గుంటూరు

రాష్ట్రంలో భానుడు ఉగ్రరూపం దాల్చాడు. రాష్ట్రం నిప్పుల కొలిమిగా మారింది. ప్రచండబానుడిదాటికి ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడదెబ్బతో 10మంది మృతిచెందారు. ఉదయం ఏడు గంటలనుంచే వేసవి ప్రతాపం చూపుతోంది. ఇళ్లలో విద్యుత్ వాడకం కూడా భారీగా పెరుగుతోంది. పలు జిల్లాల్లో విద్యుత్ కోతలు కూడా మళ్లీ మొదలయ్యాయి. బుధవారం హైదరాబాద్‌లోనూ అనధికారికంగా 3 గంటల విద్యుత్ కోత విధించారు. రాష్టవ్య్రాప్తంగా బుధవారం ఉష్ణోగ్రతలు తీవ్రరూపం దాల్చాయి. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు. ఈ సమయంలో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటాయి.
తెలంగాణతోపాటు రాయలసీమ జిల్లాల్లోనూ 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో సాధారణం కంటే 3 డిగ్రీలు, కోస్తోంధ్ర, రాయలసీమలో 1 నుంచి 3 డిగ్రీలు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదువుతన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం రెంటచింతలలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వ్యవసా య రంగానికి ప్రాణధారమైన నైరుతి రుతుపవనాలు జూన్ 1 కల్లా కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ విభాగం ప్రకటించిన విషయం తెలిసిందే. రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకేవరకు ఇదే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంటుందని అధికారులు చెబుతున్నారు. ఈసారి సాధారణ తేదీ కన్నా కొంత ఆలస్యంగా దక్షిణ అండమాన్ సముద్రంలో రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు.

చట్టం, రాజ్యాంగాలను గౌరవించాల్సిన ఆవశ్యకత మనందరిపై ఉందని, జగన్ అక్రమంగా సంపాదించిన లక్షల కోట్లను రెవెన్యూ రికవరి యాక్ట్ కింద రికవర్ చేసి ఆ డబ్బును పేదల సంక్షేమానికి వినియోగించాలని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. బుధవారం రాత్రి ఆయన గుంటూరు జిల్లా కారంపూడి మండల కేంద్రంలో రోడ్‌షో నిర్వహించారు. అలనాటి పల్నాటి యుద్ధం ధర్మం, న్యాయం కోసం జరిగితే ఈనాటి పల్నాటి ఉపపోరు నీతికి, అవినీతికి మధ్య జరుగు తుందని అన్నారు. రాష్ట్రంలో దొంగలు పడ్డారని కాంగ్రెసోళ్లు దొంగలు అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు గజదొంగలని ఆరోపించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తండ్రి పాలనను అడ్డుపెట్టుకొని లక్షల కోట్లు సంపాదించారని దీనిలో భాగంగానే టివి, పత్రికలో కూడా అవినీతి సొమ్ము చేరిందన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ దొంగ సారా అమ్ముకునే వ్యక్తికి పీసీసీ పదవి కట్టబెట్టారని, మం త్రులు కూడా మద్యం కుంభ కోణంలో భాగస్వాములు అయ్యార న్నారు. జోరున వర్షం కురుస్తున్నా చంద్రబాబు తడుస్తూనే ప్రసంగించడం విశేషం.
మాచర్ల :బీసీలు పెరిగిన జనాభాకు అను గుణంగా రిజర్వేషన్లు కల్పించలేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర బాబు నాయుడు అన్నారు. మంగళవారం జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో బాబు మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే ఎవరూ కల్పించ నన్ని సంక్షేమ పథకాలు బడుగులకు కల్పిస్తామన్నారు. రిజర్వేష న్లను జనాభా దామాషా ప్రకారం అందే విధంగా చట్టాలను సవరిస్తా మన్నారు. తాము అధికారంలోకి రాగానే చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.బీసీ కార్పోరేషన్ ఏర్పాటు చేసి రూ.5 లక్షలు కూడా ఖర్చుపెట్టని, దౌర్భాగ్య ప్రభుత్వాన్ని తిప్పి కొట్టేందుకు బడుగులు సమైక్యంగా ఉద్య మిం చాలని పిలుపు నిచ్చారు. బడుగులకు అన్ని పార్టీల కన్నా మిన్నగా అత్యధిక స్థానాలు కేటా యిస్తున్నామన్నారు. బీసీలకు కీలక మైన మంత్రి పదవులతో పాటు స్పీకర్ పదవిని కూడా అందించిన ఘనత టీడీపీ దేనని పేర్కొన్నారు. స్థానిక సంస్ధలలో వారికి మరింత ప్రాధా న్యత కల్పిస్తామన్నారు.

ఎక్సైజ్ శాఖలో మద్యం ముడపులు అందుకున్న ఏ ఒక్కరినీ వదలకుండా అవినీతి నిరోదక శాఖ ఏరేసే కార్యక్రమాన్ని ఉధృతం చేసింది. ముడుపులు అందుకున్న మరికొందరు ఎక్సైజ్ అధికార్లను కోర్టు బోను ఎక్కించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే రాష్టవ్య్రాప్తంగా ఎక్సైజ్ కార్యాలయాలపై సోమవారం ఏకకాలంలో దాడులకు దిగింది. ఏసిబి సిట్ బృందాలు అనూహ్యంగా దాడులకు దిగాయి. ఎక్సైజ్ శాఖలో ఏళ్ల తరబడి ఒకే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న వారిపై గట్టి నిఘా పెట్టారు.
ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నవారి జాబితా తయారు చేసి ఉచ్చును మరింత బిగిస్తోంది. ఎసిబి అదనపు డైరక్టర్ శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలోని స్పెషల్ ఇనె్వస్టిగేషన్ బృందాలు ఈ కార్యక్రమంలో నిమగ్నమయ్యాయి. ఎక్సైజ్ శాఖలో మద్యం సిండికేట్ల నుంచి ముడుపులు అందుకున్న వారేకాకుండా, ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్న వారినీ తాజాగా ఎసిబి టార్గెట్ చేస్తోంది. విజయనగరం, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఎసిబి బృందాలు తనిఖీలు నిర్వహించాయి. కీలకమైన ఫైళ్లు, ఆఫీసు రికార్డులు, కంప్యూటర్ సామగ్రి, అధికారుల మొబైల్ నెంబర్లు స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయాల్లోని అధికారులను విచారించడంతోపాటు, వారి వద్దనున్న మొబైల్ నెంబర్లనుంచి గత కొన్ని రోజులుగా ఎవరెవరికి కాల్స్ వెళ్లిందీ విచారిస్తున్నారు. ఎసిబి దర్యాప్తుతో వ్యాపారాలు వదిలి అజ్ఞాతంలోకి వెళ్లిన సిండికేట్ల గురించీ సిట్ బృందాలు గాలిస్తున్నాయి. చిక్కడపల్లికి చెందిన మద్యం వ్యాపారి బాలరాజ్‌గౌడ్ అరెస్టు కాకుండా తప్పించుకుంటున్నాడు. ఇతను దేశం విడిచిపోకుండా ఎసిబి లుకౌట్ నోటీసు జారీ చేసింది. త్వరలోనే అరెస్టు చేస్తామని ఎసిబి వర్గాలు తెలిపాయి. ఇదిలావుంటే, విజయనగరం జిల్లాలోని ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఏసిబి బృందాలు తనిఖీలు నిర్వహించాయి. విజయనగరం జిల్లా కేంద్రం, పార్వతీపురం ఇఎస్ ఆఫీసుతోబాటు బొబ్బిలి సబ్ డివిజన్‌లో సైతం సోదాలు నిర్వహించారు. ఎసిబి డిఎస్పీ వెంకటేశ్వర రావు నేతృత్వంలో సిబ్బంది ఇఎస్ కార్యాలయానికి చేరుకుని 2010-12 మద్యం దుకాణాల టెండర్ రికార్డులు పరిశీలించారు.
పట్టు బిగిస్తున్న ఎసిబి
ఖమ్మం జిల్లాలో 2010 మద్యం టెండర్లలో 16 దుకాణాల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని నిర్థారించిన ఎసిబి, అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకునేందుకు ఎసిబి ఆధారాలు సేకరించే పనిలో పడింది. రెండురోజులుగ దాడులు కొనసాగిస్తున్న ఎసిబి, సోమవారం టెండర్లకు సంబంధించిన అన్ని ఫైళ్లనూ ఎసిబి డిఎస్పీ శంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో డిఆర్వో క్యాంప్ కార్యాలయం నుంచి స్వాధీనం చేసుకున్నారు. టెండర్ల సమయంలో జిల్లాలో పనిచేసిన జెసి అజీంతో పాటు పలువురు ఉన్నతాధికారుల ప్రమేయంపైనా విచారణ సాగుతోంది.
గుంటూరులోని ఎక్సైజ్ డిసి ఆఫీసులో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. సిండికేట్లు అందించిన వివరాలతో ఎక్సైజ్ అధికారుల పాత్రపై ఆరా తీస్తున్నారు. ఎసిబి జెడి రమేష్‌రెడ్డి ఆధ్వర్యంలో సోదాలు సాగాయి. 2010లో జరిగిన మద్యం టెండర్లలో అవకతవకలు జరిగాయని, సిండికేట్‌లకు షాపులు కేటాయించడంలో నిబంధనల ఉల్లంఘన వెల్లడైనట్టు సమాచారం. రికార్డులను స్వాధీనం చేసుకున్న ఎసిబి, చర్యలకు సిద్ధమవుతోంది. దాడుల సందర్భంలో డిసి కార్యాలయంలో ముఖ్య అధికార్లు అందుబాటులో లేకపోవడం గమనార్హం. అలాగే తెనాలి, నరసరావుపేట ఎక్సైజ్ కార్యాలయాల్లోనూ సోమవారం ఎసిబి బృందాలు దాడులు నిర్వహించి రికార్డులు తనిఖీలు చేశాయి. ఎసిబి డిఎస్పీ శివాజీ, విజయవాడ రేంజ్ ఎసిబి సిఐ టిఎస్‌కె రవి నేతృత్వంలో రికార్డులను పరిశీలించి, టెండర్ల విషయంలో అధికార్లు అక్రమాలకు పాల్పడ్డారా? అన్న అంశాలను పరిశీలించారు.
తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి, కాకినాడ, అమలాపురం ఇఎస్ కార్యాలయాలపై సోమవారం ఎసిబి బృందాలు దాడులు జరిపాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన సిట్ బృందాలు దాడుల్లో పాల్గొన్నాయి. 2010లో మద్యం దుకాణాల వేలం ప్రక్రియకు సంబంధించిన ఫైళ్లపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. దాడుల్లో ఎసిబి సిట్ డిఎస్పీలు విజయపాల్, లక్ష్మీపతి ఆధ్వర్యంలో ఇనస్పెక్టర్లు బి రామకృష్ణ, ఎస్ మురళీమోహన్ పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు, భీమవరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ అధికార్లు సోమవారం రికార్డులు పరిశీలించారు. ఏలూరులో హైదరాబాద్ ఎసిబి డిఎస్‌పి నరసింహారావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించగా, మధ్యాహ్నం నుంచి భీమవరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో విజయవాడ నుండి వచ్చిన బృందం ఆధ్వర్యంలో తనిఖీలు జరిపారు. దాడుల్లో భాగంగా కొన్ని ముఖ్యమైన ఫైళ్లను స్వాధీనం చేసుకుని, కార్యాలయాల్లోని కంప్యూటర్లలో నిక్షిప్తమైన సమాచారాన్ని సైతం ఎసిబి అధికార్లు సేకరించారు.
నెల్లూరు జిల్లాలోని నెల్లూరు, గూడూరు ఎక్సైజ్ కార్యాలయాల్లో ఎసిబి సోదాలు సాగాయి. మద్యం దుకాణాల లైసెన్సులు పరిశీలించి, 2010 నుంచి టెండర్లకు సంబంధించిన వివరాలు తీసుకున్నారు. కర్నూలు, కడప జిల్లాల్లో సైతం ఎక్సైజ్ కార్యాలయాలపై ఎసిబి దాడులు జరిపింది. 2010 వేలం పాటల రికార్డులు, టెండర్లలో పాల్గొన్న వారి వివరాలు, ఆస్తిపాస్తుల సమాచారం, మద్యం దుకాణాలను వేలంలో దక్కించుకున్న వారి వివరాలు సేకరించారు. అలాగే, మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ పట్టణాలలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల్లో ఎసిబి అధికారులు సోమవారం దాడులు నిర్వహించి సోదాలు చేశారు. మద్యం దుకాణాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.

నున్నా రమణ వాంగ్మూలంపై విచారణ
ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం సహా 20 చోట్ల సోదాలు
అదుపులో నలుగురు అధికారులు
అవినీతి నిరోధక శాఖ అధికారులు శనివారం ఖమ్మం, వరంగల్, చిత్తూరు, హైదరాబాద్ జిల్లాల్లో విస్తృతంగా సోదాలు చేశారు. మొత్తం 50 మంది సభ్యులు బృందాలుగా విడిపోయి ఈ సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కొన్ని కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీరందరినీ ఏసిబి ఏడి శ్రీనివాసరెడ్డి సమన్వయం చేశారు. అవినీతి ఆరోపణలతో ఉన్న నలుగురు అధికారులను అదుపులోకి తీసుకున్నారు. అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎం.శంకరయ్య సొంతూరు చిత్తూరు జిల్లాలోని కోటపల్లిలోనూ సోదాలు నిర్వహించగా ఖమ్మం జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మధుసూదన్ ఇంటిపైనా దాడులు నిర్వహించారు. మధుసూదన్ ఇంట్లో రూ.లక్షా 30 వేల నగదు, 35 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఏసిబి అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి తమ ఇష్టం వచ్చినట్లు రాసుకుని సంతకాలు చేయించుకున్నారన్న మద్యం సిండికేట్ నున్న రమణ ఆరోపణలు చేసిన అనంతరం ఈ దాడులు జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఖమ్మంలో మద్యం దుకాణాల్లోనూ, ఎక్సైజ్ అధికారుల గృహాల్లోనూ ఎసిబి అధికారులు తనిఖీలు నిర్వహించారు. లైసెన్స్‌లు పొందడం, మామూళ్ల వ్యవహారంపై నున్నా రమణ ఇచ్చిన వాంగ్మూలంపై విచారణ జరిపారు. ఖమ్మంలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంతో పాటు జిల్లా వ్యాప్తంగా 20 చోట్ల తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎడి శ్రీనివాసరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ ఎక్సైజ్ శాఖకు చెందిన డిప్యూటీ కమిషనర్ నర్సింహారావు, ఖమ్మం జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మధుసూదన్‌రావు, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎం.శంకరయ్య, సిఐ డిఎస్ నాధ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పొద్దుపోయే వరకూ తనిఖీలు జరిగాయి. బంధువులు, స్నేహితుల పేరు మీద బినామీగా లైసెన్స్‌లు తీసుకున్నానని, అధిక ధరలకు అమ్ముకోవడానికి ఎక్సైజ్ అధికార్లకు ముడుపులు ఇచ్చుకున్నానని రిమాండ్ రిపోర్టులో నున్నా రమణ పేర్కొన్న విషయం విదితమే. ఇదే కోవలో రాజకీయ పార్టీలకు, మంత్రి మోపిదేవికి, పత్రికా ప్రతినిధులకు, పోలీసులకు మామూళ్లు ఇచ్చినట్లు పేర్కొన్నాడు. వాటి ఆధారాలు సేకరించడంలో భాగంగా శనివారం ఏసిబి బృందం తనిఖీ చేసింది. రమణకు చెందినవిగా చెప్పబడుతున్న 16 బార్‌షాపుల లైసెన్స్‌లు అక్రమ పద్ధతుల్లో పొందారని చెరుకూరి శ్రీనివాసరావు అనే వ్యక్తి గతంలో ఫిర్యాదు చేశారు. దీనిపై ఖమ్మం ఆర్‌డిఓ వి.వెంకటేశ్వర్లును విచారించి 2010 డిసెంబర్ 12న అప్పటి కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు. అక్రమాలు ఉన్నాయని ఆర్‌డిఓ చెప్పారు. శనివారం ఖమ్మం వచ్చిన అధికారులు ఆర్‌డిఓ వెంకటేశ్వర్లును జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో విచారించారు. ఆర్‌డిఓ నివేదికలో పొందుపరిచిన అన్ని బార్ షాపుల్లోనూ ఏసిబి అధికారులు పరిశీలనలు జరిపారు. మంత్రి మోపిదేవికి నున్నా రమణ డబ్బులు ఇచ్చే సందర్భంలో ఉన్నాడని చెబుతున్న మరో మద్యం సిండికేట్ నేత బాబ్జి ఇంట్లోనూ తనిఖీలు చేశారు. తనిఖీ సమయంలో బాబ్జి ఇంట్లో లేరు. ఆయన ఇంటి నుండి కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
వరంగల్‌లో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నర్సింహారావు ఇంటిపై, కార్యాలయంపై కూడా ఎసిబి అధికారులు దాడులు చేశారు. హైదరాబాద్‌లో నర్సింహారావును ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎసిబి అధికారులు సాంబయ్య, రాఘవేందర్‌రావు, బాపురెడ్డి శనివారం ఉదయం నుండే సోదాలు ప్రారంభించారు. సోదా చేసేందుకు నర్సింహారావు ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉండడంతో ఆయనను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. వంటమనిషితో తాళం తీయించి సోదాలు చేశారు. ఖమ్మంలో ఎక్సైజ్ సిఐగా పనిచేస్తూ వరంగల్‌లోని టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్న సర్వేశ్వర్‌నాథ్ ఇంట్లో కూడా సోదాలు చేశారు. అనంతరం ఎక్సైజ్ కార్యాలయంలో సోదాలు చేశారు. తనిఖీల్లో వరంగల్ డిఎస్‌పి కృష్ణుడు, ఖమ్మం సిఐ జనార్ధన్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. aఖమ్మం జిల్లా ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ శంకరయ్య సొంతూరు చిత్తూరు జిల్లా పీలేరు మండలం కోటపల్లి గ్రామంలో అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే సోదాల్లో ఎలాంటి ఆధారాలూ లభ్యం కాలేదని సిఐలు పార్థసారథిరెడ్డి, రామక్రిష్ణారావు తెలిపారు.
ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో ఖమ్మం జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మధుసూదన్ ఇంటిపై ఎసిబి డిఎస్పీ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. మధుసూదన్ హైదరాబాద్ నగరంలోని ఆర్‌కెపురం డివిజన్ సౌభాగ్యనగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ దాడులలో రూ.లక్షా 30 వేల నగదు, లాకర్లలో 35 తులాల బంగారం, రూ.40 వేల నగదు ఉన్నట్లు డిఎస్పీ తెలిపారు. ఇంకొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని, వాటిని పరిశీలిస్తే ఇంకొన్ని ఆస్తులు వెళ్ళడి కావచ్చన్నారు. దొరికిన సొత్తు కొద్ది మొత్తమేనని, ఇంకా ఆయనకు మద్యం సిండికేట్‌లతో సంబంధం ఉన్నట్లు వార్తలొస్తున్నాయన్నారు. ఈ దిశగా దర్యాప్తు చేపడతామని చెప్పారు. కాగా, తాను వివిధ జిల్లాలలో పని చేశానని, ఎక్కడా తనపై అవినీతి ఆరోపణలు లేవని ఎక్సైజ్ సూపరింటెండెంట్ మధుసూదన్ తెలిపారు. తాను అక్రమంగా ఎలాంటి ఆస్తులూ సంపాదించలేదన్నారు.

క్వింటాలుకు రూ.5వేలు కూడా గిట్టుబాటు కావడం లేదని ధ్వజం
ఇవాళ మార్కెట్‌లోకి విచ్చలవిడిగా నకిలీ విత్తనాలు వచ్చి రైతన్నల వెన్ను విరుస్తున్నా ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నవారికి పట్టడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విత్తన నాణ్యతను నిర్ధారించి సర్టిఫై చేయాల్సిన వ్యవసాయ యూని వర్సిటీకి గత ఏడాది కాలంగా వైస్ చాన్స్‌లర్‌ను కూడా నియమించని అధ్వాన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని విమర్శిం చారు. ‘రైతులు పంటలు కోసే సమయంలోనేమో.. ధాన్యం రేట్లు తగ్గిస్తారు. కనీస గిట్టుబాటు ధర కూడా ఇవ్వకుండా రైతుల దగ్గర నుంచి తీసుకుంటారు. ఇదే పంట మూడు నెలల తరువాత డీలర్ల చేతికి వెళ్లిన తరువాత మళ్లీ రేట్లు పెంచుతున్నారు’ అని ధ్వజమెత్తారు.
గుంటూరు జిల్లా ఓదార్పు యాత్ర 71వ రోజు గురువారం జగన్‌మోహన్‌రెడ్డి.. వినుకొండ, బొల్లాపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు. గురువారం మొత్తం 46 కిలోమీటర్లు ప్రయాణించిన జగన్ ఏడు వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. పలు చోట్ల ప్రసంగించారు.
నేను వస్తుండగా కొందరు రైతన్నలు మిరప పంటను నాకు చూపించారు. ‘అన్నా చాలా రకాల మందులు కొట్టామన్నా, అయినా కూడా పంట తేరుకోలేదు.. నకిలీ విత్తనాలున్నట్టున్నాయి.. మాకు ఇవేం బాధలన్నా!’ అంటూ నాతో చెప్పి ఆవేదన చెందారు. ఇవాళ చాలా మంది రైతులు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. ‘మిర్చి వేసుకున్న రైతన్నకు 30 నుంచి 40% పంట తాలుకాయ రూపంలో పోయింది.. మరికొంత పంట బొబ్బర వైరస్ సోకి పోయింది. ఎకరాకు కనీసం 25 క్వింటాళ్లు పండాల్సిన మిరప ఈ ఏడాది 15 క్వింటాళ్లు కూడా పండలేదన్నా’ అని ఆ రైతులు చెప్పినప్పుడు బాధనిపించింది. ఈ మిరపను తీసుకొని మార్కెట్‌కు వెళితే క్వింటాలుకు రూ.5 వేలకు ఒక రవ్వ అటో ఇటో ధర కూడా రావడం లేదన్నా అని వారు చెప్పినప్పుడు చాలా చాలా బాధనిపించింది. ఇవాళ ఒక్క మిర్చి రైతు పరిస్థితి మాత్రమే కాదు పసుపు రైతు.. పత్తి.. టమోటా.. ఉల్లి వేసుకున్న ప్రతి రైతు కూడా అధ్వానమైన పరిస్థితుల్లో వ్యవసాయం చేస్తున్నాడు.
ఆ సానుభూతి పాలకులకు లేదు…
గ్రామాలకు వెళుతున్నప్పుడు పొలాల్లో కూలి పనిచేస్తున్న అక్కా చెల్లెమ్మలు కనిపించారు. వాళ్లు నన్ను చూసి పరిగెత్తుకుంటూ వచ్చి నాతో ఆప్యాయంగా మాట్లాడారు. నేను వాళ్లను అడిగా..! ఎంత కూలి గిడుతోంది తల్లీ అని. ‘రూ.100 కూడా గిట్టడంలేదన్నా. ఇవాళ రైతుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. మిర్చి పంటలను మార్కెట్‌లోకి తీసుకుని పోయి అమ్మితే రూ.5 వేలు కూడా గిట్టుబాటు కాని పరిస్థితులలో ఇవాళ రైతులు ఉన్నారన్నా.. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్లు ఇంతకంటే ఎక్కువ మాకు ఏమిస్తారన్నా’ అని ఆ అక్కా చెల్లెమ్మలు కూడా రైతన్నమీద సానుభూతి చూపిస్తున్నారు. బాధెక్కడనిపిస్తోందంటే.. తోటి మనిషి మీద ఇంకో మనిషి సానుభూతి చూపిస్తున్నాడు కానీ.. సానుభూతి చూపించాల్సిన ప్రభుత్వం మాత్రం తనకేమీపట్టనట్లుగా వ్యవహరిస్తోంది.

కళారూపాలు సమాజంలో మార్పుకు దోహదపడా లని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డి.మాణిక్య వరప్రసాద్ అన్నారు. శని వారం స్థానిక శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు చలనచిత్ర టెలివిజన్ థియేటర్ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగిన 2011 నంది నాటకోత్సవ బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి గుంటూరు తూర్పునియోజకవర్గ శాసనసభ్యులు షేక్ మస్తాన్‌వలి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి వరప్రసాద్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ మనిషిని మానవీకరించడానికి నాటకరంగం తోడ్పాటునందించాలన్నారు. నాటకాల్లోని పాత్ర స్వభావాలను బట్టి మనిషిలో స్పందించే గుణ ం ఉండాలన్నారు. హావభావ సంబంధాలు ప్రతి మనిషికి అవసరం కావాలన్నారు. సమాజంలో మార్పు రావాలంటే నాటకాలు, నాటికలు ఒక సాధనం కావాలని ఆయన సూచించారు. విద్యార్థి దశ నుండే సాహిత్య కళారూపాల పట్ల ఆసక్తి కలిగించాలన్నారు. కళలు అభివృద్ధి చెందిన నాడే దేశాభివృద్ధి చెందుతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సాహిత్య కళా రంగాల అభివృద్ధికి ప్రోత్సహించాలన్నారు. నంది నాటకోత్సవాల్లో అవార్డుల గ్రహీతలను మంత్రి వరప్రసాద్ అభినందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టెలివిజన్, థియేటర్ అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ బి.వెంకటేశం మాట్లాడుతూ రంగస్థలానికి గుంటూరులో ప్రేక్షకాదరణ ఎక్కువ అనే ఆలోచనతో నంది నాటకోత్సవాలను గుంటూరులో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నాటక రంగ అభివృద్ధికి సంస్థ పూర్తి సహాయ, సహకారాలను అందిస్తుందన్నారు. శాసనమండలి సభ్యులు రాయపాటి శ్రీనివాస్, టీజీవీ కృష్ణారెడ్డి, కెఎస్ లక్ష్మణరావులు ప్రసంగించారు. ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారాన్ని ప్రముఖ రంగస్థల కళాకారులు కొంపల్లి శేష తల్ప శాయికి మంత్రి అందజేశారు. తదుపరి వివిధ విభాగాల్లో గెలుపొందిన నాటక సమాజాలకు, కళాకారులకు అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విఎన్ విష్ణు, జాయింట్ కలెక్టర్ ఎన్.యువరాజ్, వివిధ శాఖలకు చెందిన అధికారులు, కళాకారులు పాల్గొన్నారు.

మద్యం మాఫియా అవినీతి అక్రమాలపై విచారణ జరుపుతున్న ఏసీబీ తన పట్ల ఏక పక్షంగా వ్యవహరిస్తుందని ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు. సిండికేట్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని వివరించారు. తాను ఎవరి నుండి ముడుపులు పుచ్చుకోలేదని వెల్లడించారు. క్రిమినల్స్ ఇచ్చే వాంగ్మూలానికి విలువనిచ్చి తన అభిప్రాయాన్ని తీసుకోకుండా ఏసీబీ ఏక పక్షంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఏసీబీ వైఖరి పై తనకు అనేక అనుమానాలు ఉన్నాయని అన్నారు. తనకు ఎవరిపైన అనుమానం లేదని, తాను ఎవరికీ పోటీ కాదని, కొందరు తననే లక్ష్యంగా చేసుకొని
ఆరోపణలు చేయడం ఆవేదనకు గురి చేస్తుందని అన్నారు. మద్యం సిండికేటుకు సంబంధించి రమణ అనే వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వాస్తవాలు తెలుసుకోకుండానే తనపై రాజకీయ కోణంలో కొందరు దాడికి పాల్పడుతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం నాడు అసెంబ్లీలో ఈ వ్యవహారంపై చర్చ జరిగిన పక్షంలో సమాధానం ఇస్తానని తనను కలిసిన మీడియా ప్రతినిధులకు తెలిపారు. మద్యం మాఫియా వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని పునరుద్ఘాటించారు. ఏసీబీ వ్యవహారంపై తనకు అనేక అనుమానాలు కలుగుతున్నాయని తెలియచేశారు. దర్యాప్తు సంస్ధ తీరును ఖండించారు. వాస్తవాలను నిర్ధారించుకోకుండానే సంబంధం లేని వ్యక్తుల పేర్లు బయటకి వస్తున్నాయనే అనుమానం కలుగుతుందన్నారు. అసెంబ్లీ సభా వ్యవహారాల సలహా మండలి సమావేశంలో మద్యం ఫియా అంశంపై చర్చ జరిగింది. అందులో కొందరు మంత్రులకు మద్యం సిండికేట్ల నుండి ముడుపులు ముట్టాయని ప్రధాన ప్రతిపక్షం ఆరోపించింది. వాస్తవాలు వెలుగు చూసే విధంగా సమగ్ర చర్చ జరగాలని పట్టుబట్టింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నాటి నుండి తనను లక్ష్యంగా చేసుకొని కొందరు ఆరోపణలు చేస్తున్నారని మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఇదే విషయాన్ని మరో సారి ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చానన్నారు. ఈ విషయంలో వాస్తవం వెలుగుచూడవలసి ఉందని అన్నారు. అసెంబ్లీలో చర్చ సందర్బంగా సమాధానం ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఇప్పటికే అంగీకరించారు. మీడియాకు కూడా తెలియచేశారు. ఏబీసీ విచారణ ప్రాథమిక దశలోనే ఉందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో అమాయకులకు అన్యాయం జరగరాదనే అభిప్రాయంతో ఉన్నారు. వాస్తవాలు వెలుగుచూడావలసి ఉందని అభిప్రాయబడుతున్నారు. సభలో జరిగే చర్చకు ముఖ్యమంత్రి సమాధానంతో పాటుగా అదే సమయంలో తనకు కూడా వివరణ ఇచ్చుకునే అవకాశం కల్పించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ కోరుకుంటున్నారు.

బీరు ఏజెన్సీ తీసుకుందామనుకున్నది నిజమే
మంత్రిగా ఉంటూ మంచిది కాదని విరమించుకు
ఏసీబీ రిమాండ్ రిపోర్టులో తన పేరు ఇరికించడంలో తెర వెనుక ఎవరి కుట్రో ఉండవచ్చన్న అనుమానాన్ని ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు వ్యక్తం చేశారు. పలువురు ప్రజా ప్రతినిధుల పేర్లు ఏసీబీ రిపోర్టుల్లో ఉన్నా.. తన ఒక్కడి పేరును మాత్రమే బయట పెట్టడం పట్ల కొన్ని అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా తాను నిర్దోషినని చెప్పారు. సచివాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
“బీరు సరఫరా ఏజెన్సీ తీసుకుందామనుకున్నది వాస్తవమే. అయితే మంత్రిగా ఉంటూ మంచిది కాదని ఆ తర్వాత విరమించుకున్నాం. నా కుమారుడి పేరు మీద బీరు వ్యాపారం చేయాలని అనుకోలేదు. ఇతర వ్యాపారాలు చేయడం కోసమే అతని పేరు మీద ఫరం రిజిస్ట్రేషన్ చేశాం” అని వివరించారు. బీరు సరఫరా గురించి సెప్టెంబర్‌లో బ్లాక్ ఈగల్ కంపెనీ ప్రతినిధులు తన వద్దకు వచ్చారని, దానిని ఏపీబీసీఎల్‌తో కొనుగోలు చేయించి మద్యం దుకాణాల ద్వారా విక్రయించేందుకు తనతోపాటు ఎక్సైజ్ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. తన కుమారుడి పేరిట బీరు ఏజె న్సీ తీసుకోవాలనుకుంటే మంత్రి స్థానంలో ఉండి కేవలం రెండు వారాల్లోనే ఆ ప్రక్రియను పూరి ్తచేయించగలనని అన్నారు.
మంత్రిగా ఉంటూ బీరు వ్యాపారం చేయడం ఏమిటని పునరాలోచించే ఆ ప్రయతాన్ని విరమించుకున్నానని, ఫరం కూడా రద్దు చేశానని చెప్పారు. ఆ తర్వాత బ్లాక్ ఈగల్ కంపెనీతో ఎలాంటి లావాదేవీలు జరపలేదన్నారు. తన కుమారుడితో ఎలాంటి వ్యాపారాలు చేయించాలని అనుకోవడం లేదన్నారు. తన జోక్యం ఉంటే, కేంద్రంతో మాట్లాడి నోటిఫికేషన్‌ను విడుదల చేయించి అప్పటికప్పుడే ఏజెన్సీని తీసుకునే వాడినని తెలిపారు. ఎమ్మార్పీపై ప్రభుత్వం గట్టిగానే ఉందని, వ్యాపారులు తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదుతోపాటు లైసెన్సుల రద్దు చేసేందుకు వెనుకాడేది లేదని హెచ్చరించారు.
ఒకటి రెండు నెలల్లోనే కొత్త మద్యం విధానాన్ని రూపొందించనున్నట్టు మోపిదేవి తెలిపారు. ఇప్పటికే ఎక్సైజ్ అధికారుల బృందం తమిళనాడు వెళ్లి అధ్యయనం చేసి వచ్చిందని, రెండు మూడు రోజుల్లో కేరళ కూడా వెళుతుందని తెలిపారు. ఎక్సైజ్ శాఖ బాధ్యతలు చేపట్టిన ప్రతి మంత్రిపై ఏదో రకమైన ఆరోపణలు వస్తూనే ఉంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం సిండికేట్లు ఇప్పుడే ఏర్పడినవి కావని.. ఏళ్ల తరబడి ఈ సంప్రదాయాన్ని వ్యాపారులు కొనసాగిస్తున్నారని చెప్పారు. ఖమ్మం-వరంగల్ మద్యం సిండికేట్ లీడర్ నున్న రమణ కూడా తనపై నేరుగా ఆరోపణలు చేయలేదని మంత్రి తెలిపారు.

నంది నాటకోత్సవాల ప్రారంభ సభలో స్పీకర్
రాష్ట్రంలోని కళాకారుల సంక్షేమానికి వచ్చే బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘నంది నాటకోత్సవాలు- 2011′ను గుంటూరు లోని శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఆదివారం జ్యోతి ప్రజ్వలనచేసి ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో స్పీకర్ మాట్లాడుతూ కళాకారులు మన జాతి సంపద అన్నారు. రాష్ట్రంలో కళాకారులను ఆదుకునేందుకూ, కళారంగాన్ని ప్రోత్సహించేందుకూ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కళాకారులను ఉపయోగించుకోవాలనీ సూచించారు. సమాజంలోని రుగ్మతలను రూపుమాపడానికి నాటకాలు ఎంతో దోహదపడతాయన్నారు. గృహనిర్మాణ శాఖామంత్రి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కళాకారులను ప్రోత్సహించేందుకే ప్రభుత్వం నంది నాటకోత్సవాలు నిర్వహిస్తోం దన్నారు. సమాజానికి సందేశాన్నిచ్చేలా నాటకాలు ఉండాలన్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ కళాకారులకు పుట్టినిల్లయిన గుంటూరు లో నంది నాటకోత్సవాలు నిర్వహించడం గర్వించదగిన విషయమన్నారు. టీవీ సీరియల్స్‌తో సమాజం తప్పు దోవపడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నాటకరంగం గతం నుంచీ నేటివరకూ సమాజానికి ఉపయోగపడే విధంగా ఉందన్నారు. నంది నాటకాల ద్వారా సమాజానికి మంచి సంకేతాలు పంపాలనీ కోరారు. గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ నాటకాల ద్వారా సమాజంలో మార్పు తీసుకురావచ్చని చెప్పారు. నాటకాలు ప్రజలను ఆలోచింపజేసేలా ఉండాలని సూచిం చారు. సినిమాల్లోకంటే నాటక రంగంలో నటించడమే చాలా కష్టమన్నారు. అనంతరం స్పీకర్, మంత్రులకూ జిల్లా కలెక్టర్ వి.ఎన్.విష్ణు జ్ఞాపికలను బహూకరించి ఘనంగా సన్మానించారు. నంది నాటకోత్సవాల్లో భాగంగా తొలుత ‘భక్త పుండరీక’ నాటిక ప్రదర్శించారు.

డీఎస్స-12 నోటిఫికేషన్ విడుదల
మే 2,3,4 తేదీల్లో రాత పరీక్షలు
అప్రెంటీస్ విధానం రద్దు
‘ఇంటర్’ నిబంధన తొలగింపు
‘ఓపెన్ డిగ్రీ’ వారికీ అర్హత
ఎస్ఏ పోస్టులకు సబ్జెక్టు నిబంధనల సడలింపు
80 మార్కులకే డీఎస్సీ
20 మార్కులకు టెట్ వెయిటేజి
మరో 7100 పోస్టులకు రెండు రోజుల్లో నోటిఫికేషన్
హైదరాబాద్, జనవరి 30 : లక్షలాది మంది ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త. కొద్ది రో జులుగా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న ‘డీఎస్సీ -2012 నోటిఫికేషన్’ సో మవారం విడుదలైంది. మొత్తం 21,343 ఉపాధ్యాయ ఉద్యోగాలను ఇందులో నోటిఫై చేశారు. ఉపాధ్యాయ అభ్యర్థులు దశాబ్దకాలంగా చేస్తోన్న ‘అప్రెంటిస్’ రద్దు డిమాండ్ కూడా నెరవేరుతోంది. వివాదాస్పదంగా మారిన ‘ఇంటర్‌లో సంబంధిత సబ్జెక్టులు తప్పనిసరి’ అనే నిబంధనను తొలగించారు.
నోటిఫై చేసిన మొత్తం పోస్టుల్లో.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 5,703, ఎస్జీటీ పోస్టులు 11, 602 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్లు 2000, పీఈటీలు 365, మునిసిపల్ పాఠశాలల్లో 1,673 పోస్టులు ఉన్నాయి. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 17వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. సచివాలయంలో సోమవారం సాయంత్రం 3 గంటలకు మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కె.పార్థసారథి ఈ డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. డీఎస్సీకి విద్యార్హతల నిబంధనల్లో కొన్నింటిని సడలించారు.
స్కూల్ అసిస్టెంట్స్ (మేథ్స్, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్) పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్ స్థాయిలో కూడా మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, హిస్టరీ, జాగ్రఫీ సబ్జెక్టులు చదివి ఉండాలన్న నిబంధనలను తొలగించారు. అంటే.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్ చదివి ఉండాలన్న నిబంధన లేదు.
ఫలితంగా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా నేరుగా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు కూడా అర్హత లభిస్తుంది. స్కూల్ అసిస్టెంట్స్ (జీవశాస్త్రం) పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు జీ.వో.నెం.4లో పేర్కొన్న సబ్జెక్టులతో పాటు సెరికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, పౌల్ట్రీ సబ్జెక్టుల అభ్యర్థులకు కూడా అర్హత కల్పించారు. టీచర్లకు అప్రెంటిస్ విధానాన్ని ఈ డీఎస్సీ నుంచి రద్దు చేశారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు నమూనా, యూజర్ గైడ్ కోసం జ్ట్టిఞ://్చఞఛీటఛి.ఛిజజ.జౌఠి.జీn వెబ్‌సైట్‌ను చూసుకోవాలి.
డీఎస్సీ 80 మార్కులకే..
టెట్‌కు వెయిటేజీ ఇవ్వనున్న కారణంగా 80 మార్కులకే డీఎస్సీ పరీక్షను నిర్వహించనున్నారు. మిగతా 20 మార్కులకు టెట్ మార్కులను వెయిటేజీగా జమ చేస్తారు. ఒక్కో ప్రశ్నకు అర మార్కు చొప్పున 80 మార్కులకు 160 డీఎస్సీ పరీక్ష ఉంటుంది. ఎస్జీటీ పరీక్షలో జనరల్ నాలెడ్జ్‌కు 10 మార్కులు, పర్‌స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 10, ఇంగ్లీష్ 9, ఇండియన్ లాంగ్వేజ్ 9, మాథ్స్ 9, సైన్స్ 9, సోషల్ స్టడీస్ 9, టీచింగ్ మెథడ్ 15 మార్కులు ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్ పరీక్ష ల్లో.. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10, పర్‌స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 10, సబ్జెక్ట్ కంటెం ట్ 44, టీచింగ్ మెథడాలజీ 16 మార్కులు ఉంటాయి. పీ ఈటీలకు టెట్ ఉండకపోవ డం వల్ల పూర్తిగా 100 మా ర్కులకు పరీక్ష ఉంటుంది.