కడప
టీడీపీ అభ్యర్థి బ్రహ్మయ్య
ఉప ఎన్నికల్లో రాజకీయ లబ్దికోసం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తాను పోటీ చేయడం లేదని ప్రజాసేవకోసమే ఎన్నికల్లో ముందుకు వచ్చానని తనకు మద్దతిచ్చి గెలిపించాలని రాయవరం పంచాయితీలోని ఓటర్లను తెలుగుదేశం పార్టీ బ్రహ్మయ్య కోరారు. రాయవరం శీనేపల్లె, కావలిపల్లె, బోనంవాండ్లపల్లె, దేవాండ్లపల్లె, ఎగువ, దిగువ, కొత్తజంగంపల్లెలు, గుంతరాచపల్లె,కుడుంవాండ్లపల్లె, మిట్టమీదపల్లెల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు గురువారం ప్రతి ఇంటికి తిరిగి ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మారు మూల గ్రామాలైన కావలిపల్లె, బోనంవాండ్లపల్లె, శీనేపల్లెల్లో పలువురు తాగునీరు, రోడ్ల సమస్యలను ఆయన దృష్టికి తేవడంతో ఇలాంటి గ్రామాలు తాను మొదటిసారిగా చూస్తున్నానని తనకు ఎన్నికల్లో మద్దతివ్వండి తాను సమస్యలు పరిష్కరించి చూపిస్తానని ఆయా గ్రామాల్లో ప్రజలను కోరారు. ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చి గెలిపించాలని కోరారు. ఇంటింటి ప్రచారంలో ఆయన వెంట మహేష్‌నాయుడు, మండలంలోని టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
రాయవరంలో భారీ ర్యాలీ:
మండల పరిధిలోని రాయవరంలో ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ బుధవారం భారీ ర్యాలీ నిర్వహించింది. రాయవరం బస్టాండు ప్రాంతం నుంచి ప్రధాన వీధిలో నాయకులకు ఆ గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. ర్యాలీలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బ్రహ్మయ్య, మహేష్‌నాయుడు, టీడీపీ మండల అధ్యక్షుడు శివకుమార్‌నాయుడు, వేములయ్య, సుబ్బరామరాజుతో పాటు పలువురు నాయకులు, యువకులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో భానుడు ఉగ్రరూపం దాల్చాడు. రాష్ట్రం నిప్పుల కొలిమిగా మారింది. ప్రచండబానుడిదాటికి ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడదెబ్బతో 10మంది మృతిచెందారు. ఉదయం ఏడు గంటలనుంచే వేసవి ప్రతాపం చూపుతోంది. ఇళ్లలో విద్యుత్ వాడకం కూడా భారీగా పెరుగుతోంది. పలు జిల్లాల్లో విద్యుత్ కోతలు కూడా మళ్లీ మొదలయ్యాయి. బుధవారం హైదరాబాద్‌లోనూ అనధికారికంగా 3 గంటల విద్యుత్ కోత విధించారు. రాష్టవ్య్రాప్తంగా బుధవారం ఉష్ణోగ్రతలు తీవ్రరూపం దాల్చాయి. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు. ఈ సమయంలో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటాయి.
తెలంగాణతోపాటు రాయలసీమ జిల్లాల్లోనూ 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో సాధారణం కంటే 3 డిగ్రీలు, కోస్తోంధ్ర, రాయలసీమలో 1 నుంచి 3 డిగ్రీలు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదువుతన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం రెంటచింతలలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వ్యవసా య రంగానికి ప్రాణధారమైన నైరుతి రుతుపవనాలు జూన్ 1 కల్లా కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ విభాగం ప్రకటించిన విషయం తెలిసిందే. రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకేవరకు ఇదే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంటుందని అధికారులు చెబుతున్నారు. ఈసారి సాధారణ తేదీ కన్నా కొంత ఆలస్యంగా దక్షిణ అండమాన్ సముద్రంలో రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు.

అక్రమార్జన కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డికి సిబిఐ కోర్టు జారీ చేసిన సమన్లను ఆశాఖ అధికారులు సోమవారం అందజేశారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఉన్న జగన్‌ను హైదరాబాద్ నుంచి వచ్చిన ముగ్గురు సిబిఐ అధికారులు కలిశారు. జగన్ బసచేసిన అతిథి గృహంలో కలిసి సిబిఐ కోర్టు జారీచేసిన సమన్లు అందజేశారు. ఈ నెల 28వ తేదీ ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని సిబిఐ కోర్టుకు తమ న్యాయ వాది ద్వారా హాజరై వాదనలు వినిపించుకోవాలని ఆ సమన్లలో పేర్కొన్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా సిబిఐ కోర్టు జారీచేసిన సమన్లు అందజేసేందుకు ఆశాఖ అధికారులు ఎమ్మిగనూరు వస్తున్నట్లు మూడు రోజులుగా ప్రచారం జరిగింది. అయితే సోమవారం ఎమ్మిగనూరు చేరుకున్న ముగ్గురు సిబిఐ అధికారులు నేరుగా జగన్‌ను కలిసి కోర్టు జారీచేసిన సమన్లు అందజేశారు. కాగా సమన్లు అందుకున్న జగన్ తన సన్నిహితులు, న్యాయవాదులతో దీనిపై చర్చించినట్లు తెలుస్తోంది. కోర్టుకు హాజరయ్యే విషయంలో చాలాసేపు తమ న్యాయవాదులతో జగన్ చర్చించినట్లు తెలుస్తోంది. మరో వైపు 28వ తేదీ విచారణకు హాజరు కావాలా లేక మరి కొంత గడువు కోరుదామా అన్న దానిపై సైతం పార్టీ నాయకుల్లో చర్చ జరిగినట్లు సమాచారం. కోర్టుకు హాజరయ్యాక తదనంతర పరిణామాలపై సైతం పార్టీ నాయకుల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

సాక్షి టీవీ, పత్రిక, జననీ ఇన్‌ఫ్రా బ్యాంక ఖాతాల స్తంభన
పత్రికా స్వేచ్ఛకు గొడ్డలిపెట్టన్న సాక్షి యాజమాన్యం
అక్రమ ఆస్తుల కేసులో సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి అన్నిదారులు మూతపడుతున్నాయి. ఆయన ఆర్థిక మూలాలను కూడా దర్యాప్తు సంస్థలు వెంటాడుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, జననీ ఇన్‌ఫ్రాలకు చెందిన బ్యాంక్ ఖాతాలను స్తంభింప చేస్తూ మంగళవారం సీబీఐ నోటీసులను జారీ చేసింది. రోజుకో కోణంలో సీబీఐ జగన్‌ను ఇరుకున పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలతో జగన్ గిలగిలలాడే పరిస్థితి నెలకొంది. జగన్ నెలకొల్పిన కంపెనీలు, అందులోకి వచ్చిన పెట్టుబడుల వరద తదితరాలపై సీబీఐ గడచిన ఏనిమిది మాసాలుగా దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. సుదీర్ఘంగా విచారణ జరిపిన సీబీఐ ఆస్తుల కేసులో జగన్‌ను ఏ1 గా పేర్కొంది. కంపనీలలోకి నిధుల వరదకు ప్రధాన భూమికను పోషించారన్న అభియోగంపై ఏ2 నిందితుడిగా పేర్కొన్న జగతి పబ్లికేషన్ వైస్ చైర్మన్ వి. విజయసాయిరెడ్డిని సీబీఐ అరెస్టు కూడా చేసింది. ఈ కేసులో విచారణకు ఈ నెల 28 వ తేదీన కోర్టుకు హాజరు కావాలంటూ జగన్‌కు సోమవారం సమన్లు కూడా జారీ అయ్యాయి. తాజాగా జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్, ఇందిరా టెలివిజన్, జననీ ఇన్‌ఫ్రా సంస్థలకు చెందిన బ్యాంక్ ఖాతాలను స్తంభింప చేస్తూ మంగళవారం సీబీఐ నోటీసులు జారీ చేసి సీబీఐ తన అమ్ములపొదిలోని మరో అస్త్రాన్ని ప్రయోగించింది.
వైఎస్ జగన్మోహన్‌రెడ్డి 2004 నుంచి 2009 వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాధినేతను అడ్డు పెట్టుకుని తన వారు అనుకున్న వారందరికీ మేళ్ళు చేయించారు. ఫలితంగా ప్రభుత్వం నుంచి లబ్ధిపొందిన పలువురు జగన్ ఏర్పాటు చేసిన పలు కంపెనీలలో పెట్టుబడులు పెట్టారు. ఈ విషయాలన్నింటిపై సంపూర్ణ సాక్ష్యాలను సేకరించిన సీబీఐ ఆయనకు సంబంధించిన కొన్ని సంస్థల ఖాతాలను స్తంభింప చేస్తున్నట్లు పేర్కొంది. సెజ్‌లు, జలయజ్ఞం కాంట్రాక్టులు, భూ కేటాయింపులు తదితర వాటి ద్వారా లబ్ధి పొందిన వారే జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టారని, ఇది కేవలం నల్ల ధనాన్ని తెల్లధనంగా చూపించుకునేందుకు చేసిన ప్రయత్నమేనని సీబీఐ పలు సందర్భాలలో కోర్టుకు వివరించింది. వాన్‌పిక్, రాంకీ, హెటిరో డ్రగ్స్, అరబిందో డ్రగ్స్ లాంటి పలు సంస్థలు గత ప్రభుత్వం నుంచి లబ్ధి పొందాయని, అవే సంస్థలు జగన్ కంపెనీలలో పెట్టుబడులు భారీ ఎత్తున పెట్టినట్లు సీబీఐ సాక్ష్యాలను కూడా సేకరించింది. జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టినట్లుగా పేర్కొన్న కొన్ని సంస్థల చిరునామాలు ఒకటేనని, మరికొన్ని సంస్థలకు చిరునామాలు తప్పని సీబీఐ దర్యాప్తులో తేలింది. కొన్ని కంపెనీలలోకి విదేశాల నుంచి కూడా పెట్టుబడులు వచ్చినట్లు గుర్తించినా ఆ కంపనీలన్నీ అజ్ఞాతంలోనివేనని సీబీఐ పేర్కొంది. దీంతో అనుమానాస్పద వనరుల నుంచి పెట్టుబడులు వచ్చినట్లు గతంలోనే సీబీఐ కోర్టుకు తెలిపింది.
ఇవే ఆధారాలను పేర్కొంటూ బంజారాహిల్స్‌లోని భారతీయ స్టేట్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ మేనేజర్లకు మంగళవారం నోటీసులు అందించిన సీబీఐ జగతి పబ్లికేషన్, ఇందిరా టెలివిజన్, జననీ ఇన్‌ఫ్రా సంస్థలకు సంబంధించిన ఖాతాల లావాదేవీలను నిలుపు చేయాలని కోరింది. నోటీసులను సీఆర్‌పీసీ సెక్షన్ 102 చట్టం కింద జారీ చేసినట్లు సీబీఐ పేర్కొంది. ఈ సంస్థలలోకి వచ్చిన నిధుల వెనుక భారీ అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని, అవినీతి సొమ్మును నిలుపు చేయడంలో తమకు అధికారం ఉందంటూ సీబీఐ పేర్కొంది. ఈ మూడు సంస్థలలోకి అనుమానాస్పద వనరుల నుంచి పెట్టుబడులు వచ్చినట్లు పలు ఆరోపణలున్నాయని, ఈ నేపథ్యంలో ఖాతాలను స్తంభింప చేయాల్సిందేనని సీబీఐ స్పష్టం చేసింది.
ప్రెస్‌కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తాం
జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్లకు సంబంధించిన బ్యాంక్ ఖాతాలను స్తంభింప చేస్తూ సీబీఐ జారీ చేసిన నోటీసులు పత్రికా స్వేచ్ఛకు గొడ్డలి పెట్టని సాక్షి యాజమాన్యం పేర్కొంది. సీబీఐ వేధింపు చర్యలపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఫిర్యాదు చేయనున్నట్లు యాజమాన్యం స్పష్టం చేసింది. సాక్షి పత్రికకు, టీవీ ఛానళ్ళకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలలో ఉన్న ఆధరణను తగ్గించేందుకే ప్రభుత్వం సీబీఐ ద్వారా నోటీసులను జారీ చేయిందని, తాము మరింత పట్టుదల, దీక్షతో పాఠకులకు, వీక్షకులకు ఏ మాత్రం ఇబ్బందులు కలిగించకుండా ముందుకు తీసుకు వెళ్తామని పేర్కొన్నారు. ఏ సంస్థకు సంబంధించిన బ్యాంక్ ఖాతాలను స్థంభింప చేయాలనుకున్నప్పుడు ముందుగా నోటీసులు జారీ చేయాల్సి ఉంటుందని, సీబీఐ ఇవేవీ చేయకుండా ఏకపక్షంగా బ్యాంకులకు నోటీసులను జారీ చేసిందని యాజమాన్యం ఆరోపించింది. సీబీఐ నోటీసుల వల్ల సాక్షి పత్రిక ప్రచురణకు, టీవీ ఛానల్ ప్రసారాలకు ఎలాంటి ఆటంకం ఉండబోదని, ఏజంట్లు, ప్రకటనకర్తలు, పాఠకులు ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని యాజమాన్యం పేర్కొంది.

కోర్టు అనుమతి తీసుకున్న సీబీఐ
వైఎస్ రాజశేఖర్‌డ్డి బతికి ఉన్నన్నాళ్లు ఆయనకు నీడగా వెన్నంటి ఉండటంతోపాటు, వ్యక్తిగత సహాయకునిగా పనిచేసిన సూరీడు వాంగ్మూలాన్ని జగన్ కంపెనీల కేసులో రికార్డు చేయాలని సీబీఐ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు నాంపల్లిలోని సీబీఐ కేసుల ప్రత్యేక కోర్టు నుంచి అనుమతిని కూడా తీసుకున్నారు. ఇప్పటికే ఎమ్మార్ ప్రాపర్టీస్ అక్రమాల కేసులో సీబీఐ అధికారులు సూరీడు వాంగ్మూలాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. వైఎస్ సీఎం కావటానికి ముందు, సీఎం అయిన తరువాత సూరీడు ఆయన వెన్నంటి ఉన్న విషయం తెలిసిందే. ఒకరకంగా చెప్పాలంటే వైఎస్‌కు సూరీడు నీడలా మెలిగాడు. ఈ నేపథ్యంలోనే వైఎస్ ప్రభుత్వం వేర్వేరు సంస్థలు, వ్యక్తులకు ప్రయోజనాలు కల్పిస్తూ జారీ చేసిన జీవోలు, దీని వెనక నడిచిన మంత్రాంగం గురించి సూరీడుకు పూర్తిగా తెలుసని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. సూరీడు పెదవి విప్పితే ఆయా సంస్థలకు వైఎస్ ప్రభుత్వం ఎందుకు మేళ్లు కల్పించింది? ప్రయోజనాలు పొందినదానికి ప్రతిగా ఆయా సంస్థలు, వ్యక్తులు జగన్ కంపెనీల్లోకి ఎలా నిధులను ప్రవహింప చేశారు? దీంట్లో విజయసాయిడ్డి పాత్ర ఏమిటి? ఆయనతోపాటు ఇంకా ఎవవరు ఈ వ్యవహారాల్లో ఉన్నారు? అన్న వివరాలు వెలుగు చూస్తాయని అనుకుంటున్నారు. దీని కోసమే సూరీడు వాంగ్మూలాన్ని తీసుకోవాలని సీఐబీ అధికారులు నిశ్చయించారు.

‘‘ జగన్ రెడ్డి కాదు. ఆయన తన మనుగడ కోసం రెడ్డికార్డు వాడుతున్నారు. జగన్ ఆచరించేవన్నీ క్రైస్తవ సంప్రదాయాలే. మేం ఆయన రెడ్డి కాదని ప్రచారం చేస్తాం. ఆ యబ్బి మన కాయస్థుకాదని చెబుతాం’’
- కాంగ్రెస్ సీనియర్లు జెసి దివాకర్‌రెడ్డి, వీరశివారెడ్డి
‘‘ జగన్ ఏమైనా సోనియాగాంధీ కంటే పెద్ద క్రైస్తవుడా. అసలు క్రైస్తవురాలు సోనియా. మేము చేసిన సవాలుకు జవాబు చెప్పని పిరికివాడయిన జగన్ తన పత్రికల్లో అబద్ధాలు రాయిస్తున్నారు’’
- మంత్రి ధర్మాన ప్రసాదరావు
‘‘ మంగలికృష్ణ ఎవరో తనకు తెలియదన్న జగన్ నిజంగా తన మాట రుజువు చేసుకునేందుకు బైబిల్ మీద ప్రమాణం చేస్తారా?’’
- 20 సూత్రాలవపథకం అమలు కమిటీ చైర్మన్ డాక్టర్ తులసిరెడ్డి సవాల్
‘‘తిరుమలలో జగన్ చేసిన అపచారానికి హిందువులందరికీ క్షమాపణ చెప్పాలి. దైవనామ స్మరణ చేయవలసిన చోట జగన్నామ స్మరణ చేయటం హిందువులను, సంప్రదాయాన్ని అవమానించడమే’’
- కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు
తండ్రి సెంటిమెంట్‌తో జనాల్లోకి దూసుకుపోతున్న జగన్‌ను, అదే సెంటిమెంట్‌తో దెబ్బతీసేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు రోజు రోజుకూ కొత్త మలుపు తిరుగుతున్నాయి. పేదలను కాంగ్రెస్ ప్రభుత్వం అణచివేస్తుందని ఆరోపిస్తున్న జగన్‌ను, 80 గదులున్న జగన్ పేదవాడా? అలాంటి ధనికుడు పేదలకు ఏం సేవ చేస్తారని తాజాగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. మిగిలిన నేతలు కూడా జగన్ సెంటిమెంట్‌కు విరుగుడు ప్రచారం చేస్తున్నారు. భానుకిరణ్‌తో సన్నిహిత సంబంధాలున్న మంగలి కృష్ణతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అసలు ఆయన ఎవరో తనకు తెలియదన్న జగన్ వాదనలో ఎలాంటి నిజాయితీ లేదని నిరూపించేందుకు కాంగ్రెస్ బైబిల్ సెంటిమలెంట్‌ను తెరపైకి తీసుకువచ్చింది.
జగన్ క్రైస్తవుడయినందున, క్రైస్తవులంతా పరమ పవిత్రంగా భావించే బైబిల్ మీద ప్రమాణం చేసి.. మంగలి కృష్ణతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాలని తులసిరెడ్డి తాజాగా జగన్‌కు విసిరిన సవాలుతో యువనేత మత సంకటాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. నిజంగా తులసిరెడ్డి చెప్పినట్లు మంగలికృష్ణతో జగన్‌కు ఎలాంటి సంబంధం లేకపోతే జగన్ కచ్చితంగా బైబిల్ మీద ప్రమాణం వేయవలసి వస్తుంది. అలాకాకుండా తులసిరెడ్డి సవాలుకు స్పందించకుండా మౌనం వహిస్తే మాత్రం, జగన్ తనకు మంగలికృష్ణతో సంబంధాలున్నట్లు అంగీకరించినట్లు భావించవలసి ఉంటుంది. మరోవైపు క్రైస్తవులను ఆకట్టుకుంటున్న జగన్‌ను వారి నుంచి దూరం చేసేందుకు మంత్రి ధర్మాన మరో రూటు ఎంచుకున్నారు. అసలు సిసలు క్రైస్తవురాలయిన సోనియాగాంధీ ముందు జగన్ ఎంత అని నిలదీస్తున్నారు.
జగన్ క్రైస్తవుడిగా చెలామణి అవుతుండటం, ఆయన బావ బ్రదర్ అనిల్‌తో పాటు మరికొందరు మత పెద్దలు జగన్ కోసం పనిచేస్తున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న ధర్మాన అదే మతం కార్డు సంధిస్తున్నారు. జగన్ ఏమైనా సోనియాగాంధీ కంటే పెద్ద క్రైస్తవుడా అన్న ప్రశ్న సంధించారు. దాని ద్వారా అసలు సిసలు క్రైస్తవురాలు సోనియా మాత్రమేనని, జగన్ మత మార్పిడి చేసుకున్న క్రైస్తవుడన్న అర్ధం ధ్వనించే చర్చకు ధర్మాన తెరలేపారు. మరోవైపు ఇటీవల జగన్ తిరుమల వెళ్లినప్పుడు… తనకు హిందూ మతంపై విశ్వాసం ఉందంటూ డిక్లరేషన్ ఇవ్వకుండానే వందిమాగధులతో వెళ్లి స్వామివారిని దర్శించుకున్న ఘటనను సీనియర్ నేత వి.హన్మంతరావు మళ్లీ ప్రచారంలోకి తీసువస్తున్నారు. జగన్ హిందువులకు క్షమాపణ చెప్పాలని, లేకపోతే ఆయనను ప్రజలు క్రైస్తవుడిగానే భావించవలసి ఉంటుందని స్పష్టం చేశారు. తిరుమలలో జగన్‌కు అనుకూలంగా నినాదాలు చేయడాన్ని ఆక్షేపించిన వీహెచ్ ఆ అంశాన్ని పదేపదే ప్రస్తావిస్తూ హిందువులలో చర్చనీయాంశం చేస్తున్నారు.
అటు లక్ష కోట్ల ఆస్తులు, రాజమహళ్లు ఉన్న జగన్ తనది పేద కులమని చెప్పుకోవడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన ఎన్నికల ప్రచారంలో అవహేళన చేస్తున్నారు. లక్ష కోట్ల ఆస్తిపరుడైన జగన్ పేదలకు ఏమి మేలు చేస్తారని, ఆయనను నమ్ముకుంటే ముంచేస్తాడని హెచ్చరిస్తున్నారు. ఆ పార్టీ నేతలు సైతం జగన్ పచ్చి అబద్ధాల కోరని విమర్శిస్తున్నారు. గాలి జనార్దన్‌రెడ్డి ఎవరో తనకు తెలియదని చెప్పిన జగన్… తాను సునీల్‌రెడ్డిని ఎప్పుడూ చూడలేదన్నారని, ఇప్పుడు మంగలికృష్ణ తనకు తెలియదని అబద్ధాలాడుతున్నారన్న కొత్త ప్రచారానికి తెరలేపారు.
ఇలా చేస్తుందని ముందే ఊహించాః జగన్
ఏదో ఒక రోజు సీబీఐ ఇలా చేస్తుందని ముందే ఊహించానని సాక్షి అధినేత కడప ఎంపి జగన్ అన్నారు. సాక్షి పబ్లికేషన్స్ , ఇందిరా టెలివిజన్ బ్యాంక్ ఖాలాలను సీబీఐ అధికారులు ప్రీజ్ చేసిన అనంతరం జగన్ ప్రతిస్పందించారు. ఇటు వంటి అప్రజాస్వామిక చర్యలు ప్రజాస్వామ్య హక్కులు కాలరాయడే అన్నారు. జనం మీడియాగా సాక్షి ఏరోజో ప్రజాదరణ పొందిందన్నారు ఇటవంటి చర్యలు సాక్షి మీడియాను నిరోధించలేవని జగన్ పేర్కొన్నారు. పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. కొన్ని పత్రికలు, ఛానళ్ళు రాసేవి చూపేవే వార్తలా అని ప్రశ్నిచారు. కాంగ్రెస్ ,చంద్రబాబు తప్ప మూడోవారు ఉండకూడదన్నది వారి ఉద్దేశ్యం అన్నారు. తనను ఎదుర్కొలేక ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. ప్రజల ఆశీస్సులు ఉన్నంతకాలం తనను ఎవరూ ఏమీ చేయలేరని జగన్ పేర్కొన్నారు.

కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అక్రమ ఆస్తుల కేసుకు సంబంధించి సీబీఐ సోమవారం మూడవ చార్జీషీట్‌ను గగన్ విహార్‌లోని సీబీఐ కోర్టులో దాఖలు చేసింది. కోర్టుకు తాజాగా సమర్పించిన చార్జీషీట్‌లో సీబీఐ ఆరుగురిని నిందితులుగా చేర్చింది. ఏ1 గా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, ఏ2 గా విజయసాయిరెడ్డి, ఏ3 గా జగతి పబ్లికేషన్, ఏ4 గా అయోధ్యరెడ్డి, ఏ5 గా ఐఎఎస్ అధికారి వెంకట్రామిరెడ్డి, ఏ6 గా రాంకీ ఫార్మా సిటీ లిమిటెడ్‌లుగా పేర్కొంది. జగన్ ఆస్తుల కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఇప్పటికే కోర్టులో రెండు పర్యాయాలు చార్జీషీట్‌లను దాఖలు చేసింది.
మొదటి చార్జీషీట్‌కు అనుబంధంగా రెండవ చార్జీషీట్‌ను కోర్టుకు సమర్పించిన సీబీఐ తాజాగా మరో చార్జీషీట్‌ను సమర్పించడంతో మూడవ చార్జీషీట్‌గా అయ్యింది. సోమవారం జారీ చేసిన చార్జీషీట్ 88 పేజులు ఉండగా, అందులో 148 అనుబంధ డాక్యుమెంట్లు, 72 మంది సాక్షులను విచారించినట్లు సీబీఐ తెలిపింది. సీబీఐ ఇంతవరకు జారీ చేసిన రెండు చార్జీషీట్‌లలో ఏ1 గా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, ఏ2 గా విజయసాయిరెడ్డి, ఏ3 గా జగతి పబ్లికేషన్‌ను పేర్కొన్న విషయం తెలిసిందే. జగన్ కేసులో తాము మరిన్ని చార్జీషీట్‌లను సమర్పిస్తామని, ప్రతి చార్జీషీట్‌లో ఏ1 గా జగన్, ఏ2 గా విజయసాయిరెడ్డిలు ఉంటారని గతంలోనే సీబీఐ కోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. ఏ ఐఎఎస్ అధికారి వెంకట్రామిరెడ్డి విశాఖపట్టణం అర్భన్ డవలప్‌మెంట్ అథారిటీ వైస్ చైర్మన్‌గా ఉన్న సమయంలో విశాఖపట్టణం జిల్లాలోని పరవాడ సమీపంలో రాంకీ సంస్థకు 1500 ఎకరాలను కేటాయించారని, ఈ కేటాయింపుల వల్లే రాంకీ సంస్థ జగన్‌కు సంబంధించిన సంస్థలలో రూ. 10 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించామని సీబీఐ చార్జీషీట్‌లో స్పష్టం చేసింది. జగన్ సంస్థలలో రాంకీ పెట్టుబడులు పెట్టడం ప్రారంభించిన వెంటనే మహబూబ్‌నగర్ జిల్లా పోలేపల్లి సెజ్‌లో 77 ఎకరాలను పొందిందని సీబీఐ వివరించింది. ఈఆర్‌ఇఎస్ రూ. 8 కోట్లు, సిడబ్ల్యుసి ఇన్‌ఫ్రా రూ. 2 కోట్లు పెట్టాయని, ఈ డబ్బులను కూడా రాంకీ సంస్థే చెల్లించినట్లు ఆధారాలను సంపాదించామని సీబీఐ చార్జీషీట్‌లో తెలిపింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను ఇటీవల సైబర్ టవర్స్‌లోని రాంకీ కార్యాలయంలో సోదాలు నిర్వహించినట్లు స్వాధీనం చేసుకున్నామని సీబీఐ తెలిపింది.
అదే విధంగా అయోధ్యరెడ్డి అనే వ్యక్తి పారిశ్రామిక వేత్త అని ఇతను గత ప్రభుత్వం నుంచి లబ్ధిపొందాడని, ఫలితంగా జగతి పబ్లికేషన్స్‌కు సంబంధించిన 5,500 షేర్లను రూ. 20 కోట్లు చెల్లించి కొనుగోలు చేశారని సీబీఐ వివరించింది. సీబీఐ విచారించిన కొంత సాక్షులలో సచివాలయంలోని పురపాలక శాఖ కార్యాలయంలో అదనపు డైరెక్టర్‌గా పని చేస్తున్న దేవేందర్‌రెడ్డి, గతంలో భూ సేకరణ, టౌన్‌ప్లానింగ్ విభాగంలో పని చేసి ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థలోని భూ సేకరణ విభాగంలో పని చేస్తున్న శివబాలకృష్ణ, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేసిన సీనియర్ ఐఎఎస్ అధికారి ఎస్పీ సింగ్, హెచ్‌ఎండిఎలో పని చేస్తున్న విశ్వనాథరావు, ఆవుల సురేష్, భూమారపు పురుషోత్తంరెడ్డి, ఆనందబాబు, వెంకట్రాంరెడ్డి తదితరులున్నారు.

- వైఎస్సార్సీపీ నేతలు గజ దొంగలు
- వాళ్లకు ఓటేస్తే మీ ఇళ్లు కబ్జా చేస్తారు
- తిరుపతి రోడ్‌షోలో ఓటర్లకు బాబు హెచ్చరిక
తిరుపతి, మే 5: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి స్మగ్లర్ అని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆయన పీలేరు కేంద్రంగా ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. కిరణ్ పాలన అధ్వాన్నంగా ఉందన్నారు. ఆయన అసమర్థుడని విమర్శించారు. ఎవరైనా రౌడీయిజం చేసినట్లు, ఎక్కడైనా భూ దందాలు, కబ్జాలు జరిగినట్లూ తన దృష్టికొస్తే వారి అంతు తేలుస్తానని, అందుకు అర్థరావూతయినా వస్తానని అన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన తిరుపతిలో రోడ్‌షో నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు దొంగలైతే, వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు గజదొంగలని మండిపడ్డారు. వారికి ఓటేస్తే మీ సొంతిళ్లను కబ్జా చేసి అద్దెలు కట్టించుకుంటారని ఓటర్లను హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ రౌడీయిజానికి, మద్యం వ్యాపారానికి కేంద్రంగా మారిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నాయకులు బినామీ పేర్లతో మద్యం దుకాణాలు కొనుక్కుని రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారించారని ఆరోపించారు. చిరంజీవి రాజ్యసభ సీటు కోసం తిరుపతి ప్రజలను వదిలి వెళ్లాడని ఆరోపించారు.
తిరుపతిని అభివృద్ధి చేసిందీ, తిరుమల పవివూతతను కాపాడింది తామేనని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ తిరుపతి వెంకన్న సన్నిధిలో తన అనుచరులతో కలిసి హంగామా చేశారని, అన్యమతస్తుడైనప్పటికీ డిక్లరేషన్ తీసుకోకుండా దౌర్జన్యంగా శ్రీవారిని దర్శించుకున్నారని బాబు దుయ్యబట్టారు. జగన్ అవినీతితో కోట్ల రూపాయలు సంపాదించాడని విమర్శించారు. భానును పెంచి పోషించింది మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌డ్డి, ఆయన కుమారుడు జగన్‌మోహన్‌డ్డేనని విమర్శించారు. తిరుపతి కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణ కూడా 20 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారని తెలిపారు. తిరుపతి టీడీపీ అభ్యర్థి చదలవాడ కృష్ణమూర్తి, జిల్లా అధ్యక్షుడు మహదేవనాయుడు, ఎమ్మెల్యేలు ముద్దుకృష్ణమ నాయుడు, బొజ్జల గోపాలకృష్ణాడ్డి, అమరనాథడ్డి, హేమలత తదితరులు ఈ రోడ్‌షోలో పాల్గొన్నారు.

ధర్మానికి, అధర్మానికి మధ్య ఉప ఎన్నికలు జరుగుతున్నాయని, నీతి, నిజాయితీకి మారుపేరైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ అధినేత వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శనివారం వైఎస్‌ఆర్ కడప జిల్లా రాయచోటిలో జరిగిన ఉప ఎన్నికల ప్రచారంలో జగన్ మాట్లాడుతూ దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందన్నారు.
స్వలాభాల కోసం తనపై, తన కుటుంబంపై తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు పనిగట్టుకుని అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో రోజురోజుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ పెరుగుతోందన్నారు. దీన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్, టిడిపి నీతి మాలిన రాజకీయాల కోసం పసలేని ఆరోపణలు చేస్తున్నాయని జగన్ ధ్వజమెత్తారు. తాను రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా జనం నీరాజనం పలుకుతున్నారన్నారు. ఉప ఎన్నికలలో విశ్వసనీయతకు, న్యాయానికి ప్రజలు కట్టాలన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజశేఖర్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు అమలు చేస్తామన్నారు. తమ ప్రభుత్వం రైతు, మహిళా, యువత, బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలుస్తుందన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయమని హామీ ఇచ్చారు. తన తండ్రి హయాంలో జరిగిన అభివృద్ధి పనులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తమవని చెప్పుకుని పబ్బం గడుపుకుంటోందన్నారు. అసమర్థ పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నికల్లో ప్రజలే బుద్ధిచెప్పాలన్నారు. ఉప ఎన్నికల ఫలితాలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకే కాకుండా కేంద్రంలోని కాంగ్రెస్ పెద్దలకు చెంపపెట్టు కావాలన్నారు. తాను తొలినుంచి వైఎస్ ప్రవేశపెట్టిన పథకాల అమలు కోసం పరితపించానన్నారు. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపించినప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. రాయచోటి అభ్యర్థి జి. శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ కె. సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్యే జి. ద్వారకానాథ్‌రెడ్డి పాల్గొన్నారు.

మొద్దు శీను, మంగలి కృష్ణకు చెరో కోటి
- పలువురికి హంద్రీనీవా కాంట్రాక్ట్‌లు ఇప్పించా
- ప్రతిఫలంగా సుమారు 10శాతం కమీషన్
- పోలీసుల సహకారంతో హైదరాబాద్‌లో సెటిప్మూంట్లు
- వైఎస్ సంతాప సభలకు రూ.20 లక్షలు ఖర్చు
- జల్సాల కోసం గరిష్ట ఖర్చు రూ.40 లక్షలు.. సెటిప్మూంట్లు, ఖర్చులు సూరికి తెలిశాయి
- అన్నపూర్ణ డీల్‌తో సూరి నుంచి బెదిరింపులు.. ప్రాణభయంతోనే సూరిని చంపాను
హైదరాబాద్ మే 5 (టీ న్యూస్): మద్దెలచెరువు సూరి హత్య కేసులో పట్టుబడిన ప్రధాన నిందితుడు భాను వెల్లడిస్తున్న విషయాలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్‌డ్డికి చుట్టుకునేలా కనిపిస్తున్నాయి. హంద్రీనీవా ప్రాజెక్టు పనులు చేపడుతున్న పలువురు కాంట్రాక్టర్లను బెదిరించి వసూలు చేసిన మొత్తంలో రూ.9 కోట్లను జగన్ సన్నిహితుడు చిన్నాకు ఇచ్చానని భాను తన నేరాంగీకార పత్రంలో పేర్కొన్నట్లు సమాచారం. ఇదే ప్రాజెక్టు ఐదవ ఫేజ్‌లో 66 కోట్ల రూపాయల విలువ చేసే పనులను జీవీఆర్ నిర్మాణ సంస్థకు దక్కేలా చేశానని, ఇందుకు సదరు సంస్థ నుంచి రూ.6.5 కోట్లను కమీషన్‌గా స్వీకరించానని తెలిపాడని విశ్వసనీయంగా తెలిసింది. ఇదే ప్రాజెక్టులోని ఆరో ఫేజ్‌లో రూ.72 కోట్ల విలువైన పనులను జీకే నిర్మాణ సంస్థకు ఇప్పించడం ద్వారా ఆ సంస్థ నుంచి రూ..6 కోట్లను కమీషన్‌గా తీసుకున్నానని వెల్లడించినట్లు తెలుస్తోంది. సూరి ఆదేశాల మేరకు ఇదే ప్రాజెక్టులో 17 కోట్ల రూపాయల విలువ చేసే పనులను కేవీఎన్‌డ్డికి దక్కేందుకు తాను పని చేశానని నేరాంగీకార పత్రంలో తెలిపినట్లు సమాచారం. వైఎస్ చనిపోయినప్పుడు సూరి పేరిట రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సంతాప సభలు, ఇతర కార్యక్షికమాలకు రూ.20 లక్షలు ఖర్చు చేశానని భాను వెల్లడించినట్లు తెలుస్తున్నది.
ఇవేకాకుండా సూరి అనుచరుడిగా తాను చేసిన సెటిప్మూంట్ల వివరాలు, బెదిరింపులు, పారిక్షిశామిక, సినీ వర్గాల నుంచి గుంజిన డబ్బులు, వసూలు చేసిన కమీషన్లు, రాజకీయ నాయకుల్లో ఎవవరికి ఎంతెంత నిధులు సమకూర్చిందీ లెక్కలతో సహా చెప్పాడని సమాచారం. పరిటాల రవిని హతమార్చిన మొద్దుశీనుతోపాటు వైఎస్ జగన్ సన్నిహితులకు కూడా డబ్బు ముట్టచెప్పినట్లు భాను వెల్లడించాడని తెలిసింది. సూరి అనుచరుడిగా ఎదిగిన తాను ఆయనకు తెలియకుండా చేసిన సెటిప్మూంట్లు, ఖర్చుల విషయం సూరికి తెలిసి, తనపై ఒత్తిళ్లు పెరిగాయని, అందుకే పథకం ప్రకారం సూరిని హత్య చేశానని భాను తన నేరాంగీకార పత్రంలో పేర్కొనట్లు తెలుస్తున్నది. ఈ పత్రాన్ని సీఐడీ అధికారులు శుక్రవారం కోర్టుకు సమర్పించిన సంగతి తెలిసిందే. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం అందులో వివరాలు ఇలా ఉన్నాయి. హంద్రీనీవా ప్రాజెక్టులో కాంట్రాక్టర్లు, ఇతరులకు మధ్య వివాదాన్ని పరిష్కరించడంతో ఎమ్మెల్యే గురునాథడ్డి సోదరుడు రెడ్డప్పడ్డి తనకు రూ.0 లక్షలు ముట్టచెప్పినట్లు తెలియజేశాడు.
మరో రూ.3 కోట్ల విలువ చేసే ప్రాజెక్టు పనులను కోస్టల్ నిర్మాణ సంస్థకు దక్కేలా చేసి, రూ.3.5 కోట్లు కమీషన్ తీసుకున్నానని చెప్పాడు. ఈ కమీషన్ల నుంచే మంగలి కృష్ణకు రూ.1.03 కోట్లు, మొద్దు శీనుకు కోటి రూపాయలు ఇచ్చినట్లు వివరించారు. సూరి చెల్లెలు హేమలతాడ్డి రూ.20 లక్షలు అందచేసినట్లు వివరించాడు. పరిటాల సునీతపై పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థికి రూ.30 లక్షలు ఖర్చు చేసినట్లు తెలిపాడు. రంగాడ్డి జిల్లాలోని ఓషన్‌పార్క్ స్థల వివాదంలో జరిగిన సెటిప్మూంట్లలో లెజెండ్ బిల్డర్స్ నుండి రూ.2 కోట్లు తీసుకున్నట్లు తెలిపాడు. బెంగళూరులోని సీఎఫ్‌ఐ సాఫ్ట్‌వేర్ కంపెనీ యాజమానిని బెదిరించి రూ6 కోట్లు వసూలు చేశానని నేరాంగీకార పత్రంలో భాను పేర్కొన్నాడు. నిర్మాత సీ కల్యాణ్ ద్వారానే తాను తెలుగు సినీ పరిక్షిశమలోకి ప్రవేశించానని,సినీరంగంలో ప్రవేశం తర్వాత అక్కడ సైతం సెటిప్మూంట్లు, నిర్మాతల నుండి డబ్బులు వసూలు చేసినట్లు వివరించాడు.
హైదరాబాద్‌లోని గురుకుల్ ట్రస్ట్ ప్లాట్లలో వివాదాలు, సికింవూదాబాద్ అజంతా థియేటర్ వివాదంతోపాటు పలు వివాదాల్లో మధ్యవర్తిగా ఉన్నట్లు తెలిపాడు. సెటిప్మూంట్ల విషయంలో పోలీస్ అధికారులైన ప్రవీణ్‌డ్డి, భీంరెడ్డి, భుజంగరావు, నర్సింహాడ్డి, రాజేంవూదనగర్ డీఎస్పీగా పనిచేసిన సర్వేశ్వర్‌డ్డి సహకరించినట్లు తెలిపాడు. రంగాడ్డి జిల్లా మంచిరేవులవద్ద భూ వివాదంలో ప్రవీణ్‌డ్డి, భీంరెడ్డికి డబ్బులు ముట్టచెప్పినట్లు తెలియచేశాడు. కోట్లలో డబ్బుల ప్రవాహం మొదలవ్వడంతో జల్సాల కోసం విపరీతంగా ఖర్చు చేసినట్లు, బెంగళూరులోని అత్యంత ఖరీదైన మౌర్య ఫైవ్‌స్టార్ హోటల్‌తోపాటు, పలు ఖరీదైన హోటళ్లు, పబ్‌లకు వెళ్లేవాడినని తెలిపాడు. ఇలా జల్సాల కోసం గరిష్టంగా ఒక రోజు రూ.40 లక్షలు ఖర్చు చేసినట్లు పేర్కొన్నాడు. విలాసాలతో డబ్బులు విపరీతంగా ఖర్చు, సినిమాల్లో నష్టం, సెటిప్మూంట్లు చేస్తున్న సంగతి చివరకు సూరికి తెలిసిపోయిందని, అక్కడి నుంచి భేదాభివూపాయాలు వచ్చాయని వివరించాడు.
మలుపు తిప్పిన విజయవాడ సెటిప్మూంట్
విజయవాడలో అన్నపూర్ణ ప్యాకేజీ ఇండస్ట్రీకి సంబంధించిన వివాదంలో మీడియాలో వచ్చిన వార్తలతో సూరి నుంచి బెదిరింపులు ఎక్కువయ్యాయని, తనపై ఒత్తిడి పెరిగిందని భాను వెల్లడించినట్లు తెలుస్తోంది. సూరిని హత్య చేయడానికి అప్పటి నుంచే ప్రణాళిక రూపొందించానని, సినీ పరిక్షిశమలో పరిచయమైన శింగనమల రమేశ్‌కు ఈ విషయాన్ని వివరించానని తెలిపాడు.
2010 నవంబర్ 6న శంషాబాద్ సమీపంలోని అటవీవూపాంతంలోకి వెళ్లి, పిస్టల్‌తో ఆరురౌండ్ల టెస్ట్‌ఫైర్ చేశానని పేర్కొన్నాడు. టెస్ట్‌ఫైర్‌కు ఇన్నోవా కారులో రమేశ్, గన్‌మెన్ మన్మోహన్‌సింగ్, మదన్‌మోహన్‌డ్డిలతో కలిసి నగరంలోని కాంట్రాక్టర్‌ను హతమార్చడానికి ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు చెప్పానని భాను తెలిపాడు. ప్రాక్టీస్ అనంతరం సూరిని చంపడానికి అనువైన సమయం కోసం 2010 డిసెంబర్ 31 రాత్రి హైదరాబాద్‌లోని టచ్ పబ్‌లో పథకం రూపొందించినట్లు తెలిపాడు. అదే రాత్రి సూరికి న్యూ ఇయర్ విషెస్ చెప్పినప్పుడే, అతను చావుకు దగ్గరవుతున్నట్లు మనసులో అనుకున్నానని, అయితే తనలో భయాందోళనలు పెరిగాయని వివరించాడు. చివరకు 2011 జనవరి 3 న పథకం ప్రకారమే సూరిని హతమార్చనట్లు తెలిపాడు. ఆ తర్వాత ఉమాశంకర్ అనే వ్యక్తిని కలసి చెక్కుల రూపంలో 50 వేల నగదును తీసుకున్నట్లు, అటు నుంచి ఢిల్లీకి వెళ్లి సింప్లెక్స్ సంస్థ ఉద్యోగిగా చెప్పుకొని శర్మ లాడ్జీలో 14 రోజులు ఉన్నట్లు భాను నేరాంగీకార పత్రంలో వెల్లడించాడు. కొంతడబ్బును న్యాయవాది శ్రీకాంత్‌డ్డికి అందచేశానని తెలిపాడు.
భాను ఆస్తుల డాక్యుమెంట్లు కోర్టుకు..
తన అనుచరులతో కలసి సెటిప్మూంట్లు, బలవంతపు వసూళ్ల ద్వారా సంపాదించిన డబ్బులతో భానుకిరణ్ సంపాదించిన ఆస్తుల డాక్యుమెంట్లను సీఐడీ అధికారులు శనివారం కోర్టుకు అందచేశారు. ఇందులో రంగాడ్డి జిల్లాలోని వ్యవసాయ భూములు, ప్లాట్లకు చెందిన పత్రాలు ఉన్నాయి. మరిన్ని పత్రాల కోసం సీఐడీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రిజిష్ట్రేషన్ శాఖ అధికారులకు ఈ విషయంలో లేఖ రాశారు.
ధర్మారంలో భాను దందా!
- గ్రానైట్ క్వారీ సెటిల్‌మెంట్‌లో హస్తం
కరీంనగర్ క్రైం/ధర్మారం, మే 5(టీన్యూస్): మాఫియా ముఠానేతగా ఎదిగిన భానుకిరణ్ కరీంనగర్ జిల్లాలో దందా నడిపినట్లు పోలీసులు భావిస్తున్నారు. భాను ముఠా జోక్యం చేసుకున్నట్లుగా అనమానిస్తున్న ధర్మారం మండలం బొమ్మాడ్డిపల్లి శివారు గ్రానైట్ వద్ద శనివారం సీఐడీ పోలీసులు వివరాలు సేకరించారు. సర్వేనంబర్ 679లో గ్రానైట్ క్వారీని తొలుత లీజుకు తీసుకున్న వ్యక్తి ఒకరుండగా తర్వాత అగ్రిమెంట్లు మారుతూవచ్చాయి. మూడో వ్యక్తికి క్వారీ ఇప్పించేందుకు అనుచరుడడైన మంగళి కృష్ణ ద్వారా రెండో యజమానిపై భాను ఒత్తిడి తెచ్చినట్లు తేలింది. సెటిల్‌మెంట్ వరకే భాను పాత్ర పరిమితమైందా, లేక బినామీలతో క్వారీ నడుపుతున్నారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇప్పటి వరకు పోలీసులు అధికారికంగా విచారణ వివరాలు వెల్లడించలేదు.
భాను గ్యాంగ్‌తో..
దర్శకుడు తేజకు సంబంధాలు
- నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు
హైదరాబాద్, మే 5 (టీ న్యూస్): సినీ దర్శక, నిర్మాత తేజపై, మరో సినీ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. తేజకు భాను గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నాయని అన్నారు. గతంలో కొన్ని రోజులు తన ఇంట్లో ఉన్న తేజ, చివరికి ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారని చెప్పారు. అందులో భాగంగా తాను, తన కుటుంబసభ్యులు ఇంట్లోలేని సమయంలో భాను గ్యాంగ్ వచ్చి పనిమనిషిని కొట్టి బయటకు పంపించారని, సామాను మొత్తం బయటపడేశారని ఆయన తెలిపారు. ఈ విషయంలో అప్పట్లోనే ఎస్పీ స్టీఫెన్ రవీంవూదను ఆశ్రయించానని చెప్పారు. భాను గ్యాంగ్ వద్ద ఆయుధాలు ఉన్నాయని, తామేం చేయలేమని కమిషనర్ ఏకే ఖాన్, ఎస్పీ స్టీఫెన్ రవీంద్ర, సీఐ నర్సింగరావు చెప్పారని తెలిపారు. ఈ విషయంలో ఎంపీ సర్వే సత్యనారాయణ తనను ఓదార్చారని తెలిపారు. ఇంటి వివాదం హైకోర్టులో ఉందని, న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు. తెలంగాణలోని భూములన్నీ సీమాంవూధులు దోచుకుంటున్నారని ఆరోపించారు.