కర్నూలు
చేనేత కార్మికులను ఆదుకుని వారి అభివృద్ధికి కృషి చేసింది కాంగ్రెస్ పార్టీయేనని డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ తెలిపారు. గురువారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వై.రుద్రగౌడ్ గెలుపును కోరుతూ పట్టణంలోని 28, 29 వార్డులలోని సోమప్పనగర్ కాలనీ, సాయినగర్ కాలనీల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు తాగునీరు, వీధి లైట్లు, కరెంటు స్థంభాలు, డ్రైనేజి, రేషన్ కార్డులు, మానసిక వికలాంగులకు పింఛన్లు తదితర సమస్యలను సుజాతమ్మ దృష్టికి తెచ్చారు. ఆమె స్పందిస్తూ తాగునీటి సమస్యపై మున్సిపల్ ఏఇ హనుమన్నకు ఫోన్ ద్వారా సమస్య పరిష్కరించాలని సూచించారు. కాంగ్రెస్ అభ్యర్థి వై.రుద్రగౌడ్ సోదరుడు వై.పురుషోత్తం గౌడ్ మండలంలోని కలుగొట్ల, సోగనూరు, నాగలాపురం, పార్లపల్లి గ్రామాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హస్తం గుర్తుకు ఓటు వేసి వై.రుద్రగౌడ్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బూదూరు లకీëకాంత్ రెడ్డి, ఎం.ఆర్.శ్రీనివాసులు, బట్టా ఈరన్న, జంబన్న, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్సీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిక
మండలంలోని గుడికల్లు గ్రామానికి చెందిన వైఎస్‌ఆర్‌సి కార్యకర్తలు బోయ పెద్ద యల్లప్ప, కుమారులు చిన్న లింగన్న, శ్రీనివాసులు, ఆనందు తదితరులు వై.పురుషోత్తం గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
నేటి నుండి ఎంపి కోట్ల ప్రచారం
ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వై.రుద్రగౌడ్ గెలుపును కోరుతూ కర్నూలు ఎంపి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, గోనెగండ్ల మండల ఇన్‌ఛార్జ్ కోట్ల హర్షవర్థన్ రెడ్డి నేటి నుండి 22 వరకూ మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రచారం చేపడుతున్నట్లు పీసీసీ రాష్ట్ర కార్యదర్శి బివై రామయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కొత్తగా ఏర్పడిన నగర పంచాయతీలో పని చేసే కార్మికులకు జీవో నంబరు 333 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎపి మున్సిపాల్టీ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు గురువారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నాగరాజు డివిజన్ కార్యదర్శి వి. ఏసురత్నం మాట్లాడారు. అనేక ఆందోళనల ద్వారా సాధించుకున్న జీవోలను అమలు పరచడంలో ప్రభుత్వం విఫలమయిందన్నారు. జీవో 333 ప్రకారం కనీస వేతనం రూ.6700 ఇవ్వాలని కోరారు. గ్రామ పంచాయతీ సర్వీస్‌ను, పిఎఫ్, కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2004 నుండి ప్రతి కాంట్రాక్టు కార్మికునికి పిఎఫ్, ఇఎస్‌ఐ అమలు చేయాలని కోరారు. వీటి సాధన కోసం 28న హైదరాబాదులో జరిగే ఆందోళనలో కార్మికులు పెద్దఎత్తున పాల్గొని జయప్రదంచేయాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు డివిజన్ అధ్యక్షులు ఎం. రజాక్, నాగన్న, ప్రసాద్, లింగస్వామి, గొడుగు రాజు, ఏసేపు, పెద్ద నాగన్న పాల్గొన్నారు.
నందికొట్కూరు టౌన్: కొత్తగా ఏర్పాటు చేసిన నగర పంచాయతీలలో మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం రూ.6700 అమలు చేయాలని ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటియు మండల నాయకుడు పరమేష్ అధ్యక్షతన గురువారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం డివిజన్ కార్యదర్శి పి. వెంకటేశ్వర్లు, సిఐటియు డివిజన్ కార్యదర్శి భాస్కర్‌రెడ్డి మాట్లాడారు. 28న చలో హైదరాబాదు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపాల్టీ కార్మికులు పాల్గొన్నారు.
ఇంటర్ విద్యార్థుల్లో ఆగ్రహజ్వాలలు ఒక్కసారిగా పెల్లుబికాయి. హాల్‌టికెట్లు ఇవ్వకుండా తమ జీవితాలను నాశనం చేసారంటూ ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. సకాలంలో ఫీజులు చెల్లించినా అధికారుల నిర్లక్ష్యం కారణంగా తమకు హాల్‌టికెట్‌లు అందక పోవడం వారి ఆగ్రహావేశానికి కారణం అయింది. బుధవారం నుండి ప్రారంభమైన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి దాదాపు 300 మంది విద్యార్థులకు హాల్‌టికెట్లు అందలేదు. హాల్‌టిె ట్ తమకు రాలేదని అయితే పరీక్షకు అనుమతి ఇవ్వాలని ఆర్‌ఐఓకు కోరారు.
అయితే దీనిపెై ఆయన ఉన్నతాధికారుల నుండి అనుమతి వస్తే తప్ప తానేమీ చేయలేనని కాలయాపన చేయడంతో పరీక్షా సమయం దాటిపోయింది. దీంతో పరీక్షరాయలేని విద్యార్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బుధవారం విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆర్‌ఐఓ కార్యాలయంపెై దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు.
ఆర్‌ఐఓ కార్యాలయంపెై దాడి సమాచారం తెలుసుకున్న పోలీసులు దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ, వెైఎస్‌ఆర్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం నాయకులు సిపి నాయుడు, రాకేష్‌రెడ్డి తదితరులతో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వారిపెై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సిఐ మురళీధర్ తెలిపారు.
ఉప ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎఐసిసి సీనియర్ నేత వాయిలార్ రవి, పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణలు గురువారం ఆళ్లగడ్డకు రానున్నారు. ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకుని కాంగ్రెస్ నాయకులు ఆళ్లగడ్డలో భారీ ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీనియర్ నేత వాయిలార్ రవి పర్యటనను పురస్కరించుకుని కాంగ్రెస్ కేడర్‌ను బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తలు, కిందిస్థాయి నేతల్లో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు ఆ పార్టీ నేతలు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. నామినేషన్ల పర్వం పూర్తి అయిన తరువాత కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు చిరంజీవి ఆళ్లగడ్డలో పర్యటించనున్నారు. రెండు లేదా మూడు రోజుల పాటు ఆళ్లగడ్డలో మకాం వేసి గంగుల తరుపున ప్రచారం చేపట్టేలా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు.
గతంలో తాము చేసిన అభివృద్ధి పనులు వివరించడంతో పాటు ప్రత్యర్థుల బలహీనతలను ఎత్తి చూపిస్తూ ప్రచారం సాగిస్తున్నారు. రెండు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నా ఆళ్లగడ్డపెైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. నామినేషన్లకు ముందే ఆయా పార్టీల అగ్రనేతల ప్రచారాలు మొదటి విడత పూర్తి చేసిన ఆయా పార్టీ నేతలు నామినేషన్ల తరువాత ప్రచారం మరింత తీవ్రతరం చేయనున్నారు. వెైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఎన్నికల ప్రచారం బుధవారం నాటితో ముగిసింది. ఎమ్మిగనూరులో మూడు రోజులు, ఆళ్లగడ్డలో రెండు రోజులు మొత్తం జిల్లాలో ఐదు రోజుల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నెల 13న పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణ ఎమ్మిగనూరులో ప్రచారం పూర్తి చేశారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో రెండు రోజులు పర్యటించిన విషయం తెలిసిందే. పట్టణ ప్రాంతాలపెై పట్టు సాధించే దిశగా అన్ని పార్టీల నేతలు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. సొంత బలం పరపతితో పాటు అగ్రనేతల ప్రచారాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే దిశగా ప్రచారం చేస్తున్నారు. ఉప ఎన్నికల్లో విజయం కోసం ఎవరికి వారు హోరాహోరీగా త లపడుతున్నారు. కర్నూలు ఎంపి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఎమ్మిగనూరును కేంద్రంగా చేసుకుని ప్రచారం చేపట్టారు. ఎన్నికల నోటిఫికేషన్ ముందు నుండే ఎమ్మిగనూరులో తిష్ట వేసిన కోట్ల తనదెైన శెైలిలో పావులు కదుపుతున్నారు. వెైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎరక్రోట కేశవరెడ్డి ఒంటరిపోరు సాగిస్తుండగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి మద్దతుగా కెఇ సోదరులు నిలిచారు.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి రాష్ట్రాభివృద్ధికి తీవ్ర కృషి చేస్తున్నారని, గతంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడ సక్రమంగా అమలు చేస్తున్నారని కేంద్రమంత్రి, రాష్ట్ర పరిశీలకులు వాయిలార్ రవి ప్రసంసించారు. గురువారం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లిd పరిధిలోని ఎర్రగుంట్ల ప్రభుత్వ కళాశాలలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంలో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు చేపట్టారని, వాటి ద్వారా మంచిపాలన సాగిస్తుందన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మరిన్నీ మెరుగైన పథకాలను అమలు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. రాష్ట్ర భవిష్యత్ ఇక్కడి నాయకులపై కూడ ఆధారపడి ఉందన్నారు. సోనియాగాంధీ ఆధ్వర్యంలోని యుపీఏ ప్రభుత్వంలో కూడ ప్రజలు సంతోషంగా ఉండాలంటే అభివృద్దికి గుర్తుగా కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేయాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికలకు కారణం కొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడమేనన్నారు. అసలు రాజీనామాలు ఎందుకు చేశారో ఆ పార్టీ అభ్యర్థులను ప్రశ్నించాలని కేంద్రమంత్రి పదేపదే కార్యకర్తలకు సూచించారు.

రాష్ట్రంలో భానుడు ఉగ్రరూపం దాల్చాడు. రాష్ట్రం నిప్పుల కొలిమిగా మారింది. ప్రచండబానుడిదాటికి ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడదెబ్బతో 10మంది మృతిచెందారు. ఉదయం ఏడు గంటలనుంచే వేసవి ప్రతాపం చూపుతోంది. ఇళ్లలో విద్యుత్ వాడకం కూడా భారీగా పెరుగుతోంది. పలు జిల్లాల్లో విద్యుత్ కోతలు కూడా మళ్లీ మొదలయ్యాయి. బుధవారం హైదరాబాద్‌లోనూ అనధికారికంగా 3 గంటల విద్యుత్ కోత విధించారు. రాష్టవ్య్రాప్తంగా బుధవారం ఉష్ణోగ్రతలు తీవ్రరూపం దాల్చాయి. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు. ఈ సమయంలో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటాయి.
తెలంగాణతోపాటు రాయలసీమ జిల్లాల్లోనూ 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో సాధారణం కంటే 3 డిగ్రీలు, కోస్తోంధ్ర, రాయలసీమలో 1 నుంచి 3 డిగ్రీలు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదువుతన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం రెంటచింతలలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వ్యవసా య రంగానికి ప్రాణధారమైన నైరుతి రుతుపవనాలు జూన్ 1 కల్లా కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ విభాగం ప్రకటించిన విషయం తెలిసిందే. రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకేవరకు ఇదే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంటుందని అధికారులు చెబుతున్నారు. ఈసారి సాధారణ తేదీ కన్నా కొంత ఆలస్యంగా దక్షిణ అండమాన్ సముద్రంలో రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు.

అక్రమార్జన కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డికి సిబిఐ కోర్టు జారీ చేసిన సమన్లను ఆశాఖ అధికారులు సోమవారం అందజేశారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఉన్న జగన్‌ను హైదరాబాద్ నుంచి వచ్చిన ముగ్గురు సిబిఐ అధికారులు కలిశారు. జగన్ బసచేసిన అతిథి గృహంలో కలిసి సిబిఐ కోర్టు జారీచేసిన సమన్లు అందజేశారు. ఈ నెల 28వ తేదీ ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని సిబిఐ కోర్టుకు తమ న్యాయ వాది ద్వారా హాజరై వాదనలు వినిపించుకోవాలని ఆ సమన్లలో పేర్కొన్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా సిబిఐ కోర్టు జారీచేసిన సమన్లు అందజేసేందుకు ఆశాఖ అధికారులు ఎమ్మిగనూరు వస్తున్నట్లు మూడు రోజులుగా ప్రచారం జరిగింది. అయితే సోమవారం ఎమ్మిగనూరు చేరుకున్న ముగ్గురు సిబిఐ అధికారులు నేరుగా జగన్‌ను కలిసి కోర్టు జారీచేసిన సమన్లు అందజేశారు. కాగా సమన్లు అందుకున్న జగన్ తన సన్నిహితులు, న్యాయవాదులతో దీనిపై చర్చించినట్లు తెలుస్తోంది. కోర్టుకు హాజరయ్యే విషయంలో చాలాసేపు తమ న్యాయవాదులతో జగన్ చర్చించినట్లు తెలుస్తోంది. మరో వైపు 28వ తేదీ విచారణకు హాజరు కావాలా లేక మరి కొంత గడువు కోరుదామా అన్న దానిపై సైతం పార్టీ నాయకుల్లో చర్చ జరిగినట్లు సమాచారం. కోర్టుకు హాజరయ్యాక తదనంతర పరిణామాలపై సైతం పార్టీ నాయకుల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పేద ప్రజలకు ఉచి త బియ్య, సగం ధరకే చీర ధోవతి, వ్యాట్ రద్దు, పేదలకు మూడు సెంట్ల భూమి, ఉచిత గృహాల నిర్మాణం వంటి కార్యక్రమాలు చేపడతామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఉప పోరు సందర్భంగా సోమవారం ఎమ్మిగనూరులో పార్టీ కార్యకర్తల సమావేశం, రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పేద ప్రజలు, చెెనేత కార్మికులు, యువత, రైతులను ఆకట్టుకునేందుకు పలు హామీలు గుప్పించారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, వైఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకుల రౌడీయిజాన్ని, దౌర్జన్యాన్ని ఎదుర్కొంటామని పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. రానున్న ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులు విజయం సాధించే నియోజకవర్గాల్లో ఎమ్మిగనూరు అసెంబ్లిdదే మొదటి స్థానమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
టిడిపి అధికారంలోకి వస్తే వాల్మీకులు, బుడగ జంగాలను ఎస్‌టి జాబితాలో చేర్చేందుకు కృషి చేస్తామని, ఎస్‌సిల వర్గీకరణకు ప్రాధాన్యత ఇస్తామని చంద్రబాబు చెప్పారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు సగం ధరకే చీర దోవతి పఛకాన్ని అమలు చేస్తామని, చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేస్తామన్నారు. తమ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే సహించేదిలేదని, ముఠానాయకులు, రౌడీలకు భయపడేది లేదని, వారి గుండెల్లో నిద్రపోతామని హెచ్చరించారు. 8 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో 20 యేళ్లు వెనకబడిందన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా గిట్టుబాటు ధరలులేక రైతులు నలిగిపోతున్నారన్నారు. పేద ప్రజల ఆదాయం పెరగలేదు గాని, ధరలు మాత్రం విపరీతంగా పెరిగాయన్నారు. వ్యాపార వర్గాలను ఆదుకునేందుకు ఎన్నికల మేనిఫెస్టోలో వ్యాట్‌ను పెట్టి, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యాట్‌ను రద్దు చేస్తామన్నారు.
పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్లు సినీ రంగం నుంచి వచ్చిన చిరంజీవి సామాజిక న్యాయం అంటూ పార్టీ ఏర్పాటు చేసి, ఆ తర్వాత సొంత ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీలో విలీనమయ్యారని ఆయన విమర్శించారు. మనిషి ఉండేందుకు మూడు సెంట్ల స్థలం చాలని, అయితే వైఎస్‌జగన్‌కు బెంగుళూరులోని 30 ఎకరాల్లో భవనం నిర్మించారన్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడడం, హత్యారాజకీయాలు చేయడం, డబ్బుల కోసం హత్యలు చేయడం వౖౖెఎస్‌కాంగ్రెస్ పార్టీ నైజమన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి అభ్యర్థి, మాజీ మం త్రి బివి మోహన్ రెడ్డి, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు కేయి కృష్ణమూర్తి, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరెడ్డి రాజశేఖరరెడ్డి, టిడిపి జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు,టిడిపి ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.
నేటి పోటీ ప్రపంచంలో జర్నలిజానికి విలువలు సన్నగిల్లిపోతున్నాయని, జర్నలిజానికి నైతిక విలువలు ఎంతో అవసరమని కర్నూలు ఎంపి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు. ఎలాంటి అర్హత లేని వారు కూడ విలేకరులుగా చెలామణీ కావడం చాలా దురద ృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. కోడుమూరులో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జర్నలిస్టులకు నైతిక విలువలు ఎంతో అవసరమని సూచించారు. కనీస పరిజ్ఞానం కూడ లేని వారు కూడ విలేకరులుగా పనిచేయడం సమంజసంగా లేదని ఆయన అన్నారు. విలేకరులుగా పనిచేయాలంటే కనీస అర్హతలుంటే బాగుంటుందని ఎంపి అభిప్రాయపడ్డారు. ప్రతి కేంద్రంలో జర్నలిస్టుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుందని, అందువలన విలువలు తగ్గిపోతున్నాయని ఆయన అన్నారు. కొంత మంది కనీస విషయ పరిజ్ఞానం లేకుండా, వ్యక్తిగత విషయాలను రాస్తూ, హైలెట్స్ కావాలని ప్రయత్నిస్తున్నారని, ఇది మంచి పద్దతి కాదని ఎంపి అన్నారు. అలాంటి వారి వలన ఎంతో గౌరవంగా ఉన్న జర్నలిజానికే అప్రతిష్ట వస్తుందని ఆయన అన్నారు. జరగనున్న ఉప ఎన్నిక పోరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరు గెలుపొందుతారని ఎంపి కోట్ల సూర్య ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివ ృద్ది వలన పలువురు పేదలు లబ్ది పొందుతున్నారని, అలాంటి వారందరూ తమవైపు మొగ్గు చూపుతారని ఆయన అన్నారు. ఎమ్మిగనూరులో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకోసం తామందర ం కలసి కట్టుగా కృషి చేస్తున్నామని, తప్పకుండా గెలిపిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎ మ్మిగనూరు అభ్యర్థి విషయం విలేకరులు ప్రస్తావించగా, ఇప్పటికే తమ మంత్రి టిజి వెంకటేశ్ కాంగ్రెస్ అభ్యర్థి పేరును వెల్లడించారని ఎంపి గుర్తు చేశారు. ఎదిఏమైనప్పటికి కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందుతారని ఆయన పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కోట్ల హర్షవర్దన్‌రెడ్డి, కె.హేమాద్రిరెడ్డి, కె.మధుసూదన్‌రెడ్డి, రఘునాథరెడ్డి, గోట్ల తిమ్మప్ప, తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలోని ఆళ్ల గడ్డ అసెంబ్లిd నియోజకవర్గం ఉప ఎన్నికల అభ్యర్థి ఎంపిక వ్యవహారం ఢిల్లిd వరకు వెళ్ళింది. ఆళ్లగడ్డ అసెంబ్లిd నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తాజా మాజీ శాసన సభ్యురాలు శోభానాగిరెడ్డిని ఢీ కొనేందుకు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థిని ఎంపిక చేయడంలో అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. గతంలో పోటీ చేసిన గంగుల ప్రతాప్‌రెడ్డిని మళ్లిd రంగంలోకి దింపేందుకు అధిష్టానం తీవ్ర యత్నాలు సాగిస్తోంది. అయితే, నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలతో పాటు అవసరమైన నిధుల కేటాయింపు జరగనిదే బరిలోకి దిగేది లేదని గంగుల రాష్ట్ర అధి ష్టానంకు పేర్కొనడంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి ఆయనను రాష్ట్ర రాజధానికి పిలి చి, పలు హామీలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయినప్పటికి ఆయన సంతృప్తి చెందకపోవడంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ గులాం నబీ ఆజాద్‌తో చర్చలు జరిపేందుకు సిధ్ధమైనట్లు తెలుస్తోంది. ఆజాద్‌తో గంగులకు మంచి సంబంధాలు ఉండటంతో ఆయన ద్వారా హామీలు ఇప్పించి, రంగంలోకి దింపేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. ఈ నెల 29న ఆజాద్ హైదరాబాద్‌కు రానుండటంతో ఆయనతో మంతనాలు సాగించేందుకు అధిష్టానం చర్యలు చేపట్టింది.
ఇదిలా ఉండగా, ఎమ్మిగనూరు అసెంబ్లిd నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు పలుపార్టీలు సమాయత్తమవుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, తాజా మాజీ శాసన సభ్యులు ఎర్రకోట చెన్నకేశవరెడ్డిని ఢీ కొట్టేందుకు ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి వై.రుద్రగౌడ్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ మంత్రి బివి మోహన్‌రెడ్డి రంగంలోకి దిగుతుండగా, మరోవైపు బిజెపి నుంచి నక్కల మిట్ట శ్రీనివాసులు, లోక్‌సత్తా పార్టీ నుంచి వసంతకుమార్‌లు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఎమ్మిగనూరు అసెంబ్లిdలో పోటీ చేసే అభ్యర్థులు అధికం కావడం ద్వారా ఓట్లు చీలి ఎవరి కొంప ముంచుతుందోనన్న భయం ప్రధాన పార్టీల్లో నెలకొంది.