విజయనగరం

పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఆయన సతీమణి పార్లమెంట్ సభ్యురాలు బొత్స ఝాన్సీ సోమవారంనాడు ప్రధానిని మన్మోహన్‌సింగ్‌ను కలిశారు. బొత్స సత్యనారాయణ పిసిసి అధ్యక్షుడైన తర్వాత ప్రధానిని కలవటం ఇదే తొలిసారి. ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో కలిసి ముచ్చటించిన అనంతరం బయటికి వచ్చిన బొత్స తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ తాము ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిశాం తప్ప రాజకీయ ప్రాధాన్యత ఏదీలేదని చెప్పారు.
రాష్ట్రానికి సంబంధించి పలు సమస్యలు ప్రధానికి వివరించానని, ప్రాణహిత ..చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని, మూరుమూల గ్రామాలకు లింక్‌రోడ్ల నిర్మాణానికి మరిన్ని నిధులు కేటాయించాలని, జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకానికి నిధులు పెంచి, కూలీలకు ఇచ్చే వేతనం పెంచి పథకాన్ని మరింత పకడ్బందీగా అమలుచేయాలని ప్రధానిని కోరినట్లు బొత్స చెప్పారు. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో తలపెట్టిన అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుపై అవసరమైన జాగ్రత్త చర్యలు తీసుకోవలసిందిగా విజ్ఞప్తిచేసినట్లు బొత్స సత్యనారాయణ చెప్పారు.
కాగా, ప్రధానిని కలిసిన సందర్భంలో రాజకీయాల ప్రస్తావన రాలేదని బొత్స సత్యనారాయణ చెప్తున్నప్పటికీ రాష్ట్రంలో జరగనున్న ఉప ఎన్నికలు, ముఖ్యమంత్రి వ్యవహారశైలి, పార్టీ పరిస్థితి, ముమ్మరంగా సాగుతున్న సిబిఐ దాడులు, దర్యాప్తు తదితర అంశాలపై ప్రధానికి బొత్స సత్యనారాయణ వివరించారని తెలుస్తోంది.

డీఎస్స-12 నోటిఫికేషన్ విడుదల
మే 2,3,4 తేదీల్లో రాత పరీక్షలు
అప్రెంటీస్ విధానం రద్దు
‘ఇంటర్’ నిబంధన తొలగింపు
‘ఓపెన్ డిగ్రీ’ వారికీ అర్హత
ఎస్ఏ పోస్టులకు సబ్జెక్టు నిబంధనల సడలింపు
80 మార్కులకే డీఎస్సీ
20 మార్కులకు టెట్ వెయిటేజి
మరో 7100 పోస్టులకు రెండు రోజుల్లో నోటిఫికేషన్
హైదరాబాద్, జనవరి 30 : లక్షలాది మంది ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త. కొద్ది రో జులుగా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న ‘డీఎస్సీ -2012 నోటిఫికేషన్’ సో మవారం విడుదలైంది. మొత్తం 21,343 ఉపాధ్యాయ ఉద్యోగాలను ఇందులో నోటిఫై చేశారు. ఉపాధ్యాయ అభ్యర్థులు దశాబ్దకాలంగా చేస్తోన్న ‘అప్రెంటిస్’ రద్దు డిమాండ్ కూడా నెరవేరుతోంది. వివాదాస్పదంగా మారిన ‘ఇంటర్‌లో సంబంధిత సబ్జెక్టులు తప్పనిసరి’ అనే నిబంధనను తొలగించారు.
నోటిఫై చేసిన మొత్తం పోస్టుల్లో.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 5,703, ఎస్జీటీ పోస్టులు 11, 602 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్లు 2000, పీఈటీలు 365, మునిసిపల్ పాఠశాలల్లో 1,673 పోస్టులు ఉన్నాయి. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 17వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. సచివాలయంలో సోమవారం సాయంత్రం 3 గంటలకు మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కె.పార్థసారథి ఈ డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. డీఎస్సీకి విద్యార్హతల నిబంధనల్లో కొన్నింటిని సడలించారు.
స్కూల్ అసిస్టెంట్స్ (మేథ్స్, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్) పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్ స్థాయిలో కూడా మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, హిస్టరీ, జాగ్రఫీ సబ్జెక్టులు చదివి ఉండాలన్న నిబంధనలను తొలగించారు. అంటే.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్ చదివి ఉండాలన్న నిబంధన లేదు.
ఫలితంగా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా నేరుగా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు కూడా అర్హత లభిస్తుంది. స్కూల్ అసిస్టెంట్స్ (జీవశాస్త్రం) పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు జీ.వో.నెం.4లో పేర్కొన్న సబ్జెక్టులతో పాటు సెరికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, పౌల్ట్రీ సబ్జెక్టుల అభ్యర్థులకు కూడా అర్హత కల్పించారు. టీచర్లకు అప్రెంటిస్ విధానాన్ని ఈ డీఎస్సీ నుంచి రద్దు చేశారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు నమూనా, యూజర్ గైడ్ కోసం జ్ట్టిఞ://్చఞఛీటఛి.ఛిజజ.జౌఠి.జీn వెబ్‌సైట్‌ను చూసుకోవాలి.
డీఎస్సీ 80 మార్కులకే..
టెట్‌కు వెయిటేజీ ఇవ్వనున్న కారణంగా 80 మార్కులకే డీఎస్సీ పరీక్షను నిర్వహించనున్నారు. మిగతా 20 మార్కులకు టెట్ మార్కులను వెయిటేజీగా జమ చేస్తారు. ఒక్కో ప్రశ్నకు అర మార్కు చొప్పున 80 మార్కులకు 160 డీఎస్సీ పరీక్ష ఉంటుంది. ఎస్జీటీ పరీక్షలో జనరల్ నాలెడ్జ్‌కు 10 మార్కులు, పర్‌స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 10, ఇంగ్లీష్ 9, ఇండియన్ లాంగ్వేజ్ 9, మాథ్స్ 9, సైన్స్ 9, సోషల్ స్టడీస్ 9, టీచింగ్ మెథడ్ 15 మార్కులు ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్ పరీక్ష ల్లో.. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10, పర్‌స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 10, సబ్జెక్ట్ కంటెం ట్ 44, టీచింగ్ మెథడాలజీ 16 మార్కులు ఉంటాయి. పీ ఈటీలకు టెట్ ఉండకపోవ డం వల్ల పూర్తిగా 100 మా ర్కులకు పరీక్ష ఉంటుంది.
రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల్లో ‘తానే’ సైక్లోన్ రానున్నందని, విపత్తులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని పంకజ్ ద్వివేది జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం రాజధాని నుంచి ప్రకృతి వైపరీత్యాలు అనే అంశంపై జిల్లా కలెక్టర్లతో ఆయన అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ రాబోయే మూడు రోజుల్లో తానే సైక్లోన్ రాష్ట్రంలో తీవ్ర ప్రభావం చూపే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపిందన్నారు. దీనివల్ల తీవ్రంగా వర్షాలు పడే అవకాశముందని, వర్షాల వల్ల ఏరకమైన ప్రాణనష్టం, ఆస్తి నష్టం వాటిల్లకుండా తగినవిధంగా జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు.
వర్ష ప్రభావిత జిల్లాలో షెల్టర్లను, కంట్రోల్ రూములను ఏర్పాటు చేయాలని తెలిపారు. అధిక వర్షాల వల్ల రోడ్లు, బ్రిడ్జిలు దెబ్బతినే అవకాశముం దని, అలాంటి వాటిని ముందస్తుగా గుర్తించి చర్యలు చేపట్టాలన్నారు. అలాగే విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని, కావున పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బి, ట్రాన్స్‌కో తదితర శాఖల అధికారులను అప్రమత్తంగా ఉండేలా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేయాలన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. అనంతరం జిల్లాలవారీగా సైక్లోన్‌కు గురయ్యే ప్రాంతాల వివరాలు, అక్కడ అధికారులు చేపట్టబోయే ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూము ఏర్పాటు చేశాం ః కలెక్టర్
తానే సైక్లోన్ నిమిత్తం ముఖ్య కార్యదర్శి ఆదేశాల మేరకు ఇప్పటికే కలెక్టరేట్‌లో కంట్రోల్ రూము ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ దుర్గాదాస్ వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్య కార్యదర్శికి వివరించారు. ముఖ్యంగా చిత్తూరు సరిహద్దు గ్రామాలు, తాడిపత్రి నియోజకవర్గం లోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే దీనిప్రభావం ఉండవచ్చని తెలిపారు. వర్షాభావ జిల్లాకు సైక్లోన్‌వల్ల కొద్దిగా వర్షాలు వస్తే అది జిల్లాకు వరమవు తుందని కలెక్టర్ వివరించారు. ఏదిఏమైనా అన్ని రకాలుగా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించా మని తెలిపారు. సమావేశంలో హైదరాబాద్‌లో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కమీషనర్ రాధా, జిల్లా నుంచి అదనపు జేసి చెన్నకేశవరావు, డిఆర్‌ఓ సుదర్శన్‌రెడ్డి, పెనుకొండ ఆర్‌డిఓ ఈశ్వర్, కలెక్టరేట్ సూపరింటెం డెంట్ వరదరాజులు తదితరులు పాల్గొన్నారు.

తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్ విజయమ్మ వేసిన పిటిషన్‌లో గతంలో ఆమె భర్త రాజశేఖరరెడ్డి ఆరోపించిన అంశాలే ఉన్నాయని తెలుగుదేశంపార్టీ పేర్కొంది. అనేక కేసులు విచారణకు అర్హత లేవని కోర్టులే తోసిపుచ్చాయని, అవే అంశాలతో మళ్ళీ కోర్టులో ఫిర్యాదు చేశారని ఆపార్టీ దుయ్యబట్టింది. విజయమ్మ పిటిషన్‌పై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించిన రాష్ట్ర హైకోర్టు సహజ న్యాయ సూత్రాలు కూడా పాటించకపోవడం బాధాకరమని తెలుగుదేశం పార్టీ విచారం వ్యక్తంచేసింది.ప్రతివాదికి కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా సిబిఐ దర్యాప్తునకు ఆదేశించడం, పిటిషన్ ఒకటైతే హైకోర్టు మరో ఆదేశం ఇచ్చిందని మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో తెదేపా శాసనసభ్యులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో తుమ్మల నాగేశ్వరరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఏ.రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి రొచ్చులోకి దిగి, ఆ రొచ్చును ఇతరులపైకి చల్లే ప్రయత్నం చేస్తున్నారని తుమ్మల నాగేశ్వరరావు దుయ్యబట్టారు. 1975 నుంచి చంద్రబాబుపై ఇవే ఆరోపణలు చేసి 18సార్లు కోర్టుల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి సహా అనేక మంది కాంగ్రెస్ నేతలు పిటిషన్లు వేశారని, వాటిని నిరూపించలేక కొన్ని ఉపసంహరించుకోగా, మరికొన్నింటిని కోర్టులు కొట్టివేశాయని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబుపై వేసిన పిటిషన్లు విచారణకు అనర్హమైనవని కోర్టులు తోసిపుచ్చాయని ఆయన చెప్పారు. కన్నా లక్ష్మీనారాయణ కేసులో కూడా గతంలో చేసిన ఆరోపణలపై పిటిషన్ వేసి ఎన్నికలు కాగానే ఉపసంహరించుకున్నారని ఆయన చెప్పారు. 1999, 2004 మధ్య ఐదేళ్ళపాటు ఏ ఒక్క రాజ్యాంగ వ్యవస్థను కూడా చర్య తీసుకోమని కోరలేదంటూ ప్రతివాదులకు నోటీసులు ఇవ్వడానికి కూడా ఈ అంశాలకు అర్హత లేదని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టంచేసిందని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. హైకోర్టు తీర్పును ప్రశ్నించడం, కించపరచడం తమ ఉద్దేశం కాదని, కోర్టులను, రాజ్యాంగ వ్యవస్థలను గౌరవిస్తామని బొజ్జల గోపాలకృష్ణారెడ్డి స్పష్టంచేశారు. అలాంటి వ్యక్తిని కూడా సిబిఐ విచారణ పరిధిలోకి తీసుకురావడం బాధాకరమన్నారు. తాము న్యాయ వ్యవస్థనుగానీ, సిబిఐగానీ ప్రశ్నించడం లేదని, విజయమ్మ పిటిషన్ ఆరోపణలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, వాస్తవాలు ప్రజలకు చెప్పేందుకు గత చరిత్రను మరోసారి గుర్తు చేస్తున్నామని బొజ్జల అన్నారు. సింగపూర్‌లోని హోటల్ ఫోటోను ఇంటర్నెట్ నుంచి తెచ్చి చంద్రబాబు బినామీ ఆస్తి అని ఆరోపించారని, అయితే ఆ హోటల్ యాజమాన్యం గురించి కనీస ప్రస్తావన చేయలేదని రేవంత్‌రెడ్డి చెప్పారు. అమెరికాలో వైట్‌హౌస్ ఫోటో తెచ్చి అది కూడా చంద్రబాబు బినామీ ఆస్తి అని చెప్పినా ఆశ్చర్యం లేదని ఆయన చెప్పారు.

యానాంలో గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్, రిలయన్స్ పెట్రోలియం సంస్థలు తీర ప్రాంతాల్లో చేపడుతున్న కార్యకలాపాలను నిరసిస్తూ జిల్లా మత్స్యకార సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఓఎన్‌జిసి రిగ్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంస్థల కార్యకలాపాల వల్ల మత్స్య సంపదకు నష్టం వాటిల్లుతోందని ..తమ జీవనోపాధికి విఘాతం కలుగుతోందని మత్స్యకారులు వాపోయారు. దీనికి ఆయా సంస్థలు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమానికి కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ నేతృత్వం వహించారు. సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో సుమారు 300 బోట్లతో 3 వేల మంది మత్స్యకారులు సముద్ర మార్గాన రిగ్ ముట్టడికి బయలుదేరారు.
అయితే జిఎస్‌పిసి రిగ్ ముట్టడికి వందలాది బోట్లు వెళుతుండగా మార్గ మధ్యలో కోస్టు గార్డు సిబ్బంది తమ మినీ నౌక ద్వారా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆందోళనకారులకు, కోస్టుగార్డు సిబ్బందికి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఒక దశలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. రిగ్ ప్రాంతానికి 500 మీటర్ల దూరం వరకు ఎవరూ వెళ్ల రాదని, నిషేధ ఆజ్ఞలున్నాయని, వెనుకకు వచ్చేయాలంటూ హెచ్చరించారు. అయినప్పటికీ ఆందోళనకారులు వాటిని ఖాతరు చేయలేదు. ఈ నేపథ్యంలో కాకినాడ డీఎస్పీ లక్ష్మీనారాయణ, అమలాపురం డీఎస్పీ రాజశేఖరరావు ఆందోళనకారులకు నచ్చజెప్పారు.
ఈ సందర్భంగా జిఎస్‌పిసి కార్యకలాపాలు నిలిపి వేశారని సమాచారం రావడంతో అక్కడకు వెళ్లకూడదని నిర్ణయించుకుని అదే ప్రాంతంలో ఉన్న ఓఎన్‌జిసి రిగ్‌ను ఆందోళనకారులు ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. సుమారు రెండుగంటలన్నరపాటు 500 నాటికల్ మైళ్ళు ప్రయాణించి భారీ స్థాయిలో ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో మత్స్యకార నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐ పోలవరం, కాట్రేనికోన, ముమ్మిడివరం, తాళ్లరేవు, యానాం ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సావిత్రి నగర్ పరిసర ప్రాంతాల్లో యానాం, ఆంధ్రా ప్రాం తానికి చెందిన పోలీసులు భారీగా మోహరించారు.

తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో అధిష్ఠానంతో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించిన తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు చిట్టచివరి సారిగా ఈ నెల 25వ తేదీన ఢిల్లీకి వెళ్ళాలని నిర్ణయించారు. ఈ సారి అధిష్ఠానం సానుకూలంగా నిర్ణయం తీసుకోని పక్షంలో హైదరాబాద్‌కు తిరిగి వచ్చి అందరూ రాజీనామాలు చేయాలని నిర్ణయించారు. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా రాజీనామాలకు సిద్ధంగా ఉండాలని సమావేశంలో నిర్ణయించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సారధ్య సంఘం చైర్మన్, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు నివాసంలో గురువారం తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సారథ్య సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి, గవర్నర్‌పై సభ్యులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జరుగుతున్న సకల జనుల సమ్మె గురించి ముఖ్యమంత్రి, గవర్నర్ కేంద్రానికి, అధిష్ఠాన వర్గానికి తప్పుడు నివేదికలు పంపిస్తున్నారని, ఆ నివేదికల అధారంగానే అధిష్ఠానం ప్రతినిధులు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్నారని వారు విమర్శించారు. రాష్ట్రంలో పరిస్థితిని అంచనా వేసేందుకు అధిష్ఠాన వర్గం తన దూతగా ఎవరినైనా పంపించి వాస్తవాలను తెలుసుకోవచ్చు కదా అని వారు అభిప్రాయ పడ్డారు. సకల జనుల సమ్మె ప్రభావం ఏమీ లేదంటూ ఎఐసిసి అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి ఢిల్లీలో చేసిన ప్రకటనను సమావేశం తీవ్రంగా ఖండించింది. అదే విధంగా, తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల గురించి తెరాస అధినేత కెసిఆర్ చేస్తున్న వ్యాఖ్యలను కూడా సమావేశం ఖండించింది.
సకల జనుల సమ్మెతో తెలంగాణలో జన జీవనం స్తంభించినా అధిష్ఠాన వర్గం తెలంగాణపై నిర్ణయం తీసుకోకపోవడం పట్ల సారధ్య సంఘం ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఇక చివరిసారిగా ఢిల్మీకి వెళ్ళి అధిష్ఠాన వర్గాన్ని కలిసి ఇక్కడి పరిస్థితిని వివరించి తెలంగాణపై వెంటనే నిర్ణయం తీసుకోవలసిందిగా కోరుదాం, అధిష్ఠాన వర్గం సానుకూలంగా స్పందిస్తే సరే, లేని పక్షంలో వెంటనే హైదరాబాద్‌కు తిరిగి వచ్చి తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం రాజీనామాలు చేద్దాం’ అని సమావేశంలో సభ్యులు అన్నారు. దీనిపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, మళ్ళీ మనం ఎవరం ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం అందరం రాజీనామాలు చేస్తే అధిష్ఠానవర్గమే దిగి వచ్చి తెలంగాణను ప్రకటిస్తుంది’ అని అన్నారు.
మంత్రులు కూడా రాజీనామాలు చేయాలన్న విషయం చర్చకు వచ్చినపుడు, ఎంతమంది మంత్రులు రాజీనామాలు చేసేందుకు సిద్ధపడతారో అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సారధ్య సంఘం చైర్మన్‌గా ఉన్న పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె.జానారెడ్డి సమావేశంలో తెలియజేశారు. వెంటనే మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలుగజేసుకుని తాను కూడా రాజీనామా చేసేందుకు సిద్ధమేనని ప్రకటించారు. తన రాజీనామా గురించి ఇంతకు ముందే చెప్పానని, నెలాఖరులోగా తెలంగాణ ఏర్పాటుకు అధిష్ఠానం సానుకూల నిర్ణయం తీసుకోని పక్షంలో అక్టోబర్ 2వ తేదీ నుంచి ఆమరణ దీక్ష చేపట్టనున్న విషయాన్ని కూడా మీడియా ద్వారా ప్రకటించానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరించారు. నల్లగొండ జిల్లా సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆర్.దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ, తన సోదరుడు, ఉద్యావన శాఖ మంత్రి ఆర్.వెంకటరెడ్డితో కూడా తాను రాజీనామా చేయిస్తానని హామీ ఇచ్చారు. అయితే మిగిలిన తెలంగాణ మంత్రుల్లో ఎంతమంది రాజీనామాకు సిద్ధపడతారో ఇప్పుడే చెప్పలేమని వారు అభిప్రాయ పడ్డారు.
మాకు కావాల్సింది తెలంగాణ.. కిలో రూ.1 బియ్యం కాదు
ఇలా ఉండగా, సమావేశం అనంతరం మాజీ మంత్రి, ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. సకల జనుల సమ్మె ఇంత తీవ్రంగా ఉంటే రూపాయికి కిలో బియ్యాన్ని ఎవరు అడిగారని ప్రశ్నించారు. ‘మాకు కావలసింది తెలంగాణ తప్ప రూపాయికి కిలో బియ్యం కాదు’ అని దామోదర్‌రెడ్డి అన్నారు. సకల జనుల సమ్మె ప్రభావం గురించి ముఖ్యమంత్రి అధిష్ఠాన వర్గానికి తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఆయన మండి పడ్డారు.
తెలంగాణ ఇవ్వకపోతే కఠిన నిర్ణయాలు
తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సారధ్య సంఘం అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ, ఇక్కడి పరిస్థితిని అధిష్ఠాన వర్గానికి వివరించేందుకు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం ఈ నెల 25వ తేదీ సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళతామన్నారు. 26వ తేదీన అధిష్ఠాన వర్గాన్ని కలుసుకుంటామని, ఈ సందర్భంగా తెలంగాణకు అనుకూలంగా అధిష్ఠాన వర్గం నిర్ణయం తీసుకోని పక్షంలో హైదరాబాద్ తిరిగివచ్చి కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదని ఆయన హెచ్చరించారు.
తప్పుడు నివేదికలు పంపుతున్న సిఎం, గవర్నర్
కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు మందా జగన్నాధం మాట్లాడుతూ, సకల జనుల సమ్మెకు సంబంధించి ముఖ్యమంత్రి, గవర్నర్ కూడా కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచి వేసేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.

తమతో కలసిరండి అని వివిధ జిల్లాల కాంగ్రెస్ ఎమ్మెల్యేలను డబ్బుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రలోభపెడుతోందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ విమర్శించారు. రూ.5 కోట్లు ఇస్తాం రూ.10, రూ.20 రూ.30 కోట్లు ఇస్తామంటూ ఎమ్మెల్యేలకు గాళం వేస్తున్నారని ధ్వజమె త్తారు. ఎవర్ని ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు మీకు సమాచారం ఉంది అని అడగ్గా ఆ వివరాలు వెల్లడించడం ఇప్పుడు మంచిది కాదని ఆయన అన్నారు. అలా డబ్బు తీసుకొని వెళ్లే ఎమ్మెల్యేలు తిరిగి మరలా గెలవగలరా అని ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బేరసాలకు దిగుతున్నారని విమర్శించారు.
గురువారం గాంధీభవన్‌లో తనను కలసిన మీడియా ప్రతినిధులతో బొత్స సత్యనారాయణ మాట్లాడారు. తీసుకొన్న డబ్బు ఉత్సవ విగ్రహంలా పెట్టుకొని పూజించాలే గానీ వాటితో ఆ ఎమ్మెల్యేలు ఏమీ సాధించలేరని చెప్పారు. ఈ ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదించి ఉప ఎన్నికలు అనివార్య మైతే ఎదుర్కోనికి ఇప్పటికే ప్రత్యామ్నా యాలు చేసుకొంటున్నామన్నారు. డబ్బు తీసుకొన్న ఎమ్మెల్యేలు జగన్‌వైపు వెళ్లితే ఎన్ని కల్లో వారిని ప్రజలు హర్షిస్తారాఅ ని ప్రశ్నిం చారు. రాజీనామాలు చేసిన ఆ ఎమ్మెల్యేలతో మీరు చర్చించే అవకాశముందా అని ప్రశ్నిం చగా ఆ పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. ఎవర్ని దేహీ అంటూ అభ్యర్ధించాల్సిన అవ సరం కాంగ్రెస్‌కు లేదన్నారు. కాంగ్రెస్ పారీ కి ఓ స్పష్టత, సిద్ధాంతం, వైభవం ఉంద న్నారు. కాంగ్రెస్ పార్టీ గౌరవం ఇస్తుంది, తీసుకొంటుందని అని పేర్కొన్నారు. వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రలోభపెడుతున్న ఎమ్మెల్యేలతో మీరేమైన మాట్లాడుతున్నారా అని అడగ్గా ఆ అవసరం తమకు లేదన్నారు. ప్రలోభాలకు గురిచేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. జగన్ కోసం రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలలో ఒకరైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతరపున గెలిస్తే మాత్రం అవి నీతికి లైసెన్స్ ఇచ్చినట్లేనని పేర్కొన్నారు.
కానీ వీరిని గెలిపించి అవినీతిని ప్రొత్సహించేందుకు రాష్ట్ర ప్రజలు సిద్దంగాలేరని తెలిపారు. 2014 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని చెప్పారు. మళ్లీ తిరిగి అధికారంలోకి వస్తుందని స్పష్టంచేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల భాష అసభ్యంగా ఉందన్నారు. జగన్ దోషి అని తేలితే కాంగ్రెస్ ముద్దాయిగా నిలుస్తుందని జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యనా లపై ప్రస్తావించగా అవినీతి పరులను, తప్పుచేసిన వారిని కాం గ్రెస్ పార్టీ కాపాడాలి అంటారా అని బొత్స తీవ్రంగా స్పందించారు. వై.ఎస్.నిర్దోషి అని కోర్టులో ప్రభుత్వం అఫిడివిట్ దాఖలు చేయ కపోవడంపై జీవన్‌రెడ్డి ప్రశ్నించడాన్ని అడగ్గా ఆయనే ఓ న్యాయవాది ఆ పని ఆయన చేస్తే బాగుంటుందన్నారు. ఆ పనిచేశాక జీవన్‌రెడ్డి జగన్‌తో కలసి తిరిగితే బాగుంటుందని పేర్కొ న్నారు. వై.ఎస్.పై అవినీతి ఆరోపణలు వస్తే కొడుకుగా వాటిని నివృత్తిచేయాల్సిన బాధ్యత జగన్‌పై ఉందన్నారు. ముందు ఆ పని జగన్ చేయాల్సి ఉంటుందన్నారు. మీ ముఖ్యమం త్రిగా వైఎస్‌ఆర్‌పై ఆరోపణలు వస్తే మీరేం చేయరా అని ప్రశ్నించగా ముందు జగన్‌ను చేయనీయండి ఆ తర్వాత తాము ఏం చేయాలో చేస్తామని బొత్స పేర్కొన్నారు. తండ్రిపై ఆరోపణలు వస్తే అది వాస్తవం కాదని ఆధారాలతో సహా చూపించాల్సింది పోయి మాపై బురదజల్లి తల్లి, దండ్రులపైనే బురద జల్లుకొంటున్నారని విమర్శించారు.
హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించిన విషయాన్ని ప్రశ్నించగా ఇది ముందే ఉహించిందన్నారు. జగన్‌కు బీజేపీతో సంబంధాలు ఉన్నాయనడానికి పార్లమెంటులో ఆయనకు అనుకూలంగా బీజేపీ, కేసును ఆ పార్టీ నేత వాదించడమే ఇందు కు నిదర్శమన్నారు. స్పీకర్ ఆ ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమో దించే దాకా వారికి పునరాలోచనకు సమయం ఉన్నట్లేనని ఓ ప్ర శ్నకు జవాబిచ్చారు. జీవన్‌రెడ్డి పార్టీలైన్ దాటి మాట్లాడారా లేదా అన్నది తమ పార్టీ అంతరంగికంగా చర్చించుకొంటామన్నారు.

సిబిఐ సోదాలతో వైఎస్ జగన్ ఉక్కిరి బిక్కిరవుతుండటంతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదురు దాడికి దిగింది. కృష్ణా జిల్లా ఓదార్పు యాత్రలో ఉంటూనే జగన్ ఆస్త్రం సంధించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యూహం రూపొందించారు. సిబిఐ ఎఫ్‌ఐఆర్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును ప్రస్తావించడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ జగన్ గ్రూపు ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేయాలని నిర్ణయించారు. ఇద్దరు ఎంపీలతో పాటు, 29 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇద్దరు తెలుగుదేశం తిరుగుబాటు ఎమ్మెల్యేలతో పాటు, తెలంగాణా ఏర్పాటు కోసం రాజీనామాలు చేసిన ముగ్గురు ఎమ్మెల్యేల పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఎమ్మెల్యే పదవులతోపాటు కాంగ్రెసు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నారు. ఈ నిర్ణయం జరిగిన వెంటనే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్పీకర్, గవర్నర్ అపాయింట్‌మెంట్ కూడా తీసుకున్నారు. సోమవారం ఉదయం స్పీకర్‌ను, సాయంత్రం గవర్నర్‌ను కలవాలని నిర్ణయించుకున్నారు. రాజీనామా లేఖలు సమర్పించిన తరువాత బస్సు యాత్ర చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే, బస్సు యాత్ర ఎప్పటినుండి ప్రారంభించాలన్నది ఇంకా ఖరారు చేయలేదు. ఆదివారం రాష్ట్ర రాజధానిలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు చర్చనీయాంశమయ్యాయి. అయితే వీరి రాజీనామాలు ఆమోదించినా సర్కార్ మనుగడకు వెంటనే ముప్పు రాకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అయితే అనిశ్చితి పెరిగి ఇంకొంతమంది ఎమ్మెల్యేలు జగన్‌వైపు వెళ్తే ప్రభుత్వానికి ముప్పు ఏర్పడుతుంది. రాజీనామాల నిర్ణయం వెలువడిన వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ దిశలోనే ప్రయత్నాలు ప్రారంభించారు. సిబిఐ ఎఫ్‌ఐఆర్‌లో వైఎస్ పేరును పేర్కొనడానికి నిరసనగా తమ బాటలోనే ప్రయాణించాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై వారు ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ మేరకు ఆ పార్టీ నాయకులు బహిరంగంగానే పిలుపునిచ్చారు. తమ పిలుపునకు సానుకూల స్పందన లభిస్తోందని, మరికొందరు ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేయడానికి ముందుకొచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ తెలిపారు. మరో నాయకుడు జూపూడి ప్రభాకర్‌రావు ఒక టివి ఛానల్‌లో మాట్లాడుతూ మరో 20 మంది ఎమ్మెల్యేలు సైతం రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారని, తొలిదశ తరువాత రెండు మూడు రోజుల్లో వారు కూడా రాజీనామాలు సమర్పిస్తారని అన్నారు. ఈ దిశలో కొందరితో ఇప్పటికే కొందరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో చర్చల ప్రక్రియ కూడా ప్రారంభించినట్లు సమాచారం. మరో వైపు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బుజ్జగింపుల పర్వానికి శ్రీకారం చుట్టారు. సిఎం క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులతో పలు దఫాలు సమావేశమయ్యారు. జిల్లాల వారిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బుజ్జగించే బాధ్యత మంత్రులకు అప్పగించారు. ఈ సమావేశాల్లో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా పాల్గొన్నారు.
మూడు గంటల పాటు సమావేశం
అంతకుముందు జూబ్లిహిల్స్‌లోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు పలువురు ఇతర నాయకులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 11.30 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం సాయంత్రం 3.30 గంటల వరకు కొనసాగింది. రాజీనామాలు చేయాలన్న ప్రతిపాదన రెండు రోజుల క్రితమే వచ్చినప్పటికీ ఆ తరువాత చోటుచేసుకునే పరిణామాలపైనే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ సాగినట్లు తెలిసింది. సమావేశం నుండి కృష్ణా జిల్లా ఓదార్పు యాత్రలో ఉన్న జగన్‌తో ఒకటికి రెండు సార్లు ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. సమావేశం నుండే స్పీకర్ కార్యాలయానికి, గవర్నర్ కార్యాలయానికి ఫోన్లు చేసి అపాయింట్‌మెంట్లు ఖరారు చేసుకున్నారు. ఆ తరువాత రాజీనామాల నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు.
శాసనసభలో బలాబలాల తీరు
294 మంది సభ్యులున్న రాష్ట్ర శాసనసభలో సర్కారు మనుగడకు 148 మంది సభ్యుల మద్దతు అవసరమవుతుంది. ప్రస్తుత శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి ప్రజారాజ్యంతో కలిసి 173 మంది సభ్యుల బలం ఉంది. తాజాగా రాజీనామా చేస్తామని ప్రకటించిన 29 మందిలో 27 మంది కాంగ్రెస్‌కు, పిఆర్పీకి చెందిన వారే! వీరి రాజీనామాలను ఆమోదిస్తే కాంగ్రెస్ బలం 146కు పరిమితమవుతుంది. అయితే, ఏడుగురు సభ్యులున్న ఎంఐఎం పార్టీ మద్దతు ఇప్పటివరకు కాంగ్రెస్‌కే లభిస్తోంది. వీరిని కూడా కలుపుకుంటే కాంగ్రెస్ సర్కారు ప్రభుత్వానికి వెంటనే ముప్పురాకపోవచ్చు. 12 మంది సభ్యులున్న టిఆర్‌ఎస్ కూడా శానససభలో కీలకపాత్ర పోషించనుంది. తెలుగుదేశం పార్టీకి ప్రస్తుత శాసనసభలో 86 మంది సభ్యులుండగా, వారిలో ఇద్దరు తాజాగా రాజీనామా చేస్తామని ప్రకటించారు. దీంతో ఆ పార్టీ బలం 84కు పరిమితం కానుంది. గతంలోనే నాగం జనార్ధనరెడ్డితో పాటు మరో ముగ్గురు టిడిపి సభ్యులు శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరికొందరు రాజీనామా నిర్ణయం తీసుకుంటే సర్కార్‌కు ముప్పు తప్పనిస్థితి ఏర్పడుతుంది.
కీలకం కానున్న స్పీకర్ నిర్ణయం!
29 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడానికి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో స్పీకర్ నాదెండ్ల మనోహర్ నిర్ణయం కీలకం కానుంది. తెలంగాణా ఏర్పాటు కోసం చేసిన రాజీనామాలను ఆయన ఇప్పటికే తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా రాజీనామాల విషయంలో ఆయన ఎలా స్పందిస్తారన్న విషయం ఆసక్తిదాయకంగా మారింది. ఆవేశంతో నిర్ణయం తీసుకున్నారంటూ ఆయన తెలంగాణా ప్రాంత ప్రజాప్రతినిధుల రాజీనామాలను తిరస్కరించారు. అదే సూత్రాన్ని తాజా నిర్ణయాలకు వర్తింపచేస్తారో లేదో చూడాలి. తనను కలిసిన విలేకరులతో స్పీకర్ ఆదివారం సాయంత్రం మాట్లాడుతూ రాజీనామా లేఖలు తనకు చేరిన తరువాత, వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
11 గంటలకు రాజీనామాలు
సోమవారం ఉదయం 11 గంటలకు తమ రాజీనామాలను స్పీకర్‌కు సమర్పించాలని జగన్ గ్రూపు ఎంఎల్‌ఏలు నిర్ణయించారు. ఉదయం తొమ్మిది గంటలకు జూబ్లిహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో సమావేశం కావాలని, అక్కడి నుండి పంజాగుట్టలో ఉన్న వైఎస్‌ఆర్ విగ్రహం వద్దకు వచ్చి నివాళులర్పించాలని వారు నిర్ణయించారు. వైఎస్ విగ్రహానికి నివాళులర్పించిన తరువాత బస్సులో అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి చేరుకుంటారు.

క్రాప్‌హాలిడేతో సమస్యల్లో కూరుకుపోయిన రైతాంగాన్ని ఆదుకుని, వారి సమస్యలను జాతీయ స్థాయిలో చర్చనీయాంశం చేసి, పరిష్కార మార్గం అన్వేషించేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరో సారి రైతుబాట పట్టనున్నారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు పలు జిల్లాలకు విస్తరిస్తున్న క్రాప్ హాలిడేను ఆయుధంగా మలిచి సర్కారుపై సమర శంఖం పూరిస్తున్నారు. రాష్ట్ర రైతాంగ సమస్యలను కేంద్రానికి, దేశ ప్రజలకు వివరించేందుకు జాతీయ పార్టీ నాయకులను రాష్ట్రానికి తీసుకురానున్నారు. ఫలితంగా కాంగ్రెస్‌పై రాష్ట్రం-కేంద్ర స్థాయిలో ఒత్తిడి పెంచనున్నారు.
రెండు రోజులుగా ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యట ిస్తున్న బాబు, రైతుల దైన్య స్థితిని నేరుగా తెలుసుకు న్నారు. క్రాప్ హాలిడేపై రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను జాతీ య స్థాయిలో ఎలుగెత్తి చాటేందుకు తనకు సహకరించా లని ఆయన ఇటీవలి తన ఢిల్లీ పర్యటన సందర్భంలో జాతీయ నేతలు ప్రకాశ్ కరత్, దేవెగౌడ, అజిత్ సింగ్, సురవరం సుధాకరరెడ్డితో పాటు ఎఐఎడిఎంకే, ఆర్‌ఎస్‌పీ, ఫార్వర్డ్ బ్లాక్ లాంటి పార్టీల నేతలను కలసి అభ్యర్థించగా, వారంతా చంద్రబాబుకు మద్దతు తెలిపారు. దానితో ఈ నెల 22, 23వ తేదీల్లో వారంతా గోదావరి జిల్లాలకు వచ్చి, రైతు సమస్యలను స్వయంగా తెలుసుకుని, వాటిని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లనున్నారు.ఆ తర్వాత ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాల ని నిర్ణయించారు. ఆ తర్వాత పార్లమెంటులో ఈ పార్టీలన్నీ రాష్ట్ర రైతు సమస్యలను ప్రస్తావించి, సభను స్తంభింప చేయాలని భావిస్తున్నారు.

కొత్తగా 24 లక్షల రేషన్ కార్డులు వచ్చే నెల రచ్చబండ కార్యక్రమంలో పంపిణీ చేస్తామని రవాణాశాఖ మంత్రి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. విజయనగరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన జిల్లా సమీక్షా మండలి (డిఆర్‌సి)లో ఆయన ప్రసంగించారు. విజయనగరం జిల్లాలో లక్షా 20 వేల రేషన్ కార్డులు పంపిణీ చేస్తామన్నారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘ఇందిర జలప్రభ’లో భాగంగా ఎస్సీ, ఎస్టీ భూములను బ్లాకులుగా విభజించి భూ అభివృద్ధికి నిధులు ఇవ్వనుందని తెలిపారు. జిల్లాలో సుమారు 11,300 ఎకరాలను డ్వామా అధికారులు ఇప్పటికే గుర్తించారనీ, అక్టోబర్ రెండున ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమవుతుందనీ చెప్పారు. జిల్లాలో సుమారు 70వేల ఎకరాల్లో రూ.73 కోట్లతో ఎస్సీ, ఎస్టీ భూముల అభివృద్ధికి కృషి చేశామని తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణను రైతుల ముంగిటకు అధికారులు తీసుకెళ్లాల్సిన అవసరముందన్నారు.
అన్ని పార్టీలు ఆమోదించాకే 14 ఎఫ్‌పై నిర్ణయం
రాష్ట్ర శాసనసభలో 14 ఎఫ్‌పై అన్ని రాజకీయ పక్షాలు చర్చించి ఆమోదించిన తరువాతే కేంద్ర హోంశాఖకు నివేదించామని బొత్స తెలిపారు. ఆ తరువాతే ఈ ప్రతిపాదనపై రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారని తెలిపారు.
యంత్రాలివ్వండి : మంత్రి విశ్వరూప్
పెట్టుబడులు, కూలీల వేతనాలు పెరిగినందున ట్రాక్టర్లు, వరినాట్లు వేయడానికి రైతులకు యంత్రాలు ఇవ్వాలని వ్యవసాయ, బ్యాంకింగ్ అధికారులను జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పి.విశ్వరూప్ ఆదేశించారు.