Ankusam - 24 Hours e-News

ఐఐటి ఫలితాల్లో తెలుగు వెలుగులు – రాష్ట్రానికి ర్యాంకుల పంట
ఐఐటి(జెఇఇ) ఎంట్రెన్స్‌ ఫలితాల్లో రాష్ట్ర విద్యార్థులు విజయదుందుభి మోగించారు. 1959లో ఐఐటిని ఏర్పాటుచేసిన తరువాత జాతీయస్థాయిలో ఓపెన్‌ కేటగిరీలో మొదటిర్యాంకు రాష్ట్రానికి రావడం ఇదే మొదటిసారి. దేశవ్యాప్తంగా టాప్‌ టెన్‌లో ఏడు ర్యాంకులు సాధించిన ఘనత రాష్ట్ర విద్యార్థులకే దక్కింది. ఓపెన్‌ కేటగిరీలో ఒకటి, రెండు, నాలుగు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది ర్యాంకులను రాష్ట్ర విద్యార్థులు సాధించారు. నారాయణ, రామయ్య, శ్రీ చైతన్య, తదితర ఐఐటి సెంటర్ల నుంచి విద్యార్థులు ఈ ర్యాంకులు పొందారు. మూడు, ఐదు, పది ర్యాంకులు మాత్రమే పాట్నా, భోపాల్‌ విద్యార్థులు సాధించారు. ఐఐటి (జెఇఇ) ఎంట్రెన్స్‌ పరీక్ష ఏప్రిల్‌ 11న జరిగింది. దేశవ్యాప్తంగా 4.23 లక్షల మంది పరీక్షకు హాజరుకాగా అందులో చెన్నై రీజియన్‌ ( తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌, కేరళ) నుంచి 65,500 మంది ఉన్నారు. వాస్తవంగా రాష్ట్ర విద్యార్థులు 30 నుంచి 35 వేల వరకూ ఉంటారని కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులు చెబుతున్నారు. పదిహేను ఐఐటిల్లో పది వేల ర్యాంకులున్నాయి. బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో సాయంత్రం వరకూ అందిన సమాచారం మేరకు చెన్నై రీజియన్‌ వరకూ 2,600 ర్యాంకులు వచ్చినట్లు తెలుస్తోంది. ఓపెన్‌ కేటగిరీలో నారాయణకు ఒకటి, రెండు, నాలుగు, ఎనిమిది, తొమ్మిది ర్యాంకులు రాగా, రామయ్యకు ఆరు, శ్రీచైతన్య సెంటర్‌కు ఏడో ర్యాంకు వచ్చింది. పిహెచ్‌సి కేటగిరీలో రామయ్యకు మొదటి ర్యాంకు రాగా, ఓబిసిలో ఐదు, తొమ్మిది ర్యాంకులు వచ్చాయి. ఓబిసిలో శ్రీచైతన్యకు రెండో ర్యాంకు వచ్చింది.

ర్యాంకర్లకు సిఎం అభినందనలు

ఐఐటి(జెఇఇ) ఎంట్రెన్స్‌ ఫలితాల్లో ర్యాంకులు పొందిన విద్యార్థులను ముఖ్యమంత్రి రోశయ్య అభినందించారు. బుధవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో తన వద్దకు వచ్చిన మొదటి, రెండు, నాలుగు, ఆరు, ఎనిమిది, తొమ్మిదవ ర్యాంకర్లను అభినందించడంతో పాటు వారికోసం ప్రయత్నించిన కోచింగ్‌ సెంటర్లను కూడా ప్రత్యేకంగా కొనియాడారు. వెనుకబడిన వర్గాలకు చెందిన 26 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించడం పట్ల రోశయ్య సంతోషం వ్యక్తం చేవారు. ఎస్సీ కేటగిరి నుంచి ఏడుగురు, ఎస్టీ నుంచి 15, పిహెచ్‌ నుండి ఇద్దరు, ఓబిసి నుండి ఇద్దరు ఉన్నారు.

జాతీయస్థాయిలో రాష్ట్ర కీర్తి : నారాయణ

ఐఐటి(జెఇఇ) చరిత్రలో ఐఐటిలు ప్రారంభం అయిన నాటి నుంచి ఒక్కసారి కూడా రాష్ట్రం నుంచి ఓపెన్‌ కేటగిరిలో ఆల్‌ ఇండియాలో 1వ ర్యాంకు రాలేదు. ఈ సంవత్సరం అది సాధించి రాష్ట్ర కీర్తిని జాతీయస్థాయిలో ఇనుమడింపజేశాము. దేశంలో ఏ విద్యాసంస్థ ఓపెన్‌ కేటగిరిలో పదిలోపు ఐదు ర్యాంకులు సాధించలేదు. ఈ ఏడాది నారాయణ అది సాధించి ఐఐటిలో కొత్త చరిత్ర సృష్టించి ఆ ఘనత చేజిక్కించుకున్నాము. ఇందులో నాలుగేళ్ళ కృషి ఉంది. విద్యార్థులను హైస్కూల్‌ దశలోనే ఐఐటి వంటి పోటీ పరీక్షలకు అనుగుణంగా నూతన పద్ధతిలో బోధనాప్రక్రియను అమలుచేశాము.

ఐఐటిలో ఎపి ప్రాతినిధ్యం పెరిగింది : శ్రీచైతన్య

ఐఐటిలో రాష్ట్రం నుండి విద్యార్థుల ప్రాతినిధ్యం పెరగటానికి శ్రీచైతన్యనే కారణం. ఆలిండియాలో 2,6,7,8 లాంటి ర్యాంకులతో ప్రభంజనం సృష్టించిన శ్రీచైతన్య గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు సైతం ఐఐటి మీద అవగాహన కల్పించింది. ప్రారంభంలో రాష్ట్రం నుండి ఐఐటిలకు ప్రాతినిధ్యం తక్కువగా ఉండేది. క్రమేణా ఐఐటికి వెళ్ళేవారి సంఖ్య పెరగడంతో రాష్ట్రమే ముఖ్యకేంద్రంగా మారింది. ఐఐటి వైపు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను తిప్పగలిగింది మేమే. ఐఐటి గురించి అందరికీ తెలిసేలా చేసిన ఘనత మాకే దక్కుతుంది.

గ్రామీణ విద్యార్థుల హవా : చుక్కరామయ్య

ఐఐటి మెయిన్స్‌లో రాష్ట్రానికి చెందిన గ్రామీణ విద్యార్థులు అధిక సంఖ్యలో ఎంపిక కావటం నూతన శఖానికి నాంది ర్యాంకర్లకు నా శుభా కాంక్షలు. విద్యార్థుల దీక్ష, పట్టుదలలే ఈ ఫలితాలకు తార్కాణం. గురుకుల సంక్షేమహాస్టల్స్‌ నుంచి ఆరుగురు విద్యార్థులు ఎంపిక అవడం సంతో షకరమైన విషయం. రామయ్య కోచింగ్‌ సెంటర్‌ నుంచి 142 మందిలో 120 మంది మంచి ర్యాంకులతో ఎంపికకావటం, అది కూడా ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన అమ్మాయిలు, ఓబిసిలు కావడం మంచి పరిణామం. ఉన్నత విద్యారంగంలో ప్రతిభను చాటుకోవడం ఒక భాగమైతే అణగారిన కిందివర్గాల నుంచి ఎంపిక కావటం మరో విశేషం.

నేటి నుంచి ఇంటర్‌ ప్రాక్టికల్స్‌
నేటి నుంచి ప్రారంభం కానున్న ప్రాక్టికల్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇంటర్మీడియెట్‌ విద్యా మండలి కార్యదర్శి బలరామయ్య తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ ఈ పరీక్షల నిర్వహణ కోసం 11,149 ఎగ్జామినర్స్‌ను నియమించామన్నారు. ప్రాక్టికల్‌ పరీక్షల నిర్వహణ కోసం 2526 కేంద్రాలను ఏర్పాటు చేశామని, వారిలో 4,72,677 సైన్స్‌ అభ్యర్థులు ఉన్నారని తెలిపారు. ఓకేషనల్‌ అభ్యర్థులు 1,29,433 మంది కూడా ప్రాక్టికల్‌ పరీక్షలకు హజరుకానున్నట్లు చెప్పారు. పరీక్షల నిర్వహణ కోసం జిల్లా పరీక్షల కమిటీల ను ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్షల పరిశీలన నిమి త్తం ఉన్నత స్థాయి కమిటీలను వేశామన్నారు. ప్రతి 20 కేంద్రాలకు స్కాడ్స్‌, ఇంటర్‌ బోర్డు, జిల్లాల నుంచి కూడా ప్రత్యేక పరిశీలకులను నియ మించా మన్నారు. అవసర మైన చోట, పెద్ద కేంద్రాలలో సిట్టింగ్‌ స్కాడ్‌లను ప్రత్యేకం గా ఏర్పాటు చేయడం జరిగిం దన్నా రు. ప్రతి మూడు రోజులకు ఒక సారి ఎగ్జామినర్స్‌ను మారుస్తామన్నారు.

జంబ్లింగ్‌ తప్పని సరి…

ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం వల్ల ఈ ఒక్క ఏడాదికి వదిలేసినప్పటికీ 2011 నుంచి మాత్రం ప్రాక్టికల్‌ పరీక్షలో జంబ్లింగ్‌ విధానాన్ని కచ్చితంగా అమలు చేస్తామని బోర్డు కార్యదర్శి స్పష్టం చేశారు. ప్రాక్టికల్స్‌లో వందకు వంద మార్కులు వచ్చిన వారి కేంద్రాలు, వారి మార్కులను పరిశీ లిస్తామని అన్ని సవ్యంగా ఉంటే వారికి మార్కులు వేస్తామ న్నారు. ఈ సారి ప్రాక్టికల్‌ పరీక్షలల్లో కప్పలకు బదులు గా, వాన పాములు, బొద్ధింకలు ఉపయోగిస్తామన్నారు.

పరీక్షల వేళల్లో మార్పులపై పరిశీలన…

మార్చి 10 నుంచి 30 వరకు ఇంటర్‌ థియరీ పరీక్షలు జరగనున్నాయి. అయితే అలాగే మార్చి 22 నుంచి టెన్త్‌ పరీక్షలు ఉండడంతో కొన్ని కేంద్రాలలో పరీక్షల నిర్వహణ కష్ట తరంగా మారింది. అంటే ఈ రెండు పరీక్షలు కూడా ఒకే కేంద్రంలో అర గంట తేడాతో పరీక్షలు ఉండడంతో పరీక్ష వేళల్లో మార్పులు చేసే విషయాన్ని పరిశీలిస్తామ న్నారు. బోర్డు కార్యదర్శి. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 15 కేంద్రాలలో విశాఖపట్నం, అనంతపురం, అదిలా బాద్‌, మెదక్‌ జిల్లాల్లోని కొన్ని మండలాల్లో మాత్రమే టెన్త్‌ కు, ఇంటర్మీడియెట్‌కు ఉమ్మడి పరీక్ష కేంద్రాలు ఉన్నాయి, వాటిని త్వరలో పరిష్కరిస్తామన్నారు.

ఆర్‌పిఎఫ్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ప్రిపరేషన్‌
ఆర్‌పిఎఫ్‌ కానిస్టేబుల్‌ ఎదైనా ఎగ్జామ్‌ పేపరు ఇంగ్లీషు లాంగ్వేజ్‌ విభాగంలో 20 మార్కులకు 20 ప్రశ్నలుంటాయి. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ ఛాయిస్‌ టైప్‌లో ఉంటాయి. ఇంగ్లీషు విభాగంలో సాధారణంగా ఈ క్రింది అంశాలపై ప్రశ్నలుంటాయి.

1. Comprehension Test 2. Cloze Test 3.Synonyms Test4. Antonyms Test 5. Idioms and Phrases Test

6. Fill in the blanks Test7. Spelling Test8. Correction of Sentences Test, etc.,

ఆర్‌పిఎఫ్‌ కానిస్టేబుల్‌ పరీక్షలో ఇంగ్లీషు విభాగానికి శ్రద్ధగా ప్రిపేర్‌ కావలసి ఉంటుంది. ఇంగ్లీషు పదజాలంలో మంచి పట్టు సంపాదించటానికి ప్రతిరోజు ఇంగ్లీషు వార్తా పత్రికను చదవటం ఎంతో ప్రయోజకరంగా ఉంటుంది. రోజూ ఇంగ్లీషు వార్తా పత్రికను చదవటం సాధ్యపడని వారు ఉద్యోగ పత్రికలను చదవవచ్చు.

జనరల్‌ అవేర్‌నెస్‌: జనరల్‌ అవేర్‌్‌నెస్‌ విభాగానికి సిలబస్‌ అంటూ ప్రత్యేకంగా ఏమీలేదు. కావున జనరల్‌ అవేర్‌్‌నెస్‌కి సంబంధించిన పరిధి విస్తృతంగా ఉంటుంది. జనరల్‌ అవేర్‌్‌నెస్‌ ప్రిపరేషన్‌లో భాగంగా ప్రపంచానికి సంబంధించిన అంశాలు, భారతదేశానికి సంబంధించిన అంశాలు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అంశాలు, జనరల్‌ సైన్స్‌, క్రీడలు, అవార్డులు, గ్రంథాలు – రచయితలు, సర్వప్రధములు, కరెంట్‌ అఫైర్స్‌ను విడివిడిగా చదవాలి.

ప్రపంచానికి సంబంధించిన అంశాలలో దేశాలు – రాజధానులు, దేశాలు – కరెన్సీ, దేశాలు-పార్లమెంటు పేర్లు, దేశాలు-మారుపేర్లు, దేశాలు – పాతపేర్లు – కొత్త పేర్లు, వ్యక్తులు – మారుపేర్లు, అంతర్జాతీయ సంస్థలు, ఐక్యరాజ్యసమితి – అనుబంధ సంస్థలు. ప్రపంచ భూగోళం, ప్రపంచ చరిత్ర ముఖ్యమైనవి.

భారతదేశానికి సంబంధించిన అంశాలలో జాతీయ చిహ్నాలు, భారత భౌగోళిక పరిస్థితులు, భారతదేశ చరిత్ర – సంస్కృతి, భారత రాజ్యాంగం- రాజకీయ వ్యవస్థ, భారత ఆర్థిక వ్యవస్థ – పంచవర్ష ప్రణాళికలు ముఖ్యమైనవి. వీటితో పాటుగా భారతదేశానికి సంబంధించి రాష్ట్రాలు- రాజధానులు, నదులు – ప్రాజెక్టులు, పరిశోధనా సంస్థలు, జాతీయ ఉద్యానవనాలు – పార్కులు, రాష్ట్రాలు – కళారూపాలు. భారత రక్షణ వ్యవస్థ – క్షిపణులు, దర్శనీయ స్థలాలు, వివిధ కమిటీలు – కమిషన్లు, ఖనిజాలు లభించు ప్రాంతాలు, ఎడారులు, భౌగోళిక మారుపేర్లు, వివిధ రాష్ట్రాల్లో గల తెగలు, జాతులు, జనాభా లెక్కలు, భారతీయ రైల్వేలు, జాతీయ రహదారులు, నదీతీర నగరాలు, రాష్ట్రపతులు, ఉపరాష్ట్ర పతులు, ప్రధాన మంత్రులు, లోక్‌సభ స్పీకర్లు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు.

త్రివిధ దళాధిపతులు వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలి. ఆంధ్ర ప్రదేశ్‌కు సంబంధించిన అంశాలలో ఆంధ్రప్రదేశ్‌ – జిల్లాలు – వైశాల్యం – జనాభా – అక్షరాస్యత, ఆంధ్రప్రదేశ్‌ – నదులు, ప్రాజెక్టులు, ఖనిజసంపద, రవాణా సౌకర్యాలు, రహదారులు పరిశోధనా సంస్థలు, ప్రభుత్వ కార్యక్రమాలు – పథకాలు వంటి అంశాలను క్షుణ్ణంగా చదవాలి.

జనరల్‌ సైన్స్‌లో శాస్త్రలు – అధ్యయన అంశాలు, శాస్త్ర పరికరాలు, శాస్త్ర ప్రమాణాలు, ఆవిష్కరణలు, విటమిన్లు, శరీర ధర్మశాస్త్రం, అంతరిక్ష పరిశోధనలు, కంప్యూటర్‌ విజ్ఞానం, పర్యావరణ సంబంధ అంశాలు, క్రీడలకు సంబంధించి క్రీడాపదాలు, క్రీడలు – కొలతలు, క్రీడలు – ఆడేవారి సంఖ్య, క్రీడా మైదానాలు, క్రీడలు – కప్‌లు – ట్రోఫీలు, ఒలింపిక్‌ క్రీడలు, ఆసియా క్రీడలు, కామన్వెల్త్‌ క్రీడలు, టెన్నిస్‌ టోర్నమెంట్స్‌. ఫుట్‌బాల్‌ టోర్నమెంట్స్‌, క్రికెట్‌ విశేషాలను బాగా గుర్తుంచుకోవాలి.

అవార్డులకు సంబంధించి నోబెల్‌ ప్రైజ్‌ గ్రహీతలు, భారత రత్న, జ్ఞాన్‌పీఠ్‌, దాదాసాహెబ్‌ ఫాల్కే, గాంధీ శాంతి బహుమతి గ్రహీతలు, వాటిని ఇచ్చే సంస్థల గురించి కూడా తెలుసుకొని ఉండాలి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన గ్రంథాలు వాటి రచయితలను గురించి తెలుసుకోవాలి.

ఇటీవల విడుదలై సంచలనం సృష్టించిన గ్రంథాలు, ప్రసిద్ధ తెలుగు గ్రంథాలు, వాటి రచయితల గురించి కూడా చదవడం మంచిది. రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో వివిధ రంగాలలో కృషిచేసిన ప్రముఖుల గురించి కూడా తెలుసుకొని ఉండాలి. వాటితోపాటు జాతీయ, అంతర్జాతీయ దినోత్సవాలు, వివిధ వారోత్సవాలు, ప్రత్యేక సంవత్సరాలు, యు.ఎన్‌.ఓ. సంవత్సరాలు దశాబ్దాలు, సార్క్‌ సంవత్సరాలు దశాబ్దాలు వంటి అంశాలను కూడా చదవాలి.

కరెంట్‌ అఫైర్స్‌లో ప్రధానంగా లేటెస్ట్‌ క్రీడలు, (ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌ మొదలగునవి) అవార్డులు, సభలు – సమావేశాలు, నియామకాలు, వార్తల్లో వ్యక్తులు, వార్తల్లో ప్రదేశాలు, ప్రముఖులు, మరణాలు, ప్రముఖుల పర్యటనలు, నూతన ఆవిష్కరణలు తదితర అంశాలను చదవాలి. జనరల్‌ నాలెడ్జిని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవాలంటే కరెంట్‌ అఫైర్స్‌ను పాలో అవ్వాలి.

జనరల్‌ అవేర్‌్‌నెస్‌ అనేది విద్యాభ్యాసంలో అంతర్భాగంగా ఉంటుంది. ప్రతి విద్యార్థి పదవ తరగతిలోపు భూగోళ శాస్త్రం, చరిత్ర, పౌరశాస్త్రం, విజ్ఞాన శాస్త్రం వంటి విభిన్న అంశాలు చదివేది ఇందుకే. జనరల్‌ నాలెడ్జి విభిన్న అంశాలన్నింటిలో ఏ ఒక్క వ్యక్తీ నిపుణుడు కాలేడు. అలా అని వీటిపై పరిజ్ఞానం సాధించడం అసాధ్యమేమీకాదు. దానికి శ్రద్ధాసక్తులతో ప్రణాళిక, సుదీర్ఘ ప్రిపరేషన్‌ తప్పనిసరి. నిర్ధిష్ట ప్రణాళికను క్రమపద్ధతి ప్రకారం అమలు చేస్తే జనరల్‌ అవేర్‌్‌నెస్‌పై పట్టు సాధించి మంచి మార్కులు సాధించవచ్చు.త

ఇంటర్వ్యూ : రాతపరీక్ష అనంతరం ఇంటర్వ్యూ ఉంటుంది. రాతపరీక్షలో మెరిట్‌ సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు.

ప్రిపరేషన్‌ విధానం : ఆర్‌పిఎఫ్‌ పరీక్షల్లో విజయసాధనకు వేగం, కచ్చితత్వం ఎంతో ఆవశ్యకం. గుడ్డిగా గుర్తించే సమాధానాల్లో ఎక్కువ భాగం తప్పులు పోయే ప్రమాదముంది. నెగిటివ్‌ మార్కులు ఉండటం వల్ల వచ్చిన మార్కులు కూడా తగ్గే అవకాశముంది. గత ప్రశ్నా పత్రాలను ఎన్ని ఎక్కువగా ప్రాక్టీస్‌ చేస్తే అంత ఎక్కువ స్పీడ్‌ వస్తుందని గుర్తుంచుకోండి.

ఆర్‌పిఎఫ్‌ పరీక్షలలో సమయపాలన ఎంతో ముఖ్యం. నిర్ణీత సమయంలో వీలైనన్ని ఎక్కువ లెక్కలు చేయగల్గాలి. ఇది మంచి ప్రాక్టీస్‌ ఉన్నప్పుడే సాధ్యపడుతుంది. ఈ ప్రాక్టీస్‌ కోసం మీరు వీలైనన్ని ఎక్కువ గత ప్రశ్న పత్రాలను చేయాలి. మేథమెటిక్స్‌లో మంచి ఫౌండేషన్‌ సంపాదించిన తరువాత గత ప్రశ్న పత్రాలు ప్రాక్టీస్‌ చేయటం వల్లనే పూర్తి ప్రయోజనం పొందగల్గుతారు.

పోటీపరీక్షలకు గత ప్రశ్నాపత్రాలను పరీక్ష వాతావరణంలో ప్రాక్టీస్‌ చేయటం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

పరీక్ష వాతావరణంలో ప్రాక్టీస్‌ చేయడమంటే ఇచ్చిన సమాధానాలను చూడకుండా పరీక్షకు నిర్ణయించిన టైంలో సమాధానాలు గుర్తించి ఆ తరువాత మాత్రమే పుస్తకంలో ఇచ్చిన సమాధానాలను చూచి వచ్చిన మార్కులతో మన ప్రగతిని నిర్ణయించుకోవటం. ఇందువల్ల మనకు వచ్చినవి ఏమిటో రానివి ఏమిటో స్పష్టంగా తెలుస్తుంది.రానివాటిని ఇంకోసారి రివిజన్‌ చేసుకోవచ్చు. బ్యాంక్‌ గత ప్రశ్నపత్రాలను కూడ ఈ విధంగా పరీక్ష వాతావరణంలో ప్రాక్టీస్‌ చేయండి. ఇందుకోసం ప్రతియోగి తాకిరణ్‌, కాంపిటీషన్‌ సక్సెస్‌ వంటి పత్రికలు ఎంతో ఉపకరిస్తాయి. గత ప్రశ్న పత్రాలను ఎన్ని ఎక్కువ ప్రాక్టీస్‌ చేస్తే అంత స్పీడ్‌ వస్తుంది. ఇంగ్లీషు అయితే స్పీడ్‌తో పాటు భాష కూడ వస్తుంది.

ఇంగ్లీషు విభాగంలో ప్రాక్టీస్‌ చేసేటప్పుడు కేవలం కరెక్ట్‌ సమాధానాన్ని తెలుసుకోవటంతోనే సరిపుచ్చకుండా తెలియని మాటలకు ఇడియమ్స్‌కు అర్థాలను తెలుసుకొని గుర్తుంచుకోవాలి. కాంప్రెహెన్షన్‌ పాసేజెస్‌లో తెలియని మాటలకు అర్థాలను డిక్షనరీ సహాయంతో తెలుసుకొని గుర్తుంచుకోవాలి. వేరే నోట్‌బుక్‌పై నోట్‌ చేసుకోవాలి. దీనిని అప్పుడప్పుడు రివిజన్‌ చేస్తుండాలి. ఈ విధంగా చేయటం వల్ల ఇంగ్లీషు భాషా పరిజ్ఞానం కూడా పెంపొందుతుంది. స్పీడ్‌ వస్తుంది.

ఆర్‌పిఎఫ్‌ పరీక్షల అభ్యర్థులు ఎదుర్కొనే సమస్య సమయం సరిపోకపోవటం. తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సిరావటం వల్ల బాగా ఒత్తిడి పెరుగుతుంది. దీన్ని ఎదుర్కోవడానికి గతంలో జరిగిన పరీక్షల పేపర్లు ఎక్కువగా సాధన చేయాలి. ఒకసారి చేసిన పేపర్‌ను కూడా మరోసారి సాధన చేయటం ద్వారా మంచి ప్రావీణ్యం సంపాదించవచ్చు.

సెల్‌ఫోన్‌తో చదువులు బేజారు
‘సెల్ ఫోన్ దగ్గర ఉంచుకునే విద్యార్థి పాఠాలపై అంతగా ఆసక్తి చూపడు. చదువుపై కన్నా అందరితో కలివిడిగా ఉండడంపైనే ఎక్కువ ఆసక్తి ప్రదర్శిస్తుంటాడు.  ‘క్లాసురూములో ఇతర అంశాలపై, ముఖ్యంగా సెల్ ఫోన్లపై దృష్టి కేంద్రీకరించడమే విద్యార్థులు తప్పడానికి ప్రధాన కారణంగా భావించాలి. అత్యవసర పరిస్థితులలో తమ పిల్లలతో మాట్లాడడానికి వీలు కల్పించే సాధనంగా సెల్ ఫోన్ ను తల్లిదండ్రులు భావిస్తుంటారు. చాలా కేసులలో ఆసుపత్రిని లేదా పోలీసులను సంప్రదించడం మరింత ఆవశ్యకం కావచ్చు. అయితే, తల్లిదండ్రులు తమ పిల్లలతో మాట్లాడడానికి సదా స్కూల్ మెయిన్ ఆఫీసు ద్వారా ప్రయత్నించవచ్చు. కాగా, సెల్ ఫోన్లు టీనేజర్లకు హోదా చిహ్నాలుగా మారిపోయాయి. ఎందుకంటే వారి ఫోన్ మోగుతున్నప్పుడు టీచర్ పాఠం చెబుతుండగా ప్రతి ఒక్కరూ నవ్వుతుంటారు కదా! తమ సెల్ ఫోన్ లో వీడియో గేములు ఆడుతుంటే తమ మనస్సు ప్రశాంతంగా ఉంటుందని వారు భావిస్తుంటారు’ అని శుభమిత పేర్కొన్నారు.  పిల్లలు సెల్ ఫోన్లను ఉపయోగించడం వల్ల ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉండడమే కాకుండా శాంతి భద్రతలకు విఘాతం కూడా కావచ్చు కనుక అన్ని రాష్ట్రాలలో విద్యా సంస్థలలో సెల్ ఫోన్ల వాడకాన్ని నిషేధించాలి.