రంగా రెడ్డి

డీఎస్స-12 నోటిఫికేషన్ విడుదల
మే 2,3,4 తేదీల్లో రాత పరీక్షలు
అప్రెంటీస్ విధానం రద్దు
‘ఇంటర్’ నిబంధన తొలగింపు
‘ఓపెన్ డిగ్రీ’ వారికీ అర్హత
ఎస్ఏ పోస్టులకు సబ్జెక్టు నిబంధనల సడలింపు
80 మార్కులకే డీఎస్సీ
20 మార్కులకు టెట్ వెయిటేజి
మరో 7100 పోస్టులకు రెండు రోజుల్లో నోటిఫికేషన్
హైదరాబాద్, జనవరి 30 : లక్షలాది మంది ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త. కొద్ది రో జులుగా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న ‘డీఎస్సీ -2012 నోటిఫికేషన్’ సో మవారం విడుదలైంది. మొత్తం 21,343 ఉపాధ్యాయ ఉద్యోగాలను ఇందులో నోటిఫై చేశారు. ఉపాధ్యాయ అభ్యర్థులు దశాబ్దకాలంగా చేస్తోన్న ‘అప్రెంటిస్’ రద్దు డిమాండ్ కూడా నెరవేరుతోంది. వివాదాస్పదంగా మారిన ‘ఇంటర్‌లో సంబంధిత సబ్జెక్టులు తప్పనిసరి’ అనే నిబంధనను తొలగించారు.
నోటిఫై చేసిన మొత్తం పోస్టుల్లో.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 5,703, ఎస్జీటీ పోస్టులు 11, 602 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్లు 2000, పీఈటీలు 365, మునిసిపల్ పాఠశాలల్లో 1,673 పోస్టులు ఉన్నాయి. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 17వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. సచివాలయంలో సోమవారం సాయంత్రం 3 గంటలకు మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కె.పార్థసారథి ఈ డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. డీఎస్సీకి విద్యార్హతల నిబంధనల్లో కొన్నింటిని సడలించారు.
స్కూల్ అసిస్టెంట్స్ (మేథ్స్, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్) పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్ స్థాయిలో కూడా మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, హిస్టరీ, జాగ్రఫీ సబ్జెక్టులు చదివి ఉండాలన్న నిబంధనలను తొలగించారు. అంటే.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్ చదివి ఉండాలన్న నిబంధన లేదు.
ఫలితంగా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా నేరుగా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు కూడా అర్హత లభిస్తుంది. స్కూల్ అసిస్టెంట్స్ (జీవశాస్త్రం) పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు జీ.వో.నెం.4లో పేర్కొన్న సబ్జెక్టులతో పాటు సెరికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, పౌల్ట్రీ సబ్జెక్టుల అభ్యర్థులకు కూడా అర్హత కల్పించారు. టీచర్లకు అప్రెంటిస్ విధానాన్ని ఈ డీఎస్సీ నుంచి రద్దు చేశారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు నమూనా, యూజర్ గైడ్ కోసం జ్ట్టిఞ://్చఞఛీటఛి.ఛిజజ.జౌఠి.జీn వెబ్‌సైట్‌ను చూసుకోవాలి.
డీఎస్సీ 80 మార్కులకే..
టెట్‌కు వెయిటేజీ ఇవ్వనున్న కారణంగా 80 మార్కులకే డీఎస్సీ పరీక్షను నిర్వహించనున్నారు. మిగతా 20 మార్కులకు టెట్ మార్కులను వెయిటేజీగా జమ చేస్తారు. ఒక్కో ప్రశ్నకు అర మార్కు చొప్పున 80 మార్కులకు 160 డీఎస్సీ పరీక్ష ఉంటుంది. ఎస్జీటీ పరీక్షలో జనరల్ నాలెడ్జ్‌కు 10 మార్కులు, పర్‌స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 10, ఇంగ్లీష్ 9, ఇండియన్ లాంగ్వేజ్ 9, మాథ్స్ 9, సైన్స్ 9, సోషల్ స్టడీస్ 9, టీచింగ్ మెథడ్ 15 మార్కులు ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్ పరీక్ష ల్లో.. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10, పర్‌స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 10, సబ్జెక్ట్ కంటెం ట్ 44, టీచింగ్ మెథడాలజీ 16 మార్కులు ఉంటాయి. పీ ఈటీలకు టెట్ ఉండకపోవ డం వల్ల పూర్తిగా 100 మా ర్కులకు పరీక్ష ఉంటుంది.

రాష్ట్రంలో 15 లక్షల ఉద్యోగాలు కల్పించిన తర్వాతే ఓట్ల కోసం వస్తామని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. రానున్న మూడు సంవత్సరాల్లో అర్హులైన వారందరికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. పరిశ్రమలు, ఆసుపత్రి, సేవా రంగాల్లో నిరుద్యోగ యువత ఉద్యోగవకాశాలను అందిపుచ్చుకునే విధంగా అవసరమైన వృత్తి నైపుణ్య శిక్షణ నిచ్చేందుకు చర్యలు తీసుకున్నామని వివరించారు. ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలోని మన్సూరాబాద్‌లో మంగళవారం స్థానిక శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన 2వ విడత రచ్చబండకు సిఎం ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ గ్రూప్ 2 ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ తర్వాత భర్తీ చేసేందుకు జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు ఇంటర్వ్యూలు రద్దు చేసినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. రాత పరీక్షతో మౌఖిక పరీక్షకు ఎంపికైన అభ్యర్థులందరికీ ఎపిపిఎస్‌సికి ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు రెండు నుంచి మూడు సంవత్సరాల కాలం పడుతుందని, దీన్ని నివారించి వెంటనే నియామకాలు జరిపేందుకు వీలుగా ఇంటర్వ్యూలను రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. ఉద్యోగ నియామకాలను పారదర్శకంగా, సిఫార్సులకు తావు లేకుండా భర్తీ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను ఇక ఆధార్ (గుర్తింపు సంఖ్య)తోనే అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ పథకాలు నిజమైన లబ్ధిదారులకు మాత్రమే అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఆధార్‌తో రాష్ట్రంలో ఏ జిల్లాకు చెందిన వారైన మరే జిల్లాలోనైనా తమ రేషన్ కార్డును ఉపయోగించుకునే వీలుందన్నారు. అయితే ఒకటికి మించి రెండు రేషన్ కార్డులున్న వారు ఒక కార్డును కోల్పోక
తప్పదన్నారు. మహిళలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకుగాను పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాలకు 1000 కోట్ల రూపాయలతో స్త్రీ నిధి కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 125 పట్టణ కేంద్రాల్లో రూ.25 లక్షల వ్యయంతో ఒక్కో మహిళా సమాఖ్య భవనాన్ని నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేస్తున్న స్త్రీ నిధి పథకంతో పాటు మహిళా సమాఖ్య భవనాల నిర్మాణాలను చేపట్టడం జరిగిందని, దీనిని పట్టణ ప్రాంతాలకు విస్తరించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. మూడు వేల కోట్లతో పాఠశాలకు పక్కా భవనాలు, మరుగుదొడ్ల నిర్మాణం తదితర సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. డిసెంబర్‌లో ప్రధానమంత్రి చేతుల మీదుగా లక్ష మందికి ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలను అందజేసేందుకు కార్యక్రమం రూపొందిస్తున్నామన్నారు.
ప్రజలకు త్వరితగతిన మెరుగైన సేవలందించేందుకు అదే విధంగా వివిధ సర్టిఫికెట్ల జారీలో పారదర్శకత పాటించేందుకుగాను వీలుగా భూమికి సంబంధించిన పట్టా సర్టిఫికెట్లు, రిజిస్ట్రేషన్, కుల, ఆదాయ, నివాస, జనన, మరణ తదితర ధ్రువీకరణ పత్రాలను మీ-సేవ కేంద్రాల ద్వారా ఇచ్చేందుకు ఏప్రిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పటికే ఈ కేంద్రాలను పైలట్ ప్రాజెక్టు ప్రాతిపదికన కృష్ణా, చిత్తూరు, ఖమ్మం జిల్లాల్లో ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు.
మీ సేవ ద్వారా దళారీలు, లంచాల బారినుంచి ప్రజలకు విముక్తి కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. రెండు విడతల రచ్చబండ కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో 8 లక్షల పెన్షన్లు, 30 లక్షల రేషన్ కార్డులు, 28 వేల ఇందిరమ్మ ఇళ్లను మంజూరీ చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్ద పీట వేస్తూ అధిక మొత్తంలో నిధులు మంజూరు చేస్తున్నట్లు పేర్కొంటూ గత సంవత్సరం 27 లక్షల మంది విద్యార్థులకు రూ.3,500 కోట్ల స్కాలర్‌షిప్పులను అందించడం జరిగిందని, ఈ సంవత్సరం స్కాలర్‌షిప్పుల నిమిత్తం 5 వేల కోట్ల రూపాయలను వెచ్చించనున్నట్లు సిఎం వెల్ల్లడించారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు వీలుగా డిసెంబర్‌లోపు 1.16 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేసి ఇంటర్వ్యూలు లేకుండా అభ్యర్థుల ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
పట్టణ ప్రాంతాల అభివృద్ధిపై రాజీవ్ ఆవాస్ యోజన కింద రూ.9 వేల కోట్ల వ్యయంతో 1500 మురికివాడలను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి అందజేయడం జరిగిందని, ఇందులో పైలట్ ప్రాజెక్టు కింద 5 కాలనీలను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, అర్హులైన నిరుపేదలందరికి తెల్ల రేషన్ కార్డులను జారీ చేస్తామని పేర్కొంటూ, రచ్చబండ సందర్భంగా తీసుకున్న దరఖాస్తులన్నింటిని పరిశీలించి రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి, మంత్రి కాసు కృష్ణారెడ్డి, ఎంపీ సర్వే సత్యనారాయణ, శాసనసభ్యుడు డి.సుధీర్‌రెడ్డి ప్రసంగించారు. అనంతరం ముఖ్యమంత్రి లబ్ధిదారులకు రేషన్‌కార్డులు, పెన్షన్లు, మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలను, పావలా వడ్డీ రుణాలను అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రంగారెడ్డి, శాసనసభ్యులు కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి, ఆకుల రాజేందర్, ప్రసాద్ కుమార్, బి.రాజిరెడ్డి, భిక్షపతి యాదవ్, శ్రీశైలం గౌడ్, జిహెచ్‌ఎంసి కమిషనర్ కృష్ణబాబు, జల మండలి ఎండి అదర్ సిన్హా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ వి.శేషాద్రి పాల్గొన్నారు.

కాయలున్న చెట్టుకే రాళ్లు పడతాయి…..అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థమంతంగా నిర్వర్తిస్తున్నందుకే ప్రతిపక్షాలు తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని… ఎవరు విమర్శలు చేసినా తాము పట్టించుకోమని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ నియోజకవర్గం కీసర మండలంలోని చీర్యాలలో గురువారం రచ్చబండ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు. సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అధ్యక్షతన వహించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల విషయంలో రాజీలేకుండా తమ ప్రభుత్వం పని చేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో గతంలో కనీవినీ ఎరుగని రీతిలో 30 లక్షల రేషన్‌కార్డులు ఇచ్చా మని ఆయన తెలిపారు. 8 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేశామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 52 లక్షల గృహాలు పూర్తి చేశామని 15 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. కొత్తగా 12.30 లక్షల ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
మహిళలకు పావలా వడ్డీ
స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇక పావలా వడ్డీయేనని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇప్పటి వరకు జిల్లా సమాఖ్యల నుంచి మండల సమాఖ్యలకు అక్కడి నుంచి గ్రామ సమఖ్యల ద్వారా పావలా వడ్డీ రుణాలు పంపిణీ చేసే వారని ఇక ముందు స్వయం సహాయక సంఘాల మహిళలకు పంపిణీ చేయనున్నట్లు హామీ ఇచ్చారు. జిల్లా సమాఖ్యల ద్వారా వచ్చేందుకు నెల రోజుల సమయం పడుతోందని ఇక ముందు నేరుగా ఆన్‌లైన్ ద్వారా పావలా వడ్డీ రుణాలు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని కిరణ్‌కుమార్ వెల్లడించారు. ఆరేళ్ల కాలంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.830 కోట్లు పావలా వడ్డీ కింద పంపిణీ చేశామన్నారు. 7 శాతం వడ్డీకే మహిళలకు రుణాలు పంపిణీ చేయాలని ఇటీవల ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్‌సింగ్‌ను కోరినట్లు తెలిపారు. వచ్చే బడ్జెట్‌లో దీనికి శ్రీకారం చుట్టనున్నారని, దీంతో మహిళలకు వడ్డీ లేకుండా రుణాలు పంపిణీ చేయనున్నట్లు ఆయన
పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్‌లో లక్ష వరకు రుణం తీసుకున్న రైతులు సంవత్సర కాలంలో రుణాలు తిరిగి చెల్లిస్తే వడ్డీ ఉండదని తెలిపారు. రాష్ట్రంలో 95 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చనున్నట్లు వెల్లడించారు. వీరందరికీ గాను రూ.12వేల కోట్లు అవుతుందన్నారు.
ముక్కిపోయిన బియ్యం ఎలా తినాలి
రూపాయికే కిలో బియ్యం పంపిణీ చేస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్నారు…ఆ బియ్యాన్ని మీరు తినగలరా….ముక్కిపోయిన బియ్యం ఎలా తినగలమని స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రచ్చబండ కార్యక్రమం ప్రారంభమైన కొద్ది సేపటికే మహిళలు లేచి నిరసన వ్యక్తం చేశారు. జవహార్‌నగర్‌లో పట్టాల పంపిణీ చేయాలని, డంపింగ్ యార్డ్‌ను వెంటనే మార్పు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలు లేచి నిరసన తెలుపుతున్న విషయం చూసిన ముఖ్యమంత్రి కలెక్టర్ శేషాద్రిని పిలిచి వారితో మాట్లాడాలని సూచించారు. కలెక్టర్ సూచన మేరకు డిఆర్‌డిఎ పిడి వరప్రసాద్‌రెడ్డి వెళ్లి నచ్చజెప్పే ప్రయత్నం చేయగా మహిళలు ఒప్పుకోలేదు. దీంతో స్థానిక ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే ప్రసాద్‌కుమార్‌ను పురమాయించారు. లక్ష్మారెడ్డి వెళ్లి నచ్చజెప్పగా మహిళలు శాంతించారు. హోం మంత్రి సబితారెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ సర్వే సత్యనారాయణ, మేయర్ బండ కార్తీకారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

అవినీతి సంపాదనతో కోట్లకు పడుగెత్తిన ఓ పోలీస్ అధికారి ఇంటిపై ఏసిబి అధికారులు దాడులు నిర్వహించారు. రంగారెడ్డిజిల్లా ఆఫీసర్ ఆన్‌స్పెషల్‌డ్యూటీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సర్వేశ్వర్‌రెడ్డి గచ్చిబౌలిలోని వెంకటాద్రిఆపార్ట్‌మెంట్ ప్లాట్ నెంబర్ 401లో ఉండే నివాసంపై గురువారం తెల్లవారు జామునుంచే ఎసిబి జాయింట్‌డైరెక్టర్ సంపత్‌కుమార్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో ఆదాయానికి మించి కూడబెట్టిన పలు విలువైన పత్రాలు అధికారులకు లభ్యమయ్యాయి.
దీంతో వాటిని అధికారులు సీజ్‌చేసి సర్వేశ్వర్‌రెడ్డిని అరెస్టుచేసి ఒకటవ అదనపు ప్రత్యేక జడ్జిముందు హాజరుపర్చారు. ఈ దాడుల్లో దాదాపు 5కోట్ల 79లక్షల 90వేల విలువజేస్తే ఆస్తులు ఉన్నట్లు (మార్కెట్ విలువ ప్రకారం రూ.25 కోట్లు) సంపత్‌కుమార్ తెలిపారు. ఏకకాలంలో సర్వేశ్వర్‌రెడ్డి ఇంటితో పాటు తన బంధువుల ఇళ్లపై సోదాలు చేయడం జరిగిందని, తన సొంత ఊరు మహబూబ్‌నగర్ జిల్లా చిల్కటోని పల్లిలో నివాసంఉండే ఇంటికి తాళం వేసి ఉందని, ఆఇంటిని తీసి సోదాలు నిర్వహిస్తే మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు.

సకల జనుల సమ్మెలో అన్ని వర్గాలు కదిలివస్తుంటే ఏ మాత్రం చలనం లేకుండా ప్రేక్షకపాత్ర పోషిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను నిలదీసి ఉద్యమ సెగ ఢిల్లీకి తగిలేలా కృషి చేయాలని రాజకీయ జెఎసి ఛైర్మన్ ప్రొపెసర్ ఎం. కోదండరామ్ పిలుపునిచ్చారు. సకల జనుల సమ్మెలో భాగంగా గురువారం ఖమ్మంలో జరిగిన పోరు గర్జన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణలో పది రోజులుగా జరుగుతున్న సకలజనుల సమ్మెలో తెలంగాణ సమాజం మొత్తం కదిలివచ్చి భాగస్వాములవుతుంటే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కన్పించకుండా పోయారని మంత్రులు ఏమీ ఆశించి మౌనంగా ఉన్నారో అర్థం కావడం లేదన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కడికి పోయారో తెలియడం లేదని.. ఎక్కడా దాక్కున్నారో వేతకాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎంపిలు నోరు తెరిస్తే ఢిల్లీ కదిలిరాదా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ మంత్రులు కదిలివస్తే నిజాం విద్యార్థులపై దాడులు జరిగేవా? స్వామిగౌడ్‌ను అరెస్ట్ చేసేవారా? ఆర్టీసి బస్సులను తిప్పేవారా? అంటూ కోదండరామ్ ప్రశ్నించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ప్రేక్షకపాత్రను సవాల్‌గా తీసుకొని ఎక్కడపడితే అక్కడ వారిని నిలదీయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో సమ్మె జరగడం లేదని ఢిల్లీలో భజన చేసే రేణుకచౌదరి, అభిషేక్ సింఘ్వీలు కళ్లు ఉండి చూడదల్చుకుంటే చెవులు ఉండి వినదల్చుకుంటే తెలంగాణలో అడుగుపెట్టి చూడాలన్నారు.
శాంతియుతంగా సహనంతో సమ్మె చేస్తున్నామని ‘తెలంగాణ ప్రజల సహనాన్ని, ఓర్పును వారు తప్పుగా అర్థం చేసుకోవద్దని హితవు పలికారు. సమ్మెపై సీఎం కిరణ్ మాట్లాడిన తీరు పిల్లచేష్టల్లా ఉన్నాయన్నారు. సీఎం సమ్మె సెగ తాకకుండా బుల్లెట్ ప్రూప్ తగిలించుకున్నాడో లేదా ఏదైనా లేహ్యం, పౌడర్ రాసుకున్నాడో తెలియడం లేద న్నారు. ఆయనకు ఏ పేరు పెట్టాలో డిక్షనరీలో అర్ధాలు వెతకాల్సి వస్తుందన్నారు. ఈ నెల 24, 25 తేదీల్లో జరిగే రైల్‌రోకో ద్వారా సమ్మె సెగ ఢిల్లీకి తాకాలని కోదాండరామ్ పిలుపునిచ్చారు. 48 గంటలపాటు తెలంగాణలో రైలు పట్టాలు కన్పించ కుండా మానవహారాలే కన్పించాలన్నారు. విద్యార్థులు అవేశానికి పోయి టవర్లు ఎక్క వద్దని, ఆత్మబలిదానాలకు పాల్పడవద్దని కోరారు.
వడ్డీతో సహా మూల్యం చెల్లిస్తాం : ఈటెల
తెలంగాణ కోసం జరుగుతున్న పోరాటాన్ని అణిచివేసేందుకు ప్రయత్నిస్తే వడ్డితో సహా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని టిఆర్‌ఎస్ శాసనసభపక్ష నాయకులు ఈటెల రాజేందర్ అన్నారు. ఉద్యమాన్ని అణచివేయడానిి చూస్తే తెలంగాణ వచ్చిన తరువాత వడ్డీతో సహా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే సంసృ్కతి ఆంధ్రా వాళ్ళదని రేణుకచౌదరి మరోసారి నిరూపించిందన్నారు.
గర్జించిన ఖమ్మం
పోరుగర్జన పేరుతో నిర్వహించిన సభ విజయవంతం అయ్యింది.ఈ సభకు ముఖ్యఅతిథిగా రావాల్సిన టిఆర్‌ఎస్ అధినేత .ెచంద్రశేఖర్‌రావు అస్వస్థతకు గురికావడంతో హాజర ్‌కాలేకపోయారు.దీంతో నిర్వాహకులు నిరుత్సాహనాకి గురైనప్పటికి ప్రజలు మాత్రం భారీగా తరలివచ్చారు. తెలంగాణ ఉద్యమంలో మేము సైతం అంటూ ఏజెన్సీ నుంచి ఆదివాసులు , కొయ్యలు భారీ ఎత్తున్న తరలి వచ్చారు.

తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో అధిష్ఠానంతో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించిన తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు చిట్టచివరి సారిగా ఈ నెల 25వ తేదీన ఢిల్లీకి వెళ్ళాలని నిర్ణయించారు. ఈ సారి అధిష్ఠానం సానుకూలంగా నిర్ణయం తీసుకోని పక్షంలో హైదరాబాద్‌కు తిరిగి వచ్చి అందరూ రాజీనామాలు చేయాలని నిర్ణయించారు. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా రాజీనామాలకు సిద్ధంగా ఉండాలని సమావేశంలో నిర్ణయించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సారధ్య సంఘం చైర్మన్, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు నివాసంలో గురువారం తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సారథ్య సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి, గవర్నర్‌పై సభ్యులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జరుగుతున్న సకల జనుల సమ్మె గురించి ముఖ్యమంత్రి, గవర్నర్ కేంద్రానికి, అధిష్ఠాన వర్గానికి తప్పుడు నివేదికలు పంపిస్తున్నారని, ఆ నివేదికల అధారంగానే అధిష్ఠానం ప్రతినిధులు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్నారని వారు విమర్శించారు. రాష్ట్రంలో పరిస్థితిని అంచనా వేసేందుకు అధిష్ఠాన వర్గం తన దూతగా ఎవరినైనా పంపించి వాస్తవాలను తెలుసుకోవచ్చు కదా అని వారు అభిప్రాయ పడ్డారు. సకల జనుల సమ్మె ప్రభావం ఏమీ లేదంటూ ఎఐసిసి అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి ఢిల్లీలో చేసిన ప్రకటనను సమావేశం తీవ్రంగా ఖండించింది. అదే విధంగా, తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల గురించి తెరాస అధినేత కెసిఆర్ చేస్తున్న వ్యాఖ్యలను కూడా సమావేశం ఖండించింది.
సకల జనుల సమ్మెతో తెలంగాణలో జన జీవనం స్తంభించినా అధిష్ఠాన వర్గం తెలంగాణపై నిర్ణయం తీసుకోకపోవడం పట్ల సారధ్య సంఘం ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఇక చివరిసారిగా ఢిల్మీకి వెళ్ళి అధిష్ఠాన వర్గాన్ని కలిసి ఇక్కడి పరిస్థితిని వివరించి తెలంగాణపై వెంటనే నిర్ణయం తీసుకోవలసిందిగా కోరుదాం, అధిష్ఠాన వర్గం సానుకూలంగా స్పందిస్తే సరే, లేని పక్షంలో వెంటనే హైదరాబాద్‌కు తిరిగి వచ్చి తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం రాజీనామాలు చేద్దాం’ అని సమావేశంలో సభ్యులు అన్నారు. దీనిపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, మళ్ళీ మనం ఎవరం ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం అందరం రాజీనామాలు చేస్తే అధిష్ఠానవర్గమే దిగి వచ్చి తెలంగాణను ప్రకటిస్తుంది’ అని అన్నారు.
మంత్రులు కూడా రాజీనామాలు చేయాలన్న విషయం చర్చకు వచ్చినపుడు, ఎంతమంది మంత్రులు రాజీనామాలు చేసేందుకు సిద్ధపడతారో అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సారధ్య సంఘం చైర్మన్‌గా ఉన్న పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె.జానారెడ్డి సమావేశంలో తెలియజేశారు. వెంటనే మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలుగజేసుకుని తాను కూడా రాజీనామా చేసేందుకు సిద్ధమేనని ప్రకటించారు. తన రాజీనామా గురించి ఇంతకు ముందే చెప్పానని, నెలాఖరులోగా తెలంగాణ ఏర్పాటుకు అధిష్ఠానం సానుకూల నిర్ణయం తీసుకోని పక్షంలో అక్టోబర్ 2వ తేదీ నుంచి ఆమరణ దీక్ష చేపట్టనున్న విషయాన్ని కూడా మీడియా ద్వారా ప్రకటించానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరించారు. నల్లగొండ జిల్లా సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆర్.దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ, తన సోదరుడు, ఉద్యావన శాఖ మంత్రి ఆర్.వెంకటరెడ్డితో కూడా తాను రాజీనామా చేయిస్తానని హామీ ఇచ్చారు. అయితే మిగిలిన తెలంగాణ మంత్రుల్లో ఎంతమంది రాజీనామాకు సిద్ధపడతారో ఇప్పుడే చెప్పలేమని వారు అభిప్రాయ పడ్డారు.
మాకు కావాల్సింది తెలంగాణ.. కిలో రూ.1 బియ్యం కాదు
ఇలా ఉండగా, సమావేశం అనంతరం మాజీ మంత్రి, ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. సకల జనుల సమ్మె ఇంత తీవ్రంగా ఉంటే రూపాయికి కిలో బియ్యాన్ని ఎవరు అడిగారని ప్రశ్నించారు. ‘మాకు కావలసింది తెలంగాణ తప్ప రూపాయికి కిలో బియ్యం కాదు’ అని దామోదర్‌రెడ్డి అన్నారు. సకల జనుల సమ్మె ప్రభావం గురించి ముఖ్యమంత్రి అధిష్ఠాన వర్గానికి తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఆయన మండి పడ్డారు.
తెలంగాణ ఇవ్వకపోతే కఠిన నిర్ణయాలు
తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సారధ్య సంఘం అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ, ఇక్కడి పరిస్థితిని అధిష్ఠాన వర్గానికి వివరించేందుకు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం ఈ నెల 25వ తేదీ సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళతామన్నారు. 26వ తేదీన అధిష్ఠాన వర్గాన్ని కలుసుకుంటామని, ఈ సందర్భంగా తెలంగాణకు అనుకూలంగా అధిష్ఠాన వర్గం నిర్ణయం తీసుకోని పక్షంలో హైదరాబాద్ తిరిగివచ్చి కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదని ఆయన హెచ్చరించారు.
తప్పుడు నివేదికలు పంపుతున్న సిఎం, గవర్నర్
కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు మందా జగన్నాధం మాట్లాడుతూ, సకల జనుల సమ్మెకు సంబంధించి ముఖ్యమంత్రి, గవర్నర్ కూడా కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచి వేసేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.

తెలంగాణా రాష్ట్ర డిమాండుతో సకలజనుల సమ్మెలో పాల్గొంటున్న ఉద్యోగులకు జీతాలు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ‘నో వర్క్ … నోపే’ అంటూ గతంలో జారీచేసిన జీవో 177ను కచ్చితంగా అమలుచేయాలనే ప్రభుత్వం భావిస్తోంది. ఈమేరకు ఈనెల 17వ తేదీనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్ని ప్రభుత్వ శాఖల అధిపతులకూ, జిల్లా కలెక్టర్లకూ మెమో జారీ చేశారు. తాజాగా ఈ విషయమై ఏర్పాటుచేసిన మంత్రుల బృందం, ఉన్నతాధికారులతో గురువారం రాత్రి జరిగిన సమావేశంలోనూ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి ఇదే ఆదేశాలను జారీచేశారు. ‘సమ్మె చేస్తున్న ఉద్యోగులకు జీతాలను నిలిపియండి’ అని ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిసింది. విధులకు హాజరైన ఉద్యోగుల నుండి ఆ మేరకు సర్టిఫికెట్లు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ‘విధులకు హాజరైన ఉద్యోగుల నుండి సర్టిఫికెట్లు తీసుకున్న తరువాతే వారి పేర్లను పే రోల్స్‌లో చేర్చాలి’ అంటూ గురువారం నాడే ఆదేశాలు జారీఅయ్యాయి. మరోవైపు సమ్మె కారణంగా ఖజానాపై పడుతున్న అదనపు భారాన్ని ప్రజలపై మోపడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడంతో ఇతర రాష్ట్రాల నుండి కొనుగోలు చేస్తున్న బొగ్గు, విద్యుత్, గ్యాస్ సర్‌ఛార్జీ భారాన్ని ప్రజలపై మోపనున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం యూనిట్‌కు 50 నుండి 60 పైసల సర్‌ఛార్జీ భారాన్ని ప్రజలపై మోపనున్నారు. ‘వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తున్నందున సర్‌ఛార్జీ భారాన్ని రైతులపై వేయలేం. ఇతర తరగతులకు చెందిన ప్రజలు, పరిశ్రమల నుండి ఈ మొత్తాన్ని వసూలు చేస్తాం’ అని ఉన్నతస్థాయి అధికారి ఒకరు ప్రజాశక్తితో చెప్పారు.
హైకోర్టు తీర్పు సాకుతో…!
‘నోవర్క్ .. నోపే’ విధానంతో జారీ చేసిన జీవో 177 అమలుకు హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం కారణంగా చెబుతోంది. ఒక రిట్ పిటిషన్‌పై ఆగస్టు 16న హైకోర్టు జారీచేసిన ఆదేశాల్లో జీవో 177ను నిలుపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 1677 అమలుపై స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో జీవో 177ను అమలుచేయక తప్పనిస్థితి ఏర్పడిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తమ అనుమతి లేకుండా జీవో 177లో ఎటువంటి మార్పులూ చేయకూడదని హైకోర్టు ఆదేశించిందని ఈ నేపథ్యంలో జీతాలు నిలిపివేయడం మినహా మరోమార్గం లేదని ఆ వర్గాలంటున్నాయి. వాస్తవానికి ఈ విషయాలను పేర్కొం టూనే 17న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 30389 మెమోను అన్ని ప్రభుత్వ
శాఖలకూ జారీ చేశారు. జీతాల డ్రాయింగ్ అధికారులు జీవో 177ను పూర్తిస్థాయిలో అమలుచేయాలని, పే బిల్స్ ట్రెజరీకి సమర్పించే సమయంలో ఆ మేరకు సర్టిఫికెట్లు సమర్పించాలని ఆ మెమోలో ఆయన ఆదేశించారు. దీంతో పే రోల్స్ తయారు చేయడం నత్తనడకగా మారింది. దీన్ని నివారించడానికి విధులకు హాజరైన వారి నుండి ఆ మేరకు సర్టిఫికెట్లు తీసుకోవాలని తాజాగా ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలోని ప్రభుత్వోద్యోగులకు రోజుకు 75 కోట్ల రూపాయల మేర జీతాలు చెల్లించాల్సుంది. తెలంగాణా ప్రాంతంలోని ఉద్యోగులకు రోజుకు 33 కోట్ల రూపాయలు జీతాలుగా చెల్లించాల్సుంది.
విద్యుత్ భారం ఇలా…!
విద్యుత్ కొరతను నివారించడానికి ఇప్పటివరకు 1,500 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అదిగాకుండా ఇతర రాష్ట్రాలనుండి పెద్దఎత్తున బొగ్గును దిగుమతి చేసుకుంటున్నారు. బొగ్గును సరఫరా చేయడానికి మహారాష్ట్ర 33 కోట్ల రూపాయల మొత్తాన్ని అడ్వాన్స్‌గా అడిగినట్లు తెలిసింది. మిగిలిన సంస్థలు కూడా ఇదే రీతిలో డిమాండ్ చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు విద్యుత్‌ను ‘బదులు’ ప్రాతిపదికన సరఫరా చేయడానికి సంసిద్దత వ్యక్తంచేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికే మొగ్గుచూపుతోంది. లేనిపక్షంలో పీక్ సమయంలోనే ఆ రాష్ట్రాలు బదులు చెల్లించాలని డిమాండ్ చేస్తే కష్టమవుతుందని చెబుతున్నారు. బొగ్గు కోసం 40 నుండి 50 శాతం అధికంగా చెల్లించాల్సివస్తోందని, విద్యుత్ కొనుగోళ్ళు కూడా ఇదే మాదిరి సాగుతోందని, సహజవాయువు కోసం ఇంకా పెద్ద మొత్తంలో ఖర్చు చేయావస్తోందని ఒక అధికారి వివరించారు. ‘ఈ మొత్తాన్ని లెక్కిస్తే యూనిట్‌కు 50 నుండి 60 పైసలు అధికంగా ఖర్చవుతోంది’ అని ఆయన చెప్పారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఆ భారం ప్రజలపైనే పడనుంది.
సమ్మెలో లేని ఉద్యోగులకు సకాలంలో జీతాలు : సిఎం
సమ్మెలో పాల్గొనని ఉద్యోగులకు ఎటువంటి పరిస్థితుల్లోనూ సకాలంలో జీతాలు చెల్లించాలని ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. గురువారం రాత్రి జరిగిన సమావేశంలో ఈ మేరకు సిఎం ఆదేశాలు జారీ చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సమ్మె కారణంగా సాధారణ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా చూడాలని, వైద్య సేవలకు ఆటంకం కలగకుండా చూడాలని ఆయన ఆదేశించారు.
సమ్మెలో ఎందరు …?
ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రభుత్వోద్యోగులు 34 నుండి 36 శాతంలోపే సమ్మెలో పాల్గొంటున్నారని ఒక ఉన్నతాధికారి తెలిపారు. అయితే ఉపాధ్యాయులతో పాటు సింగరేణి, ఆర్టీసీల్లో సమ్మె పెద్దఎత్తున జరుగుతోంది. ఈ సంస్థలకు చెందిన ఉద్యోగులు 85 శాతానికి పైగా సమ్మెలో భాగస్మాములవుతున్నారని ఒక ఉన్నతాధికారి తెలిపారు. సచివాలయంతో పాటు, హెచ్ఓడిల స్థాయిలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు విధులకు హాజరవుతుండటంతో ప్రభుత్వోద్యోగుల సంఖ్య తక్కువగా కనబడుతోందని ఆయన వివరించారు. జిల్లాల స్థాయిలో 80 నుండి 86 శాతం మంది ప్రభుత్వోద్యోగులు సమ్మెలో ఉన్నారని ఆయన చెప్పారు.
శాఖ మొత్తం ఉద్యోగులు సమ్మెలో ఉన్నవారు
ప్రభుత్వోద్యోగులు 252000 86800
ఉపాధ్యాయులు 141000 128000
సింగరేణి 67000 57100
ఆర్టీసి 66000 65192

‘ఇంకానా… ఇకపై సహించం’ అంటూ తెలంగాణ ఉద్యమ ఉధృతికి నేతృత్వం వహిస్తున్న కొందరు నేతలు తమ పిల్లల్ని మాత్రం ‘భద్రం కొడుకో…!’ అంటూ ఆంధ్రా ప్రాంతంలో హాస్టళ్లలో వుంచి చదివిస్తున్నారు. ఉద్యమ సెగ తమ పిల్లల భవిష్యత్తుకు ఏమాత్రం తగలకుండా ముందే జాగ్రత్త పడ్డారు. వాళ్ల బాటలోనే తెలంగాణ ప్రాంతానికి చెందిన సంపన్న, ఎగువ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన కొందరు కూడా తమ పిల్లల్ని విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లోని కాలేజీల్లో చేర్పించారు.
తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్రంకోసం పోరాటం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. విద్యార్థులూ,ఉద్యోగులు, కవులు, కళాకారులు, కులసంఘాలు ఒకటేంటి అన్ని రంగాలకు చెందిన మెజారిటీ ప్రజలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నారు. తెలంగాణ జిల్లాల్లోని ఓయు, కేయు వంటి యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులు పూర్తిగా ఉద్యమంలోనే ఉన్నారు. ఇక ప్రాధమికోన్నత పాఠశాలనుండి మొదలుకుని ఇంటర్ కాలేజీల వరకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు సకల జనుల సమ్మెతో దాదాపు మూత పడ్డాయి. అయితే తెలంగాణ ప్రాంతంలో ఉన్న విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులంతా ఉద్యమంలో ఉంటే ఇటు ముందు చూపుతో ఆంధ్రాప్రాంతంలోని విద్యాసంస్థల్లో చేరిన విద్యార్థులు ఎంచక్కా బుద్ధిగా చదువు కుంటున్నారు. విజయవాడ, గుంటూరు జిల్లాల్లో ఉన్న నారాయణ, శ్రీచైతన్య, ఎన్ఆర్ఐ, శ్రీగాయత్రి, కెకెఆర్ గౌతమ్స్కూల్ వంటి సంస్థల్లో సుమారు 1.25 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ ప్రాంతాలకు చెందిన ఖమ్మం, నల్గొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాలకు చెందిన విద్యార్థులు ప్రస్తుత విద్యాసంత్సరంలో ఇబ్బడి ముబ్బడిగా ఆంధ్రాజిల్లాల్లో చేరారు.
విజయవాడ, గుంటూరుల్లోని శ్రీచైతన్య కాలేజీలొనె ఇంటర్ చదివే విద్యార్థులు సుమారు 28 వేల మంది చదవుతున్నారు. నారాయణ కాలేజీలో విజయవాడ, గుంటూరు బ్రాంచిల్లో కలిపి దాదాపు 30 వేలకు పైగా తెలంగాణ జిల్లాలకు చెందిన విద్యార్థులు చదువుతున్నారు. శ్రీగాయత్రీ, ఎన్ఆర్ఐ కాలేజీల్లో 40 వేలకు పైగా చదువుతున్నారు. ఇలా చేరడానికి కారణం ఖచ్చితంగా తెలంగాణ పోరాట భయమేనని పలువురంటున్నారు. తెలంగాణ పోరాటం తారాస్థాయికి చేరడంవల్ల తమ పిల్లల చదువులు తెలంగాణలో సజావుగా సాగవనే విషయాన్ని ముందుగానే గుర్తించిన ఉద్యోగులు, వ్యాపారులు, రాజకీయనాయకులు అనేక మంది తమ పిల్లలను తెలివిగా ఆంధ్రా ప్రాంతంలోని విద్యాసంస్థల్లో చేర్పించారు.
తెలంగాణ విద్యార్థుల సంఖ్యపై ఇంటిలిజెన్స్ఆరా..
విజయవాడ, గుంటూరు జిల్లాల్లోని కార్పొరేట్ కాలేజీల్లో చదువుతున్న తెలంగాణ జిల్లాలకు చెందిన విద్యార్థుల సంఖ్యపై ఇటీవలే కేంద్ర,రాష్ట్ర ఇంటిలిజెన్స్ వర్గాలు ఆయా సంస్థలకు వెళ్లి వివరాలు సేకరించినట్లు తెలిసింది. దాదాపు 1.25 లక్షల మంది విద్యార్థులు ఇంటర్,ఎంసిఏ, ఇతర టెక్నికల్ కోర్సుల్లో చదువుతున్నట్లు వారు గుర్తించినట్లు సమాచారం. ఆయా వర్గాలు ఈ అంశాలు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అయితే ఆంధ్రాప్రాంత జిల్లాల్లోని ఈ కార్పొరేట్ విద్యాసంస్థల్లో తెలంగాణ ఉద్యమం లేని సమయంలోకూడా ఆయా జిల్లాలనుంచి విద్యార్థులు చదివారు. ఇప్పుడు ఆ నాటి శాతంతో పోల్చినప్పుడు వెయ్యిరెట్లు ఎక్కువగా చేరారు. ప్రస్తుత విద్యార్థుల వలసకు కారణం ముమ్మాటికీ తెలంగాణ ఉద్యమ తీవ్రతేనని కొందరు విశ్లేషిస్తున్నారు.
‘కార్పొరేట్’ విద్యార్థుల తరలింపు..
ప్రధాన కార్పోరేట్ విద్యాసంస్థలు తెలంగాణ ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకుని హైద్రాబాద్తోసహా తెలంగాణ జిల్లాల్లో ఉన్న తమ బ్రాంచ్లనుండి సగానికి పైగా విద్యార్థులను సీమాంద్ర ప్రాంత జిల్లాలకు తరలించారు.

ఏ రాజకీయ నాయకుడి చైతన్యం ఉద్యోగులకు అవసరం లేదు. ఇక్కడ చైతన్యం వచ్చే ఉన్నరు. ఇదో కొత్త చైతన్యం మాకొద్దు. నీ చైతన్యం నీ నియోజకవర్గంలో అక్కడ చూపించుకో. నీ బండారం ఆడ బయటపడతది. అందుకే మనం రాజకీయ వ్యవస్థను నిలదీయాల్సిన అవసరం ఉంది. జేఏసీలో లేని ఏ నాయకుడిని శిబిరాల్లో మన దగ్గర కాలుబెట్టనీయవద్దు. ఆడిని రానిచ్చినమంటే ఆడి మాయమాటలకు ఎప్పుడు ఇనికి పోతమో మనకే తెలియదు. అంత బంగారు మాయమాటలుంటాయ్ వాళ్లవి. సకల సజనుల సమ్మె ఏదీ? ఎవనంతట వాడు పోతనే ఉన్నడు. వస్తనే ఉన్నడు. బస్సులు తిరుగుతూనే ఉన్నయ్. పబ్లిక్ తిరుగునే ఉంది.
ఏరీ సకల జనులు? ఏరీ రాజకీయ నాయకులు? ఎవరు సమ్మెలున్నరు? ఉద్యోగులు చేస్తేనే సమ్మె. ఇది సకలోద్యోగుల సమ్మె. ఉద్యోగులు పది, ఇరవై రోజులు సమ్మె చేసి, ఇగ మాకు చేతగాదని మానేస్తే.. ఇంకా ఐదురోజులు చేయకపోతిర్రా.. తెలంగాణ వస్తుండె.. అని అప్పుడే లేచొచ్చిన లుచ్చాలు నామీద రాళ్లేస్తరు. రేపెవడన్నా మిమ్మల్ని ప్రశ్నిస్తే లాగి చెంపదెబ్బ కొట్టకొట్టండి. లమ్డికొడకా నీవెన్నిరోజులు చేస్తివిరా సమ్మె? ఎప్పటిదాకా చేస్తివరా సమ్మె అని నిలదీయండి. పదిరోజులు మించి సమ్మె చేయలేం. అంతకుమించి బలవంతం చేస్తే సహించవద్దు. రాజకీయ నేతలు మనల్ని పట్టించుకోవడం లేదు’ – ఈ మాటలు ఎవరివో తెలుసా? తెలంగాణ సకల జనుల సమ్మెకు సార ధ్యం విహస్తోన్న ఉద్యోగుల జేఏసీ నేత కె. స్వామిగౌడ్‌వి. రాజకీయ నాయకుల కంటితుడుపు మద్దతు, పెదవులకే పరిమితమైన సంఘీభావంతో ఉద్యోగులు ఏ స్థాయిలో విసిగి వేసారిపోయారో స్వామిగౌడ్ వ్యాఖ్యలతో మరోసారి స్పష్టమయింది.
గత కొద్దిరోజుల నుంచి రాజకీయ నాయకులు, ప్రధానంగా సకల జనుల సమ్మెను తెరవెనుక ఉండి నడిపిస్తున్న టీఆర్ఎస్.. సమ్మెకు ముందు ఇచ్చిన హామీకి భిన్నంగా వ్యవహరిస్తున్న తీరు ఉద్యోగులకు ఆగ్రహం కలిగిస్తోంది. తమను ముందుకు నెట్టిన రాజకీయ నాయకులు సీరియస్‌గా రంగంలోకి దిగడం లేదన్న ఆక్రోశంతో ఉన్నారు. స్వామిగౌడ్ మాటలు నిశితంగా పరిశీలిస్తే మరో పదిరోజుల వరకే ఉద్యోగులు సకల జనుల సమ్మె చేయగలరన్న విషయం స్పష్టమవుతోంది. ‘మీరు మాకు సమ్మెకు ముందు చెప్పినదేంది? ఇప్పుడు చేస్తున్నదేంది? రోడ్లపై బస్సులు తిరగనీయమన్నారు. సర్కారు కార్యాలయాలకు తాళాలు వేస్తామన్నారు. రోడ్లు తవ్వేస్తమన్నారు.
సరిహద్దులు మూసివేస్తామని అన్నారు. కానీ మీరు చెప్పిన మాటల్లో ఒక్కటీ జరగనప్పుడు మేం సమ్మె చేసి ఏం ప్రయోజనమ’ని గత కొద్దిరోజుల క్రితం జరిగిన ఓ సమావేశంలో ఉద్యోగ సంఘ నేతలు టీఆర్ఎస్, బీజేపీ, జాక్ నేతలపై విరుచుపడినట్లు కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా స్వామిగౌడ్ ఆగ్రహం, ఆయన విరుచుకుపడిన తీరు పరిశీలిస్తే.. రాజకీయ పార్టీల మాటలు విని ఉద్యోగులు మోసపోయారని స్పష్టమవుతోంది. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను అడ్డుపెట్టుకుని, ఉద్యోగులను పావులుగా వాడుకుం టున్నారన్న విమర్శలను స్వామిగౌడ్ ఆవేదన నిజం చేసేలా ఉన్నాయి.

ఏ రాజకీయ నాయకుడి చైతన్యం ఉద్యోగులకు అవసరం లేదు. ఇక్కడ చైతన్యం వచ్చే ఉన్నరు. ఇదో కొత్త చైతన్యం మాకొద్దు. నీ చైతన్యం నీ నియోజకవర్గంలో అక్కడ చూపించుకో. నీ బండారం ఆడ బయటపడతది. అందుకే మనం రాజకీయ వ్యవస్థను నిలదీయాల్సిన అవసరం ఉంది. జేఏసీలో లేని ఏ నాయకుడిని శిబిరాల్లో మన దగ్గర కాలుబెట్టనీయవద్దు. ఆడిని రానిచ్చినమంటే ఆడి మాయమాటలకు ఎప్పుడు ఇనికి పోతమో మనకే తెలియదు. అంత బంగారు మాయమాటలుంటాయ్ వాళ్లవి. సకల సజనుల సమ్మె ఏదీ? ఎవనంతట వాడు పోతనే ఉన్నడు. వస్తనే ఉన్నడు. బస్సులు తిరుగుతూనే ఉన్నయ్. పబ్లిక్ తిరుగునే ఉంది.
ఏరీ సకల జనులు? ఏరీ రాజకీయ నాయకులు? ఎవరు సమ్మెలున్నరు? ఉద్యోగులు చేస్తేనే సమ్మె. ఇది సకలోద్యోగుల సమ్మె. ఉద్యోగులు పది, ఇరవై రోజులు సమ్మె చేసి, ఇగ మాకు చేతగాదని మానేస్తే.. ఇంకా ఐదురోజులు చేయకపోతిర్రా.. తెలంగాణ వస్తుండె.. అని అప్పుడే లేచొచ్చిన లుచ్చాలు నామీద రాళ్లేస్తరు. రేపెవడన్నా మిమ్మల్ని ప్రశ్నిస్తే లాగి చెంపదెబ్బ కొట్టకొట్టండి. లమ్డికొడకా నీవెన్నిరోజులు చేస్తివిరా సమ్మె? ఎప్పటిదాకా చేస్తివరా సమ్మె అని నిలదీయండి. పదిరోజులు మించి సమ్మె చేయలేం. అంతకుమించి బలవంతం చేస్తే సహించవద్దు. రాజకీయ నేతలు మనల్ని పట్టించుకోవడం లేదు’ – ఈ మాటలు ఎవరివో తెలుసా? తెలంగాణ సకల జనుల సమ్మెకు సార ధ్యం విహస్తోన్న ఉద్యోగుల జేఏసీ నేత కె. స్వామిగౌడ్‌వి. రాజకీయ నాయకుల కంటితుడుపు మద్దతు, పెదవులకే పరిమితమైన సంఘీభావంతో ఉద్యోగులు ఏ స్థాయిలో విసిగి వేసారిపోయారో స్వామిగౌడ్ వ్యాఖ్యలతో మరోసారి స్పష్టమయింది.
గత కొద్దిరోజుల నుంచి రాజకీయ నాయకులు, ప్రధానంగా సకల జనుల సమ్మెను తెరవెనుక ఉండి నడిపిస్తున్న టీఆర్ఎస్.. సమ్మెకు ముందు ఇచ్చిన హామీకి భిన్నంగా వ్యవహరిస్తున్న తీరు ఉద్యోగులకు ఆగ్రహం కలిగిస్తోంది. తమను ముందుకు నెట్టిన రాజకీయ నాయకులు సీరియస్‌గా రంగంలోకి దిగడం లేదన్న ఆక్రోశంతో ఉన్నారు. స్వామిగౌడ్ మాటలు నిశితంగా పరిశీలిస్తే మరో పదిరోజుల వరకే ఉద్యోగులు సకల జనుల సమ్మె చేయగలరన్న విషయం స్పష్టమవుతోంది. ‘మీరు మాకు సమ్మెకు ముందు చెప్పినదేంది? ఇప్పుడు చేస్తున్నదేంది? రోడ్లపై బస్సులు తిరగనీయమన్నారు. సర్కారు కార్యాలయాలకు తాళాలు వేస్తామన్నారు. రోడ్లు తవ్వేస్తమన్నారు.
సరిహద్దులు మూసివేస్తామని అన్నారు. కానీ మీరు చెప్పిన మాటల్లో ఒక్కటీ జరగనప్పుడు మేం సమ్మె చేసి ఏం ప్రయోజనమ’ని గత కొద్దిరోజుల క్రితం జరిగిన ఓ సమావేశంలో ఉద్యోగ సంఘ నేతలు టీఆర్ఎస్, బీజేపీ, జాక్ నేతలపై విరుచుపడినట్లు కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా స్వామిగౌడ్ ఆగ్రహం, ఆయన విరుచుకుపడిన తీరు పరిశీలిస్తే.. రాజకీయ పార్టీల మాటలు విని ఉద్యోగులు మోసపోయారని స్పష్టమవుతోంది. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను అడ్డుపెట్టుకుని, ఉద్యోగులను పావులుగా వాడుకుం టున్నారన్న విమర్శలను స్వామిగౌడ్ ఆవేదన నిజం చేసేలా ఉన్నాయి.