NRI తెలుగు తేజాలు

ఆంధ్రలో పెట్టుబడులు పెట్టండి – సుజనా చౌదరి

sujana
ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొన్నప్పటికీ, భారత దేశ ఆర్థిక వ్యవస్థ మాత్రం మరింత గా అభివృద్ధి చెందుతుందని తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) విశ్వాసం వ్యక్తం చేశారు. అందుకే ప్రవాసాంధ్రులు ఆంధ్ర ప్రదేశ్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని, తద్వారా దేశాభివృద్ధిలో వారు చురుకైన పాత్ర పోషించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఫోన్, ఇంటర్ నెట్ వంటి ఇన్ఫ్‌ర్‌మేషన్ టెక్నాలజీ సాధనాలను ప్రవాసభారతీయులు విస్త­ృతంగా వినియోగించుకుని తెలుగు దేశం పార్టీ చేస్తున్న మంచి కార్యక్రమాల గురించి అందరికీ తెలియజేయాలని ఆయన కోరారు.  సుజన చౌదరి రాకను పురస్కరించుకుని న్యూజెర్సీ, న్యూయార్క్, పెన్సిల్‌వేనియా ప్రాంతాలకు చెందిన తెలుగు వారు ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ అభినందన సభ న్యూజెర్సీలో జరిగింది. ఈ కార్యక్రమానికి దాదాపు 400 మంది తెలుగు దేశం పార్టీ అభిమానులు హాజరయ్యారు. దాదాపు నాలుగు గంటలపాటు జరిగిన కార్యక్రమానికి న్యూజెర్సీ అసెంబ్లీ సభ్యుడు ఉపేంద్ర చివుకుల అధ్యక్షత వహించారు. దాము గేదల అతిథులకు స్వాగతం పలికారు.  జితేందర్ అట్లూరి, వెంకట్ గరికపాటి కలిసి సుజనా చౌదరిని శాలువ కప్పి, సత్కరించి మెమెంటోను అందజేశారు. అనంతరం గాయకులు అనిత కృష్ణ, బాబా ఆధ్వర్యంలో జరిగిన సంగీత కార్యక్రమం అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఎన్‌టీఆర్ పాటలకు రాజ గుంటి నృత్యం, చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది.  రమణ గన్నె, బ్రహ్మాజీ వెలివేటి, శైలజా అద్లూరు, శేషు బాబు వీరమాచినేని, విమల్ కావూరు, హర్‌నాథ్ దొడ్డపనేని, కోటపతి సాంబయ్య, మహేందర్ ముసుకు, మోహన కృష్ణ మన్నవ, రవి పొట్లూరి, శ్రీధర్ అప్పసాని, కేపి చౌదరి, రాయని చందు, సుధీర్ పాకలపాటి, శ్రీఇనవాస్ రెడ్డి, పూనమ్ మంతేనా, రణధీర్ థాకూర్, నరేందర్ రెడ్డి యాస, లక్ష్మి దేవినేని తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఘనంగా కాలిఫోర్నియాలో భారత స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు

19-8c
ఫెడరేషన్ ఆఫ్ ఇండో అమెరికా ఆధ్వర్యంలో ఇటీవల కాలిఫోర్నియా ఫ్రీమాంట్‌లో భారతీయ స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఫ్రీమాంట్‌లో రెండు రోజులపాటు జరిగిన ఈ వేడుకల్లో దేశం నలుమూలల నుండి దాదాపు 75,000 వేల మంది పాల్గొన్నారు. ఈ వేడుకలు బే ఏరియాలో గొప్ప పండుగా వాతావరణంగా నిలిచాయి.  రెండో రోజు జరిగిన కార్యక్రమంలో ఇండియా నుండి విచ్చేసిన అనేక రాష్ట్రాల వారు, మతాల వారు,15 శకటాలు వివిధ రకాల వేషధారణలతో ప్రదర్శనలో పాల్గొన్నాయి. అలాగే నత్య కళాకారులు ఫ్రీమాంట్ వీధిల్లో ఊరేగింపుగా వెళ్లడం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బే ఏరియా తెలుగు అసోసియేషన్ వారు తెలుగు సంస్కతిని శకటాల రూపంలో ప్రదర్శించారు. ‘గ్రామాలు మన దేశానికి వెన్నముక్క’ అనే ఇతి వత్తాన్ని ప్రతి ఒక్కరికి అద్దంపట్టేలే చూపించారు. పల్లెటూరు యొక్క విధి విధానాలు, కట్టుబాట్లు, నాగరికితలను ఏర్పాటు చేసిన శకటాలు పలువురిని ఆకట్టుకున్నాయి.  తానా అధ్యక్షులు జయరామ్ కోమటి ఆధ్వర్యంలో బాటా మరియు తెలుగు అ సోసియేషన్ సభ్యులు కస్ట్యూమ్స్‌తో వారి వారి నృత్యాలతో కాలిఫోర్నియాలో ఊరేగింపుగా సాగింది. ఈసందర్భంగా ‘వందేమాతరం’, ‘భారత్ మాతాకి జై ‘అంటూ నినాదాలు చేశారు. ఈ నినాదాలతో ఫ్రీమాంట్ వీధులు మారుమ్రోగాయి.

19-81
ఈ వేడుకల్లో శకటాల ప్రదర్శనలో బాటాకి మొదటి బహుమతి, మరియు మొత్తానికి థీమ్ అ వార్ట్‌ను అందుకుంది. ఈ కార్యక్రమానికి కో-ఆర్డినేటర్‌గా కరుణ్ వెలిగేటి ఉన్నారు. శ్రీలు వెలిగేటి, రమేస్ కొండ, కరుణ్ వెలిగేటి, విజయ ఆసూరి, ప్రసాద్ మంగిన, శ్రీదేవి పసుపులేటి, కళ్యాణ్ కట్టమూరి, రాజేష్ చావ్లి, యుగేంధర్ కరకల, శ్రీనివాస్ కోల్లి, రవి తిరువీదుల, జాన్సి తిరువీదుల, కిరణ్ విన్నకోట, కామేస్ మల్ల, స్వాతి మల్ల, హరి చికోటి, శ్రీని మంగిపూడి, సుధ మంగిపూడి,, యశ్వంత్, సుమంత్, దీపిక, దీప్తి, విహార్, నరేష్, నీహారిక, జయ, ఉజ్వల, ఆదిత్య, పార్వతి, ప్రమోద్, విజయ్, ఆనంద్, వెంకట్ తదితరులు బాటా యూత్ వాలంటీర్స్ కలిసి ప్రదర్శన శకటాలను ఎంతో అద్భుతంగా అలంకరించారు.

అమెరికాలో ప్రపంచశాంతి కోసం ‘శ్రీ యాగం’

6-8
న్యూజెర్సీలోని క్రాస్‌బరీలోని జీయర్ ఆశ్రమంలో ఇటీవల నిర్వహించిన ‘శ్రీ యాగం’ అమెరికావాసుల్లో ముఖ్యంగా ఎన్నారైల్లో చిరస్మరణీయమైన కార్యక్రమంగా నిలిచిపోయింది. వారం రోజులపాటు జరిగిన ఈ యాగానికి అమెరికా నలుమూలలనుంచి మంచి స్పందన వచ్చింది. ఎందరో భక్తులు ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కష్టాల నుంచి మానవ సమాజాన్ని గట్టెక్కించడానికి ప్రపంచశాంతి కోసం అమెరికాలోని చినజీయర్ స్వామి భక్తులు ‘విశ్వశాంతి శ్రీయాగం’ తలపెట్టారు.  శ్రీయాగంలో కార్యక్రమంలో పాల్గొనే ందుకు శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి న్యూజెర్సీకి వచ్చినప్పుడు ఆయనకు అఖండ స్వాగతం లభించింది. సాంప్రదాయబద్దంగా జీయర్ స్వామివారిని ఆశ్రమానికి భక్తులు తీసుకుని వచ్చారు. జీయర్‌తోపాటు ఈ యాగం కార్యక్రమంలో పాల్గొనేందుకోసం భారతదేశంలోని నలుమూలల నుంచి పండితులు, జియర్ వేదపాఠశాల నుంచి కొంతమంది, యుఎస్‌లోని దేవాలయాల్లో ఉన్న పండితులు మరి కొంతమంది ఇక్కడకు తరలివచ్చారు.  యాగం నిర్వహణకోసం విశాలమైన పందిరిని, భక్తుల సౌకర్యంకోసం కార్పెట్లను, అన్నప్రసాదాల తయారికోసం పెద్ద వంటశాలను ఏర్పాటు చేశారు. పరమహంస పరివ్రాజకులు శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామిజీ పర్యవేక్షణలో జరిగిన శ్రీయాగంను పురస్కరించుకుని వేదాలు, ఉపనిషత్తులు, భాగవతం, శ్రీరామాయణం, శ్రీ మహాభారతం, శ్రీమద్భగవద్గీత పురాణాలు, శ్రీ భాష్యం, దివ్య ప్రబంధ పారాయణం చేశారు. 108 మంది వేదపండితులలో శాస్త్రక్తంగా యాగం చేశారు.  శ్రీయాగంలో భాగంగా రోజుకొక ఇష్టి చొప్పున కార్యక్రమాలు నిర్వహించారు. చినజీయర్ స్వామిజీ ప్రత్యక్షంగా ఇష్టి కార్యక్రమాలను పర్యవేక్షించారు.

6-82

దీంతో పాటు ప్రతిరోజు సామూహికంగా పూజ కార్యక్రమాలను నిర్వహించారు, శ్రీకృష్ణ, శ్రీ శ్రీనివాస, శ్రీ హయగ్రీవ, శ్రీ లక్ష్మీసృసింహ, శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ పెదజీయర్ స్వామీ,శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తర శతనామ పూజలు నిర్వహించారు. డాక్టర్ శ్రీ సముద్రాల రంగ రామానుజాచార్య స్వామి తదితరులు తమ ఆధ్యాత్యిక ప్రసంగాలను భక్తులకు వినిపించారు. ప్రతిరోజు శ్రీయాగం కార్యక్రమాలతోపాటు అఖండ హరినామ సంకీర్తన, అఖండ శ్రీసూక్త, లక్ష్మీఅష్టోత్తర పారాయణ చేశారు. సాయంకాలం సమయంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. శాస్త్రీయ సంగీతంతోపాటు నృత్యకార్యక్రమాలు జరిగాయి. భక్తులు ప్రతిరోజు విష్ణుసహస్రనామ స్తోత్రంను సామూహికంగా పఠించారు. వాహనసేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

తానా అధ్వర్యంలో శ్రీ సాయిబాబా కూచిపూడి నృత్య రూపకం

baba
షిర్దీ సాయిబాబా ఇతివృత్తంగా తానా ఆధ్వర్యంలో కూచిపూడి నృత్య రూపకాన్ని ఇటీవల ఇక్కడ ప్రదర్శించారు. వందలాదిమంది పాల్గొన్న ఈ కార్యక్రమం అందరినీ అలరించింది. ‌సర్వం సాయి మయ్ం అనే పేరుతో సాయి తత్వాన్ని వివరిస్తూ పద్మశ్రీ డాక్టర్ శోభా నాయుడు అద్భుతంగా రూపకల్పన చేశారు. రిచర్డ్‌సన్ నగర మేయర్ గారీ స్లేగల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరై ఆద్యంతం ఆనందంగా గడిపారు. బాబా జీవితాన్ని ఎనిమిది భాగాలుగా ప్రత్యేక సన్నివేశాలతో ఈ రూపకాన్ని నిర్మించారు.
ఈ కార్యక్రమానికి రేడియో వ్యాఖ్యాత గోపాల్ పొన్నంగి విచ్చేసిన అథితులకు స్వాగత వచనాలు పలికారు. శోభానాయుడు భారతీయ కళా సాంస్క­ృతిక వికాసానికి దశాబ్దాల పాటు కృషి చేస్తున్నారని తానా ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడు ప్రసాద్ తోటకూర ప్రశంసించారు. ఇక్కడ ఇంత మంచి అవకాశాన్ని కల్పించినందుకు డాక్టర్ శోభా నాయుడు తానాకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పద్మశ్రీ శోభా నాయుడు, ఆమె శిష్యులను సత్కరించారు. ఆ తర్వాత ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారికి తానా కోశాధికారి రామ్ యలమంచిలి వందనసమర్పణ చేశారు.

సాఫ్ట్‌వేర్ నిపుణులకు న్యూజెర్సీలో నాట్స్ ఉచిత శిక్షణ

newjersy-
అమెరికాలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా న్యూజెర్సీలో ఇటీవల నాట్స్ అధ్వర్యంలో సాఫ్ట్‌వేర్ నిపుణులకు, నిరుద్యోగులకు కొత్త సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌లలో ఉచిత శిక్షణ నిర్వహించారు. రెండు రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమానికి దాదాపు 125 మంది పైగా పాల్గొన్నారు.
ఎన్ఏటీఎస్ చెందిన అనిల్ బొప్పుడి శిక్షణ కేంద్రానికి ఎంతో కృషి చేశారు. నాట్స్ కోఆర్డినేట్‌ర్ మోహన్ కృష్ణ మన్నవ కార్యక్రమాన్ని ప్రారంభించి న్యూజెర్సీలో వారు చేపట్టిన అనేక కార్యక్రమాల గురించి తెలియజేశారు. విమల్ కావూరి మాట్లాడుతూ ఎన్ఏటీఎస్ చారిటీ వారు చేపడుతున్న కార్యక్రమాలను మెచ్చుకుంటూ భవిష్యత్‌లో జరగబోయే ఏ కార్యక్రమానికైనా తన సహకారాలు అంద చేస్తానని తెలిపారు. అనిల్ బొప్పుడి సాఫ్ట్‌వేర్ నాణ్యతల గురించి రెండు రోజుల్లో క్లుప్తంగా వివరించారు

2010 బాటా క్రికెట్ కప్

bata_cricket_2010
ఏరియా తెలుగు అసోషియేషన్ (బాటా) ఏడవ వార్షికోత్సవం సంధర్భంగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) సహకారంతో బాటా కప్ క్రికెట్ టోర్నమెంట్‌ను ఇటీవల నిర్వహించింది. ఈ టోర్నమెంట్‌లో వసూలైన మొత్తాన్ని శంకరా ఐ ఫౌండేషన్ (ఎస్ఎఫ్ఎఫ్) కు బాటా విరాళంగా ఇచ్చింది.
ఈ సంవత్సరం జరిగిన టోర్నమెంట్‌కు పెద్ద సంఖ్యలో స్పందన లభించింది. ఇందులో 36 పురుషుల టీమ్‌లు , 4 మహిళా టీమ్‌లు పాల్గొన్నాయి. మొత్తం 50 ఆటలను రెండు రోజుల పాటు ఆడారు. ఇందులో విజేతలు : పురుషులలో మొదటి స్థానం వారియర్స్, రన్నర్స్ టీసీసీ చార్జర్స్ కాగా, స్త్రీలలో మొదటి స్థానం ఫైర్‌బర్డ్స్, రన్నర్స్‌గా టినో6 నిలిచారు.  బహుమతి ప్రదానం కార్యక్రమాన్ని విజయ ఆసూరి నిర్వహించగా, జయరామ్ కోమటి (తానా అధ్యక్షులు), సతీష్ చిలుకూరి (తానా), వెంకట్ మద్దిపాటి (శంకరా ఐ ఫౌండేషన్), మురళీ కృష్ణమూర్తి (శంకరా ఐ ఫౌండేషన్) ఈ టోర్నమెంట్‌కు అథితులుగా విచ్చేశారు.

‘నెలనెలా వెన్నెల’ తృతీయ వార్షికోత్సవం డాలస్‌లో

16.07
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం(టాంటెక్స్) ఆధ్వర్యంలో తెలుగుసాహిత్య వేదిక సమర్పించిన ”నెల నెలా తెలుగు వెన్నెల” తృతీయ వార్షికోత్సవ సంబరాలు జరిగాయి. డాలస్‌లో నివసిస్తున్న తెలుగు భాషాబిమానులు, సాహితీ ప్రియులు అధిక సంఖ్యలో స్ధానిక ట్రినిటీ హైస్కూల్‌లో సమావేశమయ్యారు.  ”మా తెలుగు తల్లికి మల్లెపూదండ” ప్రార్ధనాగీతం అనంతరం జ్యోతి ప్రజ్వలనతో తెలుగు సాహాత్యవేదిక అధిపతి డాక్టర్. నరసింహారెడ్డి ఊరిమిండి అధ్యక్షతన తృతీయవార్షికోత్సవ సంబరాలు ప్రారంభమయ్యాయి. ఈ సంబరాలలో సాహిత్యవేదిక కార్యవర్గ సభ్యులు శ్రీ అనంత్ మల్లవరపు, డాక్టర్. రమణ జవ్వాడి, శ్రీ విజయ చంద్రహాస్ మద్దుకూరి, శ్రీ సురేష్‌కాజ మరియు శ్రీ రావుకల్వల చురుకుగా పాల్గొన్నారు.  టాంటెక్స్ అధ్యక్షుడు శ్రీ చంద్ర కన్నెగంటి తమ సందేశంలో ప్రవాసాం«ద్రులు తమ జీవితాలను సంగీతమో, సాహిత్యమో లేక నృత్యం వంటి కళలతో సుసంపన్నం చేసుకోవాలని అన్నారు. డాక్టర్. ఊరమిండి తెలుగు భాషాభివృద్ధి ప్రాముఖ్యత వివరించారు.  ”తెలుగు సాహిత్యం : తీరుతెన్నులు” అనే అంశంపై శ్రీమతి అత్తలూరి విజలక్ష్మి, ”కధ – సంఘర్షణ స్వరూపాలు” అనే అంశంపై రసవత్కవి శ్రీ కన్నెగంటి ప్రసంసించారు.

16.07.01

తెలుగు సాహిత్య వేదిక దాతలు, ముఖ్య అధితులు సమక్షంలో తెలుగు గంధ్రాలయ సంకేత చిహ్నం ఆవిష్కరణతో ఉదయం కార్యక్రమాలకు తెరపడింది.  త్రిభాషా సహస్రావధాని శ్రీ. వద్దిపర్తి పద్మాకర్ నిర్వహించిన అష్టావధానాన్ని సభికులు అత్యంత ఆసక్తితో తిలకించారు. ”పత్రికా భాష ఆవిర్భావం” అనే అంశంపై డాక్టర్ . నరిసెట్టి ఇన్నయ్య మరియు ”21వ శతాబ్ధంలో తెలుగు మనుగడ” అనే అంశంపై శ్రీ సురేష్ కొలిచాల అనేక ఉదాహరణలతో ప్రసంగించారు. ”ప్రజాకళ” పత్రిక బృందం సమర్పించిన శ్రీశ్రీ ”మరో ప్రపంచం” లఘునాటిక నేటి సామాజిక సమస్యలకీ పాతబడని సరికొత్త సరికొత్త అభ్యుదయ సందేశాలను అందజేసింది.  టాంటెక్స్ సాంస్కతిక కార్యదర్శి డాక్టర్. సుబ్బారావు పొన్నూరు సమర్పించిన సాయంకాల కార్యక్రమాలు శాస్త్రీయ నృత్యంతో ప్రారంభమై ప్రేక్షకులకు పున స్వాగతం పలికాయి. సుప్రసిద్ద వేణుగాన విద్వాంసులు ప్రొఫెసర్. ప్రపంచం సీతారం సమర్పించిన వేణుగాన సంగీతం సభికులను అలరింపజేసింది. డాక్టర్ రాళ్ళబండి కవితాప్రసాద్ రచించిన ”ఆముక్తమాల్యద” నృత్యరూపకం ప్రముఖ కూచిపూడి నృత్యదర్శకులు, ”నంది” పురస్కారగ్రహీత శ్రీ.కెవి సత్యనారాయణ దర్శకత్వంలో ప్రదర్శించారు.

అమెరికాలో హైదరాబాద్‌ యువకుడి హత్య

Arun Kumar - photo
అమెరికాలో మరో హైదరాబాదీ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. దోపిడీ దొంగలను అడ్డుకోబోయిన యువకుడిపై కాల్పులు జరిపి హతమార్చారు. నగరానికి చెందిన అరుణ్‌ అనే యువకుడు అమెరికాలో చదువుకుంటున్నాడు. ఓ పెట్రోల్‌ బంకులో నల్లజాతీయులు దోపిడీకి ప్రయత్నించగా అరుణ్‌ వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో దుండగులు అతనిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి హత మార్చారు. అరుణ్‌ నగరంలోని మెహిదీపట్నం ప్రాంతానికి చెందినవాడుగా తెలుస్తున్నది.

డాలస్‌లో వై.ఎస్. జయంతి వేడుకలు

15.07.05
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్.రాజశేఖర్ రెడ్డి 61 వ జన్మదినోత్సవం సందర్భంగా వై.ఎస్.ఆర్. జయంతి వేడుకలను నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 200 మంది ఎన్.ఆర్.ఐ.లు ఈ వేడుకలలో పాల్గొన్నారు. ‌వైఎస్ఆర్ జ్ఞాపకాలు చిరస్మరణీయ్ం, ్‌వైఎస్ఆర్ అమర్ రహ్ై అంటూ అందరూ ఒక్కసారిగా నినాదాలు చేస్తూ నివాళి అర్పించారు. అనంతరం డాక్టర్ రమణ ఆర్ గూడూరు వై.ఎస్. చిత్రపటానికి గజమాలను వేశారు. ఆయన రాజకీయ, కుటుంబం చిత్రపటాలను ప్రదర్శించారు.
రెండు రూపాయలకే కిలో బియ్యం, గ్రామీణ విద్యార్థులకు విద్య, మహిళలకు ఉపాధి పథకాలు, ఇందిరమ్మ ఇళ్ల్లు, పట్టణ వాసులకు రాజీవ్ గృహకల్ప, గ్రామీణ ఉపాధి హామి, ఆరోగ్యశ్రీ పథకం, జలయజ్ఞం, విద్యుత్, ప్రజలకు మరియు వ్యవసాయధారులకు మంచి నీటి సరఫరా వంటి అనేక పథకాలను ముఖ్యమంత్రిగా వై.ఎస్. ప్రారంభించారని వక్తలు నివాళి అర్పించారు. ఈ పథకాల ద్వారా వైఎస్ఆర్ సామాన్య ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్నారని వారు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ గోనె ప్రకాశరావ్ మాట్లాడుతూ వై.ఎస్.ఆర్.తో తమకు గల ప్రగాఢమైన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. డాక్టర్ శ్రీధర్ కొర్సపాటి, ఎన్.ఎమ్.ఎస్. రెడ్డి, డాక్టర్ రమణ ఆర్ గూడూరు, డాక్టర్ శ్రీనివాస ఆర్ అల్ల, డాక్టర్ తారా కుమార్, డాక్టర్ రాఘవ రెడ్డి, రావు కాల్వల, అజయ్ రెడ్డి, రమణ కిష్టపతి, ప్రసాద్ మల్లు, శ్రీనివాస ఆర్ గుర్రం, పకీర రెడ్డి, కిృష్ణా రెడ్డి ఉప్పలపతి, ఉపేంద్ర ఆర్ బూడిద, అశోక్ గూడూరు, బాబు నరేంద్ర, ఫాల్గుణ, తిరుమల రెడ్డి, గోపి చిలుకూరు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

బే ఏరియాలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు

15.07.04
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఇటీవల కాలిఫోర్నియాలోని సన్నివేల్‌లో కాంగ్రెస్ అభిమానులు వేడుకలు జరుపుకున్నారు. ఇందులో 300 వందల కుటుంబాలు పాల్గొని తమ అభిమాన నాయకుని స్మరించుకుని ఆయన చిత్ర పటానికి పుష్పాభిషేకం చేశారు.
సిర్రా అట్లాంటిక్ ఇంక్.సంస్థ సిఈఓ కెవీఆర్ కార్యక్రమాన్ని ప్రారంభించి, విచ్చేసిన అతిథులను పరిచయం చేశారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ తనతో గడిపిన ఆనంద క్షణాలను గుర్తుచేసుకున్నారు. వైఎస్ఆర్ ప్రజానీకానికి బాగా దగ్గరైన వ్యక్తి. అలాంటి ప్రభావం గల నాయకుడు శాశ్వతంగా నిలిచి ఉంటారు అని కొనియాడారు. అనంతరం హనిమి రెడ్డి మాట్లాడతూ వైఎస్ఆర్ తో గల సన్నిహిత్యాన్ని నెమరువేసుకున్నారు. వైఎస్ఆర్ జయంతి వేడుకను రెండవ సారి జరుపుతున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ ను గత ఆగష్టులో కలిసి ఎన్ఆర్ఐల యొక్క నిరుద్యోగ ఇన్సూరెన్ అమలు పరచమని వ్యక్తిగతంగా నివేదించాము. నీలం సంజీవరెడ్డి మరియు అంజయ్య గారు ఆంధ్రప్రదేశ్‌కు గొప్ప నాయకులుగా నిలిచారు. కాని వైఎస్ఆర్ ఏదైతే చేశారో దానిని ఎవరు చేయలేకపోయారు. నేను కలలో కూడా అనుకోలేదు పేదవారు గుండెకు సంభందించి శస్రచికిత్సకు ఆర్థికంగా భరించగలరు అని కాని అది వైఎస్ఆర్ ప్రవేశ పెట్టిన ఆరోగ్య శ్రీ పథకం ద్వారా సాధ్యపడింది.అదే విధంగా ప్రభుత్వ పాఠశాలలోని ర్యాంక్ విద్యార్థులకు మెరుగైన విద్యకై ట్రిపుల్ ఐటి ప్రారంభించారు అని పేర్కొన్నారు.
వైఎస్ఆర్ హౌస్ సర్జన్‌గా పని చేసినప్పుడు ఆయన సహ ఉద్యోగిగా పనిచేసిన డాక్టర్ రామ్ కేసరి మాట్లాడుతూ మేము ఆయనని ఒక విద్యార్థి గానే చూసాం, కాని ఆయనలో విలక్షణమైన యోగ్యత కనపడింది అని వివరించారు. మరికొంత మంది అథితులు మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి ఎంత గానో కృషి చేశారని తెలిపారు. జగన్ ను ఉద్దేశిస్తూ’ నువ్వు ఒంటరి వాడివి కాదు మేమందరం కలిసి నీతో ఉన్నాం’. అనే వాక్యంతో కూడిన పత్రంపై అందరూ సంతకం చేశారు. డాక్టర్ రాఘవ యంగల, శివ యెర్రగుడి, ఆనంద్ దారల ఆధ్వర్యంలో వైఎస్ఆర్ యొక్క వ్యక్తిగత క్షణాలను, శాశ్వతమైన రాజకీయాలను స్రీన్ పై చూపించారు.

free website analytics