శ్రీకాకుళం

నా వాదన హైకోర్టుకు వినిపిస్తా – చంద్రబాబు వెల్లడి


సిబిఐ ఇడి పంపిన నోటీసులు అందాయి.. నా వాదనను హైకోర్టుకు వినిపించాలని నిర్ణయించుకున్నాను’ అని టిడిపి అధినేత చంద్రబాబు చెప్పారు. రైతు పోరు బాటలో భాగంగా ఆయన గురువారం విశాఖ జిల్లా బుచ్చయ్యపేట మండలంలో పాదయాత్ర చేశారు. ప్రజల కోసం పోరాటం చేస్తున్న తనపై కాంగ్రెస్ పార్టీ బురద జల్లుతోందని విమర్శించారు. తనకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. రాజ్యాంగపరంగా రెండు వర్గాల వాదన విన్న తరువాత కోర్టు తీర్పు ఇవ్వాల్సి ఉంటుందని, గ్రామాల్లో జరిగే రచ్చబండలో కూడా ఈ విధానం ఉంటుందని ఆయన అన్నారు. వైఎస్‌ఆర్ అధికారంలో ఉన్నప్పుడు 25 ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు వేశారని, 26 విచారణలు జరిపించారని, 65 ప్రాజెక్ట్‌లను రివ్యూ చేశారని, అందులో ఎక్కడా తను దోషిగా నిరూపణ కాలేదని చంద్రబాబు అన్నారు. తను అధికారంలో ఉన్నప్పుడు కూడా తన పని తనను చేసుకోనీయకుండా కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టిందని అన్నారు. ఇప్పుడు ప్రజల కోసం పోరాడుతుంటే, తనపై బురదచల్లుతున్నారని ఆయన అన్నారు. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు ఎన్టీఆర్ పార్టీ పెట్టారని, ఆ ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు పోరాటం చేస్తున్నానని అన్నారు. అవిశ్వాస తీర్మానం గురించి చంద్రబాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలను గాలికొదిలేసిందని అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేని పరిస్థితిలో ఉందని అన్నారు. కనీసం వరికి, చెరకుకు మద్దతు ధర కూడా ఇవ్వలేకపోతోందని విమర్శించారు.
ప్రజాకోర్టులో తేల్చుకుంటా’
కాకినాడ, నవంబర్ 24: తనపై బనాయించిన తప్పుడు కేసులను ప్రజాకోర్టులోనే ఎదుర్కొంటానని చంద్రబాబుఅన్నారు. గురువారం ఉదయం అన్నవరం శ్రీ సత్యదేవుని దర్శించుకున్నారు. విశాఖ జిల్లా పర్యటనకు వెళ్లేముందు ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. తనపై వచ్చిన ప్రతి ఒక్క ఆరోపణకు సమాధానం చెబుతూనే వచ్చానని, ప్రస్తుతం వచ్చిన ఆరోపణలను ప్రజాకోర్టులో తేల్చుకుంటానన్నారు. సింగపూర్‌లో తనకు ఒక హోటల్ ఉన్నట్టు జరిగిన ప్రచారం అవాస్తవమని తేలిందని, ఎవరు పడితేవారు కేసులు వేస్తే స్వీకరించడమేనా? అంటూ సుప్రీంకోర్టు సైతం వ్యాఖ్యానించడాన్ని చూస్తే తనపై తప్పుడు ప్రచారం జరుగుతున్నట్టు స్పష్టమవుతోందని అభిప్రాయపడ్డారు. ప్రపంచ చరిత్రలోనే వైఎస్ రాజశేఖరరెడ్డి అంతటి కక్షసాధింపుదారుడు ఉండడని, ఆయన హయాంలో రౌడీయిజం పెరిగిపోయిందన్నారు. రాష్ట్రాన్ని ఆయన అనుయాయులు దోచుకున్నారని విమర్శించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి రైతుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. రాష్ట్రంలో సుమారు 700 కరవు మండలాలుగా ఉన్నట్టు ప్రభుత్వమే అంగీకరించిందని, అయినప్పటికీ ఇంతవరకు ఆయా ప్రాంతాల్లో పాలకులు పర్యటించి రైతులను ఆదుకున్న దాఖలాల్లేవన్నారు. వేల ఎకరాల్లో క్రాప్‌హాలిడే ప్రకటించినా ప్రభుత్వం దున్నపోతు చందాన నిద్రపోతోందని విమర్శించారు. తాము రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చి ఉన్నట్టయితే నేటికీ తెలుగుదేశమే అధికారంలో ఉండేదని చెప్పుకున్నారు. రాష్ట్రంలో లక్షల కోట్ల విలుల వేసే గనుల లీజుల అక్రమాలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డే కారణమని చంద్రబాబు విమర్శించారు. గిరిజనులకు దక్కాల్సిన అటవీ సంపదను వైఎస్ ఆధ్వర్యంలో దోచుకున్నారని ధ్వజమెత్తారు.

నేడు సీఎం శ్రీకాకుళం జిల్లా పర్యటన


రెండో విడుత రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేడు శ్రీకాకుళం, విజయనగరం జిల్లా ల్లో పర్యటించనున్నారు. తొలిత ముఖ్యమంత్రి హైదరా బాద్‌లో బుధవారం ఉదయం బయలు దేరి శ్రీకాకుళం జిల్లా కు వెళ్లనున్నారు.అక్కడనే ఏర్పాటు చేసిన రెండో విడుత రచ్చబండ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసం గించనున్నారు. అనం తరం విజయనగరం జిల్లాలో బొబ్బిలి రచ్చబండ కార్య క్రమంలో పాల్గొని పలు సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు సీఎం పంపిణి చేయనున్నార. అనంతరం అక్కడ ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో ఆయ న ప్రసంగించనున్నట్లు సీఎంఒ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

నిజాయితీని నిరూపిస్తాం


తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్‌ విజయమ్మ వేసిన పిటిషన్‌లో గతంలో ఆమె భర్త రాజశేఖరరెడ్డి ఆరోపించిన అంశాలే ఉన్నాయని తెలుగుదేశంపార్టీ పేర్కొంది. అనేక కేసులు విచారణకు అర్హత లేవని కోర్టులే తోసిపుచ్చాయని, అవే అంశాలతో మళ్ళీ కోర్టులో ఫిర్యాదు చేశారని ఆపార్టీ దుయ్యబట్టింది. విజయమ్మ పిటిషన్‌పై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించిన రాష్ట్ర హైకోర్టు సహజ న్యాయ సూత్రాలు కూడా పాటించకపోవడం బాధాకరమని తెలుగుదేశం పార్టీ విచారం వ్యక్తంచేసింది.ప్రతివాదికి కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా సిబిఐ దర్యాప్తునకు ఆదేశించడం, పిటిషన్‌ ఒకటైతే హైకోర్టు మరో ఆదేశం ఇచ్చిందని మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో తెదేపా శాసనసభ్యులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో తుమ్మల నాగేశ్వరరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఏ.రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు.
వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి రొచ్చులోకి దిగి, ఆ రొచ్చును ఇతరులపైకి చల్లే ప్రయత్నం చేస్తున్నారని తుమ్మల నాగేశ్వరరావు దుయ్యబట్టారు. 1975 నుంచి చంద్రబాబుపై ఇవే ఆరోపణలు చేసి 18సార్లు కోర్టుల్లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి సహా అనేక మంది కాంగ్రెస్‌ నేతలు పిటిషన్లు వేశారని, వాటిని నిరూపించలేక కొన్ని ఉపసంహరించుకోగా, మరికొన్నింటిని కోర్టులు కొట్టివేశాయని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబుపై వేసిన పిటిషన్లు విచారణకు అనర్హమైనవని కోర్టులు తోసిపుచ్చాయని ఆయన చెప్పారు. కన్నా లక్ష్మీనారాయణ కేసులో కూడా గతంలో చేసిన ఆరోపణలపై పిటిషన్‌ వేసి ఎన్నికలు కాగానే ఉపసంహరించుకున్నారని ఆయన చెప్పారు. 1999, 2004 మధ్య ఐదేళ్ళపాటు ఏ ఒక్క రాజ్యాంగ వ్యవస్థను కూడా చర్య తీసుకోమని కోరలేదంటూ ప్రతివాదులకు నోటీసులు ఇవ్వడానికి కూడా ఈ అంశాలకు అర్హత లేదని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ స్పష్టంచేసిందని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. హైకోర్టు తీర్పును ప్రశ్నించడం, కించపరచడం తమ ఉద్దేశం కాదని, కోర్టులను, రాజ్యాంగ వ్యవస్థలను గౌరవిస్తామని బొజ్జల గోపాలకృష్ణారెడ్డి స్పష్టంచేశారు. అలాంటి వ్యక్తిని కూడా సిబిఐ విచారణ పరిధిలోకి తీసుకురావడం బాధాకరమన్నారు. తాము న్యాయ వ్యవస్థనుగానీ, సిబిఐగానీ ప్రశ్నించడం లేదని, విజయమ్మ పిటిషన్‌ ఆరోపణలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, వాస్తవాలు ప్రజలకు చెప్పేందుకు గత చరిత్రను మరోసారి గుర్తు చేస్తున్నామని బొజ్జల అన్నారు. సింగపూర్‌లోని హోటల్‌ ఫోటోను ఇంటర్నెట్‌ నుంచి తెచ్చి చంద్రబాబు బినామీ ఆస్తి అని ఆరోపించారని, అయితే ఆ హోటల్‌ యాజమాన్యం గురించి కనీస ప్రస్తావన చేయలేదని రేవంత్‌రెడ్డి చెప్పారు. అమెరికాలో వైట్‌హౌస్‌ ఫోటో తెచ్చి అది కూడా చంద్రబాబు బినామీ ఆస్తి అని చెప్పినా ఆశ్చర్యం లేదని ఆయన చెప్పారు.

వేడుకగా ఆదిత్యుని తెప్పోత్సవం – తరలివచ్చిన భక్తజనం


ప్రత్యక్ష నారాయణుడైన శ్రీ సూర్యనారాయణ స్వామివారి తెప్పోత్సవం సోమవారం సాయంత్రం అత్యంత వేడుకగా జరిగింది. కార్తీకశుద్ధ ద్వాదశి (క్షీరాబ్ధి ద్వాదశి) సందర్భంగా అరసవల్లి దేవస్థానానికి అభిముఖంగా ఉన్న ఇంద్ర పుష్కరిణిలో ఆదిత్యుని హంస నావికోత్సవం జరిపించారు. ఆలయ అర్చకులు ఇప్పిలి శంకరశర్మ పర్యవేక్షణలో ఉషా, ఛాయా, పద్మినీ సమేతుండైన శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఉత్సవ మూర్తులను అత్యంత శోభాయమానంగా అలంకరించి విశేష పూజలు, అర్చనలు జరిపించారు. అనంతరం రజత సింహవాహనంలో పల్లకిలో ఊరేగుతూ ఆలయం నుండి పుష్కరిణి వరకు స్వామివారిని తోడ్కొని వచ్చారు. కిక్కిరిసిన జన సమూహం మధ్య నుండి దేవేరులతో స్వామివారి మంగళవాయిద్యాలు, సంప్రదాయ కీర్తనలు, భజనలు, వేద మంత్రోచ్ఛారణలతో ఆలయం నుండి బయలుదేరి పుష్కరిణి వరకు వచ్చారు. అనంతరం పుష్కరిణిలో సిద్ధంగా ఉన్న హంసనావలో స్వామివారిని ఇంద్రపుష్కరిణిలో తొమ్మిది పర్యాయాలు నౌకా విహారం చేయించారు. పటిష్టమైన బందోబస్తు నడుమ, తర తరాలుగా వస్తున్న సంప్రదాయాలను పరిరక్షించుకుంటూ వెలుగులరేడు నావికోత్సవాన్ని వైభవోపేతంగా జరిపించారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, ట్రస్టు బోర్డు చైర్మన్ ఇప్పిలి జోగిసన్యాసిరావు, ఇతర సభ్యులు, ఆలయ కార్యనిర్వహణాధికారి ముత్యాలరావు తదితరులు స్వామివారి నావికోత్సవంలో పాల్గొన్నారు. వేలాది మంది భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చి ఆదిత్యుని తెప్పోత్సవాన్ని వీక్షించడమే కాకుండా, పుష్కరిణిలో దీపాలు వెలిగించి విడిచిపెట్టారు. (చిత్రం) ఇంద్రపుష్కరిణిలో ఆదిత్యుని హంస నావికోత్సవం

ఇద్దరు ఎంపీలు, 29 మంది ఎమ్మెల్యేల రాజీనామా – జగన్‌ మద్దతుదార్ల నిర్ణయం


సిబిఐ సోదాలతో వైఎస్‌ జగన్‌ ఉక్కిరి బిక్కిరవుతుండటంతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎదురు దాడికి దిగింది. కృష్ణా జిల్లా ఓదార్పు యాత్రలో ఉంటూనే జగన్‌ ఆస్త్రం సంధించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యూహం రూపొందించారు. సిబిఐ ఎఫ్‌ఐఆర్‌లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరును ప్రస్తావించడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ జగన్‌ గ్రూపు ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేయాలని నిర్ణయించారు. ఇద్దరు ఎంపీలతో పాటు, 29 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇద్దరు తెలుగుదేశం తిరుగుబాటు ఎమ్మెల్యేలతో పాటు, తెలంగాణా ఏర్పాటు కోసం రాజీనామాలు చేసిన ముగ్గురు ఎమ్మెల్యేల పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఎమ్మెల్యే పదవులతోపాటు కాంగ్రెసు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నారు. ఈ నిర్ణయం జరిగిన వెంటనే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు స్పీకర్‌, గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ కూడా తీసుకున్నారు. సోమవారం ఉదయం స్పీకర్‌ను, సాయంత్రం గవర్నర్‌ను కలవాలని నిర్ణయించుకున్నారు. రాజీనామా లేఖలు సమర్పించిన తరువాత బస్సు యాత్ర చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే, బస్సు యాత్ర ఎప్పటినుండి ప్రారంభించాలన్నది ఇంకా ఖరారు చేయలేదు. ఆదివారం రాష్ట్ర రాజధానిలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు చర్చనీయాంశమయ్యాయి. అయితే వీరి రాజీనామాలు ఆమోదించినా సర్కార్‌ మనుగడకు వెంటనే ముప్పు రాకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అయితే అనిశ్చితి పెరిగి ఇంకొంతమంది ఎమ్మెల్యేలు జగన్‌వైపు వెళ్తే ప్రభుత్వానికి ముప్పు ఏర్పడుతుంది. రాజీనామాల నిర్ణయం వెలువడిన వెంటనే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఈ దిశలోనే ప్రయత్నాలు ప్రారంభించారు. సిబిఐ ఎఫ్‌ఐఆర్‌లో వైఎస్‌ పేరును పేర్కొనడానికి నిరసనగా తమ బాటలోనే ప్రయాణించాలని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలపై వారు ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ మేరకు ఆ పార్టీ నాయకులు బహిరంగంగానే పిలుపునిచ్చారు. తమ పిలుపునకు సానుకూల స్పందన లభిస్తోందని, మరికొందరు ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేయడానికి ముందుకొచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ తెలిపారు. మరో నాయకుడు జూపూడి ప్రభాకర్‌రావు ఒక టివి ఛానల్‌లో మాట్లాడుతూ మరో 20 మంది ఎమ్మెల్యేలు సైతం రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారని, తొలిదశ తరువాత రెండు మూడు రోజుల్లో వారు కూడా రాజీనామాలు సమర్పిస్తారని అన్నారు. ఈ దిశలో కొందరితో ఇప్పటికే కొందరు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలతో చర్చల ప్రక్రియ కూడా ప్రారంభించినట్లు సమాచారం. మరో వైపు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బుజ్జగింపుల పర్వానికి శ్రీకారం చుట్టారు. సిఎం క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులతో పలు దఫాలు సమావేశమయ్యారు. జిల్లాల వారిగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను బుజ్జగించే బాధ్యత మంత్రులకు అప్పగించారు. ఈ సమావేశాల్లో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా పాల్గొన్నారు.
మూడు గంటల పాటు సమావేశం
అంతకుముందు జూబ్లిహిల్స్‌లోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు పలువురు ఇతర నాయకులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 11.30 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం సాయంత్రం 3.30 గంటల వరకు కొనసాగింది. రాజీనామాలు చేయాలన్న ప్రతిపాదన రెండు రోజుల క్రితమే వచ్చినప్పటికీ ఆ తరువాత చోటుచేసుకునే పరిణామాలపైనే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ సాగినట్లు తెలిసింది. సమావేశం నుండి కృష్ణా జిల్లా ఓదార్పు యాత్రలో ఉన్న జగన్‌తో ఒకటికి రెండు సార్లు ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. సమావేశం నుండే స్పీకర్‌ కార్యాలయానికి, గవర్నర్‌ కార్యాలయానికి ఫోన్లు చేసి అపాయింట్‌మెంట్లు ఖరారు చేసుకున్నారు. ఆ తరువాత రాజీనామాల నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు.
శాసనసభలో బలాబలాల తీరు
294 మంది సభ్యులున్న రాష్ట్ర శాసనసభలో సర్కారు మనుగడకు 148 మంది సభ్యుల మద్దతు అవసరమవుతుంది. ప్రస్తుత శాసనసభలో కాంగ్రెస్‌ పార్టీకి ప్రజారాజ్యంతో కలిసి 173 మంది సభ్యుల బలం ఉంది. తాజాగా రాజీనామా చేస్తామని ప్రకటించిన 29 మందిలో 27 మంది కాంగ్రెస్‌కు, పిఆర్పీకి చెందిన వారే! వీరి రాజీనామాలను ఆమోదిస్తే కాంగ్రెస్‌ బలం 146కు పరిమితమవుతుంది. అయితే, ఏడుగురు సభ్యులున్న ఎంఐఎం పార్టీ మద్దతు ఇప్పటివరకు కాంగ్రెస్‌కే లభిస్తోంది. వీరిని కూడా కలుపుకుంటే కాంగ్రెస్‌ సర్కారు ప్రభుత్వానికి వెంటనే ముప్పురాకపోవచ్చు. 12 మంది సభ్యులున్న టిఆర్‌ఎస్‌ కూడా శానససభలో కీలకపాత్ర పోషించనుంది. తెలుగుదేశం పార్టీకి ప్రస్తుత శాసనసభలో 86 మంది సభ్యులుండగా, వారిలో ఇద్దరు తాజాగా రాజీనామా చేస్తామని ప్రకటించారు. దీంతో ఆ పార్టీ బలం 84కు పరిమితం కానుంది. గతంలోనే నాగం జనార్ధనరెడ్డితో పాటు మరో ముగ్గురు టిడిపి సభ్యులు శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరికొందరు రాజీనామా నిర్ణయం తీసుకుంటే సర్కార్‌కు ముప్పు తప్పనిస్థితి ఏర్పడుతుంది.
కీలకం కానున్న స్పీకర్‌ నిర్ణయం!
29 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడానికి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ నిర్ణయం కీలకం కానుంది. తెలంగాణా ఏర్పాటు కోసం చేసిన రాజీనామాలను ఆయన ఇప్పటికే తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా రాజీనామాల విషయంలో ఆయన ఎలా స్పందిస్తారన్న విషయం ఆసక్తిదాయకంగా మారింది. ఆవేశంతో నిర్ణయం తీసుకున్నారంటూ ఆయన తెలంగాణా ప్రాంత ప్రజాప్రతినిధుల రాజీనామాలను తిరస్కరించారు. అదే సూత్రాన్ని తాజా నిర్ణయాలకు వర్తింపచేస్తారో లేదో చూడాలి. తనను కలిసిన విలేకరులతో స్పీకర్‌ ఆదివారం సాయంత్రం మాట్లాడుతూ రాజీనామా లేఖలు తనకు చేరిన తరువాత, వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
11 గంటలకు రాజీనామాలు
సోమవారం ఉదయం 11 గంటలకు తమ రాజీనామాలను స్పీకర్‌కు సమర్పించాలని జగన్‌ గ్రూపు ఎంఎల్‌ఏలు నిర్ణయించారు. ఉదయం తొమ్మిది గంటలకు జూబ్లిహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో సమావేశం కావాలని, అక్కడి నుండి పంజాగుట్టలో ఉన్న వైఎస్‌ఆర్‌ విగ్రహం వద్దకు వచ్చి నివాళులర్పించాలని వారు నిర్ణయించారు. వైఎస్‌ విగ్రహానికి నివాళులర్పించిన తరువాత బస్సులో అసెంబ్లీలోని స్పీకర్‌ కార్యాలయానికి చేరుకుంటారు.

బాబు రైతు బాట


క్రాప్‌హాలిడేతో సమస్యల్లో కూరుకుపోయిన రైతాంగాన్ని ఆదుకుని, వారి సమస్యలను జాతీయ స్థాయిలో చర్చనీయాంశం చేసి, పరిష్కార మార్గం అన్వేషించేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరో సారి రైతుబాట పట్టనున్నారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు పలు జిల్లాలకు విస్తరిస్తున్న క్రాప్‌ హాలిడేను ఆయుధంగా మలిచి సర్కారుపై సమర శంఖం పూరిస్తున్నారు. రాష్ట్ర రైతాంగ సమస్యలను కేంద్రానికి, దేశ ప్రజలకు వివరించేందుకు జాతీయ పార్టీ నాయకులను రాష్ట్రానికి తీసుకురానున్నారు. ఫలితంగా కాంగ్రెస్‌పై రాష్ట్రం-కేంద్ర స్థాయిలో ఒత్తిడి పెంచనున్నారు.
రెండు రోజులుగా ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యట ిస్తున్న బాబు, రైతుల దైన్య స్థితిని నేరుగా తెలుసుకు న్నారు. క్రాప్‌ హాలిడేపై రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను జాతీ య స్థాయిలో ఎలుగెత్తి చాటేందుకు తనకు సహకరించా లని ఆయన ఇటీవలి తన ఢిల్లీ పర్యటన సందర్భంలో జాతీయ నేతలు ప్రకాశ్‌ కరత్‌, దేవెగౌడ, అజిత్‌ సింగ్‌, సురవరం సుధాకరరెడ్డితో పాటు ఎఐఎడిఎంకే, ఆర్‌ఎస్‌పీ, ఫార్వర్డ్‌ బ్లాక్‌ లాంటి పార్టీల నేతలను కలసి అభ్యర్థించగా, వారంతా చంద్రబాబుకు మద్దతు తెలిపారు. దానితో ఈ నెల 22, 23వ తేదీల్లో వారంతా గోదావరి జిల్లాలకు వచ్చి, రైతు సమస్యలను స్వయంగా తెలుసుకుని, వాటిని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లనున్నారు.ఆ తర్వాత ఢిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా చేయాల ని నిర్ణయించారు. ఆ తర్వాత పార్లమెంటులో ఈ పార్టీలన్నీ రాష్ట్ర రైతు సమస్యలను ప్రస్తావించి, సభను స్తంభింప చేయాలని భావిస్తున్నారు.

నెత్తురోడిన రహదారులు – వేర్వేరు ప్రమాదాల్లో 18 మంది మృతి


రాష్ట్ర వ్యాప్తంగా రహదారులు ఆదివారం రక్తమోడాయి. వేర్వేరు ప్రమాదాల్లో 18 మంది మృతి చెందారు. మరో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఈతకెళ్ళి నలుగురు యువకులు మృత్యువాతపడ్డారు. ఈఘటనలకు సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద లారీ- జీపు ఢీ కొన్న ప్రమాదంలో ఐదుమంది చెన్నైవాసులు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయ పడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండ లం చేబ్రోలు గ్రామసమీపం లో జాతీయరహదారిపై లారీ, ఆటో ఢీ కొన్న ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతిచెందారు. మరో ఐదుమంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా తూర్పుగోదావరి జిల్లావాసులుగా పోలీసులు గుర్తించారు. నల్గొండ జిల్లా మేళ్లచెరువు మండలం శోభనాద్రిగూడెంలో ట్రాక్టర్‌ బోల్తాపడి ముగ్గురు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. అనంతపురం జిల్లా మడకశిర మండలం చౌటుపల్లి గ్రామ సమీపంలో ద్విచక్రవాహనాన్ని ట్రాక్టర్‌ ఢీ కొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. వీరు కర్నటాక మధుగిరి ప్రాంతం శేషాపురానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌ నగరంలో రెండు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలలో ఇద్దరు మృతిచెందారు. ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం ముదురమెట్ల గ్రామంలోని క్వారీలో ఈతకెళ్ళిన ఆంజనేయులు, బాషా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి మృతిచెందారు. కరీంనగర్‌ శివారులోని మానేరు జలాశయంలో స్నానం చేయడానికి వెళ్ళిన రాహుల్‌, రాములు ప్రమాదవశాత్తు నీటిమడుగులో కూరుకుపోయి మృతిచెందినట్లు సమాచారమందింది.
చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా చెన్నైవాసులు. తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకుని, తిరుగుప్రయాణంలో వరదయ్యపాళెం సమీపంలోని వాటర్‌పాల్స్‌ను చూసేందుకు జీపులో వెళ్తుండగా ఏర్పేడు వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొంది. ఈ ప్రమాదంలో జీపు డ్రైవర్‌ ఎస్‌.సతీష్‌తో సహా నలుగురు యాత్రికులు కార్తీక్‌, వసీంరాజా, జయమూర్తి, సతీష్‌ మృతిచెందారు. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామసమీపంలో జాతీయ రహదారిపై ఆటోను లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు గ్రామానికి చెందినవారు. ఆలమూరు పురాణపండవీధికి చెందిన రెండు కుటుంబాలు సమీపంలోని మరో కుటుంబంతో కలసి మొత్తం ఎనిమిది మంది ఆదివారం తెల్లవారుజామున ద్వారకాతిరుమలశ్రీవారి దర్శనానికి బయలుదేరారు. ఆలమూరు నుంచి తాడేపల్లిగూడెం వరకు బస్సుపై వచ్చారు. అక్కడి నుంచి ద్వారకాతిరుమలకు ఆటోలు కుదుర్చుకున్నారు. ఆటోలు చేబ్రోలు రైల్వేగేటు మీదుగా ద్వారకాతిరుమల రహదారిపై వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో నాసిక్‌ నుంచి ఉల్లిపాయల లోడుతో తాడేపల్లిగూడెం వస్తున్న ఒక లారీ వేగంగా ఆటోను ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో ఆటోలు అక్కడికక్కడే తిరగబడ్డాయి. ఆటోలో ప్రయాణిస్తున్న కంచర్ల సత్యమాత(45) ప్రమాద స్థలంలోనే మృతిచెందారు. తీవ్రంగా గాయపడ్డ కూచిభట్ల శ్రీవాణి(40), పురాణపండ లలితాకుమారి(42)లను ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలోనే శ్రీవాణి మృతిచెందగా ఆసుపత్రిలో లలితాకుమారి ఆశువులుబాశారు. నల్గొండ జిల్లా మేళ్లచెరువు మండలం రఘునాథపాలెం నుంచి పీక్లానాయక్‌ తండాకు వెళ్తున్న ట్రాక్టర్‌ తమ్మారం గ్రామ సమీపంలో బోల్తాపడి ముగ్గురు మృతిచెందారు, మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం ఉల్లివలస గ్రామం వద్ద ఆదివారంరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్న ఈ ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

తెలంగాణపై నా వైఖరిలో మార్పు లేదు


తెలంగాణపై గతంలోని తన వైఖరిలో ఎలాంటి మార్పులేదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు. తాను ఎప్పుడూ ఒకటే మాట చెబుతానని అన్నారు. తాను తప్పు చేయలేదు కదా మాట మార్చడానికి అని పేర్కొన్నారు. తెలంగాణపై బొత్స వైఖరిలో మార్పు వచ్చిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు కదాఅని ప్రశ్నించగా ఆయన పై విధంగా స్పందించారు. కోమటిరెడ్డి అలా ఎక్కడ మాట్లాడారో పత్రికలో గానీ మీడియాలోగానీ చూడలేదన్నారు. అది చూశాక, లేక ఆయన్ని అడిగి తరువాత స్పందిస్తానన్నారు.  రాష్ట్ర విభజన సమస్య చర్చల ద్వారానే పరిష్కారమవుతుందని పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర హోంమంత్రి కూడా చెప్పారని ఆయన గుర్తుచేశారు. తూర్పుగోదావరిజిల్లా కాంగ్రెస్‌ నేతలతో సమీక్ష అనంతరం బొత్స సత్యనారాయణ గాంధీభవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సోనియాగాంధీ అనారోగ్యంతో ఉన్న నేపథ్యంలో ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాలని మాజీ ముఖ్యమంత్రి కె.రోశయ్య వ్యక్తంచేసిన అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నానని చెప్పారు. మూడు నెలలో సమస్య పరిష్కారమవుతుందని కేంద్ర హోంమంత్రి చెప్పారని ఆయన గుర్తుచేశారు. నిండు ప్రాణాలు బలితీసుకోవద్దని ఆయన కోరారు. ఉద్యమకారులు, రాజకీయ పార్టీలు కూడా కొంత సంయమనం పాటించాలని సూచించారు.
తెలంగాణ ఉద్యోగ సంఘాలు తమ జీత భత్యాల కోసం పోరాటం చేస్తే ఫలితముంటుందని, మెరుగైన ఫలితాల కోసం పోరాటం చేయవచ్చని పేర్కొన్నారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి కేంద్ర, కాంగ్రెస్‌ పార్టీ చిత్తశుద్ధితో ఉందన్నారు. దీనిపై త్వరలో ఏదో ఒక నిర్ణయం తీసుకొంటామని చెప్పారు. 14(ఎఫ్‌) తొలగింపు కోసం ఢిల్లీ పెద్దలతో తాను మాట్లాడానని చెప్పారు. ఇది హైదరాబాద్‌కు సంబంధించిన అంశమని, కానీ హైదరాబాద్‌లో ఎసై్స నియామకాలు జరగడంలేదని గుర్తుచేశారు. దీనివల్ల అన్యాయం జరుగుతుందన్న భావనతోనే 14(ఎఫ్‌)ను తొలగించాలని కోరుతున్నారని చెప్పారు. తెలంగాణ మంత్రులు కూడా ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొనే 14 (ఎఫ్‌)ను తొలగించాలని కోరుతున్నారని తెలిపారు. లగడపాటి రాజ్‌గోపాల్‌ లేఖ రాయడం ద్వారా 14(ఎఫ్‌) రద్దు ఆగిపోలేదన్నారు. పిఆర్‌పి విలీనం మరికొన్ని రోజులు ఆలస్యమయ్యే అవకాశముందన్నారు.
సాంకేతికంగా పిఆర్‌పి విలీనం జరిగిపోయిందన్నారు. సోనియా అనారోగ్య కారణాలతో అది కొన్ని రోజులు వాయిదా పడిందన్నారు. ఆజాద్‌తో ఆంధ్రా నేతల చర్చలు ఈ నెల 10 నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. తెలంగాణ మంత్రులు విధుల్లోకి వచ్చేలా రాయబారం నడుపుతారా అని అడగ్గా అది నిరంతర ప్రక్రియ సముదాయిస్తునే ఉన్నాం, ఒక ప్రాంతం వారినే కాదు ఇరు ప్రాంతాల వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తామని ఆయన పేర్కొన్నారు. జగన్‌ వర్గ ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఇన్‌చార్జ్‌ను గానీ కొంతమందితో కూడిన గ్రూప్‌ ఇన్‌ఛార్జ్‌లను గానీ పెడతామని చెప్పారు.  పార్టీలో నిజాయితీతో ఉన్న వారికి అన్యాయం జరుగుతోంది అని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై బొత్స తీవ్రంగా స్పందించారు. ఆయనకు అన్యాయం జరిగిందని ఇప్పుడే గుర్తుకు వచ్చిందన్నారు. గతంలో కూడా ఆయన ఎమ్మెల్యేగానే ఉన్నారని, మంత్రి పదవి రాలేదని, అన్యాయం జరగిందని నాడు గుర్తుకు రాలేదన్నారు. నచ్చితే ఒకళా, నచ్చకపోతే మరోలా అని తీవ్రంగా ధ్వజమెత్తారు. ిపీఆర్‌పి, కాంగ్రెస్‌ నేతల మధ్య కోఆర్డినేషన్‌ కోసం సమావేశాలు పెడుతామన్నారు.

సర్వే, లగడపాటిలకూ అవకాశం

తెలంగాణ అంశంపై లోక్‌సభలో శుక్రవారం జరగనున్న చర్చలో సుష్మాస్వరాజ్‌, గోపీనాథ్‌ ముండే, రమేష్‌ బైస్‌లతో పాటు సిపిఐ పక్ష నాయకుడు గురుదాస్‌ దాస్‌గుప్తా, రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్‌ సభ్యుడు, మల్కాజ్‌గిరి నియోజకవర్గ లోక్‌సభ సభ్యుడు సర్వే సత్యనారాయణ పాల్గొననున్నారు. అయితే, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ తనకు కూడా చర్చలో పాల్గొనే అవకాశం కల్పించాలని కోరుతూ స్పీకర్‌కు, అధికార పార్టీ చీఫ్‌విప్‌కు లేఖలు రాసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలియవచ్చింది. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర అస్వస్థతకు గురై శస్త్రచికిత్స కోసం అమెరికా వెళ్లిన సమయంలో తెలంగాణపై నిర్ణయం తీసుకునేందుకు అధిష్టానానికి తగినంత వ్యవధి ఇవ్వాలనే అభిప్రాయంతో పార్లమెంట్‌ సమావేశాలకు హాజరు కావాలని ఇప్పటికే నిర్ణయించుకొన్నప్పటికీ రాజీనామా చేసిన తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ పార్లమెంట్‌ సభ్యులెవరూ శుక్రవారంనాటి తెలంగాణపై చర్చ సమయంలో సభకు హాజరయ్యే అవకాశాలు కనిపించడం లేదు. పార్లమెంట్‌ను బహిష్కరించాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని భావిస్తున్నప్పటికీ ఎప్పటి నుండి సభకు హాజరుకావాలనే విషయాన్ని శనివారంనాడు హైదరాబాద్‌లో జరుగనున్న తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధుల సారథ్య సంఘం సమావేశంలోనే తుది నిర్ణయం తీసుకోవాలనుకొన్నందున తెలంగాణ ఎంపీలలో చాలామంది ఇప్పటికే రాష్ట్రానికి తిరిగివెళ్లిపోయారని ఈ వర్గాలు తెలియజేశాయి.

అబ్కారీ శాఖలో డిప్యుటీ కమీషనర్ల బదలీలు


ఆబ్కారీ శాఖలో ఎట్టకేలకు డిప్యుటీ కమీషనర్ల బదిలీ వ్యవహారం పూర్తయ్యింది. ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడి సిఫార్సులతో కష్టంగా మారిన బదిలీల వ్యవహా రం ఎట్టకేలకు సజావుగా పూర్తికావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఉత్తరాంద్ర, విశాఖ పట్నం జిల్లాల్లో ఆబ్కారీ శాఖ అధికారు లకు కోట్లాది రూపాయల ఆదాయం ఉండటంతో ఆయా ప్రాంతాల్లో పోస్టిం గ్‌ల కోసం పైరవీలు భారీ స్థాయిలో జరిగాయి. విశాఖ పట్నం లాంటి ఒకే పోస్టుకు అటు ముఖ్య మంత్రి కిరణ్‌, ఇటు పిసిసి ప్రెసిడెంట్‌ బొత్సలు, ఎకై్సజ్‌ మంత్రి మోపిదేవి వెంకట రమణకు సిఫా ర్సులు చేయడంతో తాజాగా జరిగిన బదిలీల్లో విశాఖ పట్టణం సోస్టును కదిలించ లేదు. మంత్రి కి వచ్చిన సిఫార్సులకు తోడు ఆయన భావించిన కేవలం కడపలో మాత్రమే తన మాటను ఆయన ఈ బదిలీలలో నిలబెట్టుకో గలిగారు.
బదిలీ అయ్యింది వీరే..
అదిలాబాద్‌లో డిప్యుటీ కమీషనర్‌గా పనిచేస్తోన్న ఎ.చంద్ర శేఖర్‌ నాయుడును ప్రకాశం జిల్లా ఒంగోలు డిసిగా, కడప జిల్లాలో డిసిగా విధులు నిర్వహిస్తోన్న ఎస్‌.ఎం. రాజేశ్వర్‌ రావును ఏలూరు డిసిగా, ఏలూరు డిసిగా పని చేస్తోన్న ఎ. అరవిందర్‌ సింగ్‌ను ప్రభుత్వానికి రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు. ఈదే విధంగా ఖమ్మం డిసిగా పనిచేస్తోన్న ఎ.వి. నరసింహ్మ రావును వరంగల్‌ డిసిగా బదిలీ చేవారు. మహబూబా బాద్‌ డిసి రాథోడ్‌ సురేష్‌ను విశాఖ పట్నం ఎకై్సజ్‌ సూపరింటెండెంట్‌గా అనకాపల్లికి బదిలీ చేశారు.
కరీంనగర్‌లో డిసిగా పనిచేస్తోన్న ఎం. దేవ కుమార్‌ను అనంత పూర్‌ డిసిగా బదిలీ చేశారు. ఎకై్సజ్‌ అకాడమీలో ఇంచార్జి జాయింట్‌ డైరెక్టర్‌ గా ఉన్న పి. గంగాధర్‌ను మెదక్‌ ఇంచార్జి డిప్యు టీ కమీషనర్‌గా బదిలీ చేస్తూ బుదవారం రెవె న్యూ కార్యదర్షి అశుతోష్‌ మిష్రా ఉత్తర్వులు జారీ చేశారు.ఎం. దేవ కుమార్‌, పి. గంగాధర్‌లకు టిఏ, డిఏలను వర్తింప జేయడంలేదని ప్రభుత్వం ఉత్త ర్వులో పేర్కొంది. వారి అభ్యర్థన మేరకు ఆయా స్థానాల్లో బదిలీచేయడంతో ఈ డిఏ, టిఏలను ఇవ్వడంలేదని ప్రభుత్వం ఉత్తర్వులో స్పష్టం చేసింది.

free website analytics