నిజామాబాద్

రాష్ట్రంలో భానుడు ఉగ్రరూపం దాల్చాడు. రాష్ట్రం నిప్పుల కొలిమిగా మారింది. ప్రచండబానుడిదాటికి ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడదెబ్బతో 10మంది మృతిచెందారు. ఉదయం ఏడు గంటలనుంచే వేసవి ప్రతాపం చూపుతోంది. ఇళ్లలో విద్యుత్ వాడకం కూడా భారీగా పెరుగుతోంది. పలు జిల్లాల్లో విద్యుత్ కోతలు కూడా మళ్లీ మొదలయ్యాయి. బుధవారం హైదరాబాద్‌లోనూ అనధికారికంగా 3 గంటల విద్యుత్ కోత విధించారు. రాష్టవ్య్రాప్తంగా బుధవారం ఉష్ణోగ్రతలు తీవ్రరూపం దాల్చాయి. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు. ఈ సమయంలో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటాయి.
తెలంగాణతోపాటు రాయలసీమ జిల్లాల్లోనూ 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో సాధారణం కంటే 3 డిగ్రీలు, కోస్తోంధ్ర, రాయలసీమలో 1 నుంచి 3 డిగ్రీలు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదువుతన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం రెంటచింతలలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వ్యవసా య రంగానికి ప్రాణధారమైన నైరుతి రుతుపవనాలు జూన్ 1 కల్లా కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ విభాగం ప్రకటించిన విషయం తెలిసిందే. రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకేవరకు ఇదే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంటుందని అధికారులు చెబుతున్నారు. ఈసారి సాధారణ తేదీ కన్నా కొంత ఆలస్యంగా దక్షిణ అండమాన్ సముద్రంలో రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు.

పోలవరం సమస్యపై చర్చలకు
ఒడిశా సీఎంను ఆహ్వానించా
ఛత్తీస్‌గఢ్ సీఎంనూ సంప్రతిస్తాం
మంత్రి డీఎల్‌కు పనేమీ లేదు
మీడియా.. ప్రభుత్వానికి సలహాదారుగా
వ్యవహరించాలి.. విశాఖలో సీఎం కిరణ్
- ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌దే గెలుపు.. అందుకు నరసన్నపేట నుంచే శ్రీకారం
- మాజీ సీఎం వైఎస్‌కు కాంగ్రెస్ ఎంతో ప్రాధాన్యం ఇచ్చింది
- ఆయన కుటుంబానికి అనేక పదవులు కట్టబెట్టింది
- కాంగ్రెస్ మోసం చేసిందని జగన్ చెప్పుకోవడం సిగ్గుచేటు
- శ్రీకాకుళం ఉప ప్రచారంలో సీఎం
- ఇప్పుడే ఫలితాలు చెప్పేందుకు మేం జ్యోస్యులం కాదు: పీసీసీ చీఫ్ బొత్స
విశాఖపట్నం/శ్రీకాకుళం, మే 6:పోలవరం, ప్రాణహిత-చే ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించేందుకు తాము కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్తూ.. విశాఖపట్నం విమానాక్షిశయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో సమస్యను పరిష్కరించుకునేందుకు పొరుగు రాష్ట్రాలతో సంప్రతింపులు జరుపుతామని సీఎం చెప్పారు. దీనిపై ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ముఖ్యమంవూతులతో చర్చించి ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు.
పోలవరంపై చర్చలకు రావాలంటూ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను ఢిల్లీలో ఎన్‌సీటీసీ సదస్సు సందర్భంగా ఆహ్వానించినట్లు చెప్పారు. మంత్రి డీఎల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యల గురించి విలేకరులు ప్రస్తావించగా ఆయనకేం పనిలేదు, మీకేం పనిలేదు అని వ్యంగ్యంగా స్పందించారు. అభివృద్ధి కార్యక్షికమాల విషయంలో మీడియా ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరించాలని హితవు పలికారు. అనంతరం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నరసన్నపేటలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు లోక్‌సభతోపాటు అన్ని అసెంబ్లీ స్థానాల్లో తామే గెలుస్తామని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం నుంచే శ్రీకారం చుట్టాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.
మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్‌డ్డికి కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రాధాన్యం ఇచ్చిందని చెప్పారు. రాజశేఖర్‌డ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయనను ఎవరు విమర్శించినా తాను, ధర్మాన ప్రసాదరావు, ఇతర మంత్రులు తిప్పికొట్టామని, ఆయనకు రక్షణ కవచంలా నిలిచామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబానికి అనేక పదవులు ఇచ్చిందని తెలిపారు. ఇప్పుడు రాజశేఖర్‌డ్డి కుమారుడు జగన్ కాంగ్రెస్ పార్టీ తమను మోసం చేసిందని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ బహిరంగసభలో రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కొండ్రు మురళీమోహన్, శ్రీకాకుళం ఎంపీ కృపారాణి తదితరులు పాల్గొన్నారు.
అన్ని పార్టీల్లో కోవర్టులుంటారు: బొత్స
నరసన్నపేట ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డికి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌తోసహా కోవర్టులు ఏ పార్టీలోనైనా ఉంటారని వ్యాఖ్యానించారు. ఏదేమైనా ఉప ఎన్నికల్లో విజయమే తమ ముందున్న లక్ష్యమని చెప్పారు. ఉప ఎన్నికల అభ్యర్థు ఎంపిక సరిగానే జరిగిందని, ఇందులో చర్చకు తావులేదని అన్నారు. నెల్లూరు లోక్‌సభ స్థానంతోపాటు 1 అసెంబ్లీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా తాము ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పుడే ఫలితాలు చెప్పేందుకు తామేమీ జ్యోతీష్యులం కాదని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ఎక్సైజ్ శాఖలో మద్యం ముడపులు అందుకున్న ఏ ఒక్కరినీ వదలకుండా అవినీతి నిరోదక శాఖ ఏరేసే కార్యక్రమాన్ని ఉధృతం చేసింది. ముడుపులు అందుకున్న మరికొందరు ఎక్సైజ్ అధికార్లను కోర్టు బోను ఎక్కించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే రాష్టవ్య్రాప్తంగా ఎక్సైజ్ కార్యాలయాలపై సోమవారం ఏకకాలంలో దాడులకు దిగింది. ఏసిబి సిట్ బృందాలు అనూహ్యంగా దాడులకు దిగాయి. ఎక్సైజ్ శాఖలో ఏళ్ల తరబడి ఒకే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న వారిపై గట్టి నిఘా పెట్టారు.
ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నవారి జాబితా తయారు చేసి ఉచ్చును మరింత బిగిస్తోంది. ఎసిబి అదనపు డైరక్టర్ శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలోని స్పెషల్ ఇనె్వస్టిగేషన్ బృందాలు ఈ కార్యక్రమంలో నిమగ్నమయ్యాయి. ఎక్సైజ్ శాఖలో మద్యం సిండికేట్ల నుంచి ముడుపులు అందుకున్న వారేకాకుండా, ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్న వారినీ తాజాగా ఎసిబి టార్గెట్ చేస్తోంది. విజయనగరం, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఎసిబి బృందాలు తనిఖీలు నిర్వహించాయి. కీలకమైన ఫైళ్లు, ఆఫీసు రికార్డులు, కంప్యూటర్ సామగ్రి, అధికారుల మొబైల్ నెంబర్లు స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయాల్లోని అధికారులను విచారించడంతోపాటు, వారి వద్దనున్న మొబైల్ నెంబర్లనుంచి గత కొన్ని రోజులుగా ఎవరెవరికి కాల్స్ వెళ్లిందీ విచారిస్తున్నారు. ఎసిబి దర్యాప్తుతో వ్యాపారాలు వదిలి అజ్ఞాతంలోకి వెళ్లిన సిండికేట్ల గురించీ సిట్ బృందాలు గాలిస్తున్నాయి. చిక్కడపల్లికి చెందిన మద్యం వ్యాపారి బాలరాజ్‌గౌడ్ అరెస్టు కాకుండా తప్పించుకుంటున్నాడు. ఇతను దేశం విడిచిపోకుండా ఎసిబి లుకౌట్ నోటీసు జారీ చేసింది. త్వరలోనే అరెస్టు చేస్తామని ఎసిబి వర్గాలు తెలిపాయి. ఇదిలావుంటే, విజయనగరం జిల్లాలోని ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఏసిబి బృందాలు తనిఖీలు నిర్వహించాయి. విజయనగరం జిల్లా కేంద్రం, పార్వతీపురం ఇఎస్ ఆఫీసుతోబాటు బొబ్బిలి సబ్ డివిజన్‌లో సైతం సోదాలు నిర్వహించారు. ఎసిబి డిఎస్పీ వెంకటేశ్వర రావు నేతృత్వంలో సిబ్బంది ఇఎస్ కార్యాలయానికి చేరుకుని 2010-12 మద్యం దుకాణాల టెండర్ రికార్డులు పరిశీలించారు.
పట్టు బిగిస్తున్న ఎసిబి
ఖమ్మం జిల్లాలో 2010 మద్యం టెండర్లలో 16 దుకాణాల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని నిర్థారించిన ఎసిబి, అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకునేందుకు ఎసిబి ఆధారాలు సేకరించే పనిలో పడింది. రెండురోజులుగ దాడులు కొనసాగిస్తున్న ఎసిబి, సోమవారం టెండర్లకు సంబంధించిన అన్ని ఫైళ్లనూ ఎసిబి డిఎస్పీ శంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో డిఆర్వో క్యాంప్ కార్యాలయం నుంచి స్వాధీనం చేసుకున్నారు. టెండర్ల సమయంలో జిల్లాలో పనిచేసిన జెసి అజీంతో పాటు పలువురు ఉన్నతాధికారుల ప్రమేయంపైనా విచారణ సాగుతోంది.
గుంటూరులోని ఎక్సైజ్ డిసి ఆఫీసులో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. సిండికేట్లు అందించిన వివరాలతో ఎక్సైజ్ అధికారుల పాత్రపై ఆరా తీస్తున్నారు. ఎసిబి జెడి రమేష్‌రెడ్డి ఆధ్వర్యంలో సోదాలు సాగాయి. 2010లో జరిగిన మద్యం టెండర్లలో అవకతవకలు జరిగాయని, సిండికేట్‌లకు షాపులు కేటాయించడంలో నిబంధనల ఉల్లంఘన వెల్లడైనట్టు సమాచారం. రికార్డులను స్వాధీనం చేసుకున్న ఎసిబి, చర్యలకు సిద్ధమవుతోంది. దాడుల సందర్భంలో డిసి కార్యాలయంలో ముఖ్య అధికార్లు అందుబాటులో లేకపోవడం గమనార్హం. అలాగే తెనాలి, నరసరావుపేట ఎక్సైజ్ కార్యాలయాల్లోనూ సోమవారం ఎసిబి బృందాలు దాడులు నిర్వహించి రికార్డులు తనిఖీలు చేశాయి. ఎసిబి డిఎస్పీ శివాజీ, విజయవాడ రేంజ్ ఎసిబి సిఐ టిఎస్‌కె రవి నేతృత్వంలో రికార్డులను పరిశీలించి, టెండర్ల విషయంలో అధికార్లు అక్రమాలకు పాల్పడ్డారా? అన్న అంశాలను పరిశీలించారు.
తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి, కాకినాడ, అమలాపురం ఇఎస్ కార్యాలయాలపై సోమవారం ఎసిబి బృందాలు దాడులు జరిపాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన సిట్ బృందాలు దాడుల్లో పాల్గొన్నాయి. 2010లో మద్యం దుకాణాల వేలం ప్రక్రియకు సంబంధించిన ఫైళ్లపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. దాడుల్లో ఎసిబి సిట్ డిఎస్పీలు విజయపాల్, లక్ష్మీపతి ఆధ్వర్యంలో ఇనస్పెక్టర్లు బి రామకృష్ణ, ఎస్ మురళీమోహన్ పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు, భీమవరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ అధికార్లు సోమవారం రికార్డులు పరిశీలించారు. ఏలూరులో హైదరాబాద్ ఎసిబి డిఎస్‌పి నరసింహారావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించగా, మధ్యాహ్నం నుంచి భీమవరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో విజయవాడ నుండి వచ్చిన బృందం ఆధ్వర్యంలో తనిఖీలు జరిపారు. దాడుల్లో భాగంగా కొన్ని ముఖ్యమైన ఫైళ్లను స్వాధీనం చేసుకుని, కార్యాలయాల్లోని కంప్యూటర్లలో నిక్షిప్తమైన సమాచారాన్ని సైతం ఎసిబి అధికార్లు సేకరించారు.
నెల్లూరు జిల్లాలోని నెల్లూరు, గూడూరు ఎక్సైజ్ కార్యాలయాల్లో ఎసిబి సోదాలు సాగాయి. మద్యం దుకాణాల లైసెన్సులు పరిశీలించి, 2010 నుంచి టెండర్లకు సంబంధించిన వివరాలు తీసుకున్నారు. కర్నూలు, కడప జిల్లాల్లో సైతం ఎక్సైజ్ కార్యాలయాలపై ఎసిబి దాడులు జరిపింది. 2010 వేలం పాటల రికార్డులు, టెండర్లలో పాల్గొన్న వారి వివరాలు, ఆస్తిపాస్తుల సమాచారం, మద్యం దుకాణాలను వేలంలో దక్కించుకున్న వారి వివరాలు సేకరించారు. అలాగే, మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ పట్టణాలలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల్లో ఎసిబి అధికారులు సోమవారం దాడులు నిర్వహించి సోదాలు చేశారు. మద్యం దుకాణాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.

తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్నప్పటికీ తీవ్రత తగ్గిందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ తెలిపారు. ప్రజల మనోభావాలను కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుందని అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలపై దృష్టి పెట్టిందని, సరైన సమయంలో సముచితమైన నిర్ణయం తీసుకొనగలదనే ఆశాభావంతో ఉన్నామని చెప్పారు. రాబోవు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఆసక్తికరమైన, ఆశ్చర్యం గొలిపే ఫలితాలు వెలువడగలవని చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం శానససభ సమావేశాలు వాయిదా పడిన తర్వాత డి.శ్రీనివాస్ ముఖ్యమంత్రి ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్బంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. గతంలో జరిగిన ఉప ఎన్నికల నాటి పరిస్ధితులు ప్రస్తుతం లేవని తెలిపారు. తాను పోటీ చేసిన రోజుల్లో తెలంగాణ సెంటిమెంటు అత్యంత తీవ్రంగా ఉందని వివరించారు. డిసెంబర్ 9వ తేదీ అనంతర పరిణామాలు ప్రస్తుతం అంతగా లేవని అన్నారు. అభ్యర్ధుల ఎంపిక విషయంలో ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు, అధిష్టానం అన్ని కోణాల నుండి ఆలోచించే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. గెలవాలనే ఆలోచనతోనే రాజకీయ పార్టీలు ఎన్నికల బరిలోకి దిగుతాయని వెల్లడించారు. కార్యకర్తల అభిప్రాయం, అభ్యర్ధి బలం కూడా బేరీజు వేసుకోవడం సర్వసాధారణం అని అన్నారు. తనకు సర్వేలు జరిపే అలవాటు లేదని, ఇరుగుపొరుగు అభిప్రాయాలతో ఒక ఆలోచనకు వస్తుంటానని చెప్పారు. పోటీ చేసిన ప్రతి వ్యక్తి, పార్టీ గెలవాలనే ఆసక్తితోనే పని చేస్తుంటారని వివరించారు. తన ఢిల్లీ పర్యటనలో పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలుసుకొని ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు చర్చించడం జరిగిందని చెప్పారు.

డీఎస్స-12 నోటిఫికేషన్ విడుదల
మే 2,3,4 తేదీల్లో రాత పరీక్షలు
అప్రెంటీస్ విధానం రద్దు
‘ఇంటర్’ నిబంధన తొలగింపు
‘ఓపెన్ డిగ్రీ’ వారికీ అర్హత
ఎస్ఏ పోస్టులకు సబ్జెక్టు నిబంధనల సడలింపు
80 మార్కులకే డీఎస్సీ
20 మార్కులకు టెట్ వెయిటేజి
మరో 7100 పోస్టులకు రెండు రోజుల్లో నోటిఫికేషన్
హైదరాబాద్, జనవరి 30 : లక్షలాది మంది ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త. కొద్ది రో జులుగా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న ‘డీఎస్సీ -2012 నోటిఫికేషన్’ సో మవారం విడుదలైంది. మొత్తం 21,343 ఉపాధ్యాయ ఉద్యోగాలను ఇందులో నోటిఫై చేశారు. ఉపాధ్యాయ అభ్యర్థులు దశాబ్దకాలంగా చేస్తోన్న ‘అప్రెంటిస్’ రద్దు డిమాండ్ కూడా నెరవేరుతోంది. వివాదాస్పదంగా మారిన ‘ఇంటర్‌లో సంబంధిత సబ్జెక్టులు తప్పనిసరి’ అనే నిబంధనను తొలగించారు.
నోటిఫై చేసిన మొత్తం పోస్టుల్లో.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 5,703, ఎస్జీటీ పోస్టులు 11, 602 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్లు 2000, పీఈటీలు 365, మునిసిపల్ పాఠశాలల్లో 1,673 పోస్టులు ఉన్నాయి. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 17వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. సచివాలయంలో సోమవారం సాయంత్రం 3 గంటలకు మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కె.పార్థసారథి ఈ డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. డీఎస్సీకి విద్యార్హతల నిబంధనల్లో కొన్నింటిని సడలించారు.
స్కూల్ అసిస్టెంట్స్ (మేథ్స్, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్) పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్ స్థాయిలో కూడా మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, హిస్టరీ, జాగ్రఫీ సబ్జెక్టులు చదివి ఉండాలన్న నిబంధనలను తొలగించారు. అంటే.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్ చదివి ఉండాలన్న నిబంధన లేదు.
ఫలితంగా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా నేరుగా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు కూడా అర్హత లభిస్తుంది. స్కూల్ అసిస్టెంట్స్ (జీవశాస్త్రం) పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు జీ.వో.నెం.4లో పేర్కొన్న సబ్జెక్టులతో పాటు సెరికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, పౌల్ట్రీ సబ్జెక్టుల అభ్యర్థులకు కూడా అర్హత కల్పించారు. టీచర్లకు అప్రెంటిస్ విధానాన్ని ఈ డీఎస్సీ నుంచి రద్దు చేశారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు నమూనా, యూజర్ గైడ్ కోసం జ్ట్టిఞ://్చఞఛీటఛి.ఛిజజ.జౌఠి.జీn వెబ్‌సైట్‌ను చూసుకోవాలి.
డీఎస్సీ 80 మార్కులకే..
టెట్‌కు వెయిటేజీ ఇవ్వనున్న కారణంగా 80 మార్కులకే డీఎస్సీ పరీక్షను నిర్వహించనున్నారు. మిగతా 20 మార్కులకు టెట్ మార్కులను వెయిటేజీగా జమ చేస్తారు. ఒక్కో ప్రశ్నకు అర మార్కు చొప్పున 80 మార్కులకు 160 డీఎస్సీ పరీక్ష ఉంటుంది. ఎస్జీటీ పరీక్షలో జనరల్ నాలెడ్జ్‌కు 10 మార్కులు, పర్‌స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 10, ఇంగ్లీష్ 9, ఇండియన్ లాంగ్వేజ్ 9, మాథ్స్ 9, సైన్స్ 9, సోషల్ స్టడీస్ 9, టీచింగ్ మెథడ్ 15 మార్కులు ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్ పరీక్ష ల్లో.. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10, పర్‌స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 10, సబ్జెక్ట్ కంటెం ట్ 44, టీచింగ్ మెథడాలజీ 16 మార్కులు ఉంటాయి. పీ ఈటీలకు టెట్ ఉండకపోవ డం వల్ల పూర్తిగా 100 మా ర్కులకు పరీక్ష ఉంటుంది.

‘పంటల సాగు కన్నా..ఉరి మేలంటున్న రైతన్న’ అన్నదాతను దైన్య స్థితికి తెచ్చిన సర్కార్ విలువలు, విశ్వసనీయత లేని నేత చంద్రబాబు రైతు దీక్ష ముగింపు సభలో జగన్ నిప్పులు
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో సేద్యపు రంగం సంక్షోభంలో చిక్కుకుని రైతులు విలవిల్లాడుతున్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో పంటల సాగు కన్నా, ఉరి వేసుకోవడం నయమంటూ అన్నదాతలు నిర్లిప్తతకు లోనవుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్‌రెడ్డి ఆవేదన వెలిబుచ్చారు. సేద్యపు రంగ సమస్యలపై సర్కారు పట్టింపులేని ధోరణి కారణంగా దేశంలోనే తొలిసారిగా రైతులు తమంతట తామే క్రాప్ హాలిడే ప్రకటించుకుని ఏరువాకకు దూరంగా ఉండాల్సిన దౌర్భాగ్య స్థితి నెలకొందని దుయ్యబట్టారు. పంటల సాగు పెట్టుబడులు మూడింతలు పెరుగగా, అదే స్థాయిలో వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధరలు పెరగాల్సింది పోయి ఏటికేడాది మూడింతలకు పైగా తగ్గిపోతున్నాయని, ఇందుకు పసుపు రైతుల పరిస్థితే నిదర్శనమని ఉదహరించారు. వ్యవసాయ రంగ సమస్యల పరిష్కారం కోరుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ శివారులో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మూడు రోజుల పాటు నిర్వహించిన రైతు దీక్ష గురువారం సాయంత్రం నాటితో ముగిసింది. మంథని భూమన్న అనే స్థానిక రైతు నిమ్మరసం అందించి జగన్‌చే దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జగన్ మాట్లాడుతూ, అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీల వైఖరిని తూర్పారబట్టారు. అన్నదాత ఎదుర్కొంటున్న ఇక్కట్లను ప్రస్తావిస్తూ, వారికి వెన్నుదన్నుగా నిలువడం లేదంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థతను ఎండగట్టారు. తాను రైతు దీక్ష చేపట్టిన సందర్భంగా అనేక మంది రైతులు ప్రశ్నార్ధకంగా మారిన పంటల సాగు పరిస్థితి గురించి ఏకరువు పెట్టారని, వారి సమస్యలను పాలకుల దృష్టికి తెచ్చి పరిష్కరించాలనే కృతనిశ్చయంతో ఎన్ని దీక్షలు చేసినా ప్రభుత్వంలో స్పందన రావడం లేదని, చెవిటి వాని ముందు శంఖం ఊదిన చందంగా సర్కారు తీరు మారిందని ఘాటైన విమర్శలు చేశారు. పసుపు పంట సాగు చేసే రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని, ఎకరం విస్తీర్ణంలో పంట పండించేందుకు లక్షా 20వేల రూపాయలు ఖర్చవుతుండగా, పంట దిగుబడిని విక్రయిస్తే 60వేల రూపాయలు మాత్రమే చేతికందుతున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. దివంగత నేత వైఎస్ హయాంలో క్వింటాలు పసుపు పంటకు 17వేల రూపాయల వరకు మద్దతు ధర లభించిందని, గతేడాదితో పోల్చి చూసినా రూ.4వేలకు పడిపోయిందన్నారు. ఒక్క పసుపు పంటే కాకుండా పత్తి, మిర్చి, సజ్జ, బత్తాయి, ఉల్లి, టమాట తదితర అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదని జగన్ ఆక్షేపించారు. అన్నదాత ఇబ్బందులు దూరం కావాలంటే రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని, వ్యవసాయ రంగానికి 9గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్‌ను అందించాలని, 800పైచిలుకు కరవు మండలాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సాగునీటి ఇక్కట్లను దూరం చేసేందుకు ప్రాణహిత-చేవేళ్లతో పాటు ఎల్లంపల్లి, నెట్టంపాడు, భీమా, పోలవరం తదితర ప్రాజెక్టుల నిర్మాణం పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలన్నారు.
సర్కార్ కంటే ‘చంద్రబాబు’ తీరు మరింత దారుణం
కాగా, రైతాంగ సమస్యలను గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కంటే, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరు మరింత దారుణంగా తయారైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విలువలు, విశ్వసనీయతకు అర్థం తెలియని నేత చంద్రబాబు అని అభివర్ణించారు. ఆయన చేసే ప్రతీ పని వెనుక స్వార్ధ ప్రయోజనాలే ఉంటాయని, అధికారంలో ఉన్నప్పుడు ఒకవిధంగా, ప్రతిపక్ష నేత హోదాలో మరోరీతిలో వ్యవహరించడం సిగ్గుచేటని విమర్శించారు. చంద్రబాబు హయాంలో ఉచిత విద్యుత్ అందించాలని కోరగా, ఈ ప్రతిపాదనను అమలు చేస్తే కరెంట్ తీగలు బట్టలు ఆరేసుకునేందుకే ఉపయోగపడతాయంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారని అన్నారు. దివంగత నేత వైఎస్సార్ తన పాలనలో ఐదేళ్ల పాటు ఉచిత విద్యుత్‌ను అమలు చేసి చూపిన అనంతరం 2009 ఎన్నికల్లో చంద్రబాబు కూడా మెనిఫెస్టోలో ఈ హామీని వల్లెవేశారని జగన్ గుర్తు చేశారు. చంద్రబాబుకు విశ్వసనీయత లేదనడానికి ఈ వైఖరే నిలువెత్తు నిదర్శనమన్నారు. రైతుదీక్షలో ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కొండా సురేఖ, శోభా నాగిరెడ్డి, ఎమ్మెల్సీలు కొండా మురళి, జూపూడి ప్రభాకర్ ఇతర నాయకులు పాల్గొన్నారు.

రైతు సమస్యలపై ఆర్మూర్‌లో వైఎస్ జగన్ చేపట్టిన దీక్ష రెండవరోజు ఉద్రిక్తతకు దారితీసింది. దీక్షను అడ్డుకునేందుకు ప్రయత్నించిన న్యూడెమోక్రసీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జిచేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. రైతు సమస్యలపై ఆర్మూర్‌లో చేపట్టిన రైతు దీక్ష బుధవారం రెండవ రోజుకు చేరింది. దీక్షకు జిల్లాతో పాటు కరీంనగర్, ఆదిలాబాద్, నల్గొండ, మెదక్, వరంగల్ తదితర జిల్లాల నుండి వేలాదిగా రైతులు, మహిళలు ,యువకులు తరలివచ్చారు. దీక్షా శిబిరంలో జగన్‌ను కలిసి సంఘీభావం తెలిపారు. ఉదయం నుండే జనం దీక్షా శిబిరానికి తరలిరావడం కనిపించింది. వైఎస్సార్‌సిపి రాష్ట్ర, జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి కూర్చున్న జగన్ తనను కలవడానికి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించారు. కాంగ్రెస్ పాలనలో తమకు న్యాయం జరగడం లేదని, కొందరు తమ బాధలను వివరించారు. దీక్షకు తరలివచ్చిన వారిని కళాకారుల బృందం ఆటపాటలతో అలరించింది. దీక్షలో పాల్గొన్న వైఎస్సార్‌సిపి నేతలు మధ్యమధ్యలో తమ ప్రసంగంలో రాష్ట్రప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందంటూ విమర్శించారు. కాగా, సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ కార్యకర్తలు ఒకటి రెండుసార్లు జగన్ దీక్షా శిబిరంలోకి తెలంగాణ నినాదాలు చేస్తూ చొచ్చుకు రావడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీక్షా శిబిరం బయటే ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్టు సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట చోటుచేసుకోగా న్యూడెమోక్రసీ కార్యకర్తలిద్దరికి స్వల్పగాయాలయ్యాయి. దీక్షా శిబిరం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రామకృష్ణారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, ప్రసాద్‌రాజ్, సినీ నటుడు విజయచందర్, వైఎస్సార్‌సిపి నేతలు బాజిరెడ్డి గోవర్ధన్, వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జగన్ దీక్ష గురువారం రాత్రి 9 గంటలకు ముగియనుంది. దీక్ష ముగింపుసభకు భారీగా జన సమీకరణకు ఆ పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు.

వెల్లువెత్తుతున్న మద్దతు, ఉత్సాహంతో కదులుతున్న రైతులు
ఉదయం ఆర్మూరు బయల్దేరనున్న జగన్
పంజాగుట్టలో వైఎస్ విగ్రహానికి నివాళులు
మధ్యాహ్నానికల్లా వైఎస్సార్ దీక్షా ప్రాంగణానికి
దారి పొడవునా నేతల స్వాగత ఏర్పాట్లు
వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి గంగారెడ్డి, సంతోష్‌రెడ్డి
రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోరుతూ నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలో మంగళవారం నుంచి మూడు రోజుల పాటు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టనున్న నిరాహార దీక్షకు అంతా సిద్ధమైంది. దీక్షలో పాల్గొనేందుకు మంగళవారం ఉదయం జగన్ హైదరాబాద్ నుంచి బయల్దేరతారు. ముందుగా ఉదయం 7 గంటలకు పంజాగుట్టలో తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అక్కణ్నుంచి నిజామాబాద్ మీదుగా మధ్యాహ్నం 12 గంటలకు ఆర్మూరు చేరుకుని, వైఎస్సార్ ప్రాంగణంలో దీక్ష ప్రారంభిస్తారు. 12వ తేదీన దీక్ష ముగుస్తుంది. ఆ సాయంత్రం నాలుగింటికి దీక్షా మైదానంలోనే బహిరంగ సభ జరుగుతుంది.
పూర్తయిన ఏర్పాట్లు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ నేతృత్వంలో దీక్షా ప్రాంగణం వద్ద ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. జగన్‌కు భారీగా స్వాగతం పలికేందుకు నేతలు, కార్యకర్తలు దారి పొడువునా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మాజీ ఎంపీ కె.గంగారెడ్డి, మాజీ మంత్రి శనిగరం సంతోష్‌రెడ్డి తదితర నాయకులు దీక్ష ప్రారంభం సందర్భంగా జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించారు.
తరలి రానున్న నేతలు: అనర్హత వేటు పడుతుందని తెలిసినా, రైతుల పక్షాన నిలిచి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసిన ఎమ్మెల్యేలు మంగళవారం రైతు దీక్షలో పాల్గొంటున్నారు. ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, కాపు రామచంద్రరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, కొండా సురేఖ, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ధర్మాన కృష్ణదాస్, గొల్ల బాబురావు, గుర్నాథరెడ్డి, చెన్నకేశవరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ప్రసాదరాజు, పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎం.సుచరిత, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తెల్లం బాలరాజు, శ్రీనివాసులు, ఎమ్మెల్సీ కొండా మురళీ, ఎంపీలు సబ్బం హరి, మేకపాటి రాజమోహన్‌రెడ్డిలతో పాటు అంబటి రాంబాబు, సినీ నటి రోజా కూడా దీక్షలో పాల్గొంటారు.
అడ్డుకోవడం సరికాదు: గట్టు
రైతు దీక్షను అడ్డుకునే ప్రయత్నాలు సరికాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు అన్నారు. తెలంగాణ కోసం రాజీనామా చేసిన ఎమ్మెల్యేలపైనే పోటీకి ఉబలాటపడుతున్న టీడీపీ, కాంగ్రెస్‌లను ఏమీ అనకుండా.. ఈ ప్రాంత ఆకాంక్షలను గౌరవిస్తూ, ఉప ఎన్నికల్లో పోటీ పెట్టబోమని ప్రకటించిన జగన్‌ను అడ్డుకుంటామనడం ఏ మేరకు సబబని సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన ప్రశ్నించారు. ఆర్మూరు ఎర్ర జొన్న రైతుల సమస్యలను కూడా దృష్టిలో ఉంచుకుని ఆయన అక్కడ దీక్షకు పూనుకుంటున్నారన్నారు. దీక్షలో పాల్గొనేందుకు ఆర్మూరు చుట్టుపక్కల 60, 70 కిలోమీటర్ల దూరం నుంచీ రైతులు తరలి వస్తున్నట్టు వివరించారు. జగన్ తెలంగాణలో ప్రవేశిస్తే తమ పునాదులు కదులుతాయని టీడీపీ, కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారని, అందుకే కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. బాబులా ఆయనేమీ ఎన్నికల ప్రచారానికి వెళ్లడం లేదని గుర్తు చేశారు. ‘‘తెలంగాణవాదులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు. ఎవరైనా రెచ్చగొట్టినా వైఎస్సార్ కాంగ్రెస్ రెచ్చిపోదు. సంయమనంతో రైతు సమస్యలపై పోరాడతాం’’ అన్నారు.
నేడే వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి: సంతోష్‌రెడ్డి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు మాజీ మంత్రి సంతోష్‌రెడ్డి ప్రకటించారు. ఆర్మూరులో రైతు దీక్ష సభలో పార్టీ సభ్యత్వం తీసుకుంటానని స్పష్టం చేశారు. సోమవారం పార్టీ అధినేత జగన్‌ను ఆయన నివాసంలో కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతుదీక్షను నిజమాబాద్ జిల్లా చరిత్రలోనే కనీవినీ ఎరగని రీతిలో విజయవంతం చేస్తామన్నారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా రైతులకు విజ్ఞప్తి చేశారు. ‘‘జిల్లాలో పసుపు రైతుల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. వైఎస్ హయాంలో క్వింటాల్ రూ.18 వేలున్నది రూ.3,000కు పడిపోయింది. ఎర్రజొన్న రైతులకు ప్రభుత్వం రూ.10.8 కోట్ల బకాయి ఉంది’’ అన్నారు. దీక్ష ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వాటిని వసూలు చేయిస్తామన్నారు. దీక్షను అడ్డుకుంటామన్నప్రకటనలు సరికాదన్నారు.
అన్ని జాగ్రత్తలూ: ఐజీ
‘రైతు దీక్ష’కు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్టు హైదరాబాద్ రీజియన్ ఐజీ రాజీవ్ రతన్ తెలిపారు. ‘‘జగన్ పర్యటనను అడ్డుకుంటామన్న కొన్ని పార్టీల ప్రకటనల నేపథ్యంలో మరిన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. కరీంనగర్, మెదక్, వరంగల్ జిల్లాల సిబ్బందిని బందోబస్తుకు రప్పించాం. ఏపీఎస్పీ, ఆర్‌ఏఎఫ్‌నూ రంగంలోకి దించడానికి సిద్ధంగా ఉంచాం’’ అని వివరించారు. జగన్ ప్రయాణించే మార్గంలోనూ పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు.

రైతులు, రైతు కూలీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడురోజుల పాటు నిరాహార దీక్ష చేయనున్నారు. రైతుల సమస్యలు పట్టని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్న లక్ష్యంతో ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో రైతుదీక్ష చేపట్టాలని జగన్ నిర్ణయించారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన తెలంగాణ ముఖ్య నేతల సమావేశంలో దీనిపై చర్చించారు. అనంతరం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ మీడియాతో మాట్లాడుతూ.. రైతులు ఓ పక్క కరువు, మరోపక్క పంటకు గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అప్పులపాలైన అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకునే దయనీయమైన పరిస్థితి నెలకొందనీ తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పరిపాలనలో క్వింటాల్ పసుపు ధర రూ.17,000 నుంచి రూ.18,000 ఉండేదనీ, అదిప్పుడు రూ.2,800 నుంచి రూ.4,000కు తగ్గి పోయిందని వివరించారు. ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితుల్లో.. రైతులకు వైఎస్సార్ కాంగ్రెస్ అండగా ఉండాల్సిన అవసరం ఉందని పార్టీ తెలంగాణ నాయకులంతా భావించినట్టు బాజిరెడ్డి చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా రైతులు తరలి వచ్చే ఈ దీక్ష నిర్వహణ కోసం తొమ్మిది మందితో ఒక సారథ్య సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దీక్షా ప్రాంగణానికి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు పెడతామన్నారు.
సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన చంద్రబాబు హయాంను తలపిస్తోందని బాజిరెడ్డి అన్నారు. బాబు తొమ్మిదేళ్ల పాలనలో రైతుల్ని పీల్చి పిప్పి చేసి ఇప్పుడు రైతు పోరు బాట అంటూ ఊరేగుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో రైతులను కొట్టుకుంటూ యాత్ర చేయడం ఏమిటని ప్రశ్నించారు. జగన్ చేస్తున్న దీక్ష అలాంటిది కాదనీ, రైతుల కష్టాలను స్వయంగా పంచుకుని వారికి అండగా ఉండేందుకు ఆయన ఆందోళన చేస్తున్నారని వివరించారు. చంద్రబాబు రైతులకు ఉచిత కరెంటు నిచ్చారా? విత్తనాల ధరలు తగ్గించారా? మొసలి కన్నీళ్లు కార్చడం తప్ప ఏం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ వల్లనే తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం లేదని బాబు చేసిన విమర్శను ఆయన తిప్పికొట్టారు. బాన్సువాడ ఎన్నికల్లో బాబు పోటీ చేయకపోవడానికి కారణం కాంగ్రెస్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవడమేనా? అని నిలదీశారు.

రైతు పోరుబాటలో చంద్రబాబు పశ్చాత్తాపం తెలంగాణకు తెదెపా వ్యతిరేకం కాదు బాబు పర్యటనలో చేదు అనుభవం సభా వేదికపైకి చెప్పు.. కాన్వాయ్‌పైకి గుడ్లు
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రైతులకు ఉచిత విద్యుత్ అమలు చేయకపోవడం తప్పిదంగా నిలిచిందని, ఆ సమయంలోనే ఉచిత విద్యుత్ ఇచ్చివుంటే నేడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉండేది కాదని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పశ్చాత్తాపం వెలిబుచ్చారు. రైతు పోరుబాటలో భాగంగా గురువారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఆర్మూర్ మండలం గోవింద్‌పేట్ నుంచి జక్రాన్‌పల్లి వరకు సుమారు 14కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించి రైతు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జక్రాన్‌పల్లిలో బహిరంగ సభలో మాట్లాడుతూ ‘నా హయాంలో ఉచిత విద్యుత్ ఇవ్వకపోవడం పొరబాటే. ఇందుకు ప్రాయశ్చిత్తంగానే నన్ను నేను శిక్షించుకోవడానికి రైతాంగ సమస్యలపై పాదయాత్ర నిర్వహిస్తూ పోరాటం చేస్తున్నా’ అని చంద్రబాబు పేర్కొన్నారు. వ్యవసాయరంగానికి తొమ్మిది గంటల ఉచిత కరెంట్ ఇస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, కనీసం మూడు గంటలు కూడా నాణ్యమైన విద్యుత్ అందించడం లేదని దుయ్యబట్టారు. పైపెచ్చు రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను ఇతర ప్రాంతాలకు విక్రయించుకుంటూ 1500 కోట్ల రూపాయలు కూడబెట్టుకుంటోందని, ఉచిత విద్యుత్ పేరిట అందులో కేవలం 400 కోట్ల రూపాయల సబ్సిడీ వర్తింపజేస్తోందన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతాంగానికి ఉచితంగా 9గంటలు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎరువులు, క్రిమిసంహారక ధరలు విపరీతంగా పెరిగిపోయి పంటల సాగుకు పెట్టుబడులు రెట్టింపయ్యాయని, అదే సమయంలో వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించకపోవడంతో అన్నదాత ఆర్థికంగా చితికిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరవు జిల్లాలను ప్రకటించి చేతులు దులుపుకోవడం వినా, సహాయక చర్యలకు పైసా విదిల్చలేని అసమర్ధ ప్రభుత్వమని దుయ్యబట్టారు. పసుపు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. ఇంత జరుగుతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా కాంగ్రెస్ పాలకులు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ అధికారాన్ని నిలుపుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని, మైనార్టీలకు రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
తెలంగాణకు తెదెపా వ్యతిరేకం కాదు
కాగా, తెలంగాణ ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ ఎంతమాత్రం వ్యతిరేకం కాదని, పార్టీ మహానాడులోనూ ఈ విషయమై తమ నిర్ణయాన్ని స్పష్టం చేశామని చంద్రబాబు పేర్కొన్నారు. వ్యక్తిగతంగా తానెన్నడూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదని గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణపై కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నప్పటికీ నాన్చుడు ధోరణి అవలంభిస్తూ అనిశ్చితి కొనసాగిస్తోందని, ప్రజల మధ్య అపోహలు సృష్టిస్తోందని విమర్శించారు. తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న తమ పార్టీ నేతలను కూడా తాను వారించకుండా పూర్తి స్వేచ్ఛ ఇచ్చానని చంద్రబాబు వివరించారు.
సభా వేదికపైకి టిఆర్‌ఎస్ చెప్పు
నిజామాబాద్ జిల్లా పర్యటనకు హాజరైన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు చేదు అనుభవం ఎదురైంది. పాదయాత్ర ముగించుకుని జక్రాన్‌పల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్న సమయంలో చిన్నారెడ్డి అనే టిఆర్‌ఎస్ కార్యకర్త సభా వేదికపై చెప్పు విసరడం కలకలం సృష్టించింది. తెలంగాణ విషయంలో తెదెపా వైఖరిని తేటతెల్లం చేయాలంటూ టిఆర్‌ఎస్ కార్యకర్తలు, పలువురు మహిళలు నినాదాలు చేస్తూ సభలో నిరసన వ్యక్తం చేశారు. చెప్పు విసిరిన సంఘటనను తీవ్రంగా పరిగణిస్తూ కోపోద్రిక్తులైన తెలుగుదేశం కార్యకర్తలు చిన్నారెడ్డితో పాటు తెలంగాణ నినాదాలు చేస్తున్న ఇతర ఆందోళనకారులపై దాడికి దిగి ముష్టిఘాతాలు కురిపించారు. పోలీసుల సమక్షంలోనే తీవ్రంగా చితకబాదడంతో సభా ప్రాంగణం రసాభాసగా మారింది. ఓవైపు చంద్రబాబు వారిస్తున్నా లెక్క చేయకుండా తెలుగు తమ్ముళ్లు ఇష్టారీతిన ఆందోళనకారులను చితకబాదుతూ పార్టీ అధినేత పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇదిలావుంటే, మామిడిపల్లి గ్రామం వద్ద మహిళా జెఎసి ప్రతినిధులు చంద్రబాబు కాన్వాయ్‌పై కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేసి నిరసన వ్యక్తం చేశారు. కొలిప్యాక్ గ్రామంలో తెలంగాణ ద్రోహి చంద్రబాబు గో బ్యాక్ అంటూ తెలంగాణవాదులు నినాదాలు చేశారు.