కరీంనగర్

భానుడి భగభగ


రాష్ట్రంలో భానుడు ఉగ్రరూపం దాల్చాడు. రాష్ట్రం నిప్పుల కొలిమిగా మారింది. ప్రచండబానుడిదాటికి ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడదెబ్బతో 10మంది మృతిచెందారు. ఉదయం ఏడు గంటలనుంచే వేసవి ప్రతాపం చూపుతోంది. ఇళ్లలో విద్యుత్‌ వాడకం కూడా భారీగా పెరుగుతోంది. పలు జిల్లాల్లో విద్యుత్‌ కోతలు కూడా మళ్లీ మొదలయ్యాయి. బుధవారం హైదరాబాద్‌లోనూ అనధికారికంగా 3 గంటల విద్యుత్‌ కోత విధించారు. రాష్టవ్య్రాప్తంగా బుధవారం ఉష్ణోగ్రతలు తీవ్రరూపం దాల్చాయి. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు. ఈ సమయంలో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటాయి.
తెలంగాణతోపాటు రాయలసీమ జిల్లాల్లోనూ 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో సాధారణం కంటే 3 డిగ్రీలు, కోస్తోంధ్ర, రాయలసీమలో 1 నుంచి 3 డిగ్రీలు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదువుతన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం రెంటచింతలలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వ్యవసా య రంగానికి ప్రాణధారమైన నైరుతి రుతుపవనాలు జూన్‌ 1 కల్లా కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ విభాగం ప్రకటించిన విషయం తెలిసిందే. రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకేవరకు ఇదే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంటుందని అధికారులు చెబుతున్నారు. ఈసారి సాధారణ తేదీ కన్నా కొంత ఆలస్యంగా దక్షిణ అండమాన్‌ సముద్రంలో రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు.

జాతీయ హోదాకు కృషి చేస్తాం


పోలవరం సమస్యపై చర్చలకు
ఒడిశా సీఎంను ఆహ్వానించా
ఛత్తీస్‌గఢ్ సీఎంనూ సంప్రతిస్తాం
మంత్రి డీఎల్‌కు పనేమీ లేదు
మీడియా.. ప్రభుత్వానికి సలహాదారుగా
వ్యవహరించాలి.. విశాఖలో సీఎం కిరణ్
- ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌దే గెలుపు.. అందుకు నరసన్నపేట నుంచే శ్రీకారం
- మాజీ సీఎం వైఎస్‌కు కాంగ్రెస్ ఎంతో ప్రాధాన్యం ఇచ్చింది
- ఆయన కుటుంబానికి అనేక పదవులు కట్టబెట్టింది
- కాంగ్రెస్ మోసం చేసిందని జగన్ చెప్పుకోవడం సిగ్గుచేటు
- శ్రీకాకుళం ఉప ప్రచారంలో సీఎం
- ఇప్పుడే ఫలితాలు చెప్పేందుకు మేం జ్యోస్యులం కాదు: పీసీసీ చీఫ్ బొత్స
విశాఖపట్నం/శ్రీకాకుళం, మే 6:పోలవరం, ప్రాణహిత-చే ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించేందుకు తాము కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్తూ.. విశాఖపట్నం విమానాక్షిశయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో సమస్యను పరిష్కరించుకునేందుకు పొరుగు రాష్ట్రాలతో సంప్రతింపులు జరుపుతామని సీఎం చెప్పారు. దీనిపై ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ముఖ్యమంవూతులతో చర్చించి ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు.
పోలవరంపై చర్చలకు రావాలంటూ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను ఢిల్లీలో ఎన్‌సీటీసీ సదస్సు సందర్భంగా ఆహ్వానించినట్లు చెప్పారు. మంత్రి డీఎల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యల గురించి విలేకరులు ప్రస్తావించగా ఆయనకేం పనిలేదు, మీకేం పనిలేదు అని వ్యంగ్యంగా స్పందించారు. అభివృద్ధి కార్యక్షికమాల విషయంలో మీడియా ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరించాలని హితవు పలికారు. అనంతరం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నరసన్నపేటలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు లోక్‌సభతోపాటు అన్ని అసెంబ్లీ స్థానాల్లో తామే గెలుస్తామని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం నుంచే శ్రీకారం చుట్టాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.
మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్‌డ్డికి కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రాధాన్యం ఇచ్చిందని చెప్పారు. రాజశేఖర్‌డ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయనను ఎవరు విమర్శించినా తాను, ధర్మాన ప్రసాదరావు, ఇతర మంత్రులు తిప్పికొట్టామని, ఆయనకు రక్షణ కవచంలా నిలిచామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబానికి అనేక పదవులు ఇచ్చిందని తెలిపారు. ఇప్పుడు రాజశేఖర్‌డ్డి కుమారుడు జగన్ కాంగ్రెస్ పార్టీ తమను మోసం చేసిందని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ బహిరంగసభలో రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కొండ్రు మురళీమోహన్, శ్రీకాకుళం ఎంపీ కృపారాణి తదితరులు పాల్గొన్నారు.
అన్ని పార్టీల్లో కోవర్టులుంటారు: బొత్స
నరసన్నపేట ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డికి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌తోసహా కోవర్టులు ఏ పార్టీలోనైనా ఉంటారని వ్యాఖ్యానించారు. ఏదేమైనా ఉప ఎన్నికల్లో విజయమే తమ ముందున్న లక్ష్యమని చెప్పారు. ఉప ఎన్నికల అభ్యర్థు ఎంపిక సరిగానే జరిగిందని, ఇందులో చర్చకు తావులేదని అన్నారు. నెల్లూరు లోక్‌సభ స్థానంతోపాటు 1 అసెంబ్లీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా తాము ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పుడే ఫలితాలు చెప్పేందుకు తామేమీ జ్యోతీష్యులం కాదని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

టైగర్ దామోదర్‌రెడ్డి కన్నుమూత


అనారోగ్యంతో టీడీపీ మాజీ మంత్రి ముద్దసాని మృతి
- చికెన్ సెంటర్ నడుపుతూ రాజకీయాల్లోకి ప్రవేశం
- నేడు స్వగ్రామంలో అంత్యక్షికియలు ..హాజరుకానున్న బాబు
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, కరీంనగర్ జిల్లాలో టైగర్‌గా పేరొందిన ముద్దసాని దామోదర్‌డ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న దామోదర్‌డ్డి(5) సోమవారం మధ్యాహ్నం శాశ్వతనివూదలోకి జారుకున్నారు. మార్చి 6వ తేదీన మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతూ నిమ్స్‌లో చేరారు. న్యూరాలజీ, రేడియోటాలజీ, కార్డియాలజీ విభాగాల్లో వైద్యసేవలందించినా ఆరోగ్యం మెరుగుపడలేదు. సోమవారం మధ్యాహ్నం 1.40 గంటలకు పరిస్థితి విషమించి గుండెనొప్పితో మృతిచెందారు. మంత్రులు జానాడ్డి, శ్రీధర్‌బాబు, ఎంపీ పొన్నం ప్రభాకర్, టీడీపీ నేతలు కడియం శ్రీహరి, పెద్దిడ్డి, సుద్దాల దేవయ్యలు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ముద్దసాని దామోదర్‌డ్డి మృతిపై టీఆర్‌ఎస్ ఎల్పీ నేత ఈటెల రాజేందర్ ఓ ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్వగ్రామమైన కరీంనగర్ జిల్లాలోని వీణవంక మండలం మామిడాలపల్లిలో మంగళవారం అంతయక్షికియలు నిర్వహించనున్నారు. తిరుపతి పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అంత్యక్షికియల్లో పాల్గొననున్నారు. మరణవార్త వినగానే పార్టీ జిల్లా కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు.
నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మామిడాలపల్లిలో జన్మించిన దామోదర్‌డ్డికి కరీంనగర్ జిల్లా కేంద్రంతో ఎనలేని అనుబంధముంది. జగిత్యాల రోడ్డులో లలిత చికెన్ సెంటర్ (ఇప్పుడు కూడా అదే పేరుతో ఉంది)ను నిర్వహిస్తూ తెలుగు యువతలో చేరారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. 195లో టీడీపీ సంక్షోభ సమయంలో ఎన్టీఆర్‌కు అండగా నిలిచారు. కమలాపూర్ టికెట్‌ను దక్కించుకొని నాలుగుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. భూగర్భగనులు, రవాణా, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా సేవలందించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఎన్టీఆర్‌పై చంద్రబాబు తిరుగుబాటు చేసినపుడు ఆయనను వ్యతిరేకించారు.
యువతను నడిపించిన నేత
దామోదర్‌డ్డికి టైగర్ పేరురావడానికి యువనేతగా ముందుకు నడవడమే కారణం. ఆయన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ కలెక్టరేట్‌పై రాళ్ల వర్షం కురిపించడం వంటి సంచలనాలకు కేంద్రబిందువయ్యారు. గత ఏడాది మే 25, 2011న కరీంనగర్ సర్కస్ గ్రౌండ్‌లో టీడీపీ టీ ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజాగర్జనను ఏర్పాటు చేసినపుడు దామోదర్‌డ్డి వంటి సీనియర్లను ఆహ్వానించలేదు. దీనిపై మరుసటిరోజే పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి ఎర్రబెల్లి దయాకర్‌రావును ఉతికి ఆరేశారు. ఆయన పోకడవల్లే పార్టీకి ఈ పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు. ఇదే ఆయన చివరి విలేకరుల సమావేశం.

కేసీఆర్‌ x మోత్కుపల్లి


ఉప ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణలో నేతల మధ్య మాటల వేడి తీవ్రతరమవుతున్నది. ఎన్నికలను ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటంతో మాటల యుద్ధం రోజు రోజుకూ పెరిగిపోతూనే ఉంది. ప్రధానంగా ఆరు స్థానాలలో తమదే విజయమంటున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌ టార్గెట్‌గా టీడీఎల్పీ ఉప నాయ కుడు మోత్కుపల్లి నర్సింలు గత కొంతకాలం నుంచి నిర్వి రామంగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కేసీఆర్‌ను విమర్శించటానికి తెలుగు భాష, ప్రత్యేకించి తెలంగాణ భా షలో ఎన్ని విశేషణాలు ఉన్నాయో అన్నిటినీ మోత్కుపల్లి యథేచ్ఛగా ఉపయోగించు కుంటున్నారు.
తాగుబోతు, తిరుగుబోతు
కొద్ది రోజుల క్రితం కేసీఆర్‌పై విరుచుకుపడుతూ మోత్కుపల్లి ఆయనను తాగుబోతు, తిరుగుబోతు అని అభివర్ణించారు. అమాయకులైన తెలంగాణ బడుగు, బలహీన వర్గాల యువకులు, విద్యార్థులను బలిగొన్న నరరూప రాక్షసుడు అని విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ వైఖరి వల్లనే ప్రొఫెసర్‌ జయశంకర్‌ దిగులుతో మరణించారన్నారు. కేసీఆర్‌ వైఖరిని ఎండగడుతూ పాదయాత్ర ప్రారంభించిన మోత్కుపల్లి, శుక్రవారం మరో సంచలనాత్మకమైన బాంబు పేల్చారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని, అప్పుడు తెలంగాణ భవన్‌ను స్వాధీనం చేసుకొని అమ్మివేసి అమరవీరుల కుటుంబాలకు పంచిపెడతామని ప్రకటించారు. నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ భవన్‌లో చానల్‌ను నిర్వహిస్తున్నందున ప్రభుత్వం ఇప్పుడే దాన్ని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. విచిత్రం ఏమిటంటే మోత్కుపల్లి మొదటి నుంచీ కేసీఆర్‌నే టార్గెట్‌గా చేసుకొని విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్‌పై విమర్శలకు అంతంతవరకే పరిమితమయ్యారు.
టీఆర్‌ఎస్‌… పైపై మాటలే
అటు మోత్కుపల్లి రోజు రోజుకూ మాటల తీవ్రతను పెంచుతుంటే టీఆర్‌ఎస్‌ వైపు నుంచి వస్తున్న స్పందన అంతంతమాత్రంగానే ఉంటూ వస్తున్నది. ఛోటా మోటా నేతలు అప్పుడప్పుడూ మీడియా సమావేశాలు నిర్వహించి విమర్శించటం మినహా ఆయన చేసిన ఆరోపణలకు టీఆర్‌ఎస్‌ జవాబు చెప్పలేకపోతున్నదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సీనియర్‌ నేతలంతా ప్రచార బాధ్యతల్లో బిజీగా ఉండటంతో మోత్కుపల్లి దూకుడుకు అడ్డుకట్ట వేసే నేతలే ఉండటం లేదు…
డీకే వర్సెస్‌ జూపల్లి
ఇక పాలమూరు జిల్లా కొల్లాపురం స్థానానికి జరిగే ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మంత్రి డీకే అరుణ అన్నీ తానై పర్యవేక్షింటంతో పాటు తన బద్ధ విరోధి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జూపల్లి కృష్ణారావును ఎలాగైనా ఓడించి తీరాలన్న పట్టుదలతో రోజుకో రకమైన విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తాను పట్టుపట్టి విష్ణువర్ధన్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయించటంతో ఈ ఎన్నిక ఆమెకు అగ్ని పరీక్షగా మారింది. ఇటీవలే జూపల్లికి మద్దతుగా ప్రచారం చేసేందుకు వెళ్ళిన ఉస్మానియా వర్సిటీ విద్యార్థులపై కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడులు జరపటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
హరీశ్‌ వర్సెస్‌ కడియం
వరంగల్‌ జిల్లా స్టేషన్‌ ఘనపూర్‌ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కడియం శ్రీహరి టార్గెట్‌గా టీఆర్‌ఎస్‌ ప్రచారం సాగుతోంది. టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి, కేసీఆర్‌ మేనల్లుడు తన్నీరు హరీశ్‌రావు స్వయంగా ఇక్కడ పార్టీ అభ్యర్థి టి.రాజయ్య ప్రచార భారాన్ని తలకెత్తుకున్నారు. ఫలితంగా ఇటు హరీశ్‌, అటు శ్రీహరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. శ్రీహరి మంత్రిగా ఉండగా వోట్లు రాల్చుకోవటం కోసం హడావుడిగా దేవాదుల ప్రాజెక్టుకు పునాదిరాయి వేయించి ఆ తర్వాత మొండిచేయి చూపారని టీఆర్‌ఎస్‌ అంటుంటే, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులను అమానుషంగా ఆత్మహత్యలకు ప్రేరేపించిన చరిత్ర కేసీఆర్‌ది అని శ్రీహరి ప్రచారంలో విరుచుకుపడుతున్నారు.
రేవంత్‌ వర్సెస్‌ కోదండ
ఇక టీడీపీ యువ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ కోదండరామిరెడ్డి మధ్య సైతం ఇలాంటి యుద్ధమే జరుగుతోంది. గత కొద్ది రోజుల నుంచీ కేసీఆర్‌, కోదండను టార్గెట్‌ చేసుకున్న రేవంత్‌ తాజాగా మరోసారి విరుచుకుపడ్డారు. పాలమూరులో ఎవరికైనా వోటు వేయవచ్చునన్న కోదండ ప్రకటనను ఎద్దేవా చేస్తూ ఆయనకు రెండు కళ్ళు, రెండు నాల్కలూ ఉన్నాయన్నారు. కాంగ్రెస్‌ సృష్టించిన కవల పిల్లలు కేసీఆర్‌, కోదండరామిరెడ్డి అని దుయ్యబట్టారు. మిగిలిన నియోజకవర్గాలలోనూ టీడీపీ, టీఆర్‌ఎస్‌, టీడీపీ, కాంగ్రెస్‌ నేతల మధ్య ఇలాంటి మాటల యుద్ధమే సాగుతోంది. కాలం గడిచే కొద్దీ ఈ తిట్లు ఏ స్థాయికి పోతాయో ఊహించలేకపోతున్నామని అన్ని పార్టీలలో సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

విరుచుకుపడిన ఎసిబి


ఎక్సైజ్ శాఖలో మద్యం ముడపులు అందుకున్న ఏ ఒక్కరినీ వదలకుండా అవినీతి నిరోదక శాఖ ఏరేసే కార్యక్రమాన్ని ఉధృతం చేసింది. ముడుపులు అందుకున్న మరికొందరు ఎక్సైజ్ అధికార్లను కోర్టు బోను ఎక్కించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే రాష్టవ్య్రాప్తంగా ఎక్సైజ్ కార్యాలయాలపై సోమవారం ఏకకాలంలో దాడులకు దిగింది. ఏసిబి సిట్ బృందాలు అనూహ్యంగా దాడులకు దిగాయి. ఎక్సైజ్ శాఖలో ఏళ్ల తరబడి ఒకే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న వారిపై గట్టి నిఘా పెట్టారు.
ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నవారి జాబితా తయారు చేసి ఉచ్చును మరింత బిగిస్తోంది. ఎసిబి అదనపు డైరక్టర్ శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలోని స్పెషల్ ఇనె్వస్టిగేషన్ బృందాలు ఈ కార్యక్రమంలో నిమగ్నమయ్యాయి. ఎక్సైజ్ శాఖలో మద్యం సిండికేట్ల నుంచి ముడుపులు అందుకున్న వారేకాకుండా, ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్న వారినీ తాజాగా ఎసిబి టార్గెట్ చేస్తోంది. విజయనగరం, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఎసిబి బృందాలు తనిఖీలు నిర్వహించాయి. కీలకమైన ఫైళ్లు, ఆఫీసు రికార్డులు, కంప్యూటర్ సామగ్రి, అధికారుల మొబైల్ నెంబర్లు స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయాల్లోని అధికారులను విచారించడంతోపాటు, వారి వద్దనున్న మొబైల్ నెంబర్లనుంచి గత కొన్ని రోజులుగా ఎవరెవరికి కాల్స్ వెళ్లిందీ విచారిస్తున్నారు. ఎసిబి దర్యాప్తుతో వ్యాపారాలు వదిలి అజ్ఞాతంలోకి వెళ్లిన సిండికేట్ల గురించీ సిట్ బృందాలు గాలిస్తున్నాయి. చిక్కడపల్లికి చెందిన మద్యం వ్యాపారి బాలరాజ్‌గౌడ్ అరెస్టు కాకుండా తప్పించుకుంటున్నాడు. ఇతను దేశం విడిచిపోకుండా ఎసిబి లుకౌట్ నోటీసు జారీ చేసింది. త్వరలోనే అరెస్టు చేస్తామని ఎసిబి వర్గాలు తెలిపాయి. ఇదిలావుంటే, విజయనగరం జిల్లాలోని ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఏసిబి బృందాలు తనిఖీలు నిర్వహించాయి. విజయనగరం జిల్లా కేంద్రం, పార్వతీపురం ఇఎస్ ఆఫీసుతోబాటు బొబ్బిలి సబ్ డివిజన్‌లో సైతం సోదాలు నిర్వహించారు. ఎసిబి డిఎస్పీ వెంకటేశ్వర రావు నేతృత్వంలో సిబ్బంది ఇఎస్ కార్యాలయానికి చేరుకుని 2010-12 మద్యం దుకాణాల టెండర్ రికార్డులు పరిశీలించారు.
పట్టు బిగిస్తున్న ఎసిబి
ఖమ్మం జిల్లాలో 2010 మద్యం టెండర్లలో 16 దుకాణాల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని నిర్థారించిన ఎసిబి, అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకునేందుకు ఎసిబి ఆధారాలు సేకరించే పనిలో పడింది. రెండురోజులుగ దాడులు కొనసాగిస్తున్న ఎసిబి, సోమవారం టెండర్లకు సంబంధించిన అన్ని ఫైళ్లనూ ఎసిబి డిఎస్పీ శంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో డిఆర్వో క్యాంప్ కార్యాలయం నుంచి స్వాధీనం చేసుకున్నారు. టెండర్ల సమయంలో జిల్లాలో పనిచేసిన జెసి అజీంతో పాటు పలువురు ఉన్నతాధికారుల ప్రమేయంపైనా విచారణ సాగుతోంది.
గుంటూరులోని ఎక్సైజ్ డిసి ఆఫీసులో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. సిండికేట్లు అందించిన వివరాలతో ఎక్సైజ్ అధికారుల పాత్రపై ఆరా తీస్తున్నారు. ఎసిబి జెడి రమేష్‌రెడ్డి ఆధ్వర్యంలో సోదాలు సాగాయి. 2010లో జరిగిన మద్యం టెండర్లలో అవకతవకలు జరిగాయని, సిండికేట్‌లకు షాపులు కేటాయించడంలో నిబంధనల ఉల్లంఘన వెల్లడైనట్టు సమాచారం. రికార్డులను స్వాధీనం చేసుకున్న ఎసిబి, చర్యలకు సిద్ధమవుతోంది. దాడుల సందర్భంలో డిసి కార్యాలయంలో ముఖ్య అధికార్లు అందుబాటులో లేకపోవడం గమనార్హం. అలాగే తెనాలి, నరసరావుపేట ఎక్సైజ్ కార్యాలయాల్లోనూ సోమవారం ఎసిబి బృందాలు దాడులు నిర్వహించి రికార్డులు తనిఖీలు చేశాయి. ఎసిబి డిఎస్పీ శివాజీ, విజయవాడ రేంజ్ ఎసిబి సిఐ టిఎస్‌కె రవి నేతృత్వంలో రికార్డులను పరిశీలించి, టెండర్ల విషయంలో అధికార్లు అక్రమాలకు పాల్పడ్డారా? అన్న అంశాలను పరిశీలించారు.
తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి, కాకినాడ, అమలాపురం ఇఎస్ కార్యాలయాలపై సోమవారం ఎసిబి బృందాలు దాడులు జరిపాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన సిట్ బృందాలు దాడుల్లో పాల్గొన్నాయి. 2010లో మద్యం దుకాణాల వేలం ప్రక్రియకు సంబంధించిన ఫైళ్లపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. దాడుల్లో ఎసిబి సిట్ డిఎస్పీలు విజయపాల్, లక్ష్మీపతి ఆధ్వర్యంలో ఇనస్పెక్టర్లు బి రామకృష్ణ, ఎస్ మురళీమోహన్ పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు, భీమవరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ అధికార్లు సోమవారం రికార్డులు పరిశీలించారు. ఏలూరులో హైదరాబాద్ ఎసిబి డిఎస్‌పి నరసింహారావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించగా, మధ్యాహ్నం నుంచి భీమవరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో విజయవాడ నుండి వచ్చిన బృందం ఆధ్వర్యంలో తనిఖీలు జరిపారు. దాడుల్లో భాగంగా కొన్ని ముఖ్యమైన ఫైళ్లను స్వాధీనం చేసుకుని, కార్యాలయాల్లోని కంప్యూటర్లలో నిక్షిప్తమైన సమాచారాన్ని సైతం ఎసిబి అధికార్లు సేకరించారు.
నెల్లూరు జిల్లాలోని నెల్లూరు, గూడూరు ఎక్సైజ్ కార్యాలయాల్లో ఎసిబి సోదాలు సాగాయి. మద్యం దుకాణాల లైసెన్సులు పరిశీలించి, 2010 నుంచి టెండర్లకు సంబంధించిన వివరాలు తీసుకున్నారు. కర్నూలు, కడప జిల్లాల్లో సైతం ఎక్సైజ్ కార్యాలయాలపై ఎసిబి దాడులు జరిపింది. 2010 వేలం పాటల రికార్డులు, టెండర్లలో పాల్గొన్న వారి వివరాలు, ఆస్తిపాస్తుల సమాచారం, మద్యం దుకాణాలను వేలంలో దక్కించుకున్న వారి వివరాలు సేకరించారు. అలాగే, మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ పట్టణాలలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల్లో ఎసిబి అధికారులు సోమవారం దాడులు నిర్వహించి సోదాలు చేశారు. మద్యం దుకాణాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.

ఏసిబి సోదాలు


నున్నా రమణ వాంగ్మూలంపై విచారణ
ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయం సహా 20 చోట్ల సోదాలు
అదుపులో నలుగురు అధికారులు
అవినీతి నిరోధక శాఖ అధికారులు శనివారం ఖమ్మం, వరంగల్‌, చిత్తూరు, హైదరాబాద్‌ జిల్లాల్లో విస్తృతంగా సోదాలు చేశారు. మొత్తం 50 మంది సభ్యులు బృందాలుగా విడిపోయి ఈ సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కొన్ని కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీరందరినీ ఏసిబి ఏడి శ్రీనివాసరెడ్డి సమన్వయం చేశారు. అవినీతి ఆరోపణలతో ఉన్న నలుగురు అధికారులను అదుపులోకి తీసుకున్నారు. అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ ఎం.శంకరయ్య సొంతూరు చిత్తూరు జిల్లాలోని కోటపల్లిలోనూ సోదాలు నిర్వహించగా ఖమ్మం జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ మధుసూదన్‌ ఇంటిపైనా దాడులు నిర్వహించారు. మధుసూదన్‌ ఇంట్లో రూ.లక్షా 30 వేల నగదు, 35 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఏసిబి అధికారులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించి తమ ఇష్టం వచ్చినట్లు రాసుకుని సంతకాలు చేయించుకున్నారన్న మద్యం సిండికేట్‌ నున్న రమణ ఆరోపణలు చేసిన అనంతరం ఈ దాడులు జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఖమ్మంలో మద్యం దుకాణాల్లోనూ, ఎక్సైజ్‌ అధికారుల గృహాల్లోనూ ఎసిబి అధికారులు తనిఖీలు నిర్వహించారు. లైసెన్స్‌లు పొందడం, మామూళ్ల వ్యవహారంపై నున్నా రమణ ఇచ్చిన వాంగ్మూలంపై విచారణ జరిపారు. ఖమ్మంలోని ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయంతో పాటు జిల్లా వ్యాప్తంగా 20 చోట్ల తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎడి శ్రీనివాసరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ ఎక్సైజ్‌ శాఖకు చెందిన డిప్యూటీ కమిషనర్‌ నర్సింహారావు, ఖమ్మం జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ మధుసూదన్‌రావు, అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ ఎం.శంకరయ్య, సిఐ డిఎస్‌ నాధ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పొద్దుపోయే వరకూ తనిఖీలు జరిగాయి. బంధువులు, స్నేహితుల పేరు మీద బినామీగా లైసెన్స్‌లు తీసుకున్నానని, అధిక ధరలకు అమ్ముకోవడానికి ఎక్సైజ్‌ అధికార్లకు ముడుపులు ఇచ్చుకున్నానని రిమాండ్‌ రిపోర్టులో నున్నా రమణ పేర్కొన్న విషయం విదితమే. ఇదే కోవలో రాజకీయ పార్టీలకు, మంత్రి మోపిదేవికి, పత్రికా ప్రతినిధులకు, పోలీసులకు మామూళ్లు ఇచ్చినట్లు పేర్కొన్నాడు. వాటి ఆధారాలు సేకరించడంలో భాగంగా శనివారం ఏసిబి బృందం తనిఖీ చేసింది. రమణకు చెందినవిగా చెప్పబడుతున్న 16 బార్‌షాపుల లైసెన్స్‌లు అక్రమ పద్ధతుల్లో పొందారని చెరుకూరి శ్రీనివాసరావు అనే వ్యక్తి గతంలో ఫిర్యాదు చేశారు. దీనిపై ఖమ్మం ఆర్‌డిఓ వి.వెంకటేశ్వర్లును విచారించి 2010 డిసెంబర్‌ 12న అప్పటి కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు. అక్రమాలు ఉన్నాయని ఆర్‌డిఓ చెప్పారు. శనివారం ఖమ్మం వచ్చిన అధికారులు ఆర్‌డిఓ వెంకటేశ్వర్లును జిల్లా ఎక్సైజ్‌ కార్యాలయంలో విచారించారు. ఆర్‌డిఓ నివేదికలో పొందుపరిచిన అన్ని బార్‌ షాపుల్లోనూ ఏసిబి అధికారులు పరిశీలనలు జరిపారు. మంత్రి మోపిదేవికి నున్నా రమణ డబ్బులు ఇచ్చే సందర్భంలో ఉన్నాడని చెబుతున్న మరో మద్యం సిండికేట్‌ నేత బాబ్జి ఇంట్లోనూ తనిఖీలు చేశారు. తనిఖీ సమయంలో బాబ్జి ఇంట్లో లేరు. ఆయన ఇంటి నుండి కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
వరంగల్‌లో ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ నర్సింహారావు ఇంటిపై, కార్యాలయంపై కూడా ఎసిబి అధికారులు దాడులు చేశారు. హైదరాబాద్‌లో నర్సింహారావును ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎసిబి అధికారులు సాంబయ్య, రాఘవేందర్‌రావు, బాపురెడ్డి శనివారం ఉదయం నుండే సోదాలు ప్రారంభించారు. సోదా చేసేందుకు నర్సింహారావు ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉండడంతో ఆయనను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. వంటమనిషితో తాళం తీయించి సోదాలు చేశారు. ఖమ్మంలో ఎక్సైజ్‌ సిఐగా పనిచేస్తూ వరంగల్‌లోని టీచర్స్‌ కాలనీలో నివాసం ఉంటున్న సర్వేశ్వర్‌నాథ్‌ ఇంట్లో కూడా సోదాలు చేశారు. అనంతరం ఎక్సైజ్‌ కార్యాలయంలో సోదాలు చేశారు. తనిఖీల్లో వరంగల్‌ డిఎస్‌పి కృష్ణుడు, ఖమ్మం సిఐ జనార్ధన్‌రెడ్డి కూడా పాల్గొన్నారు.  aఖమ్మం జిల్లా ఎక్సైజ్‌ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ శంకరయ్య సొంతూరు చిత్తూరు జిల్లా పీలేరు మండలం కోటపల్లి గ్రామంలో అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే సోదాల్లో ఎలాంటి ఆధారాలూ లభ్యం కాలేదని సిఐలు పార్థసారథిరెడ్డి, రామక్రిష్ణారావు తెలిపారు.
ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో ఖమ్మం జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ మధుసూదన్‌ ఇంటిపై ఎసిబి డిఎస్పీ చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. మధుసూదన్‌ హైదరాబాద్‌ నగరంలోని ఆర్‌కెపురం డివిజన్‌ సౌభాగ్యనగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ దాడులలో రూ.లక్షా 30 వేల నగదు, లాకర్లలో 35 తులాల బంగారం, రూ.40 వేల నగదు ఉన్నట్లు డిఎస్పీ తెలిపారు. ఇంకొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని, వాటిని పరిశీలిస్తే ఇంకొన్ని ఆస్తులు వెళ్ళడి కావచ్చన్నారు. దొరికిన సొత్తు కొద్ది మొత్తమేనని, ఇంకా ఆయనకు మద్యం సిండికేట్‌లతో సంబంధం ఉన్నట్లు వార్తలొస్తున్నాయన్నారు. ఈ దిశగా దర్యాప్తు చేపడతామని చెప్పారు. కాగా, తాను వివిధ జిల్లాలలో పని చేశానని, ఎక్కడా తనపై అవినీతి ఆరోపణలు లేవని ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ మధుసూదన్‌ తెలిపారు. తాను అక్రమంగా ఎలాంటి ఆస్తులూ సంపాదించలేదన్నారు.

ఎర్రబావుటా ఎగరేస్తాం

కాంగ్రెస్‌, బిజెపిలకు దీటుగా వామపక్ష శక్తుల ఏకీకరణ కోసం ప్రయత్నిస్తాం
సిపిఐ రాష్ట్ర మహాసభల ప్రారంభోపన్యాసంలో జాతీయ నేత ఎబి బర్ధన్‌

కాంగ్రెస్‌, బిజెపిలకు దీటుగా ప్రత్యామ్నాయం కోసం తమ పార్టీ కృషి చేస్తోందని, వామపక్ష శక్తుల ఏకీకరణ కోసం ప్రయత్నిస్తున్నామని సిపిఐ జాతీయనేత ఎబి బర్ధన్‌ అన్నారు.  భారత కమ్యూనిస్టు పార్టీ 24వ మహాసభలు కరీంనగర్‌లో మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ సభలకు వేలాదిగా పార్టీ కార్యకర్తలు, వివిధ జిల్లాల ప్రతినిధులు తరలివచ్చారు. ఎర్రజెండాల నీడన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎబి బర్ధన్‌, ఉప ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణతోపాటు పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు, కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపి పాల్గొన్నారు. ఎర్రదండు స్వాగతం స్వీకరించిన అనంతరం సభలో బర్ధన్‌ ప్రసంగిస్తూ కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ సక్రమంగా పనులు చేపట్టకపోవడం వల్లనే పేదలకు ఎన్నో సమస్యలు ఉత్పన్నమయ్యాయన్నారు. వారి సమగ్రాభివృద్ధి కోసం సిపిఐ పోరాటాలు చేస్తుందన్నారు. ఈ ప్రాంతాల్లోని పేదలు, యువకులు, మహిళల అభివృద్ధే తమకు ముఖ్యమన్నారు.
దేశంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ వల్ల పేదలు, ధనికుల మధ్య తేడా బాగా పెరిగిపోయిందని బర్ధన్‌ ఆరోపించారు. పేదలు ఇంకా పేదలుగా మారుతుండగా, ధనికుల సంఖ్య మాత్రం ప్రతి సంవత్సరం పెరిగిపోతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి, పేదలు, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నార న్నారు. పెరిగిన ధరల వల్ల కనీస అవస రాలైన వస్తువులు కొనలేని పరిస్థితిలో వారున్నా రన్నారు. దేశంలో అవినీతి, లంచగొండి తనం బాగా పెరిగిపోయిందన్నారు. దేశంలో
70శాతంకుపైగా ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం వల్ల వ్యవసాయరంగం సంక్షోభంలో పడిపోయిందన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర రావడం లేదన్నారు. ఎరువులు, పురుగుల మందులు, విత్తనాల రేట్లు పెంచుతున్న ప్రభుత్వం రైతులు పండించే ధాన్యానికి గిట్టుబాటు ధరలు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సెజ్‌లు, పారిశ్రామిక రంగ విస్తరణ పేరున పంటలు పండే మాగాణి భూములను రైతుల నుండి లాక్కుంటున్నాయని ఆయన ఆరోపించారు. అభివృద్ధి అంటే రైతులను తమ భూముల నుండి నెట్టివేయడమేనని ఆయన ప్రభుత్వాలను ప్రశ్నించారు. ప్రభుత్వ అణాలోచిన నిర్ణయాల వల్ల వాణిజ్యపంటలు పండించే రైతులు దేశవ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల నిరుద్యోగ యువకులకు ఉపాధి దొరకడం లేదన్నారు. విదేశీరంగ సంస్థలకు అవకాశం ఇవ్వడం వల్ల దేశంలోని చిన్న పరిశ్రమలు మూతపడి లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడుతున్నారని ఆయన అన్నారు. సోవియట్‌ యూనియన్‌ పతాననంతరం కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అమెరికా చేతిలోకి వెళ్ళిందని ఆయన అన్నారు. వారు చెప్పిన ఉదారవాద విధానాలనే ఇక్కడ ఉన్న ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌, సోనియాగాంధీలు అమలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. భారత్‌ ఆర్థిక, విదేశీ వ్యవహారాల విషయాలన్ని అమెరికా చెప్పిన విధంగానే జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. దేశ ప్రజలకు ఉపయోగపడే ఏ విధానాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టడం లేదన్నారు.
దేశంలోని ప్రజలు కూడా అయితే కాంగ్రెస్‌ లేదా బిజెపికి పట్టం కడుతున్నారని బర్ధన్‌ అన్నారు. ఈ రెండు పార్టీ విధానాలకు తేడా లేదన్నారు. ఈ రెండు పార్టీలు ప్రజలను దోపిడి చేసేవి అని అన్నారు. బిజెపి మతం, మందిర్‌ పేరిట ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుందని ఆరోపించారు. ఈ రెండు పార్టీలకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఇప్పటికే జైళ్ళలో మగ్గుతున్నారని ఆయన విమర్శించారు. సాక్షాత్తు కర్నాటక మంత్రులే శాసనసభలో బూతు బొమ్మలు చూస్తు దొరికిపోయారని ఆయన ఆరోపించారు. దేశంలో ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేసేందుకు తమ పార్టీ కృషి చేస్తుందని ఆయన అన్నారు. ఈ ప్రత్యామ్నాయ శక్తి వల్లనే ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన అన్నారు. దీని కోసం దేశంలోని మేధావులను, ప్రజాస్వామ్యవాదులను, కార్మికులను, రైతులను ఏకంచేస్తూ ఉద్యమాన్ని నిర్మిస్తామన్నారు. ఈ ప్రత్యామ్నాయం కోసం వామపక్షాలన్నింటిని ఏకం చేస్తామన్నారు. వీటితో దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ తమ వైపు రావాల్సిందేనని ఆయన అన్నారు. ఎర్ర జెండా గొడుగు కింద పార్టీలన్నీ ఏకం చేసి నూతన ప్రజాస్వామ్య ప్రభుత్వాలను ఏర్పాటు చేసేవిధంగా కృషి చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం విదేశీ సంస్థలకు బార్లా తెరవడం వల్ల చిల్లర వ్యాపారస్తులు నష్టపోయే అవకాశం ఉన్నదని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 28న సార్వత్రిక సమ్మె చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమ్మెలో దేశంలోని ప్రధాన కార్మిక సంఘాలన్నీ పాల్గొంటున్నాయన్నారు. కరీంనగర్‌లో జరుగుతున్న సిపిఐ రాష్ట్ర మహాసభల్లో పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

పోరాటాలపై సమీక్ష


కరీంనగర్‌లో నేటి నుంచి సీపీఐ 24వ రాష్ట్ర మహాసభలు
ఉప పోరుపై నిర్ణయం.. పార్టీ కార్యదర్శి ఎన్నిక
నారాయణకే అవకాశాలు మెండు
అరుణ పతాకను ఆవిష్కరించిన కమలమ్మ
సీపీఐ 24వ రాష్ట్ర మహాసభలు కరీంనగర్‌లో మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మూడేళ్లకోసారి జరిగే ఈ మహాసభల్లో పార్టీ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో తొలిరోజు బహిరంగసభ నిర్వహిస్తారు. ఈ సభలకు ముఖ్య అతిథిగా జాతీయ ప్రధాన కార్యదర్శి ఏబీ బర్ధన్, ఉప ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి హాజరవుతున్నారు. అరుణ పతాకాన్ని తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు సీహెచ్ కమలమ్మ ఆవిష్కరిస్తారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు ఈ మహాసభలకు అతిథిగా హాజరై సందేశం ఇస్తారు. సీపీఐకి తొలిసారి జిల్లా కార్యదర్శులుగా ఎంపికైన ఇద్దరు మహిళలు ఈ మహాసభకు హాజరు కానున్నారు.
రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి, ఉపపోరులో పొత్తులపై ఈ సమావేశంలో చర్చిస్తారు. గనులు, మైక్రో ఫైనాన్స్, మద్యం, ల్యాండ్ మాఫియాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. నాలుగేళ్లుగా పార్టీ నిర్వహించిన పోరాటాలు, ప్రజాహిత కార్యక్రమాలను సమీక్షించి ప్రస్తుత దేశ, రాష్ట్ర రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై చర్చిస్తామని, భవిష్యత్తులో నిర్వహించాల్సిన పోరాట కార్యక్రమాలను రూపొందిస్తామని పార్టీ నేతలు తెలిపారు. తెలంగాణ అంశంతోపాటు విద్యుత్ చార్జీల పెంపు, మద్యం సిండికేట్ల వ్యవహారం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టులు, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై ఈ మహాసభల్లో చర్చిస్తారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శిని కూడా ఎన్నుకుంటారు. నారాయణే ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయి.
త్యాగానికి ప్రతీక కమలమ్మ
కమలమ్మ… సీపీఐ 24వ రాష్ట్ర మహాసభల ప్రారంభం సందర్భంగా వినిపిస్తున్న ఓ సాయుధ పోరాట యోధురాలి పేరు. కన్నబిడ్డను వదిలి పోరాటబాట పట్టిన ధీర ఆమె. సీపీఐ రాష్ట్ర మహాసభలల్లో అరుణ పతాకావిష్కరణ గావించనున్న కమలమ్మ తెలంగాణ పోరాటం ఉధృతంగా ఉన్న రోజుల్లో నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా అడవికెళ్లి అన్నలతో కలిసి పోరాడింది. బిడ్డ ఏడిస్తే పోలీసులకు చిక్కే ప్రమాదముందన్న దళ నాయకుడి మాటలతో పోరాటం కంటే బిడ్డ ఎక్కువ కాదని, బిడ్డను వదిలి దళంతో కలిసింది. అనంతరం ఆమె సీపీఐ పార్టీలో పూర్తిస్థాయి కార్యకర్తగా పనిచేస్తోంది.
ఎరుపెక్కిన కరీంనగరం
మహాసభల కోసం కరీంనగర్ ఆరుణ పతాకలతో ముస్తాబైంది. తొలిరోజు స్థానిక సర్కస్ గ్రౌండ్‌లో సాయంత్రం 4 గంటలకు భారీ సభను నిర్వహిస్తారు. 22 నుంచి 24 వరకు పద్మనాయిక కళ్యాణ మండపంలో పార్టీ ప్రతినిధుల సభలు జరగనున్నాయి. మహాసభలకు వివిధ జిల్లాల నుంచి 800 మంది పార్టీ ప్రతినిధులు, 2 వేల మంది ప్రత్యామ్నాయ ప్రతినిధులు హాజరు కానున్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే ప్రతినిధులు కరీంనగర్ చేరుకునేందుకు వరంగల్, పెద్దపల్లి రైల్వేస్టేషన్ల నుంచి వాహనాలను ఏర్పాటు చేశారు. విద్యుత్‌చార్జీలు, వ్యాట్ పెంపుపై ఉన్న శ్రద్ధ సంక్షేమంపై లేదని, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని రాష్ట్ర సభల్లో ఎండగడతామని కరీంనగర్‌లో సోమవారం విలేకరులతో నారాయణ అన్నారు.

21,343 టీచర్ పోస్టులు


డీఎస్స-12 నోటిఫికేషన్ విడుదల
మే 2,3,4 తేదీల్లో రాత పరీక్షలు
అప్రెంటీస్ విధానం రద్దు
‘ఇంటర్’ నిబంధన తొలగింపు
‘ఓపెన్ డిగ్రీ’ వారికీ అర్హత
ఎస్ఏ పోస్టులకు సబ్జెక్టు నిబంధనల సడలింపు
80 మార్కులకే డీఎస్సీ
20 మార్కులకు టెట్ వెయిటేజి
మరో 7100 పోస్టులకు రెండు రోజుల్లో నోటిఫికేషన్
హైదరాబాద్, జనవరి 30 : లక్షలాది మంది ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త. కొద్ది రో జులుగా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న ‘డీఎస్సీ -2012 నోటిఫికేషన్’ సో మవారం విడుదలైంది. మొత్తం 21,343 ఉపాధ్యాయ ఉద్యోగాలను ఇందులో నోటిఫై చేశారు. ఉపాధ్యాయ అభ్యర్థులు దశాబ్దకాలంగా చేస్తోన్న ‘అప్రెంటిస్’ రద్దు డిమాండ్ కూడా నెరవేరుతోంది. వివాదాస్పదంగా మారిన ‘ఇంటర్‌లో సంబంధిత సబ్జెక్టులు తప్పనిసరి’ అనే నిబంధనను తొలగించారు.
నోటిఫై చేసిన మొత్తం పోస్టుల్లో.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 5,703, ఎస్జీటీ పోస్టులు 11, 602 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్లు 2000, పీఈటీలు 365, మునిసిపల్ పాఠశాలల్లో 1,673 పోస్టులు ఉన్నాయి. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 17వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. సచివాలయంలో సోమవారం సాయంత్రం 3 గంటలకు మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కె.పార్థసారథి ఈ డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. డీఎస్సీకి విద్యార్హతల నిబంధనల్లో కొన్నింటిని సడలించారు.
స్కూల్ అసిస్టెంట్స్ (మేథ్స్, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్) పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్ స్థాయిలో కూడా మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, హిస్టరీ, జాగ్రఫీ సబ్జెక్టులు చదివి ఉండాలన్న నిబంధనలను తొలగించారు. అంటే.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్ చదివి ఉండాలన్న నిబంధన లేదు.
ఫలితంగా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా నేరుగా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు కూడా అర్హత లభిస్తుంది. స్కూల్ అసిస్టెంట్స్ (జీవశాస్త్రం) పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు జీ.వో.నెం.4లో పేర్కొన్న సబ్జెక్టులతో పాటు సెరికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, పౌల్ట్రీ సబ్జెక్టుల అభ్యర్థులకు కూడా అర్హత కల్పించారు. టీచర్లకు అప్రెంటిస్ విధానాన్ని ఈ డీఎస్సీ నుంచి రద్దు చేశారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు నమూనా, యూజర్ గైడ్ కోసం జ్ట్టిఞ://్చఞఛీటఛి.ఛిజజ.జౌఠి.జీn వెబ్‌సైట్‌ను చూసుకోవాలి.
డీఎస్సీ 80 మార్కులకే..
టెట్‌కు వెయిటేజీ ఇవ్వనున్న కారణంగా 80 మార్కులకే డీఎస్సీ పరీక్షను నిర్వహించనున్నారు. మిగతా 20 మార్కులకు టెట్ మార్కులను వెయిటేజీగా జమ చేస్తారు. ఒక్కో ప్రశ్నకు అర మార్కు చొప్పున 80 మార్కులకు 160 డీఎస్సీ పరీక్ష ఉంటుంది. ఎస్జీటీ పరీక్షలో జనరల్ నాలెడ్జ్‌కు 10 మార్కులు, పర్‌స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 10, ఇంగ్లీష్ 9, ఇండియన్ లాంగ్వేజ్ 9, మాథ్స్ 9, సైన్స్ 9, సోషల్ స్టడీస్ 9, టీచింగ్ మెథడ్ 15 మార్కులు ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్ పరీక్ష ల్లో.. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10, పర్‌స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 10, సబ్జెక్ట్ కంటెం ట్ 44, టీచింగ్ మెథడాలజీ 16 మార్కులు ఉంటాయి. పీ ఈటీలకు టెట్ ఉండకపోవ డం వల్ల పూర్తిగా 100 మా ర్కులకు పరీక్ష ఉంటుంది.

డీజీపీపై పొన్నం ఆరోపణల్లో నిజం లేదు – ఐపీఎస్‌ల ప్రకటన


తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసే లక్ష్యంతోనే రాష్ట్ర డీజీపీ దినేశ్‌డ్డి ఈ ప్రాంతంలో ఐపీఎస్‌ల బదిలీలు జరుపుతున్నారంటూ కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను శంషాబాద్ డీసీపీ సుధీర్‌బాబు, ఏసీబీ జాయింట్ డైరెక్టర్ శివశంకర్‌డ్డిలు ఖండించారు. ఈ మేరకు ఇద్దరు అధికారులు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు. రెండున్నరేళ్లపాటు మహబూబ్‌నగర్ జిల్లా ఎస్‌పీగా పనిచేసిన తరువాత తనను హైదరాబాద్‌కు బదిలీ చేయాలని డీజీపీ దినేష్‌డ్డికి తానే విజ్ఞప్తి చేశానని డీసీపీ సుధీర్‌బాబు తన ప్రకటనలో తెలిపారు. తన ఈ అభ్యర్థనను ప్రభుత్వం, డీజీపీ మన్నించి శంషాబాద్ జోన్ డీసీపీగా నియమించారన్నారు. కాగా, తాను నల్గొండ ఎస్‌పీగా పనిచేశానని శివశంకర్‌డ్డి తెలిపారు. ఆరోగ్య పరిస్థితుల కారణంగా తనను హైదరాబాద్ బదిలీ చేయాలని డీజీపీని కోరినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తనను ఏసీబీకి బదిలీ చేశారన్నారు. సమర్థవంతమైన డీజీపీ దినేష్‌డ్డి నాయకత్వంలో పోలీసుశాఖ ప్రతిష్ఠ ఇనుమడిస్తోందన్నారు.

free website analytics