Ankusam - 24 Hours e-News » జాతీయం

ఎర్రజెండాలను ఏకంచేస్తాం!
ప్రతినిధి:రాష్ట్రంలోని ఎర్రజెండాలన్నింటిని ఒకచోటికి తీసుకొచ్చి ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఉవ్వెత్తున ఉద్యమించి తద్వారా ప్రజల మద్దతును కూడగట్టు కొని వచ్చే ఎన్నికల్లో రాష్ర్ట రాజకీయాలను శాసించే స్ధాయికి ఎదగాలని సీపీఎం పార్టీ రాష్ట్ర23వ మహా సభలు నిర్ణయించాయి. మూడు రోజులపాటు ఖమ్మంలో జరిగిన సభలు శనివారం రాత్రి జరిగి బహిరంగసభతో ముగిశాయి. సీపీఎం జాతీయ కార్యదర్శి ప్రకాశ్‌కారత్‌, పొలిట్‌ బ్యూరో సభ్యులు బృందాకరత్‌, ఏచూరి సీతారామ్‌ మూడురోజులపాటు ఖమ్మంలో ఉండి బహిష్యతు కార్యచరణపై కసరత్తుచేశారు. కాంగ్రెస్‌, బిజెపి ఆర్ధిక విధానాలకు, అవినీతి కి వ్యతిరేకంగా ప్రత్యామ్నయంగా ప్రజాతంత్ర లౌకిక శక్తులను కూడగట్టి భవిష్యత్తు పోరాటాలను నిర్వహించాలని ప్రధానంగా నిర్ణయించారు.ఇందుకు వామపక్షాల మద్య ఉన్న వైరుద్యాలను తగ్గించేందకు కృషిచేయాలని నిర్ణయిం చారు.

సిద్ధాంత పరమైన విభేదాలు కాకుండా ప్రజాల సమస్యలపై కలిసి పోరాడేందుకు అడ్డుగాఉన్న చిన్న చిన్న విభేదాలను పక్కన పెట్టి ఉమ్మడి గా కలిసి పనిచేయాలని సభలు పార్టి శ్రేణులను నిర్ధేశించాయి. సిపిఐతోపాటు న్యూడెమెక్రసి,ఎంసిపిఐ ఇతర ఎర్రజెండా పార్టీలు మొత్తం 11 పార్టీలను ఒకతాటిపైకి తీసుకోచ్చే ప్రయత్నం జరుగుతుందని ఇప్పటికే ఒక ధప సమావేశం జరిగిందని రెండో ధఫాగా ఈనెల15న మరోసారి సమావేశం అయ్యి ఒక అభిప్రాయానికి రానున్నామని కనుకభవిష్యత్తులో కాంగ్రెస్‌,బిజెపిలకు వ్యతిరేకంగా వామపక్ష కూటమి గట్టిగా పనిచేయాలని ,అవసరం అయితే కలిసివచ్చే కొత్త శక్తులను కలుపుకోని పోవాలని కూడా తీర్మాణించారు.

రాష్ట్రంలో గత ఎన్నికల్లో ఘోరంగా ఒడిపోయి ఒకసీటకుపరిమితం కావడం,అటూ పశ్చిమ బెంగాల్‌,కేరళ రాష్ట్రంలో పార్టీ ఓడిపోవడంతో సిపిఎం బలహినపడిందనే అభిప్రాయం తో ఉన్నవారికి ఈ మహాసభల ద్వారా తాము బలంగా ఉన్నామనే ప్రయత్నంచేశారు.మూడురోజులపాటు జరిగిన సమావేశాలకు 765మంది ప్రతినిధులు హజర్‌కావడం,చివరిరోజు బహిరంగసభకు పెద్ద ఎత్తున్న జనం తరలిరావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఉరకలేసింది.ఇన్నాళ్లు నిరుత్సాహంతో ఉన్న శ్రేణుల్లో ఈ సభలు టానిక్‌లా పనిచేశాయని చెప్పవచ్చు.ప్రత్యేకించి ఖమ్మం జిల్లాలో 2009 ఎన్నికలకు ముందు సిపిఎం అసమ్మతినేతలంతా పార్టీపై బురద జల్లి బైటికి వెళ్ళిపోయారు. ఆతరువాత వచ్చిన ఎన్నికల్లో టిడిపి పొత్తుతో నాలుగు స్ధానాల్లో పోటిచేస్తే అన్నింట్లో అపజయం ఎదురైంది.

అనాటి నుంచి ఆపార్టీలో కొంత స్ధబ్ధత నెలకొంది.పార్టీ క్యాడర్‌నిస్తేజంలో మునిగింది.ఈ పరిస్థితిలో జరిగిన మహాసభలు వారిలో మళ్ళి ఉత్తేజాన్ని నింపినట్లయింది.జిల్లాతో తమ బలం తగ్గాలేదు ఇంకా పెరిగిందని ఈసభతో చాటిచెప్పినట్లయింది,ఇదే విషయాన్ని పార్టీ కేంద్ర కమిటి సభ్యుడు తమ్మినేని వీరభద్రం బహిరంగసభ వేదికపైనే ప్రకటించారు.తమ పార్టీని నాశనంచేయాలనుకున్నేవారంతా కాలగర్బంలో కలిశారని ప్రజలకు దూరం అయ్యారన్నారు.ఈ సభకు తరలివచ్చిన జనం ను చూసి పోలీటూబ్యూరో సభ్యులు ఏచూరి సీతరామ్‌ చైనాలో అనాడు యానం నుంచి చైనా విప్లవం బయలుదేరిందని భారత దేశంలో ఖమ్మంనుంచే నూతన వామపక్ష విప్లవం ప్రారంభంకావాలని అక్షాంక్షించారంటే సభ విజయం ఏలా జరిగిందో చెప్పవచ్చు.

ఇది ఇలా ఉండగా ప్రపంచకీరణతో కొత్త సమస్యలు ఉత్పన్నం అవుతున్నందునా కొత్త సంఘాలను ఏర్పాటు చేయాల్సిన అవశ్యకత పెరిగిందని,పార్టీ అధ్యాయన కేంద్రాలను జిల్లా కేంద్రాలకే పరిమితం చేయకుండా మారుమూల ప్రాంతాలకువిస్తరింపజేసి పార్టీ పనితానాన్ని పెంచాలనిఈ మహాసభలు నిర్ణయించాయి.ప్రజా సమస్యలపై మొత్తం 45కిపైగా తీర్మాణాలు చేసి ప్రజల కోరికల పత్రాన్ని తయారుచేశారు.ఈ సమస్యల పరిష్కారం కోసం బలమైన ఉద్యమాలను నిర్మించాలని తీర్మాణించారు.ప్రాజెక్టుల సాధన కోసం జలసాధనపేరుతో ఉద్యమించాలని,కార్మికుల సమస్యలపై ఈనెల28న జరిగే సార్వత్రిక సమ్మెలో పాల్గొన్నాలని తీర్మాణించాయి.

పొత్తులు,సీట్ల సర్ధుబాట్లు ఇప్పుట్లో ఎన్నికలు లేనందునా పెద్దగా చర్చంచలేదని తెలిసింది.అయితే గత ఎన్నికల్లో టిడిపితో పొత్తుపెట్టుకొని పొరపాట్లుచేశామని ,టిడిపినేతల సహకారం లేకపోవడంతో చాలా చోట్ల ఓడిపోయామనే విశ్లేషణచేసినట్లు సమాచారం.పిఆర్‌పితో పొత్తుపెట్టుకొని ఉంటే బాగుండేదనే అభిప్రాయంకూడా వ్యక్తంఅయ్యింది.వామపక్ష కూటమి వంద స్ధానాలపై గురిపెట్టి పోటీ చేసి రాష్ట్ర రాజకీయాలను శాసించేస స్ధాయికి ఎర్రజెండాల బలం పెరగాలని సమావేశం అభిప్రాయపడినట్లు తెలిసింది.కొత్తపార్టీలు పుట్టుకొచ్చినప్పటికి ఎన్నికల సమయంలో వాటిపై దృష్టిసారించాలని నిర్ణయించారు.కొన్నిజిల్లాలో పార్టీ పనితీరు సరిగ్గాలేదని కూడా అంచనావేశారు.2014 ఎన్నికలనేపద్యంలో సుదీర్ఘరాజకీయ అనుభవం ఉన్న బివి రాఘవులకే మళ్ళి పార్టీ బాధ్యతలను అప్పగించారు.గత ఎన్నికల్లో ఒకే స్ధానానికి పరిమితం అయినప్పటికి ఆయననే ఎంపికచేశారు.

తెలంగాణ ఉద్యమం జరుగుతుండటం తో పార్టీ నూతన కమిటీలో తెలంగాణ వారికి పెద్దపీఠ వేశారు. నూతన రాష్ట్ర కమీటిలోకి ఏడుగురికి స్ధానం కల్పించినప్పటికి వారంతా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కావడం గమనర్హం.పార్టీ సెక్రట్‌యేట్‌ కమిటీలో కొత్తగా ఇద్దరికి అవకాశం కల్పించగా వారిని తెలంగాణ నుంచే తీసుకున్నారు.కార్యవర్గంలో ఐదుగురికిస్ధానం కల్పిస్తేవారంతా కూడా తె లంగాణ వారే.ఈసారి తెలంగాణ ప్రాంతానికే రాష్టక్రార్యదర్శి పదవిని కట్టబెడ్తారని అంతా భావించారు.కాని కమీటీలో ఎక్కువప్రాతినిధ్యం కల్పించారు.మొత్తంమీద మూడు రోజులపాటు ఉత్సాహవాతవరణంలో ఉత్తేజంగా సిపిఎం మహాసభలు విజయవంతంగా మూగిసాయి.

దేవుడి శక్తిని శంకించరాదు
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి బలాన్ని ఎవరు శంకించినా అది మానవుడు చేసే అతిపెద్ద తప్పిదం అవుతుందని టిటిడి ఇఓ ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, పాలకులు, ఆలయ కైంకర్యాలు, చారిత్రక కట్టడాలపైనా త్రిదండి చిన్నజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలపై టిటిడి తొలిసారిగా తీవ్రస్థాయిలో స్పందించింది. టిటిడి ఇఓ సుబ్రహ్మణ్యం శనివారం విలేఖరులతో మాట్లాడుతూ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి విశ్రాంతి లేదని జీయర్ వ్యాఖ్యానించడం, 10 గంటలకే ఆలయం మూసివేయాలని చెప్పడం సరికాదన్నారు. స్వామివారికి కానీ, తిరుమల క్షేత్రానికి కానీ కళంకం ఏర్పడితే తాను ప్రాణత్యాగానికైనా సిద్ధమన్నారు. ఆలయంలో ఏవైనా లోపాలు జరుగుతోంటే పెద్దలు తమ దృష్టికి తీసుకువస్తే తాము ఎలాంటి భేషజాలకు పోకుండా సరిదిద్దుకుంటామన్నారు. భక్తులను అనుగ్రహించడం కోసమే స్వామివారు కలియుగంలో వెలిశారన్నారు. ఆయన శక్తిసామర్థ్యాల గురించి మాట్లాడటానికి మన స్థాయి ఏ పాటిదన్నారు. నిజంగా స్వామివారి ఆలయంలో తప్పిదాలే జరుగుతూ ఉంటే, స్వామివారికే ఆగ్రహం వస్తే ఈ క్షేత్రం నడవగలదా అని ప్రశ్నించారు. ఎంత సమయం కేటాయిస్తున్నా భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోతోందన్నారు. ఇక రాత్రి 10 గంటలకే ఆలయం మూస్తే భక్తులు ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారో ఊహించలేమన్నారు. ఎక్కువ మందికి దర్శనం కల్పించేందుకు శ్రీవారి ఆలయం లోపల ఏవైనా మార్పులు, చేర్పులు చేద్దామనుకుంటే అందుకు ఆగమాలు ఏమాత్రం అంగీకరించవన్నారు. ఆగమాలను పాటించే సాంప్రదాయం వల్లనే మార్పులు చేయడానికి కూడా టిటిడి ఎప్పుడూ సాహసించలేదన్నారు. వెయ్యికాళ్ల మండపం నిర్మాణానికి ఆగమాలకు ఏమాత్రం సంబంధం లేదన్నారు. దానిని ఆగమాలకు ముడిపెట్టి ఎవరైనా మాట్లాడితే వారిని ఆ భగవంతుడే కాపాడాలని జీయర్‌పై చురకలు వేశారు. కాలానుగుణంగా పెరుగుతున్న రద్దీని బట్టి భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత, అధికారం టిటిడికి ఉందన్నారు. ప్రస్తుతం ఆలయం సమీపంలో రాంభగీచ అతిథి భవనాలు ఉన్నాయని, భక్తుల అవసరాలు పెరిగితే వాటిని కూల్చివేసి మరో విష్ణ్భుగీచగా నిర్మాణం చేపడతామన్నారు. అలాగే స్వామివారి వాహన ఊరేగింపు సమయంలో ప్రస్తుతం ఉన్న సహస్ర దీపాలంకరణ సేవ మండపం అడ్డువస్తే, అవసరమైతే వాటిని హథీరాంజీ మఠం వరకూ తొలగించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుందన్నారు. అలా అని హథీరాంజీ మఠంలో స్వామివారు పాచికలు ఆడారని చెబుతూ, ప్రస్తుతం భగవంతునికి సంబంధించి సౌకర్యాలను విస్మరించగలమా అని ప్రశ్నించారు. జీయర్ ప్రదర్శించిన 110 తప్పుల సిడిపై విలేఖరులు ప్రశ్నించగా… చిన్నజీయర్‌తో తాను నాలుగున్నర గంట పాటు సమావేశం అయిన విషయం నిజమేనన్నారు. అయితే 2003లో అప్పటి ఇఓ అజయ్‌కల్లాం, జెఇఓ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడిన వీడియో టేపులను చూపించారన్నారు. అందులో సంభాషణలు సరిగ్గా వినపడలేదని, ఆడియో కూడా సక్రమంగా లేదన్నారు. అంతమాత్రాన వారేదో తప్పులను ఒప్పుకున్నట్టు కాదుకదా.. అని ప్రశ్నించారు. ఓర్పుతో ఉన్నాను, ఇక కడిగేస్తాను అని చిన్నజీయర్ లాంటి పెద్దలు వ్యాఖ్యానించటం సరికాదన్నారు. హిందుమత పెద్దలుగా ఉన్న వారు విరుద్ధంగా మాట్లాడి అలజడులు సృష్టించడం సరికాదన్నారు. అలా చేయడం ద్వారా ఇతర మతస్థులకు మనం చేయూతనిచ్చిన వారమవుతామన్నారు. జీయర్ స్వామిపట్ల తనకు అపారమైన గౌరవం, భక్తి ఉన్నాయన్నారు. ఆయన తపస్సంపన్నులన్నారు. తాను పామరుడ్ని అన్నారు. తనపై ఆగ్రహించకుండా అనుగ్రహించాలని తాను పెద్దలను కోరుతున్నానన్నారు.

చిదంబరానికి క్లీన్‌చిట్‌
లక్షా 76 వేల కోట్ల రూపాయిల 2-జి కుంభకోణంలో కేంద్ర హోం మంత్రి పి.చిదంబరాన్ని సహనిందితునిగా చేర్చాలని కోరుతూ జనతాపార్టీ అధ్యక్షుడు డాక్టర్‌ సుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్‌ను సిబిఐ ప్రత్యేక కోర్టు శనివారంనాడు కొట్టి వేయడంతో ఆయనకే కాక, యూపీఏ ప్రభుత్వానికే ఊరట లభించింది.కాగా,ప్రత్యేక కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీలు చేస్తానని డాక్టర్‌ స్వామి ప్రకటించారు. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఒపి సైనీ సమర్ధుడేననీ, కేసులో పస లేకపోవడం వల్లే పిటిషన్‌ని కొట్టి వేశారేమోనని న్యాయశాస్త్ర నిపుణుడు సోలీ సోరాబ్జీ వ్యాఖ్యానించారు. న్యాయం గెల్చిందని కాంగ్రెస్‌ వ్యాఖ్యానించగా, అసత్య ఆరోపణలు చేసినందుకు చిదంబరానికి ప్రతిపక్షాలు సారీ చెప్పాలని కేంద్ర మంత్రి కపిల్‌ సిబాల్‌ డిమాండ్‌ చేశారు. దీనిపై ప్రధానమంత్రి పెదవి విప్పాలని సిపిఎం నాయకుడు నీలోత్పల్‌ బసు డిమాండ్‌ చేశారు. కాగా, రాజాపై డాక్టర్‌ స్వామి చేసిన ఆరోపణలపై విచారణను మార్చి 17వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. ప్రత్యేక కోర్టు తీర్పు వెలువడటానికి ముందు కొద్ది గంటల సేపు నరాలు తెగే ఉత్కంఠ కొనసాగింది. తీర్పు చెప్పే ముందు న్యాయమూర్తి కోర్టు హాలు నుంచి విలేఖరులనూ, మీడియా ప్రతినిధులనూ, లాయర్లనూ వెళ్ళి పొమ్మనమని ఆదేశించడంతో చిదంబరానికి వ్యతిరేకంగా తీర్పు రావచ్చునన్న ఊహాగానాలు వ్యాపించాయి. చిదంబరం కూడా తీవ్ర ఆందోళనకు గురి అయినట్టు వార్తలు వెలువడ్డాయి. తీర్పు వెలువరించడానికి న్యాయమూర్తి 30 నిమిషాల వ్యవధి తీసుకోవడంతో అందరిలో సహజంగానే ఉత్కంఠ పెరిగింది.

డాక్టర్‌ స్వామి పిటిషన్‌ని కొట్టి వేసినట్టు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సైనీ ప్రకటించగానే, చిదంబరమే కాక, యూపీఏ నాయకులు తేలికగా ఊపిరి పీల్చుకున్నారు. చిదంబరాన్ని ఈ కేసులో సహనిందితునిగా చేర్చడానికి తగినన్ని ఆధారాలు లేవని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ కేసులో ఇంతకుముందే అరెస్టు అయి ఏడాది నుంచి జైలు జీవితం గడుపుతున్న మాజీ కమ్యూనికేషన్ల శాఖ మంత్రి ఎ రాజాతో చిదంబరం కుమ్మక్కయ్యారనడానికీ, ఇద్దరూ కలిసి కుట్రపన్నారనడానికి తగిన ఆధారాలు లేవని కూడా న్యాయమూర్తి పేర్కొన్నారు.వీరిలో ఒకరు ఉద్దేశ్యపూర్వకంగా నేరానికి పాల్పడినట్టు, మరొకరు అమాయకంగా ఇరుక్కుపోయినట్టు నిరూపించేందుకు కూడా ఆధారాలు లేవని న్యాయమూర్తి పేర్కొన్నారు.

కాగా, 2001లో ఎన్‌డిఎ ప్రభుత్వం నిర్ధారించిన రేటుకే స్పెక్ట్రమ్‌ లైసెన్స్‌లను ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికగా కేటాయించాలని ట్రాయ్‌ సిఫార్సు చేసిన నేపధ్యంలో ఆనాటి కమ్యూనికేషన్ల శాఖ మంత్రి రాజా ఆ సిఫార్సును అమలు జేశారు. తనపై స్వామి వేసిన పిటిషన్‌ని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కొట్టి వేయడం పట్ల చిదంబరం హర్షం వ్యక్తం చేశారు. సత్యం ఎప్పటికైనా గెలుస్తుందని ఆయన అన్నారు. చిదంబరంపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఆయనకు ప్రతిపక్షాలు క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి కపిల్‌ సిబాల్‌ డిమాండ్‌ చేశారు.

జడేజా కోసం ‘వేలం’ వెర్రి
ఐపిఎల్‌-5 వేలం ప్రారంభమైంది. క్రికెటర్లను దక్కించుకోవడానికి ప్రాంచైజీలు పోటీపడుతున్నాయి. ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాను కొనడానికి డెక్కన్‌ చార్జర్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ పోటీపడ్డాయి. చివరకు సీక్రెడ్‌ బిడ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ రవీంద్ర జడేజాను రూ.9.72 కోట్లకు దక్కించుకుంది. శ్రీలంక కెప్టెన్‌ జయవర్ధనెను రూ.7.30కోట్లకు ఢిల్లిd డేర్‌డెవిల్స్‌ సొంతం చేసుకుంది. ఆర్‌. విజయ్‌కుమార్‌ను రూ.5 కోట్లకు, బ్రాడ్‌ హడ్జ్‌ను రూ.2.3 కోట్లకు బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ దక్కించుకుంది. న్యూజిలాండ్‌ వికెట్‌ కీపర్‌ మెక్‌కలమ్‌ను రూ.4.5కోట్లకు కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌, ముత్తయ్య మురళీధరన్‌ను రూ.1.14కోట్లకు బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌, అలాగే గిబ్స్‌ను కేవలం రూ.25లక్షలకు ముంబై ఇండియన్స్‌ సొంతం చేసుకున్నాయి.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపిఎల్‌) పోటీల్లో ఆడే ఆటగాళ్ళకోసం శనివారంనాడు బెంగళూరులో వేలం పాట ప్రారంభమైంది.

అవినీతి రాజా ‘లై’సెన్స్‌ల రద్దు
‘సుప్రీం’ సంచలన తీర్పు – యుపిఎ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

ఆయా కంపెనీలకు రూ.5 కోట్ల చొప్పున జరిమానా – తీర్పులో పరుష పదజాలం

తిరిగి లైసెన్స్‌లు కేటాయించడానికి మార్గదర్శకాలు -కస్టమర్లపై ప్రభావం ఉండదన్న ట్రారు

సెల్‌ఫోన్‌ చార్జీలు పెరిగే అవకాశం – చిదంబరం పాత్రపై రేపు ప్రత్యేక కోర్టు తీర్పు

2జి స్పెక్ట్రమ్‌ కేసులో ప్రధాన నిందితుడు అయిన ఎ.రాజా 2008లో కేంద్ర టెలికమ్యూనికేషన్స్‌ శాఖ మంత్రిగా మంజూరు చేసిన 122 లైసెన్స్‌లను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు గురువారంనాడు సంచలనాత్మకమైన నిర్ణయాన్ని ప్రకటించింది.జస్టిస్‌ జిఎస్‌ సింఘ్వీ, జస్టిస్‌ ఎకె గంగూలీలతో కూడిన బెంచ్‌ లైసెన్స్‌లు జారీకి ఆనాడు ప్రభుత్వం అనుసరించిన ప్రక్రియ చట్టబద్దం కాదనీ, నిష్పాక్షికంగా లేదని కూడా స్పష్టం చేసింది.

కాగా, జనతాపార్టీ అధ్యక్షుడు డాక్టర్‌ సుబ్రహ్మణ్యస్వామి, సెంటర్‌ ఫర్‌ పబ్లిక్‌ ఇంట్రస్ట్‌ లిటిగేషన్‌లు టెలికామ్‌ కంపెనీలకు రాజా జారీ చేసిన లైసెన్స్‌లను రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన రెండు ప్రత్యేక దరఖాస్తులపై కోర్టు పై తీర్పు ఇచ్చింది. లైసెన్స్‌ల జారీలో యూపీఏ ప్రభుత్వం ఆశ్రిత పక్షపాతానికి పాల్పడిందని డాక్టర్‌ స్వామి ఆరోపించారు. కాగా, కోర్టు రద్దు చేసిన 122 లైసెన్స్‌లను సరికొత్త మార్గదర్శక సూత్రాల ప్రకారం రెండు నెలల వ్యవధిలో తిరిగి కేటాయించాలని టెలికామ్‌ రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్‌)ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

అంతేకాక, ఈ కేసులో ఆనాటి ఆర్థిక మంత్రి, ప్రస్తుత హోం మంత్రి పి.చిదంబరాన్ని సహ నిందితునిగా చేర్చేట్టు ఆదేశించాలన్న స్వామి అభ్యర్ధనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ అభ్యర్ధనపై విచారణ జరిపి నిర్ణయాన్న ప్రకటిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.కాగా, కింది కోర్టు శనివారంనాడు తన నిర్ణయాన్ని ప్రకటించనున్నది.

మూడు ప్రధాన అంశాలపై నిర్ణయం: 2008 జనవరిలో ఆనాటి కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి ఎ రాజా జారీ చేసిన 122 టూజీ లైసెన్స్‌లను రద్దు చేసింది. ఈ కుంభకోణంపై మరింత దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌ని) ఏర్పాటు చేయాలన్న పిటిషనర్ల అభ్యర్ధనను కోర్టు తోసిపుచ్చింది. సిబిఐ చేస్తున్న దర్యాప్తును పర్యవేక్షించవలసిందిగా కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌(సీవీసీ)ని ఆదేశించింది. ఈ కేసులో చిదంబరాన్ని సహనిందితునిగా చేర్చాలన్న అభ్యర్ధనపై నిర్ణయాన్ని దిగువ కోర్టుకు సుప్రీంకోర్టు విడిచి పెట్టింది. —సిబిఐ సీవీసీకి సీవీసీ సుప్రీంకోర్టుకూ ఎప్పటికప్పుడు తాజా నివేదికలను సీల్డ్‌ కవర్లలో సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

కాగా, ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికగా స్పెక్ట్రమ్‌ లైసెన్స్‌లను 2008 జనవరిలో ఆనాటి టెలికామ్‌ మంత్రి రాజా జారీ చేశారు. ఆయన నిర్ణయం వల్ల ప్రభుత్వ ఆదాయానికి లక్షా 76 వేల కోట్ల రూపాయిల మేరకు నష్టం వాటిల్లినట్టు కంఎ్టోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) తన నివేదికలో పేర్కొంది. ఈ లైసెన్స్‌లను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఎటిసలాట్‌, యూనినార్‌, టాటా డోకోమో కంపెనీలకు ఐదేసి కోట్ల రూపాయిల జరిమానాను విధించింది. సుప్రీంకోర్టు బెంచ్‌ ఏకగ్రీవంగా ఇచ్చిన తీర్పులో స్పెక్ట్రమ్‌ లైసెన్స్‌లను వేలం వేయకుండా ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికగా కేటాయించడం చట్ట విరుద్ధమే కాక, ఏకపక్ష నిర్ణయంగా స్పష్టం చేసింది. చిదంబరాన్ని ఈ కేసులో సహనిందితునిగా చేర్చాలా లేదా అనే అంశంపై నిర్ణయాధికారాన్ని దిగువ కోర్టుకు అప్పగించడం సరైనదేనని సుప్రీంకోర్టు పేర్కొంది. డాక్టర్‌ స్వామి ఈ మేరకు దాఖలు చేసిన దరఖాస్తుపై ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఒపి సైనీ తన తీర్పును రిజర్వులో ఉంచారు.ఫిబ్రవరి నాల్గవ తేదీ ఉదయం 10 గంటలకు ఆయన తన తీర్పును ప్రకటిస్తారు. ఈ కేసులో చిదంబరానికి సిబిఐ క్లీన్‌చిట్‌ ఇదివరకే ఇచ్చింది. ప్రస్తుతం కేంద్ర హోం మంత్రిగా ఉన్న చిదంబరంపై దర్యాప్తు జరిపేందుకు సిబిఐ నిరాకరించింది. కాగా, 2008లో స్పెక్ట్రమ్‌ లైసెన్స్‌లను 2001 నాటి రేట్ల ప్రకారం ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికపై రాజా కేటాయించారన్నది ఆయనపై ప్రధాన ఆరోపణ, కాగా, రాజా నిర్ణయాన్ని ఆనాటి ఆర్థిక మంత్రి చిదంబరం సమర్ధించారన్నది చిదంబరంపై ఆరోపణ.చిదంబరం ఆనాడు ఈ కేటాయింపులపై వెంటనే స్పందించి వేలం పద్దతిలో కేటాయించాలని పట్టుపట్టి ఉంటే ఈ కుంభకోణం చోటు చేసుకుని ఉండేది కాదంటూ 2011 మార్చి 25వ తేదీన ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి కార్యాలయానికి పంపిన వివాదాస్పద పత్రంపై డాక్టర్‌ స్వామి ఎక్కువ ఆధారపడుతున్నారు. చిదంబరానికి తెలియకుండా ఈ కుంభకోణం జరగలేదనడానికి ఇదే ఆధారమని ఆయన స్పష్టం చేస్తున్నారు. లూప్‌ టెలికామ్‌ కంపెనీకి సుప్రీంకోర్టు రూ.50 లక్షల జరిమానాను విధించింది. సుప్రీంకోర్టు విధించిన జరిమానా మొత్తంలో సగ భాగాన్ని కేంద్ర టెలికామ్‌ శాఖకు వెళ్తుందనీ, మిగిలిన మొత్తాన్ని సుప్రీంకోర్టు రిజిస్టరీలో జమచేయాలని సుప్రీంకోర్టు బెంచ్‌ ఆదేశించింది.

యూపీఏకి ఎదురుదెబ్బ

స్పెక్ట్రమ్‌ కుంభకోణానికి సంబంధించి గురువారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు యూపీఏ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ అని చెప్పక తప్పదు. ఈ తీర్పు వెలువడిన వెంటనే టెలికామ్‌ శాఖను ప్రస్తుతం అదనంగా నిర్వహిస్తున్న కేంద్ర మంత్రి కపిల్‌ సిబాల్‌ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌తో అత్యవసరంగా సమావేశమై తీర్పు గురించి సుదీర్ఘంగా చర్చించారు. మంత్రులు, ఉన్నతాధికారులపై దర్యాప్తునకు ఉన్నత స్థాయి వర్గాల అనుమతి ముందుగా తీసుకోవాలన్న నిబంధనపై సుప్రీంకోర్టు రెండు రోజుల క్రితం ఇచ్చిన తీర్పు కూడా యూపీఏ ప్రభుత్వానికి ఎదురుదెబ్బే. నాలుగు నెలల వ్యవధిలో అనుమతి ఇవ్వని పక్షంలో దర్యాప్తు సంస్థలు తమ పనిని ప్రారంభించవచ్చని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.ఈ రెండు తీర్పులూ డాక్టర్‌ సుబ్రహ్మణ్య స్వామికి అనుకూలంగా ఉండటంతో ఆయన పట్టరాని ఆనందంతో ఉన్నారు. కేంద్ర మంత్రి చిదంబరాన్ని దర్యాప్తు పరిధిలోకి తేవడం కోసమే ఆయన ఈ పిటిషన్లు దాఖలు చేశారు.

కాగా, టూజీ కుంభకోణంలో రాజా గడిచిన ఏడాదిగా తీహార్‌ జైలులో ఉన్నారు. డిఎంకె ఎంపీ కనిమొళి చాలా కాలంపాటు అదే జైలులో గడిపి ఈ మధ్యనే బెయిల్‌పై విడుదల అయ్యారు.

ఇతర కంపెనీలకూ నష్టమే

122 లైసెన్స్‌లను సుప్రీంకోర్టు రద్దు చేయడం వల్ల ఆ యా కంపెనీలకే కాక, ఇతర కంపెనీలకు కూడా ఈతీర్పు వల్ల ఇబ్బందులు, లేదా నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు. ఈ 122 లైసెన్స్‌లలో వీడియోకాన్‌కి 21, యీనినార్‌కి 22, ఐడియాకి 9, టాటా టెలిసర్వీసెస్‌కి 3, స్వాన్‌ టెలికామ్‌కి 13, లూప్‌కామ్‌కి 21 లైసెన్స్‌లు ఉన్నాయి. కాగా, ఈ లైసెన్స్‌ల రద్దు నిర్ణయం క్రిమనల్‌ కోర్టులో నిలబడకపోవచ్చని న్యాయశాస్త్రకోవిదుడు రాంజెత్మలానీ వ్యాఖ్యానించారు. తీర్పు సమీక్ష కోసం పిటిషన్లు దాఖలయ్యే అవకాశం ఉందనీ, తదుపరి వ్యాజ్యాలకు అవకాశం ఉందని ఆయన అన్నారు.

కొత్త మార్గదర్శకాలు

రద్దు చేసిన లైసెన్స్‌లను తిరిగి కేటాయించడానికి టెలికామ్‌ రెగ్యులేటరీ అథారిటీ కొత్త మార్గదర్శక సూత్రాలను జారీ చేయనున్నది. ఈ లైసెన్స్‌లలో చాలా మటుకు పాత కంపెనీలకే చెందినవి కనుక వినియోగదారులకు అసౌకర్యం కలగకుండా తక్షణ చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉందని ట్రాయ్‌ వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాక, గతంలో ప్రభుత్వం అనుసరించిన విధానంలో ఎంత మాత్రం తప్పు లేదనీ, అమలుజేయడంలోనే లోపాలు ఉన్నాయని ట్రాయ్‌ పేర్కొంది.

పరుషమైన భాష

లైసెన్స్‌లను కేటాయించేముందు చిందబరాన్ని రాజా సంప్రదించకపోవడాన్ని, ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదిక విధానాన్ని, ఈ విధానానికి ట్రాయ్‌ అడ్డు చెప్పకపోవడాన్నీ, యూనిటెక్‌ వైర్‌లెస్‌,స్వాన్‌ సంస్థలు విదేశీ పెట్టుబడిదారులతో ఒప్పందాలను కుదుర్చుకోవడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. రాజాకు ముందు ఎన్‌డిఎ హయాంలో మంజూరు అయిన లైసెన్స్‌లను ఎందుకు రద్దు చేయరాదన్న సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే వాదాన్ని కోర్టు తోసిపుచ్చింది.ఆ నాటి లైసెన్స్‌లను కోర్టులో ఎవరూ సవాల్‌ చేయలేదని బెంచ్‌ స్పష్టం చేసింది.

‘చిదంబరంపై కోర్టు ఎటువంటి వ్యాఖ్య చేయలేదు’

కేంద్ర హోం మంత్రి చిదంబరంపై సుప్రీంకోర్టు ఈనాటి తీర్పులో ఎటువంటి వ్యాఖ్య చేయలేదని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రషీద్‌ అల్వీ స్పష్టం చేశారు. చిదంబరం రాజీనామా చేయాలన్న బిజెపి డిమాండ్‌ని ఆయన తోసిపుచ్చారు. చిదంబరం రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

ఎన్‌డిఎ, రాజాలదే బాధ్యత

ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికగా లైసెన్స్‌లు కేటాయించే పద్దతిని 2001లో ఎన్‌డిఎ ప్రభుత్వం ప్రవేశపెట్టిందనీ,అదే పద్దతిని 2008లో ఆనాటి మంత్రి రాజా అనుసరించారనీ, కనుక ఈ కేటాయింపుల్లో ఏమైనా నష్టం జరిగి ఉంటే అందుకు ఎన్‌డిఎ ప్రభుత్వమూ, మాజీ మంత్రి రాజా బాధ్యత వహించాల్సి ఉంటుందని కమ్యూనికేషన్ల శాఖ మంత్రి కపిల్‌ సిబాల్‌ వ్యాఖ్యానించారు.

అభిశంసన కాదు

సుప్రీంకోర్టు ఈరోజు ఇచ్చిన తీర్పు యూపీఏ ప్రభుత్వాన్ని అభిశంసించడమేన ంటూ బిజెపి నాయకులు చేసిన వ్యాఖ్యను సిబాల్‌ తోసిపుచ్చారు. ప్రభుత్వం మీద కోర్టు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదనీ, ఆనాటి మంత్రి తీసుకున్న నిర్ణయాన్ని మాత్రమే తప్పు పట్టిందని సిబాల్‌ అన్నారు.ప్రధానమంత్రిని కానీ, హోం మంత్రి చిదంబరాన్ని కానీ కోర్టు తప్పు పట్టలేదని ఆయన స్పష్టం చేశారు.

సెల్‌రేట్లు పెరిగే అవకాశం

రద్దు చేసిన 122 లైసెన్స్‌లను తిరిగి వేలం పద్దతిలో కేటాయిస్తే ప్రస్తుతం ఉన్న సెల్‌ రేట్లు పెరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, ఈ విషయమై ప్రభుత్వం తీసుకునే చర్యలేమిటో వేచి చూడాలని వారు అన్నారు.

కస్టమర్లపై ప్రభావం ఉండదు : ట్రాయ్‌

2జి కేసులో సుప్రీం తీర్పు వల్ల కస్టమర్ల సౌకర్యాలకు, సేవలకు ఎటువంటి అవరోధం ఉండదని టెలికామ్‌ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) చైర్మన్‌ జె.ఎస్‌.శర్మ తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పును దృష్ట్యా కొత్త లైసెన్సుల కేటాయింపు విషయంలో ట్రాయ్‌ వేలం విధానాన్నే అనుసరిస్తుందని ఆయన తెలిపారు. అవసరమయిన పక్షంలో తాము టెలికామ్‌ సంస్థలతో సంప్రతింపుల ప్రక్రియను ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. యూనిఫైడ్‌ లైసెన్సుల విషయంలో తమ సిఫారసులను అందజేసినట్టు తెలిపారు. లైసెన్సులు రద్దయిన కంపెనీల కస్టమర్లు నాలుగు నెలల కాలంలో పోర్ట్‌వుట్‌ అవచ్చని ఆయన సూచించారు. అయితే 90 రోజుల లోపు కస్టమర్లకు కొత్త మార్గదర్శకాలు వర్తిస్తాయని తెలిపారు.

సుప్రీం తీర్పు కేంద్రానికి చెంప పెట్టు
2జీ స్పెక్ట్రం కుంభకోణంలో సుప్రీం కోర్టు తీర్పు కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం కావాలని, యూపీఏ ప్రభుత్వ హయంలో అవినీతి ఏ విధంగా జరిగిందో ఈ తీర్పు ద్వారా తేటతెల్ల మయ్యిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్‌ చంద్రబాబు నాయడు అన్నారు. 2008 తరువాత కేటాయించిన 122 లైసె న్స్‌లను రద్దు చేయడాన్ని ఆహ్వానిస్తున్నట్లు ఆయన చెప్పారు. నష్టం జరగలేదని, మంచి నిర్ణయమే తీసుకున్నామని అనేక వాదనలతో కాలం వెల్లబుచ్చిన యుపీఏ పాలకుకు ఇది చెంపపెట్టు అన్నా రు. కామన్వ్‌ల్త్‌ ,ఆదర్శ్‌ సొసైటీ, ఆంధ్రప్రదేశ్‌లో లక్షల కోట్ల అవినీతి కుంబుకోణాలపై టీడీపీ గత ఎడు సంవత్సరాలు చెపుత్నుది వాస్తవమే అన్న సంగతి ప్రజలకు అర్థం అవుతోందన్నారు.

122 లెసెన్స్‌ల రద్దు హర్షణీయంః ఎర్రన్నాయుడు

2జీ స్పెక్ట్రం కుంభకోణంలో సుప్రీం కోర్టు తీర్పు కేంద్రానికి చెంపపెట్టని, 122లైసెన్స్‌ల రద్దు హర్షణీయమని పొలిట్‌ బ్యూరో సభ్యుడు కె.ఎర్రన్నాయుడు అన్నారు.యుపీఏ ప్రభుత్వం ఏ విధంగా కార్పోరేట్‌ కంపెనీలకు దాసోహం అంటుందో ఈ తీర్వు ద్వారా తెటతెల్ల మయ్యిందన్నారు. ప్రధాని కార్యాలయం నిష్క్రియా పరత్వంపై సుప్రీం కోర్టు ప్రశ్నించడం యుపీఏ పాలనలో పేరుకు పోయిన అవినీతికి, జడత్వానికి గుణపాఠం కావాలన్నారు.

వామపక్షాల ఐక్యత అనివార్యం
లోక్‌పాల్‌తో అవినీతి అంతం కాదు

పీకల్లోతు అవినీతిలో యుపిఎ ప్రభుత్వం

సిపిఎం- జాతీయ ప్రధాన కార్యదర్శి కరత్‌

మావోయిస్టులు ఎవరిచేతిలో ఆయుధాలు కావొద్దని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌కరత్‌ హితవు పలికారు. పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌తో చేతులు కలిపిన మావోలు వందలాది మంది సిపిఎం కార్యకర్తలను పొట్టనబెట్టుకున్నారని ఆరోపించారు. ఖమ్మంలో గురువారం ప్రారంభమైన సిపిఎం 23వ రాష్ట్రమహాసభల్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రారంభ సభలో ఆయన ముఖ్యఅతిదిగా పాల్గొని ప్రసంగించారు. పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో 450 మంది సిపిఎం కార్యకర్తలు హత్యకు గురైతే వారిలో 117 మంది మావోల చేతిలో బలవడం తృణమూల్‌ కాంగ్రెస్‌, మావోల నడుమ చెలిమికి నిదర్శనమన్నారు. అయితే అధికారంలో లేనప్పుడు మావోయిస్టుల జపం చేసిన మమత బెనర్జీ అధికారంలోకి రాగానే వారిపై యుధ్దం ప్రకటించిందన్నారు. మావోయిస్టులు ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని, ఎవరి చేతిలో ఆయుధాలు కావద్దని హితవు పలికారు. అన్నాహజారే కోరుతున్న లోక్‌పాల్‌ బిల్లుతో అవినీతి పూర్తిగా అంతమవుతుందని సిపిఎం పార్టీ భావించడం లేదన్నారు. దేశంలో జరిగిన ప్రతి అవినీతి వెనుక కార్పోరేట్‌ శక్తుల హస్తం ఉంటుండటం ఆందోళన కలిగించే అంశమన్నారు. యుపిఏ ప్రభుత్వం అవినీతిని పెంచిపోషిస్తుందనడటానికి 2జి స్పెక్ట్రమ్‌ కుంభకోణమే నిలువుటద్దమన్నారు. అసలు దోషులను దాచిపెడుతూ అనివార్య పరిస్థితుల్లో మాత్రం అనామకులను ప్రభుత్వం తెరపైకి తెస్తుందని ఆరోపించారు. స్పెక్ట్రమ్‌ కుంభకోణంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో ఆశాఖాంమత్రులు కటకటాల పాలయ్యారని, అయినా ఇంకా ప్రభుత్వంలో మార్పు రాకపోవడం శోచనీయమన్నారు. అప్పటి టెలికాం మంత్రి రాజా 122 లైసెన్సులను అనర్హులకు కట్టబెట్టారని, తక్షణమే ఆ లైసెన్సులు రద్దు చేసి సంబందిత కార్పోరేట్‌ శక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

గత 20 సంవత్సరాలుగా వ్యవసాయరంగాన్ని ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని కరత్‌ విమర్శించారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల దేశవ్యాప్తంగా 2లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగాన్ని కృంగదీసే పద్ధతులను ప్రభుత్వాలు అమలుచేస్తుండటంతో గ్రామీణ వ్యవస్థ కూడా చిన్నాభిన్నమైందన్నారు. 1991లో సోవియట్‌ యూనియన్‌ విచ్చిన్నమైనప్పుడు పెట్టుబడిదారులందరూ కేరింతలు కొట్టారని, అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారి వ్యవస్థ పునాదులు కదులుతున్నాయన్నారు. అమెరికాలో యూరో విలువ నానాటికీ కుప్పకూలిపోతోందని, రానున్న 2020 సంవత్సరం నాటికి ఆర్థికంగా అమెరికాను చైనా మించిపోతుందని జోస్యం చెప్పారు. పెట్టుబడిదారి వ్యవస్థను ప్రోత్సహించిన రాజ్యాలు, ప్రభుత్వాలు మనుగడ సాధించలేవని అభిప్రాయపడ్డారు. న్యాయమైన హక్కుల కోసం అమెరికా పౌరులు వాల్‌స్ట్రీట్‌ను ముట్టడించడం ప్రపంచ వ్యాప్తంగా పెల్లుబికుతున్న ఆందోళనలకు నిదర్శనంగా ఆయన అభివర్ణించారు. భారతదేశంలో నానాటికీ ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని ఇదే విషయాన్ని అర్జున్‌సింగ్‌ గుప్తా తన నివేదికలో పేర్కొన్నారని అన్నారు. దేశంలో 77శాతం మంది ప్రజలు ఇప్పటికి కూడా రోజుకు రూ.20 కూడా ఖర్చు చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వాలు నిరుపేదలను పట్టించుకోకుండా కోటీశ్వరులను తయారు చేసేందుకు పోటీపడుతున్నాయని విమర్శించారు. సిపిఎం పార్టీకి హైకమాండ్‌, డిల్లీ ఆదేశాలు, హుకుంలు ఉండవని, పార్టీ పరంగా అందరం కలిసి ఉద్యమ, నిర్మాణ,సైద్ధాంతిక వైఖరులను నిర్దేశించుకుంటామని కరత్‌ అన్నారు. అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో బూర్జూవా పార్టీల వినాశకర పద్ధతులను దీటుగా ఎదుర్కోవాలన్నా, నానాటికీ పెచ్చుమీరిపోతున్న అవినీతి అక్రమాలను తుదముట్టించాలన్నా వామపక్షాల ఐక్యత ద్వారానే అది సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.

సీనియర్‌ మార్క్సిస్టు నేత పాటూరి రామయ్య అధ్యక్షతన జరిగిన ఈ సభలో సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌, సిపిఎం రాష్ట్రకార్యదర్శి బి.వి. రాఘవులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు మధు, తమ్మినేని వీరభద్రం, ఎస్‌ పుణ్యవతి, మల్లు స్వరాజ్యం, రాష్ట్రనాయకులు వై. రాధాకృష్ణమూర్తి, ఎస్‌. వీరయ్య, వై. వెంకటేశ్వర్లు, సిపిఎం జిల్లాకార్యదర్శి పి. సుదర్శన్‌, జిల్లాకార్యదర్శివర్గ సభ్యుడు ఎన్‌. నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ కేసులో కీలక మలుపు
emmar

ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ కేసులో కీలక మలుపు. ఏ-1 నిందితుడిగా ఉన్న ఐఏఎస్‌ బీపీ ఆచార్య ఇక నేటి నుంచి జైలుజీవి కానున్నారు. సాక్షిగా హాజరయిన మరో ఐఏఎస్‌ అధికారి ఎల్వీ సుబ్రమణ్యం త్వరలో బోనెక్కనున్నారు. ఎమ్మార్‌ – ఏపీపీఐసీ ఉమ్మడి ప్రాజెక్టయిన ఎమ్మార్‌ హిల్స్‌ టౌన్‌ ప్రాజెక్టు మాజీ సీఈఓ విజయరాఘవ, సునీల్‌రెడ్డి, శ్రవణ్‌ గుప్తా పేర్లు చార్జిషీటులో చోటుచేసుకోలేదు. శ్రవణ్‌గుప్తాను అరెస్టు చేయకుండా, చార్జిషీటులో ప్రస్తావించకుండా, ఆయనను అదనపు చార్జిషీటులో చే ర్పించే ప్రయత్నాలు చేస్తోంది. అసలు ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ సంస్థ (దుబాయి) యజమాని మహ్మద్‌అలీ అల్‌బర్‌ పేరు సీబీఐ దృష్టిపథంలో ఉంటుందా? ఉండదా? అన్న సందే హాల నేపథ్యంలో ఆయనను ఏ-2గా చేర్చారు.

కోనేరు కుమారుడి హస్తం ఉందని రంగారావుతో పాటు మరి కొందరు సమాచారం ఇచ్చినందుకు ఆయననూ చార్జి షీటులో చేర్చారు. అల్‌బర్‌, కోనేరు మధును అరెస్టు చేసి తీసుకువచ్చేందుకు సీబీఐ ఇంటర్‌పోల్‌ను రంగంలోకి దింపనుంది. ఈ విధంగా, ఊహించని మలుపు తిరు గుతూ చివరకు చార్జిషీట్‌ దశకు చేరుకున్న ఎమ్మార్‌ కేసు ఆసక్తికరంగా మారింది. ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ కేసులో సుమారు 156 పేజీల చార్జిషీట్‌ను బుధవారం నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో సీబీఐ జాయింట్‌ డైరక్టర్‌ లక్ష్మీనారాయణ దాఖ లు చేశారు. మొత్తం 286 మంది సాక్షులను విచారిం చింది. వారి అభియోగాలతో పా టు సుమారు 1834 పేజీ ల డాక్యుమెంట్లను విచారణలో భాగంగా సీబీఐ సే రించింది. వాటిని ఈ చార్జిషీట్‌లో అనుబంధంగా చేర్చినట్లు జెడి లక్ష్మినారాయణ, సీబీఐ కోర్టు న్యాయ మూర్తి బి. నాగమారుతీ శర్మకు వివరణ ఇచ్చారు.

అంతకుముందు.. సీబీఐ అధికారులు సుమారు 50 వేల పేజీలతో కూడిన ఆరు ట్రంకుపెట్టెలను కోర్టుకు తీసుకువచ్చారు. అయితే ఈ కేసులో నిందితుడిగా సీబీఐ అరెస్టు చేసి చంచల్‌గూడ జైలులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న ఎమ్మార్‌ – ఏపీపీఐసీ ఉమ్మడి ప్రాజెక్టైన ఎమ్మార్‌ హిల్స్‌ టౌన్‌ ప్రాజెక్టు మాజీ సీఈఓ విజయరాఘవ, సునీల్‌రెడ్డితో పాటు అరెస్టుకాని శ్రవణ్‌ గుప్తా పేర్లను ప్రస్తుతం కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్‌లో నమోదు చేయలేదని లక్ష్మినారాయణ కోర్టుకు తెలిపారు. ఎమ్మార్‌ సంస్థ 535 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీఐఐసీతో ఒప్పందం కుదుర్చుకుందని, ఆభూమిని అభివృద్ధి చేసే విధంగా విల్లాలు, హోటల్‌ సముదాయాలతో కూడిన అత్యాధునిక హంగులతో నిర్మాణాన్ని చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుందని చార్జిషీట్‌ సీబీఐ ప్రస్తావించింది.

అయితే ఈ భూమి అమ్మకాల్లో ప్రభుత్వాన్నీ మోసం చేసే విధంగా, వాటాల్లో పెద్ద ఎత్తున మోసాలకు ఎమ్మార్‌ సంస్థ పాల్పడినట్లు సీబీఐ పేర్కొంది. తద్వారా ప్రభుత్వ రంగ సంస్థయిన ఏపీఐఐసీ వాటాను తగ్గించేందుకు ఎమ్మార్‌ సంస్థలోని డైరెక్టర్లు కుట్ర జరిపారని పేర్కొంది. ఎమ్మార్‌ విల్లాల విక్రయంలో యదేచ్ఛగా అక్రమాలు జరిగినట్లు విచారణలో వెల్లడైందని సీబీఐ సమర్పించిన చార్జిషీట్‌లో పేర్కొంది. ఈ చార్జిషీట్‌లో మొత్తం 12 మందిని నిందితులుగా సీబీఐ పేర్కొంది అయితే అందులో ప్రధానంగా ప్రస్తుత రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి బిపీ ఆచార్య, టిటిడి ఎగ్జిక్యూటివ్‌ ఆఫీ సర్‌, ఐఏఎస్‌ అధికారి లంకా వెంకట సుబ్రహ్మణ్యం, మాజీ ఐఏఎస్‌ అధికారి కె. విశ్వేశ్వర రావు పేర్లను సీబీఐ నమోదు చేసింది.

ఈ ముగ్గురు ఐఏఎస్‌ అధికారులను విచారించేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతిని సీబీఐ కోరిందని, అయితే ఇప్పటి వరకు బీపీ ఆచార్యను విచారించేందుకు మాత్రమే కేంద్రం అనుమతి ఇచ్చిందని, మిగితా వారి విచారణపై ఎలాంటి ఆదేశాలు రానందున చార్జిషీట్‌లో మాత్రమే వారి పేర్లను ఇవ్వడం జరిగిందని లక్ష్మినారాయణ కోర్టుకు వివరణ ఇచ్చారు.

రంగారావుకు ముందస్తు బెయిల్‌ – ఎమ్మార్‌ కేసులో మొదటిది

ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న స్టయిలిష్‌ హోమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరక్టర్‌ తుమ్మల రంగారావుకు సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఫిబ్రవరి 6లోపు ఇద్దరు వ్యక్తులతో రూ. 25,000 రూపాయలను కోర్టులో షూరిటీగా డిపాజిట్‌ చేయమని ఆదేశించింది. అలాగే సీబీఐ దర్యాప్తు సంస్థ విచారణకు పూర్తిగా సహకరించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనుమతి లేకుండా హైదరాబాద్‌ నగరం వదలి పోరాదని సీబీఐ ఆదేశించింది. ఇదిలా ఉండగా ఇప్పటి వరకూ ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ కేసులో సీబీఐ ఎంతో పకడ్బందీగా దర్యాప్తు, విచారణను చేపట్టింది. సీబీఐ విచారణకు హాజరైన స్టయిల్‌ష్‌ హోమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ తుమ్మల రంగారావును సీబీఐ అరెస్టు చేస్తుందని పుకార్లు షికార్లుచేశాయి. ఎంతో చాకచక్యంగా సీబీఐ అధికారులు పుకార్లకు చెక్‌ పెడుతూ ఈ కేసులో రంగారావును నిందితుడిగా చేర్చుతూనే, అతనిని నుంచి వివరాలు సేకరించడంలో సరైన పంథాను అవలంబించింది. జనవరి 28వ తేదిన రంగారావు ముందుస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దానిపై విచారణ చేపట్టిన కోర్టు ఈ రోజు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేస్తూ ఆదేశాలను జారీ చేసింది.

సునీల్‌రెడ్డికి స్సెషల్‌ కేటగిరి

ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ కేసులో నిందితుడిగా అరెస్టయిన సునీల్‌ రెడ్డికి జ్యుడీషియల్‌ కస్టడీలో స్సెషల్‌ కేటగిరికి అనుమతిని ఇస్తూ సీబీఐ కోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఈ రోజుతో జ్యుడీషియల్‌ కస్టడీ ముగియడంతో సునీల్‌రెడ్డిని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరు పరిచారు. ఇదిలా ఉండగా జ్యుడీ షియల్‌ కస్టడీలో ప్రత్యేక సదుపాయలను ఇవ్వాలని కోరుతూ ఇదివరకు వేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టు న్యాయమూర్తి నాగమారుతీ శర్మ స్పందిస్తూ.. అతనికీ ఏ కేటగిరి సదుపాయాలను కల్పించాలని చంచ ల్‌గూడ జైలు అధికారులకు ఆదేశాలను జారీ చేశారు.

బీపీ ఆచార్య బెయిల్‌ విచారణ ఈ నెల 3కు వాయిదా

ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్టయిన సీబీఐ విచారణకు హాజరువుతున్న బీపీ ఆచార్యను జ్యుడీషియల్‌ కస్టడీకి పం పాలని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నాగమారుతీ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ రోజుతో సీబీఐ కస్టడీ ముగియడంతో ఆచార్యను ఈ రోజు సీబీఐ కోర్టులో హాజరుకావాల్సి ఉంది. అయితే ఆయనకు విచారణ సమయంలో చాతీలో నొప్పి రావడంతో సీబీఐ అధికారులు నిమ్స్‌ ఆసుపత్రికి తరలించిందని సీబీఐ తరుపున న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అందుచేత ఈ రోజు విచారణకు ఆచార్యను కోర్టులో హాజరు పరచలేకపోయినట్లు సీబీఐ అధికారులు కోర్టుకు వివరణ ఇచ్చారు. సీబీఐ కస్టడీ ముగియడంతో ఆచార్య తరపున బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాల్సిందిగా సీబీఐను కోర్టు ఆదేశిస్తూ విచారణను ఈ నెల 3కు వాయిదా వేసింది.

పబ్లిక్ సర్వెంట్లపై ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు – అవినీతిపై సుప్రీం
ప్రాసిక్యూషన్ కోరవచ్చు.. ఇది పౌరుల హక్కు

అనుమతిపై నాన్చడం కుదరదు.. 4 నెలల్లోపు తేల్చాలి

లేకుంటే అనుమతి ఇచ్చినట్లే!.. తేల్చి చెప్పిన ధర్మాసనం

ప్రధానికి తగిన సలహా ఇవ్వలేదు

ప్రధాని కార్యాలయానికి అక్షింతలు

గడువుపై పార్లమెంటుకూ సూచన

రాజా ప్రాసిక్యూషన్‌కు మార్గం సుగమం

అక్రమాలకు పాల్పడిన పబ్లిక్ సర్వెంట్స్‌పై ఏ పౌరుడైనా ఫిర్యాదు చేయవచ్చు! వారిని అవినీతి నిరోధక చట్టం కింద ప్రాసిక్యూట్ చేయాల్సిందిగా కోరవచ్చు! ఇది సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన విషయం.

అక్రమార్కులను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతించకుండా ప్రభుత్వం నెలలు, సంవత్సరాల తరబడి నాన్చేందుకు వీల్లేదు. గరిష్ఠంగా నాలుగు నెలల్లోపు అటో ఇటో తేల్చేయాల్సిందేనని కూడా సుప్రీంకోర్టు ప్రభుత్వాలకు స్పష్టం చేసింది! దేశాన్ని పట్టి కుదిపేస్తున్న 2జీ కుంభకోణంలో కేంద్ర మాజీ మంత్రి, పార్లమెంటు సభ్యుడు ఎ.రాజాను ప్రాసిక్యూట్ చేసేందుకు సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసింది.

ఈ విషయంలో జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్య స్వామి వాదనను బలపరిచింది. ‘రాజాను ప్రాసిక్యూట్ చేయాల్సిందిగా ప్రధానమంత్రిని ఆదేశించలేం’ అంటూ ఢిల్లీ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును పక్కనపెట్టింది. ప్రాసిక్యూట్ చేయడంపై నిర్ణయం తీసుకోవడంలో మీనమేషాలు లెక్కించిన ప్రధానమంత్రి కార్యాలయంపై సుప్రీం మండిపడింది. జస్టిస్ జీఎస్ సింఘ్వీ, జస్టిస్ ఏకే గంగూలీలతో కూడిన ధర్మాసనం మంగళవారం దీనిపై తీర్పు చెప్పింది.

గురువారం పదవీ విరమణ చేయనున్న జస్టిస్ గంగూలీ ప్రత్యేకమైన తీర్పు రాశారు. పబ్లిక్ సర్వెంట్స్ అవినీతిపై నిశిత వ్యాఖ్యలు చేశారు. సుప్రీం తీర్పు కేంద్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అని విపక్షాలు… అన్నా హజారే బృందం పేర్కొనగా… ‘కోర్టులు ఇలాంటి తీర్పులు అనేకం ఇస్తుంటాయి. ఇది మాకు ఎదురుదెబ్బ కాదు’ అని కాంగ్రెస్ తేలిగ్గా తీసుకుంది.

ప్రజాస్వామ్యానికి అవినీతి ప్రమాదం

సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య రిపబ్లిక్‌లో అవినీతికి చోటు లేదు. అవినీతి భూతం అభివృద్ధికి శత్రువు. మానవ విలువలకు పాతరేస్తుంది. న్యాయాన్ని సమాధి చేస్తుంది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని ప్రభోదించే రాజ్యాంగ విలువలనే అపహాస్యం చేస్తుంది. ఇది ప్రజాస్వామ్యానికే పెను ప్రమాదం. స్వేచ్ఛగా, నిర్భయంగా విధులు నిర్వహించేందుకు వీలుగా తప్పుడు ప్రాసిక్యూషన్ నుంచి పబ్లిక్ సర్వెంట్స్‌కు కొన్ని రక్షణలు కల్పించారు. అయితే… ఈ ‘రక్షణ’నే కవచంగా వాడుకుంటూ అవినీతికి పాల్పడటం కుదరదు. అవినీతిపరులైన పబ్లిక్ సర్వెంట్స్‌పై ఫిర్యాదు చేయడం పౌరుల రాజ్యాంగ హక్కు. దీనిపై సంబంధిత యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సిందే.

- జస్టిస్ ఏకే గంగూలీ

అవినీతి మదగజంపై సుప్రీంకోర్టు మరోమారు అంకుశం ప్రయోగించింది. ప్రజా జీవితంలో పెచ్చరిల్లుతున్న అవినీతి… ఈ దేశ ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగబద్ధ పాలనకే పెనుముప్పు అని ఆందోళన వ్యక్తం చేసింది. అక్రమాలకు పాల్పడిన పబ్లిక్ సర్వెంట్స్ (ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల)ను ప్రాసిక్యూట్ చేయాల్సిందిగా కోరే హక్కు పౌరులెవరికైనా ఉంటుందని స్పష్టం చేసింది. పబ్లిక్ సర్వెంట్స్‌ను అవినీతి నిరోధక చట్టం కింద ప్రాసిక్యూట్ చేయాలంటే కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాల ముందస్తు అనుమతి అవసరం.

2జీ కేసులో అరెస్టయిన ఎ.రాజా ప్రాసిక్యూషన్‌కు ప్రధాని కార్యాలయం (పీఎంవో) అనుమతించకుండా, అనుమతి నిరాకరించకుండా 16 నెలలుగా నాన్చింది. 2జీ కుంభకోణాన్ని బయటికి లాగుతున్న సుబ్రమణ్యస్వామి ఇదే అంశంపై ‘లేఖల యుద్ధం’ ప్రకటించారు. రాజా ప్రాసిక్యూషన్‌కు అనుమతించాలని ఆయన కోరారు. ఇందుకు ప్రధాని నిరాకరించారు. దీంతో సుబ్రమణ్యస్వామి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ‘రాజా ప్రాసిక్యూషన్‌కు అనుమతించాల్సిందిగా ప్రధాన మంత్రిని ఆదేశించండి’ అని కోరారు.

ఇందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీంతో సుబ్రమణ్య స్వామి సుప్రీంకోర్టుకు ఎక్కారు. దీనిపై సుప్రీం ధర్మాసనం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. వినీత్ నారాయణ్ కేసులో 1998లో ఇచ్చిన ఆదేశాల ప్రకారం… పబ్లిక్ సర్వెంట్స్ ప్రాసిక్యూషన్‌కు అనుమతిపై మూడు నెలల్లో తేల్చాలని, అటార్నీ జనరల్‌తో సంప్రదింపులు జరపాల్సిన అవసరముంటే మరో నెల గడువు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. మొత్తానికి నాలుగు నెలల్లోపు విషయం తేల్చాల్సిందేనని పునరుద్ఘాటించింది.

నాలుగు నెలలు గడిచిన తర్వాత కూడా ‘నాన్చుడు కార్యక్రమం’ కొనసాగితే… ప్రాసిక్యూషన్‌కు అనుమతించినట్లుగానే భావించాల్సి వస్తుందని ఈ కేసులో ప్రత్యేకంగా తీర్పు రాసిన జస్టిస్ ఏకే గంగూలీ స్పష్టం చేశారు. సంప్రదింపులు జరపాల్సిన అవసరముందనే విషయాన్ని మూడు నెలల్లోపే లిఖిత పూర్వకంగా అటార్నీ జనరల్‌కు చెప్పాలన్నారు. అంతేకాదు… ‘అవినీతి నిరోధక చట్టం కింద ఎన్ని రోజుల్లోపు అనుమతి ఇవ్వాలనే అంశం చట్టంలో లేదు. దీనికి ఇక నిర్దిష్ట గడువు విధిస్తూ పార్లమెంటులో చట్టం చేయాలి’ అని కూడా ఆయన సూచించారు.

గాంధీజీకి సిఎం నివాళ్లు
గాంధీ వర్థంతి సందర్భంగా లంగర్‌హౌస్‌ బాపూఘాట్‌లో రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి ఎన్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదరం రాజనర్సింహ్మ, పలువురు మంత్రులు, ఎంపిలు, ఎమ్మేల్యేలు, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు, స్వాతంత్య్ర సమర యోధులు మహాత్మగాంధీ సమాధి వద్ద్ద పుష్పగుచ్ఛాలుంచి ఘన నివాళులర్పించారు. అనంతరం అక్కడి ఆడిటోరియంలో హిందూ, ముస్లీం, సిక్‌, క్రైస్తవ, బౌద్ధ్దమతాల గురువులు ఆలపించిన ప్రార్థనల్లో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పశ్చిమ మండల డిసిపి స్టీఫేన్‌ రవీంద్ర పర్యవేక్షణలో ఆసిఫ్‌నగర్‌ డివిజన్‌ ఎసిపి టి నాగరాజ్‌కుమార్‌ ఆధ్వర్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ ఇన్‌ఛార్జి ఎండి, పర్యాటక శాఖ కమీషన్‌ సత్య సాచి ఘోష్‌, హైదాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నటరాజన్‌ గుల్జార్‌, జిహెచ్‌ఎంసి కమీషన్‌ కృష్ణబాబు, హైదరాబాద్‌ జిల్లా ఆర్డీఓ హరిష్‌కుమార్‌, డిపిఆర్వో చంద్రశేఖర్‌, జనరల్‌ మేనేజర్‌(హోటల్స్‌) సుమీత్‌సింగ్‌, స్వాతంత్య్ర సమరయోధులు బోష్‌పల్లి వెంకటరమణ, బాబురావు వర్మ, తహశీల్దార్‌ అరుంధతి, స్థానిక నాయకులు జి ప్రహ్లాద్‌యాదవ్‌, పరమానందం, పెర్కారాజు, రాఘవమ్మ పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

నిరాశ చెందిన విద్యార్థులు

ఆడిటోరియంలో సర్వమతాల గురువులు ఆలపించిన అనంతరం గవర్నర్‌, సిఎం ఎవరితోనూ ముచ్చటించకుండా వెళ్లిపోయారు. దీంతో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు నిరాశ చెందారు.

ఏటా రెండు సార్లే బాపూఘాట్‌కు..

రాజకీయ నాయకులు ఏటా రెండు సార్లు మాత్రమే బాపూఘాట్‌కు వస్తుంటారు. గాంధీజయంతి, వర్థంతి రోజు తప్ప మిగతా రోజుల్లో ఆయన సమాధిని ఎవ్వరూ పట్టించుకోరు. దీన్ని పర్యాటక కేంద్రంగా ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని, అలాగే ఇక్కడి ఆడిటోరియంలో గాంధీ మహాత్మునికి సంబంధించిన డాక్యుమెంటరీ, డిజిటల్‌ ఎగ్జిబిషన్‌లను ఏర్పాటు చేసినా అది ఎవ్వరికీ ఉపయోగపడడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. బాపూఘాట్‌ను పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.