి నీటిని విడుదల చేయడంలో అధికారులు విఫలమయ్యారన్నారు. ఈ విషయమై డీఆర్‌సీ మీటింగ్‌లో ఇన్‌చార్జి మంత్రి కన్నా లక్ష్మీనారాయణతో చర్చించానన్నారు. అయితే ఇంతవరకూ పీబీసీ నీటిని విడుదల చేయలేదన్నారు. ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నోసార్లు అధికారులతో చర్చించారన్నారు. అయినా అధికారులు స్పందించలేదన్నారు. అనంతపురం జిల్లాకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేసిన అధికారులు.. పులివెందుల ప్రాంత రైతులపై వివక్ష చూపిస్తున్నారన్నారు. రైతుల ఓర్పును చేతగానితనంగా భావించి అధికారులు నీరు విడుదల చేయకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని విజయమ్మ హెచ్చరించారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను రాజకీయంగా ధీటుగా ఎదుర్కొనేందుకు తెలుగుదేశం పార్టీ వ్యూహారచన చేస్తున్న ట్లు తెలుస్తోంది. వైఎస్సార్ సతీమణిగా ఆమెకుండే ప్రజాధరణను దృష్టిలో పెట్టుకుని ఇక ఆమె చేసే ఆరోపణ లపై ఎంత మాత్రం ఉపేక్షించరాదని ఆ పార్టీ భావిస్తున్నదని సమాచారం. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని విజయమ్మ చేసిన ప్రసంగానికి సాధరణ ప్రజల నుంచి మంచి ఆదరణ లభించడంతో, టీడీపీ నాయకత్వాన్ని ఆలోచనల్లో పడేసి నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజయమ్మ టీడీపీ అధి నేత చంద్రబాబు నాయుడుపై అవినీతి ఆరోపణలు చేస్తూ పిటీషన్ దాఖలు చేయడంతో హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.
సీబీఐ విచారణ ప్రారం భంకానున్న నేపథ్యంలో విజయమ్మ ఇకపై చేసే అన్ని ఆరోపణలను ఎంత మాత్రం ఉపేక్షించరాదని నిర్ణయిం చారు. విజయమ్మ ఆరోపణలను ఇక నుంచి మహిళ శాస నసభ్యురాళ్ల చేత తిప్పికొట్టడం ద్వారా ప్రజలకు ఆమె చేస్తు న్నవన్నీ అవాస్తవమైన ఆరోపణలని తెలియజేసే అవ కాశం ఉంటుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్ విజయమ్మ తెలుగుదేశం పార్టీపై చేసిన పలు ఆరోపణలను ధీటుగా తిప్పికొట్టేందుకు సీతక్కను రంగంలోకి దింపిన టీడీపీ ఇప్పుడు అదే పద్దతిని పాటిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడలను చిత్తు చేయాలనే నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. విజయమ్మకు ధీటుగా టీడీపీ మహిళా శాసనసభ్యురాళ్లను రంగంలోకి దించాలన్నది ఆ పార్టీ నాయకత్వం వ్యూహాంగా కనిపిస్తోంది.
ఎంపిక చేసిన కొద్ది మంది మహిళ శాసనసభ్యు రాళ్లకు ఈ బాధ్యతలను అప్పగించాలని పార్టీ ఇప్పటికే ప్రాథమికంగా ఒక నిర్ణయాని కొచ్చినట్లు తెలుస్తోంది. తెలు గు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేస్తున్న శోభా హైమావతి ఆశించినస్థాయిలో దూకుడుగా ప్రదర్శించడంలో విఫలమయిందనే పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. విజయమ్మను రాజకీయంగా ఎదుర్కొనేందుకు దివంగత శాసనసభ్యుడు పరిటాల రవీం ద్ర సతీమణి పరిటాల సునీతను రంగంలోకి దించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించినట్లు సమాచా రం. రాష్ర్ట వ్యాప్తంగా పరిటాల సునీత పర్యటించి విజయమ్మ చేసిన ఆరోపణలు తిప్పికొడితే ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని పార్టీ నాయకత్వం ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. విజయమ్మ ఆరోపణలతో పాటు, వైఎస్సార్ హత్య రాజ ీయాలను సునీత ఎండగట్టేవిధంగా టీడీపీ పథక రచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మృతితో లభించే సానుభూతిని రాజకీయంగా ఉపయో గించాలని భావిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడను చిత్తు చేయడానికి అందుబాటులో ఉన్న అన్ని అవకా శాలను ఉపయోగించుకోవాలని టీడీపీ నేతలు నిర్ణ యించారు. అందులో భాగంగానే విజయమ్మ చేస్తున్న ఆరోపణలపై మహిళ శాసనసభ్యురాళ్లు ఎదురుదాడి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. విజయమ్మ ప్రసంగంపై అసెంబ్లీలో సీతక్కతో చేసిన ప్రయోగం విజ యవం తం కావడంతో, ఇప్పుడు అదే ఫార్మూలాననుసరిం చాలన్నదే ఆ పార్టీ వ్యూహాంగా కనిపిస్తోన్నది. మహిళా శాసనసభ్యురాళ్లు పరిటాల సునీత, ఉమా మాధవరెడ్డి, సీతక్క, సీతా దయాకర్‌రెడ్డి, అన్నపూర్ణమ్మ, సత్యవతి రాథోడ్‌లతో విజయమ్మ చేసే ఆరోపణలపై ఎదురుదాడి చేయించాలన్నదే పార్టీ వ్యూహామని ఆ పార్టీ ముఖ్య నాయకుడొకరు తెలిపారు.తెలంగాణ జిల్లాలో సీతక్క, సీతాదయాకర్‌రెడ్డి, అన్నపూర్ణమ్మ, ఉమామాధవరెడ్డి, సత్యవతి రాథోడ్‌లు పర్యటించి పార్టీపై , అధినేతపై విజయమ్మ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేలా చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకత్వం నిర్ణయించిదని వెల్లడించారు.

రైతుల అజెండా జాతీయ అజెండా కావాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు తమ శరీరంలో రక్తపు బొట్టు ఉన్నంత వరకు పోరాటాలు సాగిస్తామని భరోసా ఇచ్చారు. రైతుపోరు కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు కర్నూలు జిల్లాలో చంద్రబాబునాయుడు పాదయాత్రను ప్రారభించారు. జిల్లాలోని ఆలూరు అసెంబ్లిd పరిధిలోని మండల కేంద్రమైన ఆస్పరి నుంచి పత్తికొండ వరకు కరవు ప్రాంతాల్లో చంద్రబాబునాయుడు పాదయాత్ర నిర్వహించారు. దారిపోడవున ఉల్లి, పత్తి, వేరుశనగ, పంటలను పరిశీలించి రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పరిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ దేశంలో అందరూ ఆనందంగా ఉండాలని ఆశించారన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 65 సంవత్సరాలు దాటినా రైతుల పరిస్థితి మాత్రం మెరుగు పడటం లేదన్నారు. బలహీన వర్గాలకు ఆదరణ కరువైందన్నారు. రాష్ట్రంలో రైతాంగం ఇబ్బందుల్లో కూరకపోయిందన్నారు. ఏ రైతు కూడా ఆనందంగా లేడని, అప్పులపాలై జీవితాన్ని దుర్భరంగా సాగిస్తున్నారన్నారు. దిక్కుమాలిన ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. సంవత్సరానికి ఐదు సార్లు ఎరువుల ధరలు పెంచారని, యూరియా, పోటాష్ దొరకడం లేదన్నారు. కూరగాయలు, డిజీల్ ధరలు పెరగడంతో వ్యవసాయం చేయడమే రైతులకు భారంగా మారిందన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫారస్‌లను అమలు చేయాలని, రైతులకు ఎకరాకు రూ.పదివేలు నష్ట పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. రచ్చబండ కార్యక్రమం రచ్చరచ్చగా మారింద ని విమర్శించారు. సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం చెందిందని చంద్రబాబు ఆరోపించారు. ఖరీఫ్‌లో ఆకాల వర్షాల వలన పంటలు దెబ్బతిన్నాయని, సాగు చేసిన పంటలు చేతికందక రైతులు అప్పుల పాలైందన్నారు. ఎవరి కోసం వ్యవసాయం చేయలాంటూ దేశానికి అన్నం పెట్టే రైతన్న ఆవేదన చెందుతున్నారని, మరికొంత మంది ఆకలితో ఆలమటిస్తూ, అప్పుల భారం భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. రైతులకు అండగా ఉండేందుకే తాను, రైతుపోరు బాట పట్టానని, రైతుల అజెండా జాతీయ అజెండా కావాలన్నారు. పెరిగిన ఖర్చుతో చేతగాని దద్దమ్మ ప్రభుత్వం గద్దె దిగాలన్నారు. అప్పుడు సమస్యలు ఎలా పరిష్కారం కావో? తాము చూస్తామన్నారు. రైతులకు న్యాయం జరగాలన్నదే తమ లక్ష్యమని, రైతుల కోసం తన ఆఖరి బొట్టు వరకు పోరాటం సాగిస్తామన్నారు. ఈ ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని, అవసరమైతే రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లు, వాహనాలను పెట్టి, తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. రైతుల జీవితాలు బాగుపడే వరకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం మెడలు వంచి, రైతులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు.
ముఖ్యమంత్రి రూపాయికి కిలో బియ్యం అంటూ పురుగులు పట్టి, పుచ్చిపోయిన బియ్యాన్ని సరఫరా చేస్తున్నారన్నారు. చేతగాని, అసమర్థ, పనికిమాలిన ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలు సిధ్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం కేంద్రం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే విధంగా వారి గుండెల్లో నిద్రపోవాలని ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు రైతాంగానికి పిలుపునిచ్చారు. అనంతరం దేవరబండ, చిన్నహుల్తీ గ్రామాల మీదుగా 16 కి.మీ దూరంలోని పత్తికొండకు చేరుకుని, అక్కడ బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కోడెల శివప్రసాద్, టీడీపీ జిల్లా అద్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు, ఆదోని ఎంఎల్‌ఎ మీనాక్షినాయుడు, పత్తికొండ శాసన సభ్యుడు కెయి ప్రభాకర్ , నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు బివి మోహన్‌రెడ్డి, బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ఫరూక్, భాస్కర్ రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, ఇరిగెల రాంపుల్లారెడ్డి, వైకుంఠ శివప్రసాద్, రాంభూపాల్‌చౌదరి, మణిగాంధీ, మాజీ ఎంఎల్‌సి మసాల పద్మజ, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బత్తినవెంకట్రాముడు, జి.కిష్ణమ్మ, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

మైనింగ్ అక్రమాలలో అరెస్ట్ అయిన గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఆర్ ఆర్ గ్లోబల్ కంపెనీ తన కంపెనీలో పెట్టుబడులు పెట్టిన మాట వాస్తవమేనని కడప ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అంగీకరించారు. ఓబులాపురం మైనింగ్ కార్పొరే షన్‌కు తొలుత భూములు కేటాయించింది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబే అని ఈ కేసులో ఆయనను కూడా విచారించాలని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కు మారుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఓఎంసికి భూములు కేటాయిస్తూ జారీ చేసిన జీవో (80)నకలును సీబీఐ జాయింట్ డైరక్టర్ లక్ష్మీనారాయణకు అందజేశారు.
ఓఎంసి కేసులో తమ విచారణకు హాజరై సాక్ష్యం ఇవ్వాల్సిందిగా సీబీఐ నోటీసులు జారీచేయడంతో శుక్రవారం నాడు సీబీఐ కార్యాలయానికి హాజరైయ్యారు. ఉదయం పదిగంటల నలభై నిమిషాలకు జగన్ వెనుక గేటు ద్వారా సీబీఐ కార్యాలయంలోకి ప్రవేశించారు. ప్రధాన ద్వారం వద్ద భారీఎత్తున మీడియాతో పాటు వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు గుమికూడి ఉండటంతో సీబీఐ అధికారులే ఆయనకు ఫోన్ చేసి వెనుకవైపు మార్గంలో రమ్మంటూ సూచించారు.
జగన్ అక్కడకు చేరుకునే సమయానికి గేటు తెరవడంతో ఆయన నేరుగా కారులోనే కార్యాలయంలోకి వెళ్ళిపోయారు. ఈ సందర్భంగా జగన్ వెంట కొందరు శాసన సభ్యులు, పార్టీ నాయకులు వేరువేరు కార్లలో వచ్చినప్పటికీ పోలీసులు వారి వాహనాలను లోనికి అనుమతించలేదు. దాదాపు రెండున్నర గంటల అనంతరం విచారణ ముగించుకుని బైటకు వచ్చిన జగన్ అప్పటికే అక్కడ ఎదురు చూస్తున్న మీడియాకు తాను చెప్పదలుచుకున్నది చెప్పి వెళ్ళిపోయారు. ఈ సందర్భంగా ఆయనను మరికొన్ని ప్రశ్నలడిగేందుకు మీడియా ప్రతినిధులు ఎంతగా ప్రయత్నించినా ఆయన మాట్లాడేందుకు నిరాకరించి వెళ్ళిపోయారు.
చట్టప్రకారం పెట్టుబడులు ఎవరైనా ఏ కంపెనీలోనైనా పెట్టవచ్చు. కాగా సీబీఐ కార్యాలయంలోకి ప్రవేశించిన తరువాత సుమారు అరగంట పాటు అధికారులు జగన్‌ను కేవలం మర్యాదపూర్వకంగానే మాట్లాడారని తెలిసింది. అయితే ఏదైనా కేసులో సాక్షులను కార్యాలయానికి పిలిపించినప్పుడు వారి మనసుల్లో ఎలాంటి సందేహాలు, బెరుకు ఉండకుండా ప్రశాంతంగా తమకు తెలిసిన విషయాలు చె ప్పేందుకు తామే అలాంటి ఫ్రెండ్లీ వాతావరణం సృష్టిస్తామని సీబీఐ అధికారి ఒకరు చెప్పారు.
ఆ తరువాత ఓఎంసి కేసులో ఎందుకు సాక్షిగా పిలువాల్సివచ్చిందో వివరించిన అధికారులు గాలి జనార్దన్ రెడ్డి గురించి, ఆయన బినామీ సంస్థలుగా భావిస్తున్న ఆర్.ఆర్.గ్లోబల్ వంటి సంస్థలు సాక్షిగ్రూప్‌లో పెట్టిన పెట్టుబడుల గురించి పలురకాలుగా ప్రశ్నించినట్లు తెలిసింది.
అధికారులడిగిన ఒకటి రెండు ప్రశ్నలకు తప్ప మిగిలిన ప్రశ్నలన్నింటికీ జగన్ ముక్తసరిగా, క్లుప్తంగా సమాధానాలు చెప్పినట్లు తెలిసింది. ముఖ్యంగా వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో గనుల లీజుల విషయంలో అప్పటి మంత్రులు, అధికారులపై తెరవెనుకనుంచి మీరే ఒత్తిడి తీసుకువచ్చినట్లుగా అందిన సమాచారంపై సీబీఐ అధికారులు అడిగిన ప్రశ్నలకు నాకేం సంబంధం నేను ఒత్తిడి చేస్తే అనుమతులు ఇచ్చామని మీకు చెప్పిన మంత్రులు, అధికారులెవరు అంటూ ఎదురుదాడి చేసినట్లు తెలిసింది. వారికి ఎవరినుంచో వత్తిడులు వస్తే అది నేనే అని ఎలా అనుకుంటారు అని కూడా ఆయన ప్రశ్నించినట్లు తెలిసింది.
ఆర్.ఆర్.గ్లోబల్ అనే సంస్థ 90 కోట్ల రూపాయలు తన సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన మాట వాస్తవమే కాని అవి గాలిజనార్దన్ రెడ్డికి సంబంధించినవి అన్న సంగతి తనకు తెలియదని జగన్ స్పష్టం చేశారని తెలిసింది. ఒక కంపెనీకి ఛైర్మన్‌గా నా కంపెనీలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు వచ్చినా నా అవసరాల మేరకు అంగీకరిస్తా…ఆ వ్యక్తి చట్టప్రకారమే ఆ డబ్బు నా కంపెనీలో పెడుతున్నాడా లేదా అని చూస్తాం తప్ప అతడెవరు, అతడి వెనుకున్నది ఎవరు అని చూడం కదా….ఇదీ అలాగే జరిగింది అని ఆయన సమాధానం ఇచ్చినట్లు తెలిసింది.
గాలిజనార్దన్ రెడ్డితో మీకు ఏ విధమైన సాన్నిహిత్యం ఉంది అన్న ప్రశ్నకు కూడా జగన్ కాస్త అసహనంగానే సమాధానం చెప్పారని తెలిసింది. ఒక పారిశ్రామిక వేత్తగా ఆయనను నాలుగైదు సార్లు ప్రైవేటు పార్టీలలో కలిశాను….మా మధ్య వ్యాపారాల గురించి సంభాషణలు తప్ప ఇంకేమీ జరుగలేదు అని ఆయన చెప్పారని తెలిసింది. అయితే అదే గాలిజనార్దన్ రెడ్డి జగన్ నా తమ్ముడు అతడిని రాజకీయకక్షతో ఇబ్బందులు పెడుతున్నారు అని బహిరంగంగానే ప్రకటించారు కదా అన్న మరో ప్రశ్నకు గట్టిగా నవ్విన జగన్ ఆయనేదో సానుభూతిగానో, మా నాన్నగారితో ఆయనకున్న సాన్నిహిత్యంతోనో అలా అని ఉండవచ్చు అని సమాధానం ఇచ్చారని తెలిసింది. అంతేకాకుండా ఆయన (వైఎస్ రాజశేఖర్ రెడ్డి) ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఈయన (గాలిజనార్దన్ రెడ్డి) పక్కరాష్ట్రానికి చెందిన మంత్రి వీరిద్దరికీ మధ్య సాన్నిహిత్యం ఉంటే ఉండవచ్చు దానిని నాకు, నా కంపెనీలకు ఎలా ముడిపెడతారు, ఆయనగారు చేసిన అన్ని పనులలోనూ నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తారు అని ఆయన ప్రశ్నించారని తెలిసింది.
ఇదిగో జీవో… బాబునూ విచారించండి
అదే సమయంలో సీబీఐ అధికారులు తిరిగి ఓఎంసి భూముల లీజుపై ప్రశ్నలు వేయడం ప్రారంభించడంతో గాలిజనార్దన్ రెడ్డికంపెనీకి 2002 వ సంవత్సరంలో 64.2 ఎకరాల భూమిని మైనింగ్ కోసం లీజుకిచ్చింది చంద్రబాబు నాయుడే అని అంటూ అందుకు సంబంధించిన జీవో (నెంబర్ 80) నకలును తీసి అందజేశారు. 1996లో రామ్మోహన్ అనే వ్యక్తికి కేటాయించబడిన ఆ భూమిలో సకాలంలో మైనింగ్ జరుపడంలో రామ్మోహన్ విఫలం కావడంతో ఆ లీజు రద్దుచేసి ఓఎంసికి అప్పగిస్తూ2002లో చంద్రబాబే స్వయంగా ఆదేశాలు జారీ చేశారని, తన తండ్రి ముఖ్యమంత్రి అయిన తరువాత ఆ కంపెనీకి మరికొన్ని భూముల కేటాయింపులు, వాటిలో మార్పులు జరిగాయి తప్ప తన తండ్రి హయాంలోనే ఓఎంసి లీజులు ప్రారంభం కాలేదని జగన్ వివరించినట్లు తెలిసింది.
ఇప్పుడు ఈకేసులో తనను పిలిపించి సాక్షిగా విచారిస్తున్నట్లుగానే తొలుత లీజు మంజూరు చేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కూడా పిలిపించి విచారించాలని ఆయన సీబీఐ అధికారులను కోరారు. తన తండ్రి అధికారంలో ఉండగా తాను రాష్ట్రంలో అధికారులపైన, లేక మంత్రులపైన ఎలాంటి ఒత్తిడిలు తీసుకురాలేదని జగన్ సీబీఐ అధికారులకు స్పష్టం చేసినట్లు తెలిసింది. దాదాపు రెండు గంటల పాటు ఓఎంసి కేసులో పలురకాలుగా ప్రశ్నించి ఆయనిచ్చిన సమాధానాలను పూర్తిగా రికార్డు చేసిన అనంతరం అందుకు సంబంధించిన రాతప్రతులలో ఒక కాపీ జగన్‌కు అందజేశారు. అంతేకాకుండా అందులో పేర్కొన్న అంశాలన్నీ తాను తన అంతరాత్మ సాక్షిగా మనస్పూర్తిగా చెప్పినవే అని ఆ విషయంలో తనపై ఎవరి బలవంతంకాని, ఒత్తిడి కాని లేవని కూడా జగన్ నుంచి వ్యక్తిగత ప్రమాణపత్రంపై సంతకం చేయించుకున్నారు. ఈ సందర్భంగా జగన్ విచారణ ప్రక్రియను మొత్తం వీడియో రికార్డ్ చేయించారు.
అనంతరం సీబీఐ కార్యాలయం నుంచి బైటకు వచ్చిన జగన్ అప్పటికే అక్కడ ఎదురుచూస్తున్న మీడియాతో కొద్దిసేపు మాట్లాడారు. ముఖ్యంగా ఓఎంసి కంపెనీకి చంద్రబాబు హయాంలోనే భూముల కేటాయింపు జరిగిందని, తన తండ్రి హయాంలో వాటిలో మార్పులు చేర్పులు మాత్రమే జరిగాయని తాను సీబీఐ అధికారుల దృష్టికి తీసుకువెల్ళినట్లు మీడియాకు చెప్పారు. అందుకు సంబంధించిన (జీవో నెంబర్ 80) కాపీని మీడియాకు చూపుతూ ఇదిగో దాని ఆధారం కూడా వాళ్ళకి (సిబీఐ) ఇచ్చా…ఆ కేసులో చంద్రబాబునాయుడుని కూడా విచారించాలని డిమాండ్ చేశా అని చెప్పారు.
మీడియా ప్రశ్నలకు జవాబివ్వని జగన్
సీబీఐ విచారణకు హాజరయిన జగన్ మీడియాకు తాను చెప్పవలసింది తాను చెప్పారే తప్ప, మీడియా ప్రశ్నలకు బదులు ఇవ్వలేదు. తనకు గిట్టని మీడియాను ఎల్లో మీడియాగా ముద్ర వేసిన జగన్.. గాలి జనార్దన్‌రెడ్డి కంపెనీలు తన కంపెనీల్లో ఎలా పెట్టుబడి పెట్టారు? గాలి తన బ్రహ్మణీ స్టీల్స్ శంకుస్థాపన సందర్భంగా ఇచ్చిన బస్సు సంగతేమిటి? మీకు మద్దతుగా గాలి అనేకసార్లు మాట్లాడారు కదా? అన్న ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండా అసహనంగా వారిపై చూసి కారెక్కి వెళ్లిపోయారు. గతంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు డీఎస్ ఇదే సీబీఐ విచారణకు హాజరయిన సందర్భంలో మీడియాతో సవివరంగా మాట్లాడిన విషయం తెలిసిందే.
అయితే.. ఈ సందర్భంగా జగన్ కొన్ని టెలివిజన్ ఛానళ్లు, పత్రికలపై నేరుగా వ్యాఖ్యలు చేశారు. దాదాపు సంవత్సరంన్నర కాలంగా జరుగుతున్న ఈ కేసు దర్యాప్తులో కొద్దిరోజుల క్రితం హోంమంత్రిని విచారించిన సెక్షన్ల ప్రకారం సీబీఐ నన్నూ విచారణకు పిలిచింది. ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం సాక్ష్యం చెప్పేందుకు రమ్మని నోటీసు పంపారు. అయితే రెండు ఛానళ్ళు, వాటికి సంబంధించిన పత్రికలతో పాటు కొద్దిరోజుల క్రితమే వారితే జతకట్టిన టీవీ ఛానల్‌లో మాత్రం సీబీఐ నోటీసు ఇచ్చారని, ఇక ఏదో జరిగిపోతుందని, అంతా అయిపోయిందన్న తరహాలో కథనాలు, కథలు ప్రసారం చేశారంటూ ఆక్రోశం వ్యక్తం చేశారు. జర్నలిజంలో నైతిక విలువలు పాటించాలి కదా అంటూ చిన్నపాటి క్లాసు కూడా ఇచ్చి మీడియా ప్రతినిధులు మరిన్ని ప్రశ్నలు వేసేందుకు అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈసందర్భంగా జగన్ వెంట ఎంపి రాజమోహన్ రెడ్డి, సబ్బం హరి, శాసన సభ్యులు గొల్లబాబూరావు, టి.బాలరాజు తదితరులు ఉన్నారు.
సాక్షిగానే పిలిచాం..సాక్ష్యం రికార్డ్ చేశాం..
ఇదిలా ఉండగా ఓఎంసి కేసులో సాక్షిగా మాత్రమే జగన్‌కు నోటీసు ఇచ్చామని సీబీఐ జాయింట్ డైరక్టర్ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారమే ఆయనకు నోటీసిచ్చాం…ఆ ప్రకారమే ఆయన వచ్చి సాక్ష్యం చెప్పి వెళ్ళారు..ఆయన చెప్పినదానిపై సమగ్ర విశ్లేషణ జరిపిన తరువాత మా నిర్ణయం ఉంటుంది అని ఆయన చెప్పారు.అదే విధంగా ఓఎంసికి భూముల కేటాయింపులకు సంబంధించి జగన్ ఒక (జీవో 80)నకలు తమకు అందజేశారని దాని అసలు పత్రాలను, అనుబంధ పత్రాలను కూడా తెప్పించుకుని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత ఆయన డిమాండ్‌పై స్పంధిస్తామని లక్ష్మీనారాయణ మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
జగన్ డిమాండ్ చేసినట్లుగా చంద్రబాబును కూడా విచారించే అవకాశం ఉందా అన్నప్రశ్నకు ఎవరో ఎదో చెప్పగానే మేమెలా చేస్తాం….ఆయన వద్ద (జగన్)ఉన్న సమాచారం మాకు ఇచ్చారు..దానిని అధ్యయనం చేసిన తరువాత ఇంకా ఎవరినైనా విచారించాలా లేదా అన్నది నిర్ణయిస్తామని ఆయన చెప్పారు. ఓఎంసి కేసులో దర్యాప్తు చివరి దశకు చేరుకుందని వచ్చే నెలలో చార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉందని ఆ దిశగా దర్యాప్తు చురుకుగా సాగుతోందని లక్ష్మీనారాయణ చెప్పారు.
జీవో కాపీ ఇచ్చా
గాలి జనార్దనరెడ్డి కంపెనీకి 2002వ సంవత్సరంలో 64.2 ఎకరాల భూమిని మైనింగ్ కోసం లీజుకిచ్చింది చంద్రబాబు నాయుడే. ఇదిగో ఇందుకు సాక్ష్యం. చంద్రబాబునాయుడు స్వయంగా జారీ చేసిన ఉత్తర్వులు ఇవి. 1996లో రామ్మోహన్ అనే వ్యక్తికి ేకటారుుంచిన భూమిలో సకాలంలో మైనింగ్ జరగలేదు. దీంతో రామ్మోహన్‌కి ఇచ్చిన లీజును రద్దుచేసి ఆ భూములను ఓఎంసికి అప్పగిస్తూ2002లో చంద్రబాబే స్వయంగా ఆదేశాలు జారీ చేశారు. ఆ జీవో ప్రతిని సీబీఐకి ఇచ్చాను. బాబును ప్రశ్నించాలని కోరాను.
సాక్షిగానే పిలిచాం
ఓఎంసి ేకసులో సాక్షిగా మాత్రమే జగన్‌కు నోటీసు పంపాం. ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారమే ఆయనకు నోటీసిచ్చాం…ఆ ప్రకారమే ఆయన వచ్చి సాక్ష్యం చెప్పి వెళ్ళారు.. ఆయన చెప్పినదానిపై సమగ్ర విశ్లేషణ జరిపిన తరువాత మా నిర్ణయం ఉంటుంది. ఓఎంసికి భూముల ేకటారుుంపులకు సంబంధించి జగన్ ఒక (జీవో 80) ప్రతిని అందజేశారు. దాని అసలు పత్రాలను, అనుబంధ పత్రాలను కూడా తెప్పించుకుని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత ఆయన డిమాండ్గపై తగిన విధంగా స్పందిస్తాం.