విజయనగరం

రాష్ట్రంలో భానుడు ఉగ్రరూపం దాల్చాడు. రాష్ట్రం నిప్పుల కొలిమిగా మారింది. ప్రచండబానుడిదాటికి ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడదెబ్బతో 10మంది మృతిచెందారు. ఉదయం ఏడు గంటలనుంచే వేసవి ప్రతాపం చూపుతోంది. ఇళ్లలో విద్యుత్ వాడకం కూడా భారీగా పెరుగుతోంది. పలు జిల్లాల్లో విద్యుత్ కోతలు కూడా మళ్లీ మొదలయ్యాయి. బుధవారం హైదరాబాద్‌లోనూ అనధికారికంగా 3 గంటల విద్యుత్ కోత విధించారు. రాష్టవ్య్రాప్తంగా బుధవారం ఉష్ణోగ్రతలు తీవ్రరూపం దాల్చాయి. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు. ఈ సమయంలో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటాయి.
తెలంగాణతోపాటు రాయలసీమ జిల్లాల్లోనూ 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో సాధారణం కంటే 3 డిగ్రీలు, కోస్తోంధ్ర, రాయలసీమలో 1 నుంచి 3 డిగ్రీలు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదువుతన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం రెంటచింతలలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వ్యవసా య రంగానికి ప్రాణధారమైన నైరుతి రుతుపవనాలు జూన్ 1 కల్లా కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ విభాగం ప్రకటించిన విషయం తెలిసిందే. రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకేవరకు ఇదే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంటుందని అధికారులు చెబుతున్నారు. ఈసారి సాధారణ తేదీ కన్నా కొంత ఆలస్యంగా దక్షిణ అండమాన్ సముద్రంలో రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు.

పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణను వివాదాలు వెన్నాడుతూనే ఉన్నాయి. ఒకదానివెంట మరొకటి శరపరంపరగా వస్తున్న ఆరోపణలతో సత్తిబాబు ఉక్కి రిబిక్కిరి అవుతున్నారు. కొద్దికాలం కిందట ఇసుక మాఫియాతో సంబంధాలున్నాయని, అందులోనూ బినామీ వ్యాపారం ఉందన్న ఆరోపణకు గురయిన బొత్సను.. మద్యం సిండికేట్ల వ్యాపారంలో బినామీలున్నారంటూ వస్తున్న ఆరోపణలు ఇప్ప టికీ వెన్నాడుతూనే ఉన్నాయి. ఆ ఆరోపణల వేడి చల్లారకముందే మళ్లీ సినిమాల్లో బినామీ వ్యాపారం విమర్శ తెరపైకి రావ డం, అందులో భానుకిరణ్ పేరు కూడా విని పించడం సత్తిబాబును రాజకీయంగా అప్రతిష్ఠ పాలుచేసేలా మారింది. బండ్ల గణేష్ అనే ఒక సాధారణ సినిమా ఆర్టిస్టు, కోట్లాదిరూపాయ లతో సినిమాలు తీస్తుండటం వెనుక బొత్స పెట్టుబడి ఉందంటూ టీడీపీ తాజాగా పేల్చిన బాంబు, సత్తిబాబును రాజకీయంగా ఇరుకున పెట్టింది. అయితే.. వాటిని ఖండించకపోగా గణష్‌తో సంబంధాలు ఉండటం నేరమా అని బొత్స ఎదురు ప్రశ్నించడం ప్రస్తావనార్హం.
ఇప్పటికే మద్యం సిండికేట్లలో ‘తెల్ల’ దొరల పేరిట బినామీ వ్యాపారాలు సాగిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బొత్స మళ్లీ మరో వివాదంలో ఇరుక్కున్నారు. బినామీల ద్వారా బొత్స సంపాదించిన డబ్బును సినిమాల్లో పెటుబడుల రూపంలో మారుస్తున్నారని, అందుకోసం గణేష్ అనే ఒక సాధారణ సినిమా నటుడిని భారీ సినిమాల నిర్మాతగా మార్చారన్న ఆరోపణలు తెరపైకి రావడం, బొత్స పేరు చెప్పి గణేష్ సినీ వర్గాలను బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు అందటం బొత్సను రాజకీయంగా ఇరుకునపెట్టినట్టయింది. ఒకప్పుడు సాధారణ వేషాలు వేసిన బండ్ల గణేష్ అనే నటుడిని.. బొత్స తాను అక్రమ మార్గాల్లో సంపాదించిన డబ్బుతో నిర్మాతగా మార్చారని, బొత్స బినామీగా ఉన్న గణేష్ పెద్ద నిర్మాతలు కూడా తీయలేని భారీ సినిమాలు తీస్తున్నారని టీడీపీ తాజాగా ఎక్కుపెట్టిన ఆరోపణాస్త్రం ఎన్నికల సమయంలో బొత్సను సంకట పరిస్థితికి నెట్టినట్టయింది. దానితో పార్టీ ఇమేజీకి డామేజీ తగిలినట్టయింది. ఎంతోమంది పెద్ద నిర్మాతలు చేతులు కాల్చుకుని సినిమాలు తీసే ధైర్యం లేక దూరంగా ఉంటుంటే, కోట్లు నష్టాలు వస్తున్నా గణేష్ మళ్లీ పెద్ద తారలతో ఎలా సినిమాలు తీయగలుగుతున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య నిలదీశారు.
విజయనగరం జిల్లాలో తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడును అడ్డుకున్న పీసీసీ చీఫ్ బొత్సపై ఎదురుదాడి చేసేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తున్న తెలుగుదేశం పార్టీకి, సినిమా నిర్మాత బండ్ల గణేష్‌తో బొత్సకు ఉన్న లింకులు బ్రహ్మాస్త్రంలా అక్కరకొచ్చాయి. ఆ మేరకు ‘తీన్‌మార్’ సినిమా ఫంక్షన్‌లో గణేష్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ గుర్తు చేసి, బొత్సను ఇరుకునపెట్టింది. ‘నేను మర్డర్ చేసినా బొత్స నన్ను రక్షిస్తారు. బొత్స నన్ను ప్రోత్సహించారు. అన్నా.. అనుక్షణం నేను నీ వెంట ఉంటా. నీ ఇష్టం వచ్చింది చెయ్యి’ అని బొత్స సమక్షంలో గణేష్ చేసిన వ్యాఖ్యల సీడీని రామయ్య మీడియాకు విడుదల చేయడంతో బొత్స పరిస్థితి ఇరుకున పడినట్టయింది.
దీనికి తగినట్లుగానే.. గణేష్ వల్ల తాము నష్టపోయామంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం వెనుక బొత్స ఒత్తిళ్లు ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సుబ్బారావు అనే సినీ డిస్ట్రిబ్యూటర్‌కు గణేష్ డబ్బులు ఎగ్గొట్టాడని, బొత్స పేరు చెప్పి తనను బెదిరిస్తూ డబ్బులు ఇవ్వడం లేదని సుబ్బారావు ఈనెల 5న పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఇంతవరకూ ఎలాంటి చర్య తీసుకోకపోవడం ఈ ఆరోపణలకు బలం చేకూరుతోంది. భాను పేరు చెప్పి గణేష్ కోట్లాది రూపాయలు కాజేశాడని, తీన్‌మార్ సినిమా ఓవర్సీస్ హక్కులను 2 కోట్లకు గణేష్ నుంచి కొన్నామని, అయితే అగ్రిమెంట్, సినిమా ప్రింట్స్ ఇవ్వకుండా మోసం చేశారని, తమ డబ్బు వాపసు కోరితే బొత్స, భాను కిరణ్ పేరిట బెదిరిస్తున్నారని, ఇంకోసారి డబ్బుల కోసం వస్తే చంపేస్తామని హెచ్చరించారంటూ క్రౌన్ మూవీస్ డిస్ట్రిబ్యూటర్లు సుబ్బారావు, మధుసూదనరావు శనివారం హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు.
అయితే బొత్స అధికారపార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండటం వల్ల పోలీసులు చర్యలు తీసుకునేందుకు భయపడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మహబూబ్‌నగర్‌లోని బూరుగుపల్లిలో గిరిజనులకు చెందిన 2,700 వేల ఎకరాల అసైన్డ్ స్థలంలో కృష్ణవంశీకి 50 ఎకరాలు, ఇతర సినీ ప్రమఖు లతో పాటు ప్రముఖులకూ అమ్మి మోసం చేశారని, దీనిపై కృష్ణవంశీ నిలదీస్తే బొత్స, భాను పేరు చెప్పి బెదిరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అటు సుబ్బారావుతో పాటు ఇటు వర్ల రామయ్య కూడా ఇప్పుడు ఈ వ్యవహారాన్ని తెరపైకి తీసుకు వస్తుండటం బొత్సకు రాజకీయంగా ఇబ్బందికరంగా మారింది.
‘తీన్‌మార్ సినిమాకు 9 కోట్లు నష్టం వచ్చింది. 48 కోట్లతో గబ్బర్ సింగ్ తీస్తున్నారు.
గతంలో 22 కోట్లతో ఆంజనేయులు సినిమా తీశారు. ఒక సాధారణ నటుడు అశ్వనీదత్, రామానాయుడు వంటి బడా నిర్మాతలు కూడా నిర్మిం చలేని సినిమాలు ఎలా నిర్మిస్తారు? ఇది కచ్చితంగా బొత్స బినామీ సొమ్మే’నని టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్యతో పాటు, తాజాగా గణేష్ బాధితులూ ప్రశ్నిస్తున్నారు. అయితే… వీటిని ఖండిస్తారని భావించిన బొత్స, తనకు గణేష్‌తో సంబంధం ఉంటే తప్పేమిటని, అతను సంఘవిద్రోహశక్తా అని ఎదురు ప్రశ్నించడం మరిన్ని అనుమానాలకు, విపక్షాల ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. అటు గణేష్ కూడా తాను బొత్స బినామీ కాదని, కాకపోతే తనకు ఆయన అన్న అని స్పష్టం చేశారు. తాజా పరిణామాలతో బొత్స రాజకీయంగా మరోసారి చిక్కుల్లో పడినట్టయింది. ఉప ఎన్నికల సమయంలో ఇలాంటి వ్యవహారం వెలుగుచూడటం ప్రతిపక్షాలకు అనవసరంగా తామే అస్త్రాలు ఇచ్చినట్టయిందని కాంగ్రెస్ సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పదోపీఆర్పీ వెంటనే చేయాలి
హైదరాబాద్, మేజర్‌న్యూస్ : ప్రభుత్వోద్యోగుల జీతభత్యాలకు సంబంధించిన నూతన (పదవ) వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని సచివాలయ ఉద్యోగుల సమన్వయ కమిటీ ప్రభుత్వాన్ని డిమండ్ చేసింది. ఈ మేరకు సచివాలయ ఉద్యోగుల సమన్వయ కమిటీ నేతలు సోమవారంనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి వినతిపత్రం అందజేశారు. వేతన సవరణ సంఘం నిర్ణయాల అమలుపై వేసిన కమిటీనే పదవ వేతన సవరణ సంఘంగా మార్పు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరినట్లు సమన్వయ కమిటీ ఛైర్మన్, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు హన్మంత రెడ్డి పేర్కొన్నారు.

ఒకేరోజు ఏడుగురిని హత్య చేసి నరహంతకునిగా మారిన మాజీ సైనికోద్యోగి మెట్ట శంకర్రావుకు సోమవారం శ్రీకాకుళం అదనపు సెషన్సు కోర్టు న్యాయమూర్తి కెవి రమణాజీ ఉరి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. 2010 డిసెంబర్ 1న జిల్లాలోని జలుమూరు మండలం నగరికటకం పంచాయతీ మెట్టపేట గ్రామానికి చెందిన మాజీ సైనికోద్యోగి శంకర్రావు, పేగుబంధమని కూడా చూడకుండా తొమ్మిదేళ్ళ కుమార్తె మానస, ఆరేళ్ళ కుమారుడు దివాకర్‌లను అతికిరాతకంగా తలలు నరికి హతమార్చాడు. పిల్లల తలలను శ్రీముఖలింగం క్షేత్రానికి స్వాగత ఆలయమైన సోమేశ్వర ఆలయ గర్భగుడిలో భద్రపరిచాడు. అక్కడనుంచి స్వగ్రామమైన మెట్టపేట చేరుకుని పైల లక్ష్మణరావు (55), వెంకట్రావు (50), మెట్ట ఎర్రయ్య (70), ఊట పార్వతి (60), బొడ్డేపల్లి దమయంతి (55)లను అతిదారుణంగా హత్య చేసి గ్రామంలో భయబ్రాంతులు సృష్టించాడు. అంతేకాకుండా పలు ఇళ్ళపై బాంబులతో దాడి చేసి మారణాయుధాలతో నరరూప రాక్షసుడిగా వీరంగం చేశాడు. గతంలో భార్య కూన విజయలక్ష్మి కూడా శంకర్రావు వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. అప్పట్లో బంధువుల ఫిర్యాదు మేరకు శంకర్రావుకు ఐదేళ్ళు జైలు శిక్ష పడింది. విడుదలైన తరువాత గ్రామానికి చెందిన కొంతమంది వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారన్న అక్కసుతో ఒకేరోజు ఐదుగురిని హతమార్చాడు. ఈ ఘటన ప్రజలనే కాకుండా పోలీసులనూ భయభ్రాంతులకు గురిచేసింది. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు డిఐజి సౌమ్యమిశ్రా, అప్పటి ఎస్పీతోపాటు పలువురు పోలీసు ఉన్నతాధికార్లు మెట్టపేటను సందర్శించి బాధిత కుటుంబాల్లో ఆత్మస్థయిర్యాన్ని నింపేందుకు కృషి చేశారు. ఈ విషయాన్ని నగరికటకం వీఆర్వో జలుమూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసును దర్యాప్తుచేసి కోర్టులో దాఖలు చేశారు. కేసు విచారించిన న్యాయమూర్తి బాంబులు వేసి భయభ్రాంతులకు గురిచేసిన నేరానికి పదేళ్ళు, హత్య చేస్తానని బెదిరించిన నేరానికి అయిదేళ్ళు జైలుశిక్ష, క్రూరంగా, పాశవికంగా, భయానకంగా ఇద్దరు పిల్లలు సహా ఏడుగురిని హత్య చేసిన నేరానికి హత్య కేసుల్లోనే అత్యంత హేయమైన హత్య పేర్కొంటూ ఉరిశిక్ష విధిస్తూ సోమవారం తీర్పు చెప్పారు.

ఎంత ఎదిగినా ఒదిగి ఉన్న వారే ఎక్కడయినా రాణిస్తారు. అది రాజకీయాలు కావచ్చు. మరొక రంగం కావచ్చు. ఒకనాటి కారు డ్రైవర్లు నేడు మంత్రులు, ఎంపీల వుతున్నారు. ఒకప్పటి ఆఫీసుబాయ్‌లు కూడా ఎమ్మెల్యే లయ్యారు. రైసుమిల్లుల్లో గుమాస్తాలు కూడా ఎమ్మెల్యే లుగా పనిచేశారు. నాడు పీఏలుగా ఉన్న వాళ్లు నేడు ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. అప్పటి పంచాయితీ స్థాయిలో చోటా మోటా కాంట్రాక్టర్లు నేడు బడా కాంట్రా క్టర్లు, మంత్రులు, పీసీసీ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు.
వైఎస్ రెండుసార్లు సీఎం అయినా, అధిష్ఠానాన్నే శాసించే స్థాయికి ఎదిగినా, చనిపోయేంతవరకూ ఒదిగే ఉండేవారు. అలాంటి వారు నైతికంగా కూడా చిరస్థాయిగా నిలిచి పోతారు. అయితే, స్థాయి పెరిగిన వెంటనే తమ మూలాలు మరిచిపోవడం, ఇతరుల స్థాయిని నిందించే నేత ల వెలుగు జిలుగులు కొద్దికాలమేనని, పదవులు పోయిన తర్వాత వారిని ఎవరూ పట్టించుకోరని చరిత్ర చెబుతోంది. నోటి దురుసు ఉన్న నాయకుల హవా తాత్కాలికమేనని ఎంతో మంది విషయంలో రుజువయింది. ఇటీవలి కాలంలో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ మీడియాపై తెగ అస హనం చెందుతున్నారు. తన రాజకీయ గురవయిన పెన్మత్స సాంబశివరాజు కరుణా కటాక్షాలతో పంచాయితీ కాం ట్రాక్టరు నుంచి పీసీసీ అధ్యక్షుడి వరకూ ఎదిగిన సత్తిబాబు ఇప్పుడు మీడియా స్థాయినే ప్రశ్నించేంతగా ఎదిగారు. కొద్దిరోజుల నుంచి మీడియా పట్ల సత్తిబాబు వ్యవహారశైలి విచిత్రంగా కనిపిస్తోంది. ప్రధానంగా ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత మీడియాపై చిరాకు పడుతున్నారు.
తెలంగాణ నేత కు పీసీసీ పగ్గాలివ్వాలని దామోదర్‌రెడ్డి ఢిల్లీలో చేసిన లాబీ యింగ్ సత్తిబాబును అభద్రతకు గురిచేస్తోందంటు న్నారు. పత్రికల స్థాయిని, సంఖ్యను తూకమేసి కొలిచే పనిలో ఉన్నారు. వాటి స్థాయి, సంఖ్యను బాహాటంగానే వ్యాఖ్యాని స్తున్నారు. మీకు ఎన్ని కాపీలు? ఎన్ని ఎడిషన్లు? మీ చానల్‌ను ఎంతమంది చూస్తున్నారు? అని తూకం వేసే బాధ్యత తీసుకున్నారు. ‘మీకు ఎన్ని కాపీలున్నాయో తెలుసు. మీరు రాసే స్టోరీలను టీవీ వాళ్లు స్టోరీలుగా మార్చుకుంటారు. మీరు రాసిన వార్తలను కొందరు గిట్టనివాళ్లు ట్రాన్స్‌లేషన్ చేసి ఢిల్లీకి పంపిస్తారు. అంతేకదా’ అని మీడియాపై చిర్రుబుర్రులాడుతున్నారు. తన గురించి రాస్తే ఇక మీతో మాట్లాడేది లేదని, చనువుగా ఉంటున్నానని ఇష్టం వచ్చి రాసేస్తున్నారని ఢిల్లీ నుంచి గల్లీ వరకూ మీడియాపై రుసరుసలాడుతున్నారు.
తాజాగా మూడురోజులు ఢిల్లీలో గడిపిన సత్తిబాబు హైదరాబాద్‌కు వచ్చి అసెంబ్లీలో కాలుపెట్టినా సభలోకి మాత్రం వెళ్లకుండా లాబీల్లోనే తచ్చాడారు. మీడియాను పిలిపించుకుని చిట్‌చాట్‌తో కాలక్షేపం చేశారు. తనను ఆజాద్ ఉండమని చెప్పినా మళ్లీ వస్తానని ఫోన్ చేసినట్లు చెప్పుకున్నారు. మద్యం సిండికేట్లపై చర్చ జరుగుతున్న సమయంలో కూడా అది ప్రజల కోసం జరుగుతున్న చర్చ కాదని చెప్పి లోపలికి పోకుండా లాబీల్లోనే కాలక్షేపం చేశారు. తాజాగా సభలో జరుగుతున్న చర్చ సమయంలో పైకి లేచి మాట్లాడేందుకు ప్రయత్నించగా, మైక్‌ను స్పీకర్ కట్ చేయడంతో పాపం సత్తిబాబు బిత్తరపోయారు. మొన్నటి వరకూ చిట్‌చాట్‌లో సీఎం మీద, ఆయన అనుసరిస్తోన్న విధానాల మీద కామెంట్లు చేసిన సత్తిబాబు, గత కొద్దిరోజుల నుంచి ఎందుకో మౌనవ్రతం పాటిస్తున్నారు. పైగా తన వద్దకు వచ్చిన మీడియాను ఎందుకు వచ్చారు? ఎవరు రమ్మనమన్నారంటూ చిరాకు ప్రదర్శిస్తున్నారు. అయితే, మీడియాపైనా, మీడియా ప్రతినిధులపైనా సత్తిబాబు విమర్శలు కురిపిస్తూ, జర్నలిస్టులను అవమా నిస్తున్నా కనీసం దానిని ప్రశ్నించే సాహసం కూడా చేయకపోగా, గాంధీభవన్‌లోని ఇద్దరు, ముగ్గురు మీడియా ఆస్థాన విద్వాంసులు మాత్రం అవన్నీ తమను కాదన్నట్లు వ్యవహరిస్తుండటం విమర్శలకు దారితీస్తోంది. ఇలాంటి భజనపరులు, ఆత్మాభిమానం లేని వారి వల్లే జర్నలిస్టులకు నేతల వద్ద విలువ లేకుండా పోయిందని మీడియా వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

ముఖ్యమంత్రి ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డితో ప్రతిపక్షనేత చంద్రబాబు మిలాఖత్ అయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలకు బలంచేకూర్చేలా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. సమాచార కమిషనర్ల ఎంపిక విషయంలో ముఖ్యమంత్రితో ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు లాలుచీ పడ్డారని పీసీసీ అధ్యక్షుడు, మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వంతో ఆయన లాలూచీ పడటంవల్లే ఎంపిక ప్రక్రియ ఏకగ్రీవంగా, సజావుగా జరిగిందని వ్యాఖ్యనించారు. అసెంబ్లీ లాబీలో తనకు తారసపడ్డ మీడియా ప్రతినిధులతో బొత్స ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ ఆ తరువాత సీఎల్‌పీలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను అలా అనలేదన్నారు.
తమ ప్రభుత్వం చట్టబద్దమైన ప్రక్రియలో సమాచార కమిషనర్ల ఎంపికను చేపట్టింది కాబట్టే చంద్రబాబు అందుకు సహకరించారని స్పష్టంచేశారు. సహకరించారు అంటే కుమ్మక్కయ్యారనే కదా అని అడగ్గా మీరు అలా అర్థంచేసుకోంటే తానేమీ చెప్పలేనని, అలాగే భావించుకోండి అని పేర్కొన్నారు. పిసిసి పదవి ఇవ్వడం ద్వారా తెలంగాణాకు న్యాయం జరుగుతుందంటే తప్పుకోవడానికి తాను రెఢీ అని బొత్స సత్యనారాయణ ఓ ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. రెండు రోజులు సభను టీడీపీ వృధా చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. సభలో బాబు తీరు ఛ..ఛ.. దురదృష్టకరం అని పేర్కొన్నారు. ఇక నుంచైనా సభ సజావుగా సాగి ప్రజాసమస్యలు చర్చకు వచ్చేలా సహకరించాలని చంద్రబాబును బొత్స కోరారు. మద్యం సిండికేట్లపై టీడీపీ వాయిదా తీర్మానం కింద చర్చకోరడంలో తప్పేలేదని కానీ కోరుతున్న తీరే బాగోలేదన్నారు.
మంత్రులపై వారి బందువులపై వస్తున్న ఆరోపణలపై చర్చించాలని తీర్మానంలో టీడీపీ డిమాండ్ చేయడం దురదృష్టకరమన్నారు. యాత్రలు చేసే సమయంలో రైతులకు, చేనేత కార్మికులకు, జూనియర్ డాక్టర్లకు హామీ ఇస్తూ మీ సమస్యలు శాసనసభలో ప్రస్తావించి పరిష్కరిస్తామని చెప్పిన బాబు అందుకు భిన్నంగా సభలో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజలు, రైతులు, కార్మికులు, చేనేత వర్గాల వారిపై ఆయనకు ఉన్న ప్రేమ, చిత్తశుద్ధి ఏమిటో అర్థమైపోతోందన్నారు. బాబు లాంటి ప్రతిపక్షనేత ఉండటం దురదృష్టకరమని తాను చేసిన వ్యాఖ్యలపై తొలుత కొంత చింతించానని తెలిపారు. కానీ ఆయన తీరు చూశాకే అలా వ్యాఖ్యనించి ఉండకపోతేనే తప్పుచేసినట్లుగా అవుతుందన్న అభిప్రాయానికి వచ్చానని పేర్కొన్నారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలనుంచి బయటపడి అప్పుడు ఇతరుల అవినీతిపై మాట్లాడినా బాగుంటుందని బాబుకు సూచించారు.
మద్యం సిండికేట్ వ్యవహారంపై బాబు ప్రజలకు బహిరంగ లేఖ రాయడం తగుదునమ్మ అన్నట్లు ఉందన్నారు. 2009లో కూడా బాబు ఇలాగే లేఖ రాశారని, కానీ ప్రజలకు మాత్రం ఆయనకు విశ్రాంతి తీసుకోవాలి అన్నట్లు తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని వాటిపై మాట్లాడకుండా కేవలం మద్యం సిండికేట్ వ్యవహారంపైనే మాట్లాడటం అసహ్యమేస్తోందన్నారు. సమ్మె విరమించేందుకు సిద్దమవుతున్న జూనియర్ డాక్టర్లు ప్రతిపక్షాల మోసాన్ని ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారని, ఈ విషయాన్ని వారు అంగీకరించడం కూడా జరిగిందని చెప్పారు. మద్యం వ్యాపారంలో తమ సన్నిహితులు, బందువులు, కుటుంబ సభ్యులు మొత్తంగా 30 నుంచి 31 శాతం వరకు మాత్రమే ఉన్నారని, వారు చట్టబద్దంగానే వ్యాపారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
సిండికేట్ వ్యాపారంతో సంబంధం ఉన్న తన టీడీపీ ఎమ్మెల్యేపై చర్య తీసుకొనే ధైర్యంలేని చంద్రబాబు ఇతరుల గురించి మాట్లాడటం వింతగా ఉందన్నారు. వారికైతే ఒక చట్టం మాకైతే ఒక చట్టమా అని ప్రశ్నించారు. మంత్రి మోపిదేనిపై వచ్చిన ఆరోపణల గురించి ప్రస్తావించగా ముద్దాయి చెప్పిన సాక్ష్యం నిజం ఎలా అవుతుందన్నారు. నివేదికను తాము బయటపెట్టాల్సిన అవసరంలేదని, సమాచార హక్కుచట్టం కింద ఎవరైనా పొందవచ్చు అన్న బొత్స టీడీపీకి అవసరమైతే మాత్రం సింటికేట్ వ్యాపారుల జాబితాను తాము పంపిస్తామని పేర్కొన్నారు. మద్యం విషయంలో కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పేర్కొన వాటికి కట్టుబడి ఉందన్నారు. ప్రస్తుత మద్యం విధానం లోపభూయిష్టంగా ఉందని, అయితే విధానపర నిర్ణయాలలో కాంగ్రెస్ పార్టీ జోక్యం ఉండబోదన్నారు.

పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఆయన సతీమణి పార్లమెంట్ సభ్యురాలు బొత్స ఝాన్సీ సోమవారంనాడు ప్రధానిని మన్మోహన్‌సింగ్‌ను కలిశారు. బొత్స సత్యనారాయణ పిసిసి అధ్యక్షుడైన తర్వాత ప్రధానిని కలవటం ఇదే తొలిసారి. ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో కలిసి ముచ్చటించిన అనంతరం బయటికి వచ్చిన బొత్స తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ తాము ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిశాం తప్ప రాజకీయ ప్రాధాన్యత ఏదీలేదని చెప్పారు.
రాష్ట్రానికి సంబంధించి పలు సమస్యలు ప్రధానికి వివరించానని, ప్రాణహిత ..చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని, మూరుమూల గ్రామాలకు లింక్‌రోడ్ల నిర్మాణానికి మరిన్ని నిధులు కేటాయించాలని, జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకానికి నిధులు పెంచి, కూలీలకు ఇచ్చే వేతనం పెంచి పథకాన్ని మరింత పకడ్బందీగా అమలుచేయాలని ప్రధానిని కోరినట్లు బొత్స చెప్పారు. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో తలపెట్టిన అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుపై అవసరమైన జాగ్రత్త చర్యలు తీసుకోవలసిందిగా విజ్ఞప్తిచేసినట్లు బొత్స సత్యనారాయణ చెప్పారు.
కాగా, ప్రధానిని కలిసిన సందర్భంలో రాజకీయాల ప్రస్తావన రాలేదని బొత్స సత్యనారాయణ చెప్తున్నప్పటికీ రాష్ట్రంలో జరగనున్న ఉప ఎన్నికలు, ముఖ్యమంత్రి వ్యవహారశైలి, పార్టీ పరిస్థితి, ముమ్మరంగా సాగుతున్న సిబిఐ దాడులు, దర్యాప్తు తదితర అంశాలపై ప్రధానికి బొత్స సత్యనారాయణ వివరించారని తెలుస్తోంది.

డీఎస్స-12 నోటిఫికేషన్ విడుదల
మే 2,3,4 తేదీల్లో రాత పరీక్షలు
అప్రెంటీస్ విధానం రద్దు
‘ఇంటర్’ నిబంధన తొలగింపు
‘ఓపెన్ డిగ్రీ’ వారికీ అర్హత
ఎస్ఏ పోస్టులకు సబ్జెక్టు నిబంధనల సడలింపు
80 మార్కులకే డీఎస్సీ
20 మార్కులకు టెట్ వెయిటేజి
మరో 7100 పోస్టులకు రెండు రోజుల్లో నోటిఫికేషన్
హైదరాబాద్, జనవరి 30 : లక్షలాది మంది ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త. కొద్ది రో జులుగా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న ‘డీఎస్సీ -2012 నోటిఫికేషన్’ సో మవారం విడుదలైంది. మొత్తం 21,343 ఉపాధ్యాయ ఉద్యోగాలను ఇందులో నోటిఫై చేశారు. ఉపాధ్యాయ అభ్యర్థులు దశాబ్దకాలంగా చేస్తోన్న ‘అప్రెంటిస్’ రద్దు డిమాండ్ కూడా నెరవేరుతోంది. వివాదాస్పదంగా మారిన ‘ఇంటర్‌లో సంబంధిత సబ్జెక్టులు తప్పనిసరి’ అనే నిబంధనను తొలగించారు.
నోటిఫై చేసిన మొత్తం పోస్టుల్లో.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 5,703, ఎస్జీటీ పోస్టులు 11, 602 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్లు 2000, పీఈటీలు 365, మునిసిపల్ పాఠశాలల్లో 1,673 పోస్టులు ఉన్నాయి. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 17వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. సచివాలయంలో సోమవారం సాయంత్రం 3 గంటలకు మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కె.పార్థసారథి ఈ డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. డీఎస్సీకి విద్యార్హతల నిబంధనల్లో కొన్నింటిని సడలించారు.
స్కూల్ అసిస్టెంట్స్ (మేథ్స్, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్) పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్ స్థాయిలో కూడా మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, హిస్టరీ, జాగ్రఫీ సబ్జెక్టులు చదివి ఉండాలన్న నిబంధనలను తొలగించారు. అంటే.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్ చదివి ఉండాలన్న నిబంధన లేదు.
ఫలితంగా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా నేరుగా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు కూడా అర్హత లభిస్తుంది. స్కూల్ అసిస్టెంట్స్ (జీవశాస్త్రం) పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు జీ.వో.నెం.4లో పేర్కొన్న సబ్జెక్టులతో పాటు సెరికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, పౌల్ట్రీ సబ్జెక్టుల అభ్యర్థులకు కూడా అర్హత కల్పించారు. టీచర్లకు అప్రెంటిస్ విధానాన్ని ఈ డీఎస్సీ నుంచి రద్దు చేశారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు నమూనా, యూజర్ గైడ్ కోసం జ్ట్టిఞ://్చఞఛీటఛి.ఛిజజ.జౌఠి.జీn వెబ్‌సైట్‌ను చూసుకోవాలి.
డీఎస్సీ 80 మార్కులకే..
టెట్‌కు వెయిటేజీ ఇవ్వనున్న కారణంగా 80 మార్కులకే డీఎస్సీ పరీక్షను నిర్వహించనున్నారు. మిగతా 20 మార్కులకు టెట్ మార్కులను వెయిటేజీగా జమ చేస్తారు. ఒక్కో ప్రశ్నకు అర మార్కు చొప్పున 80 మార్కులకు 160 డీఎస్సీ పరీక్ష ఉంటుంది. ఎస్జీటీ పరీక్షలో జనరల్ నాలెడ్జ్‌కు 10 మార్కులు, పర్‌స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 10, ఇంగ్లీష్ 9, ఇండియన్ లాంగ్వేజ్ 9, మాథ్స్ 9, సైన్స్ 9, సోషల్ స్టడీస్ 9, టీచింగ్ మెథడ్ 15 మార్కులు ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్ పరీక్ష ల్లో.. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10, పర్‌స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 10, సబ్జెక్ట్ కంటెం ట్ 44, టీచింగ్ మెథడాలజీ 16 మార్కులు ఉంటాయి. పీ ఈటీలకు టెట్ ఉండకపోవ డం వల్ల పూర్తిగా 100 మా ర్కులకు పరీక్ష ఉంటుంది.
రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల్లో ‘తానే’ సైక్లోన్ రానున్నందని, విపత్తులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని పంకజ్ ద్వివేది జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం రాజధాని నుంచి ప్రకృతి వైపరీత్యాలు అనే అంశంపై జిల్లా కలెక్టర్లతో ఆయన అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ రాబోయే మూడు రోజుల్లో తానే సైక్లోన్ రాష్ట్రంలో తీవ్ర ప్రభావం చూపే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపిందన్నారు. దీనివల్ల తీవ్రంగా వర్షాలు పడే అవకాశముందని, వర్షాల వల్ల ఏరకమైన ప్రాణనష్టం, ఆస్తి నష్టం వాటిల్లకుండా తగినవిధంగా జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు.
వర్ష ప్రభావిత జిల్లాలో షెల్టర్లను, కంట్రోల్ రూములను ఏర్పాటు చేయాలని తెలిపారు. అధిక వర్షాల వల్ల రోడ్లు, బ్రిడ్జిలు దెబ్బతినే అవకాశముం దని, అలాంటి వాటిని ముందస్తుగా గుర్తించి చర్యలు చేపట్టాలన్నారు. అలాగే విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని, కావున పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బి, ట్రాన్స్‌కో తదితర శాఖల అధికారులను అప్రమత్తంగా ఉండేలా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేయాలన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. అనంతరం జిల్లాలవారీగా సైక్లోన్‌కు గురయ్యే ప్రాంతాల వివరాలు, అక్కడ అధికారులు చేపట్టబోయే ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూము ఏర్పాటు చేశాం ః కలెక్టర్
తానే సైక్లోన్ నిమిత్తం ముఖ్య కార్యదర్శి ఆదేశాల మేరకు ఇప్పటికే కలెక్టరేట్‌లో కంట్రోల్ రూము ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ దుర్గాదాస్ వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్య కార్యదర్శికి వివరించారు. ముఖ్యంగా చిత్తూరు సరిహద్దు గ్రామాలు, తాడిపత్రి నియోజకవర్గం లోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే దీనిప్రభావం ఉండవచ్చని తెలిపారు. వర్షాభావ జిల్లాకు సైక్లోన్‌వల్ల కొద్దిగా వర్షాలు వస్తే అది జిల్లాకు వరమవు తుందని కలెక్టర్ వివరించారు. ఏదిఏమైనా అన్ని రకాలుగా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించా మని తెలిపారు. సమావేశంలో హైదరాబాద్‌లో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కమీషనర్ రాధా, జిల్లా నుంచి అదనపు జేసి చెన్నకేశవరావు, డిఆర్‌ఓ సుదర్శన్‌రెడ్డి, పెనుకొండ ఆర్‌డిఓ ఈశ్వర్, కలెక్టరేట్ సూపరింటెం డెంట్ వరదరాజులు తదితరులు పాల్గొన్నారు.

తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్ విజయమ్మ వేసిన పిటిషన్‌లో గతంలో ఆమె భర్త రాజశేఖరరెడ్డి ఆరోపించిన అంశాలే ఉన్నాయని తెలుగుదేశంపార్టీ పేర్కొంది. అనేక కేసులు విచారణకు అర్హత లేవని కోర్టులే తోసిపుచ్చాయని, అవే అంశాలతో మళ్ళీ కోర్టులో ఫిర్యాదు చేశారని ఆపార్టీ దుయ్యబట్టింది. విజయమ్మ పిటిషన్‌పై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించిన రాష్ట్ర హైకోర్టు సహజ న్యాయ సూత్రాలు కూడా పాటించకపోవడం బాధాకరమని తెలుగుదేశం పార్టీ విచారం వ్యక్తంచేసింది.ప్రతివాదికి కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా సిబిఐ దర్యాప్తునకు ఆదేశించడం, పిటిషన్ ఒకటైతే హైకోర్టు మరో ఆదేశం ఇచ్చిందని మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో తెదేపా శాసనసభ్యులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో తుమ్మల నాగేశ్వరరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఏ.రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి రొచ్చులోకి దిగి, ఆ రొచ్చును ఇతరులపైకి చల్లే ప్రయత్నం చేస్తున్నారని తుమ్మల నాగేశ్వరరావు దుయ్యబట్టారు. 1975 నుంచి చంద్రబాబుపై ఇవే ఆరోపణలు చేసి 18సార్లు కోర్టుల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి సహా అనేక మంది కాంగ్రెస్ నేతలు పిటిషన్లు వేశారని, వాటిని నిరూపించలేక కొన్ని ఉపసంహరించుకోగా, మరికొన్నింటిని కోర్టులు కొట్టివేశాయని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబుపై వేసిన పిటిషన్లు విచారణకు అనర్హమైనవని కోర్టులు తోసిపుచ్చాయని ఆయన చెప్పారు. కన్నా లక్ష్మీనారాయణ కేసులో కూడా గతంలో చేసిన ఆరోపణలపై పిటిషన్ వేసి ఎన్నికలు కాగానే ఉపసంహరించుకున్నారని ఆయన చెప్పారు. 1999, 2004 మధ్య ఐదేళ్ళపాటు ఏ ఒక్క రాజ్యాంగ వ్యవస్థను కూడా చర్య తీసుకోమని కోరలేదంటూ ప్రతివాదులకు నోటీసులు ఇవ్వడానికి కూడా ఈ అంశాలకు అర్హత లేదని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టంచేసిందని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. హైకోర్టు తీర్పును ప్రశ్నించడం, కించపరచడం తమ ఉద్దేశం కాదని, కోర్టులను, రాజ్యాంగ వ్యవస్థలను గౌరవిస్తామని బొజ్జల గోపాలకృష్ణారెడ్డి స్పష్టంచేశారు. అలాంటి వ్యక్తిని కూడా సిబిఐ విచారణ పరిధిలోకి తీసుకురావడం బాధాకరమన్నారు. తాము న్యాయ వ్యవస్థనుగానీ, సిబిఐగానీ ప్రశ్నించడం లేదని, విజయమ్మ పిటిషన్ ఆరోపణలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, వాస్తవాలు ప్రజలకు చెప్పేందుకు గత చరిత్రను మరోసారి గుర్తు చేస్తున్నామని బొజ్జల అన్నారు. సింగపూర్‌లోని హోటల్ ఫోటోను ఇంటర్నెట్ నుంచి తెచ్చి చంద్రబాబు బినామీ ఆస్తి అని ఆరోపించారని, అయితే ఆ హోటల్ యాజమాన్యం గురించి కనీస ప్రస్తావన చేయలేదని రేవంత్‌రెడ్డి చెప్పారు. అమెరికాలో వైట్‌హౌస్ ఫోటో తెచ్చి అది కూడా చంద్రబాబు బినామీ ఆస్తి అని చెప్పినా ఆశ్చర్యం లేదని ఆయన చెప్పారు.

యానాంలో గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్, రిలయన్స్ పెట్రోలియం సంస్థలు తీర ప్రాంతాల్లో చేపడుతున్న కార్యకలాపాలను నిరసిస్తూ జిల్లా మత్స్యకార సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఓఎన్‌జిసి రిగ్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంస్థల కార్యకలాపాల వల్ల మత్స్య సంపదకు నష్టం వాటిల్లుతోందని ..తమ జీవనోపాధికి విఘాతం కలుగుతోందని మత్స్యకారులు వాపోయారు. దీనికి ఆయా సంస్థలు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమానికి కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ నేతృత్వం వహించారు. సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో సుమారు 300 బోట్లతో 3 వేల మంది మత్స్యకారులు సముద్ర మార్గాన రిగ్ ముట్టడికి బయలుదేరారు.
అయితే జిఎస్‌పిసి రిగ్ ముట్టడికి వందలాది బోట్లు వెళుతుండగా మార్గ మధ్యలో కోస్టు గార్డు సిబ్బంది తమ మినీ నౌక ద్వారా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆందోళనకారులకు, కోస్టుగార్డు సిబ్బందికి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఒక దశలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. రిగ్ ప్రాంతానికి 500 మీటర్ల దూరం వరకు ఎవరూ వెళ్ల రాదని, నిషేధ ఆజ్ఞలున్నాయని, వెనుకకు వచ్చేయాలంటూ హెచ్చరించారు. అయినప్పటికీ ఆందోళనకారులు వాటిని ఖాతరు చేయలేదు. ఈ నేపథ్యంలో కాకినాడ డీఎస్పీ లక్ష్మీనారాయణ, అమలాపురం డీఎస్పీ రాజశేఖరరావు ఆందోళనకారులకు నచ్చజెప్పారు.
ఈ సందర్భంగా జిఎస్‌పిసి కార్యకలాపాలు నిలిపి వేశారని సమాచారం రావడంతో అక్కడకు వెళ్లకూడదని నిర్ణయించుకుని అదే ప్రాంతంలో ఉన్న ఓఎన్‌జిసి రిగ్‌ను ఆందోళనకారులు ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. సుమారు రెండుగంటలన్నరపాటు 500 నాటికల్ మైళ్ళు ప్రయాణించి భారీ స్థాయిలో ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో మత్స్యకార నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐ పోలవరం, కాట్రేనికోన, ముమ్మిడివరం, తాళ్లరేవు, యానాం ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సావిత్రి నగర్ పరిసర ప్రాంతాల్లో యానాం, ఆంధ్రా ప్రాం తానికి చెందిన పోలీసులు భారీగా మోహరించారు.