కడప
పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లె గ్రామంలో ఈ నెల 22వ తేదీన ఆ గ్రామానికి చెందిన తలారీ అప్పన్న(56) హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు సంబంధించి అదే గ్రామానికి చెందిన సంపంగి వెంకటరమణను సోమవారం లింగాల మండలం చిన్నకుడాల గ్రామం వద్ద అరెస్టు చేసి అతని వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కొడవలిని స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ ఖలీల్ సౌదాగర్ తెలిపారు. సోమవారం మద్యాహ్నం పోలీసు స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో హత్య కేసు నిందితుడు సంపంగి వెంకటరమణను విలేకరుల ముందు హాజరుపరిచారు.
ఈ సందర్బంగా డిఎస్పీ ఖలీల్ మాట్లాడుతూ సంపంగి వెంకటరమణ ఈ నెల 22వ తేదీన అదే గ్రామానికి చెందిన తలారీ అప్పన్నను కొడవలితో విచక్షణారహితంగా నరికి చంపి అనంతరం పోలీసు స్టేషన్‌లో లొంగిపోయ్యారన్నారు. గత రెండు సంవత్సరాల క్రితం సంపంగి వెంకటరమణ కుమారుడు శివశంకర్ బెంగుళూరులో రైలు కిందపడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని, నా కుమారుడు ఆత్మహత్యకు తలారీ అప్పన్నే కారకుడని మనస్సులో పెట్టుకున్నాడని, అప్పన్న ఇంటిలో వంటి మనిషిగా పని చేస్తున్న మహిళను తన కుమారుడు ప్రేమించాడని, పెళ్లి చేసుకోవాలని కూడా బావించాడని, అయితే తన కుమారుడు బెంగుళూరులో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని, ఇందుకు అప్పన్నే కారకుడని, అంతేకాక తన ఇంటి సమీపాన ఖాళీ స్థలం వివాదం జరుగుతుండేదని, అదును చూసి అప్పన్నను హతమార్చాలని నిర్ఱయించుకొని ఎట్టకేలకు 22వ తేదీన అప్పన్న ఇంటి బయట కూర్చొని ఉండగా మచ్చుకత్తితో నరికి చంపాడని డిఎస్పీ తెలిపారు.
నిందితుడు సంపంగి వెంకటరమణ మాట్లాడుతూ తన కుమారుని మృతికి అప్పన్నే కారకుడని బావించి, అతన్ని హతమార్చేందుకు రెండు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నానని, ఎట్ట కేలకు ఈ నెల 18న అప్పన్న మంగంపేట నుంచి బ్రాహ్మణపల్లె గ్రామానికి వచ్చాడని, ఇదే అదునుగా బావించి అతన్ని హతమార్చేందుకు పథకం వేశానని, ఎట్టకేలకు 22వ తేదీన ఇంట్లో ఎవ్వరూ లేరని, ఇంటి బయట కూర్చొని ఉండగా ఇదే అదునుగా బావించి కొడవలితో అతనిపై దాడి చేసి హతమార్చి నా ప్రతీకారం తీర్చుకున్నానని వెంకటరమణ అన్నాడు. ఈ కార్యక్రమంలో సిఐ నాగరాజు యాదవ్, ఎస్‌ఐ పార్థసారదిరెడ్డి, పోలీసులు పాల్గొన్నారు. అనంతరం అతన్ని కోర్టుకు హాజరుపరచినట్లు డిఎస్పీ తెలిపారు.
తరతరాలుగా రాయలసీమకు అన్యాయమే జరుగుతోంది. ఇప్పటికైనా అందరూ కలిసి ఉండి నష్టపోవడం కంటే విడిపోయి బాగుపడడమే మంచిదని పలువురు వక్తలు అంటున్నారు. వై.ఎస్.ఆర్‌జిల్లా, చిత్తూరు, కర్నూల్, అనంతపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నాటకలోని రాయచూర్, కృష్ణగిరి, కోలార్, బళ్లారి, ఏలూరు జిల్లాలను కలిపి ప్రత్యేక రాయలసీమగా విడిపోతేనే అభివృద్ధి జరుగుతుందని, సమైఖ్యాంద్ర అంటూ కోస్తాలో కొనసాగితే జరిగిన నష్టంతో పాటు భవిష్యత్తులో మరింత వెనకబడి పోతాం. ఇతర బాషా ప్రయుక్త జాతుల్లో లాగా మనమంతా ఒక్కటేననే అబిప్రాయం తెలుగుజాతిలో మొదటి నుండి కొరవడిందనేది నగ్నసత్యం. అందుకే ఆంద్రులందరినీ సమీకరించాలని ఏర్పడిన ఆంధ్ర మహాసభకు ఆదిలోనే అంశపాదం ఎదురైంది.
రాయలసీమ పట్ల కోస్తా నాయకులకుండే సులకనబావాన్ని నిరసిస్తూ ఆంధ్రోద్యమంతో రాయలసీమ నాయకులు ఆనాడే తెగదెంపులు చేసుకున్నారు. రాయలసీమ జిల్లాలు కోస్తాలో కలిస్తే నష్టపోకతప్పదనే అభిప్రాయానికి సీమ వాసులు వచ్చారు. రాయలసీమ ప్రత్యేక రాష్ట్రంగా ఉండటమే క్షేమమని ప్రచారం చేస్తూ రాయలసీమ నాయకులు పత్రికలు, బహిరంగ సభల ద్వారా ప్రజలను అప్రమత్తం చేయడంతో ఆంధ్రోద్యమం బలహీనపడటం, బుజ్జగించిన ఫలించకపోవడం, చివరకు సీమ నాయకులు కోరే హామీలను లిఖిత పూర్వకంగా ఇచ్చి సంపూర్ణ అధికారంతో పట్టాభిసీతారామయ్య, కొండా వెంకటప్పయ్యలను ఆంధ్ర మహాసభలకు ఎంపిక చేశారు. 1937లో అప్పటి ఏకైక తెలుగు దినపత్రిక ఆంధ్రపత్రిక సంపాదకులు కాశీనాదుని నాగేశ్వరరావు సమక్షంలో కోస్తా, రాయలసీమ నాయకుల మద్య ఒక ఒప్పందం చేసుకున్నారు.ఆ ఒప్పందమే శ్రీబాగ్ ఒప్పందం.
1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజధాని కృష్ణా, గుంటూరుల మద్య ఉండాలని కొందరు, కర్నూల్ ఉండాలని రాయలసీమ నాయకులు కోరారు. ఈ రాజధాని ఏర్పాటుపై కోస్తా, రాయలసీమ నాయకుల మద్య అభిప్రాయ బేదాలు వచ్చాయి. అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు రాజధాని కర్నూల్‌లో ఉండేలా ప్రకటించారు. అనంతరం ఆయన సంజాయిసీ చెప్పుకొని హైదరాబాదుకు రాజధాని మారుతుందని చెప్పడంతో కోస్తా నాయకులు చల్లబడ్డారు. అంతేకాక నాగార్జున సాగర్ డ్యామ్ విషయంలో కూడా కర్నూల్, వై.ఎస్.ఆర్, చిత్తూరు, నెల్లూరు జిల్లాలో 13 లక్షల ఎకరాలకు నీటిని అందించే సిద్ధేశ్వరం ప్రాజెక్టు సెంటిమెంటు కారణంగా చేజారి పోయింది. కోస్తా ప్రాబల్యవర్గాలు కృష్ణా జలాలను దొంగిలించేందుకు తమిళనాడు చేసిన కుట్రగా నమ్మించి ఆ ప్రాజెక్టు కోసం నీరసించే వాతావరణాన్ని సృష్టించింది. ఈ కారణంగా సాగర్ వల్ల రాయలసీమకు ఎలాంటి మేలు జరుగలేదు.
ఇలాంటి కారణాలను గతంలోకి తొంగి చూస్తే కోస్తా, రాయలసీమలకు మద్య నిజాయితీ సంబంధాలు లేవు. 1983 వరకు రాష్ట్ర బడ్జెట్ పరిశీలిస్తే రాయలసీమ ద్వారా ప్రభుత్వ ఖజానాకు అందుతున్న ఆదాయం 22 శాతం కాగా, ఆ ప్రాంతానికి ఖర్చు చేసిన నిధులు ఏ సంవత్సరం కూడా 2 శాతానికి మించలేదు. విశాలాంధ్ర సంస్థానంలో రాయలసీమ పరిస్థితి పండించేందుకు నీరు, తిరిగేందుకు రహదారులు, చదువుకొనేందుకు పాఠశాలలు, చేసేందుకు ఉద్యోగులు, చెప్పుకొనేందుకు పరిశ్రమలు కూడా లేవు. ఈ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ 1986 వరకు రాయలసీమ వాసులు ఉద్యమించిన కారణంగా కొంత పరిస్థితి మెరుగుపడింది. అనంతరం కూడా రాయలసీమ ప్రాంతానికి అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతూనే ఉన్నా నాయకులు నోరు మెదపలేదు. ప్రస్తుతం తెలంగాణా నాయకులు ప్రత్యేక తెలంగాణా కోసం పార్టీలకతీతంగా నాయకులు, ప్రజలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. కానీ రాయలసీమ ప్రాంత నాయకులు మాత్రం నోరు మెదపకపోవడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు. సమైఖ్యంగా ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి:రాష్ట్రం సమైఖ్యంగా ఉంటేనే అభివృద్ధి చెందుతుందని, విడిపోతే అభివృద్ధి అన్యాక్రాంతమవుతుందని రైడ్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్.త్యాగరాజు అన్నారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని విడగొట్టేందుకు కొన్ని దుష్టశక్తులు పన్నాగం పన్నుతున్నాయని, వారి పన్నాగాలు సాగవని, రాష్ట్రాన్ని ముక్కలు చేయాలంటే ప్రత్యేక రాయలసీమ ఇవ్వాలని లేకుంటే రాష్ట్రాన్ని సమైఖ్యంగా ఉంచాలన్నారు.
విద్యార్థుల సమస్యలు అనేకం ఉన్న పట్టీ పట్టనట్టు వ్యవహరిస్తున్న అధికారులు నిర్లక్ష్యం వీడాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి యన్. శివరాం పేర్కొన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్( యస్‌ఎఫ్‌ఐ) కడప జిల్లా కమిటి ఆధ్వర్యంలో ఈ నెల 16 నుండి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న సైకిల్ జాతా సోమవారం పెండ్లిమర్రికి చేరుకుంది. .ఈ సందర్బగా ప్రభుత్వ జూనియర్ కాలేజ్ విద్యార్థులు అనేక సమస్యలను జాతా బృందానికి తెలిపారు. ఈ విషయంమై సమస్యలను పరిస్కరించాలని జాతా ఆధ్వర్యంలో విద్యార్థులు తాహశీల్దార్ కార్యలయం వరకు దర్నా నిర్వహించడం జరిగింది. దర్నా ఉద్ధేశించి శివరాం మాట్లాడుతూ గత 9 సంవత్సరాలుగా విద్యార్థులకు ఈ కళాశాలలో కనీసం మంచినీటి వసతి కూడా లేదని దీనిని బట్టి చూస్తే మిగిలిన సమస్యలు ఏస్తాయిలో ఉంటాయో అర్థం మౌతుందన్నారు.
50 శాతం మంది విద్యార్థినిలు వున్న మరుగుదొడ్లు ఏర్పాటు చేయకపోడం ధారునమన్నారు. ఎలిమెంటరీ స్కూల్స్‌లో సైతం మరుగుదొడ్లు ఉన్నాయన్నారు. విద్యార్థుల చదులు సక్రమంగా సాగాలని పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని జిల్లాకు ఒక యూనివర్సిటి, మండలానికి ఒక డిగ్రీ కాలేజ్ అని ప్రభుత్యం చెప్పుకొస్తుందని జూనియర్ కాలేజ్‌లలో క్లాసురూంలు కల్పించడంలో పూర్తిగా విఫలం అయ్యిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి చిత్త శుద్ధి వుంటే సమస్యలను పరిస్కరించి విద్యార్థులకు నాన్యమైన వాద్యను అందించాలని కోరారు. ఈ విషయామై తహశీల్దార్ చొరవ చూపని యడల కలెక్టర్ దృష్ఠికి తీసుకెల్లి సమస్యల పరిస్కారం కోసం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలోయస్‌ఎఫ్‌ఐ నాయకులు పవన్, సుబ్బారెడ్డి, అమర్, సుబ్బరాయుడు, విద్యార్థులు సుబ్బారెడ్డి, రమేష్, మహేంద్ర, శివనాగిరెడ్డి, వెంకటేష్ విజయ భారతి, నాగమణి, సైలజా తదితరులు పాల్గొన్నారు.
రామాపురం మండలంలోని చిట్లూరు, బండపల్లె, కుమ్మరపల్లె, హసనాపురం, సరస్వతిపల్లె గ్రామాలనుంచి 170 మంది అంగవైకల్య పరిక్షలకు కడప రిమ్స్‌కు పంపామని ఎంపీడిఓ, వెంకటసుబ్బయ్య తెలిపారు. శాశ్వత వికలాంగ దృవీకరణ పత్రం వుంటేనే వికలాంగ పించను వస్తుందన్నారు. లబ్ధిదారులు తప్పకుండా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. మంగళవారం సుద్దమళ్ళ, కల్పనాయనిచెరువు, రాచపల్లె, నల్లగుట్టపల్లె గ్రామాల వికలాంగులు పరిక్షలకు హాజరుకావాలని ఆయన తెలిపారు.
రామాపురం మండల కేంద్రంలో మరి రామలక్ష్ముమ్మ సోమవారం ఉపాధిపనులకు వెళ్ళగా తేలుకాటుకు గురైంది. కొండ ప్రాంతంలో వీ.యస్.ఎన్. పనులల్లో భాగంగా పనులు చేస్తుండగా తేలుకాటు వేయడంతో అపస్మారక స్థితిలోకి చేరడంతో స్థానికి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి మెరుగైన చికిత్సకై తరలించామని రామాపురం వీఎస్‌ఎన్ అధ్యక్షులు తెలిపారు.
స్థానిక లయన్స్ క్లబ్ సభ్యుడు రాజారెడ్డి కుమార్తె జన్మదినం సందర్భంగా సోమవారం లయన్స్ క్లబ్‌ఆధ్వర్యంలో రాజుల కాలనీలోని శుభోదయ ఆర్.బి.సి నందు అనాధ బాల, బాలికలకు పండ్లు, బ్రెడ్డు, బిస్కెట్లు, పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస రాజు మాట్లాడుతూ తమ గృహంలోని శుభకార్యాలను పేద బాలల మధ్య జరుపుకోవడం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ చైర్మెన్ నారాయణ రెడ్డి, లయన్ రాజారెడ్డి, స్వాతి, శేషు, ఆర్‌బిసి సిబ్బంది శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

దేవతల కాలంలోనే కడపకు ప్రత్యేక స్థానం ఉందని కడపను వేంకటేశ్వరుని తొలిగడపగా పురాణాల్లో తెలపడం జరిగిందని ఇలాంటి ప్రత్యేకత ఉన్న జిల్లా పేరును పూర్తిగా తొలగించి వైఎస్‌ఆర్ జిల్లాగా మార్చడం సరికాదని మైదుకూరు ఎమ్మెల్యే డీఎల్ రవీంధ్రారెడ్డి అన్నారు. స్థానిక తెలుగు గంగ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడు తూ రాష్ట్రానికి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా చేసిన సేవ లు మరువరానివన్నారు. వైఎస్‌కు నివాళిగా కడప జిల్లా పేరును వైఎస్‌ఆర్ కడప జిల్లాగా మార్చివుంటే బాగుండేదన్నారు. ఇలా జిల్లా పేరును మార్చడం పట్ల చాలా మంది మేధావులు బాధపడుతున్నా రని ఆయన అన్నారు. ప్రభుత్వం జిల్లా పేరును వైఎస్‌ఆర్ కడప జిల్లాగా సవ రించపోతే అఖిలపక్షాలతో కలిసి పోరాటం చేస్తామన్నారు. గతంలో ఒసారి కడపవాసిగా గర్వపడుతున్నానని దివంగత వైఎస్ చెప్పడాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
జిల్లాలో చెరువుల అభివృద్ది పనులపై పూర్తి పర్యవేక్షణ ఉండాలని జిల్లా కలెక్టర్ శశిభూషన్‌కుమార్ నీటి పారుదల శాఖ ఇంజనీర్లను ఆదేశించారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ చాంబరులో ప్రజల భాగస్వామంతో చెరువుల యాజమాన్య పథకంపై జిల్లా స్థాయి అమలు కమిటి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎంపిక చేసిన 17 చెరువుల పరిధిలో ప్రజాస్వామ్య సంస్థలను పటిష్టపరచాలని, చెరువు, భూగర్భజలాన్ని అభివృద్ది పరచాలని మూడవ కంపోనెంట్ కింద వ్యవసాయ, ఉద్యాన తోటలు, పశుసంవర్థక అభివృద్ది చేపలు, మొక్కల పెంపకం, మార్కెటింగ్ వ్యాపారాభివృద్ది వంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మొదటి కంపోనెంట్ కింద నిధులను ఇఇ నే ఖర్చు చేయక సంబంధిత స్వచ్చంద సంస్థకు విడుదల చేయాలన్నారు. అంతకు మునుపు జిల్లా కలెక్టర్ 17 చెరువుల అభివృద్ది పనులను సమీక్షించారు. ఓబులవారిపల్లె మండలం బొమ్మవరం చెరువు పరిదిలో రూ.7.52లక్షలు కంపొనెంట్ 3 కింద ఏవిధంగా ఖర్చుచేస్తావని ప్రశ్నించారు. ఇందుకు సంబందించిన వివరాలను తీసుకురావాలని సూచించారు. బొమ్మవరం చెరువు మినహా మిగిలిన 16చెరువుల అభివృద్ది పనులను చేపట్టినందుకు కలెక్టర్ ర్యాటివై ఉత్తర్వులు ఇచ్చారు. కమిటి ప్రాజెక్టు డైరెక్టర్, నీటిపారుదలశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఎన్.ఈశ్వరరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 10 సహాయ సంస్థ 63 చెరువులు కేటాయించామని, వీటి పరిధిలో 24115.66 ఎకరాల ఆయకట్టు వుందని వివరించారు. ఈ సమావేశంలో ఉద్యానశాఖ ఏడి ధర్మజ, వ్యవసాయశాఖ ఏఓ శ్రీనివాసులు, ఏపిడిలు పద్మావతి, వెంకటరెడ్డి, సుందర్ తదితర అధికారులు పాల్గొన్నారు.
పేదోళ్ల కోసం అమలవుతున్న ఇందిరప్రభ సమగ్ర భూమి అభివృద్ది పథకానికి క్షేత్రస్థాయి నుంచి సరైన సహకారం అందడం లేదని జిల్లా కలెక్టర్ శశిభూషన్‌కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం కలెక్టర్ చాంబర్‌లో ట్రాన్స్‌కో, డ్వామా అధికారులతో ఇందిరప్రభ సమగ్రభూమి అభివృద్ది పథకం అమలును కలెక్టర్ సమీక్షించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ సిఎల్‌డిసి బ్లాకుల్లో బోర్‌వెల్స్‌కు విద్యుదీకరణ పని నత్తనడకన నడుస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు తమకున్న కొంచెం భూమిని అభివృద్ది చేసుకుంనేందుకు ఇది మంచి అవకాశమని, అయితే క్షేత్రస్థాయి నుంచి వారికి రావాలసిన సహకారం అందకపోవడం వలన పథకాన్ని వినియోగించుకోలేక పోతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఆర్‌ఐడిఎఫ్ కింద 13106 బ్లాకుల్లో 331 బోర్‌బావులు తవ్వగా 284 బావుల్లో నీరు పడ్డాయని వీటిలో 263 బావులకు విద్యుదీకరణ కోసం రూ.2కోట్లు చెల్లించామని 153 బావులకు విద్యుదీకరణ జరిపినా ఇంకా 109 బావులకు విద్యుదీకరణ పెండింగ్‌లో ఉందన్నారు. తమపరిధిలో ఉన్నబోరుబావుల్లో ఒక్కొక్క బావికి 3 రోజులు సమయంలోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఏఇలకు ఆదేశాలిచ్చారు. కండక్టర్ సమస్య ఉందని ట్రాన్స్‌కో ఎస్‌ఇ లక్ష్మినారాయణ తెల్పగా అప్పటికపుడు సిఎండితో ఫోన్‌లో మాట్లాడుతూ సరఫరా చేయాలని కోరారు. గోపవరం ఎస్సీ కాలనీలో ఇంటికి కరెంట్ లేక పోవడం వల్ల బోరుబావులకు విద్యుత్ ఇవ్వడం లేదని తెల్పగా ఇంటికి, బోరుబావి లింకపెట్టకండన్నారు. ఈ సమావేశంలో డ్వామా ఏపిడి మహేశ్వరయ్య, ఏపి రమేష్, విద్యుత్ శాఖ ఏడిఇ, ఏఇలు పాల్గొన్నారు.
భారీ నీటి పారుదల శాఖా మంత్రి పొన్నాల లక్షుమయ్య దనార్జనే ద్యేయంగా ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవకతవకలకు పాల్పడుతూ రాష్ట్ర రైతాంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని తెదేపా నేతలు గోవర్ధన్‌రెడ్డి, లక్ష్మిరెడ్డి, సుభాన్‌బాషాలు ఎద్దేవ చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకర్లతో మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రైతాంగాన్ని దృష్టిలో ఉంచుకొని రాయలసీమ జిల్లాలను సశ్యశ్యామలం చేసేందుకు భారీ నీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. అయితే ఆయన హయాంలో ప్రసుత్తం అదే శాఖలో మంత్రిగా కొనసాగుతున్న పొన్నాల లక్షమయ్య కేవలం ప్రాజెక్టులలో కమీషన్లు అక్రమంగా డబ్బు సంపాదనపైనే దృష్టి కేంద్రీకరించారని రైతాంగం గోడు ఆయనకు పట్టలేదని ఆయన విమర్శించారు. అనంతపురం వ్యవసాయశాఖామంత్రి రఘువీరారెడ్డి, పొన్నాల శ్రీశైలం ద్వారా అనంతపురం వరకు ఆగస్టు 15 నాటికి హంద్రీ నీవా ద్వారా నీళ్లు ఇస్తామని చెప్పి రైతాంగాన్ని మోసగించారని, కడప జిల్లాకు అవుకు నుంచి గండికోట రిజర్వాయర్‌కు నీరు తేవడానికి వైఎస్‌ఆర్ ప్రాజెక్టు నిర్మాణం చేపడితే ఇంత వరకు కాలువ కూడా పూర్తి కావకపోవడం ఆయన చేతగాని తనానికి నిదర్శనమన్నారు. పులివెందులకు లిప్ట్ ఇరిగేషన్ ద్వారా నీటి సౌకర్యం కల్పించాలన్నదే వైఎస్ ఆశయమని అయితే వీటింన్నిటిని ఆయన మరణాంతరం పొన్నాల తుంగలో తొక్కి ప్యాకేజీ పనులను పూర్తి చేయలేదన్నారు. ఎస్‌ఆర్‌బిసి పూర్తి చేసిఉంటే రాయలసీమ జిల్లాలు సస్యశ్యామలం కావడంతో సోమశిల కూడా పూర్తి అయిఉండేదన్నారు. అలాగే గాలేరు నగరి, హంద్రీనీవా ప్రాజెకులు కూడా పూర్తి కాలేదన్నారు. అలాగే కర్నూలు జిల్లాలో గత ఏడాది సంబవించిన వరద కారణంగా దెబ్బతిన్న సుంకేసుల బ్యారేజ్ మరమ్మత్తులకు నోచుకోలేదన్నారు. రాయలసీమ, ముఖ్యంగా తెలంగాణా ప్రాంతాలకు గోదావరి బేసిన్ ద్వారా నీరు అందించడానికి ప్రధాన అడ్డంకిగా బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని మహరాష్ట్ర ప్రభుత్వం కడుతుంటే పరిశీలనకు వెళ్లిన బాబును అరెస్ట్‌చేసిన రోశయ్య సర్కార్ నిమ్మనీరెత్తినట్లు ప్రవర్తించిందని వాపోయారు. రోశయ్యకు సీటును కాపాడుకోవడానికే సమయం సరిపోలేదని ప్రజా సంక్షేమంపై ముఖ్యంగా రైతాంగ సమస్యలపై ఆయనకు తీరిక ఎక్కడుంటుందని విమర్శించారు. ఈ సమావేశంలో కార్యకర్తలు కత్తి శ్రీను, సుబ్బారెడ్డి, బొమ్మశెట్టి చంద్రశేఖర్ పాల్గొన్నారు.