Gallery

Ankusam Calender Opening

లాభాల బాటలో ఐడిబిఐ బ్యాంక్‌

idbiరాష్ట్రాలచే నిర్వహించ బడుతున్న ఐడిబిఐ బ్యాంక్‌ డిసెంబర్‌ 31 వరకు ముగిసిన త్రైమాసికంలో 29.98 శాతం వృద్ధి సాధించి రూ.287.15 కోట్ల ఆదాయాన్ని పొందింది. గత సంవ త్సరం ఇంతే మొ త్తంలో ఆదాయం పొందింది. మొత్తం మీద ఆదాయం రూ. 4,433.39 కోట్ల మేరకు వృద్ధి సాధించి, గత సంవత్సరం సాధించిన రూ. 3,513.3 కోట్ల రాబడుల మైలు రాయిని దాటింది. డిసెంబర్‌ 31 నాటికి ముగిసిన తొమ్మిదో మాసంలో రూ. 712.72కోట్ల లాభాలను ఆర్జించింది. రూ.5.44.87 కోట్లు సాధించిన గత సంవత్సర ఆదాయంతో పోల్చితే 30.80శాతం అధిక వృద్ధి సాధించింది. బిఎస్‌ఇ సెన్సె క్స్‌లో రూ.134.80 ట్రెడింగ్‌తో 2.12 షేర్‌ను పొందింది.

అర్ధరాత్రి నుంచి ఆటో బంద్

autoప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలన్న డిమాండ్ తో మంగళవారం అర్ధరాత్రి నుంచి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఆటో బంద్ కు తెలంగాణ ఆటో సంఘాయ సంయుక్త కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది.
29 అర్ధరాత్రి నుంచి ఒక రోజు బంద్ ను విజయవంతం చేయాలని కమిటీ నాయకుడు, ప్రోగ్రెసివ్ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వి. కిరణ్ కోరారు. అలాగే తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు 30వ తేదీన బంద్ ను విజయవంతం చేసేందుకు జంట నగరాలు, రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఆటో సంఘాల డ్రైవర్లు బంద్ లో పాల్గొనాలని ఆయన కోరారు.

Miss Univers Gallary

Ankusam Opening Photos

ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేసిన ముఖ్యమంత్రి రోశయ్య

img1091030023_1_1
ఉపాధ్యాయులు జీతం,ఉద్యోగం కోసం కాకుండా విద్యార్థులకు శ్రద్దాసక్తులతో విద్యాబుద్దులు నేర్పి వారిని భావిభారత నిర్మాతలుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రోశయ్య ఉపాధ్యాయులకు సూచించారు.దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి సెప్టెంబర్‌ 2వతేదీన మరణించడంతో వాయిదా పడిన ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఉత్తమ ఉపాధ్యాయులకు ఇచ్చే అవార్డులను నిలిపివేసారు. బాలల దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ప్రాథమిక, మధ్యమిక,సెకండరీ సాంకేతిక విద్య ఉపాధ్యాయులతో పాటు విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌లకు కూడా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ముఖ్యమంత్రి రోశయ్య అందించారు.

గ్రేటర్‌ వేల మేనిఫెస్టోల సందడి – పిఆర్పీ మేనిఫెస్టో విడుదల

manifest
ప్రజారాజ్యం పార్టీ గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోను ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, మధ్య తరగతి ప్రజలకు నాణ్యమైన జీవనాన్ని అందించటమే తమ మేనిఫెస్టో ప్రధాన లక్ష్యమన్నారు. నగరం మొత్తం అస్తవ్యస్థంగా తయారయిందని, గతుకుల రోడ్లపై రద్దీతో నగర ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తున్నారని చిరంజీవి అన్నారు. నగరంలో మంచి నీటి సమస్య రాజ్యమేలుతుందని చెప్పారు. రహదారుల నిర్మాణంలో అవినీతి రాజ్యమేలుతుందని ఆరోపించారు. ఇదిలా వుంటే గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి ప్రజారాజ్యం పార్టీ పోటీ చేసిందే 64 స్థానాల్లో. మేయర్ గిరీ సంగతెలా వున్నా, సింగిల్ డిజిట్ సీట్లు అయినా గ్రేటర్ ఎన్నికల్లో పీఆర్పీకి దక్కేనా అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పీఆర్పీ అధినేత చిరంజీవి సైతం గ్రేటర్ మేయర్ గిరీ పై ఆశలు వదిలేసుకున్నారు. అందుకే డిప్యూటీ మేయర్ సీటును కైవసం చేసుకుంటామని చేతులెత్తేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మేనిఫెస్టో విడుదలచేయడం హాస్యాస్పదంగా వుంది. కాంగ్రెస్, టీడీపీ తర్వాత బలమైన రాజకీయ పార్టీ పీఆర్పీయేనంటూ చిరంజీవి మేనిఫెస్టో విడుదలచేశారు. ఈ మేనిఫెస్టో ఎంతవరకు ప్రయోజనం కలిగించనుందో వేచిచూడాల్సిందే.  ఎన్నికలప్రణాళికలోని ముఖ్యాంశాలు: ప్రజలందరికీ ఉచిత మంచినీరు, ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్టు అథారిటీ ఏర్పాటు108,104 తరహాలో కాల్ సెంటర్ల ఏర్పాటు, ఎంఎంటీఎస్ రెండో దశ పూర్తి, సీనియర్ సిటిజన్లకు ఎన్ జీ వో ల సహాయంతో గ్రంథాలయాల ఏర్పాటుతో పాటు, ఇంటర్నెట్ సౌకర్యాలు అందించటం, రైతు బజార్లను మరింత బలోపేతం చేయటం, వీధి బాలలలకు బాల కార్మికులకు పునరావాసం కల్పించటం, ప్రతి డివిజన్ కు ఓ స్కూల్ ఏర్పాటు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రతి డివిజన్ లోనూ కార్పొరేటు స్కూలు ఏర్పాటు, కృష్ణా రెండో దశ, గోదావరి జలాల మళ్లింపు పథకాలను 2014 లోపు పూర్తికి కృషి, మూసీ ఆధునికీకరణ, పేదలకు, మధ్యతరగతి వారికి 50 శాతం రాయితీలో గృహాల నిర్మాణం, హమారా పైసా హమారేలియే అనే నినాదంతో ఏ డివిజన్లో వసూలు చేసిన పన్నులు అదే ప్రాంతంలో ఖర్చుపెట్టేలా ప్రణాళికలు తీసుకుంటామని చిరంజీవి మేనిఫెస్టోలో వివరించారు.

లోక్‌సత్తా పత్రిపక్షంలో ఉందా ? అధికార పక్షంలో ఉందా ? – గాలి ముద్దు కృష్ణమ నాయుడు

GM_0
లోక్‌సత్తాపార్టీ ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష పార్టీలను విమర్శించడం తగదన్నారు.  అసలు లోక్‌సత్తా పత్రిపక్షంలో ఉందా ? అధికార పక్షంలో ఉందా ? అని గాలి ముద్దు కృష్ణమ నాయుడు పేర్కొన్నారు.  కాంగ్రెస్‌పార్టీకి మద్దతు పలికేందుకే లోక్‌సత్తాపార్టీ గ్రేటర్‌ బరిలో నిలుచున్నట్లు కనిపిస్తోందని అన్నారు, మేయర్‌ పదవి దక్కించుకోవాలనఏ పట్టుదల ఆ పార్టీలో ఏ కోశము లేదని, తనవద్దే తప్పులు పెట్టుకుని చంద్రబాబుని విమర్శిస్తూ లేఖలు రాయడాన్ని తప్పుబట్టారు.  అంతేకాక తానే నియంతగా వ్యవహరిస్తూ ఇతరులకు నీతి భోదించే జయప్రకాష్‌ నారాయణ ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.

సమ్మె నోటీస్ ఇచ్చిన జూనియర్‌ డాక్టర్లు

చంద్రబాబు నాయుడు ఇంటిముందు టిడిపి కార్యకర్తల భేటీ

free website analytics