కర్నూలు

21,343 టీచర్ పోస్టులు


డీఎస్స-12 నోటిఫికేషన్ విడుదల
మే 2,3,4 తేదీల్లో రాత పరీక్షలు
అప్రెంటీస్ విధానం రద్దు
‘ఇంటర్’ నిబంధన తొలగింపు
‘ఓపెన్ డిగ్రీ’ వారికీ అర్హత
ఎస్ఏ పోస్టులకు సబ్జెక్టు నిబంధనల సడలింపు
80 మార్కులకే డీఎస్సీ
20 మార్కులకు టెట్ వెయిటేజి
మరో 7100 పోస్టులకు రెండు రోజుల్లో నోటిఫికేషన్
హైదరాబాద్, జనవరి 30 : లక్షలాది మంది ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త. కొద్ది రో జులుగా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న ‘డీఎస్సీ -2012 నోటిఫికేషన్’ సో మవారం విడుదలైంది. మొత్తం 21,343 ఉపాధ్యాయ ఉద్యోగాలను ఇందులో నోటిఫై చేశారు. ఉపాధ్యాయ అభ్యర్థులు దశాబ్దకాలంగా చేస్తోన్న ‘అప్రెంటిస్’ రద్దు డిమాండ్ కూడా నెరవేరుతోంది. వివాదాస్పదంగా మారిన ‘ఇంటర్‌లో సంబంధిత సబ్జెక్టులు తప్పనిసరి’ అనే నిబంధనను తొలగించారు.
నోటిఫై చేసిన మొత్తం పోస్టుల్లో.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 5,703, ఎస్జీటీ పోస్టులు 11, 602 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్లు 2000, పీఈటీలు 365, మునిసిపల్ పాఠశాలల్లో 1,673 పోస్టులు ఉన్నాయి. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 17వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. సచివాలయంలో సోమవారం సాయంత్రం 3 గంటలకు మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కె.పార్థసారథి ఈ డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. డీఎస్సీకి విద్యార్హతల నిబంధనల్లో కొన్నింటిని సడలించారు.
స్కూల్ అసిస్టెంట్స్ (మేథ్స్, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్) పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్ స్థాయిలో కూడా మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, హిస్టరీ, జాగ్రఫీ సబ్జెక్టులు చదివి ఉండాలన్న నిబంధనలను తొలగించారు. అంటే.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్ చదివి ఉండాలన్న నిబంధన లేదు.
ఫలితంగా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా నేరుగా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు కూడా అర్హత లభిస్తుంది. స్కూల్ అసిస్టెంట్స్ (జీవశాస్త్రం) పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు జీ.వో.నెం.4లో పేర్కొన్న సబ్జెక్టులతో పాటు సెరికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, పౌల్ట్రీ సబ్జెక్టుల అభ్యర్థులకు కూడా అర్హత కల్పించారు. టీచర్లకు అప్రెంటిస్ విధానాన్ని ఈ డీఎస్సీ నుంచి రద్దు చేశారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు నమూనా, యూజర్ గైడ్ కోసం జ్ట్టిఞ://్చఞఛీటఛి.ఛిజజ.జౌఠి.జీn వెబ్‌సైట్‌ను చూసుకోవాలి.
డీఎస్సీ 80 మార్కులకే..
టెట్‌కు వెయిటేజీ ఇవ్వనున్న కారణంగా 80 మార్కులకే డీఎస్సీ పరీక్షను నిర్వహించనున్నారు. మిగతా 20 మార్కులకు టెట్ మార్కులను వెయిటేజీగా జమ చేస్తారు. ఒక్కో ప్రశ్నకు అర మార్కు చొప్పున 80 మార్కులకు 160 డీఎస్సీ పరీక్ష ఉంటుంది. ఎస్జీటీ పరీక్షలో జనరల్ నాలెడ్జ్‌కు 10 మార్కులు, పర్‌స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 10, ఇంగ్లీష్ 9, ఇండియన్ లాంగ్వేజ్ 9, మాథ్స్ 9, సైన్స్ 9, సోషల్ స్టడీస్ 9, టీచింగ్ మెథడ్ 15 మార్కులు ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్ పరీక్ష ల్లో.. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10, పర్‌స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 10, సబ్జెక్ట్ కంటెం ట్ 44, టీచింగ్ మెథడాలజీ 16 మార్కులు ఉంటాయి. పీ ఈటీలకు టెట్ ఉండకపోవ డం వల్ల పూర్తిగా 100 మా ర్కులకు పరీక్ష ఉంటుంది.

హాకీ క్రీడాభివృద్ధికి ప్రోత్సాహం

కర్నూలు జిల్లాలో హాకీ క్రీడాభివృద్ధికి ప్రోత్సాహం అందిస్తానని రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. స్థానిక ఎస్టీబీసీ కళాశాల మైదానంలో జిల్లా హాకీ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం అండర్-19 జూనియర్ బాల బాలికల రాష్ట్రస్థాయి హాకీ పోటీల ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
పముఖ అంతర్జాతీయ హాకీ క్రీడాకారులు ముఖేశ్‌కుమార్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో హాకీ అకాడమీ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందన్నారు. అలాగే జిల్లాలో కూడా హాకీ క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటానన్నారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో పాల్గొని పోటీలను విజయవంతం చేయాలన్నారు. డీఎస్‌డీఓ నాగరాజు మాట్లాడుతూ రాయలసీమకు చెందిన బాలిక, అంతర్జాతీయ స్థాయి హాకీ పోటీల్లో పాల్గొన్న ఘనత ఉందన్నారు. హాకీ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు గెలుపు, ఓటములు సమాన స్థాయిలో స్వీకరించాలన్నారు.
రాష్ట్ర హాకీ సంఘం కార్యదర్శి ఎ.ప్రసన్నకుమార్‌రెడ్డి మాట్లాడుతూ 11 జిల్లాలకు చెందిన బాలుర జట్లు, 10 జిల్లాలకు చెందిన బాలికల జట్లు ఈ పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు తెలిపారు. వీరికి భోజన వసతి సౌకర్యాలు ఈనెల 17 నుంచి 20వ తేదీ వరకు కల్పిస్తున్నట్లు తెలిపారు. పోటీలను లీగ్ కం నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం హాకీ క్రీడాకారులను మంత్రి టీజీ వెంకటేష్ పరిచయం చేసుకుని పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర హాకీ వైస్ ప్రెసిడెంట్ జనార్ధన్ రెడ్డి, రాష్ట్ర స్థాయి పోటీల నిర్వహక అధ్యక్ష, కార్యదర్శులు ప్రతాపరెడ్డి, జాకబ్, సీనియర్ క్రీడాకారులు సాయిబాబా, టి.శ్రీనివాసనాయుడు, నోబుల్ ప్రకాష్, ప్రసన్న, గోపాల్, రాజేంద్ర కుమార్, డాక్టర్ శ్రీనివాసులు, జస్టీన్, నూర్, మోహన్‌రెడ్డి, సంపత్‌కుమార్, జిల్లా హాకీ సంఘం కార్యదర్శి విజయ్‌కరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
లీగ్ పోటీల విజేతల వివరాలు: స్థానిక ఎస్టీబీసీ కళాశాల మైదానంలో జరిగిన బాలుర విభాగంలో కర్నూలు జట్టు శ్రీకాకుళం జట్టుపై 5-0 గోల్స్ ఆధిక్యతతో విజయం సాధించి శుభారంభం చేసింది. వైఎస్‌ఆర్ జిల్లా జట్టు ప్రకాశం జట్టుపై 6-1 గోల్స్ తేడాతో, నెల్లూరు జట్టు కృష్ణా జట్టుపై 4-0 గోల్స్ తేడాతో, చిత్తూరు జట్టు కృష్ణా జట్టుపై 2-1 గోల్స్ తేడాతో ప్రత్యర్థుల జట్లపై విజయాలు సాధించాయి. చిత్తూరు జట్టు కృష్ణా జట్టుపై 2-1 గోల్ తేడాతో, విజయనగరం జట్టు శ్రీకాకుళం జట్టుపై 1-0 గోల్ తేడాతో గెలుపొందాయి. స్థానిక సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన బాలికల హాకీ పోటీల విజేతల వివరాలు జిల్లా హాకీ సంఘం కార్యదర్శి విజయ్‌కిరణ్‌కుమార్ తెలిపారు. అనంతపురం జట్టు విజయనగరం జట్టుపై 8-0 గోల్స్ తేడాతో, చిత్తూరు జట్టు నెల్లూరు జట్టుపై 4-0 గోల్స్ తేడాతో, వైఎస్‌ఆర్ జిల్లా జట్టు ప్రకాశం జట్టుపై 2-0 గోల్స్ తేడాతో ప్రత్యర్థుల జట్లపై విజయాలు సాధించాయి.

నేటి నుంచి పోలీస్ అభ్యర్థులకు పరుగు పోటీలు

కానిస్టేబుళ్ల ఎంపిక కోసం ఉద్దేశించిన ఐదు కిలోమీటర్ల పరుగు పోటీలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం పంచలింగాల క్రాస్ రోడ్డు పోలీస్ అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. 22,039 మంది పురుష అభ్యర్థులు, 1,139 మంది మహిళా అభ్యర్థులు కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. బ్యాచ్‌కు వంద మంది ప్రకారం రోజుకు వెయ్యి మందికి పరుగు పరీక్ష నిర్వహిస్తారు. స్టాటింగ్ పాయింట్ వద్ద అదనపు ఎస్పీ పద్మాకర్ రావు, ఎండింగ్ పాయింట్ వద్ద ఎస్పీ శివప్రసాద్ ఉండి పరుగు పోటీలను పర్యవేక్షిస్తారు. పంచలింగాల క్రాస్ రోడ్డు వద్ద నుంచి ఐదు కిలో మీటర్ల దూరంలో ఉన్న గొందిపర్ల వంతెన వరకు పరుగు పరీక్ష నిర్వహిస్తున్నారు. ప్రతి 100 మీటర్లకు ఒక కానిస్టేబుల్, కిలో మీటర్‌కు ఒక సీఐ, ఎస్‌ఐ బందోబస్తు విధులు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం మొత్తం ముగ్గురు డీఎస్పీలు, 15 మంది సీఐలు, 50 మంది ఎస్‌ఐలు, 100 మంది కానిస్టేబుళ్లు, 50 మంది డీపీఓ సిబ్బంది, ఈకాప్స్‌కు సంబంధించి 10 మంది సిబ్బందిని నియమించారు. అలాగే కమ్యూనికేషన్ సిబ్బందిని కూడా నియమించారు. సెయింట్ జాన్స్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద కమ్యూనికేషన్స్ టవర్ ఏర్పాటు చేసి దాని ద్వారా మ్యాన్ ప్యాక్‌లు పని చేసే ఏర్పాట్లు చేశారు. అర్హత సాధించిన అభ్యర్థుల వేలిముద్రలు సేకరించి కంప్యూటర్లలో పొందుపరిచేందుకు ఏర్పాట్లు చేశారు. అక్రమాలు చోటు చేసుకోకుండా నిఘా కోసం మూడు వీడియో కెమెరాలు అమర్చారు. అభ్యర్థులు అస్వస్థతకు గురైతే వైద్యం అందించేందుకు అంబులెన్స్, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. దారి పొడువునా డ్రమ్ములు ఏర్పాటు చేసి మంచినీటి సౌకర్యం కల్పించారు.
కేటాయించిన విధులను సక్రమంగా
నిర్వహించండి : ఎస్పీ
కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ శివప్రసాద్ అధికారులు, సిబ్బందికి సూచించారు. మంగళవారం సాయంత్రం జిల్లా పోలీస్ కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో సిబ్బందితో సమావేశమై తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. అదనపు ఎస్పీ పద్మాకర్ రావు, డీఎస్పీలు లతా మాధురి, దేవదాసు, జనార్ధన్‌తోపాటు ఎస్‌ఐలు, సీఐలు పాల్గొన్నారు.
పరుగు నిర్వహించే రహదారిలో పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లపై డీఎస్పీలు, సీఐలతో చర్చించారు. పరుగు పోటీలను వీడియో ద్వారా చిత్రీకరించాలని సూచించారు అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీల్లో ఉదయం 4 గంటల కంతా పంచలింగాల క్రాస్ రోడ్డు వద్దకు చేరుకోవాలన్నారు.

మంత్రుల్లో అసంతృప్తి లేదు – మంత్రి ఏరాసు వెల్లడి


రాష్ట్ర మంత్రుల్లో ఎవరికీ తమ శాఖల పట్ల అసంతృప్తి లేదని రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన అసెంబ్లీ ఆవరణలో తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ మంత్రుల సామర్థ్యాన్ని బట్టి ముఖ్యమంత్రి వారికి శాఖలు కేటాయిస్తారని చెప్పారు. శాఖలు చిన్న, పెద్ద అంటూ తేడాలు ఉండవని అన్నీ సమానమేనని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సిఐఐతో కలిసి నిర్వహించిన భాగస్వామ్య సదస్సు వల్ల ప్రయోజనం లేదని ప్రతిపక్షాలు విమర్శించడంలో అర్థం లేదని అన్నారు. కొత్తగా ఎన్నో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయని ఆయన చెప్పారు. రాజీవ్ యువకిరణాలు పథకం విఫలమైందన్న ప్రతిపక్షాల విమర్శను ఆయన తోసిపుచ్చారు.
బిహెచ్‌ఇఎల్ ఎక్కడ ఉంది?
ప్రశ్నించిన రంగారెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు (సమ్మిట్)తో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తిగా మరోసారి రుజువైందని టిడిపి చేసిన ఆరోపణను కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎం. రంగారెడ్డి తోసిపుచ్చారు. బిహెచ్‌ఇఎల్ ఎక్కడ ఉంది? తెలంగాణలో లేదా? అని ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించారు. బిహెచ్‌ఇఎల్ దేశంలోనే పేరెన్నికగన్న సంస్ధ అని ఆయన తెలిపారు. ఈ సమ్మిట్ వల్ల అనేక వేల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన చెప్పారు. యువకిరణాలు పథకం విఫలమైందన్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు.
టి.కాంగ్రెస్ ఎంపీలను
సీమాంధ్రలో స్వాగతిస్తాం: గాదె
సీమాంధ్ర ప్రాంతంలో పర్యటించాలనుకుంటున్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలను స్వాగతిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గాదె వెంకట్ రెడ్డి తెలిపారు. దేశంలో ఎవరైనా ఎక్కడైనా పర్యటించవచ్చని ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. టి.కాంగ్రెస్ ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు సీమాంధ్రలో పర్యటించి తమ అభిప్రాయాలను స్వేచ్చగా చెప్పుకోవచ్చని ఆయన తెలిపారు. అలాగే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారు తెలంగాణలో పర్యటిస్తే అడ్డుకోరాదని ఆయన కోరారు

ప్రజా వాణీలో ప్రజల గోడు

సార్‌ మా బాధ వినండి కలెక్టరు గారు మా సమస్య పరిష్కరించండి. అంటూ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు ,రైతులు, వికలాంగులు, మహిళలు కలెక్టర్‌కు మోర పెట్టుకున్నారు. సోమవారం కలెక్టర్‌ కార్యలయంలోని సునయన అడిటోరియంలో జరిగిన ప్రజా వాణీ కార్య క్రమంలో జిల్లా కలెక్టర్‌ రాంశంకర్‌ నాయక్‌తోపాటు జెసి బుద్ద ప్రకాశ్‌ యం. జ్యోతి డిఆర్‌ఓ వేణుగోపాల్‌ రెడ్డికి ప్రజలు వినతలు సమర్పించారు. ఎమ్మిగనూరు పట్టణంలో నివాసముంటున్న, బి. జయరాం అనే నిరుద్యోగ యువకుడ కలెక్ట ర్‌తో మాట్లాడుతూ 2001 నుండి స్కూల్‌ బ్యాగ్‌లు, కాలేజి బ్యాగ్‌లు తయారు చేయుటలో శిక్షణ పొందియున్నాని అయితే కర్నూలు నగరంలో 2005 నుండి 2010 వరకు రాఘవేంద్ర మహిళ మండలి ద్వారా 200 మంది పురుషులకు 500 మంది స్త్రీలకు శిక్షణ ఇచ్చానని ప్రస్తుతం వారు ఉపాధి పొందుతునరన్నారు. అయితే తాను ఎమ్మిగనూరు నందు జాయి రూరల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటి స్థాపించానని వాటి ద్వారా చాలా మంది స్త్రీ, పురుషులకు శిక్షణ ఇచ్చానన్ని వీరికి జీవనోపాధి చూపించాలని కోరారు. అలాగే వికలాంగ బ్యాక్‌లాగ్‌ పోస్టులను రాత పరీక్ష ద్వారా చేయాలని వికలాంగుల సంఘం నాయకుడు కలెక్టర్‌ రాంశంకర్‌ నాయక్‌ను కోరగా ఆత్మకూరు మండలం వడ్ల రామాపురం గ్రామానికి చెందిన రైతులు పావలా వడ్డీ ప తకాన్ని రెతుమిత్ర సంఘాలకు అమలు చెెసి తమను ఆదుకోవాలని వినవించుకున్నారు. ప్యాపిలి మండలం గుట్టూపల్లె గ్రామానికి చెందిన రైతులు తమ పొలాలకు స్టింకర్ల సేద్యం , బింధు సేద్యం చేసుకునేం దుకు మోటర్లు , పైపులైను సౌకర్యం కల్పించేందుకు రుణాలు మంజూరు చేయించాలని కర్నూలు మండలం పంచలింగాల గ్రామానికి చెందిన పెద్ద అయ్యన్న మరి కొందరు రైతులు ఇంధిర జలప్రభ పతకం క్రింద మోటర్‌ మరియు పైపులు మంజూరు చేసి ఇవ్వాలని కర్నూలు కుమ్మరి వీధికి చెంది యస్‌. షాలిబి తన ఇంటి స్థలం ఇతరులు ధౌర్జన్యంగా అక్రమిం చారని న్యాయం చేసి స్థలం ఇప్పించాలని కోరగా కొలిమిగుండ్ల మండలం కొత్తపాడు గ్రామానికి చెందిన సర్వే నంబరు 204లో 3.50 ఎకరాల భూమికి పట్టాదారు పాస్‌ పుస్తకం మంజూరు చేయాలని కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన శివశంకర్‌ రెడ్డి కలెక్టర్‌ను కోరారు. ఈ కార్య క్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఘనంగా క్రీడాదినోత్సవ వేడుకలు

ప్రభుత్వ టౌన్‌ జూనియర్‌ కళాశాల క్రీడా దినో త్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా యువపారిశ్రామిక వేత్త టి.జి.భరత్‌ పాల్గొని జ్యోతిప్రజ్వలన చేసిన పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. టౌన్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ చెన్నయ్య అధ్యక్షతన జరి గిన ఈ కార్యక్రమంలో అనంతపురం పోలీసు కళాశాల ప్రిన్సిపాల్‌ పి.వెం ట్రామి రెడ్డి, రీజినల్‌ ఇన్‌స్పెక్టింగ్‌ అధికారి జి.చెంగల్రాయులు పాల్గొన్నారు. ఈ సందర్భం గా టి.జి.భరత్‌ మాట్లాడుతూ విద్యను పూర్తి చేసి వచ్చే టౌన్‌ కళాశాల విద్యా ర్థులకు తమ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని ప్రకటించారు. ప్రత్యేక అతిథి చెంగల్రాయుడు మాట్లాడుతూ తాను ఇదే కళాశాలలో చదివానని గుర్తు చే శారు. కళాశాల పేరు రాష్ర్టస్థాయిలో పేరు ప్రతిష్టను తీసుకురావాలన్నారు. గౌరవ అతిథి వెం ట్రామిరెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఇష్టపడి చదవి అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు ప్రశంసపత్రాలతోపాటు బహుమతులను అందజేశారు.

నల్లమల అటవీలో.. ఫారెస్టు అధికారుల దాడులు

నల్లమల అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి ఫారెస్ట్‌ అ ధికారులు జరిపిన దాడుల్లో ఆరు ఎర్రచం దనం దుంగలతో పాటు అంకెనాయక్‌ అనే స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు రేంజర్‌ అబ్దుల్‌ఖాదర్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు నల్లమల అటవీ ప్రాంతం లోని చింతమానుకనుమ ప్రాంతంలో ఆరు మంది స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను మోసుకొని వెళుతుండగా దాడి చేశామ న్నారు. ఈ దాడిలో అంకెనాయక్‌ను అదుపు లోకి తీసుకోగా రామనాయక్‌, చంద్రనా యక్‌, శ్రీరామనాయక్‌, రాజ్యానాయక్‌, తా నేనాయక్‌లు పరారయ్యారన్నారు. వీరంద రు చాగలమర్రి మండలం కదిరిపురం తాం డా గ్రామానికి చెందిన వారన్నారు. అటివి సంపదను ఎవరు తరలించినా కఠిన చర్యలు తప్పవని రేంజర్‌ అబ్దుల్‌ఖాదర్‌ హెచ్చరించారు. అదేవిధంగా ప్రతిఒక్కరూ అటవి సంపద పరిరక్షణకు సహకరించాలని, సమాచారాన్ని అందించాలని కోరారు. ఈ దాడిలో సెక్షన్‌ ఆఫీసర్‌ యుగంధర్‌, ఎఫ్‌బిఓ నాగరాజు, ఎపిఓలు, సాయుధ పోలీసులు పాల్గొన్నారు.

సంఘం అభివృద్ధికి విద్యార్థులు పాటుపడాలి

పద్మశాలి విద్యార్థులు పెద్దవారైన తరువాత తమ కుల అభివృద్ధికి సహాయ పడాలని రాష్ట్ర చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్‌ అన్నారు. సోమవారం స్థా నిక సి.క్యాంప్‌లో ఉన్న టిజివి కళాక్షేత్రంలో జిల్లా పద్మశాలి అఫీషియల్స్‌ అండ్‌ ప్రొఫెషనల్స్‌ అ సోసియేషన్‌ వారి ఆధ్వర్యంలో విద్యార్థుల ప్రోత్సాహక సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా మంత్రి టిజి వెంకటేష్‌ పాల్గొని జిల్లాలో పదవ తరగతి, ఇంటర్మీడియట్‌, డిగ్రీ పరీక్షలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో మార్కులు సాధించిన పద్మశాలి విద్యార్థులకు జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా టిజి వెంకటేష్‌ మాట్లాడుతూ పద్మశాలి సంఘం నాయకుల అభ్య ర్థన మేరకు కమ్యూనిటీి హాలుకు కావాల్సిన స్థలం కేటాయించి భవన నిర్మాణానికి కావాల్సిన సహా య సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల ఉన్నత చదువుల కోసం తన వంతు సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. విద్యార్థులు కూడా సంఘం అభివృద్ధి ఎల్లప్పుడు తమ వంతు కృషి చేసి అందరు కలిసికట్టుగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నా యకులు పి.వెంకటేశ్వర్లు, నాగభూషణం, సుబ్బరాయుడు, గోరంట్ల, నారాయణ, ఎన్‌.శ్రీనివాసులు, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

బాధితులకు న్యాయం చేయండి

ఓర్వకల్లు మండలం హుసేనాపురం గ్రామ బస్టాప్‌లో 18వ జాతీయ రహదారి విస్తీరణలో స్థలాలు కోల్పోయి న బాధితులకు అధికంగా పరిహారం ఇవ్వాలని పాణ్యం ఎమ్మెల్యే కాట సాని రాంభూపాల్‌రెడ్డి జిల్లా కలెక్టర్‌ను కోరారు. సోమవారం క లెక్టరేట్‌ లోని సునయన ఆడిటోరియంలో ప్రజాదర్బార్‌ నిర్వహించిన ప్రజాదార్భార్‌లో కలెక్టర్‌ను ఎమ్మెల్యే కాటసాని కలిసి సమస్యలు వివరించారు. బాధితులకు సరైన న్యాయం జరుగలేదని, పరిశీలించిన ఆదుకోవాలని కోరారు. అదేవిధంగా గ్రామాల నుంచి బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలని సోమవారం ప్రజాదర్భార్‌ను ఆశ్రయించారు. జిల్లా కలెక్టర్‌ రాంశంకర్‌నాయక్‌, జాయింట్‌ కలెక్టర్‌ జ్యోతిబుద్ధప్రకాష్‌, డిఆర్‌ఓ వే ణుగోపాల్‌రెడ్డి బాధితుల నుంచి వినతులు స్వీకరించారు.
* ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి కేసులో హైకోర్టు ఉత్తర్వుల మేరకు గత డిఇఓ మువ్వారామలింగంను అరెస్ట్‌ చేయాలని ఎస్‌జిటి ఉపాధ్యాయులు సా యిబాబా సోమవారం ప్రజాదర్భార్‌ను ఆశ్రయించారు.
* జిల్లాలో కరువుకు గురైన రైతులకు పంట నష్టపరిహారం తక్షణమే చె ల్లించి అన్ని రకాల బ్యాంకు రుణాలను రద్దు చేయాలని ఎకరాకు రూ.10 వేలు పరిహారం ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు షడ్రక్‌, జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి కలెక్టర్‌ను కోరారు.
*కంబలపాడు గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న తన కుమార్తె సుజాత హాస్టల్‌ వార్డెన్‌ నిర్లక్ష్యం వల్ల మృతి చెందిందని తనకు పరిహారం గాని, ఉద్యోగంగాని ఇవ్వాలని బేతంచర్ల మండలం మర్రి కుంట గ్రామానికి చెందిన కిష్టమ్మ కలెక్టర్‌కు కోరారు.
* మీ సేవా సెంటర్‌ను మంజూరు చేయాలని వెలుగోడు గ్రామానికి చెందిన ఇంతియాజ్‌ ప్రజదార్భార్‌ను ఆశ్రయించారు.
* తన రెండు ఎకరాల పొలానికి అడంగళ్‌ ఇవ్వకుండా వేదిస్తున్నారని గడివేముల మండలం బిలకల్‌ గూడూరుకు చెందిన చాటుకుంట సుబ్బ రాయుడు అధికారులతో వేడుకున్నారు.
* తనకు పక్షవాతం రావడంతో విధులు నిర్వహించలేకపోతున్నానని త న ఉద్యోగాన్ని కుమారుడు ఖాదర్‌హుసేన్‌కు ఇవ్వాలని పోలీసు హెడ ్‌కానిస్టేబుల్‌ వలిసాహెబ్‌ కోరారు.
* జలప్రభ కింద మోటర్‌పైపులను మంజూరు చేయాలని కర్నూలు మండలం పంచలింగాల గ్రామానికి చెందిన పెద్ద అయ్యన్న కోరారు.
* కర్నూలు కుమ్మరి వీధికి చెందిన శాలిబీ తన ఇంటి స్థలాన్ని దౌ ర్జన్యంగా ఆక్రమించారని తనకు న్యాయం జరిపించి తన స్థలాన్ని తనకు ఇప్పించాలని అధికారులతో మొరపెట్టుకున్నారు.
* కొలిమిగుండ్ల మండలం కొత్తపాడు గ్రామంలోని 204 సర్వే నెం బర్‌లో తనకు 3.5 ఎకరాల భూమి ఉందని, పట్టాదారు పాసుపుస్తకం మంజూరు చేయాలని కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన శివశంకర్‌రెడ్డి సోమవారం ప్రజాదర్భార్‌ను ఆశ్రయించారు.

విపత్తులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి – పంకజ్‌ ద్వివేది

రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల్లో ‘తానే’ సైక్లోన్‌ రానున్నందని, విపత్తులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని  పంకజ్‌ ద్వివేది జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం రాజధాని నుంచి ప్రకృతి వైపరీత్యాలు అనే అంశంపై జిల్లా కలెక్టర్లతో ఆయన అత్యవసర వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ రాబోయే మూడు రోజుల్లో తానే సైక్లోన్‌ రాష్ట్రంలో తీవ్ర ప్రభావం చూపే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపిందన్నారు. దీనివల్ల తీవ్రంగా వర్షాలు పడే అవకాశముందని, వర్షాల వల్ల ఏరకమైన ప్రాణనష్టం, ఆస్తి నష్టం వాటిల్లకుండా తగినవిధంగా జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు.
వర్ష ప్రభావిత జిల్లాలో షెల్టర్లను, కంట్రోల్‌ రూములను ఏర్పాటు చేయాలని తెలిపారు. అధిక వర్షాల వల్ల రోడ్లు, బ్రిడ్జిలు దెబ్బతినే అవకాశముం దని, అలాంటి వాటిని ముందస్తుగా గుర్తించి చర్యలు చేపట్టాలన్నారు. అలాగే విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని, కావున పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బి, ట్రాన్స్‌కో తదితర శాఖల అధికారులను అప్రమత్తంగా ఉండేలా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేయాలన్నారు. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. అనంతరం జిల్లాలవారీగా సైక్లోన్‌కు గురయ్యే ప్రాంతాల వివరాలు, అక్కడ అధికారులు చేపట్టబోయే ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూము ఏర్పాటు చేశాం ః కలెక్టర్‌
తానే సైక్లోన్‌ నిమిత్తం ముఖ్య కార్యదర్శి ఆదేశాల మేరకు ఇప్పటికే కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూము ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్‌ దుర్గాదాస్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్య కార్యదర్శికి వివరించారు. ముఖ్యంగా చిత్తూరు సరిహద్దు గ్రామాలు, తాడిపత్రి నియోజకవర్గం లోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే దీనిప్రభావం ఉండవచ్చని తెలిపారు. వర్షాభావ జిల్లాకు సైక్లోన్‌వల్ల కొద్దిగా వర్షాలు వస్తే అది జిల్లాకు వరమవు తుందని కలెక్టర్‌ వివరించారు. ఏదిఏమైనా అన్ని రకాలుగా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించా మని తెలిపారు. సమావేశంలో హైదరాబాద్‌లో డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కమీషనర్‌ రాధా, జిల్లా నుంచి అదనపు జేసి చెన్నకేశవరావు, డిఆర్‌ఓ సుదర్శన్‌రెడ్డి, పెనుకొండ ఆర్‌డిఓ ఈశ్వర్‌, కలెక్టరేట్‌ సూపరింటెం డెంట్‌ వరదరాజులు తదితరులు పాల్గొన్నారు.

free website analytics