ఉద్యోగ సృష్టిలో ముందు నిలిచిన ఐటి/బిపిఒ

గడచిన త్రైమాసికంలో దేశవ్యాప్తంగా ప్రకటితమైన కొత్త ఉద్యోగాల్లో 90 శాతం ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, బిజినెస్‌ ప్రాసెసింగ్‌ ఔట్‌సోర్సింగ్‌ కంపెనీల నుంచే వచ్చాయి. మిగతా 10 శాతం కాంట్రాక్టు ప్రాతిపదికన వచ్చిన ఉద్యోగాలని లేబర్‌ బ్యూరో నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ప్రత్యక్ష కాటగిరీల్లో ఉద్యోగుల సంఖ్య పెరిగిన విభాగాలు ఐటి/బిపిఒ సెక్టార్లేనని అక్టోబర్‌-డిసెంబర్‌ మాసాల మధ్య పరిస్థితులను పరిగణలోకి తీసుకుని తయారు చేసిన నివేదిక వివరించింది. అంతకుముందు జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికంతో పోలిస్తే 6.38 లక్షల అదనపు ఉద్యోగ సృష్టి జరిగిందని, ఆర్థికమాంద్యం నుంచి రికవరీ స్పష్టత మరింత పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది. ఈ 6.38 లక్షల్లో డైరెక్ట్‌ కాటగిరీ 5,79 లక్షలని వివరించింది. ఉద్యోగాలు ఆఫర్‌ చేస్తున్న కంపెనీ ప్రత్యక్షంగా ఉద్యోగులు కావాలని ప్రకటించిన సందర్భాలు పెరిగాయని వివరించింది. వ్యవస్థలోని ఎనిమిది రంగాల్లో ఈ సర్వేను నిర్వహించామని లేబర్‌ బ్యూరో వివరించింది.

Leave a Reply

free website analytics