మెదక్

రాష్ట్రంలో భానుడు ఉగ్రరూపం దాల్చాడు. రాష్ట్రం నిప్పుల కొలిమిగా మారింది. ప్రచండబానుడిదాటికి ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడదెబ్బతో 10మంది మృతిచెందారు. ఉదయం ఏడు గంటలనుంచే వేసవి ప్రతాపం చూపుతోంది. ఇళ్లలో విద్యుత్ వాడకం కూడా భారీగా పెరుగుతోంది. పలు జిల్లాల్లో విద్యుత్ కోతలు కూడా మళ్లీ మొదలయ్యాయి. బుధవారం హైదరాబాద్‌లోనూ అనధికారికంగా 3 గంటల విద్యుత్ కోత విధించారు. రాష్టవ్య్రాప్తంగా బుధవారం ఉష్ణోగ్రతలు తీవ్రరూపం దాల్చాయి. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు. ఈ సమయంలో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటాయి.
తెలంగాణతోపాటు రాయలసీమ జిల్లాల్లోనూ 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో సాధారణం కంటే 3 డిగ్రీలు, కోస్తోంధ్ర, రాయలసీమలో 1 నుంచి 3 డిగ్రీలు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదువుతన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం రెంటచింతలలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వ్యవసా య రంగానికి ప్రాణధారమైన నైరుతి రుతుపవనాలు జూన్ 1 కల్లా కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ విభాగం ప్రకటించిన విషయం తెలిసిందే. రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకేవరకు ఇదే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంటుందని అధికారులు చెబుతున్నారు. ఈసారి సాధారణ తేదీ కన్నా కొంత ఆలస్యంగా దక్షిణ అండమాన్ సముద్రంలో రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు.

పోలవరం సమస్యపై చర్చలకు
ఒడిశా సీఎంను ఆహ్వానించా
ఛత్తీస్‌గఢ్ సీఎంనూ సంప్రతిస్తాం
మంత్రి డీఎల్‌కు పనేమీ లేదు
మీడియా.. ప్రభుత్వానికి సలహాదారుగా
వ్యవహరించాలి.. విశాఖలో సీఎం కిరణ్
- ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌దే గెలుపు.. అందుకు నరసన్నపేట నుంచే శ్రీకారం
- మాజీ సీఎం వైఎస్‌కు కాంగ్రెస్ ఎంతో ప్రాధాన్యం ఇచ్చింది
- ఆయన కుటుంబానికి అనేక పదవులు కట్టబెట్టింది
- కాంగ్రెస్ మోసం చేసిందని జగన్ చెప్పుకోవడం సిగ్గుచేటు
- శ్రీకాకుళం ఉప ప్రచారంలో సీఎం
- ఇప్పుడే ఫలితాలు చెప్పేందుకు మేం జ్యోస్యులం కాదు: పీసీసీ చీఫ్ బొత్స
విశాఖపట్నం/శ్రీకాకుళం, మే 6:పోలవరం, ప్రాణహిత-చే ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించేందుకు తాము కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్తూ.. విశాఖపట్నం విమానాక్షిశయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో సమస్యను పరిష్కరించుకునేందుకు పొరుగు రాష్ట్రాలతో సంప్రతింపులు జరుపుతామని సీఎం చెప్పారు. దీనిపై ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ముఖ్యమంవూతులతో చర్చించి ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు.
పోలవరంపై చర్చలకు రావాలంటూ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను ఢిల్లీలో ఎన్‌సీటీసీ సదస్సు సందర్భంగా ఆహ్వానించినట్లు చెప్పారు. మంత్రి డీఎల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యల గురించి విలేకరులు ప్రస్తావించగా ఆయనకేం పనిలేదు, మీకేం పనిలేదు అని వ్యంగ్యంగా స్పందించారు. అభివృద్ధి కార్యక్షికమాల విషయంలో మీడియా ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరించాలని హితవు పలికారు. అనంతరం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నరసన్నపేటలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు లోక్‌సభతోపాటు అన్ని అసెంబ్లీ స్థానాల్లో తామే గెలుస్తామని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం నుంచే శ్రీకారం చుట్టాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.
మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్‌డ్డికి కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రాధాన్యం ఇచ్చిందని చెప్పారు. రాజశేఖర్‌డ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయనను ఎవరు విమర్శించినా తాను, ధర్మాన ప్రసాదరావు, ఇతర మంత్రులు తిప్పికొట్టామని, ఆయనకు రక్షణ కవచంలా నిలిచామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబానికి అనేక పదవులు ఇచ్చిందని తెలిపారు. ఇప్పుడు రాజశేఖర్‌డ్డి కుమారుడు జగన్ కాంగ్రెస్ పార్టీ తమను మోసం చేసిందని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ బహిరంగసభలో రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కొండ్రు మురళీమోహన్, శ్రీకాకుళం ఎంపీ కృపారాణి తదితరులు పాల్గొన్నారు.
అన్ని పార్టీల్లో కోవర్టులుంటారు: బొత్స
నరసన్నపేట ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డికి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌తోసహా కోవర్టులు ఏ పార్టీలోనైనా ఉంటారని వ్యాఖ్యానించారు. ఏదేమైనా ఉప ఎన్నికల్లో విజయమే తమ ముందున్న లక్ష్యమని చెప్పారు. ఉప ఎన్నికల అభ్యర్థు ఎంపిక సరిగానే జరిగిందని, ఇందులో చర్చకు తావులేదని అన్నారు. నెల్లూరు లోక్‌సభ స్థానంతోపాటు 1 అసెంబ్లీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా తాము ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పుడే ఫలితాలు చెప్పేందుకు తామేమీ జ్యోతీష్యులం కాదని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ఢిల్లీలో 5న మహారాష్ట్ర ప్రభుత్వంతో ప్రాణహిత -చెవేళ్ల ప్రాజెక్టు కోసం ఒప్పదం చేసుకోనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. మెదక్ జిల్లా జహీరాబాద్ నియోజవర్గం మల్‌చెల్మ గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపథం కార్యక్రమంలో గురువారం పాల్గొని ప్రసంగించారు. ప్రాణహిత-చెవేళ్ల ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణలో 16 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి 38 వేల కోట్ల రూపాయల వ్యయం కానుందని, అయితే ఈ ప్రాజెక్టు వ్యయం కోసం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 57 శాతం నిధులను ఖర్చు చేస్తోందన్నారు. కానీ జాతీయ ప్రాజెక్టుగా అనుమతి వస్తే 90 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం నుండి వస్తాయని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును కూడా జాతీయ ప్రాజెక్టుగా పూర్తి చేయాలని చూస్తున్నట్లు, అయతే అవగాహన లేని కొంతమంది ఇటీవల కోర్టును ఆశ్రయించడం అన్యాయమన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ, రాయలసీమ ప్రాంతానికి నికర జలాలు లభించే అవకాశం ఉందని గుర్తించాలని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు సాకారమయితే తెలంగాణలో అన్ని భూములు సస్యశ్యామలంగా మారనున్నాయన్నారు. చాలా కాలంగా రైతుల నుండి వస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసందానం చేయడానికి కృషి చేయడం జరుగుతోందని వెల్లడించారు. ఈ మేరకు ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌కు కూడా లేఖ రాయడం జరిగిందని అన్నారు. రైతు పంటల సాగు కోసం ఖర్చు చేస్తున్న ఖర్చులో 50 లేదా 40 శాతం ఈ పథకం కింద ఖర్చు చేయాలని ఇదీ నేరుగా రైతాంగానికి అందే విధంగా చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నట్లు తెలిపారు. మీ సేవ కార్యక్రమం ద్వారా 100 రకాల సేవలు ప్రజలకు అందుబాటులో రానున్నాయని తెలిపారు. దీని ద్వారా రెండు వేల కోట్ల రూపాయల అవినీతికి అడ్డుకట్ట వేసే అవకాశం ఉందన్నారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఇక ముందు నుండి సర్ట్ఫికెట్ల కోసం తిరగాల్సిన అవసరం లేదన్నారు. 15 నిమిషాల్లో అన్నిరకాల సర్ట్ఫికెట్లు ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు. అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాల రికార్డుల కంప్యూటరీకరణ పూర్తి కావడం జరుగుతోందని చిత్తూరులో విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందంటే అది కేవలం మెదక్ జిల్లా ప్రజల ఆశీర్వాదంతోనే సాధ్యమైందని, పది అసెంబ్లీ స్థానాలకు గాను ఎనిమిది చోట్ల కాంగ్రెస్‌ను గెలిపించారని, ఎన్ని సార్లు జిల్లాకు వచ్చిన రుణం తీర్చుకోలేనిదన్నారు. అయితే రానున్న ఎన్నికల్లో అన్ని సీట్లను గెలుచుకోవడానికి గురిపెట్టడం జరిగిందన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రణాళికను రూపొందించడం జరుగుతోందన్నారు. సిద్దిపేట ప్రాంతం నుండి టిఆర్‌ఎస్‌ను కూడా తరిమికొడతామని జ్యోసం చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మొట్టమొదటి సారిగా ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోస సబ్ ప్లాన్ అమలు చేయడానికి రానున్న రెండు మూడు నెలల కాలంలో ప్రత్యేక చట్టాన్ని తీసుకురానున్నట్లు వెల్లడించారు. మహిళలకు అన్నిరంగాల్లో 50 శాతం రిజర్వేషన్లను కల్పించడం జరిగిందని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా రిజర్వేషన్లను కల్పిస్తామని వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న మూడు నెలల కాలంలో నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
మీడియాపై అసహనం
కాగా, చివరగా ముఖ్యమంత్రి మీడియాపై తన ప్రసంగంలో అసహనం వ్యక్తం చేశారు. తన మాటలను వక్రీకరించి రాయడం శోచనీయమని, వాస్తవాలను రాయాలని సూచించారు. (చిత్రం) మెదక్ జిల్లా మల్‌చెల్మ గ్రామ సభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కిరణ్

ఎక్సైజ్ శాఖలో మద్యం ముడపులు అందుకున్న ఏ ఒక్కరినీ వదలకుండా అవినీతి నిరోదక శాఖ ఏరేసే కార్యక్రమాన్ని ఉధృతం చేసింది. ముడుపులు అందుకున్న మరికొందరు ఎక్సైజ్ అధికార్లను కోర్టు బోను ఎక్కించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే రాష్టవ్య్రాప్తంగా ఎక్సైజ్ కార్యాలయాలపై సోమవారం ఏకకాలంలో దాడులకు దిగింది. ఏసిబి సిట్ బృందాలు అనూహ్యంగా దాడులకు దిగాయి. ఎక్సైజ్ శాఖలో ఏళ్ల తరబడి ఒకే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న వారిపై గట్టి నిఘా పెట్టారు.
ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నవారి జాబితా తయారు చేసి ఉచ్చును మరింత బిగిస్తోంది. ఎసిబి అదనపు డైరక్టర్ శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలోని స్పెషల్ ఇనె్వస్టిగేషన్ బృందాలు ఈ కార్యక్రమంలో నిమగ్నమయ్యాయి. ఎక్సైజ్ శాఖలో మద్యం సిండికేట్ల నుంచి ముడుపులు అందుకున్న వారేకాకుండా, ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్న వారినీ తాజాగా ఎసిబి టార్గెట్ చేస్తోంది. విజయనగరం, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఎసిబి బృందాలు తనిఖీలు నిర్వహించాయి. కీలకమైన ఫైళ్లు, ఆఫీసు రికార్డులు, కంప్యూటర్ సామగ్రి, అధికారుల మొబైల్ నెంబర్లు స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయాల్లోని అధికారులను విచారించడంతోపాటు, వారి వద్దనున్న మొబైల్ నెంబర్లనుంచి గత కొన్ని రోజులుగా ఎవరెవరికి కాల్స్ వెళ్లిందీ విచారిస్తున్నారు. ఎసిబి దర్యాప్తుతో వ్యాపారాలు వదిలి అజ్ఞాతంలోకి వెళ్లిన సిండికేట్ల గురించీ సిట్ బృందాలు గాలిస్తున్నాయి. చిక్కడపల్లికి చెందిన మద్యం వ్యాపారి బాలరాజ్‌గౌడ్ అరెస్టు కాకుండా తప్పించుకుంటున్నాడు. ఇతను దేశం విడిచిపోకుండా ఎసిబి లుకౌట్ నోటీసు జారీ చేసింది. త్వరలోనే అరెస్టు చేస్తామని ఎసిబి వర్గాలు తెలిపాయి. ఇదిలావుంటే, విజయనగరం జిల్లాలోని ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఏసిబి బృందాలు తనిఖీలు నిర్వహించాయి. విజయనగరం జిల్లా కేంద్రం, పార్వతీపురం ఇఎస్ ఆఫీసుతోబాటు బొబ్బిలి సబ్ డివిజన్‌లో సైతం సోదాలు నిర్వహించారు. ఎసిబి డిఎస్పీ వెంకటేశ్వర రావు నేతృత్వంలో సిబ్బంది ఇఎస్ కార్యాలయానికి చేరుకుని 2010-12 మద్యం దుకాణాల టెండర్ రికార్డులు పరిశీలించారు.
పట్టు బిగిస్తున్న ఎసిబి
ఖమ్మం జిల్లాలో 2010 మద్యం టెండర్లలో 16 దుకాణాల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని నిర్థారించిన ఎసిబి, అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకునేందుకు ఎసిబి ఆధారాలు సేకరించే పనిలో పడింది. రెండురోజులుగ దాడులు కొనసాగిస్తున్న ఎసిబి, సోమవారం టెండర్లకు సంబంధించిన అన్ని ఫైళ్లనూ ఎసిబి డిఎస్పీ శంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో డిఆర్వో క్యాంప్ కార్యాలయం నుంచి స్వాధీనం చేసుకున్నారు. టెండర్ల సమయంలో జిల్లాలో పనిచేసిన జెసి అజీంతో పాటు పలువురు ఉన్నతాధికారుల ప్రమేయంపైనా విచారణ సాగుతోంది.
గుంటూరులోని ఎక్సైజ్ డిసి ఆఫీసులో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. సిండికేట్లు అందించిన వివరాలతో ఎక్సైజ్ అధికారుల పాత్రపై ఆరా తీస్తున్నారు. ఎసిబి జెడి రమేష్‌రెడ్డి ఆధ్వర్యంలో సోదాలు సాగాయి. 2010లో జరిగిన మద్యం టెండర్లలో అవకతవకలు జరిగాయని, సిండికేట్‌లకు షాపులు కేటాయించడంలో నిబంధనల ఉల్లంఘన వెల్లడైనట్టు సమాచారం. రికార్డులను స్వాధీనం చేసుకున్న ఎసిబి, చర్యలకు సిద్ధమవుతోంది. దాడుల సందర్భంలో డిసి కార్యాలయంలో ముఖ్య అధికార్లు అందుబాటులో లేకపోవడం గమనార్హం. అలాగే తెనాలి, నరసరావుపేట ఎక్సైజ్ కార్యాలయాల్లోనూ సోమవారం ఎసిబి బృందాలు దాడులు నిర్వహించి రికార్డులు తనిఖీలు చేశాయి. ఎసిబి డిఎస్పీ శివాజీ, విజయవాడ రేంజ్ ఎసిబి సిఐ టిఎస్‌కె రవి నేతృత్వంలో రికార్డులను పరిశీలించి, టెండర్ల విషయంలో అధికార్లు అక్రమాలకు పాల్పడ్డారా? అన్న అంశాలను పరిశీలించారు.
తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి, కాకినాడ, అమలాపురం ఇఎస్ కార్యాలయాలపై సోమవారం ఎసిబి బృందాలు దాడులు జరిపాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన సిట్ బృందాలు దాడుల్లో పాల్గొన్నాయి. 2010లో మద్యం దుకాణాల వేలం ప్రక్రియకు సంబంధించిన ఫైళ్లపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. దాడుల్లో ఎసిబి సిట్ డిఎస్పీలు విజయపాల్, లక్ష్మీపతి ఆధ్వర్యంలో ఇనస్పెక్టర్లు బి రామకృష్ణ, ఎస్ మురళీమోహన్ పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు, భీమవరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ అధికార్లు సోమవారం రికార్డులు పరిశీలించారు. ఏలూరులో హైదరాబాద్ ఎసిబి డిఎస్‌పి నరసింహారావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించగా, మధ్యాహ్నం నుంచి భీమవరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో విజయవాడ నుండి వచ్చిన బృందం ఆధ్వర్యంలో తనిఖీలు జరిపారు. దాడుల్లో భాగంగా కొన్ని ముఖ్యమైన ఫైళ్లను స్వాధీనం చేసుకుని, కార్యాలయాల్లోని కంప్యూటర్లలో నిక్షిప్తమైన సమాచారాన్ని సైతం ఎసిబి అధికార్లు సేకరించారు.
నెల్లూరు జిల్లాలోని నెల్లూరు, గూడూరు ఎక్సైజ్ కార్యాలయాల్లో ఎసిబి సోదాలు సాగాయి. మద్యం దుకాణాల లైసెన్సులు పరిశీలించి, 2010 నుంచి టెండర్లకు సంబంధించిన వివరాలు తీసుకున్నారు. కర్నూలు, కడప జిల్లాల్లో సైతం ఎక్సైజ్ కార్యాలయాలపై ఎసిబి దాడులు జరిపింది. 2010 వేలం పాటల రికార్డులు, టెండర్లలో పాల్గొన్న వారి వివరాలు, ఆస్తిపాస్తుల సమాచారం, మద్యం దుకాణాలను వేలంలో దక్కించుకున్న వారి వివరాలు సేకరించారు. అలాగే, మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ పట్టణాలలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల్లో ఎసిబి అధికారులు సోమవారం దాడులు నిర్వహించి సోదాలు చేశారు. మద్యం దుకాణాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.

ఇంకా పార్లమెంటు ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉంది. అధిష్ఠానం వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలపై దృష్టి కేంద్రకరిస్తోంది. అయితే.. రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యేల హడావిడి చూస్తే వచ్చే నెలలోనే పార్లమెంటు ఎన్నికలున్నట్లు ఒకరిపై మరొకరు పోటీ పడి కత్తులు దూసుకుంటున్నారు. రానున్న ఎన్నికల్లో తాము ఫలానా స్థానానికి పోటీ చేస్తా మని ప్రకటించి, సిట్టింగుల గుండెల్లో ఎమ్మెల్యేలు దడ పుట్టిస్తున్నారు. కాంగ్రెస్ మార్కు రాజకీయం ఇది. రాష్ట్ర కాంగ్రెస్‌లో ముందస్తు ముసలం రేగింది. ఎంపీ స్థానాలపై ఎమ్మె ల్యేలు కన్నేస్తున్నారు. వచ్చే ఎన్నికల తర్వాత కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఇదేవిధంగా అనిశ్చితి నెలకొంటుందని, ఈ గందరగోళంలో రాష్ట్ర రాజకీయాల కంటే కేంద్ర రాజ కీయాలే మంచిదన్న ముందుచూపుతో ఎమ్మెల్యేలు పార్లమెంటు స్థానాలపై గురి పెట్టారు. రానున్న ఎన్నికల్లో కేంద్రంలో మళ్లీ యుపీఏ అధికారంలోకి వస్తుందని, బీజేపీకి అధికారం లోకి వచ్చే అవకాశం లేదన్న ధీమాతోనే ఎంపీ సీట్లపై కన్నేసినట్లు స్పష్టమవుతోంది.
ఇది సహజంగానే సిట్టింగులకు కన్నెర్రగా మారింది. పక్కలో బాంబు పడినట్టయింది. తమ స్థానాలపై కన్నేసిన ఎమ్మెల్యేలపై ఎంపీలు కారాలు మిరియాలు నూరుతున్నారు. తాము కష్టపడి అభివృద్ధి చేసిన నియోజకవర్గాల్లో కాలుపెడితే ఖబడ్దార్ అంటూ బాహాటంగానే సొంత పార్టీ నేతలను హెచ్చరిస్తున్నారు.
ఈ వివాదం అందరికంటే ముందు విశాఖ నుంచి ఆరంభమయింది. అక్కడ ప్రాతినిధ్యం వహిస్తోన్న కేంద్రమంత్రి పురంధీశ్వరిని వచ్చే ఎన్నికల్లో విశాఖకు బదులుగా నర్సరావుపేట, ఒంగోలు వెళ్లాలని మాజీ ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి చాలాకాలం క్రితమే సలహా ఇచ్చారు. విశాఖలో తనకు ప్రజాభిమానం ఉందని చెప్పుకున్నారు. అయితే, తాను వచ్చే ఎన్నికల్లో కూడా విశాఖ నుంచే పోటీ చేస్తానని, కావాలంటే సుబ్బరామిరెడ్డిని వేరే నియోజకవర్గం వెతుక్కోవాలని ఆమె ప్రతి సలహా ఇచ్చారు. అయినప్పటికీ, సుబ్బరామిరెడ్డి పట్టు వదలని విక్రమార్కుడి మాదిరిగా ఎంపీ సీటు కోసం ఇప్పటినుంచే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదిలాఉండగా.. రాష్ట్ర రాజధాని నగరంలోని సికింద్రాబాద్ పార్లమెంటు స్థానంపైనా హోరాహోరీ మొదలయింది. రానున్న ఎన్నికల్లో తాను సికింద్రాబాద్ నుంచి పోటీ చేయబోతున్నానని మంత్రి ముఖేష్ పేల్చిన బాంబు కాంగ్రెస్‌లో ప్రకంపనలు కలిగిస్తున్నాయి. అంజన్ కావాలంటే ముషీరాబాద్ అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని సలహా ఇచ్చారు. సికింద్రాబాద్ నీ జాగీరు కాదని, నా నియోజకవర్గానికొస్తే ఖబడ్దార్, నీ బండారం బయటపెడతానని సిట్టింగ్ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్ నేరుగానే మంత్రిని హెచ్చరించారు. దానిపై మళ్లీ స్పందించిన ముఖేష్ సికింద్రాబాద్ తన జాగీరేనని, తాను పోటీ చేసేది ఖాయమని ముఖేష్ విస్పష్టంగా తేల్చి చెప్పారు.
ఈ వివాదం కొనసాగుతున్న సమయంలోనే నగరంలోని మరో పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజిగిరిలో అగ్గిరాజుకుంది. రానున్న ఎన్నికల్లో ఎంపీ సర్వే సత్యనారాయణ పోటీ చేస్తే ఓడిపోతారని సొంత పార్టీ ఎమ్మెల్యే రాజిరెడ్డి బహిరంగంగానే హెచ్చరించారు. తాను పోటీ చేస్తానని చెప్పకపోయినా తనకు ఆసక్తి ఉన్న విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. సర్వేకు సీటివ్వకూడదని, తాము ఒక అభ్యర్ధిని తయారుచేస్తామని, ముగ్గురు ఎమ్మెల్యేలదీ అదేమాట అని రాజిరెడ్డి కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
ఇక ఇప్పటివరకూ ఒక్కసారి కూడా ఓడిపోని చరిత్ర ఉన్న జేసీ దివాకర్‌రెడ్డికీ శాసనసభపై విరక్తి కలిగింది. రానున్న ఎన్నికల్లో అనంతపురం పార్లమెంటుకు పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇది అక్కడి సిట్టింగ్ ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డికి సెగ పుట్టిస్తోంది. ఇప్పుడున్న అనిశ్చిత రాజకీయ పరిస్థితిలో ఎమ్మెల్యే కంటే ఎంపీనే మంచిదని జేసీ బాహాటంగానే వ్యాఖ్యానించారు. ఇక నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి రాజీనామాను స్పీకర్ ఆమోదించడంతో అక్కడ కూడా ఇలాంటి కిరికిరే మొదలయింది. ఎంపీకి పోటీ చేసేందుకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి సిద్ధమవుతున్నారు. అయితే, మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి సతీమణి నేదురుమల్లి రాజ్యలక్ష్మి కూడా బరిలోకి దిగవచ్చంటున్నారు. దీనితో నెల్లూరు రాజకీయం కూడా వేడెక్కనుంది.
రంగారెడ్డి జిల్లా మేడ్చెల్ ఎంపీ సీటుపైనా అప్పుడే కిరికిరి మొదలయింది. ప్రస్తుతం అక్కడ ప్రాతినిధ్యం వహిస్తోన్న కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి వేరే నియోజకవర్గానికి వెళితే, తాను అక్కడి నుంచి పోటీ చేయాలని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి భావిస్తున్నారు. తాను ఖాళీ చేసిన మహేశ్వరం నుంచి తనయుడిని పోటీ చేయించాలని యోచిస్తున్నారు. మెదక్ జిల్లా ఎమ్మెల్యే, విప్ జగ్గారెడ్డి కూడా పార్లమెంటు సీటుపై మనసు పారేసుకున్నారు. రానున్న ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీచేస్తానని ముందస్తుగానే ప్రకటించారు.

రాష్ట్రంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మార్చి 18న పోలింగ్
ఉప ఎన్నికల నగారా మ్రోగింది. వివిధ రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న ఒక పార్లమెంటు, 11 శాసనసభా స్థానాల్లో ఉప ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్(సిఇసి) షెడ్యూల్ జారీ చేసింది. ఇందులో ప్రస్తుతం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఏడు శాసనసభా నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. రాష్ట్రంలో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, కోవూరు, స్టేషన్‌ఘన్‌పూర్, కొల్లాపూర్, అదిలాబాద్, కామారెడ్డి నియోజకవర్గాలు ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే రాజేశ్వరరెడ్డి మృతితో మహబూబ్‌నగర్ ఖాళీ కాగా జగన్ వర్గంలో చేరిన కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, తెలంగాణా రాష్ట్ర డిమాండ్‌తో నాగం జనార్ధన్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహా ఇతర ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ స్థానాలతో పాటు మంసా(గుజరాత్), పిరవొమ్(కేరళ), శంకరన్ కొవిల్(తమిళనాడు), అతాగర్(ఒడిషా) శాసనసభా స్థానాలకు, ఉడుపి చిక్మగలూర్(కర్నాటక) పార్లమెంటు స్థానానికి ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. ఉప ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 22న విడుదల కానుంది. ఫిబ్రవరి 22 నుంచి 29వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. మార్చి 18 న పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు 21న నిర్వహిస్తారు. కాగా ఉప ఎన్నికలు జరుగనున్న ఆయా స్థానాలకు సంబంధించిన జిల్లాల్లో ఎన్నికల నియమావళి వెంటనే అమల్లోకి వస్తుందని సిఇసి ఒక ప్రకటనలో తెలిపింది.కాగా జమ్మూకాశ్మీర్‌లో ఎమ్మెల్యేల కోటాలో శాసనమండలికి ఎన్నికైన యశ్‌పాల్ ఖజరియా మృతితో ఏర్పడిన ఖాళీ స్థానానికి ఇసి షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 22న ఆ స్థానానికి పోలింగ్ జరగనుంది.

తెలంగాణ రాష్ట్రం త్వరగా సిద్ధించాలని, ఈ ప్రాంత ప్రజలకు సుఖశాంతులు కలగాలని ఆక్షాంక్షిస్తూ తెలంగాణ భవన్‌లో గురువారం టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ చండీయాగాన్ని ప్రారంభించారు. మొదటి రోజు నవగ్రహ నక్షత్ర హోమంతో ప్రారంభమై, శుక్రవారం చండీయాగంతో ఇది ముగియనుందని యాగ నిర్వహకుడు ప్రముఖ జ్యోతిష్య పండితుడు వావిలాల దామోదరశర్మ తెలిపారు. ఇందులోభాగంగానే గురువారం నవగ్రహ నక్షత్ర హోమం, మహాన్యాస పూర్వక మృత్యుంజయ హోమం, కుభేర పాశుపత అభిషేక హోమాన్ని కెసిఆర్, ఆయన సతీమణి శోభా నిర్వహించగా, కుమార్తె కవిత, ఆ పార్టీ నేతలు కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. రెండవ రోజు శుక్రవారం కెసిఆర్ 58 ఏటా అడుగు పెట్టనున్న సందర్భంగా చండీయాగం పూర్ణాహుతితో ముగిసే విధంగా నిర్వహిస్తోన్నట్టు దామోదరశర్మ వివరించారు. ఇలా ఉండగా, యాగంలో ఈసారి తెలంగాణ ప్రాంతానికి చెందిన 23 మంది పండితులు మాత్రమే పాల్గొనడం విశేషం. (చిత్రం) ప్రత్యేక రాష్ట్రం త్వరగా సిద్ధించాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ భవన్‌లో గురువారం చండీయాగం నిర్వహిస్తున్న కెసిఆర్ కుటుంబం.

జాతీయ స్థాయి పెట్టుబడులు, పారిశ్రామిక ప్రగతిరేటులో మన రాష్ట్రం మూడో స్థానానికి ఎదిగిందని భారీ పరిశ్రమలశాఖ మంత్రి జె.గీతారెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 12 లక్షల 90 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని, తద్వారా 5,81,203 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయని పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అనేక ప్రోత్సహకాల వల్ల రాష్ట్రంలో భారీ పరిశ్రమలతో పాటు చిన్నతరహా, మధ్య తరహా పరిశ్రమలు భారీగా పెరుగుతున్నాయని, ఇది రాష్ట్ర ప్రగతికి శుభ పరిణామమని అన్నారు. పరిశ్రమలు, ఉత్పాదక, సేవా రంగాల్లో రాష్ట్రం సాధిస్తున్న వృద్ధిరేటుపై అసోచం సంస్థ నిర్వహించిన సర్వే నివేదికను వెల్లడిస్తూ, మంగళవారం సచివాల యంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమా వేశంలో మంత్రి మాట్లాడారు. 2010లో జాతీయ స్థాయి పెట్టుబడుల్లో మన రాష్ట్రం 5వ స్థానంలో ఉం డగా, ప్రస్తుతం 3వ స్థానానికి చేరుకున్నదని తెలిపారు. మొదటి స్థానంలో ఉన్న గుజరాత్ రాష్ట్రానికి 16.28 లక్షల కోట్లు పెట్టుబడులు రాగా, రెండో స్థానంలో ఉన్న మహారాష్ట్రకు 14.14 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు చెప్పారు.అదే విధంగా గత సంవత్సరం 8.66 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చిన ఆంధ్రప్రదేశ్‌కు ఈ ఏడాది 12.90 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, ఇదంతా తమ ప్రభుత్వం సాధించిన ఘనతేనని స్పష్టంచేశారు. పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు 32.5 శాతం, ఉత్పాదక రంగంలో పెట్టుబడులు 21.7 శాతం, సేవా రంగంలో పెట్టుబడులు 19.8 శాతం, సాగునీటి రంగంలో పెట్టుబడులు 11.6 శాతం, భూగర్భ గనుల రంగంలో పెట్టుబడులు 2.8 శాతం వృద్ధిరేటు సాధించినట్లు మంత్రి గీతారెడ్డి వెల్లడించారు. వ్యవసాయ రంగంలో 1,40,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో 11.6 శాతం వృద్ధిరేటు, పారిశ్రామిక రంగంలో 8,28,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో 68.6 శాతం, సర్వీసుల రంగంలో 2,39,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో 19.8 శాతం స్థూల వృద్ధిరేటు సాధించామన్నారు. ఇంకా 1,25,500 కోట్ల రూపాయల పెట్టుబడులతో 16,217 ఉత్పాదక పరిశ్రమలు నెలకొల్పే ప్రక్రియ కొనసాగుతోందని, తద్వారా మరో 3 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మంత్రి వెల్లడించారు.

డీఎస్స-12 నోటిఫికేషన్ విడుదల
మే 2,3,4 తేదీల్లో రాత పరీక్షలు
అప్రెంటీస్ విధానం రద్దు
‘ఇంటర్’ నిబంధన తొలగింపు
‘ఓపెన్ డిగ్రీ’ వారికీ అర్హత
ఎస్ఏ పోస్టులకు సబ్జెక్టు నిబంధనల సడలింపు
80 మార్కులకే డీఎస్సీ
20 మార్కులకు టెట్ వెయిటేజి
మరో 7100 పోస్టులకు రెండు రోజుల్లో నోటిఫికేషన్
హైదరాబాద్, జనవరి 30 : లక్షలాది మంది ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త. కొద్ది రో జులుగా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న ‘డీఎస్సీ -2012 నోటిఫికేషన్’ సో మవారం విడుదలైంది. మొత్తం 21,343 ఉపాధ్యాయ ఉద్యోగాలను ఇందులో నోటిఫై చేశారు. ఉపాధ్యాయ అభ్యర్థులు దశాబ్దకాలంగా చేస్తోన్న ‘అప్రెంటిస్’ రద్దు డిమాండ్ కూడా నెరవేరుతోంది. వివాదాస్పదంగా మారిన ‘ఇంటర్‌లో సంబంధిత సబ్జెక్టులు తప్పనిసరి’ అనే నిబంధనను తొలగించారు.
నోటిఫై చేసిన మొత్తం పోస్టుల్లో.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 5,703, ఎస్జీటీ పోస్టులు 11, 602 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్లు 2000, పీఈటీలు 365, మునిసిపల్ పాఠశాలల్లో 1,673 పోస్టులు ఉన్నాయి. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 17వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. సచివాలయంలో సోమవారం సాయంత్రం 3 గంటలకు మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కె.పార్థసారథి ఈ డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. డీఎస్సీకి విద్యార్హతల నిబంధనల్లో కొన్నింటిని సడలించారు.
స్కూల్ అసిస్టెంట్స్ (మేథ్స్, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్) పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్ స్థాయిలో కూడా మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, హిస్టరీ, జాగ్రఫీ సబ్జెక్టులు చదివి ఉండాలన్న నిబంధనలను తొలగించారు. అంటే.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్ చదివి ఉండాలన్న నిబంధన లేదు.
ఫలితంగా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా నేరుగా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు కూడా అర్హత లభిస్తుంది. స్కూల్ అసిస్టెంట్స్ (జీవశాస్త్రం) పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు జీ.వో.నెం.4లో పేర్కొన్న సబ్జెక్టులతో పాటు సెరికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, పౌల్ట్రీ సబ్జెక్టుల అభ్యర్థులకు కూడా అర్హత కల్పించారు. టీచర్లకు అప్రెంటిస్ విధానాన్ని ఈ డీఎస్సీ నుంచి రద్దు చేశారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు నమూనా, యూజర్ గైడ్ కోసం జ్ట్టిఞ://్చఞఛీటఛి.ఛిజజ.జౌఠి.జీn వెబ్‌సైట్‌ను చూసుకోవాలి.
డీఎస్సీ 80 మార్కులకే..
టెట్‌కు వెయిటేజీ ఇవ్వనున్న కారణంగా 80 మార్కులకే డీఎస్సీ పరీక్షను నిర్వహించనున్నారు. మిగతా 20 మార్కులకు టెట్ మార్కులను వెయిటేజీగా జమ చేస్తారు. ఒక్కో ప్రశ్నకు అర మార్కు చొప్పున 80 మార్కులకు 160 డీఎస్సీ పరీక్ష ఉంటుంది. ఎస్జీటీ పరీక్షలో జనరల్ నాలెడ్జ్‌కు 10 మార్కులు, పర్‌స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 10, ఇంగ్లీష్ 9, ఇండియన్ లాంగ్వేజ్ 9, మాథ్స్ 9, సైన్స్ 9, సోషల్ స్టడీస్ 9, టీచింగ్ మెథడ్ 15 మార్కులు ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్ పరీక్ష ల్లో.. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10, పర్‌స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 10, సబ్జెక్ట్ కంటెం ట్ 44, టీచింగ్ మెథడాలజీ 16 మార్కులు ఉంటాయి. పీ ఈటీలకు టెట్ ఉండకపోవ డం వల్ల పూర్తిగా 100 మా ర్కులకు పరీక్ష ఉంటుంది.

రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ కన్న కలలు, ఆయన ఆశయం నెరవేరే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లోకి అభివృద్ధి పనులు తీసుకెళ్తుందని, ఆ దిశగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అడుగడుగునా అభివృద్ధి జరిగేవిధంగా, అందరికీ ఉపాధి దొరికే విధంగా కృషిచేస్తున్నారని కోహీర్, న్యాల్‌కల్ మండలాల్లో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో మంత్రి గీతారెడ్డి అన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనలో అందరికీ ఉద్యోగాలు, రూ.1 కిలో బియ్యం, పంటల సబ్సిడీ, పలు రకాల అభివృద్ధి పనులతో ఎవరూ ఊహించని విధంగా ముందుకెళుతున్నారని ఆమె అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు లేకుండా చేయడానికి సీఎం నడుం బిగించారని, నిరుద్యోగులు లేనప్పుడే రాష్ట్రం అభివృద్ధిజరుగుతుందని ఆమె ఈ సందర్భంగా తెలిపారు.
జిల్లాలో రైతులకు, మహిళా సంఘాలకు కోట్లలో నిధులు మంజూరు చేసి, పావలా వడ్డీ కింద మరియు వివిధ పథకాల ద్వారా అభివృద్ధి జరిగేవిధంగా కృషిచేస్తున్నందుకు ముఖ్యమంత్రికి ధన్యావాదాలు తెలపాలని ఆమె అన్నారు. మెదక్ జిల్లాను ఎంతో అభివృద్ధి చేసిన ఘనత కిరణ్‌కుమార్‌కు దక్కుతుందని, జహీరాబాద్, సంగారెడ్డి, మెదక్, నారాయణఖేడ్, నర్సాపూర్, గజ్వేల్,సిద్ధిపేట, దొమ్మాట లాంటి నియోజకవర్గాల్లో వ్యవసాయం చేసుకొని బ్రతికే వారికి వ్యవసాయానికి సంబంధించిన పరికరాలు కూడా ఇప్పించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని ఆమె ఈ సందర్భంగా అన్నారు.