ప్రకాశం

భానుడి భగభగ


రాష్ట్రంలో భానుడు ఉగ్రరూపం దాల్చాడు. రాష్ట్రం నిప్పుల కొలిమిగా మారింది. ప్రచండబానుడిదాటికి ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడదెబ్బతో 10మంది మృతిచెందారు. ఉదయం ఏడు గంటలనుంచే వేసవి ప్రతాపం చూపుతోంది. ఇళ్లలో విద్యుత్‌ వాడకం కూడా భారీగా పెరుగుతోంది. పలు జిల్లాల్లో విద్యుత్‌ కోతలు కూడా మళ్లీ మొదలయ్యాయి. బుధవారం హైదరాబాద్‌లోనూ అనధికారికంగా 3 గంటల విద్యుత్‌ కోత విధించారు. రాష్టవ్య్రాప్తంగా బుధవారం ఉష్ణోగ్రతలు తీవ్రరూపం దాల్చాయి. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు. ఈ సమయంలో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటాయి.
తెలంగాణతోపాటు రాయలసీమ జిల్లాల్లోనూ 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో సాధారణం కంటే 3 డిగ్రీలు, కోస్తోంధ్ర, రాయలసీమలో 1 నుంచి 3 డిగ్రీలు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదువుతన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం రెంటచింతలలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వ్యవసా య రంగానికి ప్రాణధారమైన నైరుతి రుతుపవనాలు జూన్‌ 1 కల్లా కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ విభాగం ప్రకటించిన విషయం తెలిసిందే. రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకేవరకు ఇదే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంటుందని అధికారులు చెబుతున్నారు. ఈసారి సాధారణ తేదీ కన్నా కొంత ఆలస్యంగా దక్షిణ అండమాన్‌ సముద్రంలో రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు.

విరుచుకుపడిన ఎసిబి


ఎక్సైజ్ శాఖలో మద్యం ముడపులు అందుకున్న ఏ ఒక్కరినీ వదలకుండా అవినీతి నిరోదక శాఖ ఏరేసే కార్యక్రమాన్ని ఉధృతం చేసింది. ముడుపులు అందుకున్న మరికొందరు ఎక్సైజ్ అధికార్లను కోర్టు బోను ఎక్కించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే రాష్టవ్య్రాప్తంగా ఎక్సైజ్ కార్యాలయాలపై సోమవారం ఏకకాలంలో దాడులకు దిగింది. ఏసిబి సిట్ బృందాలు అనూహ్యంగా దాడులకు దిగాయి. ఎక్సైజ్ శాఖలో ఏళ్ల తరబడి ఒకే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న వారిపై గట్టి నిఘా పెట్టారు.
ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నవారి జాబితా తయారు చేసి ఉచ్చును మరింత బిగిస్తోంది. ఎసిబి అదనపు డైరక్టర్ శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలోని స్పెషల్ ఇనె్వస్టిగేషన్ బృందాలు ఈ కార్యక్రమంలో నిమగ్నమయ్యాయి. ఎక్సైజ్ శాఖలో మద్యం సిండికేట్ల నుంచి ముడుపులు అందుకున్న వారేకాకుండా, ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్న వారినీ తాజాగా ఎసిబి టార్గెట్ చేస్తోంది. విజయనగరం, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఎసిబి బృందాలు తనిఖీలు నిర్వహించాయి. కీలకమైన ఫైళ్లు, ఆఫీసు రికార్డులు, కంప్యూటర్ సామగ్రి, అధికారుల మొబైల్ నెంబర్లు స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయాల్లోని అధికారులను విచారించడంతోపాటు, వారి వద్దనున్న మొబైల్ నెంబర్లనుంచి గత కొన్ని రోజులుగా ఎవరెవరికి కాల్స్ వెళ్లిందీ విచారిస్తున్నారు. ఎసిబి దర్యాప్తుతో వ్యాపారాలు వదిలి అజ్ఞాతంలోకి వెళ్లిన సిండికేట్ల గురించీ సిట్ బృందాలు గాలిస్తున్నాయి. చిక్కడపల్లికి చెందిన మద్యం వ్యాపారి బాలరాజ్‌గౌడ్ అరెస్టు కాకుండా తప్పించుకుంటున్నాడు. ఇతను దేశం విడిచిపోకుండా ఎసిబి లుకౌట్ నోటీసు జారీ చేసింది. త్వరలోనే అరెస్టు చేస్తామని ఎసిబి వర్గాలు తెలిపాయి. ఇదిలావుంటే, విజయనగరం జిల్లాలోని ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఏసిబి బృందాలు తనిఖీలు నిర్వహించాయి. విజయనగరం జిల్లా కేంద్రం, పార్వతీపురం ఇఎస్ ఆఫీసుతోబాటు బొబ్బిలి సబ్ డివిజన్‌లో సైతం సోదాలు నిర్వహించారు. ఎసిబి డిఎస్పీ వెంకటేశ్వర రావు నేతృత్వంలో సిబ్బంది ఇఎస్ కార్యాలయానికి చేరుకుని 2010-12 మద్యం దుకాణాల టెండర్ రికార్డులు పరిశీలించారు.
పట్టు బిగిస్తున్న ఎసిబి
ఖమ్మం జిల్లాలో 2010 మద్యం టెండర్లలో 16 దుకాణాల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని నిర్థారించిన ఎసిబి, అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకునేందుకు ఎసిబి ఆధారాలు సేకరించే పనిలో పడింది. రెండురోజులుగ దాడులు కొనసాగిస్తున్న ఎసిబి, సోమవారం టెండర్లకు సంబంధించిన అన్ని ఫైళ్లనూ ఎసిబి డిఎస్పీ శంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో డిఆర్వో క్యాంప్ కార్యాలయం నుంచి స్వాధీనం చేసుకున్నారు. టెండర్ల సమయంలో జిల్లాలో పనిచేసిన జెసి అజీంతో పాటు పలువురు ఉన్నతాధికారుల ప్రమేయంపైనా విచారణ సాగుతోంది.
గుంటూరులోని ఎక్సైజ్ డిసి ఆఫీసులో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. సిండికేట్లు అందించిన వివరాలతో ఎక్సైజ్ అధికారుల పాత్రపై ఆరా తీస్తున్నారు. ఎసిబి జెడి రమేష్‌రెడ్డి ఆధ్వర్యంలో సోదాలు సాగాయి. 2010లో జరిగిన మద్యం టెండర్లలో అవకతవకలు జరిగాయని, సిండికేట్‌లకు షాపులు కేటాయించడంలో నిబంధనల ఉల్లంఘన వెల్లడైనట్టు సమాచారం. రికార్డులను స్వాధీనం చేసుకున్న ఎసిబి, చర్యలకు సిద్ధమవుతోంది. దాడుల సందర్భంలో డిసి కార్యాలయంలో ముఖ్య అధికార్లు అందుబాటులో లేకపోవడం గమనార్హం. అలాగే తెనాలి, నరసరావుపేట ఎక్సైజ్ కార్యాలయాల్లోనూ సోమవారం ఎసిబి బృందాలు దాడులు నిర్వహించి రికార్డులు తనిఖీలు చేశాయి. ఎసిబి డిఎస్పీ శివాజీ, విజయవాడ రేంజ్ ఎసిబి సిఐ టిఎస్‌కె రవి నేతృత్వంలో రికార్డులను పరిశీలించి, టెండర్ల విషయంలో అధికార్లు అక్రమాలకు పాల్పడ్డారా? అన్న అంశాలను పరిశీలించారు.
తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి, కాకినాడ, అమలాపురం ఇఎస్ కార్యాలయాలపై సోమవారం ఎసిబి బృందాలు దాడులు జరిపాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన సిట్ బృందాలు దాడుల్లో పాల్గొన్నాయి. 2010లో మద్యం దుకాణాల వేలం ప్రక్రియకు సంబంధించిన ఫైళ్లపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. దాడుల్లో ఎసిబి సిట్ డిఎస్పీలు విజయపాల్, లక్ష్మీపతి ఆధ్వర్యంలో ఇనస్పెక్టర్లు బి రామకృష్ణ, ఎస్ మురళీమోహన్ పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు, భీమవరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ అధికార్లు సోమవారం రికార్డులు పరిశీలించారు. ఏలూరులో హైదరాబాద్ ఎసిబి డిఎస్‌పి నరసింహారావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించగా, మధ్యాహ్నం నుంచి భీమవరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో విజయవాడ నుండి వచ్చిన బృందం ఆధ్వర్యంలో తనిఖీలు జరిపారు. దాడుల్లో భాగంగా కొన్ని ముఖ్యమైన ఫైళ్లను స్వాధీనం చేసుకుని, కార్యాలయాల్లోని కంప్యూటర్లలో నిక్షిప్తమైన సమాచారాన్ని సైతం ఎసిబి అధికార్లు సేకరించారు.
నెల్లూరు జిల్లాలోని నెల్లూరు, గూడూరు ఎక్సైజ్ కార్యాలయాల్లో ఎసిబి సోదాలు సాగాయి. మద్యం దుకాణాల లైసెన్సులు పరిశీలించి, 2010 నుంచి టెండర్లకు సంబంధించిన వివరాలు తీసుకున్నారు. కర్నూలు, కడప జిల్లాల్లో సైతం ఎక్సైజ్ కార్యాలయాలపై ఎసిబి దాడులు జరిపింది. 2010 వేలం పాటల రికార్డులు, టెండర్లలో పాల్గొన్న వారి వివరాలు, ఆస్తిపాస్తుల సమాచారం, మద్యం దుకాణాలను వేలంలో దక్కించుకున్న వారి వివరాలు సేకరించారు. అలాగే, మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ పట్టణాలలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల్లో ఎసిబి అధికారులు సోమవారం దాడులు నిర్వహించి సోదాలు చేశారు. మద్యం దుకాణాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.

సిండి’కేట్ల’తో నాకు సంబంధాల్లేవ్‌


మద్యం మాఫియా అవినీతి అక్రమాలపై విచారణ జరుపుతున్న ఏసీబీ తన పట్ల ఏక పక్షంగా వ్యవహరిస్తుందని ఎక్సైజ్‌ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు. సిండికేట్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని వివరించారు. తాను ఎవరి నుండి ముడుపులు పుచ్చుకోలేదని వెల్లడించారు. క్రిమినల్స్‌ ఇచ్చే వాంగ్మూలానికి విలువనిచ్చి తన అభిప్రాయాన్ని తీసుకోకుండా ఏసీబీ ఏక పక్షంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఏసీబీ వైఖరి పై తనకు అనేక అనుమానాలు ఉన్నాయని అన్నారు. తనకు ఎవరిపైన అనుమానం లేదని, తాను ఎవరికీ పోటీ కాదని, కొందరు తననే లక్ష్యంగా చేసుకొని
ఆరోపణలు చేయడం ఆవేదనకు గురి చేస్తుందని అన్నారు. మద్యం సిండికేటుకు సంబంధించి రమణ అనే వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వాస్తవాలు తెలుసుకోకుండానే తనపై రాజకీయ కోణంలో కొందరు దాడికి పాల్పడుతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం నాడు అసెంబ్లీలో ఈ వ్యవహారంపై చర్చ జరిగిన పక్షంలో సమాధానం ఇస్తానని తనను కలిసిన మీడియా ప్రతినిధులకు తెలిపారు. మద్యం మాఫియా వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని పునరుద్ఘాటించారు. ఏసీబీ వ్యవహారంపై తనకు అనేక అనుమానాలు కలుగుతున్నాయని తెలియచేశారు. దర్యాప్తు సంస్ధ తీరును ఖండించారు. వాస్తవాలను నిర్ధారించుకోకుండానే సంబంధం లేని వ్యక్తుల పేర్లు బయటకి వస్తున్నాయనే అనుమానం కలుగుతుందన్నారు. అసెంబ్లీ సభా వ్యవహారాల సలహా మండలి సమావేశంలో మద్యం ఫియా అంశంపై చర్చ జరిగింది. అందులో కొందరు మంత్రులకు మద్యం సిండికేట్ల నుండి ముడుపులు ముట్టాయని ప్రధాన ప్రతిపక్షం ఆరోపించింది. వాస్తవాలు వెలుగు చూసే విధంగా సమగ్ర చర్చ జరగాలని పట్టుబట్టింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నాటి నుండి తనను లక్ష్యంగా చేసుకొని కొందరు ఆరోపణలు చేస్తున్నారని మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఇదే విషయాన్ని మరో సారి ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చానన్నారు. ఈ విషయంలో వాస్తవం వెలుగుచూడవలసి ఉందని అన్నారు. అసెంబ్లీలో చర్చ సందర్బంగా సమాధానం ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఇప్పటికే అంగీకరించారు. మీడియాకు కూడా తెలియచేశారు. ఏబీసీ విచారణ ప్రాథమిక దశలోనే ఉందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో అమాయకులకు అన్యాయం జరగరాదనే అభిప్రాయంతో ఉన్నారు. వాస్తవాలు వెలుగుచూడావలసి ఉందని అభిప్రాయబడుతున్నారు. సభలో జరిగే చర్చకు ముఖ్యమంత్రి సమాధానంతో పాటుగా అదే సమయంలో తనకు కూడా వివరణ ఇచ్చుకునే అవకాశం కల్పించాలని ఎక్సైజ్‌ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ కోరుకుంటున్నారు.

21,343 టీచర్ పోస్టులు


డీఎస్స-12 నోటిఫికేషన్ విడుదల
మే 2,3,4 తేదీల్లో రాత పరీక్షలు
అప్రెంటీస్ విధానం రద్దు
‘ఇంటర్’ నిబంధన తొలగింపు
‘ఓపెన్ డిగ్రీ’ వారికీ అర్హత
ఎస్ఏ పోస్టులకు సబ్జెక్టు నిబంధనల సడలింపు
80 మార్కులకే డీఎస్సీ
20 మార్కులకు టెట్ వెయిటేజి
మరో 7100 పోస్టులకు రెండు రోజుల్లో నోటిఫికేషన్
హైదరాబాద్, జనవరి 30 : లక్షలాది మంది ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త. కొద్ది రో జులుగా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న ‘డీఎస్సీ -2012 నోటిఫికేషన్’ సో మవారం విడుదలైంది. మొత్తం 21,343 ఉపాధ్యాయ ఉద్యోగాలను ఇందులో నోటిఫై చేశారు. ఉపాధ్యాయ అభ్యర్థులు దశాబ్దకాలంగా చేస్తోన్న ‘అప్రెంటిస్’ రద్దు డిమాండ్ కూడా నెరవేరుతోంది. వివాదాస్పదంగా మారిన ‘ఇంటర్‌లో సంబంధిత సబ్జెక్టులు తప్పనిసరి’ అనే నిబంధనను తొలగించారు.
నోటిఫై చేసిన మొత్తం పోస్టుల్లో.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 5,703, ఎస్జీటీ పోస్టులు 11, 602 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్లు 2000, పీఈటీలు 365, మునిసిపల్ పాఠశాలల్లో 1,673 పోస్టులు ఉన్నాయి. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 17వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. సచివాలయంలో సోమవారం సాయంత్రం 3 గంటలకు మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కె.పార్థసారథి ఈ డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. డీఎస్సీకి విద్యార్హతల నిబంధనల్లో కొన్నింటిని సడలించారు.
స్కూల్ అసిస్టెంట్స్ (మేథ్స్, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్) పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్ స్థాయిలో కూడా మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, హిస్టరీ, జాగ్రఫీ సబ్జెక్టులు చదివి ఉండాలన్న నిబంధనలను తొలగించారు. అంటే.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్ చదివి ఉండాలన్న నిబంధన లేదు.
ఫలితంగా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా నేరుగా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు కూడా అర్హత లభిస్తుంది. స్కూల్ అసిస్టెంట్స్ (జీవశాస్త్రం) పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు జీ.వో.నెం.4లో పేర్కొన్న సబ్జెక్టులతో పాటు సెరికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, పౌల్ట్రీ సబ్జెక్టుల అభ్యర్థులకు కూడా అర్హత కల్పించారు. టీచర్లకు అప్రెంటిస్ విధానాన్ని ఈ డీఎస్సీ నుంచి రద్దు చేశారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు నమూనా, యూజర్ గైడ్ కోసం జ్ట్టిఞ://్చఞఛీటఛి.ఛిజజ.జౌఠి.జీn వెబ్‌సైట్‌ను చూసుకోవాలి.
డీఎస్సీ 80 మార్కులకే..
టెట్‌కు వెయిటేజీ ఇవ్వనున్న కారణంగా 80 మార్కులకే డీఎస్సీ పరీక్షను నిర్వహించనున్నారు. మిగతా 20 మార్కులకు టెట్ మార్కులను వెయిటేజీగా జమ చేస్తారు. ఒక్కో ప్రశ్నకు అర మార్కు చొప్పున 80 మార్కులకు 160 డీఎస్సీ పరీక్ష ఉంటుంది. ఎస్జీటీ పరీక్షలో జనరల్ నాలెడ్జ్‌కు 10 మార్కులు, పర్‌స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 10, ఇంగ్లీష్ 9, ఇండియన్ లాంగ్వేజ్ 9, మాథ్స్ 9, సైన్స్ 9, సోషల్ స్టడీస్ 9, టీచింగ్ మెథడ్ 15 మార్కులు ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్ పరీక్ష ల్లో.. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10, పర్‌స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 10, సబ్జెక్ట్ కంటెం ట్ 44, టీచింగ్ మెథడాలజీ 16 మార్కులు ఉంటాయి. పీ ఈటీలకు టెట్ ఉండకపోవ డం వల్ల పూర్తిగా 100 మా ర్కులకు పరీక్ష ఉంటుంది.

మద్యం సిండికేట్లపై మళ్లీ ఎసిబి దాడులు


ఎక్సైజ్‌ అధికారుల ఇళ్లలో సోదాలు
ప్రకాశం, గుంటూరు, శ్రీకాకుళం, విశాఖ, వరంగల్‌ జిల్లాల్లో మద్యం సిండికేట్లపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) శుక్రవారం దాడులు నిర్వహించింది. మద్యం వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలతోపాటు కొందరు ఎక్సైజ్‌ అధికారుల ఇళ్లలోనూ సోదాలు చేశారు. నెల్లూరు, కర్నూలు, ఒంగోలుకు చెందిన ఎసిబి అధికారులు బృందాలుగా ఏర్పడి ఒంగోలు, శింగరాయకొండలలో మద్యం సిండికేట్లపై దాడులు నిర్వహించారు. ఒంగోలులోని మద్యం సిండికేట్‌ నిర్వాహకుడు అబ్బూరి వెంకట్రావు ఇంటిపై అధికారులు దాడి చేశారు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. శింగరాయకొండలోని ఎక్సైజ్‌ సిఐ గురవయ్య ఇంట్లో తెల్లవారుజామున అధికారులు తనిఖీ నిర్వహించారు. సిండికేట్లకే వడ్డీ నిమిత్తం ఆయన సుమారు రూ.20 లక్షలు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. నెలనెలా టార్గెట్ల చెల్లింపునకు ఎక్సైజ్‌ అధికారులే వ్యాపారులకు వడ్డీలకు ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఈ దాడుల్లో దొరికిన పత్రాల్లో లంచాల భాగోతం వెలుగుచూసింది. ఉదయం నుంచీ సాయంత్రం వరకూ దాడులు కొనసాగాయి. గుంటూరులోని లక్ష్మీపురంలో నివాసముంటున్న మద్యం వ్యాపారుల గృహాలపైనా అధికారులు దాడులు నిర్వహించారు. విజయవాడ ఎసిబి డిఎస్‌పి విష్ణు, గుంటూరు సిఐ శ్రీనివాసరెడ్డి, మల్లిఖార్జునరావుల నేతృత్వంలో సుబ్బారెడ్డి, నల్లబోతు శ్రీనివాసరావులకు చెందిన ఇళ్లల్లో సోదాలు చేసి, మద్యం వ్యాపారాలకు సంబంధించిన కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు.
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన ఎస్‌.శ్రీనివాసులరెడ్డి సిండికేట్లలో కానిస్టేబుల్‌ నాగేశ్వర్‌ పేరు మీద రూ.42లక్షలు పెట్టుబడి పెట్టినట్లు రికార్డులు దొరికాయి. శ్రీనివాసుల రెడ్డి ఒకప్పుడు మాజీ ఎమ్మెల్యే ఎన్‌.ప్రసన్నకుమార్‌రెడ్డి అనుచరుడు. ఇదే క్రమంలో తెనాలిలోనూ మద్యం సిండికేట్ల గృహాలపై ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఓరుగంటి ఈశ్వర్‌, శ్రీకాకుళం పట్టణంలోని ఎపిహెచ్‌బి కాలనీలో నివాసముంటున్న సర్కిల్‌ హెడ్‌కానిస్టేబుల్‌ మెండ అప్పన్న, విశాఖపట్టణంలో ఉన్న శ్రీకాకుళం ఎక్సైజ్‌ సిఐ రామకృష్ణ నివాసాల్లో ఎసిబి అధికారులు శుక్రవారం సోదాలు చేపట్టారు. ఎసిబి రాజమండ్రి రేంజ్‌ డిఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యాన ఈశ్వర్‌ ఇంట్లో సోదాలు
ప్రారంభించారు. విశాఖపట్నంలో జనప్రియ, గణేష్‌ మద్యం సిండికేట్లపై దాడులు చేశారు. సిండికేట్‌ కార్యాలయాలతోపాటు ఆయా సిండికేట్ల యాజమాన్య ప్రతినిధులు ప్రసాద్‌, పుష్కరగణేష్‌ ఇళ్లపై కూడా దాడులు చేశారు. ఎక్సైజ్‌ టాస్క్‌పోర్స్‌ సిఐ కామేశ్వరరావు ఇంటిపై కూడా దాడిచేశారు. గతంలో ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌గా పనిచేసిన హనుమంతరావు ఇంటిలో రాజమండ్రి ఎసిబి అధికారులు సోదాలు చేశారు. అందరిపై కేసులు నమోదుచేశారు. విశాఖలో జరిగిన దాడుల్లో డిఎస్‌పి రామకృష్ణప్రసాద్‌, సిబ్బంది పాల్గొన్నారు.
వరంగల్‌ జిల్లాలో మద్యం వ్యాపారులు, ఎక్సైజ్‌ అధికారుల ఇళ్లపై ఎసిబి అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. హన్మకొండలోని మద్యం వ్యాపారి మోహన్‌రెడ్డి ఇంటిపై దాడులు నిర్వహించిన అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్‌లోని రైల్వే గేట్‌ ప్రాంతానికి చెందిన వీరాచందర్‌ ఇంట్లోనూ సోదాలు చేశారు. వీరితో పాటు హన్మకొండలోని సహకార్‌నగర్‌లో ఉన్న ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ సిఐ కరమ్‌చంద్‌ ఇంటిపైనా ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. వీరి వద్ద నుండి రూ.10లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఒక్కసారిగా అధికారులు దాడులు నిర్వహిస్తుండడంతో సమాచారం తెలుసుకున్న పలువురు మద్యం వ్యాపారులు ఉడాయించినట్లు సమాచారం. దాడులపై ఎసిబి అధికారులు ఎలాంటి వివరాలూ వెల్లడించడం లేదు.

విపత్తులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి – పంకజ్‌ ద్వివేది

రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల్లో ‘తానే’ సైక్లోన్‌ రానున్నందని, విపత్తులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని  పంకజ్‌ ద్వివేది జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం రాజధాని నుంచి ప్రకృతి వైపరీత్యాలు అనే అంశంపై జిల్లా కలెక్టర్లతో ఆయన అత్యవసర వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ రాబోయే మూడు రోజుల్లో తానే సైక్లోన్‌ రాష్ట్రంలో తీవ్ర ప్రభావం చూపే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపిందన్నారు. దీనివల్ల తీవ్రంగా వర్షాలు పడే అవకాశముందని, వర్షాల వల్ల ఏరకమైన ప్రాణనష్టం, ఆస్తి నష్టం వాటిల్లకుండా తగినవిధంగా జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు.
వర్ష ప్రభావిత జిల్లాలో షెల్టర్లను, కంట్రోల్‌ రూములను ఏర్పాటు చేయాలని తెలిపారు. అధిక వర్షాల వల్ల రోడ్లు, బ్రిడ్జిలు దెబ్బతినే అవకాశముం దని, అలాంటి వాటిని ముందస్తుగా గుర్తించి చర్యలు చేపట్టాలన్నారు. అలాగే విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని, కావున పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బి, ట్రాన్స్‌కో తదితర శాఖల అధికారులను అప్రమత్తంగా ఉండేలా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేయాలన్నారు. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. అనంతరం జిల్లాలవారీగా సైక్లోన్‌కు గురయ్యే ప్రాంతాల వివరాలు, అక్కడ అధికారులు చేపట్టబోయే ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూము ఏర్పాటు చేశాం ః కలెక్టర్‌
తానే సైక్లోన్‌ నిమిత్తం ముఖ్య కార్యదర్శి ఆదేశాల మేరకు ఇప్పటికే కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూము ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్‌ దుర్గాదాస్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్య కార్యదర్శికి వివరించారు. ముఖ్యంగా చిత్తూరు సరిహద్దు గ్రామాలు, తాడిపత్రి నియోజకవర్గం లోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే దీనిప్రభావం ఉండవచ్చని తెలిపారు. వర్షాభావ జిల్లాకు సైక్లోన్‌వల్ల కొద్దిగా వర్షాలు వస్తే అది జిల్లాకు వరమవు తుందని కలెక్టర్‌ వివరించారు. ఏదిఏమైనా అన్ని రకాలుగా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించా మని తెలిపారు. సమావేశంలో హైదరాబాద్‌లో డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కమీషనర్‌ రాధా, జిల్లా నుంచి అదనపు జేసి చెన్నకేశవరావు, డిఆర్‌ఓ సుదర్శన్‌రెడ్డి, పెనుకొండ ఆర్‌డిఓ ఈశ్వర్‌, కలెక్టరేట్‌ సూపరింటెం డెంట్‌ వరదరాజులు తదితరులు పాల్గొన్నారు.

పోరుబాట పట్టండి – రైతులకు చంద్రబాబు పిలుపు


ఇదొక చేతకాని ప్రభుత్వం.. రైతులు పంటలు ఎండిపోయి, కనీసం పెట్టుబడులు దక్కక అల్లాడుతుంటే పరిస్థితిని స్వయంగా తెలుసుకోవడానికి కూడా ప్రభుత్వ పెద్దలకు తీరికలేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దుయ్యబట్టారు. ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం అనంతవరం నుంచి చంద్రబాబు సోమవారం రైతు పోరుబాటను ప్రారంభించారు. నేరుగా పంటపోలాల్లోకి వెళ్లి ఎండిపోయిన పత్తి పైరును పరిశీలించారు. వర్షాలు లేక గిడసబారిన పత్తిని చూపిస్తూ రైతులు చంద్రబాబు ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు. పుస్తెలు కూడా తాకట్టు పెట్టి, పైరు వేసినట్లు వెంకటేశ్వరమ్మ అనే మహిళ వాపోయింది. 5 ఎకరాల సాగుకు దాదాపు లక్షన్నర ఖర్చుపెట్టామని, తీరాచూస్తే ఐదారు క్వింటాళ్ళ పత్తి కూడా వచ్చే పరిస్థితి లేదని ఆమె బావురుమంది. ఆ మహిళ కంటతడి పెట్టడం చూసిన బాబు చలించిపోయారు. ఈ అసమర్ధ ప్రభుత్వాన్ని గద్దె దింపి, రైతాంగ సమస్యలను పరిష్కరించేవరకు పోరుబాట వీడేది లేదని ధైర్యం చెప్పారు. రైతుకు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేవరకు నిద్రపోనని హామీ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వామినాథన్‌, ఉడా కమీషన్‌ సిఫార్సులను వెంటనే అమలు చేసి రైతులను ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. పంట నష్టపోయిన రైతులందరికీ వెంటనే నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఓవైపు గ్యాస్‌, పెట్రో ధరలు పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని, మరోవైపు ఎరువుల ధరలు పెంచి, రైతుల ఉసురు పోసుకుంటున్నారని, ఈ ప్రభుత్వం గద్దె దిగేవరకు తాను విశ్రమించనని చంద్రబాబు చెప్పారు. రైతు సమస్యలపై ఈనెల 21న ఢిల్లిdలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నామన్నారు.
ఎంపీ నిధులతో మంచి నీళ్లందిస్తా..
రైతుపోరుబాటలో భాగంగా ఆయన వింజనంపాడులో రైతులతో మాట్లాడ ుతుండగా గ్రామస్తులంతా తాము మంచినీటి సమస్యను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. తాగడానికి గుక్కెడు నీరు లేక కలుషిత నీటితో అనారోగ్యంపాలవుతున్నారని వాపోయారు. వెంటనే స్పందించిన చంద్రబాబు తమ పార్టీ ఎంపీ నిధులతో మంచినీటి ప్లాంటు ఏర్పాటుచేయిస్తానని హామీ ఇచ్చారు. అక్కడినుంచి ఆయన చిలుకూరివారిపాలెం, పోలూరు, యద్దనపూడి వరకు పాదయాత్ర చేశారు. పోరుబాటలో భాగంగా ఆయా గ్రామాలలో ఎన్‌టీఆర్‌ విగ్రహాలను ఆవిష్కరించారు. మండలంలో అధికంగా సాగుచేసిన పతి పంటలను ఆయన పరిశీలించారు. చిలుకూరి వారి పాలెంలో రైతులతో కలిసి రాగిసంకటి తిన్నారు. అనంతరం రైతులను ఉత్సాహపరచేందుకు ట్రాక్టర్‌ నడిపారు. సాయంత్రం యద్దనపూడిలో బహిరంగ సభ అనంతరం గన్నవరం, పూనూరు గ్రామాల మీదుగా ఆయన గుంటూరు వెళ్లారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర నాయకులు కోడెల శివప్రసాదరావు, కరణం బలరామకృష్ణమూర్తి, శిద్దా రాఘవరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌, తెలుగురైతు అధ్యక్షుడు కొం డ్రగుంట వెంకయ్య, పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జి గొట్టిపాటి నర్సయ్య పాల్గొన్నారు.

బాబు ర్యాలీని అడ్డుకున్న పోలీసులు


ఈ నెల 13 నుండి ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ఒంగోలులోని ర్యాలీని గురువారం పోలీసులు అడ్డుకు న్నారు. మూడు రోజుల పర్యటణలో ముగింపు కార్యక్రమ లో భాగంగా స్థానిక రాజధాని సెంటర్‌ నుండి అశేష తెదేపా కార్యకర్తలతో కూడిన ర్యాలీ ప్రార ంభమై చర్చి సెంటర్‌, ట్రంకురోడ్డు, మార్కెట్‌ సెంటర్‌, కర్నూలు రోడ్డు మీదుగా సాగి అంజయ్యరోడ్డులోని యన్‌.టి.ఆర్‌ విగ్రహాన్ని చంద్ర బాబు ఆవిష్కరించాల్సి వుంది.  కానీ ర్యాలీ రాజధాని సెంటర్‌ నుండి ప్రారంభమై చర్చి సెంటర్‌కు చేరుకోగానే ఒక్కసారిగా ఒంగోలు ఏఎస్పీ ఆర్‌.జయలక్ష్మీ ఆధర్యంలోని పోలీసులు ర్యాలీకి ముందస్తు అనుమతి లేదంటూ అడ్డుకు న్నారు. ఈ చర్యకు తీవ్ర కోపోద్రీక్తులైన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పోలీ సులు డౌన్‌ డౌన్‌, పోలీసు జులుం నశిచాలని నినాదాలు చేస్తూ వారితో వాగ్వివాదానికి దిగారు. అనుకోని సంఘట ణతో కోపోద్రిక్తుడైన చంద్ర బాబు ఏంటి ర్యాలీకి అనుమ తినివ్వరా, మీ డిజీపితో మాట్లా డమంటావా అంటూ పోలీ సులపై ఆగ్రహం వ్యక్తంచేసారు. ఈ సంఘటణలతో చర్చిసెంటర్‌లో దాదాపు 20 నిమిషాలు ఉత్రిక్త వాతావర ణం నెలకొంది.
జరిగిన సంఘటణ యస్పీ లక్ష్మీనరసింహరాజుకు తెలియడంతో ఎట్టకేలకు ఆయన ఆదేశాల మేరకు ర్యాలీని పోలీసులు అనుమతించారు. అనంతరం సజావుగా సాగిన ర్యాలీలో చంద్రబాబు దారిపొడవునా ప్రజలతో, వ్యాపార వర్గాలవారితో, మహిళలతో వారి సమస్యలను గురించి అడిగి తెలుసుకొంటూ అంజయ్య రోడ్డులోని యన్‌.టి.ఆర్‌. విగ్రహాన్ని ఆవిష్కరించడంతో ర్యాలీని ముగించారు.

ఇద్దరు ఎంపీలు, 29 మంది ఎమ్మెల్యేల రాజీనామా – జగన్‌ మద్దతుదార్ల నిర్ణయం


సిబిఐ సోదాలతో వైఎస్‌ జగన్‌ ఉక్కిరి బిక్కిరవుతుండటంతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎదురు దాడికి దిగింది. కృష్ణా జిల్లా ఓదార్పు యాత్రలో ఉంటూనే జగన్‌ ఆస్త్రం సంధించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యూహం రూపొందించారు. సిబిఐ ఎఫ్‌ఐఆర్‌లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరును ప్రస్తావించడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ జగన్‌ గ్రూపు ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేయాలని నిర్ణయించారు. ఇద్దరు ఎంపీలతో పాటు, 29 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇద్దరు తెలుగుదేశం తిరుగుబాటు ఎమ్మెల్యేలతో పాటు, తెలంగాణా ఏర్పాటు కోసం రాజీనామాలు చేసిన ముగ్గురు ఎమ్మెల్యేల పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఎమ్మెల్యే పదవులతోపాటు కాంగ్రెసు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నారు. ఈ నిర్ణయం జరిగిన వెంటనే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు స్పీకర్‌, గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ కూడా తీసుకున్నారు. సోమవారం ఉదయం స్పీకర్‌ను, సాయంత్రం గవర్నర్‌ను కలవాలని నిర్ణయించుకున్నారు. రాజీనామా లేఖలు సమర్పించిన తరువాత బస్సు యాత్ర చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే, బస్సు యాత్ర ఎప్పటినుండి ప్రారంభించాలన్నది ఇంకా ఖరారు చేయలేదు. ఆదివారం రాష్ట్ర రాజధానిలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు చర్చనీయాంశమయ్యాయి. అయితే వీరి రాజీనామాలు ఆమోదించినా సర్కార్‌ మనుగడకు వెంటనే ముప్పు రాకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అయితే అనిశ్చితి పెరిగి ఇంకొంతమంది ఎమ్మెల్యేలు జగన్‌వైపు వెళ్తే ప్రభుత్వానికి ముప్పు ఏర్పడుతుంది. రాజీనామాల నిర్ణయం వెలువడిన వెంటనే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఈ దిశలోనే ప్రయత్నాలు ప్రారంభించారు. సిబిఐ ఎఫ్‌ఐఆర్‌లో వైఎస్‌ పేరును పేర్కొనడానికి నిరసనగా తమ బాటలోనే ప్రయాణించాలని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలపై వారు ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ మేరకు ఆ పార్టీ నాయకులు బహిరంగంగానే పిలుపునిచ్చారు. తమ పిలుపునకు సానుకూల స్పందన లభిస్తోందని, మరికొందరు ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేయడానికి ముందుకొచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ తెలిపారు. మరో నాయకుడు జూపూడి ప్రభాకర్‌రావు ఒక టివి ఛానల్‌లో మాట్లాడుతూ మరో 20 మంది ఎమ్మెల్యేలు సైతం రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారని, తొలిదశ తరువాత రెండు మూడు రోజుల్లో వారు కూడా రాజీనామాలు సమర్పిస్తారని అన్నారు. ఈ దిశలో కొందరితో ఇప్పటికే కొందరు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలతో చర్చల ప్రక్రియ కూడా ప్రారంభించినట్లు సమాచారం. మరో వైపు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బుజ్జగింపుల పర్వానికి శ్రీకారం చుట్టారు. సిఎం క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులతో పలు దఫాలు సమావేశమయ్యారు. జిల్లాల వారిగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను బుజ్జగించే బాధ్యత మంత్రులకు అప్పగించారు. ఈ సమావేశాల్లో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా పాల్గొన్నారు.
మూడు గంటల పాటు సమావేశం
అంతకుముందు జూబ్లిహిల్స్‌లోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు పలువురు ఇతర నాయకులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 11.30 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం సాయంత్రం 3.30 గంటల వరకు కొనసాగింది. రాజీనామాలు చేయాలన్న ప్రతిపాదన రెండు రోజుల క్రితమే వచ్చినప్పటికీ ఆ తరువాత చోటుచేసుకునే పరిణామాలపైనే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ సాగినట్లు తెలిసింది. సమావేశం నుండి కృష్ణా జిల్లా ఓదార్పు యాత్రలో ఉన్న జగన్‌తో ఒకటికి రెండు సార్లు ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. సమావేశం నుండే స్పీకర్‌ కార్యాలయానికి, గవర్నర్‌ కార్యాలయానికి ఫోన్లు చేసి అపాయింట్‌మెంట్లు ఖరారు చేసుకున్నారు. ఆ తరువాత రాజీనామాల నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు.
శాసనసభలో బలాబలాల తీరు
294 మంది సభ్యులున్న రాష్ట్ర శాసనసభలో సర్కారు మనుగడకు 148 మంది సభ్యుల మద్దతు అవసరమవుతుంది. ప్రస్తుత శాసనసభలో కాంగ్రెస్‌ పార్టీకి ప్రజారాజ్యంతో కలిసి 173 మంది సభ్యుల బలం ఉంది. తాజాగా రాజీనామా చేస్తామని ప్రకటించిన 29 మందిలో 27 మంది కాంగ్రెస్‌కు, పిఆర్పీకి చెందిన వారే! వీరి రాజీనామాలను ఆమోదిస్తే కాంగ్రెస్‌ బలం 146కు పరిమితమవుతుంది. అయితే, ఏడుగురు సభ్యులున్న ఎంఐఎం పార్టీ మద్దతు ఇప్పటివరకు కాంగ్రెస్‌కే లభిస్తోంది. వీరిని కూడా కలుపుకుంటే కాంగ్రెస్‌ సర్కారు ప్రభుత్వానికి వెంటనే ముప్పురాకపోవచ్చు. 12 మంది సభ్యులున్న టిఆర్‌ఎస్‌ కూడా శానససభలో కీలకపాత్ర పోషించనుంది. తెలుగుదేశం పార్టీకి ప్రస్తుత శాసనసభలో 86 మంది సభ్యులుండగా, వారిలో ఇద్దరు తాజాగా రాజీనామా చేస్తామని ప్రకటించారు. దీంతో ఆ పార్టీ బలం 84కు పరిమితం కానుంది. గతంలోనే నాగం జనార్ధనరెడ్డితో పాటు మరో ముగ్గురు టిడిపి సభ్యులు శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరికొందరు రాజీనామా నిర్ణయం తీసుకుంటే సర్కార్‌కు ముప్పు తప్పనిస్థితి ఏర్పడుతుంది.
కీలకం కానున్న స్పీకర్‌ నిర్ణయం!
29 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడానికి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ నిర్ణయం కీలకం కానుంది. తెలంగాణా ఏర్పాటు కోసం చేసిన రాజీనామాలను ఆయన ఇప్పటికే తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా రాజీనామాల విషయంలో ఆయన ఎలా స్పందిస్తారన్న విషయం ఆసక్తిదాయకంగా మారింది. ఆవేశంతో నిర్ణయం తీసుకున్నారంటూ ఆయన తెలంగాణా ప్రాంత ప్రజాప్రతినిధుల రాజీనామాలను తిరస్కరించారు. అదే సూత్రాన్ని తాజా నిర్ణయాలకు వర్తింపచేస్తారో లేదో చూడాలి. తనను కలిసిన విలేకరులతో స్పీకర్‌ ఆదివారం సాయంత్రం మాట్లాడుతూ రాజీనామా లేఖలు తనకు చేరిన తరువాత, వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
11 గంటలకు రాజీనామాలు
సోమవారం ఉదయం 11 గంటలకు తమ రాజీనామాలను స్పీకర్‌కు సమర్పించాలని జగన్‌ గ్రూపు ఎంఎల్‌ఏలు నిర్ణయించారు. ఉదయం తొమ్మిది గంటలకు జూబ్లిహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో సమావేశం కావాలని, అక్కడి నుండి పంజాగుట్టలో ఉన్న వైఎస్‌ఆర్‌ విగ్రహం వద్దకు వచ్చి నివాళులర్పించాలని వారు నిర్ణయించారు. వైఎస్‌ విగ్రహానికి నివాళులర్పించిన తరువాత బస్సులో అసెంబ్లీలోని స్పీకర్‌ కార్యాలయానికి చేరుకుంటారు.

బాబు రైతు బాట


క్రాప్‌హాలిడేతో సమస్యల్లో కూరుకుపోయిన రైతాంగాన్ని ఆదుకుని, వారి సమస్యలను జాతీయ స్థాయిలో చర్చనీయాంశం చేసి, పరిష్కార మార్గం అన్వేషించేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరో సారి రైతుబాట పట్టనున్నారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు పలు జిల్లాలకు విస్తరిస్తున్న క్రాప్‌ హాలిడేను ఆయుధంగా మలిచి సర్కారుపై సమర శంఖం పూరిస్తున్నారు. రాష్ట్ర రైతాంగ సమస్యలను కేంద్రానికి, దేశ ప్రజలకు వివరించేందుకు జాతీయ పార్టీ నాయకులను రాష్ట్రానికి తీసుకురానున్నారు. ఫలితంగా కాంగ్రెస్‌పై రాష్ట్రం-కేంద్ర స్థాయిలో ఒత్తిడి పెంచనున్నారు.
రెండు రోజులుగా ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యట ిస్తున్న బాబు, రైతుల దైన్య స్థితిని నేరుగా తెలుసుకు న్నారు. క్రాప్‌ హాలిడేపై రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను జాతీ య స్థాయిలో ఎలుగెత్తి చాటేందుకు తనకు సహకరించా లని ఆయన ఇటీవలి తన ఢిల్లీ పర్యటన సందర్భంలో జాతీయ నేతలు ప్రకాశ్‌ కరత్‌, దేవెగౌడ, అజిత్‌ సింగ్‌, సురవరం సుధాకరరెడ్డితో పాటు ఎఐఎడిఎంకే, ఆర్‌ఎస్‌పీ, ఫార్వర్డ్‌ బ్లాక్‌ లాంటి పార్టీల నేతలను కలసి అభ్యర్థించగా, వారంతా చంద్రబాబుకు మద్దతు తెలిపారు. దానితో ఈ నెల 22, 23వ తేదీల్లో వారంతా గోదావరి జిల్లాలకు వచ్చి, రైతు సమస్యలను స్వయంగా తెలుసుకుని, వాటిని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లనున్నారు.ఆ తర్వాత ఢిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా చేయాల ని నిర్ణయించారు. ఆ తర్వాత పార్లమెంటులో ఈ పార్టీలన్నీ రాష్ట్ర రైతు సమస్యలను ప్రస్తావించి, సభను స్తంభింప చేయాలని భావిస్తున్నారు.

free website analytics