నల్గొండ

భానుడి భగభగ


రాష్ట్రంలో భానుడు ఉగ్రరూపం దాల్చాడు. రాష్ట్రం నిప్పుల కొలిమిగా మారింది. ప్రచండబానుడిదాటికి ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడదెబ్బతో 10మంది మృతిచెందారు. ఉదయం ఏడు గంటలనుంచే వేసవి ప్రతాపం చూపుతోంది. ఇళ్లలో విద్యుత్‌ వాడకం కూడా భారీగా పెరుగుతోంది. పలు జిల్లాల్లో విద్యుత్‌ కోతలు కూడా మళ్లీ మొదలయ్యాయి. బుధవారం హైదరాబాద్‌లోనూ అనధికారికంగా 3 గంటల విద్యుత్‌ కోత విధించారు. రాష్టవ్య్రాప్తంగా బుధవారం ఉష్ణోగ్రతలు తీవ్రరూపం దాల్చాయి. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు. ఈ సమయంలో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటాయి.
తెలంగాణతోపాటు రాయలసీమ జిల్లాల్లోనూ 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో సాధారణం కంటే 3 డిగ్రీలు, కోస్తోంధ్ర, రాయలసీమలో 1 నుంచి 3 డిగ్రీలు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదువుతన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం రెంటచింతలలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వ్యవసా య రంగానికి ప్రాణధారమైన నైరుతి రుతుపవనాలు జూన్‌ 1 కల్లా కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ విభాగం ప్రకటించిన విషయం తెలిసిందే. రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకేవరకు ఇదే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంటుందని అధికారులు చెబుతున్నారు. ఈసారి సాధారణ తేదీ కన్నా కొంత ఆలస్యంగా దక్షిణ అండమాన్‌ సముద్రంలో రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు.

జాతీయ హోదాకు కృషి చేస్తాం


పోలవరం సమస్యపై చర్చలకు
ఒడిశా సీఎంను ఆహ్వానించా
ఛత్తీస్‌గఢ్ సీఎంనూ సంప్రతిస్తాం
మంత్రి డీఎల్‌కు పనేమీ లేదు
మీడియా.. ప్రభుత్వానికి సలహాదారుగా
వ్యవహరించాలి.. విశాఖలో సీఎం కిరణ్
- ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌దే గెలుపు.. అందుకు నరసన్నపేట నుంచే శ్రీకారం
- మాజీ సీఎం వైఎస్‌కు కాంగ్రెస్ ఎంతో ప్రాధాన్యం ఇచ్చింది
- ఆయన కుటుంబానికి అనేక పదవులు కట్టబెట్టింది
- కాంగ్రెస్ మోసం చేసిందని జగన్ చెప్పుకోవడం సిగ్గుచేటు
- శ్రీకాకుళం ఉప ప్రచారంలో సీఎం
- ఇప్పుడే ఫలితాలు చెప్పేందుకు మేం జ్యోస్యులం కాదు: పీసీసీ చీఫ్ బొత్స
విశాఖపట్నం/శ్రీకాకుళం, మే 6:పోలవరం, ప్రాణహిత-చే ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించేందుకు తాము కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్తూ.. విశాఖపట్నం విమానాక్షిశయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో సమస్యను పరిష్కరించుకునేందుకు పొరుగు రాష్ట్రాలతో సంప్రతింపులు జరుపుతామని సీఎం చెప్పారు. దీనిపై ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ముఖ్యమంవూతులతో చర్చించి ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు.
పోలవరంపై చర్చలకు రావాలంటూ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను ఢిల్లీలో ఎన్‌సీటీసీ సదస్సు సందర్భంగా ఆహ్వానించినట్లు చెప్పారు. మంత్రి డీఎల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యల గురించి విలేకరులు ప్రస్తావించగా ఆయనకేం పనిలేదు, మీకేం పనిలేదు అని వ్యంగ్యంగా స్పందించారు. అభివృద్ధి కార్యక్షికమాల విషయంలో మీడియా ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరించాలని హితవు పలికారు. అనంతరం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నరసన్నపేటలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు లోక్‌సభతోపాటు అన్ని అసెంబ్లీ స్థానాల్లో తామే గెలుస్తామని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం నుంచే శ్రీకారం చుట్టాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.
మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్‌డ్డికి కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రాధాన్యం ఇచ్చిందని చెప్పారు. రాజశేఖర్‌డ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయనను ఎవరు విమర్శించినా తాను, ధర్మాన ప్రసాదరావు, ఇతర మంత్రులు తిప్పికొట్టామని, ఆయనకు రక్షణ కవచంలా నిలిచామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబానికి అనేక పదవులు ఇచ్చిందని తెలిపారు. ఇప్పుడు రాజశేఖర్‌డ్డి కుమారుడు జగన్ కాంగ్రెస్ పార్టీ తమను మోసం చేసిందని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ బహిరంగసభలో రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కొండ్రు మురళీమోహన్, శ్రీకాకుళం ఎంపీ కృపారాణి తదితరులు పాల్గొన్నారు.
అన్ని పార్టీల్లో కోవర్టులుంటారు: బొత్స
నరసన్నపేట ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డికి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌తోసహా కోవర్టులు ఏ పార్టీలోనైనా ఉంటారని వ్యాఖ్యానించారు. ఏదేమైనా ఉప ఎన్నికల్లో విజయమే తమ ముందున్న లక్ష్యమని చెప్పారు. ఉప ఎన్నికల అభ్యర్థు ఎంపిక సరిగానే జరిగిందని, ఇందులో చర్చకు తావులేదని అన్నారు. నెల్లూరు లోక్‌సభ స్థానంతోపాటు 1 అసెంబ్లీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా తాము ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పుడే ఫలితాలు చెప్పేందుకు తామేమీ జ్యోతీష్యులం కాదని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

సమస్యల పరిష్కారానికే ప్రజాపథం


తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం చేసేందుకు కీలమైన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించేందుకు కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా ఆలేరు నియోజకవర్గం యాదగిరిగుట్ట మండలం సైదాపురం, హుజూర్‌నగర్ నియోజకవర్గం మేళ్లచెర్వు మండలంలోని మల్లారెడ్డిగూడెం ప్రజాపథం బహిరంగ సభలలో ప్రసంగించారు.
మల్లారెడ్డిగూడెంలో దొండపాడు, నక్కగూడెం ఎత్తిపోతల పథకాల ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ప్రజాసమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారించటానికే ప్రజాపథం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. పులిచింతల ప్రాజెక్టు నిర్వాసితుల త్యాగాలు మరువలేనివని 14వేల ఎకరాల భూములను, ఇళ్లను అన్నింటిని వదులుకున్న వారికి ఎంతైనా సహాయం చేయడం ప్రభుత్వం బాధ్యతన్నారు. పులిచింతల నిర్వాసితుల భూముల సాగునీటికి 1టిఎంసి ప్రాజెక్టు నీటిని వాడుకునేందుకు 75కోట్ల వ్యయంతో ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. నిర్వాసితుల్లోని ఎస్సీ, ఎస్టీల ఇళ్ల నిర్మాణ మొత్తాన్ని 53వేల నుండి లక్ష 18వేల వరకు, బిసిలకు 98వేల వరకు పెంచుతున్నట్లుగా ప్రకటించారు. మహిళాభివృద్ధితోనే కుటుంబ సంక్షేమం, రాస్ట్ర పురోగతి సాధ్యమని తలిచి 1500కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామన్నారు. గత ఐదేళ్లలో మహిళలకు 2వేల కోట్ల రుణాలు ఇవ్వగా తన హాయంలో 1200కోట్లు ఇవ్వడం జరిగిందన్నారు. కాంగ్రెస్ వైపు మహిళలను ఆకట్టుకునేందుకు దివంగత వైఎస్.రాజశేఖర్‌రెడ్డికి తానే పావలా వడ్డీ రుణ పథకం సలహా ఇచ్చానన్నారు. యువత ఉపాధికి లక్ష 20వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగిస్తున్నామన్నారు. మరో 5లక్షల ఉద్యోగాలను రాజీవ్ యువకిరణాల ద్వారా భర్తీ చేస్తున్నామన్నారు. 95లక్షల మంది రైతులకు ఈ సంవత్సరం వడ్డిలేని రుణాలు అందిస్తున్నామన్నారు. నిమ్స్ ఆసుపత్రిని 150పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా త్వరలో ప్రారంభిస్తామని ప్రకటించారు. మూసీ కాలువల నిర్మాణాలకు 50కోట్లు మంజూరు చేస్తామన్నారు. హుజూర్‌నగర్, ఆలేరు నియోజకవర్గాల్లో డిగ్రీ కళాశాలలు, 4జూనియర్ కళాశాలలు, ఐటిఐ కళాశాలలు మంజూరు చేస్తున్నట్లుగా సిఎం ప్రకటించారు.

కేసీఆర్‌ x మోత్కుపల్లి


ఉప ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణలో నేతల మధ్య మాటల వేడి తీవ్రతరమవుతున్నది. ఎన్నికలను ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటంతో మాటల యుద్ధం రోజు రోజుకూ పెరిగిపోతూనే ఉంది. ప్రధానంగా ఆరు స్థానాలలో తమదే విజయమంటున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌ టార్గెట్‌గా టీడీఎల్పీ ఉప నాయ కుడు మోత్కుపల్లి నర్సింలు గత కొంతకాలం నుంచి నిర్వి రామంగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కేసీఆర్‌ను విమర్శించటానికి తెలుగు భాష, ప్రత్యేకించి తెలంగాణ భా షలో ఎన్ని విశేషణాలు ఉన్నాయో అన్నిటినీ మోత్కుపల్లి యథేచ్ఛగా ఉపయోగించు కుంటున్నారు.
తాగుబోతు, తిరుగుబోతు
కొద్ది రోజుల క్రితం కేసీఆర్‌పై విరుచుకుపడుతూ మోత్కుపల్లి ఆయనను తాగుబోతు, తిరుగుబోతు అని అభివర్ణించారు. అమాయకులైన తెలంగాణ బడుగు, బలహీన వర్గాల యువకులు, విద్యార్థులను బలిగొన్న నరరూప రాక్షసుడు అని విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ వైఖరి వల్లనే ప్రొఫెసర్‌ జయశంకర్‌ దిగులుతో మరణించారన్నారు. కేసీఆర్‌ వైఖరిని ఎండగడుతూ పాదయాత్ర ప్రారంభించిన మోత్కుపల్లి, శుక్రవారం మరో సంచలనాత్మకమైన బాంబు పేల్చారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని, అప్పుడు తెలంగాణ భవన్‌ను స్వాధీనం చేసుకొని అమ్మివేసి అమరవీరుల కుటుంబాలకు పంచిపెడతామని ప్రకటించారు. నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ భవన్‌లో చానల్‌ను నిర్వహిస్తున్నందున ప్రభుత్వం ఇప్పుడే దాన్ని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. విచిత్రం ఏమిటంటే మోత్కుపల్లి మొదటి నుంచీ కేసీఆర్‌నే టార్గెట్‌గా చేసుకొని విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్‌పై విమర్శలకు అంతంతవరకే పరిమితమయ్యారు.
టీఆర్‌ఎస్‌… పైపై మాటలే
అటు మోత్కుపల్లి రోజు రోజుకూ మాటల తీవ్రతను పెంచుతుంటే టీఆర్‌ఎస్‌ వైపు నుంచి వస్తున్న స్పందన అంతంతమాత్రంగానే ఉంటూ వస్తున్నది. ఛోటా మోటా నేతలు అప్పుడప్పుడూ మీడియా సమావేశాలు నిర్వహించి విమర్శించటం మినహా ఆయన చేసిన ఆరోపణలకు టీఆర్‌ఎస్‌ జవాబు చెప్పలేకపోతున్నదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సీనియర్‌ నేతలంతా ప్రచార బాధ్యతల్లో బిజీగా ఉండటంతో మోత్కుపల్లి దూకుడుకు అడ్డుకట్ట వేసే నేతలే ఉండటం లేదు…
డీకే వర్సెస్‌ జూపల్లి
ఇక పాలమూరు జిల్లా కొల్లాపురం స్థానానికి జరిగే ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మంత్రి డీకే అరుణ అన్నీ తానై పర్యవేక్షింటంతో పాటు తన బద్ధ విరోధి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జూపల్లి కృష్ణారావును ఎలాగైనా ఓడించి తీరాలన్న పట్టుదలతో రోజుకో రకమైన విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తాను పట్టుపట్టి విష్ణువర్ధన్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయించటంతో ఈ ఎన్నిక ఆమెకు అగ్ని పరీక్షగా మారింది. ఇటీవలే జూపల్లికి మద్దతుగా ప్రచారం చేసేందుకు వెళ్ళిన ఉస్మానియా వర్సిటీ విద్యార్థులపై కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడులు జరపటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
హరీశ్‌ వర్సెస్‌ కడియం
వరంగల్‌ జిల్లా స్టేషన్‌ ఘనపూర్‌ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కడియం శ్రీహరి టార్గెట్‌గా టీఆర్‌ఎస్‌ ప్రచారం సాగుతోంది. టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి, కేసీఆర్‌ మేనల్లుడు తన్నీరు హరీశ్‌రావు స్వయంగా ఇక్కడ పార్టీ అభ్యర్థి టి.రాజయ్య ప్రచార భారాన్ని తలకెత్తుకున్నారు. ఫలితంగా ఇటు హరీశ్‌, అటు శ్రీహరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. శ్రీహరి మంత్రిగా ఉండగా వోట్లు రాల్చుకోవటం కోసం హడావుడిగా దేవాదుల ప్రాజెక్టుకు పునాదిరాయి వేయించి ఆ తర్వాత మొండిచేయి చూపారని టీఆర్‌ఎస్‌ అంటుంటే, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులను అమానుషంగా ఆత్మహత్యలకు ప్రేరేపించిన చరిత్ర కేసీఆర్‌ది అని శ్రీహరి ప్రచారంలో విరుచుకుపడుతున్నారు.
రేవంత్‌ వర్సెస్‌ కోదండ
ఇక టీడీపీ యువ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ కోదండరామిరెడ్డి మధ్య సైతం ఇలాంటి యుద్ధమే జరుగుతోంది. గత కొద్ది రోజుల నుంచీ కేసీఆర్‌, కోదండను టార్గెట్‌ చేసుకున్న రేవంత్‌ తాజాగా మరోసారి విరుచుకుపడ్డారు. పాలమూరులో ఎవరికైనా వోటు వేయవచ్చునన్న కోదండ ప్రకటనను ఎద్దేవా చేస్తూ ఆయనకు రెండు కళ్ళు, రెండు నాల్కలూ ఉన్నాయన్నారు. కాంగ్రెస్‌ సృష్టించిన కవల పిల్లలు కేసీఆర్‌, కోదండరామిరెడ్డి అని దుయ్యబట్టారు. మిగిలిన నియోజకవర్గాలలోనూ టీడీపీ, టీఆర్‌ఎస్‌, టీడీపీ, కాంగ్రెస్‌ నేతల మధ్య ఇలాంటి మాటల యుద్ధమే సాగుతోంది. కాలం గడిచే కొద్దీ ఈ తిట్లు ఏ స్థాయికి పోతాయో ఊహించలేకపోతున్నామని అన్ని పార్టీలలో సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

విరుచుకుపడిన ఎసిబి


ఎక్సైజ్ శాఖలో మద్యం ముడపులు అందుకున్న ఏ ఒక్కరినీ వదలకుండా అవినీతి నిరోదక శాఖ ఏరేసే కార్యక్రమాన్ని ఉధృతం చేసింది. ముడుపులు అందుకున్న మరికొందరు ఎక్సైజ్ అధికార్లను కోర్టు బోను ఎక్కించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే రాష్టవ్య్రాప్తంగా ఎక్సైజ్ కార్యాలయాలపై సోమవారం ఏకకాలంలో దాడులకు దిగింది. ఏసిబి సిట్ బృందాలు అనూహ్యంగా దాడులకు దిగాయి. ఎక్సైజ్ శాఖలో ఏళ్ల తరబడి ఒకే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న వారిపై గట్టి నిఘా పెట్టారు.
ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నవారి జాబితా తయారు చేసి ఉచ్చును మరింత బిగిస్తోంది. ఎసిబి అదనపు డైరక్టర్ శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలోని స్పెషల్ ఇనె్వస్టిగేషన్ బృందాలు ఈ కార్యక్రమంలో నిమగ్నమయ్యాయి. ఎక్సైజ్ శాఖలో మద్యం సిండికేట్ల నుంచి ముడుపులు అందుకున్న వారేకాకుండా, ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్న వారినీ తాజాగా ఎసిబి టార్గెట్ చేస్తోంది. విజయనగరం, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఎసిబి బృందాలు తనిఖీలు నిర్వహించాయి. కీలకమైన ఫైళ్లు, ఆఫీసు రికార్డులు, కంప్యూటర్ సామగ్రి, అధికారుల మొబైల్ నెంబర్లు స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయాల్లోని అధికారులను విచారించడంతోపాటు, వారి వద్దనున్న మొబైల్ నెంబర్లనుంచి గత కొన్ని రోజులుగా ఎవరెవరికి కాల్స్ వెళ్లిందీ విచారిస్తున్నారు. ఎసిబి దర్యాప్తుతో వ్యాపారాలు వదిలి అజ్ఞాతంలోకి వెళ్లిన సిండికేట్ల గురించీ సిట్ బృందాలు గాలిస్తున్నాయి. చిక్కడపల్లికి చెందిన మద్యం వ్యాపారి బాలరాజ్‌గౌడ్ అరెస్టు కాకుండా తప్పించుకుంటున్నాడు. ఇతను దేశం విడిచిపోకుండా ఎసిబి లుకౌట్ నోటీసు జారీ చేసింది. త్వరలోనే అరెస్టు చేస్తామని ఎసిబి వర్గాలు తెలిపాయి. ఇదిలావుంటే, విజయనగరం జిల్లాలోని ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఏసిబి బృందాలు తనిఖీలు నిర్వహించాయి. విజయనగరం జిల్లా కేంద్రం, పార్వతీపురం ఇఎస్ ఆఫీసుతోబాటు బొబ్బిలి సబ్ డివిజన్‌లో సైతం సోదాలు నిర్వహించారు. ఎసిబి డిఎస్పీ వెంకటేశ్వర రావు నేతృత్వంలో సిబ్బంది ఇఎస్ కార్యాలయానికి చేరుకుని 2010-12 మద్యం దుకాణాల టెండర్ రికార్డులు పరిశీలించారు.
పట్టు బిగిస్తున్న ఎసిబి
ఖమ్మం జిల్లాలో 2010 మద్యం టెండర్లలో 16 దుకాణాల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని నిర్థారించిన ఎసిబి, అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకునేందుకు ఎసిబి ఆధారాలు సేకరించే పనిలో పడింది. రెండురోజులుగ దాడులు కొనసాగిస్తున్న ఎసిబి, సోమవారం టెండర్లకు సంబంధించిన అన్ని ఫైళ్లనూ ఎసిబి డిఎస్పీ శంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో డిఆర్వో క్యాంప్ కార్యాలయం నుంచి స్వాధీనం చేసుకున్నారు. టెండర్ల సమయంలో జిల్లాలో పనిచేసిన జెసి అజీంతో పాటు పలువురు ఉన్నతాధికారుల ప్రమేయంపైనా విచారణ సాగుతోంది.
గుంటూరులోని ఎక్సైజ్ డిసి ఆఫీసులో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. సిండికేట్లు అందించిన వివరాలతో ఎక్సైజ్ అధికారుల పాత్రపై ఆరా తీస్తున్నారు. ఎసిబి జెడి రమేష్‌రెడ్డి ఆధ్వర్యంలో సోదాలు సాగాయి. 2010లో జరిగిన మద్యం టెండర్లలో అవకతవకలు జరిగాయని, సిండికేట్‌లకు షాపులు కేటాయించడంలో నిబంధనల ఉల్లంఘన వెల్లడైనట్టు సమాచారం. రికార్డులను స్వాధీనం చేసుకున్న ఎసిబి, చర్యలకు సిద్ధమవుతోంది. దాడుల సందర్భంలో డిసి కార్యాలయంలో ముఖ్య అధికార్లు అందుబాటులో లేకపోవడం గమనార్హం. అలాగే తెనాలి, నరసరావుపేట ఎక్సైజ్ కార్యాలయాల్లోనూ సోమవారం ఎసిబి బృందాలు దాడులు నిర్వహించి రికార్డులు తనిఖీలు చేశాయి. ఎసిబి డిఎస్పీ శివాజీ, విజయవాడ రేంజ్ ఎసిబి సిఐ టిఎస్‌కె రవి నేతృత్వంలో రికార్డులను పరిశీలించి, టెండర్ల విషయంలో అధికార్లు అక్రమాలకు పాల్పడ్డారా? అన్న అంశాలను పరిశీలించారు.
తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి, కాకినాడ, అమలాపురం ఇఎస్ కార్యాలయాలపై సోమవారం ఎసిబి బృందాలు దాడులు జరిపాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన సిట్ బృందాలు దాడుల్లో పాల్గొన్నాయి. 2010లో మద్యం దుకాణాల వేలం ప్రక్రియకు సంబంధించిన ఫైళ్లపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. దాడుల్లో ఎసిబి సిట్ డిఎస్పీలు విజయపాల్, లక్ష్మీపతి ఆధ్వర్యంలో ఇనస్పెక్టర్లు బి రామకృష్ణ, ఎస్ మురళీమోహన్ పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు, భీమవరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ అధికార్లు సోమవారం రికార్డులు పరిశీలించారు. ఏలూరులో హైదరాబాద్ ఎసిబి డిఎస్‌పి నరసింహారావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించగా, మధ్యాహ్నం నుంచి భీమవరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో విజయవాడ నుండి వచ్చిన బృందం ఆధ్వర్యంలో తనిఖీలు జరిపారు. దాడుల్లో భాగంగా కొన్ని ముఖ్యమైన ఫైళ్లను స్వాధీనం చేసుకుని, కార్యాలయాల్లోని కంప్యూటర్లలో నిక్షిప్తమైన సమాచారాన్ని సైతం ఎసిబి అధికార్లు సేకరించారు.
నెల్లూరు జిల్లాలోని నెల్లూరు, గూడూరు ఎక్సైజ్ కార్యాలయాల్లో ఎసిబి సోదాలు సాగాయి. మద్యం దుకాణాల లైసెన్సులు పరిశీలించి, 2010 నుంచి టెండర్లకు సంబంధించిన వివరాలు తీసుకున్నారు. కర్నూలు, కడప జిల్లాల్లో సైతం ఎక్సైజ్ కార్యాలయాలపై ఎసిబి దాడులు జరిపింది. 2010 వేలం పాటల రికార్డులు, టెండర్లలో పాల్గొన్న వారి వివరాలు, ఆస్తిపాస్తుల సమాచారం, మద్యం దుకాణాలను వేలంలో దక్కించుకున్న వారి వివరాలు సేకరించారు. అలాగే, మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ పట్టణాలలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల్లో ఎసిబి అధికారులు సోమవారం దాడులు నిర్వహించి సోదాలు చేశారు. మద్యం దుకాణాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.

బొక్క నాకే కుక్కలతో తెలంగాణ రాదు: మోత్కుపల్లి


“కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా ఇంటివద్ద బొక్క నాకే కుక్క కేసీఆర్. ఉద్యమాన్ని వ్యాపారంగా మార్చి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని సోనియా కాళ్ల వద్ద తాకట్టు పెట్టిన ద్రోహి. గుజరాత్‌లో షిప్పులు.. ఢిల్లీలో భూములు.. హైదరాబాద్‌లో ఆస్తులు! ఇలాంటి ద్రోహులు, వ్యాపారులతో తెలంగాణ రావడం కల్ల. ఇలాంటి మోసకారులకు ప్రజలు పాతరేసి భూస్థాపితం చేస్తేనే తెలంగాణ తొందరగా వస్తుంది” అని టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యానించారు.  శనివారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడారు. ఉద్యమం పేరిట రెచ్చగొట్టి 700మంది బలహీనవర్గాల వారి పిల్లలను బలిగొన్నాడంటూ కేసీఆర్‌పై మండిపడ్డారు. “ఒక దొంగ, ద్రోహి, రాజకీయ బ్రోకర్, తాగుబోతు, తిరుగుబోతు రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీ పెడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు అలాగే ఉంది. ఉద్యమం నడిపించుడు.. దానిని అమ్ముకొనుడు! దొంగ పాసుపోర్టులు అమ్ముకోవడంతో తన జీవితం మొదలు పెట్టిన కేసీఆర్ దేన్నైనా అమ్మగలనని ప్రతిరోజూ రుజువు చేస్తున్నారు. ఆయన ఒక చందాల రాయుడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల పిల్లలను బలి తీసుకొన్న బకాసురుడు. ఆయన కుటుంబం ఒక పాపాల పుట్ట. ఉద్యమం జోరుగా నడిచినంతకాలం సీపీఐ నారాయణ కనిపించలేదు.  ఢిల్లీ తీసుకువెళ్లడానికి ఆయన పనికిరాలేదు. తను.. తన పార్టీ బలహీనపడిన తర్వాత దేహీ అంటూ ఓట్ల కోసం నారాయణ కాళ్లు పట్టుకొంటున్నాడు. తెలంగాణ కోసం ఒక్క పార్టీతో కూడా మాట్లాడని నీలాంటి వెధవ ఉంటే ఎంత.. లేకపోతే ఎంత?” అని మోత్కుపల్లి ధ్వజమెత్తారు. తెలంగాణ రాకపోతే భూకంపం సృష్టిస్తానని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు తన ముడ్డి కిందకు భూకంపం వచ్చేసరికి నారాయణ వద్దకు పరిగెత్తారని ఆయన ఎద్దేవా చేశారు.
జోనల్ విధానం వద్దని అసెంబ్లీ సాక్షిగా కోరిన తెలంగాణ ద్రోహి కేసీఆర్ అంటూ.. గతంలో అసెంబ్లీలో కేసీఆర్ చేసిన ప్రసంగాన్ని మోత్కుపల్లి చదివారు. కేసీఆర్ ఆనాడు టీడీపీలో ఉన్నప్పటికీ తమ పార్టీ విధానం కాదని, అది పార్టీ విధానం అయి ఉంటే దాన్ని తమ పార్టీ అప్పుడే రద్దు చేసి ఉండేదని నర్సింహులు ఒక ప్రశ్నకు సమాధానంగా బదులిచ్చారు. “వలస వచ్చినవాడివి కాబట్టే పదకొండేళ్లుగా జనాన్ని ఏడిపిస్తున్నావు” అంటూ కేసీఆర్‌పై ఆయన నిప్పులు చెరిగారు. పదకొండేళ్ల నుంచి కేసీఆర్ చేస్తున్న మోసానికి నిరసనగా పదకొండు రోజులపాటు అమరవీరుల స్థూపం వద్దకు పాదయాత్రలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
ఈ నెల ఆరో తేదీ నుంచి పదహారో తేదీ వరకూ రోజూ ఉదయం తన ఇంటి నుంచి అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమర వీరుల స్థూపం వరకూ పాదయాత్ర నిర్వహిస్తానని, 17న ఉదయం నుం చి సాయంత్రం వరకూ నిరాహార దీక్ష చేస్తానని తెలిపారు. అమర వీరుల కుటుంబాలను శక్తికొద్దీ ఆదుకోవాలని నిర్ణయించామని, కుటుంబానికీరూ.50వేలు అందిస్తామని చెప్పారు. ఎన్నికలు జరి గే జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల వారికి ఈ సాయం ఇప్పుడు ఇచ్చి.. ఆ జిల్లాల వారికి ఎన్నికల తర్వాత ఇస్తామని చెప్పారు. ఆ కుటుంబాల వారు తమ గ్రామం లేదా మండలానికి చెందిన టీడీపీ ఇన్‌చార్జిని సంప్రదించి ఆయనను తీసుకొని తమ వద్దకు వస్తే సాయం ఇస్తామని మోత్కుపల్లి స్పష్టం చేశారు.

జోడు పదవులు వద్దు!


విధాన నిర్ణయం ప్రకటించాలి: దామోదర్
ఔను.. ఒకరికి ఒక పదవే ఉండాలి: కేఎల్ఆర్
“తెలంగాణకే పీసీసీ చీఫ్, సభాపతి పదవులు దక్కాలి’ అనే నినాదాన్ని అందుకున్న మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి తన స్వరాన్ని మరింత పెంచారు. “ఒక వ్యక్తికి ఒకే పదవి ఉండాలి. ముఖ్యంగా మంత్రులకు జోడు పదవులు ఉండకూడదు. దీనిపై విధానపరమైన నిర్ణయం ప్రకటించాలని అధిష్ఠానాన్ని కోరతాను” అని గురువారం మీడియాతో అన్నారు.
అధిష్ఠానం ప్రాధాన్యం ఇస్తున్న చిరంజీవిపైనా చెణుకులు విసిరారు. రెండుచోట్ల పోటీచేసి… ఒక చోట ఓడిపోయిన చిరంజీవి శక్తి ఎలా అవుతారని దామోదర్ రెడ్డి వ్యాఖ్యానించారు. “ఎప్పుడైనా పార్టీయే శక్తి. పార్టీయే సుప్రీం. వ్యక్తులు కాదు” అని తెలిపారు. జోడు పదవుల అంశంపై ప్రతి రోజూ మాట్లాడానని పేర్కొనడం కొసమెరుపు.
ఔను… ఉండొద్దు: కేఎల్ఆర్
మంత్రులకు జోడు పదవులు ఉండటం తగదని కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్) పేర్కొన్నారు. పదవుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని తెలిపారు. “డిప్యూటీ పదవులన్నీ తెలంగాణకే వచ్చాయి. ముఖ్య పదవులు మాత్రం సీమాంధ్రకు వెళ్లాయి. అధికారాలన్నీ ఆంధ్రావాళ్లే అనుభవిస్తున్నారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ పదవిని సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో ఏసీబీ తరహాలో విజిలెన్స్ దాడులూ జరుగుతాయని హెచ్చరికలు చేశారు.

21,343 టీచర్ పోస్టులు


డీఎస్స-12 నోటిఫికేషన్ విడుదల
మే 2,3,4 తేదీల్లో రాత పరీక్షలు
అప్రెంటీస్ విధానం రద్దు
‘ఇంటర్’ నిబంధన తొలగింపు
‘ఓపెన్ డిగ్రీ’ వారికీ అర్హత
ఎస్ఏ పోస్టులకు సబ్జెక్టు నిబంధనల సడలింపు
80 మార్కులకే డీఎస్సీ
20 మార్కులకు టెట్ వెయిటేజి
మరో 7100 పోస్టులకు రెండు రోజుల్లో నోటిఫికేషన్
హైదరాబాద్, జనవరి 30 : లక్షలాది మంది ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త. కొద్ది రో జులుగా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న ‘డీఎస్సీ -2012 నోటిఫికేషన్’ సో మవారం విడుదలైంది. మొత్తం 21,343 ఉపాధ్యాయ ఉద్యోగాలను ఇందులో నోటిఫై చేశారు. ఉపాధ్యాయ అభ్యర్థులు దశాబ్దకాలంగా చేస్తోన్న ‘అప్రెంటిస్’ రద్దు డిమాండ్ కూడా నెరవేరుతోంది. వివాదాస్పదంగా మారిన ‘ఇంటర్‌లో సంబంధిత సబ్జెక్టులు తప్పనిసరి’ అనే నిబంధనను తొలగించారు.
నోటిఫై చేసిన మొత్తం పోస్టుల్లో.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 5,703, ఎస్జీటీ పోస్టులు 11, 602 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్లు 2000, పీఈటీలు 365, మునిసిపల్ పాఠశాలల్లో 1,673 పోస్టులు ఉన్నాయి. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 17వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. సచివాలయంలో సోమవారం సాయంత్రం 3 గంటలకు మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కె.పార్థసారథి ఈ డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. డీఎస్సీకి విద్యార్హతల నిబంధనల్లో కొన్నింటిని సడలించారు.
స్కూల్ అసిస్టెంట్స్ (మేథ్స్, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్) పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్ స్థాయిలో కూడా మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, హిస్టరీ, జాగ్రఫీ సబ్జెక్టులు చదివి ఉండాలన్న నిబంధనలను తొలగించారు. అంటే.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్ చదివి ఉండాలన్న నిబంధన లేదు.
ఫలితంగా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా నేరుగా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు కూడా అర్హత లభిస్తుంది. స్కూల్ అసిస్టెంట్స్ (జీవశాస్త్రం) పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు జీ.వో.నెం.4లో పేర్కొన్న సబ్జెక్టులతో పాటు సెరికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, పౌల్ట్రీ సబ్జెక్టుల అభ్యర్థులకు కూడా అర్హత కల్పించారు. టీచర్లకు అప్రెంటిస్ విధానాన్ని ఈ డీఎస్సీ నుంచి రద్దు చేశారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు నమూనా, యూజర్ గైడ్ కోసం జ్ట్టిఞ://్చఞఛీటఛి.ఛిజజ.జౌఠి.జీn వెబ్‌సైట్‌ను చూసుకోవాలి.
డీఎస్సీ 80 మార్కులకే..
టెట్‌కు వెయిటేజీ ఇవ్వనున్న కారణంగా 80 మార్కులకే డీఎస్సీ పరీక్షను నిర్వహించనున్నారు. మిగతా 20 మార్కులకు టెట్ మార్కులను వెయిటేజీగా జమ చేస్తారు. ఒక్కో ప్రశ్నకు అర మార్కు చొప్పున 80 మార్కులకు 160 డీఎస్సీ పరీక్ష ఉంటుంది. ఎస్జీటీ పరీక్షలో జనరల్ నాలెడ్జ్‌కు 10 మార్కులు, పర్‌స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 10, ఇంగ్లీష్ 9, ఇండియన్ లాంగ్వేజ్ 9, మాథ్స్ 9, సైన్స్ 9, సోషల్ స్టడీస్ 9, టీచింగ్ మెథడ్ 15 మార్కులు ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్ పరీక్ష ల్లో.. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10, పర్‌స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 10, సబ్జెక్ట్ కంటెం ట్ 44, టీచింగ్ మెథడాలజీ 16 మార్కులు ఉంటాయి. పీ ఈటీలకు టెట్ ఉండకపోవ డం వల్ల పూర్తిగా 100 మా ర్కులకు పరీక్ష ఉంటుంది.

తప్పు చేయలేదని చెప్పు – స్టే తెచ్చుకున్న నీదేం నీతి?


‘రాష్ట్ర రైతాంగాన్ని తొమ్మిదేళ్లు నిర్లక్ష్యం చేసిన చంద్రబాబు ఇప్పుడు వారి వద్దకు వెళ్లి మొసలి కన్నీళ్లు పెడుతున్నారు. ప్రజాకంటక పాలన చేసి నీతిమంతుడిగా మాట్లాడుతున్నారు. తప్పే చేయకపోతే కోర్టుకెళ్లి స్టే ఎందుకు తెచ్చుకున్నావు? తన శ్రీరంగ నీతులను ఈ రాష్ట్ర ప్రజలు నమ్మరన్న విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలి’ అని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. బుధవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.300 కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించకపోతే ప్రజలను నానా హింసలు పెట్టిన చంద్రబాబు నేడు ప్రజల సమస్యలు తీర్చుతానంటే ఎవరైనా నమ్మగలరా..? అని ప్రశ్నించారు.
‘నీతీ నియమాలు ఉంది కాంగ్రెస్‌లోనే, చంద్రబాబు మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు’ అని బొత్స హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 24 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగేలా రూ.5 వేల కోట్ల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అందిస్తున్నామన్నారు. ‘ఇందిరమ్మ పాలన కోసం మహాపాదయాత్ర చేసి 2004లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని మేము ఆరాధిస్తుంటే, రాజకీయ వారసత్వమంటూ కొందరు యువ నాయకులు వీధికెక్కుతున్నారు.
నన్ను కాల్చేయమని అంటున్నారు. నిన్ను కాల్చడమెందుకు బాబు..! తప్పు చేయలేదని ధైర్యంగా చెప్పు, నా ఆస్తులు ఇవీ అని ప్రకటించు. ఎలా వచ్చాయో చెప్పు. కానీ సానుభూతి కోసం ఇలాంటి మాటలు మాట్లాడొద్దు’ అని జగన్‌నుద్దేశించి బొత్స వ్యాఖ్యానించారు. ‘తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తించి ఉన్నది ఉన్నట్లుగా నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను సోనియాగాంధీకి అప్పుడు చెప్పా. ఇప్పుడూ చెబుతా’ అని అన్నారు. తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. విద్యార్థులపై పెట్టిన కేసులను పూర్తిస్థాయిలో ఎత్తివేసి, ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి ఆటంకం లేకుండా సీఎంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
బొత్సపై పూలవర్షం
పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చెపట్టిన తరువాత తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్‌పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో బొత్స సత్యనారాయణ తొలిసారి పాల్గొన్నారు. మిర్యాలగూడలో జరిగిన సభకు ఆ పార్టీ అభిమానులు భారీగా తరలివచ్చారు. బొత్సకు చౌటుప్పల్ నుంచి మిర్యాలగూడ వరకు దారిపొడవునా పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. సభలో బొత్సను వందలాది పూలదండలతో సన్మానించి పూలవర్షం కురిపించారు.
ఈ సందర్భంగా ఎంపీలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ బొత్స తెలంగాణ ప్రజల మనోభావాలను గ్రహించిన సీమాంధ్ర నేత అని కొనియాడారు. ఎంపీలుగా తాము ఢిల్లీలో ఉద్యమం చేస్తుంటే బొత్స సతీమణి, తోటి ఎంపీ బొత్స ఝాన్సీ ‘మీ తెలంగాణ రాష్ట్రం కోసం మీరు ఉద్యమం చేస్తున్నారు. మీ న్యాయమైన పోరాటానికి మా మద్దతు ఉంటుంది’ అని ప్రోత్సహించారని గుర్తు చేశారు. తెలంగాణలో మిగిలిన సీమాంధ్ర నాయకులపై గుడ్లు, చెప్పులు పడుతుంటే బొత్సకు మాత్రం పూలు పడుతున్నాయని గుత్తా అన్నారు. తెలంగాణ ఇస్తే రక్తం ధారపోసి కేంద్రంలో, రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే విధంగా కృషి చేస్తామన్నారు.

ఉరేసుకుందాం రా!


తెలంగాణ రాష్ర్ట సాధన పట్ల చిత్త శుద్ధుంటే టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ ముందుకు రావాలని, ఇద్దరం కలిసి అమరవీరుల స్థూపానికి ఉరేసుకుందామని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సవాల్‌ విసిరారు. నేనొక తాడు తెచ్చు కుంటాను… నువ్వొక తాడు తెచ్చుకో రేపు ఉదయం పది గంటలకు గన్‌పార్కు వద్ద అమరవీరుల స్థూపానికి ఉరేసుందామన్నారు. శుక్రవారం ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో పత్రికాప్రతినిధుల సమావేశంలో, టీడీపీ ఆధ్వర్యంలో సాయంత్రం గన్‌పార్కు వద్ద నిర్వహించిన కొవ్వొత్తుల ప్రదర్శన సందర్భంగా కేసీఆర్‌పై మోత్కుపల్లి నిప్పులు చెరిగారు. చెత్త రాజకీయాలొద్దని… తెలంగాణ సాధన కోసం ఇద్దరం కలిసి ఆత్మబలిదానం చేసుకుందామన్నారు.
అమరవీరుల స్థూపం వద్ద ఉరి వేసుకోవడానికి శనివారం ఉదయం పది గంటలకు తాను తాడు తీసుకుని వస్తానని కేసీఆర్‌ కూడా రావాలని డిమాండ్‌ చేశారు. నాకు తెలంగాణ కావాలి… 30 ఏళ్లుగా రాజకీయాల్లో, ప్రజల మధ్య ఉన్న వ్యక్తిగా తెలంగాణ సాధన కోసం ఇంతకంటే గత్యంతరం లేక తాను ఈ డిమాండ్‌ చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ సాధన కోసం ఆత్మహత్యలొద్దు… పోరాడి సాధించుకుందామని ఇన్నాళ్లు మీరే చెప్పారు కదా? మరిప్పుడు ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకుందామని సవాల్‌ విసిరడం వల్ల విద్యార్థులకు తప్పుడు సంకేతాలు వెళ్లవా అని మోత్కుపల్లిని ప్రశ్నిస్తే మేము ఇద్దరం చనిపోతే వచ్చే నష్టమేమీ లేదన్నారు. 50లో పడిన తమ కంటే విద్యార్థుల భవిష్యత్తే ఎంతో ముఖ్యమన్నారు.
ఇకపై ఏ ఒక్క విద్యార్థి ఆత్మబలిదానం చేసుకోకుండా మా ఇద్దరి ఆత్మబలిదానాలతో ముగింపు పలుకుదామన్నారు. నేనేమన్నా కేసీఆర్‌ మాదిరిగా కేంద్ర మంత్రిని, ముఖ్యమంత్రిని కావాలనుకోవడం లేదని మోత్కుపల్లి తేల్చిచెప్పారు. దళిత కుటుంబం నుంచి వచ్చిన సాధరణ కార్యకర్తగా తెలంగాం సాధన కోసం తాను విసురుతున్న సవాల్‌ స్వీకరించి కేసీఆర్‌ను ముందుకు రావాలని డిమాండ్‌ చేస్తున్నన్నారు. మన ఇద్దరి చావు కేంద్రానికి కనువిప్పు కావాలని, అప్పటికైనా కేంద్రం తప్పక దిగివచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ చూస్తే కేసీఆర్‌కు ఎందుకంత భయమని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీతో, సోనియాగాంధీతో కేసీఆర్‌ కుమ్మకై్కయ్యారని మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు.
టీడీపీపై లేనిపోని నింధారోపణలు చేస్తూ టీఆర్‌ఎస్‌ నాయకులు, కేసీఆర్‌ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. పోలవరం టెండర్లలో అవినీతి సొమ్ములో మీ వాటా ఎంత అని నిలదీశారు. తెలంగాణ సాధన కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న విద్యార్థుల సమాధుల మీద రాజకీయ భవిష్యత్తు, నీ కుటుంబ భవిష్యత్తు నిర్మించుకుంటున్నావని మోత్కుపల్లి నర్సింహులు శివాలెత్తారు. కేసీఆర్‌ ఆరు నెలలు నిద్రపోయి ఆ తర్వాత లేచి బడుగు విద్యార్థులను బలిగొంటున్నారని నిప్పులు చెరిగారు. ఇకపై ఏ ఒక్క విద్యార్థి ఆత్మహత్య చేసుకోవద్దని మోత్కుపల్లి విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు తెలంగాణ సాధన కోసం ఆత్మబలిదానం చేసుకున్న వారంత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులేనన్నారు. పైరవీల కోసమే కేసీఆర్‌ తెలంగాణ వాదాన్ని భుజానికెత్తున్నారన్నారు. కేసీఆర్‌ తాటకు చప్పుళ్లకు బెదిరేది లేదని విస్పష్టం చేశారు.

free website analytics