హైదరాబాద్

ఔరంగ జేబు కంటే ద్రోహి – రోశయ్య

CM-6
‘బాబ్లీ యాత్రకు వెళ్లినప్పుడు తమకు జరిగిన అవమానాలపై మాట్లాడుతూ చంద్రబాబు నా గురించి అనుచిత వ్యాఖ్య లు చేశారు. నన్ను ఉద్దేశించి బూటు కాలి తో ఆయనను తంతే తెలిసేదంటూ ఇష్టానుసారంగా మాట్లాడినట్టు చానళ్లలో వ చ్చింది.
అఖిలపక్ష బృందం ఢిల్లీకి వెళ్లి వచ్చాక మరోసారి నాపై విరుచుకుపడుతూ.. నావి నీచ రాజకీయాలని వ్యా ఖ్యానించారు. ఇవన్నీ మతిస్థిమితం తప్పిన వారి లక్షణాలుగానే భావించాల్సి వస్తోం ది. బాబు ఔరంగజేబును మించిన ద్రోహి. పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచి, సీఎం అయ్యారు. అలాంటి వ్యక్తి రాజకీయాల్లో స్వచ్ఛత గురించి మాట్లాడతారా?’ – రోశయ్య, ముఖ్యమంత్రి
హైదరాబాద్, జూలై 28 : ‘ఔరంగజేబును మించిన ద్రోహి చంద్రబాబు. అలాంటి వ్యక్తికి రాజకీయాల్లో స్వచ్ఛత గురించి మాట్లాడే అర్హత ఎ క్కడిది?’ అని సీఎం రోశయ్య ప్రశ్నించారు. ఇటీవల చంద్రబాబు ఒక ప్రతిపక్ష నేత మాట్లాడకూడని దారుణమైన భా షలో మాట్లాడుతున్నారని, ఆయనకు మతిస్థిమితం తప్పినట్టు కనిపిస్తున్నదన్నారు.
హైదరాబాద్‌లో బుధవారం సో లార్‌కాన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న రోశయ్య విలేఖరులతో మాట్లాడుతూ బాబు వైఖరిపై వ్యంగ్యాస్త్రలు సంధించారు. ‘బాబ్లీ యాత్రకు వెళ్లినప్పుడు తమకు జరిగిన అవమానాలపై మాట్లాడుతూ చంద్రబాబు నా గురించి అనుచి త వ్యాఖ్యలు చేశారు.
నన్ను ఉద్దేశించి ఇష్టానుసారంగా మా ట్లాడినట్టు చానళ్లలో వచ్చింది. మళ్లీ బాబ్లీపై అఖిలపక్ష బృందం న్యూఢిల్లీ సందర్శించి వచ్చాక మరోసారి నాపై వి రుచుకుపడుతూ.. నావి నీచ రాజకీయాలని వ్యాఖ్యానించా రు. ఇవన్నీ మతిస్థిమితం తప్పిన లక్షణాలుగానే భావించా ల్సి వస్తోంది’ అని రోశయ్య వ్యాఖ్యానించారు.
‘80 ఏళ్లు నిండిన నాకు నీచ రాజకీయాలకు పాల్పడవలసిన అవసరం లేదు. నేను ఎందరో సీఎంలతో పని చేశాను. నేనలాం టి వాడినైతే అంత మందితో పని చేయడం ఎలా సాధ్యమో చంద్రబాబు విచక్షణకే వదిలేస్తున్నాను” అన్నారు. అయినా ఎవరెలాంటి వారో తెలుగు ప్రజలకు తెలుసునని, తానేమీ ఎవరికీ వెన్నుపోటు పొడిచి ఈ కుర్చీపై కూర్చొనలేదని స్ప ష్టం చేశారు.
బాబ్లీ వ్యవహారంలో టీడీపీ బృందం మహారా ష్ట్ర వెళ్లినప్పుడు ఎన్నిసార్లో మహారాష్ట్ర సీఎం చవాన్‌తో మా ట్లాడానని, చివరికి వారిని బస్సుల్లో హైదరాబాద్ పంపుతామంటే అన్ని రోజులు నానా ఇబ్బందులు పడ్డారు, బస్సు ల్లో వద్దని ప్రత్యేక విమానం కూడా ఏర్పాటు చేయించానని రోశయ్య వివరించారు.
‘ఆ ఖర్చు ప్రభుత్వం భరించడం ఇష్టం లేకపోతే వాపసు చేయమనండి. దాన్ని ప్రభుత్వ ఖ జానాలో జమ చేయిస్తాను’ అని రోశయ్య అన్నారు. బాబ్లీపై ఢిల్లీ వెళ్లిన అఖిలపక్షంలో కూడా బాబు ఏకాకిగానే మిగిలిపోయారని ఆయన గుర్తు చేశారు. ప్రధానిని కలిశాక జరిగిన మీడియాసమావేశంలో పాల్గొనేందుకు బాబును తాను ఆహ్వానించానని, కానీ ప్రతిపక్షం వేరుగా మీడియాతో మా ట్లాడుతుందని చెప్పి రాలేదని రోశయ్య చెప్పారు.
బాబుకున్నంత ఆకర్షణ శక్తి తనకు లేకపోయినా అందరూ తన వెంట వచ్చారంటే అది తన చిత్తశుద్ధికి, నిజాయితీకి గుర్తిం పు అని రోశయ్య వ్యాఖ్యానించారు. ‘1983లో ఎన్టీఆర్ టీడీపీ పెట్టిన సమయంలో బాబు కాంగ్రెస్‌లో ఉన్నారు. ఎన్టీఆర్‌పై పోటీ చేస్తానని బీరాలు పలికారు.
చంద్రబాబు మాటలు నమ్మి అతనికి మద్దతు ఇవ్వవద్దని అప్పట్లో ఇందిరాగాంధీ స్వయంగా మాతో చెప్పారు. ఆ తర్వాత అదే పార్టీలో చేరి, సమయం కోసం చూసి, ఆయనకే గొయ్యి తవ్విన విషయం అందరికీ తెలుసు’ అని ఆయన చెప్పారు.
మన దేశంలో పిల్లనిచ్చిన మామను తండ్రితో సమానంగా చూస్తారని, ఆంధ్రప్రదేశ్ సంప్రదాయం అంతకన్నా ఉత్కృష్టమైనదని పేర్కొన్నారు. అంతటి గౌరవనీయ వ్యక్తినే రాత్రికి రాత్రే పదవీచ్యుతుని చేసిన చంద్రబాబు అధికారం కోసం కన్న తల్లిదండ్రులనే చెరసాల పాల్జేసిన ఔరంగజేబును మించిన ద్రోహి అని రోశయ్య దుయ్యబట్టారు.

ప్రభుత్వం కిరాతకం మారలేదు – రాఘవులు

b-v-raghavulu
గతంలో పరిశ్రమలు పెట్టిన వారు శ్రమ దోపిడీ మాత్రమే చేసేవారని, నేడు వ్యాపారులు, పెట్టుబడి దారులు సర్కారు అండతో ప్రభుత్వ, ప్రజల భూములు కొల్లగొ ట్టి క్షణాల్లో కోట్లకు పడగెత్తాలనుకుంటున్నారని సీపీఎం రాష్ట్ర కా ర్యదర్శి బీవీ రాఘవులు ధ్వజమెత్తారు.  స్థానికులను నిర్వాసితులను చేసి దేశం మొత్తం విద్యుత్ అమ్ముకోవడానికే తీర ప్రాంతా ల్లో థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని, అవి ప్రజ ల అవసరాల కోసం కాదని ఆరోపించారు. ‘కొత్త ప్రభుత్వం వచ్చినా కిరాతక చర్యలు, విధానాలు మారలేదు’ అని ధ్వజమెత్తారు.
తీర ప్రాంతాల్ని బడా సంస్థలకు అప్పగిస్తున్నారని, మ త్స్యకారులకు చేపలవేట, రైతులకు భూములు లేకుండా చేస్తున్నారన్నారు. ముదిగొండ అమరవీరుల సంస్మరణార్థం ఎంబీ భవన్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడా రు. వైఎస్ ప్రభుత్వానికి తీసిపోకుండా రోశయ్య ప్రభుత్వం కూడా సోం పేటలో ఇద్దరిని పొట్టన పెట్టుకుందన్నారు. పార్టీ నేతలు పి. మధు, మూర్తి, చంద్రారెడ్డి పాల్గొన్నారు.

12 స్థానాల్లో నేడే పోలింగ్‌ – ఒంటరిపోరులో మూడు పార్టీలు

marathon_finish
మరికొద్ది గంటల్లో జరగనున్న శాసనసభ ఉప ఎన్నికలపై ఉత్కంఠ పెరుగుతోంది. బరిలో ఉన్న మూడు ప్రధాన పార్టీలు ఈసారి ఎవరూ తోడు లేకుండానే ఒంటరిగా పోటీ చేస్తుండటంతో చీలిపోనున్న ఓట్లు ఎవరికి మేలు చేస్తాయన్న ఆసక్తి కనిపిస్తోంది. 2004, 2009 నాటి ఎన్నికలకు భిన్నంగా జరుగుతున్న ఈ ఉప ఎన్నికలు కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, తెలుగుదేశం పార్టీలకు ప్రతిష్ఠా త్మకంగా పరిణమించగా, రాజీనామా చేసి మళ్లీ బరిలో నిలిచిన టీఆర్‌ఎస్‌కు అగ్ని పరీక్షలా మారాయి. కాంగ్రెస్‌-టీడీపీ కూడా తెలంగాణవాదాన్ని బలంగా వినిపించడంతో ఓట్లు భారీగా చీలిపోయే పరిస్థితి కని పిస్తోంది. ఆ రెండు పార్టీలకు ఉన్న క్యాడర్‌ కూడా సర్వం ఒడ్డి పోరాడింది.  మంగళవారం 12 నియోజకవర్గాల్లో జరగ నున్న ఉప ఎన్నికలు ఉత్కంఠభరితంగా మారాయి. 2004లో కాంగ్రెస్‌తో కలసి పోటీ చేసిన టీఆర్‌ఎస్‌ ఈసారి ఒంటరిగా పోటీ చేస్తోంది. 2009లో మహాకూటమిగా కలసి పోటీ చేసిన టీడీపీ-టీఆర్‌ఎస్‌ ఈ ఉప ఎన్నికల్లో విడిగా పోటీ చేస్తున్నాయి. అయితే, గతంలో టీఆర్‌ఎస్‌ విజయాలకు ప్రధాన కారకుడిగా ప్రచారంలో ఉన్న ప్రజాగాయకుడు గద్దర్‌, ఇతర కళాకారులు, విద్యార్థి సంఘ నేతలు ఈసారి ఉప ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. విద్యార్థులు, కళాకారులను కేసీఆర్‌ ఫుట్‌పాత్‌గాళ్లన్న వ్యాఖ్యలకు నిరసనగా వారంతా ఉప ఎన్ని కలకు దూరంగా ఉన్నారు. కొన్నిఉద్యోగ సంఘాలు, రాజకీయ జేఏసీ మాత్రం టీఆర్‌ఎస్‌, బీజేపీకి మద్దతుగా నిలిచాయి. తన అభ్యర్థుల విజయం కోసం కేసీఆర్‌ అలు పెరుగని ప్రచారం చేశారు.
ప్రధానంగా.. సిరిసిల్లలో కేసీఆర్‌ కుమారుడు కేటీఆర్‌ను ఓడించేందుకు అటు కాంగ్రెస్‌, ఇటు టీడీపీ వ్యూహరచన చేస్తున్నాయి. టీఆర్‌ఎస్‌కు ఈ నియోజకవర్గం ప్రాణ ప్రతిష్ఠగా పరిణమించింది. ఇక తెలుగుదేశంపార్టీ ప్రచారా నికి చంద్రబాబు సహా అగ్రనేతలంతా దూరంగానే ఉండటంతో టీడీపీ ఒంటరిపోరు సాగించింది. కా పోతే మంచిర్యాల వంటి నియోజకవర్గాల్లో సిపిఐ అనుబంధ ఏఐటియుసి మద్దతుగా నిలిచింది. ఇక కాంగ్రెస్‌ పార్టీ నుంచి సైతం ముఖ్యమంత్రి రోశయ్య కనిపించలేదు. మంత్రులే ఇన్చార్జి బాధ్యతలు పంచుకున్నారు. స్వయంగా డి.శ్రీనివాస్‌ నిజామా బాద్‌ అర్బన్‌ నుంచి పోటీ చేస్తుండ టంతో ఆయన అక్కడికే పరిమితమయ్యారు. ఆయనకు ఈ ఎన్ని కలు ప్రాణప్రతిష్ఠగా పరిణమించాయి. కాంగ్రెస్‌- టీడీపీ తెలంగాణవాదాన్ని బలంగా వినిపించి, అంతకుముందు వరకూ తమపై ఉన్న వ్యతిరేకత స్థానంలో సానుకూలత సంపాదించుకున్నాయి.  అయితే, ప్రధాన పార్టీగా బరిలో ఉన్న టీఆర్‌ ఎస్‌కు మద్దతుగా నామినేషన్లు వేసిన స్వతంత్ర అభ్యర్ధులే అందరినీ ఆకర్షిస్తున్నారు. ప్రధాన పార్టీలకు ఆందోళన కలిగి స్తున్నారు. వీరంతా సాంకేతికంగా టీఆర్‌ఎస్‌కు మద్దతుగా బ్యాలెట్‌ పేపర్ల కోసం నామినేషన్లు వేశారు. అయితే, వీరు ప్రచారం చేయకపోయినప్పటికీ కనీసం స్థానికంగా వారికున్న కొద్దో గొప్పో పేరు, బంధుగణాలు ఓట్లు వేసినా ఓట్లు చీలి ప్రధాన పార్టీల కొంప మునిగే ప్రమాదం ఉంది. మొత్తం 5 నియోజకవర్గాల్లో 60 మందికి మించి నామినేషన్లు వేశారు.  ఎల్లారెడ్డిలో 75 మంది, కోరుట్లలో 67 మంది, సిరిసిల్లలో 78 మంది, హుజూరాబాద్‌లో 69 మంది, వరంగల్‌ వెస్ట్‌లో 74 మంది స్వతంత్రులు బరిలో నిలిచారు. బ్యాలెట్‌ వల్ల ఏర్పడే గందరగోళం వల్ల.. వీరిలో ఒక్కొక్కరు హీనపక్షం వంద ఓట్లు చీల్చినా ప్రధాన పార్టీల పుట్టి మునిగిపోవడం ఖాయం.  మరోవైపు.. బ్యాలెట్‌ పోరు జరిగే నియోజక వర్గాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని కాంక్షిస్తున్న తెలంగాణ ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, సామాజిక సంఘాలు బ్యాలెట్‌పై జై తెలంగాణ రాసి, తమ డిమాండును యుపిఏ సర్కారు దృష్టికి తీసుకు వెళ్లాలని నిర్ణయించాయి. దీని వల్ల ఎవరి పుట్టి మునుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. బ్యాలెట్‌ యుద్ధం జరిగే నియోజకవర్గాల్లో పొలింగ్‌ శాతం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్కో నియోజకవర్గంలో 60 మందికిపైన అభ్య ర్థులు ఉన్నందున, బ్యాలెట్‌ పేపరు సైజుగా పెద్దదిగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఓటరు తమకు కావ లసిన అభ్యర్థిని తెలుసుకుని, ఓటుహక్కు వినియో గించుకునేందుకు కనీసం పది నిమిషాలు పట్టే అవ కాశం ఉంది. దీనివల్ల ఓటింగ్‌ గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ప్రధాని దగ్గర పెద్దన్నలు పేద అరుపులు – సాంకేతి విషయాలు తెలియవు ప్రధాని సమాధానం

pm-all
రాష్ర్ట నాయకులు అఖిల పక్షంగా వెళ్ళి కేంద్రం మెడలు వంచి బాబ్లీపై రాష్ర్టానికి జరుగుతున్న అన్యాయన్ని ఆపుతారని అనుకున్న రాష్ర్ట ప్రజలకు మరోసారి అవమానం ఎదురైంది.. అఖిల పక్షంగా వెళ్ళిన రాష్ర్ట పెద్దన్నలు ప్రధాని ముందు పేద అరుపులు అరవడానికే సరిపోయింది.. అయితే పేద అరుపులు విన్న ప్రధాని చాలా రిలాక్స్‌గా నాకు సాంకేతిక సమస్యలు తెలియవు తెలుసుకుంటానని తెలపడం అత్యంత హాస్యా స్పదం.  రెండు రాష్ర్టాల మధ్య ఇంత పెద్ద ఎత్తున జల వివాదం తలెత్తి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ర్ట ప్రదాన ప్రతి పక్ష నేత మహారాష్ర్ట అరెస్టు, లాఠీ చార్జి జరిగిన తరువాత కూడా ఇంకా ప్రధాని సాంకేతిక సమస్యలు తెలియవని కుంటి సాకులతో సమాధానం ఇవ్వడం ఎంతో హాస్యస్పాదం.  దీన్ని బట్టి కేంద్రం ఆంధ్ర ప్రదేశ్‌పై ప్రభుత్వానికి ఎంత చిత్తశుధ్ది వుందనేది ఇట్టే అర్థం మవుతుంది.. అయితే మన పెద్దన్నలు ఈ విషయాన్ని ఎక్కడ కనపడకుండా మీడియా ముందు చంకలు గుద్దుకున్నారు.  వారి మాటల్లో..   “ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ బాబ్లీ సమస్యను సావధానంగా విన్నారు. సమస్య పరిష్కారానికి ఆయన చిత్తశుద్ధితో కృషి చేస్తారనే విశ్వాసం నాకుంది” – ముఖ్యమంత్రి రోశయ్య
బాబ్లీపై కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. ప్రధాని నిర్దిష్టమైన హామీ ఇవ్వలేదు. కార్యాచరణ ప్రకటించలేదు. – చంద్రబాబు, తెలుగుదేశం
బాబ్లీ సమస్యను ప్రధాని సీరియస్‌గా తీసుకున్నారు. ఆయనతో సమావేశం సంతృప్తికరంగా జరిగింది. – చిరంజీవి, ప్రజారాజ్యం
బాబ్లీని రాజకీయంగానే పరిష్కరించాలని ప్రధానిని కోరాం. ప్రధాని స్పందించిన తీరు అసంతృప్తి కలిగించింది. – నారాయణ, సీపీఐ
కృష్ణా, గోదావరి జలాల వినియోగంపై చట్టబద్ధ సంస్థ ఏర్పాటు చేయాలని కోరాం. దీనిపై ప్రధాని సానుకూలంగా స్పందించారు. – వినోద్ కుమార్, టీఆర్ఎస్
ప్రధానికి సమస్య తీవ్రత అర్థమైంది. సమాఖ్య వ్యవస్థలో ఏ ప్రధానీ ఒక్క రోజులో సమస్యను పరిష్కరించలేరు. – జయప్రకాశ్ నారాయణ్, లోక్‌సత్తా
బాబ్లీ ప్రాజెక్టుపై కేంద్రం ముందు అఖిలపక్షం ఒకే మాట వినిపించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ అమర్చిన బాబ్లీ గేట్లను బద్దలు కొట్టాలని కోరింది. మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్టులు అడ్డుకోవాలని మొరపెట్టుకుంది. దిగువ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రధాని మన్మోహన్ దృష్టికి తెచ్చింది.
సమస్య పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని, వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని విన్నవించింది. బాబ్లీపై ముఖ్యమంత్రి రోశయ్య నేతృత్వంలో అన్ని రాజకీయ పార్టీల నేతలు సోమవారం ప్రధాని మన్మోహన్‌ను కలిశారు. గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ, 13 ఇతర ప్రాజెక్టులను నిలిపివేయకపోతే… ఉత్తర తెలంగాణలో లక్షలాది ఎకరాలు ఎడారిగా మారతాయని తెలిపారు.
మహారాష్ట్ర అక్రమాలను వివరిస్తూ 14 పేజీల వినతి పత్రాన్ని ప్రధానికి సమర్పించారు. “సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టుకు గేట్లు అమర్చింది. ఎలాంటిఅనుమతులు లేకుండానే గోదావరి 13 ఇతర ప్రాజెక్టులు నిర్మిస్తోంది.
ఇలాంటి అక్రమాలు అడ్డుకోవాలన్నా, భవిష్యత్తులో నీటి యుద్ధాలు జరగకుండా ఉండాలన్నా ఒక బలమైన రాజ్యాంగబద్ధమైన నియంత్రణ సంస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాలి” అని వినతిపత్రంలో కోరారు. కృష్ణా, గోదావరి నదులకు అత్యంత దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ జల ప్రయోజనాలను కాపాడేందుకు వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని ప్రధానిని కోరారు.
ముఖ్యమంత్రితోపాటు తొమ్మిది పార్టీల నేతలు మహారాష్ట్ర వైఖరిని ముక్తకంఠంతో ఖండించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ రాజ్యాంగానికి అతీతమైనట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ పరిస్థితుల్లో తామేమీ చేయలేమంటూ కేంద్ర జలవనరుల మంత్రి పవన్ కుమార్ బన్సల్ వ్యాఖ్యానించడం సరి కాదని రోశయ్య ప్రధానికి ఫిర్యాదు చేశారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి నిల్వ పరిధిలోనే బాబ్లీ ప్రాజెక్టు నిర్మిస్తున్న విషయాన్ని నేతలు ప్రధాని దృష్టికి తెచ్చారు. అయితే… ప్రధానమంత్రి నుంచి ఈ విషయంలో నిర్దిష్టమైన హామీ ఏమీ లభించలేదు. ఈ విషయంలో సాంకేతికాంశాలపై కేంద్ర జల సంఘం, జల మంత్రిత్వ శాఖ అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేస్తానన్నారు.
“సమాఖ్య వ్యవస్థలో చర్చల ద్వారా పరిష్కారం సాధ్యమే. నన్ను ఆలోచించుకోనివ్వండి” అని కోరారు. ప్రధాని హామీ పట్ల ముఖ్యమంత్రితోపాటు మరికొందరు ప్రతిపక్ష నేతలు విశ్వాసం ప్రకటించారు. అయితే… సమస్య పరిష్కారానికి నిర్ణీత కాలపరిమితిని చెప్పకపోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబుతీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇలాంటి హామీలు ఇచ్చి నెరవేర్చలేదని ఆయన అన్నారు.
ప్రధాని నిర్దిష్టమైన హామీ ఇవ్వనప్పటికీ ఆయన స మస్యను సానుకూలంగా విన్నారని, పరిష్కారం కోసం వేచి చూడడం మంచిదని ఇతర పార్టీ నేతలు చెప్పారు. ప్రధాని నివాసంలో సుమారు 45 నిమిషాలపాటు ఈ సమావేశం జరిగింది. ప్రధానితో భేటీ తర్వాత నేతలు విలేఖరులతో మాట్లాడారు. తా ము చెప్పి విషయాలు ప్రధాని సావధానంగా విన్నారని దాదా పు అందరు నేతలు చెప్పారు.

సేవా టిక్కెట్ల అక్రమాలపై విచారణ – విజిలెన్స్‌ డిజి దినేష్‌ రెడ్డి

Dinesh
ఏడుకొండల స్వామి వారి ఆర్జిత సేవా టిక్కెట్ల ను అక్రమాలకు పాల్ప డిన ఎంతటి వారైనను ఉపేక్షించేది లేదని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌బ మెంట్‌ టాస్క్‌ఫోర్స్‌ డిజిపి దినేష్‌రెడ్డి తెలిపారు. ఆర్జిత సేవాటిక్కెట్ల అక్రమాలను రెండు రోజులపాటు తిరుమలలో విచారణ చేపట్టడానికి ఐజి అనూరాధ, డిఐజి హరీష్‌గు ప్తాతో కలిసి సోమవారం సాయం త్రం విచ్చేశారు. ఈ సందర్భంగా పోలీసు గెస్ట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ కేసు పురోగతిని వెల్లడించారు. స్వామి వారి దర్శనం ఆర్జిత సేవా టిక్కెట్లు ముందస్తు బుకింగ్‌లో భారీ స్థాయిలో అవకతవకలు, అక్రమాలతోపాటు ఉద్దేశపూర్వ కంగా ఉద్యోగులు, బయట వ్యక్తులు, పెద్దలు నేరాలకు పాల్పడ్డారని చెప్పారు.
ఎంతటి పెద్దలైనా వదిలే ప్రసక్తి లేద ని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి, టిటిడికి తాము సిఫార్సు చేస్తున్నామని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థ అయిన టిటిడిలో అక్ర మాలకు పాల్పడిన ఉద్యోగులపై శాఖా పరమైన చర్యలతోపాటు కఠిన చర్య లు తీసుకోవాలని, అక్రమాలకు కార కులైన ప్రైవేటు వ్యక్తులపై క్రిమినల్‌ కేసులు పెట్టవల్సినవసరం ఉందని ఆయన అన్నారు. ఒకే వ్యక్తి 160 నుంచి 170 టిక్కెట్లు అడ్వాన్సు రిజర్వే షన్‌ చేసుకో వడం వలన అక్రమ మార్గంలో ధన పంపిణి కాక, నిజమైన భక్తులు ఆర్జిత సేవా టిక్కెట్లను పొందడం దుర్లభంగా మారిందన్నారు. 60, 70 ఏళ్ల వర కు ఒకే పర్యాయం టిక్కెట్లను అడ్వాన్సు బుకింగ్‌ చేయిం చుకోవడం వెనుక తెలివైన నేర ప్రవృత్తి దాగుందన్నారు. ప్రభుత్వానికి ఆర్జిత సేవాటిక్కెట్ల కుంభకోణంపై నివేదికను మరో 15 రోజుల్లో సమర్పించనున్నట్లు ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

బాబ్లీ నిర్మాణం అపాలని పార్లమెంట్‌ ఆవరణలో టీడీపీ ధర్నా

nirasana

బాబ్లీ నిర్మాణాన్ని ఆపాలంటూ మహా రాష్టక్రు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు పార్లమెంటు ఆవర ణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. మహా రాష్ట్ర డౌన్‌డౌన్‌, పీఎమ్‌ జోక్యం చేసుకోవాలి, రోకో.. రోకో..బాబ్లీ రోకో.. అంటూ నినదిం చారు. పార్లమెంటుల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమైన నేపథ్యంలో తెలుగుదేశం పార్ల మెంటరీ నాయకుడు నామా నాగేశ్వ రరావు నాయకత్వంలో దేశం నేతలు ప్లకార్డులతో గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.
ధర్నాలో మాజీ పార్లమెంటు సభ్యులు ఎర్రం నాయు డుతో సహా ఎం.పి.లు సుధారాణి, సుజనాచౌదరి, శివప్రసాద్‌, నారాయ ణరావు, వేణుగోపాలరెడ్డి, నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్యే దయాకరరావు లు ఉదయం 10.30 గంటల ప్రాంతం లో కొంత సేపు ధర్నా చేసిన అనంత రం లోకసభ స్పీకర్‌ శ్రీమతి మీరాకు మార్‌ వద్దకు వెళ్ళి మహారాష్ట్ర పోలీసు లు తమ పట్ల అనుచితంగా ప్రవర్తిం చారని ఫిర్యాదు చేశారు. నామా నాగే శ్వరరావు తన వీపుపై మహారాష్ట్ర పోలీసులు కొట్టిన దెబ్బలను, వాటి తాలూకు ఫొటోలను చూపించారు. తాము పార్లమెంటు సభ్యులమని చెప్పినా పోలీసులు వినిపించుకో కుండా లాఠీలు ఝులిపించారని ఫి ర్యాదు చేశారు. స్పీకర్‌ వారి ఫిర్యా దును హక్కుల ఉల్లంఘన విభాగాని కి పంపించారని తెలిసింది.
బాబును కలిసిన దేవెగౌడ, తంబిదొరై..
కాగా దేశం అధ్యక్షుడు ఉదయం పార్లమెంటులోని దేశం పార్లమెంటరీ సభ్యుల కార్యాలయంలో కొంత సేపు గడిపారు. ఆ సమయంలో మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ, తమిళనా డుకు చెందిన ఎం.పి.తంబిదొరై ఆయనను కలిసారు. ఈ సందర్భం గా బాబు, మహారాష్ట్ర ప్రభుత్వం అక్ర మంగా నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టు గు రించి, సుప్రీకోర్టు ఆదేశాలిచ్చినా బేఖాతరు చేసిన విష యాన్ని వివరించారు. ఇటీవల తమ బృందం బాబ్లీ సంద ర్శనకై వెళ్తే మహారాష్ట్ర పోలీసులు తమపై లాఠీలు ఝలి పించిన వైనాన్ని వారికి వివరించారు. అంతరాష్ట్ర జల వివా దాల గురించి ఒప్పందాలున్నా, ఎగువనున్న రాష్ట్రాలు వాటి ని ఉల్లంఘిస్తున్నాయని, దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని, ఇందుకు అన్ని ప్రతిపక్ష పార్టీలు చొరవ తీసు కోవాలని కోరారు.
శరద్‌యాదవ్‌, ప్రకాశ్‌ కారత్‌ను కలిసిన బాబు..
జనతాదల్‌(యు) అధ్యక్షుడు శరద్‌ యాదవ్‌ను, సీపీఐ (ఎం) కార్యదర్శి ప్రకాశ్‌ కారత్‌ను చంద్రబాబు వేరు వేరు గా కలుసుకున్నారు. వారికి మహారాష్ట్ర అక్రమంగా కడు తున్న బాబ్లీ, ఇతర ప్రాజెక్టుల గురించి వివరించారు. బాబ్లీ సందర్శనకు వెళ్లిన సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును వివరించారు. బాబ్లీ, తదితర అక్రమ ప్రాజెక్టుల విషయంలో సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరించి మహారాష్ట్ర చేస్తున్న ఆగడంతో తెలంగాణ ప్రాం తం ఎడారిగా మారనున్నదని, తెలుగుదేశం పార్టీ న్యాయం లభించేవరకు పోరాటం ఆపదని, అందుకు జాతీ య స్థాయిలో ప్రతిపక్షాల మద్దతు కావాలని కోరారు.
బన్సల్‌ ఆ పదవిలో ఎందుకు?
మహారాష్ట్ర మితిమీరిన ఆగడాలను నియంత్రించలేనపుడు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి పి.కె.బన్సల్‌కు ఆ పదవి లో కొనసాగేందుకు అనర్హుడని సీపీఐ కార్యదర్శి నారాయ ణ విమర్శించారు. ‘మంత్రిపదవి ఇచ్చింది ఆయనకు గోళ్లు గిల్లుకోవడానికా?’ అంటూ ఎద్దేవా చేశారు. అఖిలపక్షం సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ విచ్చేసిన నారాయణ ఏపీ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు.

ఎవరికి వారే – చీలిపోయిన అఖిలపక్షం

babu-walk
బాబ్లీ వివాదం మీద ఢిల్లీకి వెళ్లిన అఖిల పక్షం ప్రధాని సమక్షంలో రెండుగా చీలింది. సోమ వారం ముఖ్యమంత్రి రోశయ్య నేతృత్వంలో టీడీపీ మినహా మిగిలిన అన్ని పార్టీలు ఒకేసా రి వెళ్లగా, టీడీపీ అధినేత చంద్రబాబునాయు డు మాత్రం విడిగా వెళ్లారు. అంతా కలసి సా యంత్రం ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో సమా వేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి రోశయ్య నేతృత్వంలో అఖిల పక్ష ప్రతినిధి బృందం సభ్యులతో ప్రధాన మంత్రి ముప్పా వు గంట సేపు భేటీ అయ్యారు. ఈ వివాదం అతి సున్నితమయినందున, తాను సాంకేతిక నిపుణులతో చర్చించి విషయ అవగాహనకు రావాల్సి ఉందని, ఆ తర్వాత అతిత్వరలోనే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి కూర్చుని, చర్చించి, పరిష్కారం కనుగొంటామని మన్మోహన్‌సింగ్‌ వారికి హామీ ఇచ్చారు. సీడబ్ల్యుసీని కూడా సంప్రదిస్తామన్నారు.  అయితే, వారితో ఎప్పుడు భేటీ అవుతామన్న విషయాన్ని మాత్రం నిర్దిష్టంగా హామీ ఇవ్వక పోవడం వల్ల, అఖిలపక్ష సమావేశం వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఈ భేటీలో ఏం జరగబోతోందో ‘సూర్య’లో గత రెండు రోజుల క్రితం ‘బాబ్లీ ఓ డ్రామా’ అన్న శీర్షికతో వార్తా కథనం వెలువడిన విష యం తెలిసిందే. సోమవారం నాడు సరిగ్గా అదే జరగడం విశేషం. ఈ జల వివాదం చర్చల ద్వారానే దీన్ని పరిష్కరించుకోవాలని ప్రధాని పేర్కొనడం బట్టి, మహారాష్ట్ర కాంగ్రెస్‌ సర్కారుపై ఒత్తిడి చేసే ఉద్దేశం ప్రధానికి లేన ట్లు స్పష్టమయింది.  సమావేశానికి హాజరయి న ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విడిగా విస్తృతమైన ని వేదికను ప్రధానికి సమర్పించారు. మిగిలిన వారికంటే చంద్రబాబే ప్రధానితో బాబ్లీపై సుదీ ర్ఘంగా మాట్లాడి, ఉత్తర తెలంగాణకు జరుగు తున్న అన్యాయాన్ని వివరించారు. లోపల ప్ర ధాని వద్ద కూడా బాబు ఘాటుగా మాట్లాడా రు. మీరు చర్యలు తీసుకునేలోగా వాళ్లు మొ త్తం గేట్లు కట్టేస్తారని, వాటిని ధ్వంసం చేయా లని డిమాండ్‌ చేశారు. దానితో స్పందించిన ప్రధాని తాను ఇద్దరు ముఖ్యమంత్రులతో స మావేశం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అఖిల పక్షం ముక్త కంఠంతో బాబ్లీ నుంచి తెలంగాణా జిల్లాలను రక్షించాలని కోరారు.
ప్రధాని వారి సూచనలు, డిమాండ్లను సావ ధానంగా విన్నారు. ప్రధాని హామీ పట్ల టీడీపీ, సీపీఐ, సీపీఎం మినహా అన్ని పార్టీలూ సంతృ ప్తి వ్యక్తం చేశారు.అయితే, బాబ్లీపై ఢిల్లీకి వెళ్లిన అఖిలపక్షం నేతలు రెండుగా చీలిపోయినట్లు స్పష్టంగా కనిపించింది. ప్రధానితో సమావేశం ముగిశా క, ముఖ్యమంత్రితో పాటు అన్ని పార్టీల నాయకులు మీడియా ముందుకొచ్చి సమావే శం వివరాలను వెల్లడించగా, తెలుగు దేశం అధినేత చంద్రబాబు మాత్రం వీరితో కలవలే దు. తొలుత ముఖ్యమంత్రి రోశయ్య మీడి యాతో మాట్లాడుతూ, ప్రధాని త్వరలోనే రెం డు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పినట్లు వివరించారు.
ఆయన అందరి సూచనలనూ సావధానంగా విన్నారని చెప్పారు. సమావేశం పూర్తి సంతృ ప్తికరంగా సాగిందన్నారు. మధ్యలో మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలకు రోశయ్య అస హనం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ నేత వినోద్‌ కుమార్‌ మాట్లాడారు. ఆయన కూడా ప్రధా నితో సమావేశం తమకు సంతృప్తి నిచ్చిందని చెప్పారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ అధి నేత చిరంజీవి మాట్లాడారు. ఆయనయితే రోశయ్యకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుం డా మాట్లాడారు. ప్రధానితో తమ చర్చలు పూ ర్తి సంతృప్తిని ఇచ్చాయని ప్రభుత్వానికి అండ గా నిలిచే విధంగా మాట్లాడారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ ప్రధానితో చర్చలు అసంతృప్తి కలిగించిందని, నిర్దిష్ట హామీ ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. అయితే, గతంలో కంటే కొంత మెరుగుగా ప్రధాని స్పందించారని చెప్పారు.
సీపీఐ నేత జూలకం టి రంగారెడ్డి కూడా ప్రధాని వైఖరి సంతృప్తి కలిగింలేదని, సమస్య పరిష్కారం కోసం ఉద్యమిస్తామని ప్రధాని సమక్షంలోనే చెప్పా రు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విడి గా విలేకరులతో మాట్లాడారు. ఆయన మాత్రం ఆవేశంగానే కనిపించారు. ప్రధాని సమాధానానికి ఆయన తీవ్ర అసంతృప్తి వ్య క్తం చేశారు. ప్రధాని వైఖరి సందేహాస్పదంగా ఉందని, సమస్య పరిష్కారానికి ఆయన చిత్త శుద్ధితో వ్యవహరించగలరన్న నమ్మకం తమ కు కలగలేదని అన్నారు. 2007లోనూ ప్రధాని ఇలాగే చెప్పారని, ఆయన నిర్దిష్ట సమాధానం ఇవ్వలేదని పెదవి విరిచారు.
ప్ర ధాని స్పందించాల్సిన రీతిలో స్పందించలేదని, ఆయనలో ఫెడరల్‌ స్ఫూర్తి కనిపించడం లేదని ధ్వజమెత్తారు. ఢిల్లీలో కనిపించిన దృశ్యాలు, రాజకీయ పక్షాలు వాదించిన తీరు పరిశీలిస్తే ఒక్క తెలుగుదేశం, సీపీఐ, సీపీఎం మినహా మిగతా పక్షాలన్నీ ప్రభుత్వానికి మిత్ర పక్షాలుగా కనిపించాయన్న వ్యాఖ్యలు వినిపిం చాయి. ప్రధాని సమావేశంతో సంతృప్తి చెం దారా అని విలేకరులు ముఖ్యమంత్రిని ఉద్దే శించి అడిగినప్పుడు రోశయ్య కాస్త తటపటా యింపుగా చూస్తుండగా, వెంటనే పక్కనే ఉన్న చిరంజీవి కల్పించుకుని.. అవును.. సంతృప్తి చెందాం.. అని సీఎంకు అండగా నిలిచారు. వెంటనే రోశయ్య అందుకుని దానినే పునరు ద్ఘాటించారు.
ముఖ్యంగా చిరంజీవి పాలక కాంగ్రెస్‌ పార్టీకి అత్యంత మిత్రపక్షంగా వ్యవ హరిస్తున్నట్లు కనిపించేందుకు తహతహలా డారనిపిం చింది. ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుని నుంచి అఖిల పక్షం మీద ప్రతికూల స్పందన రాలే దు. కాంగ్రెస్‌ నేతృత్వంలో అఖిల పక్షం ఒక వైపు, ప్రతిపక్షం మరోవైపు మోహరించి ప్రధాని సమావేశానికి వెళ్లాయి. లోపల కూ డా అదేరీతిలో వ్యవహరించాయి. లోపల చంద్రబాబు, నారాయణ ఇద్దరే నిష్కర్షగా, ఘాటు గా మాట్లాడినట్లు సమాచా రం. ప్రధాని వైఖరి రాష్ట్ర ప్రయోజనాలకు ఏ మాత్రం సానుకూ లంగా లేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమ యింది. మహారాష్ట్ర ప్రభుత్వ దౌర్జన్యాలను ప్రధాని ఖండించడం గానీ, అది అన్యా యమ ని గానీ ఎక్కడా వ్యాఖ్యానించక పోవడం, పైగా తాను సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌తో మాట్లాడ తానని చెప్పడం చూస్తే బాబ్లీపై మొత్తం గేట్లు పూర్తి చేసేవరకూ ప్రధాని ఎలాంటి చర్యలు తీసుకోబోరని స్పష్టమవు తూనే ఉంది.

మా నాన్న చనిపోతే… పండగ చేసుకున్నారు

27.01
అందరికీ కొండంత అండగా ఉండే నాన్నపోతే కొంతమంది ఆయన వ్యతిరేకులు సంబర పడ్డారని స్వర్గీయ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తనయుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఆయన వ్యతిరేకులపై గళమెత్తారు. తూర్పుగోదావరి జిల్లాలో 14వ రోజు ఓదార్పు యాత్ర కోనసీమలో ముమ్మిడివరం నియోజకవర్గంలో సాగుతున్నది. గత మూడు రోజులుగా ఆయన అస్వస్థతలో ఉన్నా యాత్రకు విరామమివ్వాలని సూచించినా జగన్‌ మాత్రం ఓదార్పు యాత్రనే కొనసాగిస్తున్నారు. ఓప్రక్క వర్షం, మరోప్రక్క అభిమానుల హోరు ఆ పై జ్వరం ఇవన్నీ జగన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆయనతోపాటు ఆయన వెన్నంటి ఉన్న వారి పరిస్థితి సైతం అదేవిధంగా ఉంది.  అయినా జగన్‌ పర్యటనకుదించడంలేదు. ఆదివారం రాత్రి ముమ్మిడివరంలో ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ ఇంట్లో విరామం తీసుకున్న జగన్‌కు కాకినాడ నుంచి వెళ్ళిన వైద్యులు చికిత్సలు చేశారు. అభిమానుల ఆలింగనలు ముఖ్యంగా కరచాలనంతో చేయి గీరుకు పోవడంతో చేతికి కట్టుకట్టే పరిస్థితి ఎదురైంది. అదే పరిస్థితిలో ఆయన సోమ వారం యాత్ర మొదలుపెట్టారు. ఆదివారం రాత్రి అనారోగ్యంతో కొన్ని ప్రాంతా లకు వెళ్ళలేకపోయారు. ఆ ప్రాంతాలన్నీ సోమవారం తిరగడం మొదలు పెట్టారు. జిల్లాలో 12వ తేదీన అడుగుపెట్టిన ఆయన ఎటువంటి ఆవేశకావేశా లకు లోనుకావడంలేదు.  ఆయన సన్నిహితుడు రాంబాబును సస్పెండ్‌ చేసిన సమయంలో సైతం ఆవేదన వ్యక్తం చేశారనే గాని ఆవేశ పడలేదు. ఇక యాత్ర సాగినంత కాలం ఇలా మౌన రాగంతోనే వెళుతుందని భావించారు. అధిష్టానం ఏం చేసినా ఆయన పెదవి విప్పడంలేదు. అయితే ఎందుకో ఆయనకు పల్లం కుర్రు అనే గ్రామంలో కాంగ్రెస్‌ పెద్దలపై చిర్రెత్తుకొచ్చింది. నాన్నపోతే నాకు అండాదండా లేకుండా పోతుందని నా ప్రత్యర్థులు సంబరాలు జరుపుకున్నారు. పండుగ చేసుకున్నారని జగన్‌ ధ్వజమెత్తారు. ఓదార్పులో నాకు ఇంత అండ దండలు లభించడం చూసి వారు గుండెలు బాదుకుంటున్నారని జగన్‌ తిరిగి గళమెత్తారు.  ఆకస్మికంగా ఇలా కాంగ్రెస్‌లో ఆయన వ్యతిరేకులపై గళం విప్ప డంలో ఆంతర్యం ఏమిటో అంటూ ఆయన అనుచరులు మల్లగుల్లాలు పడుతు న్నారు. ఇప్పటికే యాత్ర ఈ నెల 28వ తేదీన ముగించాలని భావించారు. అయితే మరో రోజు 29 వరకు యాత్రను పొడిగించారు. ఆ రోజు కాకినాడలో భారీ జనం మధ్య జగన్‌ ఓదార్పు యాత్రకు ముగింపివ్వాలని ఆయన సన్నిహితులు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి వ్యూహంతో ఉన్నారు. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్‌ను అభిమానించే ఎమ్మెల్యేలను కాకినాడకు రప్పించే అవకాశలున్నట్లు తెలుస్తున్నది. అవసరమైతే 30వ తేదీన కూడా జగన్‌ కాకినాడలోనే బసచేసి కోర్‌ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తారని తెలుస్తుంది. మొత్తం యాత్రలో కీలక పాత్ర పోషిస్తున్న మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీనిపై కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తుంది. సుమారు 25 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు చివరి రోజు కాకినాడ చేరుకుంటారని తెలుస్తుంది.

రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు

22.01
రాష్ట్రంలో కరువు తీరా వర్షం కురుస్తోంది. నైరుతి రుతుపవనాలకు అల్పపీడన ద్రోణి తోడవడంతో గత 3రోజులుగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. ఫలితంగా ఈ సీజన్‌లో ఇప్పటికి సాధారణం కంటే 27 శాతం ఎక్కువ వర్షం నమోదైంది.  రాష్ట్రంలో జూన్ 1 నుంచి జూలై 26 వరకు సగటున 268.9 మిల్లీమీటర్ల వర్షం కురవాలి. అయితే, ఈ సారి రికార్డు స్థాయిలో 341 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. సోమవారం నాటికి సాధారణం కంటే.. రాయలసీమలో 52 శాతం, కోస్తాంధ్రలో 48 శాతం, తెలంగాణలో 10 శాతం ఎక్కువ వర్షం కురిసింది. 17 జిల్లాల్లో సాధారణం కంటే 20 శాతం అధికంగా వానలు పడ్డాయి.  ఈ జాబితాలో గుంటూరు(75.8 శా తం), హైదరాబాద్(74.2), కర్నూలు(62), ప్రకాశం(59.3), చిత్తూరు(55.1), కడప(55), కృష్ణా(54.1), విశాఖపట్నం(52.5), నెల్లూరు (51.5), విజయనగరం(49.5), తూర్పుగోదావరి(49.3), రంగారెడ్డి(47.1), ఖమ్మం(42.2), పశ్చిమ గోదావరి(40.4), అనంతపురం(35.5), మహబూబ్‌నగర్(32.8), వరంగల్(30.2 శాతం) జిల్లాలు ఉన్నాయి.  అలాగే, నల్లగొండ, మెదక్, శ్రీకాకుళం, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో సాధారణ వర్షం నమోదైంది. ఒక్క ఆదిలాబాద్ జిల్లాల్లో మాత్రం లోటు వర్షం ఉంది. కరువు తీరా వర్షం కురుస్తుండడంతో రాష్ట్రంలో వ్యవసాయ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.  వరంగల్, ఖమ్మం తదితర జిల్లాల్లో ఎడతెరిపి లేని వానల వల్ల వ్యవసాయ పనులు చేపట్టేందుకూ కూడా రైతులకు సమయం చిక్కడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా మెట్టపంటల సాగు దాదాపు పూర్తి కావొచ్చింది. అటు చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు కూడా కళకళలాడుతున్నాయి. దీంతో వరి సాగు ఊపందుకుంటోంది.
దేశమంతటా సమృద్ధిగా వర్షాలు..
మధ్యప్రదేశ్, దక్షిణ ఉత్తరప్రదేశ్, పశ్చిమ జార్ఖండ్, బీహార్ మినహా ఈ ఏడాది దేశమంతటా సంతృప్తికరమైన వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలు దేశం మొత్తం విస్తరించిన తరువాత రాజస్థాన్‌లోని గంగానగర్ నుంచి బంగాళాఖాతం ముఖ ద్వారం (హెడ్‌బే) వరకు ఉండే రుతుపవన ద్రోణి బలపడి వాయుగుండంగా మారుతుంది.  అయితే ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్క వాయుగుండం కూడా లేకపోయినప్పటికీ నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడంతో విస్తారంగా వర్షాలు కురిశాయని వాతావరణ నిపుణుడు ఆచార్య భానుకుమార్ తెలిపారు. రుతుపవనాలు చురుగ్గా ఉంటూ వర్షాలు విస్తారంగా కురవడానికి ‘లానినా’ ప్రభావమేనని భానుకుమార్ వెల్లడించారు.
గత ఏడాది అక్టోబర్ నుంచి 2010 జనవరి వరకు ‘ఎల్‌నినో’ పరిస్థితులు కొనసాగినప్పటికీ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఒక్కసారిగా ‘లానినా’ ప్రభావం కనిపించిందన్నారు. భూమధ్యరేఖ సమీపాన ఫసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగైదు డిగ్రీలు తక్కువగా ఉంటే ‘లానినా’ పరిస్థితులు ఏర్పడతాయని చెప్పారు.
సీఎం హర్షం
రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురవటంపై ముఖ్యమంత్రి రోశయ్య హర్షం వ్యక్తం చేశారు. భారీ వర్షాల వల్ల ఏర్పడిన పరిస్థితుల నుంచి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం విపత్తుల నిర్వహణ కమిషనర్ టి.రాధను, జిల్లాల కలెక్టర్లను కోరారు. ఆయన ఢిల్లీ నుంచే టెలికాన్ఫరెన్స్ ద్వారా వీరితో మాట్లాడి తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

వివేకా ఆరోపణలో లేకితనం – రాఘవులు

b-v-raghavulu
తనపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి చేసిన ఆరోపణలో లేకితనం కనిపిస్తోందే తప్ప పసలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు అన్నారు. రాఘవులు మందు తాగడం కోసమే నెల్లూరు వస్తుంటారని ఆనం చేసిన వ్యాఖ్యలపై ఆయన ఇలా స్పందించారు.
‘నేను ఏ హోటల్‌లో.. ఏ బ్రాండ్ తాగానో ఆయ న్నే అడగాలి. ఏ అలవాట్లు లేని నన్ను అడిగితే కృత్రిమంగా సృష్టించి చెప్పలేను కదా?’ అన్నారు. కాగా.. నెల్లూరు రూరల్ మండలం కొత్తూరు గ్రామంలో వైఎస్ఆర్ నగర్ ఇందిరమ్మ ఇళ్ల పథకంలో జరిగిన అవినీతి, అవకతవకలపైన విచారణకు ఆదేశించాలని కోరుతూ సీఎంకు సోమవారం రాఘవులు లేఖ రాశారు.