విద్య

గత డిసెంబర్‌లో జారీ చేసిన గ్రూప్-2 నోటిఫికేషన్‌లో 20 పోస్టులు అదనంగా పెరిగాయి. దీంతో గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా భర్తీ అయ్యే ఖాళీలు 665కు చేరుకున్నాయి. అలాగే మున్సిపల్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టులు 245 వరకు పెరిగాయి. గ్రూప్-4 నోటిఫికేషన్‌లో 34 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు పెరిగాయి. ఈ విషయాన్ని ఎపిపిఎస్‌సి కార్యదర్శి పూనం మాలకొండయ్య పేర్కొన్నారు.

వీఆర్వో, వీఆర్‌ఏల భర్తీకి వాయిదాల గ్రహ ణం పడుతోంది.ఈ పరీక్షల తేదీలు వాయిదాల మీద వాయిదాలు పడుతో న్నాయి. ఫిబ్రవరి 12న నిర్వహించాలని భావించిన వీఆర్వో, వీఆర్‌ఏల పరీ క్ష తాజాగా మరోమారు వాయిదా పడింది. తెలంగాణలో విశేష ప్రాచుర్యం ఉన్న సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో ఈ పరీక్షను ఫిబ్రవరి 19కి వా యిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఫిబ్రవరి 8నుంచి 11వ తేదీ వరకు వరంగల్ జిల్లా మేడారంలో సమ్మక్క సారక్క జాతర జరగనున్న రీత్యా ప్రభుత్వం ఈ వాయిదా నిర్ణయం తీసుకుంది. కాగా గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ధరఖాస్తులు, హాల్‌టిక్కెట్ల జారీ యథాతథంగా కొనసా గనుంది.ఈమేరకు సోమవారం రెవెన్యూమంత్రి నిర్ణయాన్ని ప్రకటించారు .

జాతీయ సిలబస్‌కు అనుగుణంగా రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ సిలబస్‌లో మార్పులు తీసుకువస్తున్నట్టు మాధ్యమిక విద్యాశాఖా మంత్రి పార్థసారధి చెప్పారు. శనివారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ పాఠశాలల అభివృద్ధికి 150 కోట్ల రూపాయిలు ఖర్చు చేయనున్నట్టు చెప్పారు. ఎయిడెడ్ స్కూళ్లలో టీచర్లను క్రమబద్ధీకరిస్తామని వెల్లడించారు. డిసెంబర్ నాటికి ఆంగ్లభాషలో కొత్త సిలబస్‌కు అనుగుణంగా పాఠ్య పుస్తకాల ముద్రణ పూర్తిచేసి, వచ్చే ఏడాదినాటికి తెలుగు అనువాదాలను అందుబాటులోకి తెస్తామన్నారు. ఇంటర్మీడియట్, పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికార్లతో ఆయన సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇంటర్మీడియట్‌కు సంబంధించి హైదరాబాద్, విశాఖల్లో ప్రత్యేక ఆర్జేడీలతో పాటు రంగారెడ్డిలో ఆర్‌ఐఓ పోస్టులు కేటాయించనున్నట్టు తెలిపారు. ఎయిడెడ్ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణ పూర్తి చేస్తామని చెప్పారు. కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో నమోదు
కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో బాలికల నమోదుకు పెద్దఎత్తున కృషి చేయాలని సర్వశిక్షా అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ ఆర్‌వి చంద్రవదన్ కోరారు. శనివారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించి, రాష్ట్రంలోని వివిధ తెగలకు చెందిన బాలికలు పాఠశాలల్లో నమోదు కావడం లేదని, వారి వారి పరిస్థితులను అవగాహన చేసుకుంటూ వారిని కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో చేర్పిస్తూ విద్యను అభ్యసించేలా పూర్తి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
10న డెంటల్ సర్జన్ల రిక్రూట్‌మెంట్ పరీక్ష
ఎపి ఇన్స్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్‌లో డెంటల్ అసిస్టెంట్ సర్జన్ల రిక్రూట్‌మెంట్ లిఖిత పరీక్షను వచ్చే నెల 10న నిర్వహించనున్నట్టు ఎపిపిఎస్‌సి ప్రకటించింది. అర్హులు, అనర్హుల జాబితాలను వెబ్‌సైట్‌లో ఉంచినట్టు ఎపిపిఎస్‌సి కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు.

ఎట్టకేలకు ప్రభుత్వం రెవెన్యూ శాఖలో ఖాళీల భర్తీకి సోమవారంనాడు షెడ్యూల్ ప్ర టించింది. ఈ మేరకు రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి వీ ఆర్వో, వీఆర్‌ఏల భర్తీ విధివిదానాలను స్రకటించారు. 1172 వీఆర్వో, 6063 వీఆర్‌ఏల ఖాళీలను వచ్చే ఏడు జనవరి 31లోపు నియామక ప్రక్రియ పూర్తిచేయనున్నట్లు ఆయన తెలిపారు. వీఆర్వోల విద్యార్హతను గతంలో ఉన్న పదోతరగతినుంచి ఇంటర్‌కు పెంచుతున్నట్లు ఆయన తెలి పారు. అదేవిదంగా వీఆర్‌ఏలకు 7నుంచి పదో తరగతికి విద్యార్హతను పెంచుతున్నట్లు అయన ప్రకటించారు. ఇక ఈ నియమకాలకు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రస్తు తం ప్రభుత్వం అనుసరిస్తోన్న రిజర్వేషన్ విధానమే వర్తి స్తుందని ఆయన తెలిపారు. ఇక ఎస్టీలు ఉన్న ప్రాంతా లకు కేవలం ఎస్లీ అభ్యర్దులతోనే నియమకాన్ని పూర్తి చేస్తామ న్నారు. వీఆర్‌ఓ సోస్టులకు దరఖాస్తులకు మాత్రం జిల్లాలోని ఏ గ్రామం వారైనా దరఖాస్థు చేసుకోవచ్చని, వీఆర్‌ఏలకు మాత్రం ఏ గ్రామం వారు అదే గ్రామానికి అర్హులని ఆయ న వెల్లడించారు.
అర్హతలు ఇవే…
అభ్యర్దుల ఎంపికలో అర్హతలను, వారి ఎంపిక విధానా న్ని రెవెన్యూ మంత్రి రఘువీరా వెల్లడించారు. ఈ ఉద్యోగా ల భర్తీకి జిల్లా యూనిట్‌గా కమిటీ నియామకం చేయ నుంది. ఈ కమిటీకి చైర్మన్‌గా జిల్లా కలెక్టర్ వ్యవహరి స్తారు. మెంబర్లుగా జాయింట్ కలెక్టర్, జిల్లా పరిషత్ సీఈఓ వ్యవహరిస్తారు. అవి…
వీఆర్‌ఓ పోస్టులకు….
ఈ పోస్టుకు ఇంటర్ పూర్తిచేసిన వారు అర్హులు, వీరు ఇంటర్‌లో సాధించిన మార్కులకు మెరిట్ ప్రాతిపదికన 75శాతం మార్కుల వెయిటేజీని కేటాయిస్తారు.
కంప్యూటర్‌లో పరిజ్ఞానం ఉన్న వారికి (డిప్లొమా ఇన్ కంప్యూటర్, లేదా ఏదేని కంప్యూటర్ అనుభవం) అదనం గా 5 మార్కులు కేటాయిస్తారు.
ఇక ఏదేని ప్రభుత్వ విభాగాల్లో (సెర్ప్, పారా లీగల్, కమ్యూనిటీ సర్వీసెస్, కాంట్రాక్ట్ రెవెన్యూ ఉద్యోగులకు) కాంట్రాక్ట్, పారా, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్న వారికి మరో 5 మార్కులను అదనంగా కేటాయించనున్నారు.
ఇక మిగిలిన 15 మార్కులకు అభ్యర్థులకు మౌఖిక (ఇంటర్వ్యూ) పరీక్ష నిర్వహిస్తారు.
1:3 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్య్వూకు ఆహ్వానిస్తారు.
వీఆర్‌ఏలకు…
నియమకాలకు రెవెన్యూ డివిజన్ యూనిట్ గా నిర్ణ యించారు. ఈ కమిటీకి ఆర్డీవో చైర్మన్‌గా, తహ శీల్దార్, ఎంపిడీఓలు సభ్యులుగా వ్యవహరిస్తారు.
10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ ప్రకారం 85 మార్కులు
మిగిలిన 15 మార్కులకు ఇంటర్య్వూ
ఏగ్రామం వారు ఆ గ్రామంలోనే దరఖాస్తు చేసు కోవాలి.
స్థానికులకే అవకాశాలు కల్పిస్తారు. అయితే ఆయా విభాగాల్లో మార్కుల ఆధారంగా శాస్ర్తీయ విధానం ద్వారా మెరిట్‌ను లెక్కిస్తామని మంత్రి రఘువీరా తెలిపారు.
ఇక ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్లను రెవెన్యూలో జాయింట్ కలెక్టర్లు జారీ చేస్తారని ఆయన పేర్కొన్నారు. ఇతర శాఖల్లో ఆయా శాఖల పిడీలు ఇస్తారని తెలిపారు.
దరఖాస్థుల షెడ్యూల్…
23 జిల్లాల్లో నోటీఫికేషన్ జారీ -నవంబర్26
దరఖాస్థుల స్వీకరణకు చివరి తేదీ-డిసెంబర్-17
దరఖాస్థుల స్క్రూటినీ, డాటా ఎంట్రీ-డిసెంబర్-26
ఇంటర్య్వూలకు 1ః3 నిష్పత్తిలో షార్ట్ లిస్ట్ ప్రకటన- జనవరి2-2012
అభ్యర్దులకు కాల్‌లెటర్ల పంపిణీ-జనవరి8-2012
ఇంటర్వ్యూల నిర్వహణ తేదీ-18 జనవరి నుంచి 28 జనవరి 2012 వరకు
ఫలితాల ప్రకటన-జనవరి 30, 2012న
దళారులను ఆశ్రయించకండి…
దొరికితే క్రిమినల్ చర్యలు…
1987లో మండలాల వ్యవస్థ ఏర్పడ్డ అనంతరం రెవెన్యూలో ఇంత పెద్ద ఎత్తున నియమకాలు జరపడం ఇదే ప్రథమమని ఆయన తెలిపారు. క్షేత్ర స్థాయిలో రెవెన్యూలో కీలకమైన ఈ ఉద్యోగాల భర్తీలో పూర్తి సారద ర్శకత పాటిస్తామన్నారు. ప్రతిభ, నిభందనల మేరకే నియ మకాలు జరుగుతాయన్నారు. ఎలాంటి అవకత వకలు, అవినీతికి ఆస్కారం లేకుండా నియమ కాలు చేపడ్తామ న్నారు. ఇంటర్య్వూలపై కొంత అపోహలు, అనుమానాలు నెలకొన్నాయని, అయితే దళారులు ఉద్యోగం ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తే క్రిమినల్ చర్యలకు ప్రణాళిక రూ పొందించామన్నారు. అందులో భాగంగానే అన్ని జిల్లాల ఎస్పీలను ఇందులో భాగస్వామ్యం చేశామన్నారు. ఈ ఉ ద్యోగ నియామక ప్రక్రియ మొత్తం వెబ్‌సైట్‌లో పారదర్శ కంగా పెడ్తామన్నారు. ఇంటర్వ్యూలను వీడియో రికార్డు చేసే ప్రతిపాదన పరిశీలిస్తామన్నారు. ఈనెల 21న జిల్లా కలెక్టర్లతో జరిపే వీడియో కాన్ఫరెన్సులో మరింత వివరం గా వారి బాధ్యతలను గుర్తుచేస్తామని వెల్లడించారు.

మెడికల్ కోర్సుల్లో జాతీయ స్థాయి ఎంట్రెన్స్ నిర్వహణకు సిలబస్‌తోపాటు ఈ పరీక్షను నిర్వహించే తేదీని కూడా జాతీయ వైద్య మండలి (ఎంసిఐ) ప్రకటించింది. వచ్చే ఏడాది (2012) మే 13న ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నట్టు భారత వైద్యమండలి ప్రకటించింది. దేశంలోని 335 వైద్య కళాశాలల్లో సీట్ల భర్తీకి జాతీయ స్థాయి అర్హతా పరీక్షతో పాటు ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నట్టు మండలి ఇంతకు ముందే ప్రకటించింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి ఈ జాతీయ స్థాయి పరీక్షను 2014 వరకు వాయిదా వేయాలని కోరినప్పటికీ ఫలితం దక్కలేదు. రెండేళ్ళ పాటు ఈ జాతీయస్థాయి ప్రవేశ పరీక్షను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించినా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖతోపాటు భారత వైద్యమండలి (ఎంసిఐ) ఏమాత్రం పట్టించుకోలేదు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించి ఈ ప్రవేశ పరీక్షను తమ రాష్ట్రంలో నిర్వహణ కుదరదని, ఇందుకు కారణాలు చెప్పడంతో స్టే మంజూరు చేసింది.
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి ఇటీవల విలేకరులతో మాట్లాడుతూ, భారత వైద్యమండలి ఆదేశానుసారం రాష్ట్రంలోనూ వైద్య సీట్ల భర్తీకి జాతీయ స్థాయి ఎంట్రెన్స్‌ను నిర్వహించేందుకు తాము సహకరిస్తామని చెప్పారు. ఈ అంశంపై గందరగోళ పరిస్థితి నెలకొనడంతో ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని ఎంట్రెన్స్‌ను వాయిదా వేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని ప్రకటించారు. అంతకు ముందు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సుదీర్ నేతృత్వంలో సమావేశమైన ఉన్నత స్థాయి కమిటీ ప్రత్యేక పరీక్ష నిర్వహణపై లోటుపాట్లను, దుష్ఫలితాలను, ఇబ్బందులను చర్చించింది. రాష్ట్రంలో ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించడం కుదరదని ఈ సమావేశం తేల్చింది.
ప్రస్తుతం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థికి ఎంసెట్ తరహాలోనే ఎంట్రెన్స్‌కు సిద్ధమవుతున్నారని, ఈ పరిస్థితుల్లో జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తే వారు ఆందోళన చెందడంతో పాటు తీవ్ర మనస్తాపానికి గురయ్యే అవకాశముందని అధికారులు ఈ సమావేశంలో చెప్పారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కపిల్ సిబాల్ ఇటీవల ఒక ప్రకటన చేస్తూ తెలుగు మాధ్యమంలో కూడా జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. ఇప్పుడు ఒక్క మెడికల్ కోర్సుకే జాతీయ స్థాయి పరీక్ష జరిపితే అగ్రికల్చర్, డెంటల్, బి.ఫార్మసీ, యునాని, ఆయుర్వేద, హోమియెపతి కోర్సులకు ప్రత్యేకంగా మరో పరీక్షను జరపవలసి ఉంటుందని అధికారులు చెబుతు న్నారు. ప్రభుత్వం అభ్యర్థించిన పరీక్ష వాయిదాకు ససేమిరా అంటుండడంతో ఇక విద్యార్థులు ఏంచేయాలో దిక్కుతోచని పరిస్థితి లో ఉన్నారు.
జాతీయ స్థాయి పరీక్ష నిర్వహిస్తే రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు తీరని నష్టం వాటిల్లుతుందని, ర్యాంకులన్నీ ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థులు కైవసం చేసుకుంటారని ఆరోపిస్తున్నారు. ప్రవేశ పరీక్ష నిర్వహించి ఎంబిబిఎస్ కోర్సుల్లో ప్రవేశాలను ఎవరు నిర్వహిస్తారన్నది ఎంసిఐ స్పష్టం చేయక పోవడంతో అధికారులు సైతం విస్మయానికి గురవుతున్నారు.
ముఖ్యమంత్రి మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి జాతీయస్థాయి ప్రవేశ పరీక్షను వాయిదా వేయించడానికి ప్రయత్నిస్తే తప్ప రాష్ట్ర విద్యార్థులకు ప్రయోజనాలు చేకూరుతాయని అంటున్నారు. జాతీయ స్థాయి ఎంట్రెన్స్‌కు సంబంధించి తేదీ ఖరారు చేయడంపై ఉన్నతాధికారులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. ప్రభుత్వ అభ్యర్థనను పెడచెవిన పెట్టి భారత వైద్యమండలి ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సిఎం లేఖరాసి విద్యార్థులకు జరిగిన నష్టాన్ని వివరించినా అదే పనిగా భారత వైద్యమండలి ప్రవేశ పరీక్ష నిర్వహణకు సిద్ధమవుతుండడం పట్ల వారు ఒకింత ఆక్రోషాన్ని వెల్లగక్కారు. భారత వైద్యమండలి చేసిన ప్రకటనపై ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పి.జయప్రకాశ్ రావు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు స్పందిస్తూ, జాతీయ స్థాయి పరీక్షను వాయిదా వేయాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కోరిన విషయాన్ని గుర్తుచేశారు.

వచ్చే విద్యా సంవత్సరం నుంచే జాతీయ స్థాయిలో ఉమ్మడి మెడికల్ ఎంట్రన్స్ నిర్వహిస్తామని కేంద్ర మంత్రి గులాం నబి ఆజాద్ గురువారం ప్రకటించారు. తెలుగు లోనూ పరీక్ష ఉంటుందన్నారు. ఈ విషయంలో విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అలాగే అన్ని ప్రాంతీయ భాషలలో కూడా ఈ పరీక్షను నిర్వహిస్తామని ఆజాద్ ప్రకటించారు. దీని వల్ల ఉత్తరాది రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలు కూడా ఆజాద్ నిర్ణయాన్ని స్వాగతించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎట్టి పరిస్థితిల్లో వచ్చే ఏడాది మే నెలలో మెడిసిన్‌లో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని కుండబద్దలు కొట్టారు. దీంతో ఇప్పటి వరకు మెడిసిన్ టెస్ట్ నిర్వహణపై స్పష్టత వచ్చింది.
వచ్చే ఏప్రిల్‌లో నిర్వహించే ఎంసెట్ నుంచి మెడిసిన్ వేరు కాబోతుంది. సదరు విద్యార్థులంతా రాష్ట్ర స్థాయి సిలబస్‌లో ఎంసెట్‌కు ప్రిపేర్ అయ్యారు. వచ్చే మేలో ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తామని కేంద్రం చేసిన వ్యాఖ్యలతో విద్యార్థులలో కలవరం మొదలైంది. అలాగే రాష్ట్ర ఆరోగ్య శాఖ, ఉన్నత విద్యా శాఖ అధికారులలో కూడా ఆందోళనలో పడ్డారు. ఈ విషయం ముందే గ్రహించిన ఈ రెండు శాఖల ఉన్నతాధికారులు వారం రోజుల క్రితం సమావేశం అయ్యారు. ఉమ్మడి పరీక్ష నుంచి రాష్ట్రాన్ని మినహించాలని కోరారు. ఆ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి నివేదిక సమర్పించారు. ఈ విషయంలో సీఎం కూడా సానుకూలంగా ఉన్నారు.
అయితే దేశ వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీలలో సీట్ల భర్తీ కోసం జాతీయ స్థాయిలో ఒకే ప్రవేశ పరీక్ష ఉండాలని సుప్రీంకోర్టు అదేశించినట్లు గురువారం కేంద్ర మంత్రి ఆజాద్ తెలిపారు. దాని ప్రకారమే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో పడింది. అయినప్పటికీ మెడిసిన్ పరీక్ష గందరగోళంలో పడింది. జాతీయ స్థాయి ఉమ్మడి ప్రవేశ పరీక్షపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డీ.ఎల్ రవీంద్రారెడ్డి కూడా జాతీయ స్థాయిలో నిర్వహించే ఉమ్మడి మెడిసిన్ టెస్ట్ మంచిదే అని వ్యాఖ్యానించారు. వారం రోజుల్లో దీనికి సంబంధించి ఉత్తర్వులు వెలువడనున్నాయి.
జాతీయ స్థాయిలో సింగిల్ టెస్ట్ నిర్వహించినప్పటికీ అడ్మిషన్లు మాత్రం రాష్ట్ర స్థాయిలో నిర్వహించాల్సి ఉంటుంది. రాష్టప్రతి ఉత్తర్వులలో కూడా ఇదే విషయం పొందుపరిచారు. కాబట్టి అడ్మిషన్ల విషయంలో వచ్చే ప్రమాదం ఏమీ లేదు. రాష్ట్ర విద్యార్ధులకు ఇక వైద్య విద్య మరింత కఠినం కానుంది. డాక్టర్ కావాలనుకున్న వారి కలలు కల్లలుగానే మారనున్నాయి. రాష్ట్ర స్థాయి సిలబస్‌ను వదిలేసి కేంద్ర స్థాయి సిలబస్‌లో ఇక నుంచి చదవాల్సి ఉంటుంది. దానికి రాష్ట్ర ఇంటర్మీడియేట్ విద్యా విధానం సరిపోతుందా? అంటే సరి పోదనే విద్యావేత్తలు చెప్పుకొస్తున్నారు. వచ్చే మార్చి లేది ఏప్రిల్‌లోనే జాతీయ స్థాయి ఉమ్మడి పరీక్ష ఉంటుంది. కాని రాష్ట్ర ప్రజలు ఇప్పటి వరకు ఎంసెట్ అధికారులు నిర్ధేశించిన సిలబస్‌లోనే మెడిసిన్ టెస్ట్‌కు ప్రిపేర్ అవుతున్నారు. వారికి మరో ఆరు నెలల సమయం మాత్రమే ఉన్నది. కాని కేంద్రం ఇంత వరకు ఉమ్మడి పరీక్ష సిలబస్‌ను విడుదల చేయలేదు. ఇంత స్వల్ప కాలంలో విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవుతారో అర్ధం కావడం లేదు. మెడిసిన్ టెస్ట్‌కు కావాల్సిన విద్యార్థులు ఇప్పటికే పూర్తి చేశారు. ప్రస్తుతం విద్యార్థులంతా రివిజన్ చేస్తున్నారు. ఇది తెలుసుకోకుండా కేంద్ర విద్యార్థులపై పిడుగు వేసింది. దీంతో సర్వత్రా ఉలిక్కి పడ్డారు. రాష్ట్ర ఆరోగ్య, ఉన్నత విద్యా శాఖ ఉన్నతాధికారులు ఉమ్మడి పరీక్ష నుంచి రాష్ట్రాన్ని రెండు సంవత్సరాల వరకు మినహాయించాలని కోరారు. ఈ విద్యా సంవత్సరమే కాకుండా రెండు విద్యా సంవత్సరాల తర్వాత ఉమ్మడి పరీక్ష నిర్వహించడం వల్ల తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని విద్యార్థులు, తల్లిదండ్రులు వాపోతున్నారు.
అప్పటి వరకు కొత్త సిలబస్‌లో ప్రిపేర్ కావడానికి ఆష్కారం ఉంటుందంటున్నా రు. ఈ విషయంలో మరోక్క సారి పున:పరిశీలిం చుకోవాల్సిన అవసరం కేంద్రంపై ఉంటుందని రాష్ట్ర ప్రజలు సూచిస్తున్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలో గణితం కూడా చేర్చనున్నారు. బైపిసీ విద్యార్ధులు ఇప్పటికిప్పుడు గణితం నేర్చుకోవాలంటే సాధ్యమయ్యే పనికాదు. మరోవైపు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష కారణంగా గ్రామీణ విద్యార్ధులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులతో ఉమ్మడి జాతీయ ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్లు ఇస్తే మన రాష్ట్ర విద్యార్ధులకు ఎక్కువ సీట్లు లభిస్తాయన్న వాదన కూడా ఓ వైపు వినిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,300 మెడికల్ సీట్లు, 1600 డెంటల్ సీట్లు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం 15 శాతం సీట్లను ఇతర రాష్ట్రాల విద్యార్ధులకు కేటాయిస్తున్నారు. అయితే జాతీయస్థాయి పరీక్ష ఆధారంగా సీట్లు మరింత ఎక్కువ పొందవచ్చని కొందరు విద్యావేత్తలు అంటున్నారు.
బెంబేల్ ఎత్తుతున్న శిక్షణ సంస్థలు: ఇదిలా ఉంటే మెడిసిన్ కాలేజీలలో సీట్ల భర్తీ కోసం జాతీయ స్థాయిలో ఉమ్మడి ఎంట్రైన్స్ నిర్వహిస్తామని మెడికల్ కౌన్సెలింగ్ ఆఫ్ ఇండియా (ఎంసిఎ) ప్రకటించడంతో అన్ని రకాల కోచింగ్ సంస్థల యాజమాన్యాల గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లయింది. ఇప్పటి వరకు లక్షలాది రూపాయల్లో ఫీజులు వసూలు చేసిన ప్రైవేటు కోచింగ్ సంస్థలు మళ్లీ కేంద్ర సిలబస్‌లో సిలబస్‌లో పాఠాలు చెప్పాలంటే కష్టంగా మారనుంది. అందుకు ఫ్యాకల్టీకి అదనంగా జీతాలు చెల్లించాలి. కాబట్టి అవసరమైతే విద్యార్థుల నుంచి మళ్లీ ఫీజులు వసూలు చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో విద్యార్థులు కూడా ఇదే విషయంపై గుబులు పెంచుకుంటున్నారు. మధ్య తరగతి తల్లిదండ్రుల పరిస్థితి ఇక చెప్పనక్కర లేకుండా పోతుంది.

కార్పొరేట్ జూనియర్ కళాశాలల దెబ్బకు ఇంటర్ బోర్డు కార్యదర్శి వాణీప్రసాద్‌పై బదిలీ వేటుపడింది. కార్పొరేట్ జూనియర్ కళాశాలల అక్రమాలపై నడుంబిగించిన వాణీని బదిలీ చేయాలని యాజమాన్య సంఘాలు ప్రభుత్వంపై గత కొంత కాలంగా ఒత్తిడి తెస్తున్నారు. బోర్డు కార్యదర్శిగా పదవీబాధ్యతలు చేపట్టిన రెండు మాసాల్లోనే వాణీప్రసాద్ బదిలీ కావడంపై బోర్డు అధికారులు, ఉద్యోగుల్లో గుబులు పుడుతోంది. కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజునుంచే కార్పొరేట్ కళాశాలల పనితీరుపై వాణీప్రసాద్ దృష్టి పెట్టడంతోపాటు ఇష్టం వచ్చినట్లు యాజమాన్యాలు జరుపుతున్న కళాశాలలకు నోటీసులు జారీ చేసింది. ఇంటర్ ఫస్టియర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేశాక కార్యదర్శి స్టడీ టూర్ పేరుతో నెలక్రితం అమెరికా వెళ్లింది.ప్రస్తుతం ఇంటర్ విద్యా కమీషనర్ జెఎస్‌వి ప్రసాద్ ఇంటర్ బోర్డుకు ఇన్‌చార్జ్‌గా కొనసాగుతున్నాతు. కొత్త జూనియర్ కళాశాలల అనుమతి విషయంలో జరిగిన తనిఖీలు నిబంధనలకు విరద్ధుగా ఉన్నాయని, అనుమతులు పొందిన కళాశాలలకు జారీ చేసిన ఉత్తర్వులును నిలుపుదల చేయాలని వాణీప్రసాద్ సంబంధిత ఆర్‌ఐఓలను ఆదేశించింది. ఈ ఏడాది అనుమతులు పొందిన జూనియర్ కళాశాలల్లో అత్యధికంగా కార్పొరేట్ జూనియర్ కళాశాలలు ఉండడంతో వారు ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఇంటర్ బోర్డు కార్యదర్శిని బదిలీ చేయించారని ఆరోపణలు వినవస్తున్నాయి. అమెరికా పర్యటన నుంచి తిరిగి రాకమునుపే వాణీప్రసాద్‌పై బదిలీ వేటు వేయడంపై ఐఎఎస్ అధికారుల్లో చర్చ ప్రారంభమైంది. ఇంటర్ బోర్జు కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచే వాణీప్రసాద్ పై అధికారులను పక్కనబెట్టి అత్యంత వేగం తో బోర్డు పనులకు స్వీకారం చుట్టారని, కొన్ని సమయాల్లో సీనియర్ ఐఎఎస్ అధికారులు వేగం తగ్గించుకోమని చెప్పినా వినలేదని, దీంతోనే ఆమెను బదిలీ చేశారని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఈ ఏడాది పబ్లిక్ పరీక్షలు ప్రాక్టికల్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానం ప్రవేశపెడతామని ఇందుకు ప్రైవేటు కళాశాల్లో ప్రయోగశాలలను పటిష్టపరుస్తామని ప్రకటించారు. అవసరమైతే కళాశాలలు చెల్లించిన కార్పస్ ఫండ్‌లో కొంత మొత్తాన్ని తీసుకుని ప్రయోగశాలలు ఏర్పాటుకు కృషి చేస్తామని ఆమె ప్రకటించారు. కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు కొరకరాని కొయ్యగా తయారైన వాణీప్రసాద్‌ను తప్పించేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం వేదికగా రెండు కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు చక్రం తిప్పాయని విధిలేక ప్రభుత్వం ఆమెపై బదిలీ వేటు వేసిందని తెలుస్తోంది. అత్యంతి కీలకమైన ఇంటర్ బోర్డు కార్యదర్శి పదవిలో నియమితులవుతున్న వారు స్వతహాగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపించడంలేదు. యాజమాన్యాల ఒత్తిళ్లకు తలొగ్గితేనే బోర్డులో కొంతకాలం మనుగడ సాగించవచ్చునని, లేకపోతే బదిలీ తప్పదని చర్చించుకుంటున్నారు.

విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఎఐఎస్‌ఎఫ్, పిడి ఎస్‌యు, ఎఐడిఎస్‌ఓ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం రాష్టవ్య్రాప్తంగా జరిగే బంద్‌ను జయ ప్రదం చేయాలని ఎఫ్‌ఎఫ్‌ఐ రంగా రెడ్డి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి. అశోక్, డి. కిషన్‌లు పిలుపునిచ్చారు. హైస్కూళ్లు, హాస్టళ్లు, ప్రైవేటు స్కూళ్లు ఫీజులు, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీలలో సమస్యలు పరిష్కరించా లని ఈ బంద్‌కు పిలుపునిచ్చినట్లు చెప్పారు.పేదల ప్రభుత్వం అని చెప్పు కుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్ధులు ఉండే హాస్టళ్లను 100కు పైగా సంఖ్యలేని వాటిని మూసివేయడానికి పూను కోవడం దురదృష్టకరమని వారు పేర్కొన్నారు.

ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సుల ప్రవేశానికి మెడికల్ కౌన్సెలింగ్ మంగళవారం ప్రారంభమైంది. తొలి రోజు ఒకటి నుండి 900వ ర్యాంకు వరకూ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఉదయం పది గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభం కాగా తొలిగంటలోనే 50 సీట్లను భర్తీ చేశారు. తొలుత ఎంసెట్-2011 మొదటి ర్యాంకర్ మందరపు హిమజ ఉస్మానియా యూనివర్శిటీలో మెడికల్ సీటు ఎంచుకున్నారు. డాక్టర్ ఎన్‌టిఆర్ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ ఐ.వి.రావు ఆమెకు అధికారిక పత్రాన్ని అందజేశారు. రెండోర్యాంకర్ ఎన్.ఉమామహేశ్వరి, మూడో ర్యాంకర్ లక్ష్మీప్రవల్లిక కూడా ఉస్మానియా మెడికల్ కళాశాలలోనే సీటు ఎంచుకున్నారు. గతంలో కౌన్సెలింగ్ సందర్భంలో విద్యార్థులు అవస్థలు ఎదుర్కోవడంతో ఈసారి ముందుగా దరఖాస్తులన్నీ పరిశీలించిన తరువాతే కౌన్సెలింగ్ కేంద్రంలోకి అనుమతించారు. దీంతో వేగంగా కౌన్సెలింగ్ పూర్తవుతోంది. ఈనెల 19 నుండి 21వ తేదీ వరకూ ఓపెన్ కేటగిరీలో కౌన్సెలింగ్ జరుగుతుందని వర్శిటీ రిజిస్ట్రార్ డాక్టర్ వేణుగోపాలరావు తెలిపారు. 22వ తేదీ నుండి బిసి, ఎస్‌టి, ఎస్‌టి అభ్యర్థులకు కౌన్సిలింగ్ జరుగుతుందని వివరించారు. మెరిట్ ఆర్డర్ ప్రకారం అభ్యర్థులు ఓపెన్ కేటగిరిలో సీటు తీసుకున్నా 22వ తేదీ తరువాత వచ్చి రిజర్వేషన్ కేటగిరిలో వారికి నచ్చిన సీటు ఎంచుకోవచ్చని రిజిస్ట్రార్ తెలిపారు. విజయవాడతోపాటు హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతిలోనూ తొలిరోజు కౌన్సెలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని రిజిస్ట్రార్ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే రిక్రూట్‌మెంట్‌లలో గ్రూప్ 1 సర్వీసు మినహా మిగిలిన అన్ని పరీక్షలకు ఇంటర్వ్యూలు నిర్వహించరాదని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జె సత్యనా రాయణ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ మిషన్ నిర్వహించే రిక్రూట్‌మెం ట్‌లో ఆలస్యంతో పాటు అవకతవకలు జరుగుతున్నాయని గతంలో వచ్చిన ఆరోపణలపై అప్పటి ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జె సత్యనారాయణను ప్రభుత్వం విచారణ అధికారిగా నియమించిన సంగతి తెలసిందే. ఎపీపీఎస్సీ రిక్రూట్‌మెంట్ పద్దతిలో పాదర్శకతతో పాటు ప్రస్తుతం ఉన్న పద్దతుల్లో పలు మార్పులను ఆయన సిఫార్స్‌లలో సూచించారు.
గ్రూప్ 1లో ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపిక జరుతు న్నందన అభ్యర్థి వ్యక్తిత్వం, ఆలోచనా పద్దతి, నాయకత్వ లక్షణాలు, నిర్ణయాధికారం,వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉన్నందున ఇంటర్వ్యూలు నిర్వహించాల్సిన అవసరం ఉందని సత్యనారాయణ తన సిఫార్స్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న రిక్రూట్‌మెంట్ పద్దతిలో గ్రూప్ 4 సర్వీసు మినహా అన్ని పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. దీని వలన సమయం, వనరులు వృధా అవుతున్నాయి.
దీనిని దృష్టిలో ఉంచుకుని సత్యనారా యణ తన సిఫార్స్‌లో స్టేట్ సర్వీసులకు తప్ప మిగతా అన్ని సర్వీసులకు ఇంటర్వ్యూ పద్దతి లేకుండా వ్రాత పరీక్ష ఆధారంగా జనరల్ మెరిట్ లిస్టును రూపొందించాలని సూచించారు. దీని వలన ఎపీపీఎస్సీ రిక్రూట్‌మెంట్ పద్దతిలో పారదర్శకతతో పాటు సమర్ధతను పెంచుతుంది. సత్యనారాయణ చేసిన ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ఒక వేళ ప్రభుత్వం ఆమోదిస్తే భవిష్యత్తులో జరిగే గ్రూప్ 2 రిక్రూట్‌మెంట్‌లు ఈ కొత్త పద్దతిలో జరుగుతాయి.