జాతీయం

రాంగోపాల్‌వర్మకు సీఐడీ నోటీసు!


రక్తచరిత్రకు ఫైనాన్స్ చేసింది నేనే
-ఫ్యాక్షన్ ఏరియాలకు వర్మను తీసుకెళ్లా విచారణలో వెల్లడించిన భాను!
మద్దెలచెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు మలిశెట్టి భాను కిరణ్ అలియాస్ భాను కేసులో దర్శకుడు రాంగోపాల్‌వర్మను విచారించాలని సీఐడీ అధికారులు నిశ్చయించినట్టుగా తెలిసింది. రాయలసీమ పాలెగాళ్ల కథ ఆధారంగా రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో వచ్చిన రక్తచరిత్ర సినిమాకు ఫైనాన్స్ చేయటమే కాకుండా, అతడిని ఫ్యాక్షన్ ప్రాంతాలకు తీసుకెళ్లినట్టు భాను విచారణలో వెల్లడించిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రాంగోపాల్‌వర్మను ఫ్యాక్షన్ ఏరియాలకు తీసుకెళ్లినపుడు తనతోపాటు సినీ నిర్మాత చిల్లర కళ్యాణ్ కూడా ఉన్నట్టు భాను చెప్పిన నేపథ్యంలో అతన్ని కూడా ప్రశ్నించాలని భావిస్తున్నట్టు తెలియవచ్చింది. సూరిని చంపిన తరువాత పరారైన భానును పదిహేను నెలల తరువాత సీఐడీ అధికారులు జహీరాబాద్ ప్రాంతంలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత కోర్టు అనుమతితో భానును కస్టడీలోకి తీసుకున్న సీఐడీ అధికారులు అతన్ని క్షుణ్ణంగా విచారించారు. దీంట్లోనే దంతలూరి కృష్ణ అలియాస్ మంగలి కృష్ణ, మధుమోహన్‌డ్డి తదితరులతో కలిసి భాను చేసిన సెటిప్మూంట్లు వెలుగు చూశాయి. హంద్రీ-నీవా ప్రాజెక్ట్ కాంట్రాక్టర్లను బెదిరించి కోట్లాది రూపాయలు తీసుకున్న కథలు కూడా బయటపడ్డాయి.
ఫ్యాక్షన్ గొడవల కథతో రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో వచ్చిన రక్తచరిత్ర సినిమాకు తానే ఫైనాన్స్ చేసినట్టుగా భాను సీఐడీ కస్టడీలో ఉన్నపుడు వెల్లడించాడని సమాచారం. ఆ సినిమా తీస్తున్నపుడే రాంగోపాల్‌వర్మతో తనకు పరిచయం ఏర్పడినట్టుగా తెలియచేశాడు. సినిమాకు ఫైనాన్స్ చేయటమే కాకుండా రాంగోపాల్‌వర్మను సినీ నిర్మాత చిల్లర కళ్యాణ్‌తో కలిసి ఫ్యాక్షన్ ప్రాంతాలు చూపించినట్టు చెప్పాడని తెలిసింది. రక్తచరిత్ర సినిమా పూర్తికాకముందే చిల్లర కళ్యాణ్‌కు చెందిన బాలాజీ కలర్ ల్యాబ్ నుంచి రెండు రీళ్లు తీసుకెళ్లినట్టు వెల్లడించాడు. రాప్తాడు నియోజకవర్గం ప్రజలకు చూపించటానికే ఆ రీళ్లను తీసుకెళ్లినట్టు తెలిపాడు. రక్తచరిత్ర సినిమా కోసం బెంగళూరులో రెండు థియేటర్లను కూడా బుక్ చేసినట్టు చెప్పాడు. కస్టడీలో ఉన్నపుడు భాను వెల్లడించిన ఈ వివరాల నేపథ్యంలోనే దర్శకుడు రాంగోపాల్‌వర్మను ప్రశ్నించాలని సీఐడీ అధికారులు నిర్ణయించినట్టుగా తెలిసింది. ఈ మేరకు ఆయనకు నోటీసులు జారీ చేయనున్నట్టు సమాచారం.

జువెలరీపై ఎక్సైజ్‌ సుంకం ఉపసంహరణ


న్యూఢిల్లీగత రెండు నెలలుగా విదేశీ, దేశీయ పెట్టుబడి దారుల నిరసనల నేపథ్యంలో కేంద్రం వెనక్కు తగ్గింది. జనరల్‌ యాంటీ అవాయిడెన్స్‌ రూల్స్‌ (గార్‌) అమలును ఏడాది పాటు వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ సోమవారం పార్లమెంట్‌లో ప్రకటించారు. 2013 – 14 తర్వాత ‘గార్‌’ అమల్లోకి వస్తాయని ఆయన తెలిపారు. ‘గార్‌’ కమిటీలో స్వతంత్య్ర సభ్యుడిని నియమిస్తామని ప్రణబ్‌ తెలిపారు. 82 దేశాలతో డిటిఎఎ అమల్లో ఉన్నందున ఆయా దేశాలతోపాటు మన దేశంలో పెట్టుబడులపై ఆదాయ పన్ను వసూలు కూడా నిలిపి వేస్తున్నట్లు ప్రణబ్‌ ముఖర్జీ తెలిపారు. అన్‌ లిస్టెడ్‌ సంస్థల్లో పెట్టుబడుల లావాదేవీలపై ఎస్‌టిటిని 0.2 శాతానికి పరిమితం చేస్తున్నట్లు ప్రణబ్‌ తెలిపారు.
కేంద్రం స్థిరాస్థులపై టిడిఎస్‌ పూర్తిగా ఉపసంహరించుకుంది. ఇక గతంలో రూ. 2 లక్షల విలువ గల స్వర్ణాభరణాల కొనుగోలుపై ఎక్సైజ్‌ డ్యూటీ #పరిధిని రూ. 5 లక్షలకు పెంచింది. బ్రాండెడ్‌, అన్‌ బ్రాండెడ్‌ ఆభరణాలపై లేవీ పన్ను విధించాలన్న యోచన నుంచి కేంద్రం వెనక్కు తగ్గింది. ప్రయివేట్‌ ఈక్విటీల్లో పెట్టుబడి లాభాలపై 10 శాతం పన్ను ప్రతిపాదన ఉపసంహరించుకున్నట్లు ప్రణబ్‌ వివరించారు. అన్ని వ్యాపార లావాదేవీలపై టాక్స్‌ లోయర్‌ రేట్‌ను పెండింగ్‌లో పెట్టాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. కస్టమ్స్‌ అండ్‌ ఎక్సైజ్‌ సుంకం నిబంధనల ప్రకారం పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వ్యతిరేకించే వరకు బెయిల్‌ తిరస్కరించాలన్న ప్రతిపాదనపైనా సర్కార్‌ వెనక్కు తగ్గింది.
‘గార్‌’ అమలును ఏడాది పాటు నిలిపి వేయాలని కేంద్రం నిర్ణయించడంతో సోమవారం అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి విలువ వారం క్రితం స్థాయికి పెరిగింది. గత శుక్రవారం అమెరికన్‌ డాలర్‌పై రూపాయి విలువ 53.47/48 కాగా, సోమవారం అది రూ.52.965/975కు చేరుకుంది.
ఎక్సైజ్‌ సుంకం ఉపసంహరించుకున్నట్లు కేంద్రం ప్రకటించడంతో బంగారం దిగుమతులు పెరగనున్నాయని బాంబే బులియన్‌ వ్యాపారుల సంఘం ఆశాభావం వ్యక్తం చేసింది. గత మార్చిలో బడ్జెట్‌ ప్రతిపాదనలు పార్లమెంట్‌కు సమర్పించినప్పటి నుంచి బులియన్‌ వ్యాపారులు పక్కకు తప్పుకున్నారని బాంబే బులియన్‌ వ్యాపారుల సంఘం అధ్యక్షుడు పృథ్వీరాజ్‌ కొఠారీ తెలిపారు. ఎక్సైజ్‌ సుంకం ఉపసంహరిస్తూ ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఆయన తెలిపారు. వచ్చే వారాల్లో బులియన్‌ వ్యాపారం పుంజుకుంటుందని కొఠారీ ఓ వార్తా సంస్థకు చెప్పారు.

మళ్లీ మో ‘ఢీ’


2002 గుజరాత్‌ అల్లర్ల సమయంలో ‘వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచినందుకు’ భారత శిక్షా స్మృతి (ఐపిసి)లోని వివిధ సెక్షన్ల కింద గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడిని ప్రాసిక్యూట్‌ చేయవచ్చునని సుప్రీం కోర్టు నియుక్త అమికస్‌ క్యూరీ అభిప్రాయం వెలిబుచ్చారు. జకియా జాఫ్రి ఫిర్యాదుపై అమికస్‌ క్యూరీ పరిశీలన జరిపి సమర్పించిన నివేదిక సుప్రీం కోర్టు నియుక్త ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) నివేదికకు పూర్తి విరుద్ధంగా ఉండడం విశేషం. సిట్‌ నివేదిక మోడి, ప్రభృతులకు క్లీన్‌ చిట్‌ ఇచ్చిన విషయం విదితమే. ‘మతం కారణంగా వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచినందుకు ఐపిసి 153 ఎ (1) (ఎ), (బి) సెక్షన్ల కింద, జాతీయ సమగ్రతకు హాని కలిగించే ప్రకటనలు చేసినందుకు ఐపిసి 153 బి (1) సెక్షన్‌ కింద నేరానికి పాల్పడినట్లుగా ప్రాథమిక దశలో మోడిపై నిర్ధారణ చేయవచ్చునని నా అభిప్రాయం’ అని రామచంద్రన్‌ తన నివేదికలో వివరించారు.
‘ఏ వ్యక్తికైనా గాయం కలిగించే ఉద్దేశంతో చట్టాన్ని ప్రభుత్వోద్యోగి పాటించకపోవడానికి సంబంధించిన ఐపిసి 166 సెక్షన్‌ కింద, శత్రుత్వాన్ని లేదా విద్వేషాన్ని లేదా అయిష్టతను సృష్టించే లేదా ప్రోత్సహించే ప్రకటనలకు సంబంధించిన 505 (2) సెక్షన్‌ కింద కూడా ఆయనను (మోడిని) ప్రాసిక్యూట్‌ చేయాలి’ అని అమికస్‌ క్యూరీ తన నివేదికలో సూచించారు. గోధ్రా రైలు దగ్ధం సంఘటన నేపథ్యంలో ‘ముస్లింలపై ఆగ్రహం వెళ్లగక్కడానికి, వారికి గుణపాఠం నేర్పడానికి హిందువులను అనుమతించాలి’ అని మోడి 2002 ఫిబ్రవరి 27 నాటి సమావేశంలో ఆదేశించారని సస్పెండైన ఐపిఎస్‌ అధికారి సంజీవ్‌ భట్‌ చేసిన ఆరోపణలను సిట్‌ తన నివేదికలో తోసిపుచ్చింది. సంజీవ్‌ భట్‌ ఈ విషయమై సుప్రీం కోర్టులో ఒక అఫిడవిట్‌ దాఖలు చేశారు కూడా.
భట్‌ గురించి అమికస్‌ క్యూరీ తన నివేదికలో ప్రస్తావిస్తూ, ‘నా అభిప్రాయంలో, పై నేపథ్యం ఉన్నప్పటికీ (భట్‌ ఆరోపణలను సిట్‌ తిరస్కరించినప్పటికీ), విధి నిర్వహణలో ఉన్న పోలీస్‌ అధికారి ఎటువంటి ఆధారమూ లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి మోడిపైన అటువంటి తీవ్రమైన ఆరోపణ చేసేందుకు అవకాశం ఉన్నట్లు కనిపించడం లేదు’ అని పేర్కొన్నారు. ఫిర్యాదీ జకియా జాఫ్రికి సోమవారం మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో అమికస్‌ క్యూరీ నివేదికతో పాటు సిట్‌ నివేదికను అందజేశారు. 2002 గోధ్రా అనంతర అల్లర్లలో గుల్బర్గ్‌ సొసైటీలో హతులైన 69 మందిలో జాఫ్రి భర్త, కాంగ్రెస్‌ మాజీ ఎంపి ఎహ్‌సాన్‌ జాఫ్రి కూడా ఉన్నారు.
అమికస్‌ క్యూరీ నివేదికకు బిజెపి తిరస్కృతి
ఇది ఇలా ఉండగా, అమికస్‌ క్యూరీ నివేదికను భారతీయ జనతా పార్టీ (బిజెపి) తీవ్రంగా ఆక్షేపించగా, మోడి పాత్రపై సందేహాలన్నిటినీ ఈ నివేదిక తొలగించిందని కాంగ్రెస్‌ వ్యాఖ్యానించింది. పార్టీ భావి ప్రధాని అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న నరేంద్ర మోడికి బిజెపి అండగా నిలిచింది. తగిన దర్యాప్తు ప్రక్రియ, సాక్ష్యాధారాలు బట్టి చట్టం నడుచుకుంటుందే కాని అమికస్‌ క్యూరీ (కోర్టుకు సాయపడే వ్యక్తి) లేదా ఏ న్యాయవాది అభిప్రాయాన్ని బట్టి కాదని బి జెపి స్పష్టం చేసింది. ‘ఒక న్యాయవాది లేదా అమికస్‌ క్యూరీ అభిప్రాయానికి క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సిఆర్‌పిసి)లో గాని, సాక్ష్యాధారాల చట్టం (ఇఎ)లో గాని అవకాశమే లేదు. నేర పరిశోధన పూర్తిగా పోలీసుల బాధ్యతే కాని న్యాయవాది బాధ్యత కాదు.
నేర పరిశోధనకు పోలీసులు శిక్షణ పొందుతారు కాని న్యాయవాది కాదు’ అని బిజెపి సీనియర్‌ నాయకుడు అరుణ్‌ జైట్లీ అన్నారు. అమికస్‌ క్యూరీ వాదన బిజెపికి నచ్చలేదు. ‘నేర విచారణ తగిన చట్ట ప్రక్రియ ప్రకారమే జరుగుతుంది కాని అభిప్రాయాల ఆధారంగా కాదు. అమికస్‌ క్యూరీ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్న తరువాత దర్యాప్తు సంస్థ, అంటే సిట్‌ ఒక అభిప్రాయానికి వస్తే ఆ అభిప్రాయమే విచారణ కోర్టు తీసుకునే చర్యను బట్టి అంతిమం అవుతుంది’ అని జైట్లీ పేర్కొన్నారు.
మోడి దోషే: కాంగ్రెస్‌
అయితే, మోడి దోషేనని కాంగ్రెస్‌ వాదించింది. ‘గోధ్రా అనంతర అల్లర్లకు గుజరాత్‌ ముఖ్యమంత్రికి లేదా బిజెపికి బాధ్యత ఉందని విజ్ఞుడైన ఏ వ్యక్తీ సందేహించజాలడు’ అని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి మనీష్‌ తివారి అన్నారు. ‘బిజెపికి ఏమాత్రం నైతికత ఉన్నా అది పదేళ్ల క్రితమే చర్యలు తీసుకుని ఉండేది. రాష్ర్ట ప్రభుత్వానికి బాధ్యత లేకపోయినట్లయితే అప్పటి ఎన్‌డిఎ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి రాజధర్మం గురించి మోడికి గుర్తు చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది’ అని మనీష్‌ తివారి అన్నారు. ‘ఇప్పుడు నిర్ణయం ప్రజల చేతుల్లో ఉంది. సమయం వచ్చినప్పుడు గుజరాత్‌ ప్రజలు నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం’ అని తివారి అన్నారు.

ఇసుక తవ్వకాలపై నిషేధం కొనసాగింపు


మాఫియా ఆగడాలపై ‘సుప్రీం’ ఆందోళన
ఇసుక తవ్వకాలపై నిషేధాన్ని కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశంలో ఇసుక మాఫియా ఆగడాలపై సుప్రీం ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఇసుక తవ్వకాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను దాఖలు చేసింది. పర్యావరణానికి ముప్పు వాటిల్లేవిధంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలపై నిషేధం కొనసాగవలసిందేనని సుప్రీం స్పష్టం చేసింది. నిషేధం ఉండడం వల్ల రాష్ట్రంలో నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోయాయని, దీంతో దినసరి కూలీలు, కాంట్రాక్టర్లు, ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం సుప్రీం దృష్టికి తెచ్చింది. ఇసుక తవ్వకాల నిషేధంపై కేంద్ర పర్యావరణ శాఖకు సుప్రీం నోటీసులను జారీ చేసింది. ఇసుక తవ్వకాలపై మూడు వారాల్లో నిర్ణయం తెలపాలని ఆదేశించింది. దేశంలో ఇసుక మాఫియా వ్యవహారం అత్యంత దారుణంగా ఉందని, ఐపిఎస్‌ అధికారులను హతమార్చే స్థాయికి మాఫియా ఎదిగిందని న్యాయస్థానం ఆందోళన వ్యక్తంచేసింది. అక్రమ తవ్వకాలపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సరైన వివరణ ఇవ్వలేదని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. నిషేధంపై స్టేను ఎత్తివేసే ప్రశ్నే లేదని తేల్చిచెప్పింది. గతంలో హైకోర్టు ఉత్తర్వులపై సవాల్‌ చేసిన రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కేంద్ర అటవీ, పర్యావరణ శాఖను సంప్రదించాలని సూచించింది. ఐదు హెక్టార్లకంటే ఎక్కువ స్థలంలో తవ్వకాలు జరుపుతున్నవారు అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర పర్యావరణ శాఖను సంప్రదించాలని తెలిపింది. ఈ అనుమతులు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రత్యేకాధికారిని నియమించాలని సుప్రీం ఆదేశించింది. ఇసుక అక్రమ తవ్వకాలను బడా మాఫియాగా సుప్రీంకోర్టు అభివర్ణించింది.

అగ్రస్థానానికి నైట్‌రైడర్స్


ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఐదో ఎడిషన్ ట్వంటీ-20 టోర్నమెంట్‌లో అప్రతిహత విజయాలతో దూసుకెళ్తున్న ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్ షాక్ ఇచ్చింది. న్యూఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో సోమవారం దాదాపు ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు 6 వికెట్ల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టులో కెప్టెన్ వీరేంద్ర సెవాగ్ దూకుడుగా ఆడి 9 బంతుల్లోనే 23 పరుగులు సాధించినప్పటికీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (21), మహేల జయవర్ధనే (30) కూడా స్థాయికి తగ్గట్టు రాణించలేకపోయారు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 153 పరుగుల స్కోరుకే పరిమితమైంది. అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్లు చక్కగా రాణించారు. దీంతో 18.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 154 పరుగులు సాధించి లక్ష్యాన్ని అధిగమించిన నైట్‌రైడర్స్ ఈ సీజన్ ఆరంభంలో ‘డెవిల్స్’ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నారు. ఆల్‌రౌండ్ ప్రతిభతో అలరించి కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయంలో కీలకపాత్ర పోషించిన జాక్ కాలిస్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు. ఐపిఎల్-5లో ఇప్పటివరకూ 12 మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఇది ఎనిమిదో విజయం కాగా, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు 11 మ్యాచ్‌లలో ఇది మూడో ఓటమి.
అంతకుముందు టాస్ గెలిచి ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కెప్టెన్ వీరేంద్ర సెవాగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌తో కలిసి కొద్దిసేపు తనదైన శైలిలో మెరుపులు మెరిపించాడు. కేవలం 9 బంతుల్లో ఒక సిక్సర్, మరో మూడు ఫోర్ల సహాయంతో 23 పరుగులు సాధించిన సెవాగ్ తొలి వికెట్‌కు 40 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. అనంతరం జాక్ కాలిస్ బౌలింగ్‌లో సెవాగ్ లెగ్ బిఫోర్ వికెట్‌గా నిష్క్రమించగా, కొద్దిసేపటికి వార్నర్ (21) కూడా కాలిస్ బౌలింగ్‌లోనే వికెట్ల వెనుక బ్రెండన్ మెక్‌కలమ్ చేతికి చిక్కాడు. ఈ తరుణంలో స్థిమితంగా ఆడుతూ మూడో వికెట్‌కు 46 పరుగులు జోడించిన మహేల జయవర్ధనే (30) 13వ ఓవర్‌లో రనౌట్‌గా పెవిలియన్‌కు చేరగా, రాస్ టేలర్ (16) ప్రదీప్ సంగ్వాన్ బౌలింగ్‌లో రజత్ భాటియాకు దొరికిపోయాడు. దీంతో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు 100 పరుగుల స్కోరు వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత యోగేష్ నగర్ (10), నమన్ ఓజా (2) స్వల్పస్కోర్లకే నిష్క్రమించినప్పటికీ ఇర్ఫాన్ పఠాన్ కొద్దిసేపు ఒంటరి పోరాటం చేసి 22 బంతుల్లో ఒక సిక్సర్, నాలుగు ఫోర్ల సహాయంతో 36 పరుగులు సాధించాడు. సునీల్ నారాయణ్ బౌలింగ్‌లో ఇర్ఫాన్ పఠాన్ వికెట్ల వెనుక మెక్‌కలమ్ చేతికి చిక్కిన తర్వాత వరుణ్ ఆరోన్ ఒక పరుగు సాధించి చివరి బంతికి రనౌటవడంతో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు సాధించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలర్లలో జాక్ కాలిస్, సునీల్ నారాయణ్ రెండేసి వికెట్లు కైవసం చేసుకోగా, బ్రెట్ లీ, ప్రదీప్ సంగ్వాన్ ఒక్కో వికెట్ చేజిక్కించుకున్నారు.
అనంతరం 154 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు ఓపెనర్లు బ్రెండన్ మెక్‌కలమ్, గౌతమ్ గంభీర్ గట్టి పునాది వేశారు. స్థిమితంగా ఆడుతూ ‘డెవిల్స్’ బౌలర్లను ప్రతిఘటించి క్రీజ్‌లో నిలదొక్కుకున్న వీరు చూడముచ్చటైన షాట్లతో అలరిస్తూ తొలి వికెట్‌కు 68 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అనంతరం కెప్టెన్ గంభీర్ (36) 7వ ఓవర్ చివర్లో వరుణ్ ఆరోన్ వేసిన బంతికి క్లీన్‌బౌల్డ్‌గా నిష్క్రమించగా, అతని స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన జాక్ కాలిస్ కూడా మెక్‌కలమ్‌కు సహకరించాడు. దీనిని చక్కగా సద్వినియోగం చేసుకుని 40 బంతుల్లో అర్ధ సెంచరీ నమోదు చేసుకున్న మెక్‌కలమ్ రెండో వికెట్‌కు మరో 60 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అందించాడు. ఆ తర్వాత కాలిస్ (30), మెక్‌కలమ్ (56) 16వ ఓవర్‌లో ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో వెంటవెంటనే పెవిలియన్‌కు చేరడంతో నైట్‌రైడర్స్ జట్టు 128 పరుగుల స్కోరు వద్ద మరో రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం మనోజ్ తివారీ (8) స్వల్ప స్కోరుకే నిష్క్రమించినప్పటికీ యూసుఫ్ పఠాన్ (7), దేవవ్రత దాస్ (1) అజేయంగా నిలిచి మిగిలిన పని పూర్తి చేశారు. దీంతో 18.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 154 పరుగులు సాధించిన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు మరో 8 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఢిల్లీ డేర్‌డెవిల్స్ బౌలర్లలో ఉమేష్ యాదవ్ రెండు వికెట్లు సాధించగా, వరుణ్ ఆరోన్, మోర్న్ మోర్కెల్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. (చిత్రం) ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ జాక్ కాలిస్
సంక్షిప్తంగా స్కోర్లు
ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 153/9 (డేవిడ్ వార్నర్ 21, వీరేంద్ర సెవాగ్ 23, మహేల జయవర్ధనే 30, రాస్ టేలర్ 16, ఇర్ఫాన్ పఠాన్ 36, యోగేష్ నగర్ 10). వికెట్ల పతనం: 1-40, 2-49, 3-95, 4-100, 5-125, 6-146, 7-152, 8-152, 9-153. బౌలింగ్: జాక్ కాలిస్ 2/20, సునీల్ నారాయణ్ 2/23, బ్రెట్ లీ 1/39, ప్రదీప్ సంగ్వాన్ 1/42.
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: 18.4 ఓవర్లలో 154/4 (బ్రెండన్ మెక్‌కలమ్ 56, గౌతమ్ గంభీర్ 36, జాక్ కాలిస్ 30, యూసుఫ్ పఠాన్ 7-నాటౌట్). వికెట్ల పతనం: 1-68, 2-128, 3-128, 4-147. బౌలింగ్: ఉమేష్ యాదవ్ 2/30, వరుణ్ ఆరోన్ 1/20, మోర్న్ మోర్కెల్ 1/35.
===============
పాయింట్ల పట్టిక
జట్టు మ్యా గె ఓ ఫ.తే పా నె.ర
కోల్‌కతా 12 8 3 1 17 +0.600
ఢిల్లీ 11 8 3 0 16 +0.880
ముంబయి 11 7 4 0 14 -0.143
చెన్నై 12 5 6 1 11 +0.013
బెంగళూరు 11 5 5 1 11 -0.333
రాజస్థాన్ 11 5 6 0 10 +0.144
పంజాబ్ 11 5 6 0 10 -0.453
పుణే 12 4 8 0 8 -0.134
డక్కన్ చార్జర్స్ 11 2 8 1 5 -0.557
మ్యా: మ్యాచ్‌లు, గె: గెలిచినవి, ఓ: ఓడినవి,
ఫ.తే: ఫలితం తేలనివి, పా: పాయింట్లు, నె.ర: నెట్ రన్‌రేట్.
==============

ఫలించిన బుజ్జగింపు


తెలంగాణ నినాదాలతో పార్లమెంటును హోరెత్తిస్తున్న తెలంగాణ ఎంపీలను బుజ్జగించేందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం రంగంలోకి దిగింది. బుధవారం మధ్యాహ్నం కేంద్రమంత్రి వాయలార్‌ రవి టీ కాంగ్రెస్‌ ఎంపీలతో భేటీ అయ్యారు. వారికి నచ్చ చెప్పేందుకు ప్రయ త్నించారు. రాత్రి వారంతా రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్‌తో సుదీర్ఘ భేటీ జరిపారు. మొత్తానికి సభలో కీలకమైన బిల్లులు ప్రస్తావనకు వచ్చినప్పు డు లేదా ఆపద్ధర్మ పరిస్థితులు ఉత్పన్నమై నప్పుడు సభకు హాజరు కాగలమ్న హామీని టీ కాంగ్రెస్‌ ఎంపీల నుంచి రాబట్టగలిగారు. ఆదేవిధంగా ఉదయం టీ ఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో వాయలార్‌ రవి పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో భేటీ అయ్యారు.
అప్పటికే కేసీఆర్‌ సభను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు అంశంపై తేల్చేయాల్సిందేనని, అంత వరకూ తాము పార్లమెంటుకు హాజరయ్యే ప్రసక్తే లేదని టీ కాంగ్రెస్‌ ఎంపీలను తేల్చి చెప్పడంతో వారిని బుజ్జగించే కార్యక్రమాన్ని ఆ పార్టీ అగ్రనేతలు బుధవారం చేపట్టారు. గత మూడు రోజులుగా పార్లమెంటు సమావేశాలకు టీ కాంగ్రెస్‌ ఎంపీలు గైర్హాజరవుతున్న సంగతి తెలిసిందే. బుధవారం సాయంత్రం కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ గులాంనబీ ఆజాద్‌ నివాసంలో టీ కాంగ్రెస్‌ ఎంపీలతో సీనియర్‌ నేతలు వాయిలార్‌ రవి, పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు. రాష్ర్టంలో ఒక పక్క ఉప ఎన్నికలు జరుగుతుండడం, మరోపక్క రాష్ర్టపతి ఎన్నికల నిర్వహణ గడువూ సమీపిస్తున్న తరుణంలో టీ కాంగ్రెస్‌ ఎంపీలు కాస్త పట్టువిడుపులతో సంయమనం పాటించాలని అగ్రనేతలు సూచించినట్లు సమాచారం.
సుమారు రెండున్నర గంటల పాలు సమావేశమయ్యాక కూడా టీ కాంగ్రెస్‌ ఎంపీలు పట్టు వీడక పోవడంతో వాయలార్‌ రవి అక్కడి నుండి వెళ్లి పోయారు.
ఇదే సమయంలో అక్కడికి చేరుకున్న మీడియా ప్రతినిధులు రవితో మాట్లాడేందుకు ప్రయత్నించగా… టీ కాంగ్రెస్‌ఎంపీలను అడగండి అంటూ ఒకింత అసహనంగానే మాట్లాడారు. కాగా సమావేశం అనంతరం టీ కాంగ్రెస్‌ ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, మందా జగన్నాథం, తదితరులు మీడియాతో మాట్లాడారు. లోక్‌సభకు హాజరు కావాలని ఆజాద్‌ తమను కోరారని అయితే తెలంగాణ అంశాన్ని ఇంకా నాన్చకుండా తేల్చాలని తాము డిమాండ్‌ చేశామన్నారు. ‘‘ అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో వస్తేనే నిర్ణయం’’అంటూ హోం మంత్రి చిదంబరం పాతపాటే పాడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉప ఎన్నికలు, రాష్టప్రతి ఎన్నికల కారణంగానే తెలంగాణ ప్రకటించడం లేదని తమకు అర్థం అవుతోందని, అయినా ప్రజా స్వామ్య పద్దతుల్లో పార్టీ అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకువస్తామని గుత్తా సుఖేందర్‌రెడ్డి వెల్లడించారు. కేసిఆర్‌ లాంటి వారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని మరో ఎంపీ మందా జగన్నాథం అన్నారు. ఎవరెన్ని రకాలుగా రెచ్చగొట్టినా వ్యతిరేక శక్తులను అడ్డుకుంటూ ముందుకు వెళ్తామన్నారు. కేసిఆర్‌ తమను దూషించడం సరి కాదని ఆయన హితవు చెప్పారు. తెలంగాణ అంశాల్లో ఇతర పార్టీలతో సంప్రదించి పోరాడుతామన్నారు. ఉప ఎన్నికల కోడ్‌ రాష్ట్రంలో అమలులో ఉన్న దృష్ట్యా ఎన్నికలు ముగిశాక కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. సభలో కీలకమైన బిల్లులపైనో, లేదా ఆపద్ధర్మ పరిస్థితులు మినహా ఇతర రోజుల్లో తాము సభకు హాజరుకాబోమన్నారు.

వీరూ వీరవిహారం – ఢిల్లీ హ్యాట్రిక్‌


నువ్వానేనా అన్నట్టు సాగిన ఉత్కంఠపోరులో ఢిల్లి డేర్‌డెవిల్స్‌ ఒక పరుగు తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌పై సంచలన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లిd డేర్‌డెవిల్స్‌ 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ 20 ఓవర్లలో 3వికెట్ల నష్టానికి 151 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. చివరి రెండు ఓవర్లలో విజయానికి 15 పరుగులే అవసరమైనా రాజస్థాన్‌ దాన్ని అందుకోలేక పోయింది. 19వ ఓవర్‌లో మోర్నీ మోర్కెల్‌ కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చి మ్యాచ్‌ను అనూహ్య మలుపు తిప్పాడు. చివరి ఓవర్‌లో విజయం 12 పరుగులు అవసరం కాగా, 10 మాత్రమే వచ్చాయి. దీంతో ఒక పరుగు తేడాతో ఓటమి తప్పలేదు. ఓపెనర్‌ అజ్యంక రహానె 63 బంతుల్లోనే 9ఫోర్లు, ఒక సిక్స్‌తో 84 పరుగులు చేసినా రాజస్థాన్‌ను గెలిపించలేక పోయాడు. మరోవైపు కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ ఆడిన ద్రవిడ్‌ 38 బంతుల్లో 5ఫోర్లతో 40 పరుగులు చేశాడు. ఇదే క్రమంలో రహానెతో కలిసి తొలి వికెట్‌కు 99 పరుగులు జోడించాడు.
జోరు…
అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లిdకి ప్రారంబంలోనే షాక్‌ తగిలింది. ఓపెనర్‌ మహేల జయవర్ధనే 6, స్టార్‌ ఆటగాడు పీటర్సన్‌ ఐదు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌ చేరారు. అయితే రాస్‌ టేలర్‌ అండతో సెహ్వాగ్‌ వీరవిహారం చేశాడు. ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగిన సెహ్వాగ్‌ పరుగుల వరద పారించాడు.
చెలరేగి ఆడి 39 బంతుల్లోనే 8ఫోర్లు, రెండు సిక్సర్లతో 63 పరుగులు చేసి హాగ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. టోర్నీలో సెహ్వాగ్‌కు ఇది వరుసగా నాలుగో హాఫ్‌ సెంచరీ కావడం విశేషం. ఐపిఎల్‌లో ఒక ఆటగాడు వరుసగా నాలుగు అర్ధ సెంచరీలు సాధించడం ఇదే తొలిసారి. మరోవైపు టేలర్‌ 25, యోగేష్‌ నాగర్‌ 27, ఇర్ఫాన్‌ పఠాన్‌ 11 (నాటౌట్‌) తమవంతు పాత్ర పోషించడంతో ఢిల్లిd స్కోరు 152కి చేరింది. ప్రత్యర్థి బౌలర్లలో పంకజ్‌, అమిత్‌ సింగ్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. బ్యాటింగ్‌లో రాణించిన ఢిల్లిd కెప్టెన్‌ సెహ్వాగ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.
ఢిల్లిd డేర్‌ డెవిల్స్‌ ఇన్నింగ్స్‌.. జయవర్ధనే (సి)హాగ్‌ (బి)పంకజ్‌ 6, సెహ్వాగ్‌ (సి)మెనారియా (బి)హాగ్‌ 63, పీటర్సన్‌ (సి)ద్రవిడ్‌ (బి)చావన్‌ 5, టేలర్‌ (బి)పంకజ్‌ 25, నాగర్‌ (సి)చావన్‌ (బి)అమిత్‌సింగ్‌ 27, ఓజా (సి)ద్రవిడ్‌ (బి)అమిత్‌సింగ్‌ 11, పఠాన్‌ (నాటౌట్‌)7, అగార్కర్‌ 0, ఎక్స్‌ట్రాలు.. 8, మొత్తం 20 ఓవర్లలో 152/6.
బౌలింగ్‌.. చావన్‌ 4-0-31-1, పంకజ్‌ 4-0-25-2, అమిత్‌సింగ్‌ 4-0-41-2, కూపర్‌ 4-0-19-0, హాగ్‌ 4-0-31-1.
రాజస్థాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌.. ద్రవిడ్‌ (సి)అగార్కర్‌ (బి)పఠాన్‌ 40, రెహానె (నాటౌట్‌) 84, హడ్జ్‌ (ఎల్బీ)(బి)మోర్కెల్‌ 22, షా (రనౌట్‌) ఓజా 1, ఎక్స్‌ట్రాలు.. 4, మొత్తం 151/3.
బౌలింగ్‌.. పఠాన్‌ 4-0-27-1, నదీమ్‌ 4-0-30-0, మోర్కెల్‌ 4-0-26-1, ఉమేష్‌ యాదవ్‌ 4-0-35-0, అగార్కర్‌ 4-0-33-0.2

బంగారు దోషే


బిజెపి మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ అవినీతి నిరోధక చట్టం కింద అరెస్టయ్యారు. ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు అవినీతి ఆరోపణలపై అరెస్టు కావటం ఇదే మొదటిసారి. ఈ సంఘటన బిజెపి వర్గాలను ఆందోళనకు గురిచేసింది. బంగారు లక్ష్మణ్ బిజెపి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక విదేశీ సంస్థకు రక్షణశాఖ నుంచి ఆర్డర్లు ఇప్పిస్తానని లక్ష రూపాయలు లంచం తీసుకున్నట్టు అభియోగం. తెహాల్కా స్టింగ్ ఆపరేషన్‌లో చిక్కుకున్న ఆయన తరువాత పదవిని కోల్పోయారు. 11ఏళ్ళపాటు జరిగిన వాదోపవాదాల అనంతరరం లక్ష్మణ్‌కు వ్యతిరేకంగా సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు ఆయనను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఆయనకు ఎంతకాలం శిక్ష విధించాలన్న విషయమై శనివారం తీర్పునిస్తారు. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం ఆయనకు ఐదునుంచి ఏడేళ్లపాటు కారాగారం విధించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రానికి చెందిన బంగారు లక్ష్మణ్ 20001లో అత్యంత ప్రతిష్టాకరమైన భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా నియమితులయ్యారు. ఆయన అధ్యక్షునిగా ఉన్నపుడు వాజపేయి ప్రధానిగా ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉంది. బంగారు అధ్యక్షుడు కావటం జీర్ణించుకోని ఒకవర్గం ఆయన కదలికలపై నిఘా పెట్టి, లావాదేవీలపై కనే్నసింది. పదవిని చేపట్టినప్పటి నుంచి ఆయన అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. ఆయుధాల సేకరణకు సంబంధించి రక్షణ శాఖలో జరుగుతున్న అవినీతి అవకతవకలపై తెహల్కా నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో లక్ష రూపాయల లంచం తీసుకుంటూ బంగారు లక్ష్మణ్ కెమెరాకు చిక్కారు. ఒక విదేశీ సంస్థకు (బోగస్) చెందిన ప్రతినిధిగా తనకుతాను పరిచయం చేసుకుని ఒక జర్నలిస్టు పన్నిన కుట్రకు బంగారు బలైపోయారు. ఆ ప్రతినిధి ఇచ్చిన లక్ష రూపాయలు తీసుకుని ప్రభుత్వంతో మాట్లాడి కాంట్రాక్టు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. పార్టీ కార్యాలయంలో తన చాంబర్‌లోనే బంగారు ఈ లావాదేవీని ఖరారు చేసి, సొమ్మును పార్టీ కోశాధికారికి ఇవ్వాల్సిందిగా చెప్పకుండా తనదగ్గరే ఉంచుకున్నారు. తెహల్కా ప్రతినిధులు బంగారు లక్ష్మణ్‌తోపాటు అప్పటి రక్షణమంత్రి జార్జి ఫెర్నాండేజ్‌కు అత్యంత సన్నిహితురాలైన జయాజైట్లీతోనూ కొనుగోళ్లపై సంప్రదించారు. ఆమె జార్జితో సంప్రదిస్తానని హామీ మాత్రమే ఇచ్చారు. తెహల్కా తన ఆపరేషన్‌ను సీడీ రూపంలో వెలుగులోకి తీసుకురావటంతో బిజెపి ఖంగుతుంది. బంగారు లక్ష్మణ్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. బంగారుపై సిబిఐ అవినీతి నిరోధక చట్టం, విధి నిర్వహణలో ఉన్న అధికారులపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారన్న ఆరోపణలపై కేసు నమోదు చేసింది. పదకొండేళ్ల తరువాత ఇప్పుడు తీర్పు ఇచ్చింది. కేసులో బంగారు లక్ష్మణ్ వ్యక్తిగత కార్యదర్శిగా వ్యవహరించిన సత్యమూర్తి అప్రూవర్‌గా మారిపోవటంతో శిక్షనుంచి బయటపడ్డారు.

సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ప్రకాశ్‌ కరత్‌


89 మందితో కేంద్ర కమిటీ
15 మందితో పొలిట్‌బ్యూరో
పిబిలోకి కొత్తగా బేబి, ఎకెపి, సూర్యకాంత్‌ మిశ్రా
రాష్ట్రం నుండి సిసిలోకి ఎస్‌ వీరయ్య
బినరు కోనార్‌ నేతృత్వంలో కంట్రోల్‌ కమిషన్‌
సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ప్రకాశ్‌ కరత్‌ తిరిగి ఎన్నికయ్యారు. కోజికోడ్‌లో జరుగుతోన్న పార్టీ 20వ అఖిల భారత మహాసభ సోమవారం 89(రెండు ఖాళీలు) మందితో నూతన కేంద్ర కమిటీని ఎన్నుకుంది. అనంతరం కేంద్ర కమిటీ కరత్‌ను నూతన కార్యదర్శిగా ఎన్నుకుంది. 15 మంది సభ్యులతో పొలిట్‌బ్యూరోను కూడా కేంద్ర కమిటీ ఎన్నుకుంది. 2005లో ఢిల్లీలో జరిగిన పార్టీ 18వ మహాసభలో తొలిసారి కరత్‌ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2008లో కోయంబత్తూరులో జరిగిన 19వ మహాసభలో రెండోసారి ఆ బాధ్యతలు చేపట్టారు. కోజికోడ్‌ మహాసభలో వరుసగా మూడోసారి ఆయన ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన 15 మంది పొలిట్‌బ్యూరో సభ్యుల్లో ముగ్గురు కొత్తవారు. బెంగాల్‌ నుండి సూర్యకాంత్‌ మిశ్రా, కేరళ నుండి ఎంఎ బేబి, కార్మిక రంగం నుండి ఎకె పద్మనాభన్‌ కొత్తగా పొలిట్‌బ్యూరోలోకి అడుగు పెట్టారు. కొత్తగా ఎన్నికైన 87 మంది సభ్యుల కేంద్ర కమిటీలోనూ 13 మంది కొత్త వారే. వీరిలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య కూడా ఉన్నారు. పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘువులుతో పాటు తమ్మి నేని వీరభద్రం, పాటూరు రామయ్య, ఎంఎ గఫూర్‌, ఎస్‌ పుణ్యవతి, పెనుమల్లి మధు రాష్ట్రం నుండి కేంద్ర కమిటీకి ఎన్నికయ్యారు. కొత్తగా 89 మంది సభ్యుల కేంద్ర కమిటీకి మహాసభ ఆమోదం తెలిపింది. వీరిలో 87 మంది సభ్యులను మహాసభ ఎన్నుకుంది.
మరో రెండు స్థానాలను ప్రస్తుతానికి ఖాళీగా ఉంచారు. విజరు రావత్‌, ఎంకె నందిలను కేంద్రకమిటీ ఆహ్వానితులుగా…ఆర్‌ ఉమానాథ్‌, సమర్‌ ముఖర్జీ, మహ్మద్‌ అమీన్‌తో రాష్ట్రానికి చెందిన మల్లు స్వరాజ్యంను కేంద్ర కమిటీ ప్రత్యేక ఆహ్వానితులుగా మహాసభ ఎన్నుకుంది. పార్టీ అధికారిక వార పత్రిక పీపుల్స్‌ డెమోక్రసీ సంపాదకులుగా పొలిట్‌బ్యూరో సభ్యులు సీతారాం ఏచూరిని కేంద్ర కమిటీ ఎన్నుకుంది. కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు బినరు కోనార్‌, రాష్ట్రానికి చెందిన జి.రాములుతో పాటు పి.రాజేంద్రన్‌, మినోతి ఘోష్‌, ఆర్‌ గోవిందరాజ్‌ సభ్యులుగా కంట్రోల్‌ కమిషన్‌ను మహాసభ ఎన్నుకుంది. అనంతరం వారు సమావేశమై బినరు కోనార్‌ను ఛైర్మన్‌గా ఎన్నుకున్నారు.

భగ్గుమన్న పాతబస్తీ


- సైదాబాద్, మాదన్నపేటలో కర్ఫ్యూ..
- హైదరాబాద్ నగరమంతా 144
- మధ్యాహ్నానికి పరిస్థితి అదుపులోకి
- రెండు వర్గాల మధ్య గొడవలు
- జోరుగా రాళ్ల వర్షం.. కత్తిపోట్లు
- వాహనాలు, ఆస్తుల ధ్వంసం
- భారీగా మోహరించిన పోలీసులు
- లాఠీచార్జి, బాష్పవాయువు ప్రయోగం
- సమస్యాత్మక ప్రాంతాల్లో ముమ్మర గస్తీ
- కర్ఫ్యూ ప్రాంతాల్లో డీజీపీ పర్యటన
- సీఎం, హోంమంత్రి, డీజీపీ సమీక్ష
- వదంతులు నమ్మవద్దన్న హోంమంత్రి
-పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు మినహాయింపు


దుష్టశక్తులు రగిల్చిన చిచ్చుకు పాతబస్తీ భగ్గుమన్నది. రెండు వర్గాల మధ్య గొడవలకు దారి తీసింది. ఇరువర్గాల వారూ రాళ్లు రువ్వుకోవడంతో పాటు కత్తులతో తెగబడటంతో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ గొడవల నేపథ్యంలో సైదాబాద్, మాదన్నపేటలో కర్ఫ్యూ విధించారు. నగరం మొత్తం 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు. సున్నిత ప్రాంతాల్లో పోలీసు గస్తీని ముమ్మరం చేశారు. లాఠీచార్జి జరిపి, బాష్పవాయువు ప్రయోగించి అల్లరిమూకలను చెదరగొట్టారు. దీంతో మధ్యాహ్నానికే పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ ఘటనలపై హోంమంత్రి, డీజీపీతో సీఎం సమీక్ష జరిపారు. నగర పోలీసు కమిషనర్ ఏకే ఖాన్, ఇన్‌చార్జి సీపీ అనురాగ్ శర్మ ఉదయం ఎనిమిది గంటల నుంచి పరిస్థితి అదుపులోకి వచ్చేంత వరకు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత డీజీపీ కూడామాదన్నపేట, సైదాబాద్ సందర్శించారు. అధికారులతో మాట్లాడి, తీసుకుంటున్న చర్యలు తెలుసుకొని, కొన్ని జాగ్రత్తలు సూచించారు. పరీక్షలకు వెళ్లే విద్యార్థులను కర్ఫ్యూ నుంచి మినహాయిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.హనుమాన్ జయంతి రోజు ఏమైనా అవాంఛనీయ ఘటనలు జరుగుతాయోమోనన్న ఆందోళనతో నగర ప్రజలు గడిపారు. ఆ ఉత్సవం ప్రశాంతంగా ముగియడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆ మరుసటిరోజే ఈ ఘటన చోటుచేసుకోవడం వెనుక మత ఘర్షణలు సృష్టించే దుష్టశక్తుల హస్తం ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు. మాదన్నపేట కుర్మగూడ డివిజన్ పరిధిలో పురాతన చరిత్ర కలిగిన ఒక ప్రార్థనాస్థలం ఉంది. ఉదయం దాని గోడలకు రంగు పులిమి ఉండటం, లోపల అభ్యంతరకర అంశాలు ఉండటంతో తలుపులు తెరిచినవారు వెంటనే స్థానిక పెద్దల దృష్టికి తీసుకు వచ్చారు. అందరూ కలిసి మాదన్నపేట పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. గతంలో గొడవలకు పాల్పడిన ముగ్గురిపై అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రార్థనా స్థలం వద్దకు వచ్చారు. అయితే కమిషనర్ వచ్చేంత వరకూ తలుపులు తీయనిచ్చేది లేదని అక్కడివారు పట్టుబట్టారు. అప్పటికే ఈ విషయం దావానలంలా పాకింది. పరిస్థితి చేయిదాటే ప్రమాదం ఉండటంతో ఏసీపీ, ఎఫ్‌ఎస్‌ఎల్ అధికారులు ప్రార్థనాస్థలం వద్దకు వచ్చి నిర్వాహకులకు నచ్చజెప్పారు. లోపలికి వెళ్లి అక్కడ ఉన్నవాటిని స్వాధీనం చేసుకున్నారు. ఎఫ్‌ఎస్‌ఎల్ నిపుణులు అక్కడ వేలి ముద్రలు కూడా తీసుకున్నారు. విషయం తెలియడంతో పెద్ద సంఖ్యలో జనం అక్కడికి వచ్చారు. నినాదాలు చేశారు. దీంతో మరోవర్గానికి చెందినవారు ఆగ్రహానికి గురయ్యారు. రెండు వర్గాల వారు రోడ్లపైకి చేరుకుని పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ సందర్భంగా చాలా మందికి రాళ్ల దెబ్బలు తగిలాయి. ఇదే గందరగోళం మద్య కొందరు కత్తిపోట్లకు గురయ్యారు. ఇరువర్గాల ఘర్షణలో 20కి పైగా బస్సులు, ఇతర వాహనాలు, ఆస్తులు కూడా ధ్వంసమయ్యాయి. గొడవల నేపథ్యంలో పాతబస్తీలో దుకాణాలు మూతపడ్డాయి. ఘటనను కవర్ చేయటానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై ఒక వర్గం వారు దాడులు చేశారు. దీంతో ఇద్దరు మీడియా/పవూతిక ప్రతినిధులు గాయపడ్డారు.
ఐదుగురికి కత్తి పోట్లు.. పరిస్థితి విషమం
ఈ దాడుల్లో ఇరు వర్గాలకు చెందిన ఐదుగురు వ్యక్తులు కత్తిపోట్లకు గురయ్యారు. వారిని పోలీసులు చికిత్స నిమిత్తం ఉస్మానియా అసుపవూతికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. డబీర్‌పురా నుంచి సైదాబాద్‌కు ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు యువకులను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచారు. కుర్మగూడ పెట్రోల్ పంపు వద్ద మరో ఇద్దరు యువకులు కత్తిపోట్లకు గురయ్యారు. సైదాబాద్ శంకేశ్వర బజార్‌కు చెందిన మరో వ్యక్తి తన ద్విచక్షికవాహనంపై చెంచల్‌గూడకు వెళ్తుండగా సైదాబాద్ ఏసీపీ కార్యాయం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై కత్తులతో దాడి చేయటంతో తీవ్రంగా గాయపడ్డాడు. మరో వ్యక్తి కూడా గాయపడ్డాడు.
ఈ సంఘటనతో ఇరు వర్గాల నాయకులు మాదన్నపేట, సైదాబాద్ ప్రాంతాలను సందర్శించారు. పరిస్థితిని తెలుసుకున్నారు. వారి వారి వర్గాల ప్రజలకు మద్దతు పలికారు. రెండు వర్గాల నాయకుల రాకతో అక్కడి పరిస్థితి మరింత వేడెక్కింది. ప్రార్థనాస్థలం నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు మాదన్నపేట ఇన్‌స్పెక్టర్ సూర్యవూపకాష్ తెలిపారు.
మాదన్నపేట ఘటనపై సీఎం సమీక్ష
హైదరాబాద్‌లోని మాదన్నపేటలో జరిగిన అల్లర్లకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్‌డ్డి డీజీపీ దినేష్‌డ్డి, ఇతర ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఆదివారం ఫోన్‌లో సమీక్షించారు. గొడవలకు బాధ్యులైన వారు ఎంతటివారైనా ఉపేక్షించవద్దని, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అన్ని చర్యలూ తీసుకోవాలని ఆదేశించారు.
హోంమంత్రి సమీక్ష
మాదన్నపేట ఘటనపై హోంమంత్రి సబితా ఇంద్రాడ్డి కూడా ఆరా తీశారు. అక్కడి పరిస్థితులపై నగర పోలీసు కమిషనర్‌తో మాట్లాడి తెలుసుకున్నారు. బాధ్యులను వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని, భద్రతను కట్టుదిట్టం చేయాలని కమిషనర్‌ను ఆదేశించారు. అల్లర్లలో గాయపడి, పలు ఆస్పవూతుల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ… అల్లర్లు అదుపులోనే ఉన్నాయన్నారు. అన్ని చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. వదంతులు నమ్మవద్దన్నారు. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు.
డీజీపీ సమీక్ష….
మాదన్నపేట, సైదాబాద్‌లో నెలకొన్ని పరిస్థితులపై డీజీపీ దినేష్‌డ్డి సమీక్ష నిర్వహించారు. సైదాబాద్, మాదన్నపేట, పాతబస్తీ సందర్శించారు. మతసామరస్యానికి హైదరాబాద్ ప్రతీక… అని అన్నారు. అలాంటి నగరానికి చెడ్డ పేరు వచ్చే విధంగా ప్రవర్తించరాదని పిలుపునిచ్చారు. ప్రజలు వదంతులను నమ్మవద్దన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పికెట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పటికే అదనపు బలగాలను రంగంలోకి దింపామని, అవసరమైతే మరిన్ని బలగాలను కూడా దింపుతామని తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్టు డీజీపీ తెలిపారు.
సీఎంను కలిసిన ఎంఐఎం ఎమ్మెల్యేలు
మాదన్నపేట ఘటనలో మతఛాందసుల హస్తం ఉందం టూ ఎంఐఎం శాసన సభ్యులు అక్బరుద్దీన్ ఒవైసీ, పాషాఖాద్రి ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డిని కలిసి విన్నవించారు. అల్లర్లకు బాధ్యులను గుర్తించి, చర్యలు తీసుకోవాలన్నారు. ఇది పరీక్షల సమయం కనుక కర్ఫ్యూ, 144 సెక్షన్‌తో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సున్నిత ప్రాంతాల్లో గస్తీ పెంచి, భద్రత కల్పించాలని కోరారు.

free website analytics